పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తున్నారు రేణుదేశాయ్. ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ.. వాళ్లు చేసే అల్లరిని, వారి సరదా సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు రేణూ దేశాయ్. బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగానే ఉన్న రేణూ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పూణేలో ఉంటున్నారు. తాజాగా కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. '1 2 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా.. ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరూ నా సొంతం' అంటూ క్యాప్షన్ పెట్టారు.
చదవండి: దర్శకుడిపై దినపత్రిక సీఈఓ అత్యాచారం
చదవండి: నెలకు ఇంటి అద్దె రూ.15 లక్షలా ..? మీరు వెంటనే వెనక్కి రండి!
చదవండి: '5 కి.మీ ప్రయాణానికి హెలికాప్టర్ బుక్ చేసిన మంత్రి'
అయితే రేణూ క్యాప్షన్‌కి నెటిజన్ స్పందిస్తూ.. ఎంతైనా పవన్ రక్తం కదా అని కామెంట్ చేశాడు. అలా కామెంట్ చేయడం రేణూ దేశాయ్‌కి ఎంత మాత్రం నచ్చలేదు. దీంతో టెక్నికల్‌గా సైన్స్ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంటూ సమాధానం ఇచ్చారు. రేణూ దేశాయ్ కామెంట్‌కు మరో అభిమాని స్పందిస్తూ అభిమానులు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. వాటిని మీరు ఎందుకు పట్టించుకుంటారు అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అమ్మతనం గురించి వారు మాట్లాడుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటాను అని కొంచెం ఎమోషనల్‌గా సమాధానం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment