తెలుగులోనూ రేణు దేశాయ్‌ కవితలు | Renu desai tweet about poetry | Sakshi
Sakshi News home page

తెలుగులోనూ రేణు దేశాయ్‌ కవితలు

Nov 15 2017 12:29 PM | Updated on Nov 15 2017 1:48 PM

Renu desai tweet about poetry - Sakshi

ఇటీవల మీడియాలో తరుచూ కనిపిస్తున్న రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యం పవన్ తో తన రిలేషన్, విడాకులకు దారితీసిన పరిస్థితులు, రెండో పెళ్లి లాంటి విషయాలతో పలు వివాదాలకు కేంద్రబిందువయ్యారు. తరుచూ మీడియాతో మాట్లాడుతున్న రేణు హాబీగా తాను రాసుకున్న కవితలకు పుస్తక రూపం ఇవ్వనున్నట్టుగా తెలిపారు. తాజాగా ఈ కవితలను తెలుగులోకి అనువదిస్తున్నట్టుగా తన సోషల్ మీడియా పేజ్ లో తెలిపారు.

తన ఫేస్ బుక్ పేజ్ లో తన కవితను ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ పోస్ట్ చేసిన రేణు, ప్రముఖ కవి ప్రసాదమూర్తి గారు తన కవితలను తెలుగులోకి అనువదిస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే తెలుగు అనువాదం పూర్తయిన ఈ పుస్తకానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. త్వరలోనే పూర్తి వివరాలతో పాటు బుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement