Holi: మధుర.. కోల్‌కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం | Holi Colors Festival Celebration UP Delhi MP Sambhal Nation Wide | Sakshi
Sakshi News home page

Holi: మధుర.. కోల్‌కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం

Published Fri, Mar 14 2025 12:19 PM | Last Updated on Fri, Mar 14 2025 12:20 PM

Holi Colors Festival Celebration UP Delhi MP Sambhal Nation Wide

న్యూఢిల్లీ: దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్‌ గన్‌లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు.
 

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తన ఇంటిలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనం ఆయనపై పూలవాన కురిపించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హోలీ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీకృష్ణ జన్మభూమి మధురలో భక్తులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.

బీహార్‌లో బీజేపీ నేత రామ్‌ కృపాల్‌ యాదవ​ బుల్గోజర్‌ ఎక్కి, డోలు వాయిస్తూ, వినూత్నంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఢిల్లీలోని తన స్వగృహంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి.

మహారాష్ట్రలోని ముంబైలో జుహూ బీచ్‌ దగ్గర హోలీ సందడి కనిపిస్తోంది.

హోలీ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుని ఘనంగా అభిషేకాలు నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో హోలీ వేడుకలు అంత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. 

 

ఇది కూడా చదవండి: ‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement