
అగర్తలా: దేశవ్యాప్తంగా పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ ఉద్ధండులు తాము ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, గుర్తింపు తెచ్చుకుని ఉన్నఫలానా గుడ్ బై చెబుతున్నారు. తాజాగా త్రిపురలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. టీఎంసీకి ఆ పార్టీ సీనియర్ నేత గుడ్ బై చెప్పారు.
వివరాల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) త్రిపుర యూనిట్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ ఖాన్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌కు అందించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో.. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. టీఎంసీ పార్టీ ఉపాధ్యక్ష పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.
అయితే, టీఎంసీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా సుబల్ భౌమిక్‌ని తొలగించిన కొద్ది రోజులకే ఇలా.. బాసిత్ ఖాన్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, సుబల్ భౌమిక్‌ను పార్టీ అత్యున్నత స్థానం నుంచి తొలగించడంపై పార్టీ అధిష్టానం ఎటువంటి కారణం చెప్పకుండానే బాధత్యల నుంచి తొలగించింది. మరోవైపు.. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉండగా.. టీఎంసీకి, మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది.
The vice-president of the #Tripura unit of TMC, Abdul Basit Khan, resigned from the party.
— IndiaToday (@IndiaToday) August 28, 2022
(@RittickMondal)https://t.co/rYeBLZiYWp