కల్కి మూవీ.. ఇంతలా అరిచి ఎన్నాళ్లయిందో: రేణు దేశాయ్‌ Renu Desai Watched Kalki 2898 AD Movie With Akira Nandan | Sakshi
Sakshi News home page

కుమారుడితో కలిసి కల్కి 2898 ఏడీ సినిమా చూసిన రేణు దేశాయ్‌

Published Thu, Jun 27 2024 2:06 PM | Last Updated on Thu, Jun 27 2024 3:32 PM

Renu Desai Watched Kalki 2898 AD Movie With Akira Nandan

ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. భారీ అంచనాల మధ్య నేడు (జూన్‌ 27న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా ఈ సినిమాను నటి రేణు దేశాయ్‌ వీక్షించింది. కుమారుడు అకీరా నందన్‌తో కలిసి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో మూవీ చూసింది. 

ఈమేరకు ఓ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. చాలారోజుల తర్వాత ఓ సినిమా చూసి ఇంతలా ఎంజాయ్‌ చేశాం. నా గొంతు పోయేంతలా అరిచాను. మేము కల్కి మార్నింగ్‌ షోకి వెళ్లాం.. మీరు కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లండి.. తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు అని రాసుకొచ్చింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
(కల్కి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

కాగా కల్కి సినిమాలో ప్రభాస్‌ హీరోగా నటించగా అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, దిశాపటానీ, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement