సోషల్ మీడియాలో నెగెటివిటి ఎక్కువగా ఉందని, కొందరు పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారని రేణూ దేశాయ్ ట్విటర్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యక్తిగత విషయాల గురించి పోస్ట్ చేస్తున్నారు. కానీ, తనకు కాబోయే భర్త పేరు, వివరాలు బయట పెట్టడం లేదు. తాజాగా రేణూ చేసిన పోస్ట్ హృదయాన్నిహత్తుకునేలా ఉంది.
నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగానే కాకుండా రేణూ దేశాయ్ కవితలు కూడా రాస్తుంటారు. ‘వెయ్యి ముక్కలైన నా మనసును ఓపికగా.. ఒక్కటిగా చేర్చావు. ఒక్కో ముక్క నేను పడిన బాధకు సాక్ష్యం. నీ సున్నితమైన వైఖరి, సుతిమెత్తని మాటలతో.. నా బాధలను పోగొట్టావు. నా ఆత్మకు ప్రశాంతతను కలిగించావు. ఇక ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు.. ఎందుకంటే నువ్వు నాకు ఉన్నావు’ అంటూ సంతోషంగా ఉన్న ఫోటోను షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment