
ముంబై: తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పొరుగింటావిడ డింపుల్ తవానిపై చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి సీబీఐకిలేఖ రాసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో రియా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అంటే జూన్ 13న రియాను తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి సుశాంత్ వచ్చాడని డింపుల్ ఒక మీడియాతో చెప్పారు. అయితే ఆమె సీబీఐ విచారణలో నేను వారిని చూడలేదని ఎవరో చెబితే విన్నానని వెల్లడించారు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి చూసిన డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని రియా సీబీఐని లేఖ ద్వారా కోరింది.
మీడియా తన టీర్‌పీల కోసం తనను అపకీర్తి పాలు చేస్తోంది లేఖలో పేర్కొంది. ఇక సుశాంత్ కేసులో రియాను సీబీఐ సెప్టెంబర్‌లో అదుపులోకి తీసుకుంది. ఆమెకు అక్టోబర్7 వతేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రియా తమ్ముడు షోవిక్‌కు మాత్రం ఇంకా కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇక రియా తరుపు న్యాయవ్యాది ఈ కేసులో మీడియా ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పేర్లు సీబీఐ ముందు ఉంచుతామని తెలిపారు.
చదవండి: సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..?