
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు.
గత 24 గంటల్లో 1,21,311 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,79,11,384 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 24.96 కోట్ల మందికిపైగా వ్యాక్సినేషన్ జరిగింది.
చదవండి: Covid-19: ‘‘అరే, యార్! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’
Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు!