త్వరలో రేణూ దేశాయ్‌ రీ ఎంట్రీ! | Renu Desai Coming Back To Tollywood With Biopic | Sakshi
Sakshi News home page

త్వరలో రేణూ దేశాయ్‌ రీ ఎంట్రీ!

Feb 19 2019 3:21 PM | Updated on Aug 3 2019 12:45 PM

Renu Desai Coming Back To Tollywood With Biopic - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాన్‌ సరసన బద్రి సినిమాతో టాలీవుడ్‌ పరిచయం అయిన భామ రేణూ దేశాయ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణూ తరువాత పవన్‌తోనే జానీ సినిమాలో కలిసి నటించారు. పవన్‌ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైన రేణూ దేశాయ్‌ తరువాత పవన్‌ నుంచి విడిపోయిన తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరమయ్యారు.

ఇటీవల ఓ టీవీ షోతో తెలుగు ప్రజలను పలకరించిన రేణూ, త్వరలో సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా రీ ఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కనున్న బయోగ్రాఫికల్‌ మూవీ తో రేణూ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దొంగాట ఫేం వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement