
న్యూఢిల్లీ/తిరువనంతపురం: హత్యాయత్నం నేరంలో ఇటీవల దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కవరట్టిలోని సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించిన జనవరి 11వ తేదీ నుంచి ఆయన లోక్‌సభ సభ్యత్వ అనర్హత అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది
. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని ఆర్టికల్ 102(1)(ఇ) ప్రకారం ఈ మేరకు ప్రకటిస్తున్నట్లు వివరించింది. హత్యాయత్నం నేరం రుజువు కావడంతో లక్షద్వీప్‌లోని కోర్టు ఫైజల్ సహా నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.