సాక్షి, హైదరాబాద్: నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ గొప‍్ప కవయిత్రి కూడా అని మరోసారి నిరూపించుకున్నారు. మల్టీ టాలెంటెడ్ రేణూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవలి కాలంలో తన అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు ఆంగ్లంలో రాసిన కవితలను ట్విటర్‌లో పోస్ట్ చేయడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనే టైటిల్‌తో కవితను, వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీన్ని అభిమానుల కోసం ట్విటర్‌లో షేర్ చేశారు. జ్ఞాపకాల సమాధులను తవ్వితీస్తూ..ముక్కలైన హృదయాన్ని విషాద సాహిత్యంగా అవిష్కరించిన వైనం అద్భుతంగా నిలిచింది. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయానడం ఆమె ప్రస్తుత పరిస్థితికి అద్ధం పట్టింది.
ముక్కలైన హృదయం, రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు మాత్రమే మిగిలాయంటూ తన జ్ఞాపకాలతో బాధాతప్త హృదయాన్ని ప్రస్తావించారు. కమ్ముకున్న మంచు కరిగిపోయి మళ్ళీ ఆ జ్ఞాపకాలు కళ్ళెదుట నిలిచాయి. మనసు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాపకాలని మళ్ళీ తట్టి లేపుతుంది. తిరిగి చూసుకుంటే..తుప్పు పట్టిన కలం, తుడిచిపెట్టుకుపోయిన పేరు. విధి ఎంత బలీయమైనది . ముక్కలైన హృదయం విషాద సాహత్యంగా అంటూ తన కవితను ముగించారు. ఎంతో బాధతో, ఆవేదనతో కూడిన ఈ కవిత అభిమానులను ఆలోచింపచేస్తోంది.
కాగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఫీనిక్స్ పక్షిలా తిరిగి జీవితాన్నిసాగిస్తున్న రేణూ దేశాయ్ ప్రస్తుతం ఒక టీవీ షోకు జడ్జిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
రేణూ దేశాయ్ ఆంగ్ల కవిత:
Went digging in the graveyard of my memories
Had buried my metaphors with his words, some letters too and a pen with his name inscribed
Spring, forced the cherry trees to blossom
The ice melted, leaving the grave bare Scavengers of destiny dug open the buried moments and metaphors
Found the remains of the pen,rusted parts,name faded
Pieces of my heart, in the torn letters
Jagged edges of buried reminiscences And the metaphors had ironically become literal tragedies
Uploaded a new poem on YouTube. Do share with your friends too 🌸https://t.co/0duBjs3taU
— renu (@renuudesai) February 22, 2018
Comments
Please login to add a commentAdd a comment