
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని ఆసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం తెలిపింది. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది.
ఈ 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 5,54,596 తక్కువగా ఉన్నాయని వివరించింది. అలాగే 176 నియోజకవర్గాల్లో పొలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 35,093 అదనంగా ఉన్నాయని తెలిపింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదు.