Holi 2025
-
హోలీకి లీవ్ ఇవ్వని బాస్.. పైగా రూల్స్
భారతదేశంలో హోలీని ఎంతబాగా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికి తెలుసు. ఈ పండుగను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు కూడా మంజూరు చేస్తాయి. అయితే ఓ కంపెనీ బాస్ మాత్రం హోలీకి ఉద్యోగులకు సెలవు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంతే కాకుండా కొన్ని రూల్స్ కూడా పాస్ చేశారు.ఒక ఉద్యోగి తన బాస్ పంపిన సందేశాన్ని రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. దీంతో అది నెట్టింట్లో వైరల్ అయింది. లీవ్ ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా.. ఆఫీసుకు కూడా రంగులు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, కంపెనీ పేరు ఏమిటనేది వెల్లడికాలేదు.హోలీ రోజు చెప్పకుండా సెలవు తీసుకుంటే లేదా అనుమతి లేకుండా సెలవు తీసుకుంటే.. అనుమతించనని, జీతం కూడా కట్ చేస్తామని బాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగులందరూ రాజీనామా చేయండి అని ఒకరు చెబితే.. కంపెనీ పేరు చెప్పి, బాస్ సిగ్గుపడేలా చేయాలసింది అని మరొకరు అన్నారు. భారత ప్రభుత్వం తన శ్రామిక శక్తిని రక్షించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మొత్తం మీద ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని ఇంకొకరు అన్నారు. -
ఆంటీ అంటావా? దమ్ముంటే పైకి రారా..: యాంకర్ అనసూయ సవాల్
తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం.. అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి పదే పదే అంటుంటాడు. అలాగే తెలుగు, ఇంగ్లీష్.. ఏదైనా కానీ నాకు నచ్చని ఏకైక పదం ఆంటీ అంటోంది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). ఏళ్ల తరబడి ఈ పదంపై ఉద్యమమే చేస్తోందీ యాంకర్. ఎవరు పడితే వారు ఆంటీ అంటే ఊరుకునేది లేదు.. అలా పిలవాలంటే నా బంధువులై ఉండాలి, లేదా చిన్నపిల్లలై ఉండాలని అప్పట్లోనే కుండ బద్ధలు కొట్టింది.హోలీ ఈవెంట్లోనూ 'ఆంటీ' పిలుపుకానీ జనాలు వింటేగా.. తనకు ఇష్టం లేదని చెప్తున్నా సరే పట్టించుకోకుండా సందు దొరికినప్పుడల్లా ఆంటీ అని ఏడిపిస్తున్నారు. శుక్రవారం (మార్చి 14న) హోలి సెలబ్రేషన్స్‌లో పాల్గొంది అనసూయ. హైదరాబాద్‌లోని ఓ హోలి ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వెళ్లిన ఆమెను ఓ ఆకతాయి ఆంటీ అని పిలిచాడు. ఆ పిలుపు తన చెవిన పడటంతో అనసూయకు చిర్రెత్తిపోయింది.రెచ్చగొట్టకు..దమ్ముంటే స్టేజీపైకి రా అని సవాల్ విసిరింది. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని ధమ్కీ ఇచ్చింది. ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్లుగా సైగ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అటు అనసూయ తగ్గదు, ఇటు జనాలు మారరు అని కామెంట్లు చేస్తున్నారు.యాంకర్‌గా, నటిగా..అనసూయ.. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఎన్నో యేళ్లుగా పలు టీవీ షోలలో యాంకర్‌గా, జడ్జిగా పని చేసింది. ఈ మధ్య బుల్లితెరను వదిలేసి వెండితెరపైనే ఎక్కువ బిజీ అయింది. క్షణం, రంగస్థలం, మీకు మాత్రమే చెప్తా, పుష్ప 1, పుష్ప 2, విమానం, ప్రేమ విమానం, రజాకార్ వంటి పలు చిత్రాల్లో నటించింది. సూయ సూయ సూయ.., పైన పటారం లోన లొటారం, వా వా మేరే బావా వంటి స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసింది. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా నుంచి రిలీజైన కొల్లగొట్టినాదిరో పాటలోనూ యాక్ట్ చేసింది.చదవండి: అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు -
Holi 2025, బోసిపోయిన రహదారులు.. కిటకిటలాడిన వైన్ షాపులు
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హోలీ పండుగ ఘనంగా జరిగింది. చిన్నపెద్ద వయసుతో తేడా లేకుండా అందరూ ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ జరుపుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గతేడాది కంటే ఈసారి హడావుడి కొంత తగ్గినప్పటికీ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా అనేక మంది రాజకీయ నాయకులు తమతమ ప్రాంతాల్లో జరిగిన హోలీ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముంబై, నవీముంబై, థానే పుణే, సోలాపూర్‌లో వీధివీధినా సంబరాలు అంబరాన్ని తాకాయి. కొన్ని ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు, బ్యాండు మేళాలతో నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకున్నారు. పలుచోట్ల గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, పూరన్ పోలీ (పూర్ణంతో తయారుచేసిన తీపి రొట్టెలు, బూరెలు) నైవేద్యంగా సమరి్పంచి, కాముని దహనం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగుపంచమి (రంగులు చల్లుకునే) ఉత్సవాలను జరుపుకున్నారు. ముఖ్యంగా కోళీ ప్రజలు తమ సాంప్రదాయ పద్దతిలో హోళీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా శుక్రవారం కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో గురువారం సాయంత్రం నుంచే యువతీ యువకులు, పిల్లలు, అందరు వేడుకలను ప్రారంభించారు. కొందరు ఫోన్లలో, మరికొందరు ప్రత్యక్షంగా కలుసుకుని ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు..... హోలీ ఉత్సవాల్లో ఎటువంటి అనుచిత సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించింది. బహిరంగ ప్రదేశాల్లో , బాటసారులపై రంగులు చల్లి ఇబ్బందులు పెట్టకుండా నగర రహదారులపై గస్తీ నిర్వహించారు. పండగ నేపథ్యంలో అనేక మంది పోలీసుల వారంతపు సెలవులు రద్దు చేశారు. హోలీ రోజున మద్యం సేవించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ప్రధాన కూడళ్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినవారిపై చర్యలు తీసుకున్నారు. కిటకిటలాడిన బీచ్‌లు.. హోలీ పండుగ సందర్భంగా ముంబైలోని బీచ్‌లన్నీ కిటకిటలాడాయి. పండుగ అనంతరం సముద్ర స్నానాలు చేసేందుకు యువతీ, యువకులు పెద్దసంఖ్య లో బీచ్‌లకు చేరుకున్నారు. ముఖ్యంగా చరి్నరోడ్, లో టస్, వర్లీ సీ ఫేస్, శివాజీపార్క్, మాహిం, బాంద్రా, అక్సాబీచ్ తదితర బీచ్‌లు సందర్శకులతో నిండిపోయాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జలాశయాలు, చెరువుల పరిసరాల్లో కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మద్యం సేవించి ఇతరుల ను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నారు. బోసిపోయిన రహదారులు.. నిత్యం వాహనాలతో రాకపోకలతో రద్దీగా కనిపించే ముంబై రహదారులన్నీ శుక్రవారం బోసిపోయి కనిపించాయి. శుక్ర, శని, ఆదివారం...ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధిక శాతం ప్రజలు గురువారం రాత్రి నుంచే పర్యాటక ప్రాంతాలకు, రిసార్టులకు, పిక్నిక్ పాయింట్లకు తరలిపోయారు. దీంతో హోలీ పండుగనాడు ప్రధాన రహదారులు సైతం బోసిపోయి కనిపించాయి. అయితే విహారప్రాంతాలకు వెళ్లే రోడ్లపై ముఖ్యంగా పుణే ఎక్స్‌ప్రెస్ హైవే, గోవా మార్గంతోపాటు పలు మార్గాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ కొంత పెరిగింది. శుక్రవారం ‘బెస్ట్’బస్సులు కూడా పూర్తిస్థాయిలో రోడ్లపైకి రాలేదు. అదే విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిక్కిరిసి తిరిగే లోకల్ రైళ్లు కూడా ఖాళీగానే కనిపించాయి. నగరంలో ట్యాక్సీలు, తూర్పు, పశి్చమ ఉపనగరాలలో ఆటోలు కూడా అనుకున్నంత మేర తిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. వైన్ షాపుల వద్ద రద్దీ.. హోళి పండుగ నేపథ్యంలో శుక్రవారం ముంబైతోపాటు థాణే జిల్లాలోని వైన్ షాపుల వద్ద మద్యం కొనుగోలు కోసం మందుబాబులు పెద్దఎత్తున బారులు తీరారు. చేసేందుకు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు. మటన్, చికెన్ కొనుగోళ్లకు కూడా జనం పోటెత్తారు. గురువారంతోపాటు శుక్రవారం మధ్యాహ్నం దాకా ఈ రద్దీ కొనసాగింది. -
విమానంలో అదిరే హోలీ స్టెప్పులు: ఇక జన్మలో స్పైస్‌జెట్ ఎక్కను!
హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్యమానవుల దగ్గర్నించీ, సెలబ్రిటీల దాకా రంగుల పండుగ ఉత్సవాల్లోఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్‌మీడియాలో ఆకట్టుకంటున్నాయి. అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఒకవీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. హోలీ పండుగ సందర్భంగా స్పైస్ జెట్ (SpiceJet) సిబ్బంది తమ డ్యాన్స్‌తో ప్రయాణికులను అలరించారు. అయితే విధి నిర్వహణ మర్చి గెంతులేశారు అంటూ నెటిజన్లులు మండిపడ్డారు.హోలీ (Holi202) స్పైస్‌జెట్ క్యాబిన్ సిబ్బంది వార్తల్లో నిలిచాయి. విమానంలో స్టెప్పులేసి ప్రయాణీకులతో కలిసి హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలీవుడ్ మూవీ యే జవానీ హై దీవానీ చిత్రంలోని పాటకు నృత్యం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్‌కు సిద్ధంగా విమానంలో స్పైస్‌జెట్ క్యాబిన్ క్రూ అంతా సంప్రదాయ దుస్తులు ధరించి, హోలీ ‘బలం పిచ్కారి’ పాటకు నృత్యంచేశారు ఎయిర్ హోస్టెస్‌లు, ఫ్లైట్ స్టీవార్డ్‌లు ఉత్సాహంగా మ్యూజిక్కు తగ్గట్లు స్టెప్పులతో అదరగొట్టేశారు. వీరి సంతోషానికి ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. పనిలో పనిగా వీడియోలను రికార్డు చేశారు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను గోవింద్ రాయ్ (@govindroyicai) అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియో 3 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించినప్పటికీ, ఇది ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని తప్పుబట్టారు. సిబ్బంది మూలంగా విమానం 5 గంటలు ఆలస్యం అయింది అంటూ విమర్శించారు. విధి నిర్వహణ మానేసి ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.A signature festival, a signature song, and a celebration like no other! 💃 Our crew brought Holi to life with an energetic dance, proving that traditions take flight with us!#flyspicejet #spicejet #happyholi #addspicetoyourtravelVideo was filmed on ground with all safety… pic.twitter.com/63XKMJDZCI— SpiceJet (@flyspicejet) March 14, 2025 మరో వినియోగదారుడైతే ఏకంగా స్పైస్ జెట్ విమానం ఎక్కను అంటూ అన్నాడు. “చాలా ఏళ్ల తరువాత నేను స్పైస్‌జెట్‌లో ప్రయాణిస్తున్నా..ఇక ఇదే చివరిసారి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ ఎయిర్‌లైన్‌తో ప్రయాణించను”అంటూ కమెంట్ చేశాడు.కొంతమంది క్యాబిన్ క్రూ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. “ ఒక క్యాబిన్ క్రూగా, నేను దీన్ని అభినందించను. ఇది అస్సలు ప్రొఫెషనల్ కాదు” అని వ్యాఖ్యానించారు. -
మార్చి 17 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్
వదంతులు, చట్టవ్యతిరేక కార్యకలాపాల వ్యాప్తిని నిరోధించడానికి పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలోని ఐదు గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో ఇంటర్నెట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెలిఫోనిక్ సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 14 (శుక్రవారం) నుంచి మార్చి 17 (సోమవారం) వరకు ఈ ప్రాంతాల్లో నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ హోం, హిల్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మార్చి 14న ఈమేరకు ప్రకటన జారీ చేశారు. అసలు ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాజ్ఞలు విధించే వీలుందో తెలుసుకుందాం.దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రజా భద్రత, జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుందని భావిస్తే ఈ చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కిందకు వచ్చే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ) రూల్స్, 2017 ప్రకారం టెలికాం సేవలు, ఇంటర్నెట్ సేవలను నిలిపేసే అధికారం ప్రభుత్వాలకు ఉంది.ఏయే సందర్భాల్లో నిలిపేస్తారంటే..పబ్లిక్ ఎమర్జెన్సీలో భాగంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి, అల్లర్లు, నిరసనలు లేదా మత హింస వంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయవచ్చు.ఉగ్రవాద కార్యకలాపాలు లేదా సైబర్ దాడులు వంటి జాతీయ భద్రతకు ముప్పు ఉందనే సందర్భాల్లో, సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి, శత్రు సంస్థల మధ్య సమన్వయాన్ని నివారించడానికి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కట్టడి చేయవచ్చు.హింస లేదా అశాంతిని ప్రేరేపించే నకిలీ వార్తలు, పుకార్లు లేదా రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి కొన్నిసార్లు ఇంటర్నెట్ను నిలిపేసే అవకాశం ఉంటుంది.న్యాయ సమీక్షకు లోబడి ఉండాల్సిందే..అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వాలు తమ ఇష్టారీతిన ఇంటర్నెట్ను నిలిపేయలేవు. దీనికి సంబంధించి ప్రభుత్వ చర్యలు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి. ఇదిలాఉండగా, ఇలాంటి చర్యలు టెలికాం కంపెనీల రెవెన్యూను ప్రభావితం చేస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఇతర ప్రాంతాల వినియోగదారుల నుంచి ఆదాయ మార్గాలను ఎలా పెంపొందించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ చర్యలు హైలైట్ చేస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: గృహాల ధరలకు బ్రేక్..!అసలు గొడవేంటి..పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలో హోలీ వేడుకల సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు స్థానిక వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం రాళ్లు రువ్వడం, భౌతిక దాడులకు దారితీయడంతో పలువురికి గాయాలయ్యాయి. -
బలవంతంగా రంగులు పోస్తే.. వైరల్ వీడియోలు
దేశంలో హోలీ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సంబరాల్లో ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఆనందించారు. కొందరైతే ‘ఏమీ అనుకోకండి’ అంటూ ఎదుటివారిని ఆటపట్టిస్తూ వారిని రంగుల్లో ముంచెత్తారు. సోషల్ మీడియాలో హోలీకి సంబంధించిన లెక్కలేనన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని తెగనవ్వు తెప్పిస్తున్నాయి. 💀💀pic.twitter.com/Q3xav0qzeu— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025రంగు జల్లాడని ఫోను విసిరికొట్టి..సోషల్ మీడియాలో ప్ర్యత్యక్షమైన ఒక వీడియోలో ఒక యువకుడు మంచి దుస్తులు ధరించి నడుచుకుని వస్తుండగా, మరొక యువకుడు అతనిపై రంగులు కుమ్మరిస్తాడు. దీంతో ఆగ్రహంచిన ఆ వ్యక్తి తన సెల్ ఫోనును అతని మీదకు విసరడాన్ని చూడవచ్చు.Phone tod dia uncle ji ne😭 pic.twitter.com/l9FXBsGJZt— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025రంగుపడిందని..మరో హొలీ వీడియోలో ఒక యువతి కుర్చీలో కూర్చున్న అంకుల్‌పై వెనుక నుంచి రంగు పోస్తుంది. వెంటనే అంకుల్ ఆగ్రహంతో ఫోనును పగులగొడతాడు.Ladai pi kr bhang na kare….Happy Holi!!!#HappyHoli pic.twitter.com/B9PKRhW4C7— RV (@Dominus_vaibhav) March 14, 2025ఇరువర్గాల వివాదం @Dominus_vaibhav అనే యూజన్ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో మద్యం మత్తులో హోలీ ఆడవద్దు అనే వ్యాఖ్యానంతో పాటు, రెండు గ్రూపులు గొడవ పడుతున్న ఒక సీన్ కనిపిస్తుంది.Holi is incomplete without KALESH pic.twitter.com/tNlR0iRKrW— JEET (@saadharan_ladka) March 14, 2025ఏదో జరిగిందిమరో వీడియోలో రెండు గ్రూపులు ఎందుకో గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను చూస్తే ఏదో జరిగింది అని అనిపించడం ఖాయం.Kalesh b/w Two Group of Men During holi celebration and a Kaleshi guy recording itpic.twitter.com/q6hsS8r3S0— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025హోలీలో కొట్టుకుంటున్నారుఇంకొక వీడియోలో దానిని రికార్డు చేస్తున్న వ్యక్తి హోలీలో కొట్టుకుంటున్నారని పెద్దగా అరుస్తూ చెప్పడాన్ని గమనించవచ్చు.😭😭 (Use-Headphones 🎧) pic.twitter.com/8VHeWSF12h— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025తాతకు కోపం వస్తే..ఈ వీడియోలో ఒక తాత దుకాణం ముందు కూర్చుని కనిపిస్తున్నాడు. ఇంతలో హోలీ ఆడుతున్న కొందరు యువకులు అతనిపై రంగులు చిలకరిస్తారు. దీంతో ఆయన ఆగ్రహిస్తూ, కర్రతో వారిని తరిమికొడతాడు.ఇది కూడా చదవండి: Bihar: హోలీ వివాదంలో జోక్యం.. పోలీసు అధికారి హత్య -
Bihar: హోలీ వివాదంలో జోక్యం.. పోలీసు అధికారి హత్య
ముంగేర్: బీహార్(Bihar)లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో మద్యం మత్తులో మునిగిన కొందరు యువకులు ఒక పోలీసు అధికారి తల పగులగొట్టారు. వెంటనే స్థానికులు ఆ పోలీసు అధికారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.ఈ ఘటనలో రోహ్తక్(Rohtak)కు చెందిన ఏఎస్ఐ సంతోష్ కుమార్ మృతిచెందారు. మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ముఫస్సిల్ పోలీస్ స్టేషన్‌కు డయల్ 112కు ఫోను వచ్చింది. నందలాల్‌పూర్‌లో మద్యం మత్తులో ఇరు వర్గాలు ఘర్ణణ పడుతున్నాయని ఆ ఫోను ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఏఎస్ఐ సంతోష్‌కుమార్ తన బృందంతో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గొడవ పడుతున్న ఇరు గ్రూపులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయితే పోలీసులు ప్రయత్నం ఫలించలేదు. ఇంతలో వారిలో ఒకరు మారణాయుధంతో ఏఎస్ఐ సంతోష్ కుమార్ తల పగులగొట్టారు. వెంటనే అతను స్పృహ తప్పి కింద పడిపోయారు. అతని తల నుంచి విపరీతంగా రక్తం కారసాగింది. దీంతో స్థానికులు, పోలీసులు అతనిని వెంటనే ముంగేర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం సంతోష్ కుమార్‌ను ముంగేర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పట్నా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సంతోష్ కుమార్ మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు -
హోలీ వేళ ఘర్షణలు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. పలువురికి గాయాలు
గిరిడీహ్: శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు(Holi celebrations) జరిగాయి. అయితే పండుగ నేపధ్యంలో కొన్ని చోట్ల అల్లర్లు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలో హోలీ వేళ ఇరు వర్గాల మధ్య ఘర్ణణలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా అల్లరి మూకలు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. #WATCH | Jharkhand: Vehicles torched after a scuffle broke out between two communities during Holi celebration in the Ghorthamba area (14/03) pic.twitter.com/Ao1Sn2WBGh— ANI (@ANI) March 14, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం గిరిడీహ్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపధ్యంలో మూడు దుకాణాలతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) తమ బలగాలను సంఘటనా స్థలంలో మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన ఘోడతంబాలో జరిగిందని, ఒక వర్గంవారు హోలీ రంగులు జల్లుకుంటూ ఇటు రాగానే, స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలై, పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. #WATCH | Giridih, Jharkhand: Dr Bimal, SP, says, " In Ghorthamba OP constituency, an incident of clash between two communities has come to light. During Holi celebration, this incident took place...we are identifying the two communities, we are also identifying the people...once… https://t.co/Jqs1sKyNjU pic.twitter.com/DatUYzWnir— ANI (@ANI) March 14, 2025ఇది కూడా చదవండి: మహాకుంభమేళాలో మాయమైన మహిళ తిరిగొచ్చిందిలా.. -
హైదరాబాద్ : ఫుల్ జోష్‌లో హోలీ సంబరాలు (ఫొటోలు)
-
హోలీ రోజు వైట్ శారీలో అదిరిపోయిన అనసూయ (ఫొటోలు)
-
ప్రశాంతంగా ముగిసిన హోలీ, రంజాన్ ప్రార్థనలు
న్యూఢిల్లీ: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జనం రంగుల్లో మునిగితేలారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. హోలీ రంగులతో ఇళ్లు, వీధులు కొత్తరూపు సంతరించుకున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాలతో గడిపారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు రెండో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకేరోజు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల డ్రోన్లు సైతం మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో మసీదు కమిటీల పిలుపు మేరకు హోలీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో మొఘల్ పాలకుల కాలంనాటి షాహీ జామా మసీదులో గత ఏడాది నవంబర్‌లో సర్వే ప్రారంభించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రంజాన్ ప్రార్థనలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదు. సంభాల్‌లో సంప్రదాయ ‘చౌపాయ్ కా జులూస్’ శాంతియుతంగా జరిగింది. పోలీసుల చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు, రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని
భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నేడు హోలీ వేడుకలు(Holi celebrations) జరుగుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ హోలీ ఆడుతూ ఆనందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో న్యూజిలాండ్ ప్రధాని ప్రజల మధ్య హోలీ ఆడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.ఈ వీడియోను న్యూజిలాండ్(New Zealand)లోని ఇస్కాన్ ఆలయం వద్ద చిత్రీకరించారు.ఇక్కడ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్(Christopher Luxon) సమక్షంలో హోలీ వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఇస్కాన్ ఆలయానికి జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని జనసమూహంపై రంగులు చల్లుతూ కనిపించారు. అలాగే అక్కడున్నవారంతా ఒకరిపై ఒకరు ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. Prime Minister of New Zealand Christopher Luxon celebrating #Holi. pic.twitter.com/xjPbxPLeyT— The Gorilla (News & Updates) (@iGorilla19) March 12, 2025వేడుకలు జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ ప్రధాని మెడలో పూల దండ వేసుకున్నారు. అతని భుజంపైవున్న టవల్‌పై హ్యాపీ హోలీ అని రాసివుంది. కాగా హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే హోలీ, దీపావళి అంతర్జాతీయ పండుగలుగా పరిణమిస్తున్నాయి. అమెరికా, కెనడా, మారిషస్, ఫిజి, గయానా, నేపాల్, న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.ఇది కూడా చదవండి: Holi: మధుర.. కోల్‌కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం -
Holi: మధుర.. కోల్‌కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం
న్యూఢిల్లీ: దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్ గన్లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. #WATCH | Bhopal: Madhya Pradesh CM Mohan Yadav celebrates Holi at his residence pic.twitter.com/o47ciC9C64— ANI (@ANI) March 14, 2025మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన ఇంటిలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనం ఆయనపై పూలవాన కురిపించారు.#WATCH | Gorakhpur: UP CM Yogi Adityanath attends Holi celebration event organised by the RSS pic.twitter.com/U2pqt2djaV— ANI (@ANI) March 14, 2025ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.#WATCH | Sambhal, Uttar Pradesh | CO Anuj Chaudhary says, "The police personnel are continuing their foot patrolling. There is no issue; people are celebrating Holi. Friday prayers will also be organised as usual." pic.twitter.com/4Z922S70vS— ANI (@ANI) March 14, 2025ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హోలీ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.#WATCH | Uttar Pradesh | People celebrate #Holi outside Shri Krishna Janmasthan Temple in Mathura pic.twitter.com/itlcYLR28x— ANI (@ANI) March 14, 2025శ్రీకృష్ణ జన్మభూమి మధురలో భక్తులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.#WATCH | Bihar: BJP leader Ram Kripal Yadav and others climb a bulldozer, play dhols and celebrate #Holi in Patna. pic.twitter.com/mYSpv3RGhQ— ANI (@ANI) March 14, 2025బీహార్‌లో బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ బుల్గోజర్ ఎక్కి, డోలు వాయిస్తూ, వినూత్నంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.#WATCH | Delhi: Defence Minister Rajnath Singh plays #Holi with people who have arrived at his residence. pic.twitter.com/O7K77VLsOw— ANI (@ANI) March 14, 2025కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలోని తన స్వగృహంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.#WATCH | Varanasi, UP | Historic city, Kashi celebrates the festival of colours #Holi pic.twitter.com/fYkCJwpikL— ANI (@ANI) March 14, 2025ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీలో హోలీ వేడుకలు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి.#WATCH | Maharashtra: People arrive at Juhu Beach in Mumbai to celebrate the festival of #Holi pic.twitter.com/ngIkpvlbEC— ANI (@ANI) March 14, 2025మహారాష్ట్రలోని ముంబైలో జుహూ బీచ్ దగ్గర హోలీ సందడి కనిపిస్తోంది.#WATCH | Madhya Pradesh | Rudrabhishek of lord Shiva is being performed at Ujjain's Mahakaleshwar Temple on the occasion of #Holi pic.twitter.com/sK64EWECuu— ANI (@ANI) March 14, 2025హోలీ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుని ఘనంగా అభిషేకాలు నిర్వహించారు.#WATCH | Kolkata, West Bengal: Women apply gulaal and celebrate the festival of colours, Holi pic.twitter.com/9U4w9mZavi— ANI (@ANI) March 14, 2025పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో హోలీ వేడుకలు అంత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇది కూడా చదవండి: ‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన -
Holi 2025 : భూమికి పచ్చాని రంగేసినట్టు, రంగులద్దిన ఫ్యాషన్ క్వీన్స్
హోలీ (Holi2025) పండుగ అంటే ఉల్లాసం, ఉత్సాహం. పిల్లాపెద్దా అంతా అందంగా ముస్తాబవుతారు. ఇంద్రధనుస్సు లాంటి రంగులతో ఆటలాడుకుని తమ జీవితాలు మరింత రంగులమయం శోభిల్లాలని కోరుకుంటారు. రంగు రంగుల రంగులు, గులాల్ చల్లుకొని హోలీ ఆడతారు. ఇక సెలబ్రిటీలయితే అందంగా ముస్తాబై తమ అభిమానులను అలరిస్తారు. రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వయసుతో పని ఏముంది అని నిరూపించారు బాలీవుడ్ హీరోయిన్లు. వారెవరో చూసేద్దామా.2025 హోలీ కోసం సాంప్రదాయ చీరలో మాధురి దీక్షిత్ ( Madhuri Dixit ) ప్రశాంతకు చిహ్నమైన పచ్చని రంగులో అందంగాముస్తాబైనారు. తొమ్మిది గజాల అద్భుతంలో ఆకుపచ్చ రంగులో మాధురి యంగ్ అండ్ ఎనర్జటిక్‌గా కనిపించారు. 57 ఏళ్ల ఈ బాలీవుడ్ స్టార్ పండుగ కళతో ఉట్టిపడుతూ దేవతలామెరిపించింది.చీర అంటే గుర్తొచ్చే సెలబ్రిటీలలో మాధురి ఒకరు అనడంలో ఎలాంటి సందేహంలేదు. డిజైనర్ జయంతి రెడ్డి రూపొందించిన చీరకు వెండి జర్డోజీ ఎంబ్రాయిడరీ స్వీట్హార్ట్ నెక్లైన్, జుట్టుగా చక్కగా ముడి వేసుకకొని తన సిగ్నేచర్ లుక్కు మరింత వైభవాన్ని జోడించారు. చదవండి: Holi 2025 Celebrations: యంగ్ హీరోయిన్ల ఫ్యావరేట్ కలర్స్ ఇవే! సెలబ్రిటీ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ మాధురి ఎథెరియల్ లుక్‌ను వజ్రాలు, పచ్చలు నిండిన మహారాణి నెక్లెస్, చెవిపోగులు, ఇతర ఆభరణలతో ఎథ్నిక్ లుక్కు మెరుపు వచ్చేసింది. గ్లామర్ విత్ ట్రెడిషన్ మాధురి షేర్ చేసిన ఫోటోలను ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా! తగ్గేదెలే అంటున్న రవీనా నాకేం తక్కువ అంటూ ఈ హోలీకి వచ్చేశారు మరో సీనియర్ నటి, 52 ఏళ్ల రవీనా టాండన్ (Raveena Tandon). 90ల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ అందమైన దివా , ఈ హోలీకి బ్యూటీ ట్రీట్‌ను అందించింది. తన అందమైన కళ్ళతో హోలీకి రంగుల కళను తీసుకొచ్చింది. ఇద్దరు బిడ్డలతల్లి, రవీనా దేశీ స్టైల్ గ్లామ్‌లో మహారాణిలా కనిపించింది. గోధుమరంగు డ్రెస్‌కు, పింక్ కలర్ దుప్పట్టాను జోడించింది. సొగసైన ఝుంకాలు ఆమె లుక్నుమరింత ఎలివేట్ చేశాయి. హోళికా దహన్ శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. -
అక్కడ పది రోజులపాటు హోలీ వేడుకలు
నవసారి: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు(Holi celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. చిన్నాపెద్దా అంతా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా హోలీ వేడుకలు ఒకరోజు జరుగుతాయి. కానీ ఆ ప్రాంతంలో ఏకంగా 10 రోజుల పాటు హోలీ వేడుకలు కొనసాగుతాయి. గుజరాత్‌లోని ఆదివాసీ జనబాహుళ్యం కలిగిన డాంగ్ జిల్లాలో హోలీ ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.డాంగ్ జిల్లాలో జరిగే హోలీని రాజుల హోలీ(Holi of the Kings)గా చెబుతారు. డాంగ్ జిల్లాలో నేటికీ ఐదుగురు రాజవంశస్థులు ఉన్నారు. ఏడాదిలో ఒకసారి ఈ రాజులను బహిరంగంగా గౌరవపూర్వకంగా సన్మానిస్తారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనిని డాండ్ దర్బార్ మేళా అని అంటారు. ఈ ఉత్సవాల్లో ఆ రాజులను రథాలలో కూర్చోబెట్టి వేదిక దగ్గరకు తీసుకువచ్చి, ఘనంగా సన్మానిస్తారు. వీరికి ప్రభుత్వం ఫించను అందజేస్తుంది. పది రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో ప్రతీరోజూ ఇక్కడి ఆదివాసీ మహిళలు సాయంత్రం వేళల్లో జానపద గీతాలు ఆలపిస్తారు. అలాగే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతలోని చిన్నారులు తమ మేనమామలకు హోలీ స్నానం చేయిస్తారు. చిన్నారులను స్థానికులు భక్త ప్రహాదుని రూపాలుగా భావించి పూజలు చేస్తారు.ఇది కూడా చదవండి: ‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన -
హైదరాబాద్ లో అంబరాన్నంటిన హోలీ వేడుకలు.. (ఫొటోలు)
-
హోలీ.. ఆర్థిక వ్యవస్థకు ఆనంద కేళి
రంగుల పండుగ హోలీ కేవలం ఆనందం, ఐక్యతకు వేడుకగా మాత్రమేకాదు, దేశంలో గణనీయమైన ఆర్థిక వ్యాపారానికి తోడ్పాటునందిస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది హోలీ రోజున రూ.60,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది నమోదైన రూ.50,000 కోట్ల వ్యాపారంతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని తెలిపింది.అన్ని రంగాల్లో ఆర్థిక వృద్ధిసాధారణంగా పండుగ సమయాల్లో విభిన్న విభాగాల్లో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. స్వీట్లు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), గిఫ్ట్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, దుస్తులు, పూలు, పండ్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వంటి ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుంది. పండుగలకు ముందే కొందరు ఆయా వస్తువులను కొనుగోలు చేస్తే, పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంకొందరు ఈమేరకు ఖర్చు చేస్తారు. దాంతో రిటైల్ వ్యాపారులతోపాటు, దుకాణదారులతో మార్కెట్లు సందడిగా ఉంటాయి. గతంలో కంటే ఈసారి అధికంగా ఖర్చు చేస్తారని అంచనాలు ఉండడంతో స్థానిక వ్యాపారాలు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.స్థానిక ఉత్పత్తులకు గిరాకీఈ ఏడాది వివిధ విభాగాల్లోని వ్యాపారులు భారత్‌లో తయారవుతున్న వస్తువులను ప్రమోట్ చేయడంపై దృష్టి సారించారు. వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులకు దూరంగా స్థానికంగా తయారైన హెర్బల్ కలర్స్, ట్రెడిషనల్ వాటర్ గన్స్ (పిచ్కారీస్), బెలూన్లు, పూజా సామగ్రిని ఎంచుకుంటున్నారు. ఈ మార్పు దేశీయ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుంది.ఇదీ చదవండి: బ్యాంకింగ్‌కు జెనరేటివ్ ఏఐ బూస్ట్!ఒక్క ఢిల్లీలోనే 3000కు పైగా కార్యక్రమాలు..పెద్ద ఎత్తున హోలీ మిలన్ కార్యక్రమాలు, సమావేశాలు ఆర్థిక వృద్ధికి మరింత దోహదం చేస్తున్నాయి. ఒక్క ఢిల్లీలోనే ఇలాంటి 3,000కు పైగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడంతో వేదికలు, క్యాటరింగ్, సంబంధిత సేవలకు గిరాకీ పెరిగింది. వివిధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరిచే ఈ ఉత్సవం సామర్థ్యం సాంస్కృతిక, సామాజిక కోణాలకు అతీతంగా దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. -
Holi 2025: పసందైన సినీ హోలీ పాటలు
హోలీ పండుగ అంటేనే సంబరాలు పండుగ. హోలీకి సంబంధించిన అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాగే సరదా సంబరాల పండుగలో పాటలు లేకుండా సరదా ఏముంటుంది. సినీ పరిశ్రమలో ఎన్నో పాటలు రంగుల వసంతాలను వెదజల్లాయి. తెలుగు సినిమా పాటల్లో హోలీ సంబరం కనిపిస్తుంది. మచ్చుకు కొన్ని పాటలు... 71 సంవత్సరాల హోలీ సాంగ్... మణిరత్నం–కమల్‌హాసన్ ‘నాయకుడు’ సినిమాలోని హోలీ పాట ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ ప్రతి హోలీ సందర్భంగా ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘రాఖీ’లో ‘రంగ్ బర్సే’ హోలీ పాట బాగా పాపులర్.నాగార్జున ‘మాస్’ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ హోలీ పండగ రోజున చెవిన పడాల్సిందే వెంకటేష్ ‘జెమిని’లో ‘దిల్ దివానా.. మై హసీనా’ హోలీ నేపథ్యంలో వినిపిస్తుందిప్రణయ విలాసములే. శివాజీ గణేషన్ సినిమా ‘మనోహర’ సినిమాలోనిది ఈ పాట. వీటితోపాటు గోపాల గోపాల, విజయ్ దేవర కొండ, మెహ్రీన్.. ‘హోలీ’ స్పెషల్ సాంగ్ , సీతారామరాజు సీనిమాలోని నాగార్జున, హరికృష్ణ, సాక్షి శివానంద్, ఆట ఆరంభం: అజీత్ కుమార్, రాణా, నయన తార నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాల్లోని పాటలు ఉన్నాయి. హోలీ -పురాణగాథలుచెడు అంతానికి సంకేతంవద్దని చెప్పినా శ్రీమహావిష్ణువునే స్మరిస్తున్న ప్రహ్లాదుడిని చంపాని తన సోదరి హోలికను ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని హోలిక మంటల్లో దూకుతుంది. విష్ణునామ స్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి చీమ కుట్టినట్లు కూడా కాదు. హోలిక మాత్రం కాలి బూడిద అవుతుంది, ఆ బూడిదే చెడు అంతానికి సంకేతం.చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!కాముని పున్నం శివుని భార్య సతీదేవి దక్ష ప్రజాప్రతి యజ్ఞంలో దేహాన్ని విసర్జింపగా శివుడు విరాగిౖయె హిమవత్ పర్వతంపై తపస్సు చేయసాగాడు. రాక్షసుల బాధలు పడలేని దేవతలు తపస్సులో ఉన్న శివుడి దీక్షను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. పార్వతిగ పుట్టిన సతీదేవిపై శివుడికి ప్రేమ కలిగించవలసిందిగా దేవతలు మన్మథుణ్ణి కోరారు. మన్మథుడు తన భార్య రతీదేవి మిత్రుడు వసంతుడితో కలిసి హిమవంతం చేరాడు. పార్వతీదేవి సపర్యలు చేస్తున్న సమయంలోశివుడిపై మన్మథుడు పుష్ప బాణాలు ప్రయోగించాడు. తన దివ్యదృష్టితో కాముని చర్యలు గ్రహించిన శివుడు కోపంతో ముక్కంటితో దహించాడు. కాముడి రూపంలో ఉన్న మన్మథుడిని దహించి వేయడాన్ని ‘కాముని దహనం’ ‘కాముని పున్నం’గా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రజలు పండుగ చేసుకుంటారు.కాముని పున్నంకృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు రాజు ఉండేవాడు. పసిపిల్లలను ‘హోలిక’ అనే రాక్షసి హింసిస్తోందని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు. అదే సభలో ఉన్న నారద మహాముని ‘ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికను పూజించిన పసిపిల్లలకు బాధలు ఉండవు’ అని చెప్పాడు. ఆనాటి నుంచి ఈ హోలీ ఉత్సవం జరుగుతోందని ప్రతీతి.‘రంగుల’ రాట్నం పురాతన కాలంలో గ్రీస్‌లో ‘నీలం’ రంగుకు నేరుగా సరిపోయే పదం లేదు. దగ్గరి వర్ణనలు మాత్రమే ఉండేవి ఆఫ్రికా ఎడారి తెగ ప్రజలు ‘ఎరుపు’ వర్ణాన్ని ఆరు పేర్లతో పిలుస్తారు. పురాతన కాలంలో ఈజిప్షియన్లు, మాయన్లు వేడుకలలో తమ ముఖానికి ఎరుపు రంగు పూసుకోవడం తప్పనిసరిగా ఉండేది. రోమన్ సైన్యాధిపతులు తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి శరీరానికి ఎరుపురంగు వేసుకునేవారు. కలర్ అసోసియేషన్ల ద్వారా వ్యక్తిత్వ లోపాలను నిర్ధారించేవాడు... డాక్టర్ మాక్స్ లుషర్. ∙వన్స్ అపాన్ ఏ టైమ్ రోమన్ల కాలంలో క్యారెట్లు ఉదా, తెలుపు రంగులలో ఉండేవి. మధ్య యుగాలలో నలుపు, ఆకుపచ్చ రంగులలో కూడా ఉండేవి.కలర్ మ్యాజిక్ వర్డ్స్: సెలాడాన్–లేత ఆకుపచ్చ రంగు, ల్యూటీయన్–డీప్ ఆరెంజ్, కెర్మెస్–ప్రకాశవంతమైన ఎరుపు, సినోపర్–ముదురు ఎరుపు–గోధుమ రంగు, స్మాల్డ్–డీప్ బ్లూ. చదవండి : Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! -యంబ నర్సింహులు, సాక్షి, ప్రతినిధి, యాదాద్రి భువనగిరి -
‘27 ఏళ్లుగా హోలీ అన్నదేలేదు’.. ఓ పోలీసు ఆవేదన
దేశంలో హోలీ వేడుకలు(Holi celebrations) అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. వాడవాడలా జనం ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటూ ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే హోలీ వేళ భద్రతా విధులు చేపడుతున్న పోలీసులు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సివస్తోంది. దీంతో వారు కొంతమేరకు అసంతృప్తికి లోనవుతున్నారు.ఒక పోలీసు తాను కుటుంబ సభ్యులతో హోలీ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నానంటూ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది. సాధారణంగా పండుగలకు ఎవరికైనా సెలవు ఉంటుంది. అలా లేని పక్షంలో ఆఫీసులో సెలవు పెట్టుకుని, పండుగపూట ఇంటిలోని వారితో ఆనందిస్తుంటారు. అయితే తనకు గత 27 ఏళ్లుగా ఎప్పుడూ ఇంటిలోనివారతో హోలీ ఆడేందుకు అవకాశం రాలేదని కానిస్టేబుల్(Constable) సంజీవ్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. यूपी पुलिस के संजीव कुमार सिंह जी का वीडियो देखकर मन बड़ा चिंतित हुआ जिन्होंने लगातार 27 साल सेवा दी हैलेकिन संजीव कुमार जी की माता जी का भी देहांत पिछले साल हुआ है और उनकी इस बार पहली होली है गांव में उनकी उपस्थिति अनिवार्य है लेकिन छुट्टी नहीं मिल पाई है और लगातार कुंभ में भी… pic.twitter.com/MGZgbtGtPm— Adv Deepak Babu (@dbabuadvocate) March 13, 2025ఈ వీడియోలో సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ‘ఫ్రెండ్స్, ఈ రోజు నేనెంతో ఆవేదన చెందుతున్నాను. నేను గత 27 ఏళ్లుగా పోలీసు డ్యూటీ నిర్వహిస్తున్నాను. ఈ 27 ఏళ్లలో ఎన్నడూ ఇంటిలోని వారితో హోలీ చేసుకోలేదు. మహాకుంభ్ డ్యూటీ ముగిశాక సెలవు దొరుకుతుందని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మేముండే హర్దోయీ(యూపీ)కి వెళ్లలేను. జనమంతా స్వస్థలాలకు వెళ్లి, హోలీ వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసు విధుల కారణంగా నేను ఇంటికి రాలేనని ఇంటిలోని వారికి చెప్పాను’ అని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఇదేం హోలీరా బాబూ.. వీడియో వైరల్ -
హోలీ వేళ పిడిగుద్దుల ఆటపై పోలీసుల ఆంక్షలు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో 124 ఏళ్ల నుంచి ఆచారంగా వస్తున్న పిడిగుద్దుల(Pidiguddulata) ఆటపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పిడిగుద్దుల ఆటకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయంగా వస్తున్న ఆటను అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఈ ఆటపై ఉత్కంఠ నెలకొంది.నిజామాబాద్ జిల్లాలోని సాలూర మండలం హున్సాలో ప్రతీ ఏడాది హోలీ సందర్బంగా పిడిగుద్దుల ఆట నిర్వహిస్తారు. ఈ ఆటలో భాగంగా ముందుగా గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. గ్రామం మధ్యలో ఉన్న చావిడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో రెండు వైపులా రెండు కర్రలు (గుంజలు) భూమిలో పాతుతారు. ఆ రెండు కర్రలకు మధ్యన ఓ బలమైన తాడును కడుతారు.అంతకుముందు గ్రామదేవతలకు పూజలు చేసి గ్రామ పెద్ద మనుషులు, పటేల్, పట్వారీలను డప్పులు, బాజాలతో పిడిగుద్దుల ఆట నిర్వహించే స్థలం వద్దకు వస్తారు. తర్వాత ఆట మొదలు కాగానే ఒక వర్గంపై మరో వర్గం పిడిగుద్దులతో విరుచుకుపడతారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగుతుంది. ఈ క్రమంలో దెబ్బలు తాకినా లెక్క చేయకుండా ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆట ముగిసిన ఒకరినొకరు కౌగిలించుకుంటారు.ఈ ఆటలో దెబ్బలు తగిలి రక్తాలు కారినా పట్టించుకోకుండా, కామదహనంలోని బూడిదను చేతులతో తీసుకుని దెబ్బలు, గాయాలపై రాసుకుంటే గాయాలు మానిపోతాయని, నొప్పులు కూడా తెలియవని గ్రామస్థులంటారు. కొత్తగా చూసేవారికి విచిత్రంగా అనిపించే ఈ ఆట హున్సా గ్రామానికే ప్రత్యేకతను సంతరించి పెట్టింది. అనంతరం, ఆట స్థలం నుంచి డప్పులు బాజాలతో కేకలు వేస్తూ గ్రామంలో తిరుగుతారు. ఈ ఆటను తిలకించడానికి తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తారు. అందుకే ఎన్ని ఆంక్షలు, హెచ్చరికలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా గ్రామస్థులంతా ఏకంగా నిలబడి ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల నుంచి గ్రామస్థులు పిడిగుద్దులాట కోసం రిహార్సల్స్ చేస్తూ ఆటకు సిద్ధమవుతున్నారు. -
Holi 2025 యంగ్ హీరోయిన్ల ఫ్యావరేట్ కలర్స్ ఇవే!
భువిపై విరిసే ఇంధ్రధనుస్సుఇంధ్ర ధనుస్సు నేలకు దిగి వచ్చిందా... అనిపించే రోజు హోలీ. సప్తవర్ణాలలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది.ఆ ఇష్టాన్ని తమ డ్రెస్సుల ద్వారా చూపుతుంటారు. సినిమా తెరపైన రంగు రంగుల దుస్తుల్లో కనిపించే తారలు తమకు ప్రత్యేకించి ఇష్టమైన రంగు గురించి ఈ హోలీ సందర్భంగా మనతో పంచుకుంటున్నారు. బ్లూ అండ్ పింక్ నాకు నచ్చిన రంగు పింక్. పెరుగుతున్న కొద్దీ అన్ని రంగులు నచ్చుతుంటాయి. కానీ, ఎక్కువ భాగం అయితే పింక్, బ్లూ కలర్స్ నా డ్రెస్సింగ్లోనూ చోటు చేసుకుంటుంటాయి. – శివాత్మిక రాజశేఖర్మల్టీ కలర్స్ నా జీవితంలో ఇంధ్రధనస్సు రంగులన్నీ ఉండాలనుకుంటాను. ఎందుకంటే, మనలోని భావోద్వేగాలను తెలియజేప్పేవే రంగులు. సప్తవర్ణాలన్నీ నాకు ఇష్టమైనవే. అందుకే నా డ్రెస్సులలో మల్లీ కలర్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. ఒక ప్లెయిన్ కలర్ శారీ లేదా డ్రెస్ వేసుకుంటే దాని మీదకు మల్టీకలర్ బ్లౌజ్, దుపట్టా ఉండేలా చూసుకుంటాను. – సంయుక్త మీనన్చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!అన్ని రంగులను స్వాగతించే తెలుపు నాకు తెలుపు రంగు చాలా ఇష్టం. శాంతి, కొత్త ప్రారంభాలు, అంతులేని అవకాశాలకు చిహ్నం తెలుపు. రంగులతో నింపుకోవడానికి వేచి ఉండే ఖాళీ కాన్వాస్ లాంటిది తెలుపు. ఇది అన్నింటినీ స్వాగతించే రంగు. అందుకే ఈ రంగు నాకు స్ఫూర్తిమంతమైనది కూడా. ప్రేమ, దయ, ఆనందాన్ని వ్యాప్తి చేసే ఈ వేడుక సందర్భంగా తెల్లని మన హృదయాలపైన అందమైన రంగులను చిలకరించుకుందాం. – వైష్ణవి చైతన్యచదవండి: Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! గ్రీన్ అండ్ పర్పుల్నాకు చాలా ఇష్టమైనది ఎల్లో. దీనిలోనే మరింత బ్రైట్‌గా ఉండే డ్రెస్సులను ఎంచుకుంటాను. దీంతో పాటు పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్స్ ఇష్టపడతాను. ఈ రంగులోనే పీచ్ కలర్ డ్రెస్సులు ధరించినప్పుడు ఉల్లాసంగా అనిపిస్తుంది. అవి నన్ను ప్రత్యేకంగా చూపుతాయి అనే భావన ఉంటుంది – రెజినా కసండ్రాప్రతి ఒక్కరికి కొన్ని రంగులు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అయితే, దుస్తుల విషయంలో మాత్రం కొన్ని రంగులు మాత్రమే వారి శరీరానికి నప్పేవిధంగా ఉంటాయి. ఏ రంగు డ్రెస్ ఎవరికి నప్పుతుందంటే... సాధారణంగా చీరలు ఎంపిక చేసుకుంటున్నప్పుడు వాటిని మన మీద వేసుకొని, కలర్ బాగుంటుందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకుంటుంటాం. కొంత మంది చర్మం ఫెయిర్‌గా ఉంటుంది. కానీ, డార్క్ కలర్స్ సెట్ అవవు. అలాంటప్పుడు లైట్ షేడ్స్ లేదా మల్టీకలర్స్ని ఎంపిక చేసుకోవచ్చు. వీరు సేమ్ స్కిన్ టోన్ కలర్ డ్రెస్సులు ఈవెనింగ్ పార్టీలకు ధరిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు డార్క్ స్కిన్ ఉన్నవారికి లేత రంగులు బాగుంటాయి అనుకుంటారు. కానీ, వీరికి డార్క్ కలర్స్ బాగుంటాటాయి.తమకు నప్పే కలర్ డ్రెస్ ఎంపికకు డిజైనర్ సలహాలు తీసుకుంటారు. అలాంటి వారికి కలర్ కాన్సెప్ట్ గురించి వివరిస్తాం. వారి శరీర రంగు, సందర్భం, పార్టీ .. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని డిజైన్ చేస్తాం. రీ యూజ్... రంగులు చల్లుకున్నాక వేసుకున్న డ్రెస్ మల్టీకలర్‌తో నిండిపోతుంది. ఆ డ్రెస్ పైన ఏ కలర్ భాగం ఎక్కువుందో చూసుకొని, ఆ రంగుతో డైయింగ్ చేయించి, తిరిగి వాడుకోవచ్చు. -నవ్యశ్రీ మండవ, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
Holi 2025 వర్చువల్ హోలి,నలభై రోజుల హోలీ!
హోలి అంటే యువతరం పండగ. ఆనందం ఆకాశాన్ని అంటే పండగ. దీన్ని దృష్టిలో పెట్టుకొని వర్చువల్ హోలిని ముందుకు తెచ్చాయి శాంసంగ్,స్నాప్‌చాట్. సాంకేతికతకు, సంప్రదాయాన్ని జోడిస్తూ హోలి వేడుకలకు కొత్త రంగు జోడించాయి శాంసంగ్, స్నాప్‌చాట్ సంస్థలు. ఏఐ ఆధారిత ఏఆర్ లెన్స్‌తో హోలీ వేడుకలకు డిజిటల్ రంగును జోడించాయి. ఇంటరాక్టివ్ ఫేస్–పెయింటింగ్ ఎఫెక్ట్ ద్వారా హోలీ రంగులు వచ్చువల్‌గా అనుభవంలోకి వస్తాయి. పైనల్ స్క్రీన్ డిస్ప్లేలో ‘హోలి మెసేజ్’ కనువిందు చేస్తుంది. ‘77 శాతం మంది హోలి వేడుకలను సృజనాత్మకంగా, కొత్తగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఏఆర్ లెన్స్లనుఇష్టపడుతున్నారు’ అంటుంది స్నాప్ ఇంక్ ఇండియా అడ్వర్టైజింగ్ హెడ్ నేహా జోలి. వర్చువల్ హోలి ‘ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్‌తో కలిపి హోలి బాగా ఆడేవాడిని. వారు విదేశాల్లో ఉండడం వల్ల ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాను’ అని ఇక ముందు బాధ పడనక్కర్లేదు. ఫ్రెండ్స్ ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు ఉన్నా సరే, వర్చువల్ హోలి పుణ్యమా అని పండగ సంతోషాన్ని సొంతం చేసుకోవచ్చు. వర్చువల్ హోలి పార్టీలు ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి!చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా! నలభై రోజుల హోలీ! ఉత్తరాఖండ్‌లో హోలీని ‘కుమావోనీ’ హోలీగా జరుపుకుంటారు. ఇది బసంత్ పంచమితో ప్రారంభమయ్యే నెలరోజుల ఉత్సవం. దీన్ని బైతక్ హోలీ, నిర్వైన్ హోలీ అని కూడా పిలుస్తారు శివుడు కొలువు తీరిన వారణాసిలో శ్మశానంలో దొరికే బూడిదతో హోలీ వేడుకలు జరుపుకుంటారు. ఈ హోలిని ‘మసన్ హోలీ’ అని పిలుస్తారు.రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో చారిత్రాత్మకమైన ‘ఘన్‌శ్యామ్ జీ మందిర్’ ప్రాంతంలో హోలీ ఉత్సవాన్ని 40 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ హోలీ ఉత్సవాలను చూడడానికి స్థానికులే కాదు విదేశీయులు కూడా వస్తారు. ఈ ఆలయాన్ని 1718లో నిర్మించారు పండగకి రెండు రోజుల ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లో వితంతువులు హోలీ వేడుకలు మొదలుపెడతారు.ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘లాత్మార్ హోలీ’ వేడుకలు జరుగుతాయి. పురుషులను కర్రలతో తరుముతూ, వారిని రెచ్చగొట్టేలా మహిళలు పాటలు పాడతారు ∙హోలీని మన దేశంలోనే కాదు నేపాల్, శ్రీలంకలాంటి దేశాల్లోనూ జరుపుకుంటారు. నేపాల్‌లో ‘భోటే ఉత్సవ్’ అని, శ్రీలంకలో ‘పులంగి’ అనీ పిలుస్తారు.హోలీ... అరవై వేల కోట్ల వ్యాపారం! గత ఏడాదితో పోల్చితే 20 శాతం వృద్ధితో ఈ సంవత్సరం హోలీ పండగకు సంబంధించి రూ.60,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. మూలికరంగులు, పండగ వస్తువులు, స్వీట్లు, వాటర్ గన్స్, బెలూన్లు, వైట్ టీ–షర్ట్లు, కుర్తా–పైజామాలు, హ్యాపీ హోలి స్లోగన్లతో ఉన్న టీ–షర్ట్లు... మొదలైన వాటికి పెరిగిన డిమాండ్ దేశవ్యాప్తంగా హోలీ పండగ వాణిజ్యాన్ని పెంచింది. ఈ డిమాండ్ రిటైలర్లు, చిన్న వ్యాపారులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఎఐటి) తెలియజేసింది చదవండి: Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు! -
ఇదేం హోలీరా బాబూ.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా హోలీ(Holi) ఉత్సవాలు ఆనందంగా జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు ఉత్సాహంగా రంగులు జల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. రంగులు జల్లేందుకు పలువురు వివిధ మార్గాలను ఎన్నుకుంటుంటారు. ఇందుకోసం కొందరు కలర్ పౌడర్లను వినియోగిస్తుండగా, మరికొందరు రంగు నీళ్లను వినియోగిస్తుంటారు. అయితే దీనికి భిన్నంగా జరిగిన ఒక హోలీ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. गांव की होली का अंदाजा भी नहीं शहर वालो को🤣हमारे यहां ऐसा ही होता है pic.twitter.com/445Pxr2mHw— @Madhu_queen (@madhu_quen) March 13, 2025ఈ వీడియో(Video)లో ఒక యువకుడు మరో యువకుడి ఎత్తుకుని తీసుకువెళ్లి, ఒక బురద గుంతలో పడేస్తాడు. దీంతో ఆ కుర్రాడి శరీరమంతా బురదమయంగా మారిపోతుంది. అలాగే ఆ కుర్రాడు బురదలో నుంచి లేవడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ హోలీ సందర్భంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘గ్రామాల్లో జరిగే హోలీ వేడుకలను ఎవరూ అంచనా వేయలేరని, మా గ్రామంలోనూ ఇలానే జరుగుతుందని’ రాశారు. మరొకరు ‘వారు వింత మనుషుల్లా ఉన్నారంటూ’ కామెంట్ రాశారు.ఇది కూడా చదవండి: నేడు హోలీ.. రంజాన్ ప్రార్థనలు.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం -
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు షురూ..(ఫొటోలు)
-
వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా నేడు ప్రజలంతా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.హోలీ పండుగ సందర్బంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ హోలీ మీ అందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు.#happyholi2025— YS Jagan Mohan Reddy (@ysjagan) March 14, 2025 -
హైదరాబాద్‌లో ఫుల్ జోష్‌లో హోలీ సంబరాలు (ఫొటోలు)
-
నేడు హోలీ.. రంజాన్ ప్రార్థనలు.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: నేడు ఒకవైపు హోలీ(Holi) మరోవైపు రంజాన్ శుక్రవారం ప్రార్థనల సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశరాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడేందుకు పారామిలిటరీ(Paramilitary) దళాలతో పాటు 25,000 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఢిల్లీలో పోలీసులు 300కు పైగా సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి, డ్రోన్లు,సీసీటీవీ కెమెరాల సహాయంతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Delhi Police conducted a flag march in the Malviya Nagar area ahead of Holi celebrations and Jumma Namaz, which are due to be held tomorrow. pic.twitter.com/pNSUYB1Xc1— ANI (@ANI) March 13, 2025ఇక హోలీ వేడుకలు ఘనంగా జరిగే రాజస్థాన్ విషయానికొస్తే రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైపూర్ అదనపు పోలీస్ కమిషనర్(Police Commissioner) (లా అండ్ ఆర్డర్) రామేశ్వర్ సింగ్ మాట్లాడుతూ పోలీసు విభాగానికి చెందిన 11 మంది అదనపు డిప్యూటీ కమిషనర్లు, 40 మందికి పైగా అసిస్టెంట్ కమిషనర్లు, 80 మంది సర్కిల్ ఆఫీసర్లు, దాదాపు 1500 మంది కానిస్టేబుళ్లు భద్రతా ఏర్పాట్లను చూసుకుంటారని తెలిపారు. అలాగే 300 మందికి పైగా మహిళా సిబ్బంది కూడా భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటారన్నారు. హోలీ రోజున పెద్ద సంఖ్యలో పర్యాటకులు జైపూర్‌కు తరలివస్తారని తెలిపారు.#WATCH | Delhi Police conducted a bike rally in the Connaught Place area ahead of Holi celebrations and Jumma Namaz, which are due to be held tomorrow. pic.twitter.com/9yhAKsPs0I— ANI (@ANI) March 13, 2025శతాబ్దాల నాటి సనాతన ధర్మ సంప్రదాయాలను అనుసరించి, సామరస్యంగా హోలీ జరుపుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోలీ సందర్భంగా ఎవరిపైన అయినా బలవంతంగా రంగులు వేయవద్దని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. పరస్పర గౌరవంతో జరుపుకునే పండుగలు మరింత ఆనందాన్ని ఇస్తాయన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు ఉన్నందున ప్రతి జిల్లాలోని శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. హోలీ రోజున అణువణువునా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో పాటు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్, స్టంట్ బైకింగ్‌లపై నిఘా ఉంచడానికి ప్రత్యేక బృందాలను మోహరించామని యూపీ పోలీసు అధికారులు తెలిపారు. ఇదేవిధంగా వివిధ రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇది కూడా చదవండి: హోలీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ -
హోలీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
ఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా ప్రజలంతా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు .ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఐకమత్యం, స్పూర్తిని హోలీ ప్రతిబింబిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మరోవైపు.. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా..‘మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఆనందంతో నిండిన ఈ పండుగ ప్రతీ ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపుతుంది. హోలీ పండుగ దేశ ప్రజల ఐక్యతను మరింతగా పెంచుతుంది అంటూ కామెంట్స్ చేశారు.आप सभी को होली की ढेरों शुभकामनाएं। हर्ष और उल्लास से भरा यह पावन-पर्व हर किसी के जीवन में नई उमंग और ऊर्जा का संचार करने के साथ ही देशवासियों की एकता के रंग को और प्रगाढ़ करे, यही कामना है।— Narendra Modi (@narendramodi) March 13, 2025 -
హోలీ రంగులు వద్దనుకుంటే దేశం విడిచి వెళ్లండి
గోరఖ్‌పూర్: హోలీ అంటే ఇష్టంలేనివారు, రంగులంటే పడనివారు దేశం విడిచి వెల్లాలని యూపీ మంత్రి, నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది హోలీ.. రంజాన్ మాసంలోని శుక్రవారం రోజే వచ్చింది. దీంతో హోలీ వేడుకలకు అసౌకర్యం కలగకుండా ముస్లింలు మధ్యాహ్నం వరకు ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావాల్సి వస్తే టార్పాలిన్‌తో కప్పుకోవాలని యూపీ, బీహార్‌లోని కొందరు రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం గోరఖ్‌పూర్‌లో హోలీ మిలన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిషాద్ మాట్లాడుతూ.. సమాజంలో విభేదాలు సృష్టించేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. హోలీ వేడుకలతో మతాన్ని ముడిపెట్టి ప్రజలన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారని, హøలీ ఆడేటప్పుడు కూడా అలాగే చేస్తారని చెప్పుకొచ్చారు. రెండూ ఐక్యతకు సంబంధించిన పండుగలే అయినా కొందరు రాజకీయ నాయకులు ఈ ఐక్యతను కోరుకోవడం లేదని, ఒక వర్గానికి చెందిన ప్రజల మనస్సులను విషపూరితం చేస్తున్నారని ఆరోపించారు. వారు కూడా ఈ దేశం పౌరులేనని, రంగులతో సమస్యలుంటే వారు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించారు. రంగులు పూస్తే తమ విశ్వాసాలు దెబ్బతింటాయని భావిస్తారని, మరి రంగురంగుల దుస్తులు ఎలా ధరిస్తున్నారని ప్రశ్నించారు. రంగుల వ్యాపారులు సైతం ఆ సామాజిక వర్గానికి చెందినవారేనని వెల్లడించారు. పండుగలు ఆనందాన్ని పంచడానికి, ఐక్యతను వ్యాప్తి చేయడానికి ఉద్దేశించినవన్నారు. -
ఇక్కడ పురుషులు హోలీ ఆడరు...
హోలీ.. రంగుల పండుగ. దేశమంతా ఉత్సాహంగా జరుపుకొనే ఈ వేడుకకు మార్కెట్లు రంగులతో కళకళలాడతాయి. వీధులన్నీ రంగులద్దుకుంటాయి. హోలీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో సంప్రదాయం ఉండగా.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో పురుషులు మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉంటారు. స్త్రీలు స్వేచ్ఛగా హోలీ ఆడుకుంటారు. ఈ ఆసక్తికర ఆచారం 500 ఏళ్లుగా కొనసాగుతోంది. ధిక్కరిస్తే బహిష్కరణే... ఈ సంప్రదాయం కొన్ని తరాలుగా కొనసాగుతోంది. 500 ఏళ్లుగా గ్రామస్తులు ఆచారాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. మహిళలు బయట తిరగకుండా ఉంచిన పర్దా వ్యవస్థ నుంచి ఈ సంప్రదాయం వచ్చిందని స్థానికులు చెబతారు. పురుషులు ఉండరు కాబట్టి మహిళలు స్వేచ్ఛగా వేడుకలు చేసుకుంటారు. ఈ సంప్రదాయాన్ని ధిక్కరించి పురుషులు గ్రామంలో ఉండిపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు. వారిని వెంటనే గ్రామం నుంచి బహిష్కరిస్తారు. ఇక పురుషులకు హోలీ పండుగే ఉండదా అంటే.. ఉంటుంది. కాకపోతే తరువాతి రోజు పురుషులు, స్త్రీలు కలిసి ఈ వేడుకలు జరుపుకొంటారు. కేవలం రంగులు జల్లుకోవడం కాదు.. పురుషులను స్త్రీలు కొరడాలతో కొట్టడంతో పుండుగ ముగుస్తుంది. పురుషులు ఆలయానికి.. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో నాగర్ గ్రామంలో ఈ అసాధారణ సంప్రదాయం ఉంది. హోలీ రోజున ఉదయం 10 గంటలు కాగానే.. నాగర్‌కు చెందిన ఐదేళ్లు దాటిన పురుషులంతా గ్రామాన్ని వదిలి శివార్లలో ఉన్న చాముండేశ్వరీ దేవీ ఆలయానికి వెళ్తారు. అక్కడ జాతర చేసుకుంటారు. భక్తిగీతాలు వింటూ రోజంతా భక్తిశ్రద్ధలతో గడుపుతారు. పురుషుల వేషధారణలో స్త్రీలు.. ఇంకేముంది ఊరంతా మహిళలదే. రోజంతా పండుగే. గ్రామాన్నంతా అలంకరించి రంగులు జల్లుకుంటూ శోభాయమానంగా మారుస్తారు. వయసుతో తేడా లేకుండా మహిళలంతా ఆనందోత్సహాల్లో మునిగిపోతారు. ప్రత్యేక ఆచారం కావడంతో అంతగా ఇష్టపడనివారు సైతం కచి్చతంగా హోలీ ఆడతారు. కొందరు స్త్రీలు పురుషుల వేషధారణతో వేడుకల్లో పాల్గొంటారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
అమ్మ శ్రమలో ఎన్ని రంగులో!
ఉదయాన్నే అమ్మ వేసే ముగ్గు రంగు తెలుపు. చల్లే కళ్లాపి ఆకుపచ్చ. గడపకు రాయాల్సింది పసుపు. నాన్నకు పెట్టాలి గోధుమ రంగు టీ. బాబు షూస్ పాలిష్ చేయాలి కదా నల్లగా. పాపాయికి కట్టాలి ఎర్ర రిబ్బన్. బట్టల సబ్బు రంగు నీలం. వంట గది నిండా మెటాలిక్ కలర్ పాత్రలే. కాటుక, తిలకం కంటే ముందు అమ్మకు అంటేది శ్రమ తాలూకు రంగులే. లోకానికి ఒకటే హోలి. అమ్మకు నిత్యం హోలి. నేడు అమ్మకే చెప్పాలి రంగు రంగుల కృతజ్ఞత.ప్రతి ఒక్కరి జీవితంలో రంగు రంగుల కలలు ఉంటాయి. అయితే స్త్రీలు ఆ రంగుల కలలను అందుకోవడంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. పరిమితులు ఎదురవుతాయి. వారు ఈ రంగులకు మాత్రమే అర్హులు అనే కనిపించని నియమాలు ఉంటాయి. పరిస్థితి చాలా మారినా స్త్రీ ఏదో ఒకదశలో రాజీ పడాలి. అయితే భారతీయ స్త్రీ ఆ రాజీని ఇష్టంగానే స్వీకరిస్తుంది. ముఖ్యంగా వివాహం అయ్యాక, తల్లిగా మారాక తాను కన్న రంగుల కలలన్నీ తన సంతానానికి ఇచ్చేస్తుంది. భర్త, పిల్లల సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. వారి కేరింగ్ కోసం రోజూ అంతులేని శ్రమ చేస్తుంది. ఆ పనుల్లోనే ఆమెకు రంగుల ప్రపంచం తెలియకుండానే ఎదురవుతుంటుంది. అమ్మకు రంగులు తోడవుతాయి. అవి ఆమెను అంతో ఇంతో ఉత్సాహ పరచడానికి ప్రయత్నిస్తాయి. కావాలంటే గమనించండి.అమ్మ శ్రమలో తెలుపు రంగు అడుగడుగునా ఉంది. ఆమె నిద్ర లేవడమే పాలు పోయించుకోవాలి. ముగ్గు వేయాలి. పిల్లలకు స్కూలుకు సిద్ధం చేసి తెల్లటి పౌడర్ రాయాలి. వెన్న కంటే తెల్లనైన ఇడ్లీల కోసం రాత్రే పిండి గ్రైండర్లో వేసుకోవాలి. తెల్ల యూనిఫామ్ ఉతికి సిద్ధం చేయాలి. తెల్లటి ఉప్పు, పంచదార తాకకుండా ఆమెకు జీవితం గడవదు. మునివేళ్ళకు ఆ తెల్లరంగు పదార్థాలు తాకుతూనే ఉంటాయి. ఎండలో వడియాలూ? టెంకాయ తెచ్చి పగులగొట్టి కొబ్బరి తీయడం ఆమెకు గాక ఇంటిలో ఎవరికీ రాదు. రాత్రిళ్లు అత్తామామలకు పుల్కాల కోసం ఆశీర్వాద్ ఆటాతో చేతులు తెల్లగా చేసుకోవాలి. ఆమే అన్నపూర్ణ. తెల్లటి అన్నం ఆమె చేతి పుణ్యం. ఆ వెంటనే ఆమెకు ఆకుపచ్చ ఎక్కువగా కనపడుతుంటుంది. కూరగాయలన్నీ ఆ రంగువే. ఇంట్లో మొక్కలకు ఆమే నీరు పోయాలి. ఆకుపచ్చ డిష్ వాషర్‌ను అరగదీసి గిన్నెలు కడిగి కడిగి చేతులు అరగదీసుకోవాలి. హెల్త్ కాన్షియస్నెస్ ఉన్న భర్త రోజూ ఆకుకూరలు ఉండాల్సిందే అంటాడుగాని పొన్నగంటి కూరో, కొయ్య తోటకూరో ఆకులు తుంచి కవర్లో వేయమంటే వేయడు. చేస్తే తప్ప ఆ పని ఎంత పనో తెలియదు.ఎరుపు రంగు అమ్మ పనిలో భాగం. ఇంటికి ఆమె ఎర్రటి జాజుపూతను అలుకుతూ ఉంటే వాకిలి నిండా మోదుగుపూలు రాలినట్లు అనిపిస్తుంది. అమ్మ ఉదయాన్నే స్నానం చేసి, దేవుడి పటాల ముందు నిలిచి అరుణ కిరణం లాంటి ఎర్రటి కుంకుమను వేలికొసతో అందుకొని, నుదుటి మీద దిద్దుకొని, దీపం వెలిగించాకే దేవుడు ఆవులిస్తూ నిద్రలేచేది. అమ్మ మునివేళ్ల మహిమకు సూర్యుడు కూడా ఆమె పాపిట్లో సిందూరమై ఒదిగిపోతాడు. ఎర్రటి ఆవకాయలు, పచ్చళ్లు చేతులను మంట పుట్టించినా అమ్మ చిర్నవ్వు నవ్వుతూనే ఉంటుంది. ఆమె చేయి కోసిన టొమాటోలు ఎన్ని వేలో కదా.అయితే అమ్మకు తనకంటూ కొన్ని రంగులు ఇష్టం. గోరింట పండితే వచ్చే ఎరుపు ఇష్టం.. మల్లెల తెలుపు ఇష్టం... తన ఒంటిపై మెరిసే నగల బంగారు వర్ణం ఇష్టం, మట్టి గాజుల రంగులు ఇష్టం, పట్టీల వెండి వర్ణం ఇష్టం, గోర్ల రంగులు ఇష్టం, కురుల నల్ల రంగు ఇష్టం, తాంబూలపు ఎరుపు ఇష్టం, కొద్దిగా మొహమాట పడినా లిప్‌స్టిక్ రంగులూ ఇష్టమే. పసుపు ఇంటికీ, అమ్మకూ శుభకరం. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా పసుపు డబ్బా తీసుకుని అమ్మ పరిగెడుతుంది. తీరిక ఉన్నప్పుడు గడపలకు రాస్తుంది. తను తాగినా తాగకపోయినా పిల్లలకు పాలలో కలిపి ఇస్తుంది. ఇక బ్లూ కలర్ అమ్మకే అంకితం. గ్యాస్ స్టవ్ మీద నీలం రంగు మంట ఆమెను ఎప్పటికీ వదలదు. ఇక జీవితాంతం బట్టల సబ్బు, సర్ఫ్‌ను వాడుతూ బట్టలు శుభ్రం చేయడమో చేయించడమో చేస్తూనే ఉండాలి. కనీసం హార్పిక్ వేసి టాయిలెట్లు కడగరు ఇంటి సభ్యులు. అదీ అమ్మ చాకిరే. నీలి మందు వేసి తెల్లవి తళతళలాడించడం, ఇస్త్రీ చేయించడం ఆమెకు తప్పదు. బట్టల హోమ్‌వర్క్‌లు చేయిస్తే బాల్‌పాయింట్ పెన్నుల నీలి గుర్తులు ఆమె చేతుల మీద కనిపిస్తాయి. ఇక నలుపు ఆమెకు ఏం తక్కువ. బూజు నుంచి అంట్ల మసి వరకు ఆమెకు ఎదురుపడుతూనే ఉంటుంది.ఇవాళ హోలి. కనీసం ఇవాళ అయినా అమ్మకు విశ్రాంతినిచ్చి ఆమెకు ఇష్టమైన రంగుల్లో ఇష్టమైన బహుమతులు ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి. -
Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!
హోలీ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. సరదాలు, రంగులు కలగలిసిన చక్కటి రంగుల పండుగ హోలీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఒకరిపై ఒకరు సంతోషంగా రంగులు జల్లుకుంటూ సంబరంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ హోలీ వెనుక అనే పురాణగాథలున్నాయి. అంతేకాదు పండుగ వేడుకల్లో ఆరోగ్యకరమైన ఆయుర్వేదకర ప్రయోజనాలున్నాయి. వణికించే చలి పులి పారిపోతుంది. వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ గాలి మార్పు కారణంగా జ్వరాలు, జలుబూ మేమున్నాం అంటూ వచ్చేస్తాయి. వీటిని అడ్డుకునేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడులను నీళ్లలో కలిపి చల్లుకునేందుకు ఈ వేడుక పుట్టిందని పెద్దలు చెబుతారు. కానీ కాలక్రమంలో సహజమైన రంగుల స్థానంలో రసాయనాలుమిళితమైన ప్రమాదక రంగులు వచ్చి చేరాయి. పైగా నాచులర్ కలర్స్‌తో పోలిస్తే చవగ్గా దొరుకుతాయి. అందుకే ఇంట్లోనే తక్కువగా ఖర్చుతో ఆర్గానిక్‌గా తయారు చేసుకునే కలర్స్ గురించి తెలుసుకుందాం. తద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు ప్రకృతిని కాపాడుకున్నవారమవుతాం.పండుగ వేడుక అంటే సంతోషాన్ని మిగిల్చాలి. ఆనందంగా గడిపిన క్షణాలు మనకు లేనిపోని సమస్యల్ని, రోగాలను తీసుకు రావడం కూడదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మందారం, బంతి, చేమంతిలా పూలతోపాటు, గోరింటాకుతో పచ్చని రంగు, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగులు తయారు చేసుకోవచ్చు. మోదుగుపూల రసాన్ని మర్చిపోతే ఎలా? మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హోలీ పండుగ పూట చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరి చేరవని అంటారు.పసుపు: బంతి పువ్వులు, నారింజ తొక్కల పొడి, చేమగడ్డ పొడి, పసుపు వంద సమపాళ్లలో తీసుకొని కలుపుకోవాలి.దీనికి కొద్దిగా నిమ్మ రసం వేసి ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే చక్కటి పసుపు రంగు తయారవుతుంది. దీన్ని నీళ్లలో కలుపుకుంటే లిక్విడ్ కలర్‌గా మారిపోతుంది.ఎరుపు: మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. వీటిని మెత్తని పొడిగా నూరుకుంటే ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఇది ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే దీనికి కొంచెం బియ్యప్పిండి యాడ్ చేసుకుంటే చాలు.మందారంతోపాటు ఎర్ర చందనం పౌడర్(కొంచెం ఖరీదైనదే)కలిపితే రెడ్ కలర్ తయారవుతుంది. ఎర్ర చందనం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తడి, పొడి రూపంలో వాడుకోవచ్చుగోధుమరంగుగోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్ర మాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్య ప్పిండిని కలిపితే చాలు.నీలం: జకరండ లేదా బ్లూ, ఊదా గుల్మొహార్ ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. అలాగే నీలం రంగు శంఖు పుష్పాలను నీళ్లలో నానబెడితే చక్కటి నీలం రంగు తయారవుతుంది. ఆకుపచ్చ: గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్య కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా సిద్దం చేసుకోవచ్చు.కాషాయం: మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెడితే పసుపు కాషాయం రంగుల మిశ్రమంతో చక్కటి రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. గోరింటాకును నూరి నీటిలో కలిపి, కొద్దిసేపు ఉంచి వడబోసుకుంటే ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును (ఇది కూడా చాలా ఖరీదైనది) రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికి కాషాయం రంగు తయారవుతుంది.గులాబీ: హోలీ ఆటలో చాలా ప్రధానమైన గులాల్ గులాబీ రంగులో ఉంటుంది. బీట్ రూట్ (నీటిలో మరగబెట్టి) రసం ద్వారా దీన్ని తయారు చేయొచ్చు. బీట్ రూట్‌ను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దీనికి శెనగ, పిండి, బియ్యం, గోధుమ పిండిని కలుపుకోవచ్చు. -
హోలీ అంటే రంగుల పండుగేనా..? కాముని పూర్ణిమ అని ఎందుకంటారు..?
'హోలీ' అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు. కానీ ప్రస్తుత కాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారతకాలం నుంచే వాడుకలో ఉంది. “హోళీక” అను రాక్షస దేవత బ్రహ్మ సృష్టించిన రావణ బ్రహ్మ సోదరి. ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవంతులవుతారుని ప్రశస్తి. ఈ హాలీ పండుగ నేపథ్యంలో అందుకు సంబంధించి.. ప్రాచుర్యంలో ఉన్న పలు కథనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.మహాభారతకాలంలో “బృహద్రధుడు” అను ఒకరాజు ఉండేవాడు. ఆ రాజులకు ఇరువురు భార్యలు. వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారట. వారు హోళికారాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించారట. దాంతో వారికి సగం-సగం శరీరభాగాలతో శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ రెండు శరీర భాగములు సంధిచేసి (అనగా అతికించి) ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడుఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..ఈ హోలీ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 'హోలీ' అంటే 'అగ్నిపునీత' అని అర్థం. ఈ పండుగ ప్రతి ఏడాది ఫాల్గుణమాసం పౌర్ణమిరోజున వస్తుంది. కనుక ఈ పండుగను 'హోళీ', కామునిపున్నమి', 'డోలికో త్సవం' అని రకరకాలుగా పిలుస్తారు. హోలీ అంటే అసలు తత్త్వం మరచిపోయి కాలాను గుణంగా రంగులపండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటుపడ్డారు. కానీ భారతీయ సాంప్రదాయంలో ఈ పండుగ అసలు ప్రాశస్త్యం తెలుసుకుందాం. దీనికి పురాణాల ప్రకారం ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. 'హిరణ్యకశివుడు' రాక్షసరాజు, అతని కుమారుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు కొడుకు విద్య కొరకు ఆచార్యుల వద్దకు పంపుతాడు.కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్ధులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవుతాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమిలాడి, బుజ్జగించి హరిభక్తిని విడనాడమని నచ్చచెప్పి చూస్తాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పరమార్ధమని చెప్పి తండ్రిమాటను ఖతరు చేయడు. ఇక్కడ హిరణ్యకశిపుడు హరివైరి. కనుక హరిని సేవించే తన కుమారుడిని తనకు శతృవుగా భావించి ప్రహ్లాదుని అంత మొందించాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఉద్దేశ్యంతోనే తన సేవకులను పిలిచి పిల్లవాడిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం. లోయలో పడ చేయడం, పాములతో కరిపించడం వంటి దారుణాలు చేయిస్తాడు. కానీ ఆ సమయంలో కూడా హరిభక్తివీడక 'నారాయణ' నామస్మరణచేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. దీంతో ప్రహ్లదుడికి విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు.హోళికాదహనం ఎందుకంటే..అది గమనించిన హిరణ్యకశిపుడు తనసోదరి హోళికను పిలిపిలిపిస్తాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ' ఉంటుంది. ఆ శాలువ ఆమె ఒంటిమీద ఉన్నంతవరకు మంటలు ఆమెను అంటుకోవు. అందువలన హిరణ్యక శిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు."అమ్మా! హోళికా! నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితిమీద కూర్చో! నీవు శాలువా కప్పుకో. నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెబుతాడు. ఆమె అన్న చెప్పి నట్లుగా చితి పేర్చుకుని ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని, తాను మాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టుమంటుంది.అత్త ఒడిలో కూర్చున్న ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా నారాయణనామ స్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళిక శరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరం మీదకి వచ్చినట్లు చేస్తాడు. అప్పుడు హోలిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోళిక దహనం కావడంతో..ఈనాటికీ చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పాత కర్రలతో మంటలు పెట్టి 'హోళికాదహనం' అని జరుపుకుంటారు. రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమైందన్న సంతోషంలో జరుపుకొనే పండుగ ఇది.కాముని పున్నమి అని ఎందుకంటారంటే..మరొకగాథ ప్రకారం.. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది.. మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకొనలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు. తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలా స్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. కనుక ఎలా గైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్ధించి పార్వతిని ఒప్పించి శివకల్యాణం జరిగేటట్లు చూడమని చెబు తాడు.విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతనివద్దకు మన్మథుడుని పంపుతారు ఋషులు. శివునిపై మన్మథుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేయించుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికారమును కలిగించగా.. ఆయన కోపంలో మన్మథుడుని చూశాడు. ఆ సమయానికి మన్మథుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండటం గమనించి పట్టరాని కోపంతో తన మూడవకన్ను తెరుస్తాడు.ఆ సమయంలో శివుని కంటి నుంచి సూర్యుని కిరణాలలో ఉన్న ఏడురంగుల కాంతితో మిళితమైన ఆ భగభగ మంటలధాటికి మన్మథుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మథుని భార్య రతీదేవి శివుడిని ప్రార్ధించగా కామదేవుడైన మన్మథుడుని తిరిగి బతికించాడు. కానీ భౌతికంగా కనిపించడని, భౌతికకామం కంటే నిజమైన ఉద్రేకపూరితమయిన ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు. ఆ ఏడురంగుల మంటలకు గుర్తుగా రంగుల పండుగలా ఈ హోలీని జరుపుకుంటారు.రంగులు ఎందుకు పులుముకుంటారంటే..శ్రీ కృష్ణునికి సంబంధించిన మరొక విషయంకూడా ఈ హోలీ పండుగకు సంబంధించింది. బాలకృష్ణుని ఫాల్గుణమాసం పౌర్ణమిరోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అందువలన పశ్చిమబెంగాల్లో ఈ పండుగరోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలోని వేసి 'డోలోత్సవం' జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోలీ పండుగరోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట.కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. "రంగ పంచమి" రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధ శరీరం ఎరుపు వర్ణం గురించి ఫిర్యాదుచేశాడట. అందుకని కృష్ణుని తల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట. అందువలన అందరూ హోళీ పండుగ రోజున రంగులు పులుముకుంటారని పురాణ వచనం.పూరీ జగన్నాధ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు. మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనం చేసి, వీధులలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంటలు వేస్తారు. కాశ్మీరులో సైనికులు రంగు రంగుల నీళ్ళను చల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపికలను ఆటపట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట. అప్పటినుండి హోళీ పండుగను 'లార్మోర్' అనే పేరుతో జరుపుకుంటారు.కవుల మాట్లలో హోలీ .."విలాసానాం సృష్టికర్రీ హోలికా పూర్ణిమా సదా"కాళిదాస మహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచూ సూర్యకాంతిలోని ఏడురంగుల కలయిక హోళీ అన్నాడట. రంగులు అంటే రాగరంజిత భావానలు అని అర్ధం. అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు-"వెలగడిమి నాడి వెన్నెల అలవడునేగాది బోయెన అమవస నిశితిన్" అంటే పౌర్ణిమనాటి వెన్నెలను విడిచి బెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్యవరకు కూడా వెలుగునుంచుకోవాలని... అలాగే జీవితంలో పండుగల ద్వారా మనం పొందే ఆనందం, మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం. ఏదీఏమైనా మన భారతీయ పండుగలు గొప్ప ఆధ్యాత్మికత తోపాటు ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అందిస్తాయనడంలో అతిశయోక్తి లేదు కదా..!.(చదవండి: ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!) -
Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
హోలీ హోలీల రంగ హోలీ..చమ్మకేళీలహోలీ అంటూ ఎంతో సరదాగా, ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ. పిల్లా పెద్దా అంతా హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణంగా ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే, హోలీ ఆడేముందు, ఆడిన తరువాత కొన్ని జాగ్రత్తలు తప్పని సరి. అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం.హోలీ ఆడే సమయంలో ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలు ఉంటాయని గమనించాలి. అలాగే వాడి సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు, ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకు దారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం.సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించు కోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదు.చదవండి: Holi 2025 : ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా! పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి.స్కిన్ అండ్ హెయిర్ : హోలీ ఆడటానికి వెళ్లే ముందు కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్‌ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు.ఇలా చేయడం వల్ల రంగులు ముఖం నుచి పోయే అవకాశం ఉంటుంది. హోలీ రంగులతో రియాక్షన్ ఇచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. పైగా సులభంగా రంగులు క్లీన్ అవుతాయి.దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని.నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.రంగులను ఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకుందాం. అందరికీ హ్యాపీ హోలీ. -
Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు
రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా మార్చి 14న జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతీ ఇంటిలోనూ సన్నాహాలు మొదలయ్యాయి. రంగులను కొనుగోలు చేసి, వాటితో ఆటలాండేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సహజసిద్ధమైన రంగులనే వాడాలంటూ పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. ఈ రంగుల కేళి హోలీని కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.హోలీ పండుగ అందరూ కలసి చేసుకునే వేడుక. ఇది ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తుంది. మనుషుల మధ్య ఉండే శతృత్వాలను కూడా హోలీ తరిమికొడుతుందని చెబుతుంటారు. పలు దేశాలలో స్థిరపడిన భారతీయులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటారు.నేపాల్హోలీ పండుగను మన పొరుగుదేశమైన నేపాల్లోనూ అత్యంత వేడుకగా జరుపుకుంటారు. దీనిని నేపాల్‌లో ఫాల్గుణ పూర్ణిమ అని అంటారు. కాఠ్మాండు తదితర నగరాల్లో హోలీ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. జనం ఈ వేడుకల్లో పాల్గొని ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని, ఇష్టమైన ఆహార పదార్థాలను ఆరగిస్తారు.యునైటెడ్ కింగ్డమ్హోలీ పండుగ బ్రిటన్‌లోని భారతీయులు అంత్యంత వేడుకగా చేసుకునే ఉత్సవం. హోలీ వేడుకలు లండన్‌తో పాటు బర్మింగ్‌హామ్‌లో అంత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడి భారతీయులు హోలీ వేళ బాలీవుడ్ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటారు.అమెరికాఅగ్రరాజ్యం అమెరికాలో హోలీ వేడుకలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో రంగుల ఉత్సవం జరుగుతుంది. భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.మారిషస్మారిషస్లో భారతీయ మూలాలు కలిగినవారు అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇక్కడ హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతుంటాయి. మారిషస్‌లో హోలీ వేళ ఒకరిపై మరొకరు రంగులు జల్లుకోవడమే కాకుండా, ఆలయాలలో పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే సాంప్రదాయ వంటకాలను చేసుకుని ఆరగిస్తుంటారు.బంగ్లాదేశ్బంగ్లాదేశ్లోని హిందువులు హోలీ వేడుకలను అంత్యంత వైభవంగా చేసుకుంటారు. ఆలయాలకు వెళ్లి, భక్తిప్రపత్తులతో పూజలు చేస్తారు. సాయంత్రం వేళ ఆలయాలలో భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుని ఆనందిస్తారు.ఇది కూడా చదవండి: Brazil: పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!! -
Holi 2025 : ఎపుడూ వైట్ డ్రెస్సేనా? కలర్ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!
హోలీ (Holi) అంటే.. రంగుల రాజ్యం. ఆద్యంతం హుషారుగా సాగే ఏకైక పండుగ ఇదేనేమో.. డ్యాన్స్, మ్యూజిక్, విందు వినోదాల కలయికగా సాగే ఈ పండుగ సందర్భంగా అనుసరించే ఫ్యాషన్ కూడా కలర్ఫుల్గా ఉండాలి కదా.. కాబట్టి కలర్ ఫెస్ట్‌లో ప్రత్యేకంగా కనబడేందుకు తాను చెప్పే స్టైల్స్‌తో లుక్‌ని కొత్త లెవల్‌కి తీసుకెళ్లండి అని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్ కన్సెల్టెంట్ సుమన్ కృష్ణ. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కలర్.. బ్లాక్‌ని సెంటరాఫ్ ఫ్యాషన్‌గా చేసి హోలీ వేడుకలో త‘లుక్’మనవచ్చని అంటున్నారామె. ఆమె అందిస్తున్న విశేషాలు, సూచనలివీ.. – సాక్షి, సిటీబ్యూరో కలర్ బ్లాకింగ్ అంటే..? ఇది విభిన్న, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ స్టైల్. మామూలు వైట్ కుర్తా బోరింగ్‌గా ఉంటుంది. సో.. ట్రెండీ కలర్ కాంబినేషన్లతో లుక్‌కి ఎక్స్ట్రా గ్లామర్ వస్తుంది.. ఒకే షేడ్‌లో ఉండే డ్రెస్సింగ్ కంటే, రెండు లేదా మూడింటికి పైగా బ్రైట్ కలర్స్ మిక్స్ చేసి ధరించడం ద్వారా మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. కొన్ని కలర్ కాంబినేషన్స్.. ధరించే దుస్తుల మధ్య సరైన కలర్ కాంబినేషన్ చాలా కీలకం. పింక్–ఆరేంజ్ హోలీకి చాలా ఎనర్జిటిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే..ఎల్లో–పర్పుల్ వంటి బ్రైట్ షేడ్స్ ట్రెడిషనల్ హోలీ లుక్‌కి సరైన ఎంపిక. అంతేకాకుండా బ్లూ–రెడ్ కూడా ట్రెండీ లుక్ అందిస్తాయి. వైట్–రేసింగ్ గ్రీన్‌లు క్లాసిక్‌గా కనపడాలంటే బెస్ట్. పీచ్‌లను సున్నితమైన, పండుగ కళ తెచ్చే కలర్స్‌గా పేర్కొనవచ్చు.స్టైల్–కంఫర్ట్ రెండింటి మేళవింపులా ఇంపుగా అనిపించాలంటే, కాటన్ లేదా లినెన్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవడం మంచిది. బ్రైట్ టాప్ + లైట్ బాటమ్ – లేదా ఆపోజిట్ కలర్ బ్లాక్ డ్రెస్సింగ్ ట్రై చేయవచ్చు. బాగీ/లూజ్ కుర్తాస్, ఫ్యూజన్ ధోతి ప్యాంట్స్ హోలీ మూడ్‌కి సరిగ్గా సరిపోతాయి. హోలీ డాన్స్‌లో ఫుల్ ఫన్ కోసం బెస్ట్ ఆప్షన్‌గా పాదాలకు స్నీకర్స్ బెస్ట్. సన్‌గ్లాసెస్, వాటర్ ప్రూఫ్ మేకప్ – హోలీ ఎఫెక్ట్స్ స్టైలిష్‌గా హ్యాండిల్ చేయండి. ఇలా చేయొద్దు.. పూర్తిగా వైట్ డ్రెస్సింగ్ వద్దు. దీనివల్ల రంగుల మిక్స్ తక్కువగా కనిపిస్తుంది. హెవీ మెటీరియల్స్, సిల్క్ ధరిస్తే అన్ ఈజీగా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కాళ్లకు హీల్స్ ధరిస్తే జారిపడే చాన్స్ ఎక్కువ. మేకప్, హెయిర్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్లడం పెద్ద పొరపాటు అవుతుంది.ఫైనల్ టచ్.. ఈ హోలీలో బ్లాక్ కలర్‌తో మ్యాజిక్ ట్రై చేయవచ్చు. ఫొటోలు మరింత ట్రెండీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ హోలీ జ్ఞాపకాలతో ఆనందాన్ని ఏడాది పాటు కొనసాగించవచ్చు. -
హోలీ..జోష్ హైలీ
హోలీ సంబరాలకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో విశాలమైన వేదికలను ఏర్పాటు చేశారు. కొన్ని ఈవెంట్లలో చర్మానికి హాని చేయకుండా ఉండే రసాయనాలు లేని ఆర్గానిక్ రంగులను మాత్రమే అనుమతిస్తుండటం విశేషం. ఈ హోలీని మరింత సంబురంగా మార్చడానికి ముంబై,బెంగళూరు, ఢిల్లీ వంటి వివిధ నగరాల నుంచి ప్రముఖ డీజేలు నగరానికి చేరుకున్నారు. మరి కొందరు నిర్వాహకులు.. ఈ వేడుకల్లో వినూత్నంగా సాంస్కృతిక సంబరాలను నిర్వహించనున్నారు. దీని కోసం బ్యాండ్ బాజా, డోల్ దరువు, జానపద హొయలు పలికే డప్పులను నగరానికి ఆహా్వనించారు. \వందకు పైగా ఈవెంట్స్‌కు ఏర్పాట్లు రిస్టార్టులు, క్లబ్స్, పబ్లిక్ గ్రౌండ్స్‌లో భారీస్థాయిలో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ భారీ వేదికల్లో 5 వేల నుంచి 15 వేల మందికి సరిపడా సౌకర్యాలు, విశాల ప్రాంగణాలు సిద్ధం చేశారు. ఇలాంటి భారీ హోలీ ఫెస్టివల్స్ సుమారు 30 నుంచి 40 వరకు నిర్వహిస్తుండగా.. మొత్తం నగరంలో వందకు పైగా హోలీ పబ్లిక్ ఈవెంట్స్‌కు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనడానికి ఎంట్రీ పాస్ కోసం రూ.500 నుంచి రూ.5,000 వేలకు పైగా వసూలు చేసే ఈవెంట్స్ ఉన్నాయి. కొందరు నిర్వాహకులు రంగులను ఉచితంగా అందిస్తుంటే మరికొందరు రంగులతో పాటు ఫుడ్ – డ్రింక్స్ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్లు హోలీ లవర్స్‌ను ఆకర్షించడానికి పలువురు సినీతారలను, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, స్పోర్ట్స్ సెలబ్రెటీలను ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తున్నారు.60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్‌గ్రౌండ్ స్టేజ్‌తో..లాత్మర్ హోలీ మీట్స్ టాలీవుడ్ పేరుతో నగరంలో అతిపెద్ద హోలీ సంబరాలను హైటెక్ ఎరీనాలో నిర్వహించనున్నారు. 60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్‌గ్రౌండ్ స్టేజ్‌తో నగరంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు. ఇందులో రంగుల సోయగాలతో పాటు సంగీతం, సెలబ్రెటీలతో అలరించనున్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లోని అంథమ్ వేదికగా నియాన్ హోలీ పార్టీ 2025కి ఘనంగా ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్ బీట్స్‌తో లైవ్ మ్యాజిక్ ఉంటుంది. సుచిర్ ఇండియా ఆధ్వర్యంలో నగర శివార్లలోని హానీ బర్గ్ రిసార్ట్స్ వేదికగా హోలీ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పదేళ్లుగా రంగ్ బర్సే..పదేళ్లుగా నగరంలో హోలీ సంబరాలను వినూత్నంగా నిర్వహిస్తున్నాం. ఈ సారి సిటీలోని యోలో ఎరీనాలో రంగ్ బర్సే 9.0 పేరుతో భారీ స్థాయిలో హోలీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఇందులో మ్యూజిక్‌తో పాటు రెయిన్ డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. హోలీ థీం టీ షర్ట్‌తో పాటు స్పెషల్ డ్రింక్స్, మీల్ బాక్స్ అందిస్తున్నాం. మా ఫెస్టివల్లో కార్పొరేట్ ఉద్యోగులు, యూత్‌తో పాటు కుటుంబ సమేతంగా పాల్గొనే వారు ఎక్కువగా ఉన్నారు. సిటీలో హోలీ అంటే ట్రెండీ కల్చర్‌గా మారింది. దీనికి అనుగుణంగానే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. 4 వేల మంది వరకు మా వేడుకల్లో పాల్గొంటారని అంచనా. – శరత్, రంగ్ బర్సే 9.0 నిర్వాహకులు మ్యూజిక్, డ్యాన్సింగ్తో పాటు బ్రుక్ ది పాట్ వంటి విభిన్న కార్యక్రమాలతో ఈ సంబరాలను ఏర్పాటు చేస్తున్నారు. సిటీలోని శ్రీపలాని కన్వెన్షన్ వేదికగా హోలీ మహోత్సవ్ 2.0 పేరుతో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్ జరుపుతున్నారు. ఇందులో డీజే, లైవ్ డోల్, ఓపెన్ స్కై ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వేడుకల్లో బిగ్ బాస్ ఫేం అశ్వినీశ్రీ, శుభశ్రీ కలర్‌ఫుల్ గెస్టులుగా సందడి చేయనున్నారు.గచ్చిబౌలిలోని సంధ్య పార్కింగ్ గ్రౌండ్ వేదికగా టోస్ట్ టానిక్ ఆధ్వర్యంలో హోలీ కారి్నవాల్ 2.0ను ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల్లో అర్జున్ విజయ్, డీజే ఆకాశ్, డీజే మణి, డీజే రిష్, బీజే రుమీ వంటి వారు లైవ్ డీజేతో ఉర్రూతలూగించనున్నారు. బేగంపేట్ హాకీ స్టేడియం వేదికగా రంగ్ బసంత్ 2025 సంబరాలను, ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ గచ్చిబౌలిలో హోలీ కలర్ ల్యాండ్ ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్‌తో పాటు నగరంలోని వివిధ వేదికల్లో హోలీ సంబరాలను నిర్వహిస్తున్నారు. -
Holi 2025 : రంగుల పండుగ, షాపింగ్ సందడి షురూ!
నగరంలో హోలీ సందడి మొదలయ్యింది. ఈ నెల 14న పండుగ సందర్భంగా ఇప్పటికే నగరంలోని పలు దుకాణాల్లో హోలీ వేడుకలకు సంబంధించిన వివిధ రకాల సామగ్రిని కొనుగోలు చేయడానికి బేగం బజార్ వచ్చిన కొనుగోలుదారులు, మహిళలతో సందడి వాతావరణం నెలకొంది. హోలీ రంగుల కేళీ. చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగల్లో మరో ముఖ్యమైన పండుగ. హోలీ అంటే రంగుల పండుగ. ఫాల్గుణ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. పౌర్ణమి రాత్రి హోలికా దహనం చేస్తారు. మరునాడు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకలను ఎంజాయ్ చేస్తారు. దీనిని ధూలేడి పండుగ అని అంటారు.హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. భారతదేశం వ్యాప్తంగా హోలీని గొప్పగా జరుపుకుంటారు. ఒక్కోప్రాంతంలో ఒక్కోలా దీనిని చేసుకుంటారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలో హోలీకి ప్రత్యేక ప్రాధన్యత ఉంది. మేజర్‌గా అన్ని చోట్ల రంగులతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆర్గానిక్ కలర్స్‌నే వాడదాంహోలీ ప్రధానంగా రంగుల చుట్టూ ఉంటుంది. అందుకే దీనిని ఆడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణానికి, మన చర్మానికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలంటే సేంద్రీయ, సహజమైన రంగులు ఎంచుకోవడం ఉత్తమం. అలాగే స్నేహితులతో హోలీ ఆడేటపుడు అప్రమత్తంగాఉండాలి. ఎక్కువగా తిరగకుండా, హైడ్రేటెడ్‌గా ఉండాలా జాగ్రత్తపడాలి. జుట్టుకు నూనె రాస్తే రంగులు ఈజీగా వదిలిపోతాయి. కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. సన్‌స్క్రీన్ వాడితే మంచిది.