
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చైన్నై: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించింది. ఈ మేరకు ఆదివారం తమిళనాడు సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 28 వరకు లాక్‌డౌన్ పొడిగించినట్లు వెల్లడించింది. ప్రజలంతా లాక్‌డౌన్ ఆంక్షలను పాటించాలని పేర్కొంది.
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 28 నుంచి కోవిడ్ ఆంక్షల్లో సడలింపులు ఇవ్వన్నుట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సడలింపుల్లో భాగంగా పార్క్‌లు, నర్సరీలు, గోల్ఫ్ క్లబ్‌లకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. బహిరంగ ప్రాంతాల్లో యోగా కార్యకలాపాలు, 50 శాతం సీటింగ్‌తో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు బార్లకు అనుమతి ఇచ్చింది.
చదవండి: 81 రోజుల తర్వాత.. 50 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు