Trinamool Congress (TMC)
-
చీలిక దిశగా ఇండియా కూటమి -మమతకు పెరుగుతున్న మద్ధతు
-
బాలికపై లైంగిక దాడి.. తృణమూల్ నేత అరెస్టు
కోల్‌కతా:ఒక పక్క కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారంపై ఆందోళనలు జరుగుతున్న వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ చిక్కుల్లో పడింది.తాజాగా ఆ పార్టీ కార్మిక సంఘం నేత నారాయణ మిత్ర తన ఇంట్లో ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయ్యాడు.బంకూర్లోని ఇంట్లో తమ కూతురిపై మూడు రోజులు అత్యాచారం చేశాడని మిత్రాపై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.ఈ కేసులో మిత్రాను పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన బయటికి తెలిసిన వెంటనే మితత్రాను పార్టీ పదవుల నుంచి తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఇదీ చదవండి.. వేధింపుల కేసు..కర్ణాటక బీజేపీ నేత అరెస్టు -
Mamata Banerjee: ఘోరంగా అవమానించారు
న్యూఢిల్లీ/కోల్‌కతా/పటా్న: నీతి ఆయోగ్ సమావేశం రాజకీయ దుమారానికి కారణంగా మారింది. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన ఈ భేటీలో తనకు ఘోర అవమానం జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మండిపడ్డారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భేటీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలో, ఆ తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇతర సీఎంలకు 10 నుంచి 20 నిమిషాలు సమయమిచ్చి తనకు మాత్రం 5 నిమిషాలకే మైక్ కట్ చేశారని ఆరోపించారు. ‘‘కేంద్రంపై పెద్దగా ఆశలు లేకపోయినా సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో భేటీకి వచ్చా. విపక్ష పాలిత రాష్ట్రాల నుంచి హాజరైన ఏకైక సీఎంను నేనే. ఆంధ్రప్రదేశ్ సీఎంకు 20 నిమిషాలిచ్చారు. గోవా, అసోం, ఛత్తీస్‌గఢ్ తదితర సీఎంలకు కూడా 10 నుంచి 12 నిమిషాల దాకా ఇచ్చారు. నన్ను మాత్రం ఐదు నిమిషాల కంటే మాట్లాడనివ్వలేదు. పైగా ఆ ఐదు నిమిషాల్లోనూ పదేపదే బెల్లు కొడుతూ దారుణంగా అవమానించారు. భేటీని పర్యవేక్షించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పదేపదే బెల్లు కొట్టారు. పక్కనే కూర్చున్న మోదీ, కేంద్ర హోం మంత్రి సూచన మేరకే ఆయనలా చేశారు. దీనికి నిరసనగా వాకౌట్ చేశా’’ అని వివరించారు. ఇకపై నీతి ఆయోగ్ భేటీలకు ఎప్పటికీ హాజరు కాబోనని ప్రకటించారు. మైక్ కట్ చేయలేదు: నిర్మల మమత ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆమెకు కేటాయించిన సమయం మేరకు పూర్తిగా మాట్లాడారని పేర్కొంది. ‘‘నిజానికి అక్షరక్రమంలో మమత లంచ్ అనంతరం మాట్లాడాల్సింది. కానీ ఆమె అర్జెంటుగా కోల్‌కతా తిరిగి వెళ్లాల్సి ఉందన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంతకుముందే ఏడో వక్తగా అవకాశమిచ్చాం. మమతకు కేటాయించిన సమయం పూర్తయిందని కేవలం అందరి ముందూ ఉన్న స్క్రీన్లపై కని్పంచింది. అంతే తప్ప టైం అయిపోయిందంటూ ఎవరూ బెల్ కూడా మోగించలేదు’’ అని వివరణ ఇచి్చంది. మమత పూర్తి సమయం మేరకు మాట్లాడారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మధ్యలో మైక్ కట్ చేయడం నిజం కాదు. ఎవరెంతసేపు మాట్లాడుతున్నదీ మా ముందున్న స్క్రీన్లపై కనిపిస్తూనే ఉంది. కొందరు సీఎంలు కేటాయించిన సమయం కన్నా ఎక్కువగా మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు అదనపు సమయం కేటాయించాం. అంతే తప్ప ఎవరికీ, ముఖ్యంగా బెంగాల్ సీఎంకు మైకు కట్ చేయలేదు’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్రానిది రాజకీయ వివక్ష విపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం దారుణమైన రాజకీయ వివక్ష కనబరుస్తోందని మమత ఆరోపించారు. ‘‘ఈ వివక్ష కేంద్ర బడ్జెట్లో కూడా కొట్టొచి్చనట్టు కని్పంచింది. ఈ వైనాన్ని భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే లేవనెత్తా. వారికి కొన్ని రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటే ఉండొచ్చు. వాటికి ఎక్కువ నిధులు కేటాయించడంపైనా నాకు అభ్యంతరం లేదు. కానీ బెంగాల్ తదితర రాష్ట్రాలపై మాత్రం ఎందుకిలా వివక్ష చూపు తున్నారని ప్రశ్నించా. దీనిపై సమీక్ష జరగాలని డిమాండ్ చేశా. అన్ని రాష్ట్రాల తరఫునా భేటీలో మాట్లాడా’’ అని తెలిపారు. ‘‘నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలూ లేవు. దానికి అధికారాలన్నా ఇవ్వాలి. లేదంటే ప్రణాళిక సంఘాన్నే పునరుద్ధరించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ఉపాధి హామీ వంటి పలు కీలక కేంద్ర పథకాల అమలును బెంగాల్లో మూడేళ్లుగా నిలిపేయడాన్ని భేటీలో ప్రస్తావించా. స్వపక్షం, విపక్షాల మధ్య కేంద్రం ఇలా వివక్ష చూపుతుంటే దేశం ఎలా నడుస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు అందరి మేలూ పట్టించుకోవాలి’’ అన్నారు. అధికార, విపక్షాల పరస్పర విమర్శలు కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు మమతకు సంఘీభావం ప్రకటించాయి. విపక్ష నేత అ న్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ముఖ్యమంత్రినే ఇంతగా అవమానించడం దారుణమని మండిపడ్డాయి. దీన్ని ఎంతమాత్రమూ అంగీకరించలేమని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్టాలిన్ (తమిళనాడు) సహా విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచి్చంది. కేవలం మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచేందుకే ముందుగా నిర్ణయించుకుని మరీ మమత ఇలా వాకౌట్ చేశారని కేంద్ర మంత్రులు అర్జున్‌రాం మేఘ్వాల్, ప్రహ్లాద్ జోషీ తదితరులు విమర్శించారు. బెంగాల్ పీసీసీ చీఫ్ అ«దీర్ రంజన్ చౌధరి మాత్రం మమత కావాలనే డ్రామా చేశారంటూ కొట్టిపారేయడం విశేషం.‘‘సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ అంటే ఇదేనా? సీఎంతో ప్రవర్తించే తీరిదేనా? మన ప్రజాస్వామ్యంలో విపక్షాలు కూడా అంతర్గత భాగమని కేంద్రంలోని బీజేపీ సర్కారు అర్థం చేసుకోవాలి. శత్రువుల్లా చూడటం ఇకనైనా మానుకుంటే మంచిది’’ – తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‘‘మన దేశంలో పతాక శీర్షికలకు ఎక్కడం చాలా తేలిక. ఏకైక నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ఏకైక విపక్ష సీఎం నేనే అని ముందుగా చెప్పాలి. బయటికొచ్చి, ‘నా మైక్ కట్ చేశారు. అందుకే బాయ్‌కాట్ చేశా’ అని చెప్పాలి. ఇక రోజంతా టీవీలు దీన్నే చూపిస్తాయి. పని చేయాల్సిన, చర్చించాల్సిన అవసరం లేదు. ఇదీ దీదీ తీరు!’’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ -
టీఎంసీ నేత ముకుల్ రాయ్ పరిస్థితి విషమం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్(70) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోల్‌కతాలోని తన నివాసంలోని బాత్రూంలో ఈ నెల 4న ముకుల్ రాయ్ జారిపడ్డారు. తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. శనివారం ఆయన ఆరోగ్యం విషమించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ఆ యన డిమెన్షియా(మతిమరుపు వ్యాధి)తో బాధపడుతున్నట్లు కుటుంబస భ్యులు తెలిపారు. ముకుల్ రాయ్ టీఎంసీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. -
సమీప భవిష్యత్తులో ఇండియా కూటమి సర్కారు
కోల్‌కతా: సమీప భవిష్యత్తులో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారం కోసం ప్రయతి్నంచనంత మాత్రాన రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయబోమని కాదన్నారు. తృణమూల్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తుందని చెప్పారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని బలహీన, అస్థిర ఎన్డీఏ ప్రభుత్వం అధికారం కోల్పోతే సంతోషిస్తాను. దేశం మార్పు కోరుతోంది. తాజా ప్రజాతీర్పు మార్పు కోసమే. ఇది నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పు. కనుక ఆయన ప్రధాని పదవి చేపట్టకుండా మరొకరికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది’’ అని మమత అన్నారు. కొత్తగా ఎంపికైన తృణమూల్ ఎంపీలతో మమత శనివారం సమావేశమయ్యారు. మోదీ ప్రమాణస్వీకారానికి తృణమూల్ దూరంగా ఉంటుందని తెలిపారు. బీజేపీ అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. ‘‘బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. మిత్రపక్షాలపై ఆధారపడుతోంది. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో, ఎంతవరకు బండిని లాగుతుందో చూద్దాం. పదేళ్లుగా ఎలాంటి చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదించుకునేది. ఇక అలా కుదరదు. రాజ్యాంగాన్ని కూడా మార్చలేరు’’ అని మమత అన్నారు. ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జేడీయూ గురించి అడగ్గా.. ‘వారు మా మిత్రులు కూడా. టీడీపీ, జేడీయూలు మాతో లేవని మీకెవరు చెప్పారు?’ అని మమత ప్రశ్నించారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్ల ప్రభావితం చేశారని, దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని టీఎంసీ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభల్లో డిమాండ్ చేస్తారని తెలిపారు. బెంగాల్ 42 స్థానాలకు గాను టీఎంసీ 29 సీట్లకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీప్ బందోపాధ్యాయ్‌ను లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ నేతగా మమత నియమించారు. -
తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లోని బరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన యూసఫ్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌధురిపై 73 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందాడు. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన యూసఫ్.. రాజకీయ దురంధరుడు, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు, మూడు ఎంపీ అయిన అధిర్ రంజన్‌పై సంచలన విజయం సాధించడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిర్ రంజన్ ప్రస్తుతం తాను ఓటమి చవిచూసిన బరంపూర్ నుంచే 1999 నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. అధిర్ రంజన్ గత లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తొలి క్రికెటర్‌గా యూసఫ్ అరుదైన ఘనత సాధించాడు. గత లోక్‌సభలో ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపీగా ఎన్నికయ్యాడు. అయితే అతను ఈసారి ఎన్నికల్లో పాల్గొనలేదు.కాగా, ఇవాళ (జూన్ 4) వెలువడుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాలు సాధిస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీఎంసీ 29 స్థానాల్లో జయకేతనం ఎగరేసే దిశగా దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ ఈ ఎన్నికల్లో బెంగాల్ నుంచి టీఎంసీ విజయదుందుభి మోగించనుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఇక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వచ్చింది. అయితే బీజేపీ మాత్రం కేవలం 12 సీట్లకే పరితమితమయ్యేలా కనిపిస్తుంది.దేశవ్యాప్తంగా వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే.. గతంలో కంటే ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గణనీయంగా సీట్లు తగ్గేలా ఉన్నాయి. ప్రస్తుతమున్న సమాచారం మేరకు 543 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 292 సీట్లకు పరిమితమయ్యేలా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఈ కూటమి 300కు పైగా సీట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి అనూహ్య విజయాలు సాధించే దిశగా దూసుకుపోతుంది. ఈ కూటమి ప్రస్తుతమున్న సమాచారం మేరకు 236 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Lok Sabha Election 2024: డమ్ డమ్‌లో... విజయఢంకా మోగించేదెవరో!
డమ్ డమ్ లోక్‌సభ స్థానం. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌తో కలిసి లెఫ్ట్ విజయం సాధించగలిగే సీట్లలో ఒకటి. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. దాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని సీపీఎం పోరాడుతోంది. ఇది తృణమూల్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ తమ ఓటు బ్యాంకుకు గండి పడకుండా కాపాడుకోవడానికి టీఎంసీ తిప్పలు పడుతోంది. ఒకసారి గెలుపొందిన ఈ స్థానంలో మళ్లీ పాగా వేయాలని బీజేపీ ప్రయతి్నస్తోంది. దాంతో డమ్ డమ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది... కోల్‌కతా సమీపంలో ఉండే డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి పశి్చమ బెంగాల్లో చారిత్రక ప్రాధాన్యముంది. 1783లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ సైనిక కంటోన్మెంట్, మిలిటరీ బ్యారక్‌లు నిర్మించింది. 1846లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్థాపించింది. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసిన మంగళ్ పాండేకు మరణశిక్ష విధించింది కూడా డమ్ డమ్ కంటోన్మెంట్‌లోనే. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని డమ్ డమ్ బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో హిందూ శరణార్థులు ఇక్కడ భారీగా స్థిరపడ్డారు. పట్టణ జనాభా అధికం... డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి 1977లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 20 ఏళ్ల పాటు ఈ స్థానం సీపీఎం గుప్పెట్లోనే కొనసాగింది. 1998లో తొలిసారిగా బీజేపీకి చెందిన తపన్ సిక్దర్ విజయం సాధించారు. 1999లో ఈ స్థానాన్ని నిలుపుకున్నారు. అనంతరం మూడుసార్లు టీఎంసీ నుంచి సౌగతా రాయ్ విజయం సాధించారు. డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం మొత్తం జనాభా 21,84,460. ఇందులో 98.43 శాతం పట్టణ జనాభాయే. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలూ టీఎంసీ ఖాతాలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.ప్రతి ఐదు ఓట్లలో ఒకటి... డమ్ డమ్‌లో తృణమూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ సౌగతా రాయ్, సీపీఎం నుంచి సుజన్ చక్రవర్తి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పద్రా దత్తా బరిలో ఉన్నారు. శిల్పద్రా 2020లో తృణమూల్‌కు రాజీనామా చేసి కాషాయ పారీ్టలో చేరారు. మమతా వ్యతిరేక ఓటర్లు వామపక్షాల వైపు మొగ్గితే కాంగ్రెస్ మద్దతుతో సుజన్ గెలవడం సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు. అయితే సీపీఎం కేవలం బీజేపీకి ఓట్లను ఆకర్షించగలదే తప్ప తమనేమీ చేయలేదని టీఎంసీ ధీమాతో ఉంది. సీపీఎం ఓట్లు గతం కంటే పెరిగే అవకాశముందని, ఇది బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.‘వలస’ ఓట్లపై సీఏఏ ప్రభావం... బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన వారు డమ్ డమ్‌లో అధిక సంఖ్యలో ఉంటున్నారు. పౌరసత్వ (సవరణ) చట్టం అమలు వివాదం వారిపై ప్రభావం చూపేలా ఉంది. ‘‘దీంతోపాటు అయోధ్య రామమందిర నిర్మాణం కూడా హిందూ ఓట్లను ఏకీకృతం చేస్తుంది. కనుక బీజేపీ గెలుపు ఖాయం’’ అని శిల్పద్రా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రంలో ప్రధానంగా కని్పంచే డమ్ డమ్ ఇప్పుడు ఆ ప్రత్యేకతను కోల్పోయిందని స్థానికులు వాపోతున్నారు. తాగునీటి సంక్షోభం అధికార తృణమూల్‌కు నష్టం చేయడం ఖాయమని చెబుతున్నారు. ఇక్కడ జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఇద్దరికీ కీలకమే
తృణమూల్, బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికైన పశి్చమబెంగాల్లో ఎన్నికలు ఆరో దశకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా ఐదు విడతల్లో 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక ముగిసింది. ఆరో దశలో భాగంగా 8 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. తామ్లుక్, కాంథీ స్థానాల్లో బీజేపీ కీలక నేత సువేందు అధికారిపై ప్రతీకారానికి తృణమూల్ ఉవి్వళ్లూరుతోంది. సువేందు సోదరుడు సౌమేందు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ, కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్, పలువురు బెంగాలీ నటుల భవితవ్యాన్ని ఈ దశలో ఓటర్లు తేల్చనున్నారు... బాంకురా2019లో తృణమూల్ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీపై కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ 1.74 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. కానీ సొంత కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు! టీఎంసీ నుంచి బాంకురా ఎమ్మెల్యే అరూప్ చక్రవర్తి, సీపీఎం నుంచి న్యాయవాది నీలాంజన్ దాస్ గుప్తా పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీలో ఎవరు నెగ్గుతారన్నది ఆసక్తికరం.ఘాటల్సిట్టింగ్ ఎంపీ, నటుడు, గాయకుడు దీపక్ అధికారి (దేవ్) తృణమూల్ నుంచి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. బీజేపీ కూడా ప్రముఖ బెంగాలీ నటుడు, ఖరగ్‌పూర్ ఎమ్మెల్యే హిరేన్ ఛటర్జీని పోటీకి దించింది. ఎంపీ భారీ సభల ద్వారా దర్పం ప్రదర్శిస్తుంటే తాను రోడ్లపైకొచ్చి సామాన్యులతో మమేకం అవుతున్నానని హిరేన్ అంటున్నారు. సీపీఐ కూడా బరిలో ఉండటంతోటిక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.కాంథీ ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా పరిధిలోని ఈ స్థానమూ సువేందు కుటుంబానికి కంచుకోటే. ఆయన తండ్రి శిశిర్ అధికారి తృణమూల్ టికెట్‌పై 2009, 2014, 2019ల్లో వరుసగా గెలిచారు. ఈసారి సువేందు తమ్ముడు సౌమేందు అధికారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పతా‹Ùపూర్ ఎమ్మెల్యే ఉత్తమ్ బారిక్ తృణమూల్ నుంచి, యువ న్యాయవాది ఊర్వశి భట్టాచార్య సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. తామ్లుక్తో పాటు కాంథీలోనూ నెగ్గి సువేందుపై ప్రతీకారం తీర్చుకోవాలని తృణమూల్ చూస్తోంది. మేదినీపూర్ బీజేపీ నుంచి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. ఆమె బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు. అసన్సోల్ దక్షిణ ఎమ్మెల్యే. తృణమూల్ నుంచి మేదినీపూర్ ఎమ్మెల్యే జూన్ మాలియా బరిలో ఉన్నారు. అభ్యర్థులిద్దరికీ సొంత పారీ్టల్లో విభేదాలు తలనొప్పిగా మారాయి. తమ పారీ్టలో విభేదాలు సర్దుకున్నాయని అగి్నమిత్ర చెబుతున్నారు. సీపీఐ నుంచి బిప్లబ్ భట్టా పోటీలో ఉన్నారు. ఝార్గ్రాం ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ కునార్ హెంబ్రమ్ పార్టీని వీడటంతో ప్రణత్ తుడుకు టికెట్ దక్కింది. సంథాలీ రచయిత, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత కాళీపద సోరెన్‌ను టీఎంసీ బరిలోకి దింపింది. మరోసారి విజయంపై ధీమాతో ఉంది. సీపీఎం నుంచి సోనామణి ముర్ము పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ పీపుల్స్ పార్టీ, ఐఎస్ఎఫ్ కూడా పోటీలో ఉన్నాయి.పురూలియా బీజేపీ సిట్టింగ్ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో ఈసారి కూడా బరిలో ఉన్నారు. తృణమూల్ నుంచి మాజీ మంత్రి శాంతిరాం మహతో, కాంగ్రెస్ నుంచి నేపాల్‌దేవ్ మహతో, ఫార్వార్డ్ బ్లాక్ తరఫున ధీరేంద్ర నాద్ మహతో, బీఎస్పీ నుంచి సంతోష్ రాజోవర్ పోటీ చేస్తున్నారు. వీరికి ఎస్‌యూసీఐ విద్యార్థి నేత సుషి్మత మహతో, స్వతంత్ర అభ్యర్థి అజిత్ ప్రసాద్ మహతో గట్టి పోటీ ఇస్తున్నారు. మహతోలంతా కుర్మి సామాజిక వర్గీయులే. బలమైన కుర్మి ఓటు బ్యాంకు కోసం తృణమూల్ బాగా ప్రయత్నిస్తోంది. దాంతో కురి్మల ఓటు బ్యాంకు చీలేలా కని్పస్తున్నాయి. ఆ లెక్కన బీజేపీకి ఈసారి విజయం సులువు కాదంటున్నారు.తామ్లుక్ తృణమూల్, బీజేపీ ఇక్కడ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీలో విపక్ష నేత, రాష్ట్ర బీజేపీ దిగ్గజం సువేందు అధికారి 2009, 2014ల్లో ఇక్కణ్నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2016 ఉప ఎన్నికలో, 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు దిబ్యేందు అధికారి తృణమూల్ టికెట్‌పై గెలవడం విశేషం! ఈసారీ గెలుపు కోసం తృణమూల్ గట్టిగా పోరాడుతోంది. ఈస్ట్ జిల్లా పరిధిలో సువేందు కుటుంబానికి అపార పలుకుబడి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతపై నందిగ్రాం స్థానంలో సువేందు 1,956 ఓట్లతో గెలిచారు! మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయకు బీజేపీ ఇక్కడ టికెటిచి్చంది. సీపీఎం కూడా కలకత్తా హైకోర్టు యువ న్యాయవాది సాయన్ బెనర్జీకి టికెటిచి్చంది. తృణమూల్ నుంచి పార్టీ ఐటీ సెల్ చీఫ్ 27 ఏళ్ల దేబాన్షు భట్టాచార్య బరిలో ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
బన్గావ్. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్‌సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పారీ్టల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దాంతో బీజేపీ, తృణమూల్ రెండూ మథువా సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో ఉన్నారు...బన్గావ్ లోక్‌సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో హిందూ శరణార్థులు భారీగా బన్గావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు మథువాలే. బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నేపథ్యంలో వీరు సహజంగానే బీజేపీకి మద్దతిస్తున్నారు. బన్గావ్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ బన్గావ్ నుంచి బెంగాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారి ఓట్లు అత్యధికంగా బీజేపీకే పడ్డాయి. అలా ఇక్కడ తొలిసారి బీజేపీ విజయం సాధించింది. శంతను లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బన్‌గావ్‌లో సీఏఏ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఎన్నికల ముందు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. అయితే ఆన్లైన్ దరఖాస్తుల్లో బంగ్లాదేశ్‌లో ఉన్నప్పటి చిరునామా, నివాస పత్రాల వివరాలను చాలామంది సమర్పించలేదు. ఇది సమస్యలకు దారి తీయడంపై ఇక్కడి మథువాలు అసంతృప్తితో ఉన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు: టీఎంసీ సీఏఏను తృణమూల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా అభివరి్ణస్తోంది. మథువాలు ఇప్పటికే భారతీయులని, వారికి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నాయని తృణమూల్ అధినేత్రి మమత అంటున్నారు. ‘‘ఈ దేశ పౌరులు కాకుంటే ఇన్నేళ్లు వారు ఓటెలా వేశారు? ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు, బెంగాల్ అసెంబ్లీకి ఎలా వెళ్లారు?’’ అని ప్రశి్నస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బన్‌గావ్‌లో ఘోర పరాజయం తర్వాత గతేడాది పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ దుమ్ము రేపింది. బోరో కుటుంబానిదే ఆధిపత్యం... బన్గావ్ రాజకీయాలను బోరో మా (బీనాపాణి దేవి) కుటుంబమే శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్‌కతాలోని బల్లిగంజ్‌లో స్థిరపడ్డారు. ప్రమథ్ నామశూద్ర (ఎస్సీ) కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. తమలా వలస వచి్చన వారికి ఆశ్రయం కోసం స్థానిక ఠాకూర్నగర్లో భూమి కొనుగోలు చేశారు. ‘ఠాకూర్బరీ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీస్’ పేరుతో కొన్న ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యరి్థగా హన్స్‌ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థి శంతను ఆయన రెండో కుమారుడే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ నేతలు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశి్చమ బెంగాల్ సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపులు, అత్యాచారాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సందేశ్‌ఖాలీకి చెందిన ముగ్గురు మహిళలు స్పష్టం చేశారు. స్థానిక బీజేపీ మహిళా నేత ఒకరు తెల్లకాగితాలపై తమతో బలవంతంగా సంతకాలు పెట్టించారని, ఈ కాగితాలపై బీజేపీ నాయకులే ఫిర్యాదులు రాసి, తమ పేరిట తృణమూల్ కాంగ్రెస్ నేతలపై పోలీసు స్టేషన్లో అత్యాచారం కేసులు పెట్టారని చెప్పారు. తమను మభ్యపెట్టి మోసం చేసిన బీజేపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు తమను వేధిస్తున్నారని, తమకు రక్షణ కలి్పంచాలని కోరారు. ఈ మేరకు ముగ్గురు మహిళలు చెబుతున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ షేర్ చేసింది. సందేశ్‌ఖాలీ మహిళలపై తమ పార్టీ నాయకులెవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని, బీజేపీ నేతలే తప్పుడు ప్రచారం చేశారని పశి్చమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి పాంజా ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో కొన్ని భూకబ్జా ఘటనలు మినహా లైంగిక వేధింపుల ప్రసక్తే లేదని అన్నారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదంతా కుట్ర: సువేందు అధికారి కొత్తగా తెరపైకి వచి్చన వీడియోలపై బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి స్పందించారు. వాటిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ ఉద్దేశపూర్వకంగా సృష్టించాడని విమర్శించారు. దీనివెనుక ప్రైవేట్ ఎన్నికల, రాజకీయ వ్యూహ సంస్థ ‘ఐ–ప్యాక్’ ప్రోద్బలం ఉందని చెప్పారు. మహిళలను తీసుకొచ్చి, బీజేపీపై ఆరోపణలు చేయిస్తున్నారని, ఇదంతా కుట్రేనని స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీ, ఐ–ప్యాక్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలో కోర్టు ఆశ్రయిస్తామని అన్నారు. బీజేపీ నేతలపై ఫిర్యాదు సువేందు అధికారితోపాటు మరికొందరు బీజేపీ నేతలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులపై అత్యాచార ఆరోపణలు చేసేలా సందేశ్‌ఖాలీ మహిళలను బీజేపీ నేతలు ప్రేరేపించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
రచనా బెనర్జీ. అందం, అభినయం కలబోసిన నటిగా దక్షిణాదికి చిరపరిచితం. ఒడిశా సినీ పరిశ్రమలోనూ వెలుగు వెలిగిన బెంగాలీ బ్యూటీ. దీదీ అనగానే తృణమూల్ అధినేత్రి మమతాయే గుర్తొస్తారు. అయితే సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో ‘దీదీ నంబర్‌వన్’కు హోస్ట్‌గా అలరిస్తూ రచన దీదీ నంబర్‌వన్ అయ్యారు. తృణమూల్ నుంచే రాజకీయ అరంగేట్రమూ చేస్తున్నారు...!నటిగా ప్రయాణం.. 1974 అక్టోబర్ 2న కోల్‌కతాలో జన్మించిన రచన అసలు పేరు ఝుంఝుమ్ బెనర్జీ. కోల్‌కతా సౌత్ సిటీ కాలేజీలో డిగ్రీ చేశారు. 1990లో సెకండియర్‌లో ఉండగానే మిస్ కలకత్తా టైటిల్ గెలుచుకున్నారు. 1994లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆకర్షణీయమైన ముఖం, అందమైన చిరునవ్వు ఆమెకు బోలెడు సినీ అవకాశాలు తెచి్చపెట్టాయి. బెంగాలీ చిత్రం ‘డాన్ ప్రొటిడాన్’తో తొలిసారి వెండితెరపై కనిపించారు. బెంగాలీతో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేశారు. కన్యాదానం సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మిథున్ చక్రవర్తి వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ఒరియా నటుడు సిద్ధాంత మహాపాత్రతో కలిసి ఏకంగా 40 సినిమాలు చేశారు. ప్రసేన్‌జిత్ ఛటర్జీతోనూ 35 బెంగాలీ సినిమాల్లో నటిస్తే వాటిలో 32 సూపర్ డూపర్హిట్లే! సినిమాలు చేస్తూనే వ్యాపారవేత్తగానూ ఎదిగారు. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్స్టాగ్రాం, ఎక్స్‌లో రచనకు లక్షల్లో ఫాలోవర్లున్నారు. రాజకీయాల్లోకి... సినిమాలకు గుడ్‌బై చెప్పాక రచన టీవీపై దృష్టి సారించారు. సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో దీదీ నంబర్‌వన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని కలిశారు. రాజకీయాల్లోకి వెళ్తారని అప్పుడే ప్రచారం జరిగినా కొట్టిపడేశారు. బీజేపీకి బెంగాల్లో బలం పెరుగుతుండటం, పలువురు టీఎంసీ నేతలపై ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బలమైన కొత్త ముఖాన్ని తెరపైకి తేవాలని మమత భావించారు. ఆ మేరకు భారీ ర్యాలీలో రచనను హుగ్లీ నుంచి లోక్‌సభ అభ్యరి్థగా ప్రకటించారు. అక్కడి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ కూడా సినీ నటే. పైగా రచనకు మంచి స్నేహితురాలు కూడా. అదంతా వ్యక్తిగతమని, పోటీ పోటీయేనని అంటున్నారు రచన.వంద శాతం ఇస్తా...తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా మమత అడిగినప్పుడు కాస్త ఆలోచించి అంగీకరించినట్టు చెప్పారు రచన. ‘‘దీదీ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశం వస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే లోక్‌సభకు దీదీ నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు పొంగిపోయా. నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు. నా నిర్ణయంతో అమ్మ సంతోషంగా ఉంది. గతంలో లైవ్ స్టేజ్ షోల కోసం రెండు మూడుసార్లు హుగ్లీ వెళ్లా. ఇక నుంచి అదే నా అడ్డా. జీవితంలో ఏం చేసినా 100 శాతం చిత్తశుద్ధితో కష్టపడ్డా. అదే స్ఫూర్తితో నాయకురాలిగానూ రాణించి దీదీ నమ్మకం నిలబెడతా’’ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘టీఎంసీని ఉగ్రసంస్థగా ప్రకటించి.. సీఎం మమతను అరెస్ట్ చేయాలి’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. సందేశ్‌కాళీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందుగుడు సామాగ్రిని సీబీఐ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సువేందు టీఎంసీ, సీఎం మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడ లభ్యమైన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవని తెలిపారు. ‘సందేశ్‌కాళీలో లభించిన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉపయోగించేవి. అందుకే టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పడే పశ్చిమ బెంగాల్ ప్రశాంతంగా ఉంటుంది. సందేశ్‌కాళీలో ఆయుధాలకు సంబంధించి ఘటనకు సీఎం మమత బాధ్యత వహించాలి. సీఎం మమతను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని సువేందు డిమాండ్ చేశారు.Paschim Medinipur, West Bengal | Bengal Assembly LoP Suvendu Adhikari says, "All the weapons found in Sandeshkhali are foreign. Explosives like RDX are used in horrific anti-national activities. All these weapons are used by international terrorists. I demand to declare Trinamool… pic.twitter.com/IOfFUknMFL— ANI (@ANI) April 27, 2024 శుక్రవారం సందేశ్‌కాళీలో సీబీఐ జరిపిన సోదాల్లో టీఎంసీ సస్పెండెడ్ నేత షాజహాన్ షేక్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, ఒక పోలీసు తుపాకీ లభించింది. వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ దాడులపై టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వేళ (శుక్రవారం) సీబీఐ పలు చోట్ల సోదాలు చేపట్టింది’ అని ఆరోపణలు చేసింది.జనవరిలో ఈడీ అధికారులుపై టీఎంసీ కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించి శుక్రవారం సీబీఐ పలు చోట్లు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక.. షాజహాన్ షేక్‌ను బెంగాల్ పోలీసులు ఫ్రిబవరి 29న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
‘తృణమూల్’ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే..
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్లతో పాటు ఎన్ఆర్సీలను బెంగాల్లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్ -
Lok sabha elections 2024: బెంగోల్ కొట్టేదెవరో?
ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెంగాల్ బెబ్బులి మమత దెబ్బకు రాష్ట్రంలో 34 ఏళ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు తెరపడటమే గాక కాంగ్రెస్ ప్రాభవమూ కొడిగట్టింది. ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేస్తూ బీజేపీ క్రమంగా బెంగాల్లో పాగా వేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 సీట్లను కొల్లగొట్టి మమతకు పక్కలో బల్లెంలా మారింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ 77 సీట్లతో సత్తా చాటింది. కొంతకాలంగా రాష్ట్రం తృణమూల్, బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికగా మారిపోయింది. బెంగాల్లో ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రధాని మోదీ వర్సెస్ తృణమూల్ అధినేత్రి మమత అన్నట్టుగా సాగుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి... స్టేట్‌స్కాన్ 42 స్థానాలతో లోక్‌సభ సీట్లపరంగా దేశంలో మూడో అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇది జాతీయ పారీ్టలను ఊరించే విషయం. జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య, సోమ్‌నాథ్ చటర్జీ వంటి ఉద్ధండులను అందించిన కమ్యూనిస్టులకు ప్రస్తుతం లోక్‌సభలోనూ, బెంగాల్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది! గత ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న తీరుతో పరిశీలకులే నోరెళ్లబెట్టారు. రాష్ట్రంలో ఎన్నడూ రెండు స్థానాలు దాటని కమలనాథులు. మొత్తం స్థానాల్లోనూ పోటీ చేసి ఏకంగా 18 సీట్లలో కాషాయ జెండాను రెపరెపలాడించారు. దాంతో తృణమూల్ 34 నుంచి 22 సీట్లకు పడిపోయింది. ఈ ట్విస్టులకు తోడు సంక్లిష్ట రాజకీయాలకు, ఎన్నికల హింసకు పెట్టింది పేరైన బెంగాల్లో ఈసారి కూడా పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. తృణమూల్‌కు సవాల్... అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌కు గత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ నువ్వానేనా అనేంతగా సవాల్ విసింది. 2014తో పోలిస్తే దీదీ ఏకంగా 12 సీట్లను కోల్పోయారు. కాషాయదళం 18 సీట్లను ఎగరేసుకుపోయింది. ఇరు పారీ్టల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమే! కానీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి భిన్న ఫలితాలొచ్చాయి. తృణమూల్ ఏకంగా 215 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది. కాకపోతే బీజేపీ బలం 3 అసెంబ్లీ సీట్ల నుంచి ఏకంగా 77 స్థానాలకు ఎగబాకింది. దాంతో కాంగ్రెస్, లెఫ్ట్ పారీ్టలే ప్రధానంగా నష్టపోయి పూర్తిగా సున్నా చుట్టాయి. 2016లో 44 సీట్లు సాధించిన కాంగ్రెస్, 32 సీట్లు నెగ్గిన లెఫ్ట్ పారీ్టలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది! అంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలం 4 నుంచి 2 సీట్లకు పడిపోయింది. లెఫ్ట్ ఉన్న 2 సీట్లనూ కోల్పోయింది. ఇండియా కూటమిలో భాగంగా బీజేపీపై పోరాడుతున్న మమత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తుండటం విశేషం. మోదీ సర్కారు తమ పారీ్టపై, రాష్ట్రంపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. తమ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీ హిందుత్వ నినాదం నేపథ్యంలో ముస్లిం ఓటర్లను పూర్తిగా తమవైపు తిప్పుకునేలా ప్రయతి్నస్తున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్లతో కుమ్మక్కు వంటి అ్రస్తాలను మోదీపై ఎక్కుపెడుతున్నారు. బీజేపీ పై చేయి సాధించేనా? పశ్చిమబెంగాల్లో అధికారమే లక్ష్యంగా సాగుతున్న కమలనాథుల్లో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఫుల్ జోష్ నింపాయి. రాష్ట్రంలో 2 స్థానాలకు మించి ఎప్పుడూ గెలవని బీజేపీకి ఏకంగా 18 సీట్లు దక్కాయి. కాషాయదళం కేంద్రంలో తొలిసారి 300 సీట్ల మైలురాయిని అధిగమించడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. అనంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తృణమూల్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచి్చంది. 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఇదే జోరుతో ఈసారి మరిన్ని లోక్‌సభ సీట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ వ్యూహం. బెంగాలీ హిందూ ఓట్లపై కమలం పార్టీ ప్రధానంగా గురిపెట్టింది. అయోధ్య రామమందిర కల సాకారం, మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది. మమతా ప్రభుత్వ అవినీతి, విపక్షాలపై తృణమూల్ గూండాయిజం, దాడులను కూడా లేవనెత్తుతోంది. మమత ఒంటరిగా పోటీ చేస్తుండటంతో, త్రిముఖ పోరు నెలకొంది. ఇండియా కూటమికి తృణమూల్ మొండిచెయ్యి, కాంగ్రెస్, లెఫ్ట్ నిరీ్వర్యమవడం తమకు కలిసొస్తుందనేది కమలనాథుల అంచనా. గత ఎన్నికల్లో ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సాధించిన గణనీయ విజయాలను మిగతా చోట్లా రిపీట్ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పలు ఇన్ఫ్రా, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ భారీగా నిధులు విదల్చడం దీనిలో భాగమే. మెజారిటీ స్థానాలతో దీదీపై పైచేయి సాధించాలని కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో మోదీ కూడా బెంగాల్‌పై ఫోకస్ పెంచారు. సర్వేలు ఏమంటున్నాయి... బెంగాల్లో పోటీ బీజేపీ, తృణమూల్ మధ్యేనని, ఇతర పారీ్టలది ప్రేక్షక పాత్రేనని సర్వేలు చెబుతున్నాయి. టీఎంసీ ఈసారి కూడా 21–22 సీట్లను దక్కించుకోవచ్చని పలు సర్వేలు లెక్కలేస్తున్నాయి. బీజేపీకి 19–20 స్థానాలు రావచ్చంటున్నాయి. అంటే 2019 కంటే కాస్త మెరుగుపడనుంది. కాంగ్రెస్ రెండు సీట్లలో ఒకటి కోల్పోవచ్చని అంచనా. సీఏఏ గేమ్ చేంజర్..! కేంద్రం తాజాగా అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఈ ఎన్నికల్లో బెంగాల్లో బాగా ప్రభావం చూపేలా ఉంది. బెంగాల్ విభజన తర్వాత బంగ్లాదేశ్ నుండి భారీగా వలస వచి్చన దళిత ప్రాబల్య మథువా సామాజిక వర్గం దశాబ్దాలుగా పౌరసత్వం కోరుతూనే ఉంది. సీఏఏ నేపథ్యంలో వారంతా గంపగుత్తగా బీజేపీకి జై కొట్టేలా కని్పస్తున్నారు. వీరు ఉత్తర 24 పరగణాలు, నాదియా, మాల్దాతో పాటు పలు ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. సీఏఏ నుంచి ముస్లింలను మినహాయించడం తెలిసిందే. బంగ్లా నుంచి ముస్లింల వలసలకు మమత సర్కారు గేట్లెత్తేసిందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. మరోవైపు సీఏఏను మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ఎన్నికల లబ్ధి కోసం తెచి్చన ఈ చట్టం అమలును బెంగాల్లో అడ్డుకుని తీరతానంటున్నారు. అవినీతికి లైసెన్స్, దోపిడీకి ఫ్రీ పాస్ కావాలని తృణమూల్ సర్కారు కోరుకుంటోంది. రాష్ట్రంలో టీఎంసీ సిండికేట్ రాజ్ నడుస్తోంది. అందుకే దోపిడీలకు, అవినీతికి పాల్పడిన పార్టీ నేతలపై విచారణ కోసం వచి్చన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై టీఎంసీ దాడులు చేయిస్తోంది. –జల్పాయ్గురి సభలో ప్రధాని మోదీ జూన్ 4న ఎన్నికల ఫలితాలొచ్చాక విపక్ష నేతలందరినీ జైలుకు పంపుతామంటూ మోదీ బెదిరిస్తున్నారు. ఒక ప్రధాని అనాల్సిన మాటలేనా ఇవి! కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి చాలామంది నేతలను బీజేపీ ఇప్పటికే జైల్లో పెట్టింది. మొత్తం హిందుస్థాన్నే జైలుగా మార్చేసింది. సీబీఐ, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీ సోదరులు. ఐటీ, ఈడీ ఆ పారీ్టకి నిధులు సమీకరించే సంస్థలు. మీకు గెలిచే సత్తా, నమ్మకముంటే మా నాయకులను అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? ఈ ఎన్నికల తర్వాత కూడా బెంగాల్లో ఉండేది మా ప్రభుత్వమే. మేం తలచుకుంటే మీ నాయకులందరినీ ఊచలు లెక్కపెట్టిస్తాం. – కృష్ణనగర్ ఎన్నికల ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ.. త్రిపుర సీఎం
అగర్తల: సార్వత్రిక ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్ళీ అధిక సంఖ్యలో సీట్లు గెలవడానికి ప్రయతిస్తోంది. ఈ తరుణంలో త్రిపుర ముఖ్యమంత్రి 'మాణిక్ సాహా' తృణమూల్ కాంగ్రెస్ పార్టీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ త్రిపుర జిల్లా పరిధిలోని బెలోనియాలో జరిగిన బహిరంగ సభలో సాహా మాట్లాడుతూ.. బెంగాల్‌ను వరుసగా 34 ఏళ్లు పాలించిన సీపీఐఎంకు తృణమూల్ కాంగ్రెస్ కార్బన్ కాపీ అని వ్యాఖ్యానించారు. 'కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ పాలించినా వారి అవశేషాలు దొరుకుతాయని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు తృణమూల్‌ను నమ్మి ఓట్లు వేయడం దురదృష్టమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మరింత మెరుగైన ఫలితాలు రానున్నట్లు మాణిక్ సాహా పేర్కొన్నారు. ఇప్పటికే వామపక్షాలకు చెందిన నా మిత్రులు బీజేపీకి ఫిర్యాదు చేశారు. మా పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలను గురించి వివరిస్తూ.. అప్పట్లోనే బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని బాక్సానగర్, ధన్పూర్ వంటి ప్రాంతాల్లో మెజారిటీ స్థాయిలో ఓట్లను నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. -
ఎలక్టోరల్ బాండ్ల కొత్త డేటా విడుదల.. ఏ పార్టీకి ఎంత?
ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం రెండో జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సమర్పించిన డేటాను మరోసారి అందుబాటులో ఉంచినట్లు ఆదివారం ఎన్నికల సంఘం వెల్లడించింది. సీల్డ్ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ పార్టీ అత్యధికంగా రూ.6,986.50 కోట్ల విరాళాలను పొందినట్లు తెలిపింది. కేవలం 2019-2020 మధ్య బీజేపీకి రూ.2,555 కోట్ల బాండ్లు అందినట్లు ఈసీ విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది. ఇక.. బీజేపీ పార్టీ తర్వాత అత్యధికంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి రూ.1,397కోట్ల విలువైన బాండ్లను విరాళాలుగా పొందినట్లు తెలిపింది. ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం.. ఆయా పార్టీకు వచ్చిన విరాళాలు కాంగ్రెస్ పార్టీ- రూ.1334 కోట్లు బీఆర్ఎస్- రూ. 1322 కోట్లు బిజు జనతాదళ్- రూ.944 కోట్లు డీఎంకే - రూ. 656.5 కోట్లు (ఇందులో రూ. 509 కోట్లు లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ నుంచి వచ్చాయి) వైఎస్సార్సీపీ- రూ.442.8 కోట్లు టీడీపీ- రూ.182. 35 కోట్లు సమాజ్‌వాదీ పార్టీ- రూ. 14.5 కోట్లు అకాలీదళ్- రూ.7.26 కోట్లు ఏఐఏడీఎంకే- రూ.6.05 కోట్లు నేషనల్ కాన్ఫరెన్స్- రూ. 50 లక్షలు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమాచారంలో ఎస్బీఐ పూర్తి సమాచారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఎందుకు లేవో చెప్పాలని మార్చి 15 నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలు వెల్లడించకపోవటంపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: ఒకే డ్రెస్ ఎన్ని రోజులేసుకుంటాం.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు -
లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్
టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. పఠాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నాడు. వెస్ట్ బెంగాల్‌లోని బరంపూర్ నియోజకవర్గం నుంచి యూసఫ్ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దించింది. ఇవాళ ఉదయమే తృణమూల్ తీర్దం పుచ్చుకున్న పఠాన్... పార్టీలో చేరిన గంటలోపే ఎంపీ టికెట్ దక్కించుకోవడం ఆసక్తికరం. ప్రస్తుతం బరంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ ఎంపీగా ఉన్నాడు. చౌదరీ గతంలో ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా బరంపూర్ స్థానాన్ని టీఎంసీ కాంగ్రెస్‌కు వదిలి పెడుతుందని అంతా అనుకున్నారు. Here's an exclusive image of Yusuf Pathan following his entry into the politics with the All India Trinamool Congress.#YusufPathan pic.twitter.com/UfnrbdvDTy— CricTracker (@Cricketracker) March 10, 2024 అయితే కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ టీఎంసీ రాష్ట్రం మొత్తంలో అభ్యర్దులను నిలబెట్టింది. ఇవాళ ఉదయం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 42 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించింది. సీట్ల సర్దుబాటులో విషయంలో కాంగ్రెస్-టీఎంసీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని గత కొద్ది రోజుల నుంచి భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తాడని సమాచారం. యువీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బరిలో నిలుస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీగా (ఆమ్ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు. లోక్‌సభ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. అయితే గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతున్న యువరాజ్ సింగ్.. ప్రస్తుత ఎంపీలు గంభీర్, హర్బజన్ సింగ్ సమకాలీకులే కావడం విశేషం. -
మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినప్పుడు బీజేపీ ఎక్కడుంది?
కోల్‌కతా: ‘సందేశ్‌ఖాలీ’ తుపాను ధాటికి పశి్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని, నారీశక్తి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని గద్దె దింపుతుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీటైన జవాబిచ్చారు. రాష్ట్రంలో మహిళలకు తమ ప్రభుత్వం అండగా నిలబడిందని పునరుద్ఘాటించారు. దేశంలోనే మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం తమదేనని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే గురువారం కోల్‌కతాలో ‘మహిళా హక్కులే మాకు ముఖ్యం’ పేరిట చేపట్టిన పాదయాత్రలో మమత ముందు నడిచారు. ఆమెను వందలాది మంది మహిళలు, పార్టీ కార్యకర్తలు అనుసరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన అకృత్యాలపై మమత విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ సందేశ్‌ఖాలీపై బీజేపీ దేశానికి తప్పుడు సందేశాలు పంపుతోంది. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదంటూ నిన్న ఇక్కడికొచ్చి లెక్చర్లు దంచేసిన మోదీ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలు అకృత్యాలకు బలైనప్పుడు ఎందుకు మౌనం వహించారు?’’ అని నిలదీశారు. ‘‘మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినపుడు ఈ బీజేపీ ఏం చేసింది?. ఉత్తరప్రదేశ్ హథ్రాస్‌లో అత్యాచారం చేసి మృతదేహాన్ని బలవంతంగా తగలబెడితే బీజేపీ సర్కార్ ఏం చేసింది?. గుజరాత్లో సర్వం కోల్పోయిన బిల్కిస్ బానోకు దక్కిన న్యాయమెంత?’’ అని ప్రశ్నించారు. ‘నిజానికి దేశంలో మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం బెంగాల్’ అని ప్రకటించారు. ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం గురువారం బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్‌నూ మమత విమర్శించారు. ‘‘ తన తీర్పుల ద్వారా బెంగాల్లో వేలాది మంది యువత నుంచి ఉద్యోగాలు లాక్కున్నారు. వారు మిమ్మల్ని క్షమించరు. మీ తీర్పుల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా సరే మిమ్మల్ని ఓడించి తీరతాం’ అని అన్నారు. ‘‘ పింటూ బాబు(బీజేపీ) ఆగ్రహంతో ఊగిపోయినా సరే బెంగాల్లో మీ విభజన రాజకీయాలు నడవనివ్వను. బెంగాల్‌కు 450కిపైగా బృందాలను పంపిన పింటూ బాబు.. మహిళలను లైంగికంగా వేధించి నగ్నంగా ఊరేగించిన మణిపూర్‌కు ఒక్క బృందాన్ని కూడా పంపలేదు’ అని మమత గుర్తుచేశారు. ‘బీజేపీపాలిత యూపీలో మహిళలపై దారుణ అత్యాచారాలు జరుగుతున్నాయి. మణిపూర్‌లో మహిళలు రేప్‌కు గురై, అగి్నకి ఆహుతైన ఉదంతంలో అక్కడి బీజేపీ సర్కార్ సిగ్గుతో తలదించుకోవాలి’ అని మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ సందేశ్‌ఖాలీ ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందే. టీఎంసీ కార్యకర్తలు బాధ్యుతులుగా తేలితే అరెస్ట్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడను’ అని ఆమె స్పష్టంచేశారు. పాదయాత్రలో సందేశ్‌ఖాలీ ప్రాంతానికి చెందిన 200కుపైగా మహిళలు పాల్గొన్నారు. -
సందేశ్‌ఖాలీలో తుపాను!
బరాసత్/కోల్‌కతా: సందేశ్‌ఖాలీలో తుపాను మొదలైందని, అది పశ్చిమ బెంగాల్‌ను చుట్టుముట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అరాచకాలు, అకృత్యాలకు మారుపేరైన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళా శక్తి మట్టి కరిపించడం తథ్యమని అన్నారు. బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లా కేంద్రమైన బరాసత్ పట్టణంలో బుధవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీశక్తి వందన్ సభలో ఆయన ప్రసంగించారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై నేరాలు సిగ్గుచేటన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, మహిళల భద్రతను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బాధితుల్లో తిరుగుబాటు మొదలైందని, సందేశ్‌ఖాలీలో పుట్టిన తుఫాను రాష్ట్రాన్ని ముంచెత్తి తృణమూల్‌ను గద్దె దింపుతుందని అన్నారు. సందేశ్‌ఖాలీ అంశంలో హైకోర్టులో, సుప్రీంకోర్టులో మమత ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయని గుర్తుచేశారు. బాధితులకు న్యాయం చేకూరుస్తాం పశి్చమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో అత్యాచారాలకు, అకృత్యాలకు గురైన మహిళలకు న్యాయం చేకూరుస్తామని, తగిన భద్రత కలి్పస్తామని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు. అనంతరం సందేశ్‌ఖాలీ నుంచి వచి్చన మహిళలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐదుగురు బాధితులతో స్వయంగా మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై నిర్భయంగా పోరాడుతున్న సందేశ్‌ఖాలీ మహిళలను దుర్గా మాతతో పోల్చారు. బాధితుల గోడు విని ఆయన చలించిపోయారు. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా కలి్పంచారు. మరోవైపు సందేశ్‌ఖాలీ నుంచి నారీశక్తి వందన్ సభకు బస్సుల్లో వస్తున్న మహిళలను బెంగాల్ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. బీజేపీ నాయకులు వారితో ఘర్షణకు దిగారు. కొంతమంది మహిళలు మాత్రమే సభకు రాగలిగారు. లాలూ కుటుంబం నేరగాళ్లమయం బేటియా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు బిహార్‌లో అతిపెద్ద నేరుగాళ్లని మోదీ ఆరోపించారు. పదేళ్ల ఆర్జేడీ పాలనలో బిహార్‌ను జంగిల్‌రాజ్ మార్చేశారని మండిపడ్డారు. బిహార్‌లో పశ్చిమ చంపారన్ జిల్లాలోని భేటియాలో రూ.12,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అప్పట్లో ఆర్జేడీ–కాంగ్రెస్ దుష్పరిపాలన వల్ల బిహార్ యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వారసత్వ రాజకీయాలు చేసేవారు తనపై మాటల దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి నేతలు రాముడిని కూడా కించపరుస్తున్నారన్నారు. దేశం పేదరికం నుంచి బయటపడాలంటే, మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో అతి పెద్దదిగా వ్యవస్థగా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు కట్టబెట్టాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కోల్‌కతాలో అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభం దేశంలోనే మొట్టమొదటి జలాంతర్భాగ మెట్రో రైలు సొరంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. కోల్‌కతా మెట్రోరైల్ నెట్‌వర్క్‌లో భాగంగా హుగ్లీ నది దిగువన ఈ సొరంగాన్ని నిర్మించారు. ఎస్‌ప్లానాడి నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకు మెట్రో రైలులో మోదీ ప్రయాణించారు. రైలులో తనతోపాటు ప్రయాణించిన పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. అదే మార్గంలో ఎస్‌ప్లానాడి స్టేషన్‌కు తిరిగివచ్చారు. ఈస్ట్–వెస్ట్ కారిడార్‌లో అంతర్భాగమైన 4.8 కిలోమీటర్ల ఎస్‌ప్లానాడి–హౌరా మైదాన్ మెట్రో మార్గాన్ని రూ.4,960 కోట్లతో నిర్మించారు. ఈ మార్గంలో దేశంలోనే అత్యంత లోతైన రైల్వే స్టేషన్ ఉంది. ఉపరితలం నుంచి 32 మీటర్ల దిగువన హౌరా మెట్రో స్టేషన్‌ను నిర్మించారు. కోల్‌కతాలో బుధవారం మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మొత్తం రూ.15,400 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. -
'సందేశ్‌ఖాలీ' కేసులో సుప్రీంకోర్టుకు దీదీ సర్కార్
సందేశ్‌ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్ ప్రభుత్వం విముఖత చూపింది. ఇవాళ సాయంత్రం లోపు కేసును సీబీఐకి అప్పగించాలని ఆ రాష్ట్ర హైకోర్డు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది బెంగాల్ ప్రభుత్వం. బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, జైదీప్ గుప్తా, గోపాల్ శంకరనారాయణన్ ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ముందు సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ చేసిన పిటిషన్ వేశారు. అయితే ఆ పత్రాలను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందు ఉంచాలని పిటిషనర్‌కు సూచించింది బెంచ్. రేషన్ బియ్యానికి సంబంధించిన కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో, అతని అనుచరులు అధికారులపై దాడిచేశారు. ఈ ఘటన జరిగిన తరువాత షాజహాన్ పరారయ్యాడు. మరోవైపు షాజహాన్ దురాగతాలపై అప్పుడే వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. తమపై అత్యచారాలు జరుగుతున్నాయంటూ సందేశ్‌ఖాలీ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సుమారు 50 రోజులకు పైగా పరారీలో ఉన్న షాజహాన్‌ను పోలీసులు ఫిబ్రవరి 29న అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు సామాన్యుడు కాదని.. ప్రజాప్రతినిధి అని.. దర్యాప్తు అనేది సాధారణ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటానికే తప్ప కేసుకు సంబంధించిన నిజాలను దాచి పెట్టడానికి కాదని చెబుతూ.. సిట్ ఏర్పాటును సైతం రద్దు చేసి కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు బెంగాల్ పోలీస్ శాఖను ఆదేశించింది. -
'ఎన్నికలు రావచ్చు, పోవచ్చు' - మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' (Mamata Banerjee) రాష్ట్రంలో తమ పార్టీ ఆధిపత్యాన్ని గురించి వివరిస్తూ.. 'ఎన్నికలు రావచ్చు, పోవచ్చు' కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని కొనసాగిస్తుందని ఉద్ఘాటించారు. తూర్పు మేదినీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు నినాదాలు చేసే వారు కూడా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ తప్పకుండా అధికారంలో కొనసాగుతుందని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి కొందరు వస్తుంటారు, ఎన్నికలు అయిన తరువాత మళ్ళీ కన్పించరని, ఎవరైనా చనిపోయినా రారు అని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాయ్ ఆదివారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు గౌరవం లేదని భావించి రాజీనామా చేసినట్లు రాయ్ స్పష్టం చేశారు. -
టీఎంసీలో కీలక పరిణామం.. కునాల్ ఘోష్‌కు షోకాజ్ నోటీస్
లోక్‌సభ ఎన్నికలకు ముందే పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామానాలు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత తపస్ రాయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. మరో నేత కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. కోల్‌కతా ఎంపీ సుదీప్ బందోపాధ్యపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు కునాల్ ఘోష్‌కు టీఎంసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అంతకు ముందే ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవులలో కొనసాగడం ఇష్టం లేదని ప్రకటించారు. కునాల్ ఘోష్ శనివారం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎంపీ సుదీప్ బెనర్జీ బ్యాంకు ఖాతాలు, ఆయన తరపున అపోలో, భువనేశ్వర్‌కు జరిగిన చెల్లింపులపై విచారణ జరపాలి. అతను కస్టడీలో ఉన్నప్పుడు, అతనికి పెద్ద మొత్తం చెల్లించారా లేదా అతని తరపున ఆసుపత్రికి చెల్లించారా లేదా అనే దానిపై విచారణ జరగాలని పోస్ట్ చేశారు. -
తృణమూల్ కాంగ్రెస్‌కు 'తపస్ రాయ్' గుడ్ బై - కారణం ఇదే..
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత 'తపస్ రాయ్' (Tapas Roy) ఈ రోజు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన నివాసంపై దాడి చేసినప్పుడు పార్టీ నాయకత్వం తనకు అండగా నిలవలేదని, పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తపస్ రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించానని, ఇప్పుడు నేను 'ఫ్రీ బర్డ్' అని అన్నారు. తపస్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన బీజేపీలో చేరతారా? లేదా మరేదైనా ప్రతిపక్ష పార్టీలో చేరతారా అనే దానిపై తీవ్రమైన ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీలలో చేరే విషయం మీద తన అభిప్రాయాన్ని రాయ్ వెల్లడించలేదు, రానున్న రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
బెంగాల్లో స్కీములన్నీ స్కాములే
కృష్ణనగర్: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. స్కీములను స్కాములుగా మార్చడంలో తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ప్రభుత్వం మాస్టర్ డిగ్రీ సాధించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పథకాలన్నీ కుంభకోణాలుగా మారాయని ఆరోపించారు. అణచివేత, వారసత్వ రాజకీయాలు, మోసాలు, ద్రోహానికి మమత సర్కారు మారుపేరుగా మారిందని ఆరోపించారు. మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. నాడియా జిల్లాలోని కృష్ణనగర్‌లో రూ.15,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.940 కోట్లకు పైగా విలువైన నాలుగు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రంసంగించారు. బెంగాల్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ఆరి్ధకాభివృద్ధికి, నూతన ఉద్యోగాల సృష్టికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సాగించిన అకృత్యాల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం బాధిత మహిళలను గోడు వినిపించుకోవడం లేదని, నిందితులను అరెస్టు చేయకుండా కాపాడుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నో ఆశలతో నమ్మి అధికారం అప్పగిస్తే ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ‘మా, మాటీ, మను‹Ù’ అంటూ నినాదాలు చేసే తృణమూల్ కాంగ్రెస్ మన అక్కచెల్లెమ్మలకు రక్షణ కలి్పంచడం లేదని మండిపడ్డారు. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో నేరగాళ్లే నిర్ణయిస్తున్నారని, పోలీసులు చేతులెత్తేస్తున్నారని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్‌కు అవినీతి, బంధుప్రీతి తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ఎద్దేవా చేశారు. టీఎంసీ అంటే తూ, మై, ఔర్ కరప్షన్(నువ్వు, నేను, అవినీతి) దుయ్యబట్టారు. బిహార్‌లో అరాచక పాలన మళ్లీ రానివ్వం ఔరంగాబాద్: ప్రధాని మోదీ శనివారం బిహార్‌లో పర్యటించారు. రూ.34,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకున్న నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారని, రాజ్యసభ మార్గం ద్వారా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు. ఇక ఎప్పటికీ ఎన్డీయేలోనే ఉంటా: నితీశ్ కుమార్ తన ప్రయాణం ఇకపై ఎప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే అని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400కుపైగా స్థానాలు కచి్చతంగా గెలుచుకుంటుందని అన్నారు. ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించడానికి తమ రాష్టానికి వచి్చన ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. కొంతకాలం ఎన్డీయేకు దూరమయ్యానని, మళ్లీ తిరిగివచ్చానని, ఇకపై ఇదే కూటమిలో కొనసాగుతానంటూ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా నితీశ్‌ను చూస్తూ ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించడం విశేషం. -
సిగ్గు... సిగ్గు...
వ్యవసాయభూముల కాపాడేందుకు ఉద్యమాలు చేసి, అప్పటి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చిన పార్టీ చివరకు అందులోనే విఫలమైతే? సదరు పార్టీ వ్యక్తులే సారవంతమైన భూముల్ని కబ్జా చేసి, స్థానికులను జీతం బత్తెం లేని బానిస కూలీలుగా మార్చి, స్త్రీలపై యథేచ్ఛగా లైంగిక అత్యాచారాలు సాగిస్తుంటే? పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ళ దీర్ఘకాల వామపక్ష సర్కార్‌పై అలుపెరుగని పోరాటాలు చేసి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ఇప్పుడు సందేశ్‌ఖలీ వ్యవహారంలో వస్తున్న విమర్శలు ఇవే. కోల్‌కతాకు 70 కి.మీ.ల దూరంలో, ఉత్తర 24 పరగణాల జిల్లాలో సారవంతమైన భూములతో కూడిన ఈ కుగ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికి 53 రోజులైనా, అక్కడి అకృత్యాలకు మూలమని ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ నేత షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేయకపోవడంపై కలకత్తా హైకోర్ట్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి రావడం పరాకాష్ఠ. సందేశ్‌ఖలీలో చాలాకాలంగా అకృత్యాలు సాగుతున్నా, అది ఇప్పుడు చర్చకు వచ్చింది. రేషన్ కుంభకోణంలో నిందితుడైన స్థానిక రాజకీయ బాహుబలి షేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 5న వెళ్ళింది. వారిపై దాదాపు 2 వేల మంది దాకా షాజహాన్ అనుచరులు తీవ్రమైన దాడికి తెగబడ్డారు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉండగా, పెద్దయెత్తున స్థానిక మహిళలు బయటకొచ్చి, ధైర్యం కూడగట్టుకొన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడ షాజహాన్, ఆయన అనుచరులు సాగిస్తున్న భూకబ్జాలనూ, లైంగిక అత్యాచారాలనూ బయటపెట్టారు. ఈ ఆరోపణలతో గ్రామంలో నిరసనలు తలెత్తాయి. గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, షాజహాన్ ప్రధాన అనుచరులైన ఉత్తమ్ సర్దార్, శివప్రసాద్ హజ్రాల ఆస్తులపై దాడికి దిగేలా చేసింది. షాజహాన్నూ, అతని అనుచరులనూ అరెస్టు చేయాలని కోరుతూ ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో వీధులకెక్కారు. అధికార తృణమూల్ అసలు నిందితుడి విషయంలో మీనమేషాలు లెక్కిస్తుంటే, ఈ వ్యవహారాన్ని ఎన్నికల ప్రయోజనాలకు ఎలా వాడుకోవాలా అని బీజేపీ చూస్తోంది. అధికార పార్టీ సైతం ఆచితూచి వ్యవహరిస్తున్న నిందితుడు షేక్ షాజహాన్‌ది పెద్ద కథ. ‘సుందర్బన్స్ అసలు పులి’ అంటూ స్థానిక గ్రామీణులు పిలుచుకొనే అతను 2013 నుంచి తృణ మూల్‌కూ, అంతకు ముందు సీపీఐ (ఎం)కూ ఓటింగ్ మిషన్. అతను∙ఎవరికి మద్దతిస్తే వారిదే గెలుపు. 2023 జూలై పంచాయతీ ఎన్నికల్లో సందేశ్‌ఖాలీలోని రెండు బ్లాకుల్లో 333 సీట్లుంటే, 310 సీట్లు పోటీ లేకుండా తృణమూల్ ఖాతాలో పడ్డాయి. మిగతా 23 సీట్లలోనూ చివరకు తృణమూల్ జెండాయే ఎగిరింది. అలాంటి బలవంతుణ్ణి వదులుకోవడం ఎంత మమతకైనా కష్టమే. అందులోనూ మైనార్టీ అయిన షాజహాన్‌ను పరారీలో ఉన్నాడంటూ వదిలేసి, అతని∙హిందూ సహచరు లిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో బీజేపీ – ఆరెస్సెస్‌లకు అస్త్రం అందివచ్చినట్టయింది. మమత మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని నిందిస్తూ ఎస్సీ, ఎస్టీలను తమ వైపు తిప్పుకోవాలని కమలదళం యత్నిస్తోంది. నాలుగేళ్ళ క్రితమే పోలీసులకు ఫిర్యాదులందినా, 42 కేసులు దాఖలైనా షాజహాన్‌ను కదిలించినవారు లేదు. అతణ్ణి అరెస్ట్ చేస్తే మైనార్టీలు దూరమవుతారనేది మమత భయం. ఏమైనా, మోదీ పర్యటనకు వచ్చే లోపల మమత ఆ పని చేయక తప్పకపోవచ్చు. గతంలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా మమత ఎలాంటి ధర్నాలు చేసిందీ తెలుసు. 2007లో నందిగ్రామ్‌లో ప్రత్యేక ఆర్థిక జోన్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించి అక్కడకు చేరడానికి ఆమె స్కూటర్ వెనుక కూర్చొని ప్రయాణించడం, సింగూర్‌లో టాటా నానో కర్మాగారం ఎదుట ధర్నాలు చేయడం అందరికీ గుర్తే. తీరా మమత పాలనలో ప్రతిపక్షాలు ఆ తరహా పోరాటాలు సాగించలేకపోతున్నాయి. బీజేపీలో సైతం నేతల మధ్య సమన్వయం కొరవడింది. దాంతో, ప్రధానమంత్రే రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మరికొద్ది రోజులే ఉన్నందున అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు మార్చి తొలివారంలో ఒకటికి మూడుసార్లు బెంగాల్లో పర్య టించనున్నారు. రాజకీయాలు, హింసాకాండ జంటపదాలైన బెంగాల్ దేశంలోని అతి సున్నితమైన ప్రాంతాల్లో ఒకటని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చివరకు కాశ్మీర్ కన్నా ఎక్కువగా 920 కంపెనీల కేంద్ర బలగాలను బెంగాల్లో దింపనున్నట్టు ప్రకటించింది. సభ్యసమాజం సిగ్గుపడేలా సాగుతున్న లైంగిక అత్యాచారాలపై పార్టీలకు అతీతంగా నేతలందరూ గళం విప్పాల్సింది. తృణమూల్ మొదట అసలు అలాంటిదేమీ లేనే లేదని కొట్టిపారేసింది. ఆనక ఇదంతా తమను అప్రతిష్ఠ పాల్జేసేందుకు కాషాయదళ స్కెచ్ అనీ, ఇప్పుడేమో నిందితుల్ని శిక్షిస్తామనీ పిల్లిమొగ్గలు వేసింది. ప్రతిపక్షాలేమో స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఈ వివాదాన్ని ఎలా వాడుకోగలమనే ప్రయత్నంలోనే ఉన్నాయి. ఇంత సాగుతున్నా, సందేశ్‌ఖలీ ఘటనల్ని సీఎం మమత గట్టిగా ఖండించిన పాపాన పోలేదు. కనీసం పోలీసులు అసలు నిందితుణ్ణి అరెస్ట్ చేసిందీ లేదు. ఇది శోచనీయం. ఓ మహిళ పాలిస్తున్న రాష్ట్రంలో, శాంతిభద్రతల పరిరక్షించాల్సిన హోమ్ శాఖ ఆమె చేతిలో ఉండగా ఇదీ స్త్రీల పరిస్థితి కావడం మరింత సిగ్గుచేటు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రభుత్వం తక్షణం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బలవంతుడిదే రాజ్యంగా మారిన పరిస్థితుల్ని మార్చి, కబ్జాకు గురైన భూముల్ని అసలు యజమానులకు అప్పగించాలి. అప్పుడే న్యాయం గెలుస్తుంది. ప్రభుత్వంపై, ప్రజాస్వామ్యంపై జనంలో నమ్మకం నిలుస్తుంది. -
సందేశ్‌ఖాలీలో పెల్లుబికిన నిరసనలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, సోదరుడు సిరాజ్, వారి అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడి భూములను లాక్కున్నారంటూ పశి్చమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో కొద్దిరోజులుగా మహిళలు చేస్తున్న నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. సందేశ్‌ఖాలీలోని ఝుప్‌ఖాలీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా ఆందోళనకారులు రోడ్లుపై దుంగలతో నిప్పుపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆస్తులను తగలబెట్టారు. ఇన్నిరోజులైనా షాజహాన్, అతని అనుచరులను అరెస్ట్‌చేయకపోవడంపై పోలీసుల నిర్లిప్త వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. బెల్మాజూర్ దగ్గరి ఫిషింగ్‌యార్డ్ నిర్మాణాలను తగలబెట్టారు. పోగొట్టుకున్న భూములు, గౌరవాన్ని తిరిగి పొందేందుకు, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టామని స్థానికులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్‌చేసి తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా మహిళలు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ‘షాజహాన్‌ను అరెస్ట్‌చేసే దమ్ములేని మీరు మా వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మా మనుషుల అండలేకుండా మాకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ఒక మహిళ పోలీసులను నిలదీసింది. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. -
Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
కోల్‌కతా/చండీగఢ్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్‌తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్‌ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి. ఆది నుంచీ అంతంతే... విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి. పంజాబ్‌లో ఒంటరి పోరే సీఎం భగవంత్ మాన్ వెల్లడి పంజాబ్‌లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి. కూటమిపై ఎవరికీ పెత్తనముండదు మమత నర్మగర్భ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది! -
‘మహువా మొయిత్రాపై వేటు.. అది విచారకరమైన రోజు’
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మొదటిసారి స్పందించారు. ‘అవినీతి, జాతీయ భద్రత సమస్య విషయంలో ఓ ఎంపీ బహిష్కరణకు గురికావటం తనకు బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి రోజు(శుక్రవారం) సంతోషకరమైన రోజు కాదని, అదో విచారకరమైన రోజని తెలిపారు. అయితే మొయిత్రా తన లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీకి ఇచ్చారని నిశికాంత్ దూబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. #WATCH | BJP MP Nishikant Dubey on expulsion of TMC leader Mahua Moitra from Parliament "The expulsion of a parliamentarian for corruption and on the issue of national security gives me pain. Yesterday, it was not a happy day, but a sad day." pic.twitter.com/DZoZei5AqF — ANI (@ANI) December 9, 2023 ఆయన ఫిర్యాదుతోనే స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయగా.. శుక్రవారం ఎథిక్స్ కమిటి నివేదిక ఆమెను దోషిగా తేల్చటంతో బహిష్కరణ గురయ్యారు. ఇక మొయిత్రాపై వేటుపడిన అనంతరం ఆమెపై ఫిర్యాదు చేసిన ఎంపీ నిశికాంత్ దూబే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. -
‘బహిష్కరణ’పై చర్చ జరగాల్సిందే
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సులు.. అఖిలపక్ష భేటీలో వేడిపుట్టించాయి. ఆ సిఫార్సులపై లోక్‌సభలో తుది నిర్ణయం తీసుకు నేలోపే పార్లమెంట్లో వాటిపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీ వాడీవేడీగా జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి పార్ల మెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుదీప్ బందోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రియాన్, ఎన్సీపీ నేతలు ఫౌజియా ఖాన్ తదితరులు హాజరయ్యారు. ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో మహువా మొయిత్రాను బహిష్కరించేందుకు వీలుగా లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నివేదికపై పార్లమెంట్ తొలిరోజే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోస్తోంది. దీంతో ప్రభుత్వ వైఖరిని విపక్ష సభ్యులు ఆక్షేపించారు. బహిష్కరణపై తుది నిర్ణయం తీసుకునే ముందు నివేదికపై చర్చ చేపట్టాలని టీఎంసీ నేతలు డిమాండ్ చేశారు. సభలో చర్చ జరక్కుండానే ఎథిక్స్ కమిటీ నివేదిక బహిర్గతం కావడాన్ని వారు నిరసించారు. మహువాపై బహిష్కరణ వేటు తీవ్ర శిక్ష: అధీర్ రంజన్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలన్న యోచన అత్యంత తీవ్రమైనదని, దీని పర్యవసానాలు ఎన్నో రకాలుగా ఉంటాయని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి ఆగ్రహంవ్యక్తంచేశారు. పార్లమెంటరీ కమిటీ నిబంధనలు, ప్రక్రియలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నాలుగు పేజీల లేఖ రాశారు. అఖిలపక్షానికి హాజరుకాలేకపోయిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే ఎయిర్ఇండి యా విమానం శనివారం దారి మళ్లింపు కారణంగా పార్లమెంటు అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ హాజరుకాలేకపో యింది. ఉదయం 8.10 నిమిషాలకు ఢిల్లీ రావాల్సిన విమానా న్ని విజిబిలిటీ లేని కారణంగా జైపూర్ మళ్లించారు. ఇదే విమానంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయాణించారు. విమానం దారి మళ్లింపు కారణంగా ఉదయం పార్లమెంటు లైబ్రరీ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకాలేకపోయారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
Mahua Moitra: కష్టాల్లో ఫైర్ బ్రాండ్
తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టినవారికి గుర్తింపు రావటం అంత సులభం కాదు. ప్రసంగించే అవకాశం లభించటం, దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అరుదు. మహిళా ఎంపీల విషయంలో దాదాపు అసాధ్యం. కానీ రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్దికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికై లోక్‌సభలో ప్రవేశించిన మహువా మొయిత్రా చాలా త్వరగానే ‘వార్తల్లో వ్యక్తి’ అయ్యారు. తీరా నాలుగేళ్లయ్యే సరికల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఏం జరిగిందో అందరూ గ్రహించే లోగానే ఉరుము లేని పిడుగులా, ఊహించని ఉత్పాతంలా వచ్చిపడిన వివాదం చివరికామె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరుపెట్టేలా పరిణమించింది. సభ్యుల నైతిక వర్తనను నియంత్రించే లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమెను సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరుతూ గురువారం నివేదికను ఆమోదించింది. ఇందుకు ప్రధానంగా అనైతిక వర్తన, తీవ్ర తప్పిదాలకు పాల్పడటం కారణాలుగా చూపింది. అంతేకాదు... ఈ విషయంలో సంస్థాగత విచారణ, చట్టపరంగా గట్టి చర్యలు అవసరమని సిఫార్సు చేసింది. పార్లమెంటు సభ్యులు సభలో ప్రశ్నలు వేయటానికి వినియోగించే ఎన్ఐసీ వెబ్సైట్ లాగిన్, పాస్వర్డ్ ఆమె తన స్నేహితుడైన దుబాయ్ రియలెస్టేట్ వ్యాపారి దర్శన్ హీరానందానీకి ఇచ్చారనీ, ఆయన నుంచి కోటి రూపాయల ముడుపులు తీసుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థలపై ప్రశ్నలు సంధించారనీ మొయిత్రాపై వచ్చిన ఆరోపణలు. ఆ ప్రశ్నలు అదానీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతీసేంత తీవ్రమైనవా? అందువల్ల హీరానందానీకి ఒరిగేదేమిటి? ముడుపుల సంగతిని మొయిత్రా తోసి పుచ్చారు. లాగిన్, పాస్వర్డ్ ఇచ్చినట్టు అంగీకరించారు. అందుకుగల కారణాలు చెప్పారు. ఇదంతా దేశభద్రతకు ముప్పు తెచ్చే చర్య అనీ, లంచం తీసుకుని ప్రశ్నలేయటం అనైతికమనీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత నెలలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ ఇప్పటికే మొయిత్రా ఓం బిర్లాకు లేఖ రాశారు. కమిటీ తనను ప్రశ్నించిన తీరు ‘వస్త్రాపహరణం’ మాదిరిగా వున్నదంటూ దుయ్యబట్టారు. మొయిత్రా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వలె ఆంగ్ల భాషాప్రావీణ్యం వుండటం వల్లనే త్వరగా ఆమెకు పేరుప్రతిష్టలు సాధ్యమైనాయని అనుకోవటానికి లేదు. ప్రసంగించదల్చుకున్న అంశంపై పట్టు సంపాదించటం ఒక్కటే మొయిత్రా ప్రత్యేకతని చెప్పడానికి కూడా లేదు. విషయ పరిజ్ఞానంతోపాటు విస్ఫులింగాలు విరజిమ్మే స్వభావం, నిర్భీతిగా పాలక పక్షాన్ని నిలదీసే తత్వం ఆమెకొక విశిష్టతను తీసుకొచ్చాయి. అంతకుముందు మూడేళ్లు ఆమె తృణమూల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ మొయిత్రా గురించి దేశానికంతకూ తెలిసింది ఈ నాలుగేళ్ల కాలంలోనే. సభలోనే కాదు... వెలుపల కూడా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిప్పులు చిమ్ముతారు. మూకుమ్మడి అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షపడిన గుజరాత్ దోషులకు క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎథిక్స్ కమిటీ విచారణలో నిర్ధారించిన అంశాలేమిటో, అవి ఏరకంగా తీవ్రమైన స్వభావంతో కూడుకున్నవో ఇంకా తెలియాల్సి వుంది. ఎన్ఐసీ లాగిన్, పాస్వర్డ్ ఇవ్వటం విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిబంధనలూ లేవు. అయినా సరైంది కాదనుకుంటే ఆమెను మందలించవచ్చు. కమిటీలోని విపక్ష సభ్యులు చెబుతున్న ప్రకారం 800 మంది ఎంపీల్లో అనేకులు సగటున కనీసం ఇద్దరు ముగ్గురికి ఇలా ఇస్తారు. కంప్యూ టర్ల వాడకం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం ఇందుకు కారణం. ఈ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. ఆ సంగతలా వుంచితే ఫిర్యాదు, విచారణ వగైరాలన్నీ ఆదరా బాదరాగా సాగినట్టు కనబడుతోంది. అక్టోబర్ 26న కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ నెల 2న జరిగిన రెండో సమావేశం మధ్యలోనే ముగిసింది. అడిగినవాటికి జవాబివ్వకుండా ఆమె దుర్భాషలాడారని కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ ఆరోపిస్తే... ఫిర్యాదుతో సంబంధం లేని ప్రశ్నలతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వేధించారన్నది మొయిత్రా ఆరోపణ. దుబాయ్ వెళ్తే ఏ హోటల్లో దిగుతారు... మీతో ఎవరుంటారు... మీరు మీ మిత్రులతో మాట్లాడుతున్నట్టు వారి భార్యలకు తెలుసా అని అడిగారని కూడా ఆమె ఆరోపించారు. దీనికి నిరసనగా ఆమె, విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కమిటీ విచారణ గోప్యం కనుక ఆరోపణలు, ప్రత్యారోపణల్లో నిజానిజాలేమిటో తెలియదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మన పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందన్నది మాత్రం వాస్తవం. అసలు దూబే ఫిర్యాదుకు మొయిత్రా మాజీ సహచరుడు దేహద్రాయ్ లేఖ ఆధారమన్న సంగతి కమిటీకి తెలుసా? కమిటీకిచ్చిన అఫిడవిట్లో మొయిత్రాకు ముడుపులు చెల్లించానని హీరానందానీ అంగీకరించారా? లేదని విపక్ష సభ్యులు చెబుతున్నారు. విడిపోయిన జంట పరస్పరం ఆరోపించుకోవటం సర్వసాధారణం. ఇప్పటికే పెంపుడు కుక్క విషయంలో వారిద్దరూ కేసులు పెట్టుకున్నారు. కనుక దేహద్రాయ్ ఫిర్యాదు అంశంలో దూబే, ఎథిక్స్ కమిటీ ఆచితూచి అడుగు లేయాల్సింది. మహిళ గనుకే ఇలా చేశారన్న అపవాదు రానీయకుండా చూసుకోవాల్సింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతం, రాజకీయం కలగాపులగం చేశారన్న అప్రదిష్ట కలగడమూ మంచిది కాదు. ఏదేమైనా వ్యవస్థను ఢీకొట్టేవారు నిరంతరం అత్యంత జాగురూకతతో మెలగాలని మొయిత్రా ఇప్పటికే గుర్తించి వుంటారు. ఈ వివాదంలో పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యానికి అనుగుణమైన నిర్ణయం వెలువడాలని అందరూ కోరుకుంటారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
అభిషెక్ బెనర్జీకి ఈడీ సమన్లు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషెక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. పాఠశాల ఉద్యోగాల కుంభకోణం దర్యాప్తులో భాగంగా నవంబర్ తొమ్మిదో తేదీన(నేడు) కోల్‌కతాలో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మహిళా మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి అయిన శశి పంజా చెప్పారు. ‘ మా పార్టీ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శి అభిషెక్‌ను ఈడీ కక్షపూరిత రాజకీయాలకు బాధితుడిగా మార్చేసింది’ అని ఆమె ఆరోపించారు. సమన్లలో పేర్కొన్న మేరకు అభిషెక్ బెనర్జీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ‘‘వచ్చే సంవత్సరం కీలకమైన ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ నేతలను బెదిరించడానికి బీజేపీ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతోంది’’ అని శశి అన్నారు. దీనిపై పశి్చమబెంగాల్ బీజేపీ రాష్ట్ర విభాగం స్పందించింది. ‘ కక్షసాధింపు రాజకీయాలపై మాకు నమ్మకం లేదు. జాతీయ దర్యాప్తు సంస్థలు కోర్టు ఆదేశాల మేరకే ఇలా సమన్లు జారీ చేస్తాయి. మీకేమైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించండి’ అని బీజేపీ అధికార ప్రతినిది సంబిత్ పాత్రా అన్నారు. ఇప్పటికే అక్టోబర్‌లో బెనర్జీ ఈడీ ఎదుట హాజరైన విషయం విదితమే. సెపె్టంబర్ 13వ తేదీన ఆయనను ఈడీ అధికారులు ఏకంగా తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. కీలక ‘ఇండియా’ కూటమి సమావేశంలో పాల్గొనకుండా టీఎంసీ నేతలను అడ్డుకునేందుకే ఈడీ ఆనాడు అలా చేసిందని అప్పుడే అభిషెక్ ఆరోపించారు. గతంలో బొగ్గు కుంభకోణం కేసులో 2021, 2022 సంవత్సరాల్లో అభిషేక్‌ను ఈడీ అధికారులు రెండు పర్యాయాలు ప్రశ్నించారు. -
మహువాపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపనుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే తాజాగా వెల్లడించారు. తన ఫిర్యాదు ఆధారంగా లోక్‌పాల్ ఈ మేరకు ఆదేశించినట్టు వివరించారు. ఈ మేరకు బుధవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. దీనిపై మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ‘‘సీబీఐ ముందుగా అదానీ గ్రూప్ రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణం తదితరాలపై విచారణ జరిపితే బాగుంటుంది. ఆ తర్వాత నా అంశానికి రావచ్చు. నాకు ఎన్ని పాదరక్షలున్నాయో లెక్కపెట్టుకోవచ్చు’’ అని ఎద్దేవా చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. ఇందుకు బదులుగా హీరానందానీ నుంచి డబ్బులతో పాటు ఇతరత్రా పలు రకాలుగా ఆమె భారీ స్థాయిలో లబ్ధి పొందారని ఆమెపై ఆరోపణ. ఎంపీ హోదాలో ఉంటూ డబ్బుల కోసం జాతీయ భద్రతనే ఆమె ప్రమాదంలో పడవేశారని లోక్‌సభ స్పీకర్‌కు దూబే గతంలో ఫిర్యాదు చేయడం తెల్సిందే. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది. కమిటీ గత భేటీకి హాజరైన మొయిత్రా, చైర్మన్ తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ వాకౌట్ చేయడం విదితమే. ఈ ఉదంతంపై కమిటీ గురువారం మరోసారి భేటీ కానుంది. డబ్బులకు ప్రశ్నలడిగిన ఉదంతంలో మొయిత్రాను దోషిగా తేలుస్తూ స్పీకర్‌కు కమిటీ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. అదే జరిగితే దానితో విభేదిస్తూ కమిటీలోని విపక్ష సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (కాంగ్రెస్), కున్వర్ దానిష్ అలీ (బీఎస్పీ) నోట్ ఇస్తారని చెబుతున్నారు. -
ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. అఫిడవిట్‌లోని అంశాలు... ► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను తీసుకున్నాను ► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్‌చేశారు. ► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు. ► పార్లమెంట్లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్లోడ్ చేసేవాడిని. ► ఆమెకు రాహుల్ గాం«దీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా. ► ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు ► సుచేతా దలాల్, శార్దూల్ ష్రాఫ్‌లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేíÙంచిప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. -
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. అతడొక జూనియర్
కోల్‌కతా: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలో ఒక్కొక్క పార్టీ విభేదిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా చేరిపోయారు. వివాదం జరిగిన ఒక రోజు తర్వాత మమతా బెనర్జీ స్పందిస్తూ ఏమన్నారంటే.. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. నా దృష్టిలో ఉదయనిధి స్టాలిన్ చాలా జూనియర్. ఆయన ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారన్నది నాకు తెలియదు. అన్ని మతాలను గౌరవించాలన్నది నా అభిప్రాయం. నాకు తమిళనాడు ప్రజలంటే అమితమైన గౌరవం. కానీ వారు అన్ని మతాలను సమానంగా గౌరవించాలని కోరుతున్నాను. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. నాకు సనాతన ధర్మం మీద అపార గౌరవముంది. వేదాల నుంచే మనం అన్నీ నేర్చుకున్నాము. పౌరోహిత్యాన్ని గౌరవించుకుంటాము.. పౌరోహిత్యం చేస్తున్న వారికి పెన్షన్లు కూడా ఇస్తున్నాము. దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మనమంతా దేవాలయాలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, చర్చిలకు కూడా వెళ్తుంటాం. భారతదేశ మూలాల నుంచి గమనిస్తే భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇక్కడ అనాదిగా కొనసాగుతూ వస్తోంది. దాన్ని మనం గౌరవించాలని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం పరిణామ క్రమంలో వృద్ధి చెందుతున్న 'ఇండియా' కూటమిపైన పడే అవకాశమున్నందున ఇప్పటికే ఈ కూటమిలోని పార్టీలు నష్ట నివారణ చర్యలు చేపట్తాయి. కాంగ్రెస్ పార్టీ తమకు అన్ని మతాలపైనా గౌరవముందని ప్రకటించగా.. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదించింది. తాజాగా మమతా బెనర్జీ కూడా ఈ జాబితాలో చెరిపియారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా? -
కమ్యూనిస్టుల కంచుకోటనే కూల్చేశా.. మీరెంత?
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ యూత్ వింగ్ నిర్వహించిన ర్యాలీ సందర్బంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే నిరంకుశత్వం రాజ్యమేలుతుందని ఈ ఏడాది చివర్లోగాని వచ్చే ఏడాది ప్రారంభంలో గాని లోక్‌సభ ఎన్నికలు ఉంటాయని అధికార బీజేపీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రత్యర్ధులు గెలుపుకోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తారని.. ఇటీవల పర్గణాస్ జిల్లా 24 నార్త్‌లో బాణాసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం లాంటి దురాగతాలకు పాల్పడటానికి కూడా వెనకడుగు వేయరని. అలాంటివారికి వారికి కొంతమంది పోలీసులు కూడా సహకరిస్తుండటం సరికాదన్నారు. చాల మంది పోలీసులు తమ పనిని తాము చిత్తశుద్ధితో చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రమే దుష్టశక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు. ర్యాగింగ్ నిరోధక విభాగం ఉన్నట్లే అవినీతి నిరోధక విభాగం కూడా ఉందని వారికి గుర్తు చేస్తున్నానన్నారు. కాషాయం బాణాసంచాతో ఏమి ప్రయోజనం ఉంటుంది? పచ్చ బాణాసంచాతో అయితే వాతావరణానికి కూడా మేలు కలుగుతుంది కదా అన్నారు. ఇప్పటికే కాషాయ పార్టీ ఎన్నికల కోసం తన అమ్ములపొదిలో అస్త్రాలన్నిటినీ సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే వారు దేశమంతటా మత విద్వేషాలు రెచ్చగొట్టారు. మళ్ళీ వారు అధికారంలోకి వస్తే దేశాన్ని ద్వేషపూరితంగా మార్చేస్తారు. బీజేపీ ఇతర పార్టీల వారికి అవకాశం లేకుండా ఎన్నికల కోసం మొత్తం హెలికాఫ్టర్లన్నిటినీ బుక్ చేసేశారన్నారు. ఇదే క్రమంలో ఆమె బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ని కూడా లక్ష్యం చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వొద్దు. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాలు రాజ్యమేలిన కమ్యూనిస్టుల కంచుకోటకు బీటలు వారేలా చేసిన ఘనత నాదని పరోక్షంగా గవర్నర్‌ని ఉద్దేశించి అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో 'గోలీ మారో' అంటూ నినాదాలు చేస్తున్న ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను కటకటాలోకి నెట్టామని, మళ్ళీ లాంటి నినాదాలు చేసేవారంతా ఇది యూపీ కాదు బెంగాల్ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇది కూడా చదవండి: ఆ లెక్చరర్ని ఎందుకు సస్పెండ్ చేశారు.. సుప్రీంకోర్టు -
దేశంలో ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయంటే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: సీపీఐకి జాతీయ హోదాను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపట్టారు. దీనిపై అప్పీలుకు వెళతామని ప్రకటించారు. త్వరలో జాతీయ హోదా పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వందేళ్ల చరిత్ర ఉన్న సీపీఐ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొన్నదని, ఈసీ నిర్ణయం విచారకరమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈసీ కేవలం సాంకేతిక అంశాలనే పరిగణనలోకి తీసుకుందన్నారు. అయినా సీపీఐ ప్రజల్లో ఉంటుందని, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటుందని ప్రకటించారు. ఇక సీపీఐకి జాతీయ హోదా రద్దు, ఆప్‌కు హోదా ఇవ్వడంలో రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఆప్‌కు జాతీయ పార్టీ హోదా కట్టబెట్టారని ఆరోపించారు. జాతీయ పార్టీగా సీపీఐకి ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, దాన్ని ఎవరూ చెరిపివేయలేరని పేర్కొన్నారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించిన విషయం తెలిసిందే. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కనబర్చిన పనితీరు ఆధారంగా ఆప్‌కు జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లకు ఇప్పటిదాకా ఉన్న జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్కు, ఉత్తరప్రదేశ్‌లో ఆర్ఎల్డీ, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమబెంగాల్లో ఆర్ఎస్సీ, మణిపూర్‌లో ఎంపీసీ పార్టీలకు ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక నాగాలాండ్‌లో ఎన్సీపీ, మేఘాలయలో టీఎంసీలకు త్వరలో రాష్ట్ర పార్టీ హోదా కల్పించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. నాగాలాండ్‌లో లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్), మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ, త్రిపురలో తిప్రా మోతా పార్టీలకు ‘గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీ’ హోదా ఇస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు, సమీక్షల తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించింది. ప్రస్తుతం జాతీయ పార్టీలు ఆరు ఎన్నికల సంఘం తాజా చర్యల మేరకు ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉన్నట్టయింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. ► జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్ కేజ్రీవాల్ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. అతి తక్కువ సమయంలోనే తమ పార్టీకి జాతీయ హోదా దక్కడం పట్ల కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ►1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది. ►జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచి్చంది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది. ►శరద్‌పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్సరంలో జాతీయ హోదా లభించింది. తర్వాత ప్రభావం తగ్గిపోయింది. ఏపీలో పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్కు హోదా రద్దు తెలంగాణ ఏర్పాటు నినాదంతో 2001లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ఏర్పాటైంది. 2004 సాధారణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ హోదా కోసం తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ 16 చోట్ల బరిలోకి దిగింది. తెలంగాణలో ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంతోపాటు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకశాతం ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో 2004 ఎన్నికల తర్వాత రాష్ట్ర పార్టీ హోదా దక్కింది. 2009 సాధారణ ఎన్నికలతోపాటు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఏ ఇతర ఎన్నికల్లోనూ ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. అయినా ఉమ్మడి రాష్ట్రంనాటి రాష్ట్ర హోదా గుర్తింపు.. విభజన తర్వాత కూడా ఏపీలో కొనసాగింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం సమీక్షలో ఆ హోదాను కోల్పోయింది. -
వ్యూహం మార్చుకున్న టీఎంసీ.. బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరమైనట్లేనా?
కోల్‌కతా: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయిన తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంది. ఇకపై బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించనుంది. అవంటే గిట్టని ప్రాంతీయ పార్టీలతో మరో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ‘బీఆర్ఎస్, ఆప్ తదితర పార్టీలతో చర్చలు ప్రారంభించాం. మా వ్యూహమేంటో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలుస్తుంది’ అని టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి టీఎంసీ సాయం చేస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఎం నేతలు విమర్శలు గుప్పించడంతో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. -
ఇక నమ్మలేం! ఒంటరిగానే పోటీ చేస్తాం: మమత శపథం
పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్ జిల్లాలోని సాగర్డిఘి ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్, సీపీఎంలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మహా ప్రతి పక్ష కూటమి ఆశకు ఎదురు దెబ్బతగలడంతో ఒక్కసారి మమతా ఆయా పార్టీలపై ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్, సీపీఎంల అపవిత్ర పొత్తులను మరోసారి బహిర్గతం చేసిందంటూ మండిపడ్డారు. తమ పార్టీ మూడు ప్రత్యర్థి రాజకీయ శక్తులతో ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ శపథం చేశారు. అయినా బీజేపీతో ఉన్న కాంగ్రెస్, సీపీఎంలతో చేరితే మమ్మల్ని బీజేపి వ్యతిరేకి అని ఎలా పిలుచుకుంటారని ప్రశ్నించారు. వారంతా కమ్యూనల్ కార్డ్ ఆడుతున్నారు. సాగర్దిఘిలో ఓటమే మాకు గుణపాఠం ఇకపై కాంగ్రెస్‌ని సీపీఎంని నమ్మేదే లేదని తేల్చి చెప్పారు.అయినా బీజేపీతో ఉన్న పార్టీలతో వెళ్లలేం అన్నారు. మా పొత్తు ప్రజలతోనేనని కరాఖండీగా చెప్పారు. సాగర్దిఘి ఉప ఎన్నికల్లో టీఎంసీ ఓటమి గురించి మాట్లాడుతూ.."మేము ఎన్నికల్లో ఓడిపోయాం. ఎవరినీ నిందించను ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఐతే ఇందులో ఇద్దరి మద్ద జరిగిన అనైతిక పొత్తు కారణంగా ఓట్లన్నీ కాంగ్రెస్‌కి పడ్డాయి. అదీగాక మేఘాలయ ఎన్నికల్లో కొంత గందరగోళం కూడా నెలకొంది. రెండు పార్టీలకు కాంగ్రెస్ అనే పదం కామన్‌గా ఉండటంతో తాను కాంగ్రెస్‌తోనే ఉన్నానని ఓటర్లు భావించారు. నేను కాంగ్రెస్‌లో ఉన్నందున, కాంగ్రెస్ రోజలు నుంచి నా చిత్రాన్ని వారితో చూడటంతో ఓటర్లు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయినప్పటికీ మేఘాలయలో టీఎంసీ ఐదు సీట్లు గెలిచేందుకు సాయం చేశారు. అందుకు అభినందనలు. టీఎంసీ ఆరు నెలల క్రితమే మేఘాలయలో ప్రచారం ప్రారంభించినప్పటికీ పోలైన మొత్తం ఓట్లలో 15శాతం సాధించాం. వచ్చే ఎన్నికల్లో మరింత రాణిస్తాం." అని మమత ధీమాగా చెప్పారు. కాగా, ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం..త్రిపురలో.. బీజేపీ మెజారిటీ మార్కును దాటి 32 సీట్లు గెలుచుకోగా.. కలిసి పోటీ చేసిన సీపీఎం, కాంగ్రెస్‌లు ఏకంగా 14 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) ఒక్క సీటును గెలుచుకుంది. అయితే, త్రిపురలో టీఎంసీ ఖాతా తెరవలేకపోయింది. (చదవండి: తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ) -
మేఘాలయలో ముక్కోణం
ఈశాన్య భారత్‌లో గిరిజన ప్రాబల్యం కలిగిన మేఘాలయాలో శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పాత ప్రత్యర్థులైన కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మళ్లీ హోరాహోరీగా తలపడుతున్నారు. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నేతృత్వం వహించి, 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నుంచి బరిలోకి దిగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. కిందటిసారి పోటీలో లేని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతుండడం విశేషం. 2018లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికార పీఠానికి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులంటూ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ఎన్పీపీకి కాన్రాడ్ సంగ్మా, తృణమూల్ కాంగ్రెస్‌కు ముకుల్ సంగ్మా, కాంగ్రెస్‌కు విన్సెంట్ పాలా, బీజేపీకి ఎర్నెస్ట్ మారీ నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా ఎన్పీపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది. అంతర్గత లుకలుకలతో అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమైంది. కూటమిలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ), యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఎండీఏలో అతిపెద్ద పార్టీ అయిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మరోసారి కుర్చీ దక్కించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే మేఘాలయలో 2013 తర్వాత వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న తొలి పార్టీగా ఎన్పీపీ రికార్డుకెక్కుంది. 18 మంది రాజీనామా 2018లో కేవలం 20 సీట్లు గెలుచుకున్న ఎన్పీపీ.. యూడీపీ(6 సీట్లు), హెచ్ఎస్పీడీపీ(2 సీట్లు), పీడీఎఫ్(4 సీట్లు), బీజేపీ(2 సీట్ల)తోపాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఎమ్మెల్యేల గోడదూకుళ్లు తదితరాలతో బలాబలాలు మారుతూ వచ్చాయి. 2021 నవంబర్‌లో ముకుల్ సంగ్మా నేతృత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకుండాపోయారు. ఇటీవలే 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు, సొంత పార్టీలకు రాజీనామా చేశారు. టిక్కెట్లపై హామీ ఇచ్చే పార్టీలో చేరి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తృణమూల్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ వీరిలో ఉన్నారు. గిరిజన రాష్ట్రమైన మేఘాలయకు ప్రత్యేక హోదా ఉంది. దాంతో రాష్ట్రంలో ఖర్చు చేసే నిధుల్లో 90 శాతానికిపైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంటాయి. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి రాజకీయాలను చాలావరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. చిన్నాచితక పార్టీలు ఏదో ఒక నినాదంతో ఎన్నికల్లో పోటీ చేయడం, ఒకటో రెండో స్థానాలు గెలుచుకొని, ఫలితాల అనంతరం నెంబర్ గేమ్‌లో వీలైనంత మేరకు లబ్ధి పొందడం పరిపాటిగా మారింది. మళ్లీ మాదే అధికారం: ఎన్పీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టించిందని, అందుకే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నామని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం లేదని, తాము మళ్లీ నెగ్గడం ఖాయమని ఎన్పీపీ రాష్ట్ర అధ్యక్షుడు డబ్ల్యూ.ఖార్లుఖీ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభావితం చేసే అంశాలేమిటి? ప్రభుత్వ వ్యతిరేకత: కాన్రాడ్ సంగ్మా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుండడం, నిధుల లేమితో ఆరోగ్య రంగం కునారిల్లుతుండడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారింది. సరిహద్దు రగడ: మేఘాలయ–అస్సాం నడుమ సరిహద్దు వివాదం రగులుతోంది. రెండు రాష్ట్రాల్లో సరిహద్దులో ఉన్న పలు తెగల మధ్య హింసాకాండ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని జనం ఆరోపిస్తున్నారు. కూటమి విచ్ఛిన్నం: అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమై, పార్టీలు సొంతంగా పోటీ చేస్తుండడం ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Manoj Tiwary: పుష్ప డైలాగ్ కొట్టాల్సింది కాదు!
కోల్‌కతా: సినిమా డైలాగులు పేల్చడం రాజకీయ నాయకులకు ఈమధ్య బాగా అలవాటైంది. అయితే పంచ్ కోసం పేలుస్తున్న ఆ డైలాగులు.. ఒక్కోసారి బెడిసి కొడుతున్నాయి కూడా. తృణమూల్ కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ తాజాగా అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలోంచి కొట్టిన డైలాగ్.. బీజేపీకి బాగా కోపం తెప్పించింది. మొత్తం బెంగాల్ ప్రభుత్వం తీరే పుష్ప సినిమాలాగా ఉంది. ఎర్ర చందనపు స్మగర్ల సినిమాలో ఏవో డైలాగులు కొడితే.. ఇక్కడి టీఎంసీ నేత కూడా అలాగే డైలాగులు కొడుతున్నాడు. ఒకరేమో యువత హక్కులను దోచుకుంటున్నారు. మరొకరేమో స్కామ్‌లు చేసి వాళ్ల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. టీఎంసీ నేతల తీరు.. ఆ సినిమాలోని ఎర్ర చందనపు స్మగ్లర్లలాగే ఉంది. వాళ్లతో పాటు ఆ పార్టీ ఒరిజినల్ క్యారెక్టర్లను బయటపెడుతోంది అంటూ బీజేపీ నేత ఉమేశ్ రాయ్ మండిపడ్డారు. క్రికెటర్ నుంచి రాజకీయ నేత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా ఎదిగిన మనోజ్ తివారీ.. ఆదివారం ఓ ర్యాలీలో పార్టీ కార్యకర్తలంతా సంఘటితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ సాలా' (తెలుగులో నీయవ్వ.. తగ్గేదే లే) అంటూ బీజేపీకి సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ భగ్గుమంది. అయితే.. ర్యాలీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మీడియా ప్రతినిధులు ఆయన తీరును ప్రశ్నించారు. దీంతో ఆయన నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ఆ డైలాగ్ కొట్టాల్సింది కాదు అని తివారీ క్షమాపణలు చెప్పారు. -
రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు.. తగ్గేదెలే! అంటున్న బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదంపై పశ్చిమబెంగాల్ బీజేపీ నిరసనలు ఉధృతం చేసింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిల్ గిరిని పదవి నుంచి తప్పించాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ అంశానికి సంబంధించి క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ డిమాండ్ చేశారు. బహిరంగ సభల్లో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసమని భారీ స్పీచ్‌లు దంచికొట్టే తృణమూల్ నేతల అసలు స్వరూపం బయటపడిందని ఆమె ధ్వజమెత్తారు. అఖిల్ గిరిపై ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలిస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ కూడా జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అఖిల్ గిరిని తక్షణమే అరెస్టు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్యేగా కూడా ఆయనను డిస్మిస్ చేయాలని అన్నారు. (చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ.. ఏమన్నారంటే?) వివాదమేంటి? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో క్లిప్ ప్రకారం.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారిపై విమర్శలు చేసే క్రమంలో బెంగాల్ మంత్రి అఖిల్ గిరి.. దేశ రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘సువేంధు అధికారి నా రూపం గురించి వ్యాఖ్యానిస్తారు. నేను చూడ్డానికి బాగుండనట. నువ్వెంత అందంగా ఉన్నావ్. మనిషి రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు. ఎవరెలా ఉన్నా వారికిచ్చే గౌరవ మర్యాదలు వారికివ్వాలి. మన రాష్ట్రపతి చూడ్డానికి ఎలా ఉంటారు.. అయినా ఆమెను గౌరవిస్తున్నాం కదా’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. అయితే, తన తప్పును తెలుసుకున్న మంత్రి అఖిల్ గిరి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. కానీ, బీజేపీ నాయకులు మాత్రం తగ్గడం లేదు. మంత్రిని పదవి నుంచి తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇక వివాదం ముదరడంతో గిరి వివరణ ఇచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని గౌరవిస్తానని ఆయన అన్నారు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం సువేంధు అధికారి తనను ఉద్దేశించి కొన్ని బాధాకరమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. తన రూపు గురించి మాట్లాడి దారుణంగా అవమానించారని, వయసులో పెద్దవాడిననే కనీస గౌరవం లేకుండా బాధపెట్టారని గిరి చెప్పుకొచ్చారు. ‘బాధ, కోపం వల్లే సువేంధు అధికారిని విమర్శించాలని అనుకున్నా.. ఆ క్రమంలోనే పొరపాటుగా రాష్ట్రపతికి ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడా’ అని పేర్కొన్నారు. ఇక బీజేపీ నాయకుల విమర్శలపై తృణమూల్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే స్పందించారు. బీజేపీ నేతల తీరు ఆమోదయోగ్యం కాదని అన్నారు. తమ పార్టీ రాష్ట్రపతికి అపారమైన గౌరవం ఇస్తుందన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: భారీ షాకిచ్చిన కేంద్రం.. 10 లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఇదే!) -
‘బీజేపీలో చేరలేదనే గంగూలీపై కక్ష సాధింపు’
కోల్‌కతా: భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారనే వార్తను వ్యాప్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షాను బీసీసీఐ సెక్రెటరీగా రెండో టర్మ్ కొనసాగిస్తూ గంగూలీకి అధ్యక్షుడిగా మరోమారు అవకాశం ఇవ్వకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అది రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. ‘సౌరవ్ గంగూలీని పార్టీలో చేర్చుకుంటున్నట్లు బెంగాల్ ప్రజల్లో ఓ వార్తను వ్యాప్తి చేయాలని బీజేపీ కోరుకుంటోంది. ఈ విషయంపై మేము నేరుగా మాట్లాడాలనుకోవట్లేదు. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత అలాంటి వార్తల వ్యాప్తికి బీజేపీ ప్రయత్నించిన క్రమంలోనే మాట్లాడుతున్నాం. బీసీసీఐ చీఫ్‌గా రెండోసారి గంగూలీని కొనసాగించకపోవటం వెనుక రాజకీయాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. సౌరవ్‌ను అవమానించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.’ అని తెలిపారు ఘోష్. ఈ ఏడాది మే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గంగూలీ ఇంటికి వెళ్లటం వెనుక అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితులపై మాట్లాడటానికి గంగూలీనే సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. మరోవైపు.. గంగూలీకి మద్దతు తెలిపారు టీఎంసీ ఎంపీ సాంతాను సేన్. బీసీసీఐ అధ్యక్షుడిగా రెండాసారి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఖండించిన బీజేపీ.. సౌరవ్ గంగూలీ విషయంలో టీఎంసీ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. గంగూలీని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించిందో తమకైతే తెలియదన్నారు. బీసీసీఐ చీఫ్ మార్పుపై కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటం టీఎంసీ మానుకోవాలని హెచ్చరించారు. ఇదీ చదవండీ: Sourav Ganguly: గంగూలీ కథ ముగిసినట్లే..! -
వీడియో: స్పెషల్ అట్రాక్షన్.. క్లాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన మహిళా ఎంపీ
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్లో సైతం అమ్మవారి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అయితే, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్‌లోని నదియా జిల్లాలో దుర్గా పూజ ఉత్సవాల్లో మహాపంచమి వేడుకల సందర్భంగా టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డ్యాన్స్ చేసిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను టీఎంసీ ఎంపీ.. ఆమె ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా వీడియోకు లవ్లీ మూవ్మెంట్స్ ఫ్రమ్ మహాపంచమీ వేడుకలు అన్ని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియోలో బెంగాలీ జానపద గీతానికి టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర చేసిన డ్యాన్స్ స్టెప్స్ అందరినీ అలరించాయి. మహాపంచమి వేడుకల సందర్భంగా పాటను ఆలపిస్తూ చేసిన డ్యాన్స్ హైలైట్ అని చెప్పవచ్చు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Lovely moments from Mahapanchami celebrations in Nadia pic.twitter.com/y0mkbhGGiC — Mahua Moitra (@MahuaMoitra) September 30, 2022 -
అమిత్ షాపై దారుణంగా ట్రోల్స్
బెంగాల్ టీఎంసీ నేతలు, బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. కొద్దిరోజులుగా బెంగాల్‌లోని టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టార్గెట్ చేసి టీఎంసీ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్‌లోని పలువురు మంత్రులను టార్గెట్ చేయడంతో అమిత్ షాను ‘ఇండియాలోనే అతిపెద్ద పప్పు’ అని అన్నారు. అభిషేక్.. అమిత్ షాను కామెంట్ చేసిన అనంతరమే.. దేశంలోనే అతిపెద్ద పప్పు అనే క్యాప్షన్ ఉన్న టీ-షర్టులను టీఎంసీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అభిషేక్ బెనర్జీ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకసారి ఢిల్లీ నేరాల రేటు చూడండి. కోల్‌కతాలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని మీ స్వంత ఏజెన్సీ తెలిపింది. ఢిల్లీ పోలీసులు మాత్రం హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నారు. అయినా అక్కడ క్రైమ్ రేట్ ఏ స్థాయిలో ఉందో చూడండి. అమిత్‌షా అందరికీ జాతీయవాదాన్ని బోధిస్తారు. కానీ తన కొడుకు బీసీసీఐ కార్యదర్శి జై షాకి మాత్రం జాతీయ జెండా పట్టుకోవడంలో ఇబ్బంది ఉంది. ముందుగా అతనికి నేర్పించండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా జై షా జాతీయ జెండాను ఊపేందుకు నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా.. “మాకింగ్ అనేది కమ్యూనికేట్ చేయడంలో అత్యంత శక్తివంతమైన రూపం. ఇది మా జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్య నుంచి ప్రారంభమైంది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అది టీ-షర్టులపైకి వచ్చింది” అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు. కాగా, టీ షర్టులు తెలుపు, పసుపు, బ్లాక్ రంగుల్లో వస్తున్నాయని వీటిని ఆన్లైన్ నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. టీ షర్టు ధరను రూ. 300గా నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. You cannot give someone a title just because you feel like it. The person must truly deserve it! Listen to the many reasons why this gentleman has truly EARNED the title #IndiasBiggestPappuAmitShah VIDEO 👇 pic.twitter.com/vGHsyAjR5Z — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) September 5, 2022 -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్
అగర్తలా: దేశవ్యాప్తంగా పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ ఉద్ధండులు తాము ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, గుర్తింపు తెచ్చుకుని ఉన్నఫలానా గుడ్ బై చెబుతున్నారు. తాజాగా త్రిపురలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. టీఎంసీకి ఆ పార్టీ సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. వివరాల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) త్రిపుర యూనిట్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ ఖాన్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంసీ రాష్ట్ర ఇన్ఛార్జ్కు అందించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో.. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. టీఎంసీ పార్టీ ఉపాధ్యక్ష పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, టీఎంసీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా సుబల్ భౌమిక్‌ని తొలగించిన కొద్ది రోజులకే ఇలా.. బాసిత్ ఖాన్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, సుబల్ భౌమిక్‌ను పార్టీ అత్యున్నత స్థానం నుంచి తొలగించడంపై పార్టీ అధిష్టానం ఎటువంటి కారణం చెప్పకుండానే బాధత్యల నుంచి తొలగించింది. మరోవైపు.. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉండగా.. టీఎంసీకి, మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. The vice-president of the #Tripura unit of TMC, Abdul Basit Khan, resigned from the party. (@RittickMondal)https://t.co/rYeBLZiYWp — IndiaToday (@IndiaToday) August 28, 2022 -
బీజేపీ జంప్‌జిలానీ ఎమ్మెల్యేకు ఈడీ షాక్?
ఢిల్లీ/కోల్‌కతా: టీచర్ల నియామక కుంభకోణం ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ సస్పెండెడ్ మంత్రి పార్థ ఛటర్జీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. పార్థకు దగ్గరి సంబంధాలున్న అర్పితా ముఖర్జీ ఇంట నోట్ల గుట్టలు వెలుగు చూడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. ఇప్పుడు దర్యాప్తు సంస్థ లిస్ట్‌లో మరో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, రాయ్‌గంజ్ టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అతిత్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. కృష్ణ కళ్యాణి.. కళ్యాణి సోల్వెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఫుడ్ మ్యానుఫ్యాక్చురింగ్ కంపెనీని నడుపుతున్నారు. అయితే కోల్‌కతాకు చెందిన రెండు ఛానెల్స్‌తో ఆయన కంపెనీ నిర్వహిస్తున్న లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కంపెనీ ఆర్థిక లావాదేవీలపై గత కొంతకాలంగా ఈడీ నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో.. రేపో, మాపో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేయొచ్చని ఈడీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే.. 2021లో బీజేపీ టికెట్ తరపున గెలుపొందిన కృష్ణ కళ్యాణి.. పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలోకి మారిపోయారు. ఆ టైంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఆయనపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రస్తుతం టీఎంసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ బాధ్యతలు వహిస్తున్నారు ఈయన. 2016లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలో టీచర్ నియామకాల అవకతవకలకు పాల్పడినట్లు పార్థా ఛటర్జీపై ఆరోపణలు వెల్లువెత్తగా.. ఆయన సన్నిహితురాలు.. నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ. 50 కోట్లకు పైగా నగదు, ఐదు కేజీలకు పైగా బంగారం బయటపడింది. అదంతా మంత్రి పార్థా ఛటర్జీ సొమ్మేనని, ఆయన తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకునే వాడంటూ అర్పిత వాంగ్మూలం ఇచ్చింది. ఇక రాజకీయ విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిడితో ఆయనపై వేటు వేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఇదీ చదవండి: బొగ్గు కుంభకోణంలో మాజీ కార్యదర్శి దోషే: కోర్టు -
Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత
కోల్‌కతా: కాళీమాతను అవమా నిస్తూ విదేశంలో ఒక డాక్యుమెంటరీ పోస్టర్ వెలిసిన వివాదం ముదిరిన వేళ తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి’ అని మంగళవారం కోల్‌కతాలో ఇండియాటుడే సదస్సులో వ్యాఖ్యానించారు. ‘సిక్కింలో కాళీమాతకు విస్కీని కానుకగా సమర్పిస్తారు. అదే యూపీలో ఇది తీవ్రమైన దైవదూషణ. అదే బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో కాళీమాతను ఆరాధించే తారాపీఠ్ శక్తిపీఠం వద్ద సాధువులు ఎప్పుడూ ధూమపానం చేస్తూ కనిపిస్తారు. నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి. నాతో సహా ప్రతి ఒక్కరికీ నచ్చిన దైవాన్ని నచ్చినట్లు ఆరాధించే హక్కుంది’ అని మొయి త్రా అన్నారు. మొయిత్రా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీ అభి ప్రాయంగా భావించాలేమో అంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. మొయి త్రా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఎంసీ తర్వాత ట్వీట్‌చేసింది. మణిమేఖలైపై కేసులు నమోదు కాళీమాత వేషధారణలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చూపే డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఆన్లైన్లో పోస్ట్చేసిన మధురైకి చెందిన దర్శకురాలు లీనా మణిమేఖలైపై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు మంగళవారం కేసు నమోదుచేశారు. ‘కాళీ’పోస్టర్ ప్రొడ్యూసర్ ఆశా అసోసియేట్స్, ఎడిటర్ శ్రవణ్ ఓనచంద్, మణిమేఖలైపై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చదవండి: (కాంగ్రెస్‌లో చేరినవారికి టికెట్ల హామీ ఇవ్వట్లేదు) -
మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!!
-
Shatrughan Sinha: బీహారీ బాబు.. చారిత్రక విజయం
అలనాటి బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా .. భారీ విజయం అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2 లక్షలకు పైచిలుకు ఓట్లతో ఆయన ఘన విజయం సాధించినట్లు సమాచారం. విశేషం ఏంటంటే.. అసన్సోల్ లోక్‌సభ స్థానాన్ని టీఎంసీ దక్కించుకోవడం ఇదే తొలిసారి. ► పాట్నాలో పుట్టి, పెరిగి.. రాజకీయాల్లో బీహారీ బాబుగా పేరు ముద్రపడ్డ 76 ఏళ్ల సిన్హా.. రాజకీయ జీవితం కూడా సంచలనమే!. ► అలనాటి బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా.. 80వ దశకంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► వాజ్‌పేయి-అద్వానీల కాలంలో.. స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీకి ఆయన ప్రచారం చేశారు. ► ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. పాట్నా సాహిబ్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి కేబినెట్లో శత్రుఘ్న సిన్హా కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ► అయితే పార్టీతో విభేధాలతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ► 2019 సార్వత్రిక ఎన్నికల్లో.. పాట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. రవి శంకర్ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ► అభిమానులు ముద్దుగా షాట్‌గన్ అని పిలుచుకునే శతృఘ్నసిన్హాకు.. రాజకీయాల్లోనూ రెబల్ స్టార్‌గా గుర్తింపు ఉంది. బీజేపీ ఎంపీగా ఉన్న రోజుల్లోనే ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించిన సందర్భాలు ఎన్నో. ► ఎంపీగా ఉన్న.. బాబుల్ సుప్రియో బీజేపీని వీడి టీఎంసీలో చేరడంతో అసన్సోల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ► ఎన్నికల ప్రచారంలో బీజేపీ.. టీఎంసీ అభ్యర్థి శతృఘ్నసిన్హాను బయటి వ్యక్తిగా ప్రచారం చేసింది. అయితే బెంగాలీలకు ఏమాత్రం వ్యక్తిని తాను అని గట్టిగానే ప్రచారం చేసుకున్నారాయన. ► అసన్సోల్ బరిలో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ను చిత్తుగా ఓడించారు శతృఘ్నసిన్హా. ► శత్రుఘ్న సిన్హాపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అలాగే తనదైన శైలిలో గాంభీర్యమైన ప్రసంగాలతో జనాలను ఆకట్టుకోగలిగారు శత్రుఘ్న సిన్హా. :::సాక్షి వెబ్‌డెస్క్ -
దీదీ పాలన హింసాత్మకమంటూ గవర్నర్ సీరియస్
కోల్‌కతా: బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బేనర్జీ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘బెంగాల్లో హింసాత్మకమైన పాలన సాగుతోంది. భయంకరమైన హింసాత్మక ఘటనలు, సజీవ దహనాలు చూస్తుంటే అదే సత్యమనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఓ నివేదికను అడిగాను. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్విటర్లో విడుదుల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో సోమవారం బర్షల్ గ్రామ పంచాయితీ డిప్యూటీ చీఫ్ తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత బాదు షేక్ బాంబు దాడిలో మరణించారు. అదేరోజు అర్ధరాత్రి చెలరేగిన హింసలో అల్లరి మూకలు 10 ఇళ్లకు నిప్పంటించారు. ఈ హింసాత్మక ఘటనలో 8 మంది మృతి సజీవ దహనమయ్యారు. టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి పాల్పపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Horrifying violence and arson orgy #Rampurhat #Birbhum indicates state is in grip of violence culture and lawlessness. Already eight lives lost. Have sought urgent update on the incident from Chief Secretary. My thoughts are with the families of the bereaved. pic.twitter.com/vtI6tRJcBX — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) March 22, 2022 -
బెంగాల్లో టీఎంసీ వర్గపోరు?.. ఏడుగురి మృతిపై అనుమానాలు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో సోమవారం బర్షల్ గ్రామ పంచాయితీ డిప్యూటీ చీఫ్ తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత బాదు షేక్ బాంబు దాడిలో మరణించారు. అయితే ఆయన మరణించిన కొద్దిగంటల్లో చోటు చేసుకున్న ఓ అగ్నిప్రమాదంలో ఏడుగురు చనిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తృణమాల్ కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి చెందిన వాళ్లే.. ఆ ఇంటికి నిప్పటించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్ మాత్రం షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పైగా ఆయన అంతర్గత తగాదాలు, ప్రతీకార దాడుల వంటివి ఏం జరగలేదని ఆ ఆరోపణలన్నింటిని ఆయన ఖండించారు. సుమారు 10 ఇళ్లు మంటల్లో చిక్కుకున్నట్లు అగ్రిమాపక సిబ్బంది తెలిపింది. పైగా ఒకే ఇంట్లో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఏడు మృతదేహాలు లభించాయని వెల్లడించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సూపరింటెండెంట్ నాగేంద్ర నాథ్ త్రిపాఠి ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా మాత్రమే అగ్నిప్రమాదానికి గల కారణాలను నిర్ధారించగలమని చెప్పారు. ముసుగులు ధరించి మోటార్‌సైకిళ్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు షేక్‌పై దాడి చేశారని స్థానికులు చెబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య వైరం కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోందన్నారు. హత్య అనంతరం పలు ఇళ్లను కూడా ధ్వంసం చేశారని చెప్పారు. సీఐడీ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారించడం మొదలు పెట్టింది. బాదు షేక్ సోదరుడు బాబర్ షేక్ కూడా ఏడాది క్రితం ఇదే గ్రామంలో హత్యకు గరైయ్యారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు టీఎంసీ బ్లాక్ యూనిట్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్ పార్టీ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని, ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు సమిక్ భట్టాచార్య పిలుపునిచ్చారు. ఈ తరహా అనాగరిక దాడులు మధ్య యుగాలలో జరిగేవని అన్నారు. (చదవండి: రోడ్డు దాటుతున్న బాలిక.. అంతలో బీబీఎంపీ లారీ వచ్చి..) -
ఆట ఇంకా అయిపోలేదు: సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా: ఇటీవల నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ.. ఆట ఇంకా అయిపోలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించండం అంత సులభం కాదని తెలిపారు. దేశంలో మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో సగం కూడా బీజేపీకి లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత రాష్ట్రపతి ఎన్నికల మాదిరి ఈసారి అంత ఈజీ కాదని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమిపాలైనప్పటికీ గతంతో పోల్చితే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య అధికంగానే ఉందని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలు పరోక్షంగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభల్లోని ఎన్నికైన సభ్యుల(ఎమ్మెలేలు)తో కూడిన ఎలక్టోరల్ కళాశాల ద్వారా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఓట్ల విలువను నిర్ణయించడానికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటారు. 1971 నాటి మొత్తం జనాభాను ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందుకోసమే కేంద్రంలోని అధికార బీజేపీతో పోరాడటానికి సిద్ధమవుతోంది. -
తృణమూల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బెంగాల్లో వివాదాన్ని రేకెత్తిస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి బిహార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని బుక్ ఫెయిర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో టీఎంసీ ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి ప్రసంగిస్తూ.. ‘మీలో బెంగాలీ రక్తం ప్రవహిస్తే, ఖుదీరామ్, నేతాజీ(సుభాష్ చంద్రబోస్)ల రక్తం ప్రవహిస్తే.. మాతృభాషను, మాతృభూమిని ప్రేమిస్తే.. ఒక బీహార్ వ్యక్తి వంద వ్యాధులతో సమానం’ అని గట్టిగా అరవాలని వ్యాఖ్యానించారు. బెంగాలీలకు వ్యాధులు వద్దని, బెంగాల్‌ను వ్యాధి రహితంగా మార్చాలని పేర్కొన్నారు. తృణమూల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మాట్లాడిన వీడియో తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ యూపీ, బిహారిలు లేని పశ్చిమ బెంగాల్‌గా మార్చాలని అన్నారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మొదటిసారిగా 2021 బెంగాల్ ఎన్నికల్లో హుగ్లీ నుంచి గెలిచారు. First his leader @MamataOfficial labels Biharis & UPites as "Bohiragotos" & now this clarion call to make Bengal free of Biharis.@BJP4Bihar @BJP4India @renu_bjp @SanjayJaisw @girirajsinghbjp @BJP4Jharkhand@YashwantSinha @PavanK_Varma — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) March 14, 2022 -
తృణమూల్‌లో కాంగ్రెస్ విలీనం కావాల్సిందే: మమతా బెనర్జీ
-
తృణమూల్ ప్రభంజనం.. 102 మున్సిపాల్టీలు కైవసం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 10 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 108 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 102 మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను దక్కించుకుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీ 63.45 శాతం ఓట్లను సాధించింది. నాలుగు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారికి కంచుకోట అయిన కాంతీ మున్సిపాల్టీలో టీఎంసీ విజయం సాధించడం గమనార్హం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాల్టీని దక్కించుకుంది. తాహెర్‌పూర్ పురపాలక సంఘంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఎగురవేసింది. బీజేపీ కనీసం ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. వారణాసిలో నేడు, రేపు మమతా ప్రచారం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం కోల్‌కతా నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారు. -
టీఎంసీ కార్యవర్గం రద్దు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో నానాటికీ పెరిగిపోతున్న అసమ్మతిని, యువ–సీనియర్ విభేదాలను కట్టడి చేయడంపై పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో 20 మందితో నూతన జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్న మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు యువ, సీనియర్ నేతలకు స్థానం కల్పించారు. కొత్త కార్యవర్గాన్ని మమత త్వరలో ప్రకటిస్తారని సీనియర్ నాయకుడు పార్థ బెనర్జీ మీడియాకు తెలిపారు. భేటీలో అభిషేక్ కూడా పాల్గొన్నారు. తృణమూల్‌లో వృద్ధ, యువతరం నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అభిషేక్ నాయకత్వంలో యువ నేతలు ‘ఒక వ్యక్తికి ఒకే పోస్టు’ నినాదాన్ని తెరపైకి తేవడం తెలిసిందే. జోడు పదవుల్లో ఉన్న పలువురు సీనియర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
తృణమూల్‌లో ట్వీట్ చిచ్చు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌లో ‘వన్ పర్సన్, వన్ పోస్ట్’ ట్వీట్ దుమారం రేపుతోంది. దీనిపై పార్టీలో నాయకులు కొందరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అభిషేక్ బెనర్జీకి అనుకూలురైన నాయకులు ఈ పోస్టును సమర్ధిస్తూ మాట్లాడగా, పార్టీలో పాత కాపులు మాత్రం ఇదంతా క్రమశిక్షణా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐటీసీలో ఒక వ్యక్తికి ఒక పదవిని తాము సమర్థ్ధిస్తున్నామని అభిషేక్ సన్నిహితులు అదితి, ఆకాశ్ ట్వీట్ చేశారు. చాలా రోజులుగా ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలంటూ అభిషేక్ సూచిస్తున్నారు. అయితే పార్టీలో కొందరు సీనియర్లు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్‌పై కోల్‌కతా మేయర్‌గా, కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్న ఫిర్హాద్ హకీమ్ స్పందించారు. నాయకత్వాన్ని సంప్రదించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా తన అకౌంట్నుంచి ఎవరో ఇదే ఈ్వట్ చేశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల జాబితాలు ప్రకటించినప్పటినుంచి పార్టీలో నేతల మధ్య వివాదాలు మొదలయ్యాయి. అంతర్గత విభేదాలపై నేడు భేటీ పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల పరిష్కారంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శనివారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ కావాలని నిర్ణయించారు. మమత నివాసంలో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. భేటీకి కేవలం ఆరుగురు నేతలకు పిలుపు అందించినట్లు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, సెక్రెటరీ జనరల్ పార్థా చటర్జీ, పార్టీ బెంగాల్ విభాగం అధ్యక్షులు సుబ్రతా బక్షీ, మంత్రులు ఫిర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, చంద్రిమా భట్టాచార్యకు పిలుపు వెళ్లినట్లు తెలిసింది. పార్టీ నేతల మధ్య విభేదాలు ముదురుతుండడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడంపై మమతా బెనర్జీ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్న వారికి గట్టి సందేశం ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. -
‘కేంద్రం చరిత్రను మారుస్తోంది’
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చరిత్రనే మార్చేయడానికి ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొహువా మొయిత్రా దుయ్యబట్టారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. వర్తమానంపై అపనమ్మకం, భవిష్యత్తు పట్ల భయం కేంద్రం చర్యల్లో అడుగడుగునా కన్పిస్తున్నాయని, ఈ ప్రభుత్వం బారినుంచి దేశా న్ని కాపాడటం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. చదవండి: రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు: అమెరికా -
సాక్షి కార్టూన్ (04-02-2022)
-
ప్రధాన పార్టీలకు..వలసల దెబ్బ
గోవా రూటే సెపరేటు.. ఆ రాష్ట్రంలో ఫిరాయింపులు సర్వసాధారణం. అతి చిన్న రాష్ట్రమైన గోవాలో పార్టీ కంటే నాయకులే అత్యంత శక్తిమంతులు. పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాలు కూలదోయగలరు, వాటితోనే ప్రభుత్వాలను నిలబెట్టగలరు. ఇప్పుడు కూడా ఆయారామ్, గయారామ్ సంస్కృతి పెరిగి గందరగోళానికి దారితీస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గోవాలో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు దూకుతారో తెలియక అన్ని పార్టీలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెస్ హవా కొనసాగిన గోవాలో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో నాలుగు స్తంభాలాట (ఆమ్ ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడ బరిలోకి దిగింది) నెలకొంది. దీంతో నాయకుల పక్క చూపులు ఎక్కువయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువగా ఆపరేషన్ ఆకర్‡్ష నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో అత్యంత ప్రభావం చూపించే నాయకులపై వల విసురుతోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న తృణమూల్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సై అంటోంది. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి అయిన లూయీజిన్హో ఫలేయిరో 2021 సెప్టెంబర్‌లో తృణమూల్‌లో చేరడంతో ఈ ఫిరాయింపుల పర్వం మొదలైంది. వెంటనే ఆయన్ను రాజ్యసభకు పంపిన మమతా బెనర్జీ ఎవరొచ్చినా తగిన గౌరవం ఇస్తామని సంకేతాలు పంపారు. గోవా మరో మాజీ సీఎం, ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో కూడా పార్టీని వీడి టీఎంసీలో చేరారు. వీరిద్దరి రాకతో కేథలిక్కుల్లో తృణమూల్‌కు పట్టు లభించినట్టయింది. గత ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఇద్దరే మిగిలి ఉండడం పార్టీ దుస్థితిని చాటిచెబుతోంది. 2017లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, 2019లో ఏకంగా 10 మంది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. తర్వాత గత ఏడాది మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడారు. అధికార బీజేపీలో సొంత పార్టీ మంత్రులే అవినీతి ఆరోపణలు చేయడంతో ఆ పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతోంది. బీజేపీకి క్రిస్టియన్లు దూరమవుతున్నారా? గోవాలో బీజేపీ క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. కలంగుటే ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో బీజేపీకి రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. గోవాలో మెజార్టీ జనాభా హిందువులైనప్పటికీ 2011 లెక్కల ప్రకారం 25% క్రిస్టియన్లు ఉన్నారు. మనోహర్ పారిక్కర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్లను ఆకర్షించే కార్యక్రమాలు నిర్వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాలను గెలిస్తే వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు క్రిస్టియన్లు కావడం విశేషం. గత నెలలో కార్టోలిమ్ ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా బీజేపీకి రాజీనామా చేసి ఆప్‌లో చేరారు. మరో క్రిస్టియన్ ఎమ్మెల్యే వాస్కో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్లోస్ అల్మీదా కాంగ్రెస్‌లో చేరారు. ఇక వెలిమ్ ఎమ్మెల్యే, మంత్రి ఫిలిప్ నెరి, రోడ్రిగెజ్ ఎమ్మెల్యే బాబాసన్ త్వరలోనే బీజేపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి మైఖేల్ లోబో తన భార్య దలిలాకి కూడా టికెట్ ఆశించారు. అది వచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీని వీడారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఉత్తర గోవాకి చెందిన లోబోకు 5–6 నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతామన్న భయంతోనే వీరంతా రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మదర్ థెరిసా నెలకొల్పిన మిషనరీస్ ఆప్ చారిటీకి విదేశీ విరాళాల సేకరణకు లైసెన్స్ పునురుద్ధరించకపోవడం.. ఆపై విమర్శలు రావడంతో 15 రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓకే చెప్పడం తెలిసిందే. ఈ పరిణామాలు క్రిస్టియన్లలో బీజేపీపై ఆగ్రహం తెప్పించి ఉంటాయని ఈ నాయకులు భయపడుతున్నారు. అంతా గందరగోళం ఎమ్మెల్యేలు, నేతలు పార్టీలు మారుతుండటంతో ఎవరెక్కడ ఉన్నారోననే తీవ్రమైన గందరగోళం నెలకొంది. దీంతో ఓటర్లు ఎవరివైపు ఉంటారో చెప్పడం తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా సాధ్యం కావడం లేదు. ‘‘బీజేపీ తీవ్ర అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కానీ టీఎంసీ ఎన్నికల బరిలోకి రావడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి దెబ్బపడింది. గత ఎన్నికల్లో 6.3 శాతం ఓటు షేర్ సాధించిన ఆప్ క్రమంగా బలం పుంజుకుంటోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైతేనే అధికార బీజేపీని ఓడించగలరు’’ అని ఎన్నికల విశ్లేషకుడు క్లాఫాటో కౌంటిన్హో అభిప్రాయపడ్డారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
సీఎంకు వ్యతిరేకంగా గవర్నర్ మెసేజ్‌లు.. అనైతికమని ఎంపీ ఫైర్
కోల్‌కతా: తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గవర్నర్ తనకు మెసేజ్‌లు పంపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ స్థాయి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికమని విమర్శిచారు. తాను తృణమూళ్ కాంగ్రెస్ ఎంపీనని, సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అధినేత్రి అని అన్నారు. గవర్నర్‌ను ఎవరో వెనక ఉండి నడిపిస్తూ.. ఈ చర్యలకు పాల్పడాలని ప్రభావితం చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఇటీవల గవర్నర్ జగదీప్ ధంఖర్ బీజేపీ నేతలు కేంద్రమంత్రి అమిత్ షా, సువేందు అధికారిని కలిసిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మెసేజ్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం బెంగాల్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
Mamata Banerjee: కోల్‌కతా దీదీదే.. తృణమూల్ ‘హ్యాట్రిక్’
కోల్‌కతా: కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వరసగా మూడోసారీ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపుబావుటా ఎగరేసి టీఎంసీ హ్యాట్రిక్ కొట్టింది. 144 వార్డులున్న కార్పొరేషన్లో ఏకంగా 134 వార్డులను టీఎంసీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 72 శాతం ఓట్లు టీఎంసీకే పడటం విశేషం. టీఎంసీకి ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. రెండు వార్డుల్లో గెలిచిన లెఫ్ట్ ఫ్రంట్ 11.13 శాతం ఓట్లను మూటగట్టుకుంది. బీజేపీ సాధించిన ఓట్ల(8.94శాతం ఓట్లు)తో పోలిస్తే సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ సాధించిన ఓట్లే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో సాధించిన ఓట్ల పట్టికలో లెఫ్ట్ ఫ్రంట్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మూడు, కాంగ్రెస్ రెండు వార్డులను గెల్చుకున్నాయి. గత కేఎంసీ ఎన్నికలతో పోలిస్తే టీఎంసీ ఈసారి 22 శాతం ఓట్లు ఎక్కువ సాధించింది. బీజేపీకి గతంతో పోలిస్తే ఆరు శాతం తక్కువ ఓట్లు పడ్డాయి. చదవండి: (S-400 Air Defence System: బోర్డర్లో ‘బాహుబలి’) ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కేఎంసీ ప్రాంతంలో సాధించిన ఓట్ల కంటే ఈసారి బీజేపీ ఏకంగా 20 శాతం తక్కువ ఓట్లు పడ్డాయి. విపక్షాల ఓటు బ్యాంక్‌ను బద్దలుకొట్టాలని టీఎంసీ కుట్ర పన్నిందని, ఆ క్రమంలోనే లెఫ్ట్ ఫ్రంట్ పుంజుకుందని బీజేపీ ఆరోపించింది. 145 ఏళ్ల చరిత్ర ఉన్న కేఎంసీ ఎన్నికల్లో ఈసారి 40.5 లక్షల మంది ఓట్లేశారు. టీఎంసీ సాధించిన విజయంపై ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ మాట్లాడారు. ‘ఈ విజయం రాష్ట్ర ప్రజలకు అంకితం. టీఎంసీ భవిష్యత్ జాతీయ రాజకీయ ప్రస్థానానికి ఈ విజయం మేలిమి బాటలు పరుస్తోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. చదవండి: (మహిళా వివాహ వయసు పెంపు.. వాళ్లని బాధిస్తోంది) -
మేఘాలయలో కాంగ్రెస్‌కు ఝలక్!
న్యూఢిల్లీ: నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో తాజాగా తలబొప్పి కట్టింది. అసెంబ్లీలో పార్టీకి ఉన్న 18 మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం ముకుల్ సంగ్మాతోతో సహా ఏకంగా 12 మంది బుధవారం తృణమూల్ కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ముకుల్ సంగ్మా కొంతకాలంగా కాంగ్రెస్ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. మేఘాలయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విన్సెంట్ హెచ్. పాలాను నియమించినప్పటి నుంచి ముకుల్ సంగ్మాకు ఆయనతో పొసగడం లేదు. తన అభిప్రాయానికి విలువివ్వకుండా విన్సెంట్ నియామకం జరిగిందనేది ఆయన కినుక. చివరకు సంగ్మా టీఎంసీ గూటికి చేరారు. 2023లో జరగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే టీఎంసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్త, మమతా బెనర్జీకి సన్నిహితుడైన ప్రశాంత్ కిశోర్‌కు చెందిన బృందం కొంతకాలంగా షిల్లాంగ్‌లో మకాం వేసి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తోంది. ఇప్పుడు ముకుల్ సంగ్మా చేరికతో టీఎంసీ ఒక్కసారిగా బలపడినట్లైంది. -
చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?
బీజేపీలో మనోహరంగా వెలిగిపోయిన పారికర్ లేకుండా జరగబోయే తొలి ఎన్నికల్ని ఆ పార్టీ ఎంతవరకు ఎదుర్కోగలదు? పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలదళం అధికార వ్యతిరేకతను ఎదుర్కొని నిలబడగలదా? తృణమూల్ కాంగ్రెస్, ఆప్, శివసేన వంటి పార్టీల సత్తా ఎంత? కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? అతి చిన్న రాష్ట్రమైన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా అయిదు నెలలు గడువు ఉన్నప్పటికీ ఎందుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి? పర్యాటక ప్రాంతమైన అతి చిన్న రాష్ట్రం గోవా. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో దాదాపుగా పదో వంతు ఉంటుంది. 3,702 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ రాష్ట్ర జనాభా దాదాపుగా 15 లక్షలు. 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. వచ్చే ఏడాది మార్చి 15 వరకు అసెంబ్లీకి గడువుంది. ఎన్నికలకి ఇంకా అయిదు నెలలు సమయం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌లు గోవా బరిలోకి పూర్తి స్థాయిలో దిగుతూ ఉండడం, శివసేన కూడా 25 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, కాంగ్రెస్‌లో ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. గోవా కాథలిక్కులు కూడా గౌరవించే మనోహర్ పారికర్ కేన్సర్‌తో 2019లో మరణించడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే. రాష్ట్రంలో ప్రమోద్ సావంత్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ప్రచారం జోరు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గత జులై నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటించడం ప్రారంభించారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ ఈసారి ఎలాగైనా మెజార్టీ సాధించాలని భావిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే గోవాలో పర్యటించి సమర్థవంతులైన నాయకుల్ని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిదంబరం వంటి జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారం బరిలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల మూడు రోజులు గోవాలో మకాం వేసి బీజేపీకి బెంగాల్లో పట్టించిన గతే ఇక్కడా పట్టిస్తామని ప్రతినబూనారు. ఆప్ గత ఎన్నికల్లో ఒక్క సీటు సాధించకపోయినా 6.3% ఓట్లను సాధించింది . దీంతో ఈసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దూకుడు పెంచారు. ఆప్ అ«ధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన, అందరికీ ఉచితంగా తీర్థయాత్రల హామీతో ముందుకు వెళుతున్నారు. చిన్న నియోజకవర్గాలతో పార్టీలకు చింత గోవాలో ప్రతీ నియోజకవర్గంలో 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఓటర్లు ఉంటారు. దీంతో స్వల్ప ఓట్లతోనే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థిని దింపడం కూడా కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించడానికి చిన్న నియోజకవర్గాలే కారణం. ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వార్డ్ పార్టీ మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ, ఎన్సీపీ, శివసేన , స్థానిక పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లో ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో దొడ్డి దారిలో వచ్చిన బీజేపీ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాలు నెగ్గి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ని గోవా ముఖ్యమంత్రిని చేసి చిన్న పార్టీలతో చేతులు కలిపిన బీజేపీ గద్దెనెక్కింది. కేవలం 13 స్థానాలను గెలుచుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన అప్పటి గోవా గవర్నర్ మృదుల సిన్హాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా బీజేపీ పారికర్ ఇమేజ్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సభ్యుల్ని లాగేసి బలం పెంచుకుంది. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో బీజేపీకి సభ్యుల బలం 28 ఉంటే కాంగ్రెస్ బలం నాలుగుకి పడిపోయింది. అప్పట్నుంచి గోవా కాంగ్రెస్ తమకు దక్కాల్సిన అధికారాన్ని కొల్లగొట్టిందని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ►పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న రాష్ట్రంలో కరోనా ప్రభావంతో వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్లు నష్టం వచ్చినట్టుగా అంచనా. పర్యాటకుల్ని అనుమతిస్తున్నప్పటికీ చాలా హోటల్స్‌లో ఆక్యుపెన్సీ 20 శాతానికి మించడంలేదు. ప్రజల జీవనోపాధిపై దెబ్బపడింది. ►గోవాలో మైనింగ్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామీణ ఆర్థిక రంగానికి గట్టి దెబ్బ తగిలింది. జీడీపీలో 30%వాటా, లక్షకు మందికి పైగా ఉద్యోగాలను కల్పించే మైనింగ్ నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది ►కరోనా సమయంలో పర్యాటక రంగంలో 1.22 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతే, మైనింగ్ నిలిచిపోయి లక్ష మంది వరకు ఉపాధి కోల్పోయారు. దీంతో నిరుద్యోగం అంశం రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా మారింది. -
టీఎంసీ గూటికి దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు
Leander Paes Join TMC కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన టీఎంసీ.. గోవాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. గోవాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం టీఎంసీలోకి వలసలు భారీగా పెరిగాయి. రాజకీయ నాయకులతో పాటు.. సెలబ్రిటీలు కూడా టీఎంసీలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ టీఎంసీలో చేరారు. ఆయనతో పాటు నటి నసిఫా అలీ, సామాజిక కార్యకర్త మృణాళిని దేశప్రభు శనివారం టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని టీఎంసీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. వీరంతా మమతా బెనర్జీ సమక్షంలో వీరు పార్టీలో చేరినట్లు ప్రకటించారు. We are extremely delighted to share that Shri @Leander joined us today in the presence of our Hon'ble Chairperson @MamataOfficial! Together, we shall ensure that every single person in this nation sees the Dawn of Democracy that we have been waiting for since 2014! — All India Trinamool Congress (@AITCofficial) October 29, 2021 (చదవండి: ‘ఈ సైకిల్స్’ ఆవిష్కరణలో పేస్ ఇలా పడిపోయాడేంటి?) టీఎంసీలో చేరిన అనంతరం లియాండ్ పేస్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యాను. రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. దేశంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. దీదీ నిజమైన చాంపియన్’’ అన్నారు. చదవండి: జేమ్స్ బాండ్ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు -
కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్: టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం
కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పంజాబ్‌లో తీవ్ర అనిశ్చితి ఏర్పడిన విషయం తెలిసిందే. పార్టీలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ అలా ఉండగా ఇప్పుడు గోవాలో కూడా పరిస్థితులు సమస్యగా మారాయి. ఆ పార్టీకి పెద్ద ఎత్తున నాయకులు బై బై చెప్పేశారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరిన నేతలు ఒక్కొక్కరిగా తిరిగి టీఎంసీలో చేరుతున్నారు. అయితే తాజాగా గోవాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం లుయిజిన్హో ఫలీరో టీఎంసీలో చేరారు. బుధవారం సీఎం మమతా బెనర్జీ, పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ సమక్షంలో లుయిజిన్హో టీఎంసీ కండువా కప్పుకున్నారు. లుయిజిన్హో తన అనుచరుల బృందంతో కలిసి కోల్‌కతాలో టీఎంసీలో చేరారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లుయిజిన్హో టీఎంసీలో చేరికపై సీఎం మమతా స్పందిస్తూ.. లుయిజిన్హోను టీఎంసీలోకి ఆహ్వానించటం గర్వంగా ఉందని తెలిపారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు టీఎంసీ స్వాగతం పలుకుతోందని తెలిపారు. తాము ప్రతి గోవా పౌరుడికి అండగా నిలబడతామని, అదేవిధంగా విభజన శక్తులతో పోరాడతామని పేర్కొన్నారు. సరికొత్త గోవాను రూపొందించటం కోసం కలిసి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శులు యతీష్ నాయక్, విజయ్ వాసుదేవ్ పోయి, పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శులు మారియో పింటో డి సంతాన, ఆనంద్ నాయక్, మరో ఐదుగురు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత, కవి శివదాస్ సోను నాయక్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నాయకుడు లావూ మమ్లేదార్ లుయిజిన్హో ఫలీరో పాటు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. -
కోల్‌కతా ఓటరుగా ప్రశాంత్ కిషోర్.. పక్కా ప్లాన్‌తోనేనా?!
కోల్‌కతా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పశ్చిమబెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటరుగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్రపోషించారు. ఆయన ఇదివరకు బీహార్‌లోని ససారాం జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటరుగా ఉన్నారు. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్‌కిషోర్ తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. IUI0656683 ఎపిక్ నెంబర్‌తో ఉన్న నివాసం ఆయన శాశ్వత నివాసంగా చూపబడింది. నియోజకవర్గ పరిధిలోని రాణిశంకరి లేన్‌లోని బూత్ నెం-2222లో పోలింగ్ స్టేషన్ ఉంది. భవానీపూర్ అసెంబ్లీ ఎన్నిక సమయంలో ప్రశాంత్ కిషోర్ కోల్‌కతాలో ఉండకుండా బయటకు తీసుకురావడానికి బీజేపీ ఎన్నికల కమిషన్ని బలవంతం చేయొచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పథకం ప్రకారం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. భవానీపూర్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. టీఎంసీ అడ్వయిజర్‌గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఓటరుగా నమోదు చేసుకోవడంపై బీజేపీ మీడియాసెల్ ఇన్చార్జ్ సప్తర్షి చౌదరి ఫైర్ అయ్యారు. 'చివరికి బహిరాగాటో (బయటివ్యక్తి) భవానీపూర్ ఓటర్ అయ్యారు. కాబట్టి, బెంగాల్ కుమార్తె ఇప్పుడు బహిరాగాటో (బయటి) ఓటర్‌కు అనుకూలంగా ఉంటుందో లేదో తెలియదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: (యూపీ బరిలో ఒవైసీ అలజడి) కిషోర్‌ను భవానీపూర్ ఓటర్ జాబితాలో చేరడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. కొద్ది రోజుల క్రితం సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నాయకులను కలుసుకున్నారు. దీంతో అతను కాంగ్రెస్‌లో చేరవచ్చు అనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. అయితే ఆయన పార్టీలో చేరే నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని పార్టీ వర్గాలు సూచించాయి. ప్రశాంత్ కిషోర్ మొదట్లో 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత జేడీ(యు)లో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ పార్టీ నుంచి బహిష్కరించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ వేదికను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. అతను పంజాబ్‌లో పార్టీ విజయానికి తోడ్పాటునందించాడు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సలహాదారుగా ఉంటూ, అతను ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు) -
మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి
కలకత్తా: ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పోస్టు కోల్పోయిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో బీజేపీకి బైబై చెప్పేసి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజులు కిందట బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తాజాగా శనివారం టీఎంసీ గూటికి చేరారు. బాబుల్ సుప్రియోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్ బబ్రెయిన్ సాదర స్వాగతం పలికారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు:హోంమంత్రి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో జూలై 31వ తేదీన ఇక రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు కూడా. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో ప్రముఖ గాయకుడు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. చదవండి: పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? అయితే ఇటీవల కేంద్రమంత్రివర్గంలోకి తనను తీసుకోకపోవడంతో బీజేపీకి బైబై చెప్పేశారు. వాటితోపాటు మరికొన్ని కారణాలుకూడా ఉన్నాయి. కొన్ని నెలల కిందట జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది. అనూహ్యంగా సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేశారు. తాజాగా తృణమూల్‌లో చేరడంతో ఆయన రాజకీయ సన్యాసం చేస్తారనే వార్తలకు తెర పడింది. Today, in the presence of National General Secretary @abhishekaitc and RS MP @derekobrienmp, former Union Minister and sitting MP @SuPriyoBabul joined the Trinamool family. We take this opportunity to extend a very warm welcome to him! pic.twitter.com/6OEeEz5OGj — All India Trinamool Congress (@AITCofficial) September 18, 2021 -
మమతా బెనర్జీకి తాడోపేడో: భవానీపూర్ నుంచే పోటీ
కలకత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 294 స్థానాల్లో 213 ఎమ్మెల్యేలను గెలుచుకుని ముచ్చటగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే మమతా ఓటమి మాత్రం ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆరు నెలల్లోపు అసెంబ్లీ సభ్యురాలు కాకుంటే ఆమె ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సిందే. చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్‌దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి మమత పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు విసిరిన సవాల్‌ను స్వీకరించి నందిగ్రామ్‌లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సవాళ్ల పర్వంలో త్రుటిలో పరాజయం పొందారు. ఆమెను బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచారు. సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. 16వ తేదీ ఉపసంహరణ. ఈ స్థానంతో పాటు మరో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక -
మరో ఎమ్మెల్యే జంప్: ఉప ఎన్నికల వేళ బీజేపీకి షాక్
కలకత్తా: తాజాగా పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో బెంగాల్ రాజకీయం మళ్లీ హాట్‌హాట్‌గా మారింది. ప్రకటన అలా వెలువడిందో లేదో ఇలా బీజేపీ ఊహించని షాక్ తగిలింది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాషాయ పార్టీని వదిలేసి అధికార పార్టీ బాట పట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సౌమోన్ రాయ్ శనివారం చేరారు. చదవండి: ఆస్పత్రి బాత్రూమ్లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు ఇప్పటికే ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్, విశ్వజిత్ దాస్‌లు బీజేపీని వీడి టీఎంసీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కలియగంజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సౌమెన్ రాయ్ అధికార పార్టీ కండువా మార్చుకున్నారు. ‘రాష్ట్ర అభివృద్ధితో పాటు, ఉత్తర బెంగాల్ అభివృద్ధి కోసం పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నా’ అని సౌమెన్ రాయ్ తెలిపారు. అయితే ఈయనతో కలిపి టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం నాలుగుకు చేరింది. అయితే వీరంతా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వారే. బీజేపీ అధికారంలోకి వస్తుందనే హైప్ రావడంతో వారంతా మమతాను వదిలేసి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. వీరిని చూసి మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి చేరే అవకాశం ఉంది. ఒకప్పుడు తృణమూల్‌లో ఉన్నవారంతా ఇప్పుడు మళ్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఉప ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చదవండి: సీక్రెట్ యాప్‌తో భార్య ఫోన్ ట్యాపింగ్.. ఆమెపై నీడలా భర్త -
Narada Sting Case: టీఎంసీ నేతలకు ఝలక్
కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ప్రత్యేక కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించింది. పశ్చిమ బెంగాల్ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ప్రత్యేక కోర్టు ఛార్జ్షీట్లోని నలుగురు టీఎంసీ నేతలకు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 16హాజరు కావాలని పేర్కొంది. టీఎంసీ నేతలతో పాటు సస్పెండ్ చేయబడిన ఐపీఎస్ అధికారి ఎస్ఎంహెచ్ మీర్జాకు కూడా కోర్టు నోటీసు పంపింది. చదవండి: అమరవీరులను అవమానించడమే ముఖర్జీ, హకీమ్, మిత్రాకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ద్వారా సమన్లు అందజేయాలని కోర్టు ఆదేశించింది. మిగిలిన ఇద్దరికి నేరుగా వారి చిరునామాలకు సమన్లు పంపిస్తున్నామని పేర్కొంది. ఇక ఈ ఏడాది సీబీఐ ముఖర్జీ, హకీమ్, మిత్రా, సోవన్ ఛటర్జీలను అరెస్ట్ చేయగా.. వారికి మే నెలలో కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చదవండి: పనిచేస్తారా? తప్పుకుంటారా.. పార్టీ శ్రేణులకు కమల్ వార్నింగ్! తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
టీఎంసీ నాయకులపై తాలిబన్ల తరహాలో దాడి చేయండి..
అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ త్రిపురలోని బెలోనియా నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అరుణ్ చంద్ర భౌమిక్.. ఇటీవల తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎంసీ నాయకులు అగర్తలా ఎయిర్‌పోర్టులో కాలుపెడితే వారిపై తాలిబన్ల తరహాలో దాడి చేయాలని తన మద్దతుదారులను రెచ్చగొట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు టీఎంసీ నాయకులు త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ఒంట్లో చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకూ తాము బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. సదరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదిలా ఉంటే, త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్ట్‌ల పాలన తరువాత బిప్లవ్ దేవ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. తమ ప్రభుత్వాన్ని అస్తిర పరిచేందుకు టీఎంసీ నేతలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటినుంచే తమ కార్యాచరణను మొదలుపెట్టాయి. చదవండి: శక్తిమంతమైన 'జీరో రూపాయి నోట్' గురించి మీకు తెలుసా? -
కాంగ్రెస్‌కు భారీ షాక్.. కీలక నేత రాజీనామా
డిస్పూర్: దేశవ్యాప్తంగా తన ప్రభావం కోల్పోతున్న జాతీయ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత, అసోం మాజీ ఎంపీ సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతా బయోలో కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మహిళ నేత అని మార్చి.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మొదటి క్లూ ఇచ్చారు. సుస్మితా దేవ్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్ త్వరలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుస్మితా దేవ్ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో భేటీ అవ్వనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చిలోనే సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు వార్తలు వచ్చాయి. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై అసంతృప్తిగా ఉన్న సుస్మితా దేవ్ పార్టీని వీడతారంటూ వచ్చిన వార్తలను కాంగ్రెస్ ఖండించింది. ఇక సుస్మితా దేవ్ రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ స్పందించారు. ‘‘సుస్ముతా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. యువ నాయకులంతా పార్టీని వీడితున్నారు.. పార్టీని బలోపేతం చేయడానికి మేం సరిగా ప్రయత్నించడం లేదంటూ వృద్ధులపై నిందలు వేస్తున్నారు’’ అంటూ కపిల్ సిబాల్ విమర్శించారు. ఇక సుస్మితా దేవ్ రాజీనామా గురించి తనకు తెలియదని అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా తెలిపారు. సుస్మితా దేవ్ అసోం కాంగ్రెస్ నాయకుడు ప్రభావవంతమైన బెంగాలీ నాయకుడు సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె. సుస్మితా దేవ్ గతంలో తన తండ్రికి పట్టున్న సిల్చార్ సీటు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్‌పై దాడి
అగర్తల: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. అది కూడా వేరే రాష్ట్రంలో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోమవారం త్రిపుర అగర్తలలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు అభిషేక్ బెనర్జీ ట్విటర్లో ‘‘బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్ దేవ్ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అంటూ తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిలో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న రోడ్డు పక్కన.. కొందరు వ్యక్తులు నిలుచుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వీడియోలో చూడవచ్చు. వీరిలో కొందరి చేతిలో బీజేపీ జెండా ఉంది. కాన్వాయ్ అలా ముందుకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి కర్రతో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశాడు. వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఈ క్రమంలో టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండించడమేకాక ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అభిషేక్ బెనర్జీ త్రిపురలో పర్యటిస్తుండటంతో.. అగర్తలలో బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ పోస్టర్లను చించేశారని టీఎంసీ నాయకులు ఆరోపించారు. -
త్రిపురలో ఐప్యాక్ బృందం నిర్బంధం
అగర్తలా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) సభ్యులు 23 మందిని త్రిపుర పోలీసులు ఒక హోటల్లో హౌస్ అరెస్టు చేశారు. 2023లో జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐప్యాక్ బృందం వారం రోజుల కిందట అగర్తలాకు చేరుకుంది. ఆదివారం రాత్రి నుంచి త్రిపుర పోలీసులు వీరిని హోటల్ నుంచి బయటికి రానివ్వడం లేదు. ‘తృణమూల్ ఇంకా త్రిపురలో అడుగుపెట్టకముందే బీజేపీ భయపడుతోంది. 23 మంది ఐప్యాక్ ఉద్యోగులను గృహనిర్భందంలో పెట్టారు. బీజేపీ అరాచక పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఇలాగే పదేపదే ఖూనీ అవుతోంది’ అని తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు. బయటినుంచి వచ్చినందున వారికి కరోనా పరీక్షలు చేశామని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీలోకి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో సోమవారం అభిజిత్ ముఖర్జీకి, టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్‌లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయినవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో... ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు అభిజిత్ ముఖర్జీ. Warmly welcoming Shri @ABHIJIT_LS into the Trinamool family! We are certain that your contribution towards fulfilling @MamataOfficial's vision for a brighter Bengal shall be valued by all. pic.twitter.com/oSQgmfxVCR — All India Trinamool Congress (@AITCofficial) July 5, 2021 అయితే 2019లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ మొదలు పెట్టిన మతపరమైన హింసను మమతా బెనర్జీ సమర్థవంతంగా అదుపు చేశారని అభిజిత్ చెప్పారు. దేశమంతటా బీజేపీని కంట్రోల్ చేసే శక్తి ఆమెకు ఉందన్నారు. కాంగ్రెస్‌లో ప్రాథమిక సభ్యత్వం తప్ప తనకు ఎలాంటి పొజిషన్ లేదని... టీఎంసీలోనూ సాధారణ కార్యకర్తగానే చేరినట్టు అభిజిత్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు. అయితే అభిజిత్ ముఖర్జీ నిర్ణయంపై ఆయన సోదరి షర్మిష్ట స్పందిస్తూ.. విచారకరం అంటూ ట్వీట్ చేశారు. SAD!!! — Sharmistha Mukherjee (@Sharmistha_GK) July 5, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు చూసుకున్నారు అభిజిత్ ముఖర్జీ. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జట్టు కట్టడంపై అభిజిత్ ముఖర్జీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ ఓట్ల వాటా పెరిగి ఉండేదని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అభిజిత్ ముఖర్జీ పేర్కొన్నారు. -
బేబీ బంప్‌తో నుస్రత్ జహాన్.. ఫొటోలు వైరల్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తున్నారు. బిడ్డకు జన్మనివ్వబోయే ఆనంద క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘తప్పిపోయిన పక్షికి ఇంటికి వెళ్లే దారి గురించి మార్గదర్శనం చేద్దాం’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. మిక్కీ మౌజ్ బొమ్మలతో కూడిన డిజైన్ గల డ్రెస్ ధరించిన కాబోయే అమ్మ నుస్రత్‌కు ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఎంతో అందంగా ఉన్నారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీదీ. పుట్టబోయే బిడ్డ గురించి మీరు కనే కలలు నిజమవ్వాలి’’ అంటూ ఫ్యాన్స్ నుస్రత్ జహాన్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. కాగా బెంగాల్ సినీ నటి అయిన నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019లో లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. అదే ఏడాది జూన్ 19న నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. అయితే, కొంతకాలం సఖ్యతగా మెలిగిన దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు ఇటీవల వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై స్పందించిన నుస్రత్ జహాన్.. నిఖిల్‌తో జరిగిన తన వివాహం భారత చట్టాల ప్రకారం చెల్లదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా భర్త, అత్తింటి వారు తన నగలు, విలువైన వస్తువులను తనకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంపై కూడా పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో నుస్రత్ జహాన్.. వరుసగా ఫొటోలు షేర్ చేస్తూ వాటన్నింటికీ ఫుల్‌స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: అవును మేము గతేడాది నుంచి విడిగా ఉంటున్నాం: నిఖిల్ జైన్ View this post on Instagram A post shared by Nusrat (@nusratchirps) -
‘నన్ను కొట్టారు.. నా దుస్తులు చించేశారు’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును మానవహక్కుల కమిషన్ విచారిస్తుంది. ఈ క్రమంలో ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో టీఎంసీ కార్యకర్తలు తమను ఎలా చిత్రహింసలకు గురి చేశారో బాధితులు ఇండియాటుడేకి వెల్లడించారు. ఫలితాల అనంతరం టీఎంసీ కార్యకర్తలు తమ ఇళ్లు, దుకాణాల మీద పడి దాడి చేశారని.. విచక్షణా రహితంగా కొట్టారని తెలిపారు. వారికి భయపడి చాలామంది ఇప్పటికి ఇళ్లకు రావడం లేదన్నారు. రాఖీ రావంత్ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘మే 2 ఆదివారం నాడు ఫలితాలు వెల్లడైన అనంతరం టీఎంసీ కార్యకర్తలు మా ఇంటి మీద దాడి చేశారు. నన్ను, నా కుటుంబ సభ్యులను చితకబాది.. నా బట్టలు చించేశారు. అంతటితో ఆగక నన్ను అసభ్యకరంగా తాకుతూ.. తెల్లవారేసరికి ఊరు విడిచి వెళ్లాలని.. లేదంటే అదే మాకు చివరి రాత్రని హెచ్చరించారు. సోమవారం ఉదయం మరోసారి వచ్చి నా పిల్లల్ని కొట్టారు. ఊరు విడిచి పోకపోతే నా భర్తను చంపుతామని బెదిరించారు. వారి భయంతో మేం వేరే గ్రామానికి వెళ్లాం. ఆ తర్వాత పోలీసులు సెక్యూరిటీ కల్పించడంతో తిరిగి మా ఇంటికి వచ్చాం’’ అని తెలిపింది. మరో బాధితురాలు మాముని సాహా అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు ముందు మార్చిలో టీఎంసీ కార్యకర్తలు 10 కేజీల చికెన్ కొట్టాల్సిందిగా ఆదేశించారు. డబ్బులు అడిగితే లేవన్నారు. దాంతో మేం చికెన్ ఇవ్వలేదు. దాన్ని మనసులో పెట్టుకుని ఫలితాల తర్వాత మా ఇంటి మీద దాడి చేశారు. కోళ్లఫారానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. మా ఇంటి ముందు బారికేడ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. నన్ను నా భర్తను కొట్టారు’’ అని తెలిపింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై కోర్టుకెళ్లిన మమత సర్కార్‌కు కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఘర్షణ సంబంధ కేసుల్ని విచారించాలని ఎన్హెచ్ఆర్సీని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను రీకాల్ చేయాలంటూ బెంగాల్ ప్రభుత్వం కోరగా అందుకు కోర్టు నో చెప్పింది. చదవండి: దీదీ పిటిషన్‌పై విచారణ వాయిదా -
సువేందును భయపెడుతున్న ఆ 24 మంది..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీకి షాకుల మీద షాకుల తగులుతున్నాయి. బీజేపీ తరఫున గెలిచిన ముకుల్ రాయ్ తృణమూల్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలో మరి కొందరు పయణించే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరు తమతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి, గవర్నర్ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ సంఘటనతో మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి తిరుగుపయనం కానున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. సువేందు అధికారి సోమవారం సాయంత్రం గవర్నర్ జగ్దీప్ ధన్కర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనుచిత సంఘటనలు, వాటి పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. దాంతో వారంతా తిరిగి టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవి కట్టబెట్టడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలకపోతున్నారు. సువేందు నాయకత్వాన్ని అంగీకరించడానికి వారు సుముఖంగా లేరు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ముకుల్ రాయ్ టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరికొందరు బీజేపీని వీడి తృణమూల్‌లో చేరతారని భావిస్తున్నారు. 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ టీఎంసీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి -
టీఎంసీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ పార్టీ ఎమ్మెల్మే మదన్ మిత్రా నివాసంలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతాలో ఉంటున్న మదన్ మిత్రా ఇంట్లో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని ముందే గ్రహించిన మదన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులంతా క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయని.. ప్రమాదానికి షార్ట్ సర్య్కూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై మదన్ మిత్రా స్పందిస్తూ.. '' ఇది మా పూర్వీకుల ఇళ్లు. ఇవాళ ఉదయం ఇంట్లో ఏదో పేళుళ్ల శబ్ధం వినిపించింది. దీంతో అగ్ని ప్రమాదం జరుగుతుందని ముందే గ్రహించాను. వెంటనే కుటుంబ సభ్యులను అలర్ట్ చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని చెప్పాను. దేవుడి దయవల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం'' అని పేర్కొన్నారు. చదవండి: హిమాచల్ ప్రదేశ్‌లో తొలిసారి కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. వైరల్ Mizoram: పరీక్షలు రాయాలి.. సిగ్నల్స్ రావడం లేదు -
West Bengal: అంకుల్ జీ అంటూ గవర్నర్‌పై ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గవర్నర్ జగ్దీప్ ధన్కర్, తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆదివారం నుంచీ ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు ట్వీట్ల ద్వారా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ముఖ్యంగా గవర్నర్‌ను అంకుల్ జీ అని సంబోధిస్తూ.. మహువా ట్వీట్లు చేస్తుండటం గమనార్హం. ఇక తాజాగా తన ‘‘కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్తులను రాజ్‌భవన్‌లో ఓఎస్డీలుగా నియమించారు’’ అంటూ మహువా మోయిత్రా చేసిన ఆరోపణలను గవర్నర్ జగదీప్ ధన్కర్ సోమవారం తోసిపుచ్చారు. రాష్ట్రంలో "భయంకరమైన శాంతిభద్రతల పరిస్థితి" నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై జగదీప్ ధన్కర్ ‘‘ఓఎస్డీలుగా నియమించిన ఆరుగురు వ్యక్తులు నా కుటుంబ సభ్యులు అంటూ మీడియాలో ప్రచారం చేయడం నిజంగా తప్పు. వారు నాకు బంధువులు అనే మాట పూర్తిగా అవాస్తవం. ఈ ఓఎస్డీలు మూడు రాష్ట్రాలకు, నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వారు. వీరిలో ఎవరూ మా కుటుంబంలో భాగం కాదు. వీరిలో కనీసం ఒక్కరు కూడా నా సొంత రాష్ట్రానికి, కులానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరు’’ అంటూ ట్వీట్ చేశారు. Assertion @MahuaMoitra in tweet & Media that six coterminous appointee OSDs in personal staff are relatives is FACTUALLY WRONG. OSDs are from three states and belong to four different castes. None of them is part of close family. Four of them are not from my caste or state. — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) June 7, 2021 దీనిపై మహువా వెంటనే స్పందించారు. వాళ్ల చరిత్ర ఏంటో, వారిలో ఎవరు.. ఎలా రాజ్‌భవన్‌లోకి వచ్చారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. బీజేపీ ఐటీ సెల్ వాళ్లు కూడా ఈ విషయంలో మీకు ఏ సాయం చేయలేరని మోయిత్రా ఎద్దేవా చేశారు. అంతేకాదు మీకు ఉపరాష్ట్రపతి పదవి కూడా దక్కుతుందని అనుకోవడం లేదంటూ ట్వీట్ చేశారు. చదవండి: బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి... తీవ్ర ఆందోళనకరం -
West Bengal: మమత ఓకే అంటేనే..!
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఘర్‌వాపసీ చర్చ ఊపందుకుంది. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన పలువురు నాయకులు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఘర్‌వాపసీకి అనుమతించాలా వద్దా అనే విషయంలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకొనే నిర్ణయంపైనే ఇప్పుడు ఈ నాయకుల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే పార్టీలోకి తిరిగి రావాలనుకుంటున్న నాయకులు అందరికీ ఘర్‌వాపసీ సులభంగా జరగకపోవచ్చని, కేవలం కొందరు నాయకులను మాత్రమే పార్టీలోకి ఆహ్వానించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024కు ముందు క్షేత్రస్థాయిలో బీజేపీని సంస్థాగతంగా బలహీనపరచడం టీఎంసీ లక్ష్యమైనప్పటికీ, ఎన్నికల ముందు అవకాశవాద రాజకీయాల కోసం పార్టీని వదిలిన వారిని అందరినీ తిరిగి పార్టీలోకి తీసుకొనే విషయంలో పార్టీ క్యాడర్‌కు మమతా బెనర్జీ క్యాడర్‌కు ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీని వీడిన దీపేందు బిస్వాస్, సోనాలిగుహాతో సహా పలువురు మాజీ టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలని తీసుకున్న తమ నిర్ణయానికి చింతిస్తున్నామని, తిరిగి పార్టీలోకి రావాలనుకుంటున్నట్లు లేఖలు పంపారు. అంతేగాక ఒకప్పుడు మమతా బెనర్జీకి సన్నిహితంగా భావించిన గుహ తనను క్షమించాలని సీఎంను కోరుతూ ఒక వీడియోను విడుదల చేశారు. మరోవైపు అనారోగ్యంగా ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ భార్యను పరామర్శించేందుకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హాస్పిటల్‌కు వెళ్ళిన తరువాత ముకుల్‌రాయ్ ఘర్‌వాపసీ విషయంలోనూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తనపై వస్తున్న పుకార్లను ముకుల్‌రాయ్ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు పార్టీని వీడిన వారి విషయంలో కాంగ్రెస్– వామపక్షాల వ్యూహాన్ని టీఎంసీ అనుసరిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ గతంలో తరచూ అసమ్మతివాదులను వెనక్కి తీసుకోగా, వామపక్షాలు సాధారణంగా అసమ్మతివాదులకు, పార్టీని వదిలిన వారికి నో రీఎంట్రీ విధానాన్ని కలిగి ఉన్నాయి. కీలకమైన సమయంలో పార్టీని విడిచిన వారిని తిరిగి తీసుకొనే విషయంలో పార్టీ ఒక విధానాన్ని అనుసరించాలని పలువురు టీఎంసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఘర్‌వాపసీలో భాగంగా పార్టీలోకి తిరిగి రావాలనుకొనే వారిలో ఎంపిక చేసిన వారికి మాత్రమే మమతా బెనర్జీ అవకాశం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి, ఎవరిని బహిష్కరించాలనే నిర్ణయాలను మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, సుబ్రతా బక్షి, పార్థా ఛటర్జీలతో కూడిన ప్రధాన క్రమశిక్షణా కమిటీ నిర్ణయిస్తుందని టీఎంసీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు టీఎంసీని వదిలి వెళ్ళినవారిని పార్టీలోకి తిరిగి తీసుకోవడం విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు స్పష్టంచేశాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే చాలా కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ గూటికి చేరుకున్న పరిస్థితుల్లో టీఎంసీ కుప్పకూలుతోందన్న విధంగా బీజేపీ ఎన్నికల సమయంలో ఒక హైప్ క్రియేట్ చేసిందని టీఎంసీ నాయకులు విమర్శిస్తున్నారు. -
Mamata Banerjee: బెంగాల్లో బీజేపీకి మరో షాక్!
కోలకతా: బెంగాల్ కోటలో పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ పన్నిన వ్యూహాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుని విశ్లేషకులను సైతం ఆశ్యర్యంలో ముంచెత్తారు. 292 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ 213 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 77 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే ఈ విజయం అంత అలవోకగా వచ్చిందేమీ కాదు. రాష్ట్ర ఎన్నికలకు ముందు మమతా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా, కీలక నేతలు, సన్నిహితులు పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం పెనుసవాల్‌గా మారింది. అయితే కేవలం నెల రోజుల్లోనే ఇపుడు సీన్ రివర్స్ అవుతుండటం విశేషం. తృణమూల్ కాంగ్రెస్‌లోకి రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్ నెలకొంది. టీఎంసీ ఘన విజయం నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుదారులంతా మళ్లీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2017లో మమతకు తొలి షాక్ ఇచ్చి పార్టీని విడిచి పెట్టిన బీజేపీ నేత ముకుల్ రాయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే గత మార్చిలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహా, ఫుట్‌బాల్ క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు దీపేందు బిస్వాస్ టీఎంసీ జెండా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితోపాటు సరాలా ముర్ము , అమల్ ఆచార్య తదితరులుకూడా ఇదే బాటలో ఉన్నట్టు పీటీఐ సమాచారం. అంతేకాదు ఏడు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లేదా నలుగురు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాలనే కోరికను వ్యక్తం చేశారని తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్ మీడియాకు వెల్లడించారు. అయితే దీనిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ నాయకులు ఎన్నికలకు ముందే పార్టీని విడిచిపెట్టిన క్రమంలో కార్యకర్తల కృషితో మమతా నాయకత్వంలో విజయం సాధించాం కనుక వారి మనోభావాలను కూడా గౌరవించాల్సి ఉందన్నారు. అయితే ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలో చేరనున్నారన్న వార్తలను బీజేపీ కొట్టి పారేసింది. మరోవైపు ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ విషయంలో కేంద్రం, మమత సర్కార్ మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. రాష్ట్రంలో ఓటమిని జీర్ణించుకోలేని కేంద్రం తమ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మమత మండి పడ్డారు. ఈ సందర్భంగా 70 వ దశకంనాటి హిందీ సినిమా షోలే లోని పాపులర్ డైలాగ్ ‘జో డరతే హై..వో మరతే హై’ అనే డైలాగును గుర్తు చేసిన దీదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: కేంద్రానిక్ షాక్.. పంతం నెగ్గించుకున్న మమత -
నారద కేసు: టీఎంసీ నేతలకు ఊరట
కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో నలుగురు టీఎంసీ నేతలకు కలకత్తా హైకోర్టు శుక్రవారం తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. రూ.2 లక్షలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఎలాంటి న్యూస్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. టీఎంసీ నేతలు ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రత ముఖర్జీ, సోవన్ ఛటర్జీలను మే 17న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి వీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా వీరికి తాత్కాలిక బెయిల్ ఇచ్చిన కోర్టు.. నిబంధనలు ఉల్లఘింస్తే బెయిల్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక కేసుకు సంబంధించి కోర్టుకు ఏమైనా అవసరం వస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దర్యాప్తులో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంపెక్స్ కన్సల్టెన్సీ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యాపార ప్రయోజనాలు కల్పించేందుకు వీరు నగదును తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించారు. స్టింగ్ ఆపరేషన్ చేయడం కోసమే ఈ కల్పిత సంస్థను శామ్యూల్ సృష్టించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినవారిలో ముకుల్ రాయ్, సౌగత రాయ్, కకోలీ ఘోష్ దస్తిదార్, ప్రసూన్ బెనర్జీ, సువేందు అధికారి, అపరుప పొద్దార్, సుల్తాన్ అహ్మద్, మదన్ మిత్రా, సోవన్ ఛటర్జీ, సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, ఇక్బాల్ అహ్మద్, షంకు దేబ్ పాండా సహా ఐపీఎస్ అధికారి హెచ్ఎంఎస్ మీర్జా ఉన్నారు. చదవండి: నారద కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలి: సీబీఐ నారదా స్టింగ్ ఆపరేషన్: మంత్రులకు బెయిల్ -
Mamata Banerjee: దీదీ పోటీచేసేది అక్కడి నుంచేనా?
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించి మూడోసారి పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అయితే, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కషి చేసిన ఆమె నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. బీజేపీ పక్కా వ్యూహంతో ఆమె స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండడంతో మమత దానిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఓ స్పష్టత వచ్చిందని సమాచారం. మమతా బెనర్జీ కోసం తన పదవిని వదులుకునేందుకు భవానీపూర్ ఎమ్మెల్యే ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఆ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ శుక్రవారం రాజీనామా చేసినట్టు సమాచారం. ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మమతా బెనర్జీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మమతా బెనర్జీ ఎక్కడ పోటీ చేసినా ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. మమతా పోటీ చేసే స్థానంపై బీజేపీ ప్రధాన దృష్టి పెట్టింది. ఏం జరగనుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే భవానీపూర్ నుంచే మమత 2016లో గెలిచిన విషయం తెలిసిందే. ఆ స్థానం టీఎంసీకి కంచుకోట. దీంతో మమత గెలుపు సునాయాసమేనని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ -
మూడోసారి బెంగాల్ పీఠంపై దీదీ
కోల్‌కతా: హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయఢంకా మోగించిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్ సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెతో సీఎంగా ప్రమాణంచేయించారు. మమత కేబినెట్లో కొత్త మంత్రులంతా 9వ తేదీన ప్రమాణం చేయను న్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత హింస చెలరేగడానికి కారకులైన వారిని వదిలిపెట్టేదిలేదని ఈ సందర్భంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో కోవిడ్ కట్టడే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మమత స్పష్టంచేశారు. కాగా, సీఎంగా ప్రమాణంచేసిన మమత దీదీకి అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తూ ప్రధాని మోదీకి మమత ఓ లేఖ రాశారు. అల్లర్లను చెల్లెలు మమత అదుపుచేయగలదు: గవర్నర్ ధన్కర్ ‘మూడోసారి సీఎం అయిన మమతకు ధన్య వాదాలు. అయితే, ప్రస్తుతం అల్లర్లు, హింసతో బెంగాల్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ హింసా త్మక ఘటనలకు నా సోదర సమానురాలైన మమతా బెనర్జీ అడ్డుకట్ట వేయగలదనే నమ్ముతున్నా. హింసకు గురౌతున్న మహిళలు, చిన్నారులను రక్షించి తక్షణమే శాంతిభద్రతలను ఆమె అదుపులోకి తెస్తారని భావిస్తున్నా’అని గవర్నర్ ధన్కర్ వ్యాఖ్యానించారు. -
మే 5న మమత ప్రమాణ స్వీకారం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమత వరుసగా మూడో విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్‌నుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆమె రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ట్విట్టర్లో తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆమె ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. మమతా బెనర్జీ మే 5వ తేదీన ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరవుతారని ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఈ నెల 6వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు.అంతకుముందు జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొంటామని తెలిపారు. దీనిపై అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికైతే కోవిడ్ సంక్షోభంపై పోరాటమే ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తనకు సంప్రదాయం ప్రకారం ప్రధాని మోదీ నుంచి ఫోన్ కాల్ రాలేదన్నారు. ‘ఇలాంటి సందర్భాల్లో ప్రధానమంత్రి ఫోన్ చేయకపోవడం ఇదే మొదటిసారి. అయినా సరే, ఆయన బిజీగా ఉండి ఉండవచ్చు. ఈ విషయాన్ని నేను పట్టించుకోను’అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి. ప్రాణభయంతోనే రిటర్నింగ్ ఆఫీసర్ రీకౌంటింగ్ పెట్టలేదు నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చాక రీకౌంటింగ్ జరపాల్సిందేనని డిమాండ్లు వచ్చినప్పటికీ అక్కడి రిటర్నింగ్ అధికారి అందుకు ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఇవేనంటూ మమత కొన్ని విషయాలు చెప్పారు. ‘‘రీకౌంటింగ్ జరపండి అంటూ ఒకవేళ తాను ఆదేశిస్తే తీవ్రమైన పరిణామాలను తాను ఎదుర్కోవాల్సి రావచ్చు. తీవ్ర ‘ఒత్తిడి’కారణంగా ఒకవేళ ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తానేమో’’అని రిటర్నింగ్ అధికారి తీవ్ర ఆందోళనకు గురైనట్లు మమత మీడియా సమావేశంలో చెప్పారు. అందుకు సాక్ష్యంగా మమత ఒక ఎస్ఎంఎస్ను మీడియాకు చూపించారు. రిటర్నింగ్ అధికారి ఆ ఎస్ఎంఎస్ను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు పంపారని మమత చెప్పారు. ‘ముందుగా వెల్లడైన ఫలితాల ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం ఎలా మారుస్తుంది? ఈ అంశంలో మేం కోర్టుకు వెళ్తాం. నాలుగుగంటలపాటు సర్వర్ డౌన్ ఎందుకైంది? ప్రజాతీర్పును మేం గౌరవిస్తాం. కానీ ఒక అసెంబ్లీ స్థానంలోనే అవకతవకలు జరిగాయి. వాస్తవాలు మాకు తెలియాలి. రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలొచ్చాయి. టీఎంసీ కార్యకర్తలంతా ప్రశాంతంగా ఉండాలి’ అని మమత మీడియా సమావేశంలో అన్నారు. -
మమతకు జై కొట్టిన ‘కాంగ్రెస్’ జిల్లాలు
కోల్‌కతా: కాంగ్రెస్ కుంచుకోటలుగా ఉన్న ముస్లిం ఆధిక్య జిల్లాలైన మాల్దా, ముర్షీదాబాద్‌లు ఈసారి తృణమూల్‌కు జై కొట్టాయి. ఫలితంగా మమతా బెనర్జీ అద్వితీయ విజయం సాధ్యమైంది. ఈ రెండు జిల్లాల్లో టీఎంసీకి పెద్దగా పట్టులేదు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిలాల్లోని 12 సీట్లలో టీఎంసీ ఒక్క సీటూ గెలువలేదు. ముర్షీదాబాద్‌లోని 22 స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ఈ రెండు జిల్లాల్లోని 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 స్థానాల్లో (మాల్దాలో 7, ముర్షీదాబాద్‌లో– 14) నెగ్గింది. 2011 ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో కాంగ్రెసే విజయ ఢంకా మోగించింది. 2021 ఎన్నికల నాటికి పరిస్థితి తారుమారైంది. ఈ ప్రాంతంలో అనూహ్యంగా తృణమూల్ పుంజుకుంది. రెండు జిల్లాల్లోని 32 స్థానాల్లో 24 సీట్లలో టీఎంసీ విజయం సాధించింది. పోటీలో ఉన్న వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో శంషేర్‌గంజ్, జంగీపూర్ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 8 సీట్లలో విజయం సాధించి బీజేపీ కూడా ఈ ప్రాంతంలో గణనీయ స్థాయిలో బలపడింది. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ కూటమి ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం. మార్పునకు కారణమేంటి? ఈ రెండు ముస్లిం ఆధిపత్య జిల్లాలు. మాల్దాలో 51% జనాభా, ముర్షీదాబాద్‌లో 66% జనాభా ముస్లింలే. చాన్నాళ్లుగా వీరు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముస్లింలు అత్యంత వ్యూహాత్మకంగా ఓట్లు వేసినట్లు స్పష్టమవుతోంది. తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్ కూటమిల త్రిముఖ పోరులో, బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య తమ ఓట్లు చీలితే, అది అంతిమంగా బీజేపీకి లాభిస్తుందని వారు గుర్తించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నార్త్ మాల్దా స్థానంలో చోటు చేసుకున్న త్రిముఖ పోరు వల్ల బీజేపీ లాభపడిన విషయాన్ని వారు మర్చిపోలేదు. దాంతో, కీలకమైన ఈ ఎన్నికల్లో ఆ తప్పు చేయవద్దని, తృణమూల్, కాంగ్రెస్‌ల మధ్య తమ ఓట్లు చీలకూడదని నిర్ణయించుకున్నారు. మూకుమ్మడిగా తృణమూల్‌కు మద్దతిచ్చారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత, వివాదాస్పద ఎన్నార్సీ, సీఏఏలను మమత గట్టిగా వ్యతిరేకించడం ముస్లింలకు ఆమెపై విశ్వాసం పెరగడానికి కారణమైంది. బీజేపీ గెలిస్తే సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేస్తారన్న భయం కూడా ముస్లింలను మమతకు దగ్గర చేసింది. బీజేపీ గెలుపును అడ్డుకునేలా, ఈ రెండు జిల్లాల్లో ముస్లింల వ్యూహాత్మక ఓటింగ్ సరళి తృణమూల్ ఘనవిజయానికి బాటలు వేసింది. -
Nandigram: నందిగ్రామ్.. హై టెన్షన్
కోల్‌కతా: తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ తొలిసారి బరిలో నిలిచిన పశ్చి మ బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠత రేపాయి. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి మధ్య క్షణ క్షణం మారిపోతున్న ఓట్ల మెజారిటీ... మొత్తం రాష్ట్ర ఎన్నికల ఘట్టంలోనే అత్యంత ప్రధానమైనదిగా నిలిచింది. ఇద్దరు ప్రధాన పార్టీల ప్రత్యర్థుల మధ్య అటూ ఇటూ దోబూచులాడిన మెజారిటీ.. చివరకు సువేంధు అధికారిని వరించింది. మమతా బెనర్జీపై స్వల్ప ఆధిక్యంతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించింది. అయితే, నందిగ్రామ్ ఫలితాలపై తాను కోర్టుకు వెళ్తానని మమతా ప్రకటించారు. అంతకుముందు ఆదివారం ఉదయం కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా కొద్దిసేపటికే సువేంధు మమత కంటే ఆధిక్యంలోకి వచ్చారు.ఆ తర్వాత సువేంధు మెజారిటీ ఏకంగా ఎనిమిది వేల దాకా వెళ్లింది. మధ్యాహ్నందాకా సువేంధుదే పైచేయి. మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా పుంజుకుని మమత ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆధిక్యత మరొకరి చెంతకు చేరింది. ఒకానొక దశలో సువేంధు కేవలం ఆరు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లో మెజారిటీ సువేంధు, మమత మధ్య మారుతూ వచ్చింది. సువేంధు 1,200 ఓట్ల మెజారిటీలో గెలిచారని వార్తలు రాగా, ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 1,956 ఓట్ల ఆధిక్యంతో సువేంధు అధికారి గెలిచారని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్యాగాలు తప్పవు.. ఈసీ ప్రకటనపై మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. ‘‘నందిగ్రామ్‌లో ఓటమిని అంగీకరిస్తున్నాను. మరేం ఫరవాలేదు. అయితే, నందిగ్రామ్‌లో అక్రమాలు జరిగాయని విన్నాను. దీనిపై కోర్టుకు వెళతాను. మనం మొత్తం రాష్ట్రాన్నే గెలిచాం. ఇంతటి ఘన విజయం సాధించినపుడు ‘నందిగ్రామ్’లో ఓటమిలాంటి త్యాగాలు తప్పవు’’ అని ఫలితాల అనంతరం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో రీకౌంటింగ్ జరపాలని ఈసీని టీఎంసీ కోరగా అందుకు ఈసీ నిరాకరించింది. -
Mamata Banerjee: భారత్‌ను రక్షించిన బెంగాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ తన తీర్పుతో భారతదేశాన్ని రక్షించిందని తృణమూ ల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టిన బెంగాల్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె ఆదివారం సాయంత్రం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్–19 మహమ్మారిని అరికట్టడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడా విజయోత్సవాలు జరపొద్దని పార్టీ శ్రేణుల కు విజ్ఞప్తి చేశారు. ఇది బెంగాల్ ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. ఈరోజు భారత్‌ను బెంగాల్ కాపాడిందని పేర్కొ న్నారు. మానవత్వాన్ని సైతం రక్షించిందని వివరిం చారు. ఎన్నో అవాంతరాలకు ఎదురొడ్డి నిలిస్తే ఈ గెలుపుదక్కిందని వెల్లడించారు. కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, యంత్రాం గానికి వ్యతిరేకంగా పోరాటం సాగించామని గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ కాదు.. డబుల్ సెంచరీ ఎన్నికల సంఘం(ఈసీ) తీరుపైనా దీదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈసీ తమ పార్టీని వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడగా, ఎన్నికల్లో తమ పార్టీ డబుల్ సెంచరీ సాధించిందని వ్యాఖ్యానించారు. 2021లో 221 సీట్లు సాధించాలని ఆశించామని, లక్ష్యానికి చేరువయ్యా మని చెప్పారు. నందిగ్రామ్‌లో ఓట్ల లెక్కింపులో గందరగోళం జరిగిందని, దీనిపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. బెంగాల్లో గొప్ప విజయం సాధించామని, అదే సమయంలో నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. వారి తీర్పు ఏదైనప్పటికీ అంగీకరిస్తానని తెలిపారు. భారతీయులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాల్సిందే ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. పూర్తిగా కోలుకుంటానని, కాలుకు కట్టు (ప్లాస్టర్) తొలగిస్తానని కొద్ది రోజుల క్రితమే చెప్పానని అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. బెంగాల్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తానని పునరు ద్ఘాటించారు. ప్రతి భారతీయుడికి ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని 140 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వడానికి రూ.30,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఉచిత టీకా విషయంలో తన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే కోల్‌కతాలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. ఎన్నికల్లో తమ పార్టీకి అద్భుతమైన విజయం దక్కినప్పటికీ ప్రమాణ స్వీకారం నిరాడంబరంగానే చేస్తానని చెప్పారు. ఆర్భాటానికి దూరంగా ఉంటామన్నారు. కరోనా ఉధృతి కారణంగా విజయోత్సవాలకు సమయం లేదని, మహమ్మారిని అరికట్టడంపైనే దృష్టి పెడతానని వివరించారు. ఈ ముప్పు తొలగిపోయాక కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మెగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. -
గెలవలేదుకానీ.. గణనీయంగా పుంజుకున్న బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఆశించిన ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో పాగా వేసేందుకు సర్వ శక్తులు ఒడ్డినప్పటికీ అధికార పీఠం లభించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలన్న కాషాయ దళం ఆశలు నెరవేరలేదు. అయితే, రాష్ట్రంలో రాజకీయంగా పెద్దగా ఉనికే లేని స్థాయి నుంచి ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకోవడాన్ని బీజేపీ విజయ ప్రస్థానంగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాల సంఖ్య 3 మాత్రమే. ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం 10.16 మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి అసాధారణ స్థాయిలో కాషాయ దళం పుంజుకుంది. మోదీ హవా బెంగాల్లోనూ ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 2016లో 3 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన పార్టీ.. మూడేళ్లు తిరిగేనాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపి లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించగలిగింది. 40.7 శాతం ఓట్లతో 18 స్థానాల్లో గెలవగలిగింది. మోదీ హవాతో పాటు, బీజేపీ, ఆరెస్సెస్‌ల సోషల్ ఇంజినీరింగ్, క్షేత్రస్థాయి ప్రణాళిక, బూత్ స్థాయిలో కార్యకర్తల ఏర్పాటు, ఎన్నికల సంసిద్ధతలతో పాటు బీజేపీ వ్యతిరేక ఓటులో చీలిక కూడా అందుకు కారణాలుగా భావిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో, అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్లను గెల్చుకోలేనప్పటికీ.. మెరుగైన ఫలితాలనే బీజేపీ సాధించింది. సుమారు 37.11% ఓట్లతో 77 సీట్లను గెల్చుకుంది. రాష్ట్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న లెఫ్ట్, కాంగ్రెస్‌లను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచింది. -
టీఎంసీని గెలిపించిన అంశాలు ఇవే..
కోల్‌కతా: ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎన్నడు లేని విధంగా ఈసారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 8 దశల్లో నిర్వహించారు. ఇక బెంగాల్లో విజయం సాధించడం కోసం బీజేపీ అన్ని రకాలుగా కృషి చేసింది. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. బెంగాల్ ప్రజలు మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కే పట్టం కట్టారు. కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికి వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా టీఎంసీ పశ్చిమ బెంగాల్లో హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతుంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాల్లో 215 సీట్లలో టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు తెలుపుతున్నాయి. ఇక బీజేపీ 79 స్థానాల్లో ముందంజలో ఉంది. నందిగ్రామ్ రిజల్ట్‌పై ఉత్కంఠత కొనసాగుతుంది. బెంగాల్ టీఎంసీ విజయానికి దోహదం చేసిన అంశాలు ఇవే.. తక్కువ ఓటింగ్.. గతంతో పోల్చుకుంటే ఈ సారి బెంగాల్లో తక్కువ పోలింగ్ నమోదయ్యింది. కరోనాకు జడిసి చాలా మంది ఓటు వేయడానికి వెళ్లలేదు. తక్కువ పోలింగ్ నమోదైతే అధికార పార్టీకే లాభం జరుగుతుంది. బెంగాల్లో కూడా అదే జరిగింది. బీజేపీకి సీఎం అభ్యర్థి లేకపోవడం.. బెంగాల్లో బీజేపీ ఓటమి పాలవ్వడానికి ప్రధాన కారణం.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ నేతలు భారీగా అవినీతికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా దీదీని బెంగాల్ ప్రజలు ఆమోదించారు. ఇక బీజేపీ ప్రచార తీరును పరిశీలిస్తే.. స్థానిక నేతల కన్నా ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచార బాధ్యతలు నిర్వహించారు. స్థానికులతో బలమైన సంబంధాలు కలిగి ఉండటంలో వీరు విఫలమయ్యారు. కలిసి వచ్చిన బయటి వ్యక్తి నినాదం.. ఎన్నికల ప్రచరాంలో ప్రధానంగా దీదీ ‘‘బయటి వ్యక్తులు’’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మోదీ-అమిత్ షాల ద్వయాన్ని ‘బయటి వ్యక్తులు’ అంటూ ఆమె చేసిన ప్రచారం ఫలించింది. బెంగాలీ జాతీయవాదం, రాష్ట్ర సంస్కృతి ‘బయటివారికి’ అర్థం కాదని ప్రజలకు స్పష్టంగా చెప్పడంలో దీదీ విజయం సాధించారు. సంక్షేమ పథకాలు... ఎన్నికల వేళ దీదీ ఇచ్చిన హామీలు కూడా ఆమెకు బాగా కలసి వచ్చాయి. ముఖ్యంగా నగదు పథకాలు జనాలను ప్రబలంగా ఆకర్షించాయి. వీటిలో ప్రధానమైనవి మహిళల కోసం ప్రకటించిన- కన్యాశ్రీ, రూపశ్రీ పథకాలు వారిపై బాగా ప్రభావం చూపాయి. ఇవే టీఎంసీ గెలుపును సుగమం చేశాయి. కన్యాశ్రీ పథకం కింద, ఒక ఆడపిల్ల 8వ తరగతికి చేరుకున్న తర్వాత రూ .25 వేలు.. రూపాశ్రీ పథకం ద్వారా 18 ఏళ్లు నిండినప్పుడు అమ్మాయి కుటుంబానికి రూ .25 వేలు ఇస్తామని దీదీ హామీ ఇచ్చారు. ఇవే కాక ఉచిత బియ్యం, ఉచిత రేషన్ వంటి పథకాలు కూడా టీఎంసీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ ‘కట్-మనీ’, దోపిడీపై తీవ్ర ఆగ్రహం ఎదుర్కొంటున్నప్పటికి ఈ హామీలు టీఎంసీ విజయానికి దోహదం చేశాయి. మమతకు మద్దతుగా సీపీఎం-కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 18 సీట్లు, 40 శాతం ఓట్లను దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన సీపీఎం-కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బెనర్జీ పక్షాన ఉన్నట్లు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల సరళి తెలుపుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మమత బెనర్జీకి ఓటు షేర్ 6 శాతం పెరిగి 43 నుంచి 49 శాతానికి చేరింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 40 శాతం నుంచి 37 శాతానికి పడిపోయింది. ఇంతకుముందు సీపీఎం-కాంగ్రెస్ కలయికపై విశ్వాసం ఉంచిన ముస్లింలు ఇప్పుడు దీదీకి తమ పూర్తి మద్దతు తెలిపారు. దీనికి ప్రధాన కారణం పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఆమె దూకుడుగా ప్రచారం చేయడమే అంటున్నారు విశ్లేషకులు. ఈ సారి దీదీ ముస్లిం ఓట్లను గణనీయంగా రాబట్టుకోగలిగారు. యాంటీ హిందూ రాజకీయాలు.. యాంటీ రాజకీయాలు బీజేపీకి కొంత లాభాలను తెచ్చినప్పటికి.. టీఎంసీకే అధికంగా మేలు చేశాయి. ఈ నినాదం బీజేపీ కొన్ని హిందూ ఓట్లను పొందడానికి సహాయపడింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో దీని ప్రభావం బాగా ఉంది. అయతే ఇది బీజేపీ కంటే ఎక్కువగా మమతకే మేలు చేసింది. ముస్లింలు అందరూ టీఎంసీకే సామూహికంగా ఓటు వేయడానికి ఇది దారి తీసింది. -
ఎగ్జిట్ పోల్స్: బీజేపీకి షాకిచ్చిన దీదీ
న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల మినీ సంగ్రామానికి నేటితో తెరపడింది. గురువారంతో.. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగా.. పశ్చిమ బెంగాల్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజుతో ముగిసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అత్యధికంగా ప్రజలు అధికార పార్టీలకే పట్టం కట్టారు. ఒక్క తమిళనాడులో మాత్రం డీఎంకే అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఇక బెంగాల్లో బీజేపీ, టీఎంసీల మధ్య రసవత్తర పోరు సాగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ తక్కువ స్థానాలకే పరిమితం అయినప్పటికి ఈ సారి మాత్రం టీఎంసీకి గట్టి పోటీనే ఇచ్చినట్లు పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఇక ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్రాల వారిగా ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ (294 సీట్లు)... సీఓటర్ సర్వే: టీఎంసీదే విజయం సీఓటర్: టీఎంసీ 158, బీజేపీ 115, కాంగ్రెస్ ప్లస్ - 19 బెంగాల్ పీమార్క్ : బీజేపీ 120, టీఎంసీ 158, లెఫ్ట్+ 14 బెంగాల్ ఈటీజీ : బీజేపీ 110, టీఎంసీ 169, లెఫ్ట్+ 12 రిపబ్లిక్-సీఎన్ఎక్స్ : బెంగాల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ రిపబ్లిక్-సీఎన్ఎక్స్: టీఎంసీ 128-138, బీజేపీ138-148, కాంగ్రెస్: 11-21 సీఎన్ఎన్: టీఎంసీ 128-132, బీజేపీ: 138-148, ఇతరులు - 20 అస్సోం(126 అసెంబ్లీ స్థానాలు)... ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: అసోంలో బీజేపీదే విజయం. బీజేపీ: 75-85, కాంగ్రెస్: 40-50 రిపబ్లిక్ ఎగ్జిట్‌పోల్: బీజేపీ 74-84, కాంగ్రెస్: 40-50 కేరళ (140 అసెంబ్లీ స్థానాలు)... రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: లెఫ్ట్‌ఫ్రంట్ 70-80, కాంగ్రెస్ 40-50 తమిళనాడు (234 అసెంబ్లీ స్థానాలు).. రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: డీఎంకే 160 -170, అన్నాడీఎంకే 58-68 పుదుచ్చేరి (30 అసెంబ్లీ స్థానాలు) ఇక్కడ బీజేపీకి విజయవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
Mamata Banerjee: ఎన్నికల సంఘం బీజేపీ గూటి చిలక
కోల్కత్తా: ఏడో దశ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటేసిన అనంతరం ఆన్లైన్లో నిర్వహించిన ఓ ప్రచార సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘంపై చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ స్వాగతించారు. ఎన్నికల సంఘం తీరుపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం బీజేపీ గూటికి చెందిన చిలకగా అభివర్ణించారు. ‘మద్రాస్ హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా. కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం కారణమని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఎన్నికల సంఘం బీజేపీ గూటికి చెందిన చిలక. కరోనా కేసులు పెరగడానికి కారణం అదే’ అని మమత బెనర్జీ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యులని పేర్కొన్నారు. ఎన్నికలు త్వరగా ముగించాలని తాము ఎన్నికల సంఘానికి చెప్పినా వినిపించుకోలేదని మమత గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం కారణమని పునరుద్ఘాటించారు. చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ -
వైరల్: ‘ఆక్సిజన్ కావాలంటే ఈ నాయకులకు కాల్ చేయండి’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా జనాలు కరోనాతో విలవిల్లాడుతుంటే.. ధైర్యం చెప్పాల్సిన రాజకీయ నాయకులు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్న విధం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. అవును మరి ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీలు భారీ ఎత్తున జనాలను పోగు చేసి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ ఫలితం ఇప్పుడు జనాలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులకు బుద్ది చెప్పడం కోసం పశ్చిమబెంగాల్ నెటినులు చేసిన ఓ వినూత్న ఆలోచన తాజాగా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసిన నేతలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితయ్యారు. ఎన్నికల వేళ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి వైరస్ వ్యాప్తికి కారణమయిన రాజకీయ నాయకులు ప్రసుత్తం వైరస్ విజృంభిస్తున్న వేళ ఎవరూ కనిపించడం లేదు. దాంతో నెటిజనులు సదరు నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత ఫోన్ నంబర్లున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిలో టీఎంసీ, బీజేపీ రెండు పార్టీల నేతలున్నారు. ఫోన్ నంబర్లున్న ఫోటోతో పాటు ‘‘కరోనా అంటే భయం ఎందుకు. మన దగ్గర రాజకీయ నాయకులున్నారు. జనాలకు కష్టం వచ్చిందంటే చాలు.. వారు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ప్రజల కోసం పాటు పడతారు. మీకు ఆక్సిజన్, రక్తం, మాస్క్, శానిటైజర్, అంబులెన్స్ వంటి సేవలు కావాల్సి వస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫోటోలోని నాయకుల నంబర్‌కు కాల్ చేయండి’’ అనే మెసేజ్ చేశారు. ఈ ఫోటోల 14 మంది బీజేపీ, టీఎంసీ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత మొబైల్ నంబర్లు ఉన్నాయి. వీరిలో సువేందు అధికారి, బాబుల్ సుప్రియో, రాజ్ చక్రవర్తి వంటి ప్రముఖులు పేర్లు కూడా ఉండటం గమనార్హం. ఇక బెంగాల్లో ఆదివారం ఒక్కరోజన 15,889 కేసులు వెలుగు చూశాయి. చాలా ఆస్పత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్ కొరత నెలకొంది. దాంతో పలు ఆస్పత్రులు కొత్త వారిని ఎవరిని చేర్చుకోవడం లేదు. ఇక వైరస్ వ్యాప్తికి అసెంబ్లీ ఎన్నికలే కారణమని జనాలు బలంగా విశ్వసిస్తున్నారు. అన్ని పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాయి. జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వీరిలో చాలా మంది మాస్క్ కూడా ధరించలేదని.. అందువల్లే వైరస్ వ్యాప్తి ఉధృతం అయ్యిందని సామాన్యులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది -
మమతవి శవ రాజకీయాలు
అసన్సోల్/గంగారాంపూర్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగు దశలు ముగిసేనాటికే తృణమూల్ పార్టీ దాదాపు ముక్కలు చెక్కలు అయిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇక ఎనిమిది దశల పోలింగ్ ప్రక్రియ ముగిసేనాటికి తృణమూల్ కథ ముగిసిపోతుందని, సీఎం మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ ఓటమి ఖాయమవుతుందని మోదీ జోస్యం చెప్పారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మోదీ రాష్ట్రంలో అసన్సోల్లో ప్రచార ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. సీతల్‌కూచీ ఘటనను మమత తనకు అనుకూలంగా మలుచుకున్నారని మోదీ ఆరోపించారు. ఆ ఐదుగురి మరణాలతో మమత శవ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆ తర్వాత మోదీ గంగారాంపూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మమత సర్కార్‌లో అక్రమ బొగ్గు తవ్వకం జరిగిందంటూ నిప్పులుచెరిగారు. Üున్నిత అంశమైన కూచ్ బెహార్లో కాల్పుల ఘటనపై మమత వ్యవహార శైలి ఎలాంటిదో ఆడియో క్లిప్‌ను వింటే అర్ధమైపోతుందని మోదీ ఆరోపించారు. కాల్పులు చనిపోయిన వారి మృతదేహాలతో భారీ ర్యాలీ చేపట్టాలని టీఎంసీ జిల్లా అధ్యక్షుడు, సీతల్‌కూచీ నుంచి పార్టీ అభ్యర్థి పార్థ ప్రతీమ్ రాయ్‌కు మమత ఫోన్ ఆదేశించినట్లుగా చెబుతున్న ఆడియో వివాదమవడం తెల్సిందే. ‘తన రాజకీయ స్వలాభం కోసం మమత ఎలాంటి శవ రాజకీయాలు చేస్తుందో.. ఆ ఆడియో టేప్ వింటే తెలుస్తుంది. ఆమెకు గతంలోనూ ఇలా శవ రాజకీయాలు చేశారు’ అని మోదీ ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, బెంగాల్ ప్రజలకు మధ్య మమత అడ్డుగోడలా నిలిచారు. పీఎం–కిసాన్, ఆయుష్మాన్ భారత్ పథకాల ప్రతిఫలాలను బెంగాల్ ప్రజలకు దక్కకుండా మమత అడ్డుకున్నారు. నన్ను నిందించకుండా మమతది ఏ రోజూ గడవలేదు’ అని మోదీ అన్నారు. -
బీజేపీతో కరోనా పెరుగుతోంది: మమత
కోల్‌కతా: ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలోకి బీజేపీ పెద్ద ఎత్తున బయటి వ్యక్తులను తీసుకువ చ్చిందని, అందువల్ల రాష్ట్రంలో కరోనా కేసులు పె రుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. జల్‌పయిగురిలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కూడా కేంద్రం సహకరించడం లేదన్నారు. మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడంపై తనకు 24 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించడంపై స్పందిస్తూ.. ‘హిందువులు, ముస్లింలు, అందరూ ఓటేయాలని కోరడం తప్పా? ప్రతీ సభలో నన్ను అవమానిస్తున్న ప్రధాని మోదీని ప్రచారం నుంచి ఎందుకు బహిష్కరించడంలేదు?’ అని ప్రశ్నిం చారు. మమత బెనర్జీకి వీడ్కోలు పలికేందుకు సమయం ఆసన్నమైందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పుల్లో మరణించిన ఓ బాధితుడి కుటుంబాన్ని ఓదార్చి, వారి బిడ్డను లాలిస్తున్న మమతా బెనర్జీ -
బీజేపీ హంతకుల పార్టీ: మమత
తృణమూల్ కాంగ్రెస్‌పై నేరం మోపాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు సొంత కార్యకర్తలనే చంపేస్తున్నారని, సొంత వాహనాలను ధ్వంసం చేసుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థి స్వయంగా సొంత కారును ధ్వంసం చేసుకుని, టీఎంసీపై ఆరోపణలు చేసిందన్నారు. కూచ్‌బిహార్ హింసాకాండను సమర్ధిస్తూ మాట్లాడుతున్న నాయకులపై రాజకీయాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కూచ్‌బిహార్ జిల్లాలోని సీతల్‌కుచిలో శనివారం సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై మమత సోమవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేసే వారు మనుషులే కారని మండిపడ్డారు. ‘సీతల్‌కుచి తరహా కాల్పులు మరిన్ని జరుగుతాయని కొందరు నాయకులు అంటున్నారు. సీతల్‌కుచిలో జరిగిన కాల్పుల్లో చనిపోయినవారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటే బావుండేదని మరి కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మమత ప్రచారంపై ఈసీ నిషేధం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడం, కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సోమవారం ఎన్నికల సంఘం స్పందించింది. 24 గంటల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిషేధం విధించింది. ఏప్రిల్ 12 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో కీలక అంశాలను ఆమె కావాలనే దాటవేశారని వ్యాఖ్యానించింది. ఈసీ నిర్ణయంపై మమత తీవ్రంగా స్పందించారు. ఈ నిషేధం రాజ్యాంగవిరుద్ధమని, దీనిపై కోల్‌కతాలో నేడు(మంగళవారం) ధర్నా చేస్తానని ప్రకటించారు. ఈసీ నిష్పక్షపాక్షితపై తమకు మొదట్నుంచీ అనుమానాలున్నాయని టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. మమతపై విధించిన తాజా నిషేధంతో ఈసీ వేసుకున్న ముసుగు పూర్తిగా తొలగిపోయిందని, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోదీ, షాల ఆదేశాల మేరకు పనిచేస్తోందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. -
సర్కారు ఎవరిదో నిర్ణయించేది ఆ రెండు జిల్లాలే!
కోల్‌కతా: నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ.. పశ్చిమబెంగాల్లో ఈ రెండు జిల్లాలు తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటలు. ఈ కోటలను బద్దలు కొట్టి టీఎంసీ ఓటమికి బాటలు వేయాలనేది బీజేపీ ప్రణాళిక. ఈ రెండు జిల్లాల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుపొందడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలన్నది టీఎంసీ ఆలోచన. మొత్తం 294 స్థానాల అసెంబ్లీలో ఈ రెండు జిల్లాలకు కలిపి 64 సీట్లు ఉన్నాయి. నార్త్ 24 పరగణలో 33, సౌత్ 24 పరగణలో 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్ 24 పరగణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు జిల్లాలకు బంగ్లాదేశ్‌తో సరిహద్దులున్నాయి. శరణార్థుల జనాభా కూడా ఇక్కడ ఎక్కువ. 1980లో 24 పరగణ జిల్లాను అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం రెండు జిల్లాలుగా విభజించింది. మొదట్లో ఈ ప్రాంతంలో వామపక్షాలకు గట్టి పట్టు ఉన్నప్పటికీ క్రమంగా టీఎంసీ పుంజుకుని, లెఫ్ట్ బలాన్ని తగ్గించేసింది. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాలు ఈ ప్రాంతంలో టీంఎసీని మరింత బలోపేతం చేశాయి. 2011, 2016 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2016లో నార్త్ పరగణలో 27, సౌత్ పరగణలో 29 స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో నార్త్ పరగణలో బీజేపీ కొంతవరకు ప్రభావం చూపగలిగింది. ‘బెదిరింపులతో, ప్రలోభాలతో 2019 ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావం చూపింది. కానీ ఆ తరువాత మేం జాగ్రత్తపడ్డాం. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకున్నాం’ అని నార్త్ 24 పరగణ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు జ్యోతిప్రియొ తెలిపారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విబేధాలు, మత ఘర్షణల కారణంగా రెండు జిల్లాల్లోనూ టీఎంసీ బలం కొంత తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచారాస్త్రంగా చేపట్టి, శరణార్ధులను ఆకర్షించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో రెండింటిని బీజేపీ గెల్చుకోగలిగింది. అలాగే, అక్కడ ప్రబలంగా ఉన్న మథువా వర్గంలో పట్టు సాధించింది. నార్త్ 24 పరగణలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మథువాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ రెండు జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు బీజేపీలో చేరడం టీఎంసీకి ఆందోళనకరంగా మారింది. కొత్తగా వచ్చిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సౌత్ 24 పరగణ జిల్లాలో టీఎంసీకి చెందిన మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐఎస్ఎఫ్ కాంగ్రెస్, లెఫ్ట్‌లతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ప్రచారం సాయంతో నార్త్ 24 పరగణలో 60% సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ధీమాగా ఉన్నారు. -
దీదీ నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్: మోదీ
బర్ధమాన్: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇన్నింగ్స్ ముగిసిందని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన క్రికెట్ పరిభాషలో కాసేపు మాట్లాడారు. గడచిన నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఫోర్లు, సిక్సులు కొట్టారని, బీజేపీ సెంచరీ కొట్టేసిందని వ్యాఖ్యానించారు. సగం మ్యాచ్‌లోనే టీఎంసీని ప్రజలు ఊడ్చేశారన్నారు. ‘ఓటర్లు దీదీని నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ చేశారు. బెంగాల్లో ఆమె ఇన్నింగ్స్ ముగిసింది. ఆమె మొత్తం టీమ్‌ను కూడా గ్రౌండ్ నుంచి వెళ్లిపోవాలని ప్రజలు తేల్చేశారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒక టీఎంసీ నాయకురాలు దళితులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలతో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల వారిని భిక్షగాళ్లు అని ఇటీవల టీఎంసీ మహిళానేత, ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న సుజాత మోండల్ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘దీదీ తనను తాను రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పుకుంటారు. ఆలాంటి టైగర్ అనుమతి లేకుండా పార్టీ నేత ఆ వ్యాఖ్యలు చేయగలరా? అలాంటి మాటలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. మమత బెనర్జీ కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. క్షమాపణ చెప్పలేదు’ అన్నారు. దళితులను అవమానించి మమత పెద్ద తప్పు చేశారన్నారు. బంగ్లాదేశ్‌లో తాను మథువా సామాజిక వర్గానికి చెందిన సంస్కర్త హరిచంద్ ఠాకూర్ జన్మస్థలాన్ని సందర్శించడాన్ని మమత తప్పుబట్టారని మథువా వర్గం బలంగా ఉన్న కల్యానిలో జరిగిన సభలో ప్రధాని పేర్కొన్నారు. ఒక్కసారి అధికారం కోల్పోతే తిరిగి రాలేనన్న విషయం మమతకు అర్థమైందని వ్యాఖ్యానించారు. -
దీదీ ఆటలు సాగవు.. గద్దె దిగక తప్పదు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్‌ను హింసాత్మకంగా మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కూచ్‌బెహార్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆయన శనివారం బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని సిలిగురి, కృష్ణానగర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర బలగాలపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో నెగ్గడానికి రక్తపాతం సృష్టించి, రిగ్గింగ్ చేసుకోవాలన్న తృణమూల్ కాంగ్రెస్ కుట్రలతోనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూచ్‌బెహార్ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బెంగాల్లో బీజేపీకి ప్రజాదరణ పెరగడం చూసి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ గూండాలు భరించలేకపోతున్నారని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆక్రోశం పట్టలేకపోతున్నారని, అందుకే భద్రతా సిబ్బందిపై దాడి చేయాలంటూ జనానికి నూరిపోస్తున్నారని విమర్శించారు. మళ్లీ కుర్చీ దక్కకుండా పోతోందన్న భయంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రిగ్గింగ్‌కు అడ్డుగా ఉన్నాయన్న కారణంతోనే కేంద్ర బలగాలపై తృణమూల్ కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దీదీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఆమె గద్దె దిగక తప్పదని తేల్చిచెప్పారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే లంచాల సంస్కృతికి చరమ గీతం పాడుతామన్నారు. మూడు టీలకు(టీ, టూరిజం, టింబర్) మాఫియా చెర విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 2వ తేదీ నుంచి బెంగాల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకుంటుందని, దోపిడీదార్లు కాదని మోదీ స్పష్టం చేశారు. -
బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం
సితాల్‌కుచీ/సిలిగురి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అతిపెద్ద హింసాకాండ శనివారం చోటుచేసుకుంది. కూచ్‌బెహార్ జిల్లాలో రెండు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూచ్‌బెహార్ జిల్లా సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలోని మాతాభంగా పోలింగ్ కేంద్రం వద్ద శనివారం ఉదయం 9.40 గంటలకు కాల్పులు జరిగాయి. ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాల నుంచి తుపాకులు లాక్కొనేందుకు స్థానికులు ప్రయత్నించారని, దాడికి దిగారని పోలీసు అధికారులు చెప్పారు. ఆత్మరక్షణ కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మృతులు తమ పార్టీ మద్దతుదారులని అధికార తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. క్యూఆర్టీ వాహనం ధ్వంసం ఓట్లు వేయడానికి వచ్చినవారిపై తొలుత కొందరు రాళ్లు రువ్వారని, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారని తెలిపారు. కేంద్ర బలగాలకు చెందిన క్విక్ రియాక్షన్ టీమ్(క్యూఆర్టీ) వాహనాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గలేదని, భద్రతా సిబ్బందిపైకి దూసుకొచ్చారని, తుపాకులు లాక్కొనేందుకు ప్రయత్నించారని వివరించారు. ఆత్మరక్షణతోపాటు పోలింగ్ బూత్‌ను, ఎన్నికల సిబ్బందిని రక్షించడానికి అల్లరి మూకపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారన్నారు. నలుగురు మరణించగా, మరో నలుగురికి బుల్లెట్ గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఈ మొత్తం ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4 మృతదేహాలను అధికారులు సమీప ఆసుపత్రికి తరలించారు. మరో ఘటనలో ఓటర్ కాల్చివేత కూచ్‌బెహార్ జిల్లాలో సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలో శనివారం ఉదయం మరో దారుణం చోటుచేసుకుంది. మొదటిసారి ఓటు వేసేందుకు వచ్చిన ఆనంద బర్మన్(18)ను పఠాన్‌తులీలో 85వ నంబర్ పోలింగ్ బూత్ బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో బర్మన్ మరణించాడు. 126/5 బూత్‌లో పోలింగ్ నిలిపివేత సితాల్‌కుచీ నియోజకవర్గంలోని 126/5 పోలింగ్ బూత్ వద్ద కాల్పులు జరగడం, నలుగురు మరణించడంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ వెంటనే పోలింగ్‌ను నిలిపివేశారు. రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర బలగాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయన్న పుకారు కార్చిచ్చులా వ్యాపించడంతో దా దాపు 400 మంది వెంటనే 126/5 పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారని, కేంద్ర జవాన్లను ఘెరావ్ చేశారని కూచ్‌బెహార్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నిజానికి పోలింగ్ బూత్ వద్ద ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోతే భద్రతా సిబ్బంది సపర్యలు చేశారని అన్నారు. కానీ, అతడిని కాల్చి చంపారని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు ఎన్నికల సందర్భంగా బెంగాల్లో పలు చోట్ల టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దిన్హతా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన గాయాలపాలయ్యారు. బెహలా పూర్బా స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి పాయల్ సర్కారు కారుపై అల్లరి మూక దాడికి పాల్పడింది. వారి బారి నుంచి ఆమె క్షేమంగా తప్పించుకున్నారు. బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీపైనా టీఎంసీ మద్దతుదారులు దాడికి దిగారు. హుగ్లీ జిల్లాలోని చుచురాలో ఆమె కారును ధ్వంసం చేశారు. హౌరా జిల్లాలోని బాల్లీలో బీజేపీ అభ్యర్థి బైశాలీ దాల్మియా కాన్వాయ్‌పై టీఎంసీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కోల్‌కతాలో బీజేపీ అభ్యర్థి ఇంద్రనీల్ ఖాన్‌ను టీఎంసీ శ్రేణులు ఘెరావ్ చేశాయి. జాదవ్‌పూర్‌లో సీపీఎం ఏజెంట్‌పై కొందరు దుండగులు కారం పొడి చల్లి దాడి చేశారు. బంగోర్ నియోజకవర్గంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, టీఎంసీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటిదాకా 8 మంది అరెస్టు కూచ్‌బెహార్ జిల్లాలో రెండు హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి అరీఫ్ అఫ్తాబ్ చెప్పారు. రెండు ఘటనలపై కూచ్‌బెహార్ జిల్లా కలెక్టర్, ఎస్పీ నుంచి నివేదికను కోరినట్లు తెలిపారు. సితాల్‌కుచీ అసెంబ్లీ స్థానం పరిధిలో జోర్పాట్కీ పోలింగ్ బూత్ వద్ద రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొందన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగాయన్నారు. పఠాన్‌తులీలో యువకుడిని కాల్చి చంపిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగో దశలో 76.16 శాతం ఓటింగ్ పశ్చిమ బెంగాల్లో నాలుగో దశలో 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. 15,940 పోలింగ్ కేంద్రాల్లో జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర బలగాలను, పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ స్పందించింది. ప్రిసైడింగ్ అధికారి సూచిస్తే తప్ప పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లొద్దని కేంద్ర బలగాలకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది. కూచ్‌బెహార్ జిల్లాలో అశాంతి తలెత్తకుండా రాజకీయ నాయకుల ప్రవేశంపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాబోయే 72 గంటల వరకూ ఎవరూ జిల్లాలో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఐదో దశ ఎన్నికల్లో ‘సైలెన్స్ íపీరియడ్’ను 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్లో మరో నాలుగు దశల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. శనివారం కూచ్‌బెహార్ జిల్లాలో మూడో దశ ఎన్నికల సందర్భంగా హింస చోటుచేసుకోవడం, నలుగురు మరణించడంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమయ్యింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు బెంగాల్‌కు అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 1,000 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నాయి. -
మమతకు ఈసీ మరో నోటీసు
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలపై రెచ్చగొట్టేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల సంఘం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి గురువారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా భారతీయ శిక్షాస్మృతిని, ఎన్నికల కోడ్‌ను మమతా బెనర్జీ ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఈసీ ఆ నోటీసుల్లో పేర్కొంది. శనివారం ఉదయం 11 గంటల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని మమతను ఆదేశించింది. ‘ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలను తన వ్యాఖ్యల ద్వారా అసత్యపూరితమైన వ్యాఖ్యలతో, రెచ్చగొట్టేలా, విచక్షణ రహితంగా మమత దూషించారనేందుకు, అవమానించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలతో వారిలో నైతికస్థైర్యం దెబ్బతింటుంది’ అని ఈసీ పేర్కొంది. 1980ల నుంచి ఎన్నికల్లో కేంద్ర బలగాలు విలువైన సేవ చేస్తున్నాయని గుర్తు చేసింది. ఈసీ నోటీసుపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈసీ నోటీసులను పట్టించుకోబోనన్నారు. సీఆర్పీఎఫ్పై తన ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు. ‘బీజేపీ కోసం పనిచేయడం ఆపి వేయనంత వరకు సీఆర్పీఎఫ్ తప్పులపై మాట్లాడుతూనే ఉంటాను. వారు ఆ పని ఆపేస్తే వారికి సెల్యూట్ చేస్తాను’ అని స్పష్టం చేశారు. ‘మీ షోకాజ్ నోటీసులను నేను పట్టించుకోను. మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఎన్నికల రోజున ప్రధాన మంత్రి ప్రచారం చేస్తే మీ దృష్టిలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ఈసీని ప్రశ్నించారు. జమల్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో శుక్రవారం మమత పాల్గొన్నారు. దాదాపు వారం వ్యవధిలో మమతకు ఈసీ నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి. ముస్లింలను మతపరంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై ఇప్పటికే ఆమెకు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, బీజేపీకే ఓటేయాలని ఓటర్లను, ముఖ్యంగా మహిళలను బెదిరిస్తున్నాయని గత కొన్ని రోజులుగా మమత ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బెంగాల్లో హింసకు అమిత్ షా కుట్ర రాష్ట్రంలో హింసను రాజేసేందుకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా కుట్ర చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. అనైతిక చర్యలకు పాల్పడేలా పోలీసులను ప్రోత్సహిస్తున్నారన్నారు. షాను నియంత్రించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘ఇలాంటి గూండా హోం మంత్రిని నా జీవితంలో చూడలేదు. ఆయన పులి కన్నా ప్రమాదకరం. ఆయనతో మాట్లాడాలంటేనే ప్రజలు భయపడ్తున్నారు. షాను నియంత్రించాలని ప్రధానిని కోరుతున్నా. ఆయన వల్ల బెంగాల్లో అల్లర్లు, హింస చెలరేగే ప్రమాదముంది’ అని మమత ఒక ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. బెంగాల్ మరో గుజరాత్‌లా మారకుండా చూడాలని, బీజేపీకి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్ధించారు. -
మమతకు ఈసీ నోటీసు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం బుధవారం నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు 48 గంట ల్లోగా స్పందించాలని ఆదేశించింది. హూగ్లీ జిల్లాలో ని తారకేశ్వర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగిస్తూ.. ముస్లింలంతా టీఎంసీకే ఓటేయాలని, వేర్వేరు పార్టీలకు వేసి ఓట్లను చీల్చవద్దని కోరారు. దీనిపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దాంతో, ఆ వ్యాఖ్యలు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈసీ మమతకు నోటీసు జారీ చేసింది. ‘మైనారిటీల కోసం ఐక్యశ్రీ పథకం ప్రారంభించాం. 2.35 లక్షల మంది మైనారిటీలకు లబ్ధి చేకూర్చాం. మైనారిటీ సోదర, సోదరీమణులకు చేతులెత్తి ప్రార్థిస్తున్నా. మైనారిటీ ఓట్లను చీల్చకండి. బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న ఆ సైతాను మాటలను నమ్మకండి. అతడు హిందూ, ముస్లిం ఘర్షణలు చెలరేగాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎన్నో చేస్తుంటాడు. బీజేపీ రహస్య మిత్రుల్లో అతడు ఒకడు. ఇటు సీపీఎం, బీజేపీ నేతలు మైనారిటీ ఓట్లను చీల్చేందుకు బీజేపీ ఇచ్చిన డబ్బులు పంచుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడ్తారు. నా హిందూ కుటుంబ సభ్యులను అభ్యర్థిస్తున్నా. బీజేపీ మాటలు విని హిందూ, ముస్లింలుగా మీరు విడిపోవద్దు’ అని మమత ప్రసంగించారని బీజేపీ పేర్కొంది. -
ఆయనేమైనా దేవుడా?
ఖనాకుల్/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరో ఆరు దశల ఎన్నికలు జరగాల్సి ఉండగానే, బీజేపీ విజయం తథ్యమని ప్రధాని మోదీ చెప్పడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ఫలితాలను ముందే చెప్పేయడానికి ఆయన ఏమైనా దేవుడా? సూపర్ మ్యానా? అని ప్రశ్నించారు. మైనార్టీల ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ ఓ వ్యక్తికి డబ్బులిస్తోందని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) వ్యవస్థాపకుడు అబ్బాస్ సిద్దిఖీపై పరోక్షంగా విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలంటూ ప్రధాని మోదీ రాష్ట్ర అధికారులను ఆదేశిస్తున్నారని, తద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ ఆదివారం హుగ్లీ, హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. పలుచోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించబోనని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఆరేళ్లుగా ప్రజలను కష్టాలపాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయడం తప్ప వెలగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలాన్ని కుళ్లిపోయిన పుష్పం అని మమతా బెనర్జీ అభివర్ణించారు.∙మోదీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి హేళనగా మాట్లాడుతున్నారని పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత శశి పంజా ఆదివారం విమర్శించారు. దీదీ ఓ దీదీ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రధాని మోదీ కేవలం మమతా బెనర్జీనే కాదు మొత్తం బెంగాల్ మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. -
మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర
కోల్‌కతా: ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆరోపించారు. 24 పరగణ జిల్లాలో శనివారం ఆమె పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ముస్లిం ఓట్లను చీల్చే బీజేపీ కుట్రలో పావులుగా మారొద్దని రాష్ట్రంలోని ముస్లింలకు మమత పిలుపునిచ్చారు. ‘బీజేపీ మద్దతుతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక పార్టీ, బెంగాల్లో ఆ పార్టీ మిత్రపక్షమైన మరో పార్టీ ముస్లిం ఓట్లను చీల్చాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి కుయుక్తులను తిప్పికొట్టండి’ అని ఆమె పిలుపునిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం, అబ్బాస్ సిద్ధిఖీల ఐఎస్ఎఫ్లను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో మమత చేసిన ఇదే తరహా వ్యాఖ్యలను ఎంఐఎం, ఐఎస్ఎఫ్ ఇప్పటికే తోసిపుచ్చాయి. ఐఎస్ఎఫ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. మతం పేరుతో బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని హిందువులను కూడా మమత కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, రాష్ట్రంలో ప్రశాంతతను దెబ్బతీయాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. మీ ప్రాంతాల్లో బయటివారు కనిపిస్తే వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తాను హిందుత్వాన్ని విశ్వసించే వ్యక్తినని మమత మరోసారి గుర్తు చేశారు. దళితుల ఇళ్లల్లో ఆ భోజనం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటు న్నారని, అయితే ఆ భోజనాన్ని ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి తెప్పించుకుంటు న్నారని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు. తాను బ్రాహ్మణ మహిళను అని, అయితే, తనకు అన్ని సమయాల్లో సహాయకారిగా ఉండి, వంట చేసి పెట్టేది ఒక ఎస్సీ మహిళ అని వివరించారు. వీడియోపై వివాదం మమత వీల్ చెయిర్లో కూర్చుని గాయమైన తన కాలును పైకి, కిందకు కదిలిస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సానుభూతి ద్వారా ఓట్లు పొందాలని మమత ఈ డ్రామాలు చేస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని టీఎంసీ బదులిచ్చింది. -
బీజేపీ నియంతృత్వాన్ని ఎదిరిద్దాం
న్యూఢిల్లీ/నందిగ్రామ్: బీజేపీ, ఆ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై, సమాఖ్య స్ఫూర్తిపై వరుస దాడులు చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. స్వాతంత్య్రం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత దిగువకు దిగజారాయని పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వంపై కలసికట్టుగా పోరాడుదామని విపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీల నేతలకు ఆమె రాసిన లేఖను బుధవారం టీఎంసీ విడుదల చేసింది. ‘ఈ లేఖను మీతో పాటు దేశంలోని బీజేపీయేతర పార్టీల నాయకులకు రాస్తున్నాను. ప్రజాస్వామ్యంపై, సమాఖ్య విధానంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వరుస దాడులకు పాల్పడుతోంది. ఇది చాలా ఆందోళనకర అంశం. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన, ఒక ప్రత్యామ్నాయ వేదికను ప్రజలకు అందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా విపక్ష నాయకులకు రాసిన లేఖలో మమత పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)కి అపరిమిత అధికారం, ఢిల్లీ ప్రభుత్వమంటే ఎల్జీనే అని స్పష్టం చేసే చట్టంపై లేఖలో మమత మండిపడ్డారు. ‘ఆ చట్టంతో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం అధికారాలను లాగేసుకుంది. ఆ అధికారాలను తన ప్రతినిధి అయిన ఎల్జీ చేతిలో పెట్టింది. ఎల్జీని అప్రకటిత ఢిల్లీ వైస్రాయ్గా మార్చింది’ అని మమత వివరించారు. ఢిల్లీలో 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజా తీర్పును బీజేపీ అంగీకరించడం లేదన్నారు. ఆ చట్టం భారతదేశ సమాఖ్య విధానంపై జరిపిన ప్రత్యక్ష దాడి అని ఆమె అభివర్ణించారు. సోనియాతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, బీజేడీ నాయకుడు నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫెరెన్స్‌కు చెందిన ఫారూఖ్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్యలకు మమత ఈ లేఖను పంపించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రాలు తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువచ్చే జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళిక సంఘం... తదితర వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను మున్సిపాలిటీల స్థాయికి కుదించాలని, దేశంలో ఏకపార్టీ అధికార వ్యవస్థ కోసం కుట్ర పన్నుతోందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. అక్రమ మార్గాల ద్వారా సేకరించిన నిధులను రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను అధికారంలో నుంచి కూలదోయడానికి, బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులని, వాటిని ప్రైవేటు పరం చేయాలన్న బీజేపీ ఆలోచన నిర్లక్ష్యపూరితమైందని విమర్శించారు. బీజేపీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి రావాలని బీజేపీయేతర పార్టీల నాయకులను ఆమె కోరారు. కలిసికట్టుగా పోరాడితేనే విజయం సాధించగలమని, ఈ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ విషయంలో ఒక కార్యాచరణ రూపొందించే విషయమై చర్చిద్దామని ఆమె ప్రతిపాదించారు. మమత లేఖపై బీజేపీ స్పందించింది. మమత డిక్షనరీలో లేని పదమే ప్రజాస్వామ్యమని వ్యాఖ్యానించింది. మమత ప్రతిపాదనకు పీడీపీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నుంచి మద్దతు లభించింది. కోట్లు కుమ్మరిస్తున్నారు ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ నేతలు కోట్ల రూపాయలను ఓటర్లకు పంచిపెడ్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఓటర్లను భయపెట్టేందుకు యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి గూండాలను దింపుతున్నారన్నారు. బీజేపీ నేతలు ఇదంతా బహిరంగంగా చేస్తోంటే.. ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. నందిగ్రామ్‌లో తనపై దాడి చేసిన వారి వివరాలు తెలిశాయని, ఎన్నికల తరువాత ఆ విషయం చూస్తానని పేర్కొన్నారు. మరోవైపు, మమత బెనర్జీపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆమె బెదిరిస్తున్నారని ఆరోపించారు. -
నా ఆందోళనను పంచుకోండి: మమత లేఖ వైరల్
కోల్కత్తా: ‘రండి.. ఏకమవుదాం.. నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా జత కడుదాం’ అని బీజేపీయేతర పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎన్నికలు ముగియగానే చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చారు. మొత్తం ఏడు ప్రధానాంశాలపై మమత లేఖ రాస్తూ వారికి పంపించారు. ఎన్సీపీ, డీఎంకే, శివసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ, ఎస్పీ, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు మమతా పంపారు. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడిని తిప్పి కొట్టాల్సిన అవసరాన్ని మమతా గుర్తుచేశారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే.. ‘నేను మీకు లేఖ రాస్తున్నా. నా తీవ్రమైన ఆందోళనను మీతో పంచుకోవాలనుకుంటున్నా..’ అంటూ మమతా లేఖ మొదలుపెట్టారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ దారుణంగా దాడి చేస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని లేఖలో మమత ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విధానాలు, నైతిక విలువలు బీజేపీకి వ్యతిరేకమని, అలాగే వదిలేస్తే దేశానికే ప్రమాదం అని గుర్తుచేశారు. ఆ పార్టీపై పోరాటానికి అన్ని పార్టీలు ఏకం కావాలని, అలాగైతేనే ఓడించగలమని మమత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీకి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును మమత ప్రస్తావించారు. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వం కాకుండా పూర్తిస్థాయి లెఫ్టినెంట్ ప్రభుత్వం నడిపించేలా కొత్త చట్టం తెస్తోందని ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సూచించారు. రెండుసార్లు కేజ్రీవాల్ ఓడించారని, మళ్లీ గెలిచే నమ్మకం లేకనే ఈ కొత్త తెస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసి మున్సిపల్ స్థాయికి తీసుకొస్తోందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిణామాలతో బీజేపీ ఏక పార్టీ అధికారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని మమత స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మమతా ఇతర పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు. మమత లేఖ పంపినది వీరికే.. శరద్ పవార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) స్టాలిన్, ద్రవిడ మున్నేట కజగమ్ (డీఎంకే) ఉద్దవ్ ఠాక్రే, శివసేన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నవీన్ పట్నాయక్, బిజూ జనతాదళ్ (బీజేడీ) తేజస్వి యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ చదవండి: ‘టార్చ్‌లైట్’ విసిరివేత: కోపమేలా కమల్ హాసన్ -
మహిళలపై హింసను సహించం
నందిగ్రామ్: బీజేపీ కార్యకర్త అని చెబుతున్న వ్యక్తి తల్లి మృతి ఘటన పశ్చిమ బెంగాల్లో సంచలనాత్మకంగా మారింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మహిళలపై హింసను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోనని పేర్కొన్నారు. వృద్ధురాలి మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఆమె సోమవారం నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగాల్ గురించి మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాల విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. హథ్రాస్ ఘటనపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బెంగాల్లో తన తల్లులు, సోదరీమణులపై హింసను సహించే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవలే ముగ్గురు చనిపోయారని అన్నారు. బెంగాల్లో ప్రస్తుతం శాంతిభద్రతలు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని వెల్లడించారు. నందిగ్రామ్‌లో దీదీ భారీ రోడ్ షో అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానం నుంచి మంచి మెజార్టీలో విజయం సాధించాలని మమత సంకల్పించారు. ఇక్కడ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు సోమవారం భారీ రోడ్ షో నిర్వహించారు. రేయపారా ఖుదీరామ్ మోరే నుంచి ఠాకూర్‌చౌక్ వరకూ 8 కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీలో దీదీ ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. నందిగ్రామ్‌లో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటిదాకా తాను ఇక్కడే ఉంటానని మమతా బెనర్జీ ప్రకటించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. -
బెంగాల్లో వృద్ధురాలి మృతిపై రాజకీయ రగడ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త తల్లి మరణం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మద్దతుదారులు దాడి చేయడంతో ఆమె గాయాలపాలై మృతి చెందిందని బీజేపీ ఆరోపిస్తుండగా, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని తృణమూల్కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది. వయసుతో వచ్చే అనారోగ్య సమస్యలే ఆమె మృతికి కారణమని తృణమూల్ వెల్లడించింది. వృద్ధురాలి మృతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్లో స్పందిస్తూ టీఎంసీపై ఆరోపణలు గుప్పించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అసలేం జరిగింది? పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో నిమ్తా పోలీసు స్టేషన్ పరిధిలోని నార్త్ డమ్‌డమ్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త గోపాల్ మజుందార్ తన తల్లి శోభా మజుందార్‌తో (82) కలిసి నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 27న కొందరు వ్యక్తులు ముఖాలు గుర్తుపట్టకుండా ముసుగులతో వచ్చి గోపాల్ ఇంటిపై దాడి చేశారు. గోపాల్‌తోపాటు వృద్ధురాలైన అతడి తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై నిమ్తా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలే తమపై దాడి చేశారని శోభా మజుందార్ చెప్పారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 27న కన్నుమూశారు. శోభా మజుందార్ చావుకు టీఎంసీ కార్యకర్తలే కారణమని, వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు సోమవారం నిమ్తా పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. రోడ్లను దిగ్బంధించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వారికి నచ్చజెప్పారు. హింస లేని రేపటి కోసం పోరాటం తమ పార్టీ కార్యకర్త తల్లి చనిపోవడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. టీఎంసీ గూండాలు కొట్టడం వల్లే శోభా మజుందార్ మరణించారని ధ్వజమెత్తారు. ‘బాధిత కుటుంబం అనుభవిస్తున్న బాధ, గాయాలు మమతను వెంటాడడం ఖాయం. హింస లేని రేపటి కోసం మన తల్లులు, చెల్లెళ్లకు రక్షణ ఉండే రాష్ట్రం కోసం బెంగాల్ పోరాడుతోంది’ అని షా ట్వీట్‌చేశారు. బెంగాల్లో హింస రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రి దేబశ్రీ చౌదరి మండిపడ్డారు. 82 ఏళ్ల వృద్ధురాలిని కూడా వదలకుండా కొట్టి చంపడం దారుణమని దుయ్యబట్టారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఆరోపణలపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పందించారు. వృద్ధురాలి మరణానికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. చావును కూడా బీజేపీ సొమ్ము చేసుకుంటోందని విమర్శించారు. వృద్ధాప్యం వల్ల తలెత్తే అనారోగ్యం కారణంగానే శోభా మజుందార్ మరణించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలిగించరాదని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ అమిత్ షాకు హితవు పలికారు. -
నేను పులి: ‘నందిగ్రామ్’లో మమతా బెనర్జీ గర్జన
కోల్కత్తా: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 1వ తేదీన జరగనుంది. పశ్చిమ బెంగాల్లో ఈ రెండో దశ పోలింగ్‌లో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయి. దీంతో ప్రచారంలో ఆఖరి రోజు సోమవారం హోరాహోరీగా ప్రచారం సాగింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో చక్రాల కుర్చీపైనే కూర్చుని భారీ బహిరంగ సభ నిర్వహించారు. చక్రాల కుర్చీలో కూర్చునే 8 కిలోమీటర్ల భారీ ర్యాలీలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై గర్జించారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడిన మమత అనంతరం తన పదేళ్ల పాలనను వివరించారు. ‘నేను బెంగాల్ టైగర్’ను అంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. తన ముందు ప్రత్యర్థులు పనికి రారు అని పేర్కొన్నారు. నాపై దాడి చేయడానికి ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి గూండాలను రప్పిస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రేమించే సంస్కృతి లేనివారు రాజకీయాలకు పనికి రారు అని హితవు పలికారు. వారి దాడులను తాను సింహంలాగా స్పందిస్తానని మమతా చెప్పారు. ఈ సందర్భంగా తనను తాను ‘రాయల్ బెంగాల్ టైగర్’గా మమతా అభివర్ణించుకున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ గూండాలు వస్తే గిన్నెలు, పాత్రలతో దాడి చేయండి అని మమతా మహిళలకు పిలుపునిచ్చారు. మమతాకు పోటీగా ఆమె మాజీ అనుచరుడు సువేందు అధికారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే నందిగ్రామ్ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో రెండు రోజుల ముందట ప్రచారం ముగిసింది. -
టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్ చేసిన బీజేపీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ నేతలు పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ కు సంబంధించిన వీడియో చర్చనీయాంశమైంది. పార్టీకి గంట కంటే ప్రచారం చేయలేనని, సీఎం కోసం కూడా అంత సమయం కేటాయించలేను అన్నట్లుగా నుస్రత్ వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వీడియోను బీజేపీ బెంగాల్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా, సొంత పార్టీకి ఎన్నికల్లో సరైన ప్రచారం చేయలేని స్థితిలో టీఎంసీ పార్టీ ఎంపీలు ఉన్నారని విమర్శించింది. అంతేకాకుండా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోతున్నారని బీజేపీ జోస్యం చెప్పింది. కాగా, ఇరు పార్టీల నుంచి నందిగ్రామ్ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్లను దించారు. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల అసెంబ్లీ ఎన్నికలలో మొదటి విడత పోలింగ్ శనివారం ముగిసింది, 84 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 1 న జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2 న జరుగనుంది. TMC MP Nusrat Jahan " I can't do rally for more than 1 hour, I don't even do it for CM"😆 #MamataLosingNandigram pic.twitter.com/p0jOm4iy03 — BJP Bengal (@BJP4Bengal) March 28, 2021 చదవండి: హత్రాస్ కంటే బెంగాల్ ఎన్నికలే ముఖ్యమా? -
ఓట్లు లెక్కిస్తేనే ఫలితం తేలేది
చాందీపూర్/కోల్‌కతా: ఓట్లను లెక్కించిన తర్వాతే ప్రజల తీర్పు తేటతెల్లమవుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్లో తొలి దశ ఎన్నికలు జరిగిన 30 స్థానాల్లో బీజేపీ 26 స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు. ఎన్నికలు జరిగిన తెల్లారే 26 సీట్లు గెలుస్తామంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. మరి మిగిలిన 4 సీట్లు ఎవరికి వదిలేశారు? కాంగ్రెస్, సీపీఎంలకా? అని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ ఆదివారం చాందీపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలను తాను ఇప్పుడే ఊహించలేనని అన్నారు. ఓట్ల లెక్కింపు తర్వాతే తేలుతుందని స్పష్టం చేశారు. అన్నిచోట్లా అభ్యర్థి నేనే నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి ఎవరు అనేది పట్టించుకోవద్దని, అన్ని స్థానాల్లో స్వయంగా తానే పోటీ చేస్తున్నట్లు భావించాలని ఓటర్లను మమత కోరారు. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని తృణమూల్ పోలింగ్ ఏజెంట్లకు సూచించారు. బెంగాల్లో మైనార్టీ ఓట్ల ను చీల్చడానికి హైదరాబాద్ నుంచి ఓ నాయకుడు వచ్చాడని పరోక్షంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై మండిపడ్డారు. ఢిల్లీ, గుజరాత్లో అల్లర్లు జరిగితే ఈ నేత ఎక్కడున్నాడో చెప్పాలన్నారు. అలజడి సృష్టిస్తున్న మరో ఫోన్‌కాల్ పశ్చిమ బెంగాల్లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష బీజేపీ విడుదల చేసిన ఆడియో టేప్‌నకు ప్రతీకారం అన్నట్లుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ కూడా వెంటనే ఓ ఫోన్‌కాల్ టేప్‌ను బహిర్గతం చేసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, సీనియర్ నేత, పారిశ్రామికవేత్త శిశిర్ బజోరియా మాట్లాడుకున్నట్లు చెబుతున్న ఈ ఫోన్ కాల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో అన్ని చోట్లా బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు లేరు, అందుకే స్థానికేతరులను ఏజెంట్లుగా నియమించేలా ఈసీని ఒప్పించాలని బజోరియాను ముకుల్ రాయ్ అదేశిస్తున్నట్లు ఈ టేప్‌లో రికార్డయ్యింది. -
మమత ఆడియో కలకలం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్‌ను ప్రతిపక్ష బీజేపీ శనివారం విడుదల చేసింది. నందిగ్రామ్‌కు చెందిన బీజేపీ నేత ప్రళయ్ పాల్‌తో ఆమె మాట్లాడినట్లు, మళ్లీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాలని, తన గెలుపునకు సహకరించాలని అభ్యర్థిస్తున్నట్లుగా ఈ ఆడియోలో ఉండడం కలకలం రేపుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి బరిలోకి దిగుతున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులే కావడంతో నందిగ్రామ్‌పై అందరి దృష్టి పడింది. ప్రళయ్ పాల్ గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశాడు. సువేందు అధికారితో కలిసి బీజేపీలో చేరాడు. ప్రళయ్ పాల్‌తో మమతా బెనర్జీ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు బీజేపీ చెబుతోంది. ఆడియో క్లిప్‌లో ఏముందంటే.. ‘నందిగ్రామ్‌లో నేను నెగ్గడానికి సహకరించు. నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు. ఇకపై నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’’ అని మమత హామీ ఇవ్వగా, ప్రళయ్ పాల్ స్పందిస్తూ.. ‘‘దీదీ (అక్కా).. మీరు నాకు ఫోన్ చేశారు. అది చాలు. సువేందు అధికారికి ద్రోహం చేయలేను’ అని పేర్కొన్నాడు. ఈ ఆడియో విషయంలో ప్రళయ్ పాల్ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం బీజేపీ కోసం పనిచేస్తున్నానని, ఆ పార్టీని మోసం చేయలేనని అన్నాడు. ఎలక్టోరల్ అధికారికి బీజేపీ ఫిర్యాదు మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ౖMðలాశ్ విజయ్ వర్గీయా నేతృత్వంలో ఓ బృందం బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను కలిసింది. ఆడియో క్లిప్‌ను అందజేసింది. ఈ ఆడియో క్లిప్ వాస్తవికతపై తృణమూల్ కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రళయ్ పాల్ గతంలో తమ పార్టీ నాయకుడేనని, అతడితో మాట్లాడి, సాయం కోరితే తప్పేముందని ఆ పార్టీ నేత కునాల్ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇదంతా సహజమేనని తేల్చిచెప్పారు. -
ఆడియో క్లిప్ వైరల్: ‘నందిగ్రామ్‌లో సాయం చేయండి’
-
ఆడియో క్లిప్ వైరల్: ‘నందిగ్రామ్‌లో సాయం చేయండి’
కోల్కత్తా: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే తనను ఎలాగైనా గెలిపించాలని ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను వేడుకున్నారని ఓ బీజేపీ నాయకుడు చేస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. తృణమూల్‌లోకి తిరిగొచ్చేసేయ్.. నా గెలుపునకు కృషి చేయి అని తనను విజ్ఞప్తి చేశారని ఆ నాయకుడు ప్రకటించాడు. ఈ మేరకు సీఎం తనకు ఫోన్ చేశారని దానికి సంబంధించిన ఫోన్ కాల్ వైరల్‌గా మారింది. మమత బెనర్జీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే తనకు రాజకీయంగా పేరు తీసుకొచ్చిన నందిగ్రామ్ నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ నుంచి సువేందు అధికారి ప్రత్యర్థిగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. అయితే సువేందు అధికారి వర్గానికి చెందిన ప్రళయ్ పాల్‌కు మమతా ఫోన్ చేశారని ఆరోపిస్తున్న ఓ ఆడియో కాల్ లీకయ్యింది. ప్రళయ్తో ఫోన్ సంభాషణలో మమతా ‘నందిగ్రామ్‌లో సహకరించాలి’ అని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఉంది. ఈ విషయాన్ని ప్రళయ్ పాల్ శనివారం మీడియా సమావేశంలో విడుదల చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు తెలిపాడు. బీజేపీ నందిగ్రామ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రళయ్ పాల్ సువేందు అధికారికి నమ్మిన బంటు. నందిగ్రామ్‌లో తనకు ప్రచారం చేయాలని మమతా కోరినట్లు ప్రళయ్ తెలిపాడు. మళ్లీ తృణమూల్‌లోకి రా.. సువేందుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పాడు. అయితే మమత విజ్ఞప్తిని తాను తిరస్కరించానని ప్రళయ్ చెప్పుకొచ్చాడు. అధికారి కుటుంబంతో తనకు అవినాభావ సంబంధం ఉందని.. తాను అలా చేయలేనని చెప్పినట్లు వివరించాడు. బీజేపీ కోసమే పని చేస్తానని స్పష్టం చేశాడు. సీపీఎం పాలనలో నందిగ్రామ్‌లో మమ్మల్ని హింసించినప్పుడు సువేందు అధికారి కుటుంబం అండగా ఉందని ఫోన్లో ప్రళయ్ చెప్పాడు. తాను ఆ పని చేయలేనని చెప్పినట్లు ప్రళయ్ మీడియా సమావేశంలో చెప్పాడు. అయితే ఇది మమతా ఫోన్ కాల్ అని ఎవరూ నిర్ధారించడం లేదు. తొలి దశలో లబ్ధి పొందేందుకు ఈ విధంగా బీజేపీ కుట్ర పన్ని ఫేక్ కాల్స్ రూపొందిస్తున్నాయని అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. తృణమూల్ ధీటుగా సమాధానం ఇస్తోంది. బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 294 సీట్లలో తొలి దశలో భాగంగా 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మే 2వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. -
భారీగా తగ్గిన ముఖ్యమంత్రి ఆస్తులు
కోల్‌కతా: గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తుల విలువ దాదాపు సగం మేర తగ్గింది. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న మమత ఈసీకి తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మమత డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 16,72, 352 రూపాయలు. 2016లో ఆమె భవానీపూర్ నుంచి పోటీ చేశారు. ఆ సందర్భంగా ఆమె ఆస్తుల విలువ 30, 45, 013 రూపాయలుగా డిక్లరేషన్ ఇచ్చారు. టీఎంసీకే చెందిన అభ్యర్ధులు మమతా భూనియా, సుకుమార్ డే ఆస్తుల విలువ సైతం దాదాపు 36- 37 శాతం తగ్గినట్లు డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు సీపీఎంకు చెందిన షేక్ ఇబ్రహీం అలీ(పన్సుకురా పుర్బా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు) ఆస్తుల విలువ 2016తో పోలిస్తే అనూహ్యంగా 2141 శాతం పెరిగింది. దీంతో ఈ ఐదేళ్లలో అత్యంత అధికంగా ఆస్తుల విలువ పెరిగిన అభ్యర్ధుల్లో ఆయన తొలిస్థానంలో నిలిచారు. 2016లో ఆయన ఆస్తుల విలువ రూ. 49,730గా పేర్కొనగా, ప్రస్తుతం రూ. 10, 64, 956గా చూపారు. టీఎంసీకి చెందిన కాకద్వీప్ అభ్యర్ధి మంతురామ్ పఖీరా ఆస్తుల విలువ 736 శాతం పెరిగి రూ. 59 లక్షలకు చేరింది. చదవండి: ‘సాగర్’.. సస్పెన్స్: పోటీదారులెవరో..? చదవండి: ‘నీ జన్మకు సిగ్గుందా?’ కమిషనర్‌పై బీజేపీ ఎమ్మెల్సీ చిందులు -
ప్రధాని ‘ఇంటి ప్రకటన’పై రాజకీయ దుమారం
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇచ్చిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీగా ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెబుతూ ఓ ఇంటి ముందు ఒక మహిళ నిలబడి ఉన్న ఫొటోను ప్రకటనగా చేసి ప్రచురించారు. ప్రధాన పత్రికలతో పాటు సోషల్ మీడియాలో ఆ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రకటనలో ఉన్న మహిళ పేరు లక్ష్మిదేవి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలోని బౌబజార్‌లో మలాంగలో ఆమె నివసిస్తోంది. ‘ఆమె ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా లక్ష్మీదేవికి ఇల్లు వచ్చింది’ అని ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను చూసిన లక్ష్మి షాక్‌కు గురైంది. ఆ ఫొటో ఎవరూ తీసుకున్నారో.. ఎప్పుడు తీసుకున్నారో తెలియదని మీడియాకు చెప్పింది. ఇంకా ఆమె చెప్పిన వివరాలు తెలుసుకుంటే అవాక్కయ్యే పరిస్థితి. లక్ష్మీదేవి ఉండేది అద్దె ఇంట్లో. అది కూడా ఒకే ఒక గది ఉన్న ఇంటిలో కుటుంబసభ్యులు మొత్తం ఆరుగురు ఉంటారు. ఆ ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేదు. ఉంటున్న గదికి నెలకు రూ.500 అద్దెగా చెల్లిస్తున్నారు. బాబుఘాట్‌లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వెళ్లామని.. అప్పుడు ఆ ఫొటో తీసి ఉండొచ్చని లక్ష్మి తెలిపింది. తాను చదువుకోలేదని.. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని పేర్కొంది. తనను బీజేపీ నాయకులు ఎవరు కలవలేదని చెప్పింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు రాహూల్ గాంధీ కూడా స్పందించి దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. మళ్లీ మళ్లీ అబద్ధాలు చెప్పడానికి కూడా జ్ఞానం ఉండాలి అని ట్వీట్ చేశారు. ఈ అబద్ధపు ప్రచారంపై తృణమూల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తప్పు పట్టింది. बार-बार दोहराने पर भी, झूठ झूठ ही रहता है!#FactCheck pic.twitter.com/yvl6tf7yCW — Rahul Gandhi (@RahulGandhi) March 22, 2021 -
సువేందు అధికారి ద్రోహి
కాంతి దక్షిణ్: తానొక పెద్ద గాడిదనని(అమీ ఏక్తా బోరో గధా), అందుకే సువేందు అధికారి అసలు రంగును గుర్తించలేకపోయానని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకర్గం నుంచి ఆమెపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మమతకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సువేందు అధికారి అభిప్రాయభేదాల వల్ల దూరమయ్యారు. మమతా బెనర్జీ ఆదివారం పూర్బ మేదినీపూర్ జిల్లా కాంతి దక్షిణ్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సువేందు కుటుంబం రూ.5వేల కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు తాను విన్నానని చెప్పారు. ఆ డబ్బుతో ఓట్లు కొనేయాలని సువేందు ప్రయత్నిస్తున్నాడని, అతడికి ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే అతడి అవినీతిపై విచారణ జరిస్తానన్నారు. బీజేపీని తరిమికొట్టాలి సువేందు అధికారి కుటుంబాన్ని ద్రోహుల(మీర్ జాఫర్) కుటుంబంగా మమతా బెనర్జీ అభివర్ణించారు. అతడికి ఓటేయవద్దని ప్రజలను కోరారు. బీజేపీ వంచకులు, గూండాల పార్టీ అని మండిపడ్డారు. బెంగాల్లో శాంతి భద్రతలను కాపాడాలన్నా, అభివృద్ధిని కొనసాగించాలన్నా బీజేపీని తరిమికొట్టాలని సూచించారు. -
దుర్యోధనుడు, దుశ్శాసనుడు మనకొద్దు
ఇగ్రా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్యోధునుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుశ్శాసనుడు అని నిప్పులు చెరిగారు. తన పార్టీ నుంచి ఫిరాయించి, బీజేపీలోకి చేరి, తనపైనే పోటీకి దిగిన సువేందు అధికారి ఒక ద్రోహి(మీర్ జాఫర్) అని మండిపడ్డారు. ఆమె శుక్రవారం ఇగ్రా, తూర్పు మిడ్నాపూర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో చక్రాల కుర్చీలో కూర్చొని ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీ తమకు అవసరం లేదన్నారు. నరేంద్ర మోదీ ముఖం చూడడం ఇష్టం లేదని తేల్చిచెప్పారు. అల్లర్లు, లూటీలు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మీర్ జాఫర్ తమకు అక్కర్లేదని స్పష్టం చేశారు. మమత ఏం మాట్లాడారంటే.. ద్రోహులంతా వెళ్లిపోయారు ‘’మా పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన నేతలంతా ద్రోహులు. వారు వెళ్లిపోవడంతో మాకు మంచే జరిగింది. మా పార్టీ ప్రక్షాళన అయ్యింది. ఆ పార్టీ అల్లర్లు సృష్టిస్తోందని, లూటీలు చేస్తోంది, హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. పరివర్తన్(మార్పు) అంటూ నేను ఇచ్చిన నినాదాన్ని ప్రధాని మోదీ కాపీ కొట్టారు. సువేందు అధికారిని గుడ్డిగా నమ్మాను. అతడు మాత్రం నన్ను మోసం చేశాడు. మనిషి ఎదురుగా హరి హరి అని జపం చేసే బీజేపీ నేతలు వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తారు. ఇకపై ‘నో ఓటు టు బీజేపీ’ అనేది మన నినాదం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) గోల్మాల్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. ఎన్నికలు పూర్తయ్యాక ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాల వద్ద నిఘా పెట్టాలి’’ అని కోరారు. బీజేపీ దోపిడీ సంగతేంటి? నేను కోల్‌కతాలో కాకుండా నందిగ్రామ్ నుంచి పోటీ చేయడానికి కారణం బలవంతపు భూసేకరణపై ప్రజా పోరాటం ఇక్కడే పురుడుపోసుకుంది. ఈ పోరాటం జరిగినప్పుడే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. బెంగాల్లో ప్రతి ప్రాంతం నా సొంత ప్రాంతమే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేదు. ఒక పేదవాడు రూ.500 దొంగతనం చేస్తే పట్టుకొని శిక్షిస్తున్నాం. మరి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా, అవినీతి ద్వారా కోట్లాది రూపాయలు దోచుకుంటున్న బీజేపీ సంగతేంటి? బీజేపీ నేతలు సాగిస్తున్న ఈ దోపిడీ ప్రజలకు తెలియడం లేదు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే ఢిల్లీలో బీజేపీని గద్దె దింపడానికి మార్గం ఏర్పడుతుంది’’ అని మమతా బెనర్జీ సూచించారు. -
అధినాయకి వర్సెస్ అధికారి
సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం నందిగ్రామ్ పేరు తొలిసారిగా వార్తల్లోకెక్కింది. సెజ్‌ల ఏర్పాటు కోసం రైతుల నుంచి భూసేకరణకు నిరసనగా నందిగ్రామ్‌లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ సెగలు దేశం నలుమూలలకీ పాకాయి. పోలీసు కాల్పుల్లో 14 మంది రైతులు మరణించడంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నదాతలకు అండగా నిలిచి ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. నందిగ్రామ్ వేదికగా నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటమే చేసి కాలం మారింది కామ్రేడ్స్ అని గర్జిస్తూ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు కంచుకోటని బద్దలు కొట్టారు. మళ్లీ ఇన్నేళ్లకి మమత నందిగ్రామ్ అసెంబ్లీ బరిలో దిగడంతో దేశవ్యాప్తంగా మరోసారి నందిగ్రామ్ పేరు మారుమోగుతోంది. ఇన్నాళ్లూ తనకి కుడి భుజంగా ఉంటూ గత డిసెంబర్లోనే బీజేపీలో చేరిన సువేందు అధికారి సవాల్‌ని స్వీకరించి మరీ నందిగ్రామ్ బరిలో మమత దిగడంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ సంగ్రామం వేడెక్కింది. వ్యూహ ప్రతివ్యూహాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన సమయంలో కాలికి అయిన గాయాన్ని తనకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీల్‌చైర్ మీదే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటూ సానుభూతి ఓట్లు దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ తనని నాలుగ్గోడల మధ్య పరిమితం చేయడానికే నందిగ్రామ్‌లో తనపై దాడికి దిగిందని ఆరోపిస్తున్నారు. తన గెలుపు కోసం పూర్ణేందు బసు అనే సీనియర్ మంత్రిని ప్రత్యేకంగా నియమించారు. పూర్ణేందు అధికారి సాక్షితో మాట్లాడుతూ మమతా బెనర్జీ చేపట్టిన సంక్షేమ పథకాలే ఆమెని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మమతను వెన్ను పోటు పొడిచి పార్టీ వీడిన సువేందు అధికారి తప్పు చేశారని, ఆయన చేసిన తప్పులే దీదీకి ఓట్లను కురిపిస్తాయని అన్నారు. నందిగ్రామ్ ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారి చేసిన అవినీతి పనులే ఆయనని ఓటమి పాలు చేస్తాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ధోలాసేన్ జోస్యం చెప్పారు. నందిగ్రామ్‌లో మహిళలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. తరచుగా ఉద్యమాల్లో పాల్గొంటారు. 49 శాతం ఓట్లు ఉన్న మహిళా ఓటర్లు మమతకే అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకుపోతున్నారు. 2016 ఎన్నికల్లో 67% ఓట్లు కొల్లగొట్టిన సువేందు అ«ధికారి కుటుంబానికి ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. సువేందు అధికారి తండ్రి, సోదరుడు కూడా ఎంపీలుగా పని చేశారు. జూట్ మిల్లు కార్మిక కుటుంబాలతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం ఉన్న మిడ్నాపూర్ ఉమ్మడి జిల్లాలో వీరి కుటుంబానికి ఎదురే లేదు. హిందూ ఓట్లను ఏకం చేయడంతో పాటుగా ముస్లిం ఓట్లను రాబడితే గెలుపు ఖాయమన్న ధీమాలో అధికారి ఉన్నారు. బీజేపీకి కేడర్ లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. సమఉజ్జీల మధ్య సమరంలో ముస్లింలు, కమ్యూనిస్టు ఓటు బ్యాంకుపైనే వారి గెలుపు ఆధారపడి ఉంది. ముస్లిం ఓటు బ్యాంకు ఎటు ? నందిగ్రామ్ నియోజకవర్గంలో 30% ఉన్న ముస్లింలు ఈ సారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ముస్లింలు మొదట్లో కమ్యూనిస్టులకు అండగా ఉండేవారు. 2007లో జరిగిన భూ సేకరణలో భూములు కోల్పోయిన వారు మమతకి మద్దతుగా నిలిచారు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. సువేందు అధికారి తనకున్న వ్యక్తిగత పరిచయాలతో ముస్లిం ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక సీపీఎం, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఐఎస్ఎఫ్ నాయకుడు అబ్బాస్ సిద్ధి్దఖికి నందిగ్రామ్‌లో గట్టి పట్టు ఉంది. ఆయన ప్రభావంతో ముస్లింలు తిరిగి కమ్యూనిస్టుల వైపు మళ్లితే మమతా బెనర్జీ గెలుపు అవకాశాలు ప్రమాదంలో పడిపోతాయి. హిందూత్వ కార్డు నందిగ్రామ్‌లో 70% హిందూ ఓట్లన్నీ గంపగుత్తలా తమకే పడేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీ కరడుగట్టిన హిందూత్వ వాదాన్ని ఎదుర్కోవడానికి మమత కూడా హిందూత్వ బాట పట్టారు. గుళ్లు గోపురాలు తి రుగుతూ, ఎన్నికల ర్యాలీల్లో శ్లోకాలు వల్లె వేస్తున్నారు. తమదీ హిందూ కుటుంబమే అని చెబుతున్నారు. బ్రాహ్మణ్ సమ్మేళన్ నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తూ దుర్గా పూజ కమిటీలకు సాయం చేస్తున్నారు. హిందువుల్లో వైçష్ణవ ఓటర్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వీరు తులసిమాల ధరిస్తారు. విభూదిని బొట్టుగా పెట్టుకుంటారు. మమత గెలిస్తే విభూది పెట్టుకోవాలన్నా అనుమతి తీసుకోవాలంటూ సువేందు ప్రచారం చేస్తున్నారు. మత్స్యకారుల పాత్ర హుగ్లీ నది సముద్రంలో కలిసే ప్రాంతం నందిగ్రామ్‌లో ఉంది. దీంతో ఇక్కడ భారీ సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సముద్రపు నీటిని చట్టవిరుద్ధంగా కాలువల ద్వారా గ్రామాల్లోకి తీసుకువచ్చి వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రొయ్యల సాగుని అడ్డుకుంటామని మమత ప్రభుత్వం చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. సువేందు అధికారి రొయ్యల వ్యాపారుల సిండికేట్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఈ మత్స్యకారుల్లో దళితులు, ముస్లింలు కూడా ఎక్కువే ఉన్నారు. వీరంతా అధికారి వైపే ఉంటారన్న అంచనాలున్నాయి. సీపీఎం ప్రభావం ? నందిగ్రామ్‌లో సీపీఎం ప్రభావం ఎన్నికల్లో కీలకం కానుంది. చాలా ఏళ్లు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట. 2007లో జరిగిన కాల్పుల ఘటనతో వారి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. కేడర్ పెద్ద సంఖ్యలో పార్టీని విడిచి వెళ్లిపోయారు. అయితే టీఎంసీ అధికారంలోకి వచ్చాక సీపీఎం నాయకులపైనా, కార్యకర్తలపైనా దాడులు జరగడంతో మమతపై వారంతా గుర్రుగా ఉన్నారు. వీరు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. సీపీఎం విద్యార్థి నాయకురాలైన మీనాక్షి ముఖర్జీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీకి దిగింది. వాక్పటిమ కలిగిన మీనాక్షి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కమ్యూనిస్టులు తమ ఓటు బ్యాంకును తిరిగి కొల్లగొడితే సువేందు అధికారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. – నందిగ్రామ్ నుంచి సాక్షి ప్రతినిధి -
సీఎం జగన్ పథకాల స్ఫూర్తితో మమతా బెనర్జీ సైతం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు ప్రకటిస్తున్నా మ్యానిఫెస్టోలు హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడులో ప్రజలకు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అని చాలా వరకు ఉచితంగా వస్తువులు అందిస్తామని ప్రధాన పార్టీలు హామీ ఇచ్చాయి. అదే విధంగా కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్లో కూడా పార్టీలు తమ మ్యానిఫెస్టోలో హామీలు కురిపించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన హామీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉంది. టీఎంసీ తరఫున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల మ్యానిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. అందులో అనేక హామీలు ఇవ్వగా.. వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న ‘ఇంటింటికి రేషన్ బియ్యం’ కార్యక్రమం మాదిరి పశ్చిమ బెంగాల్లో కూడా అమలుచేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. ‘బంగ్లా శోబర్.. నిశ్చిత్ ఆహార్’లో భాగంగా ‘రాష్ట్రంలోని 1.5 కోట్ల రేషన్ కార్డుదారులందరూ ఇకపై చౌకధరల దుకాణానికి వెళ్లనవసరం లేదు.’ అని మేనిఫెస్టోలో తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఏపీలో సీఎం జగన్ జనవరి 21వ తేదీన ‘ఇంటింటికి రేషన్’ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీని ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. మార్చి 25వ తేదీన ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఢిల్లీ అంతటా అమలు చేయనున్నారు. చదవండి: పాంచ్ పటాకా: రూ.331 కోట్ల సంపద సీజ్ చదవండి: తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్ -
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ మేనిఫెస్టో
-
మేనిఫెస్టో: విద్యార్థులకు 10 లక్షల లిమిట్ క్రెడిట్ కార్డు
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తమ మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ఐదు లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇంటింటికీ రేషన్ అందిస్తామని, ఎస్సీ, ఎస్టీలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రతి ఏటా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ. 6 వేల నుంచి 10 వేలకు పెంచుతామని వాగ్దానం చేశారు. ఇక ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం 4 శాతం వడ్డీతో రూ. 10 లక్షల లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఇస్తామని మమత పేర్కొన్నారు. అదే విధంగా, వెనుకబడిన, పేద వర్గాలకు రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు కనీస వార్షికాదాయం ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. పటిష్టమైన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికై మమత 10 వాగ్దానాలు ►ప్రతి ఏటా ఐదు లక్షల ఉద్యోగాల కల్పన ►అదనంగా 10 లక్షల ఏటా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్ల ఏర్పాటు ►రానున్న ఐదేళ్లలో 2 వేల పెద్ద పరిశ్రమల ఏర్పాటు ►1.6 కోట్ల ఇంటి మహిళా యజమానులకు నెలవారీగా రూ. 500(జనరల్ కేటగిరీ), రూ. 1000 (ఎస్సీ,ఎస్టీలకు) అందజేత ►వైద్య రంగానికి పెద్దపీట.. రాష్ట్ర జీడీపీలో 1.5 శాతం వైద్యారోగ్యానికి కేటాయింపు ►23 జిల్లా ప్రధాన కేంద్రాల్లో మెడికల్ కాలేజీ-కమ్- సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు ►డాక్టర్, నర్సులు, పారామెడిక్స్ సీట్లు రెట్టింపు ►యువత స్వయం ఉపాధి పొందేలా అనేక పథకాలు.. 4 శాతం వడ్డీరేటుతో రూ. 10 లక్షల లిమిట్ క్రెడిట్ కార్డు ►విద్యారంగానికి రాష్ట్ర జీడీపీలో 4 శాతం కేటాయింపు ►నెలనెలా ఇంటి వద్దకే రేషన్.. 1.5 కోట్ల కుటుంబాలకు లబ్ది ►బెంగాల్ ఆవాస్ యోజన కింద తక్కువ రేట్లకే 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం ►క్రిషక్ బంధు పథకం కింద 68 లక్షల మంది చిన్న,సన్నకారు రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున సాయం ►తక్కువ రేట్లకే ఇండ్లకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ►46 లక్షల కుటుంబాలకు తాగునీటి సరఫరా చదవండి: అసెంబ్లీ ఎన్నికల బరిలో బెంగాలీ తారలు I humbly present my 10 ‘Ongikars’ to build a stronger & more prosperous Bengal so that the wheels of development keep moving forward in the third term of our government. The aim is just one, to sustain Bengal as one of the leading states in the country. (1/4) pic.twitter.com/K0xNtrt7GB — Mamata Banerjee (@MamataOfficial) March 17, 2021 -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన దీదీ.. వీల్ చైర్లో ఇంటికి
కోల్‌కతా: రెండు రోజుల క్రితం నందిగ్రామ్ ర్యాలీలో భాగంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. వీల్‌చైర్ సాయంతో తన నివాసానికి చేరుకున్నారు. దాదాపు 48 గంటల పాటు దీదీని అబ్జర్వేషన్లో ఉంచారు వైద్యులు. ఈ క్రమంలో ఆమెని డిశ్చార్జ్ చేయాల్సిందిగా పార్టీ నాయకులు పదే పదే కోరడంతో ఆస్పత్రి వర్గాలు దీదీని డిశ్చార్జ్ చేశాయి. ప్రస్తుతం దీదీ ఆరోగ్యంగానే ఉన్నారని.. మరి కొన్ని రోజుల పాటు ఆమెకు విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. నందిగ్రామ్‌లో నామినేషన్ వేసి వస్తుండగా.. మమత ప్రమాదానికి గురయ్యారు. తనపై నలుగురైదురు వ్యక్తులు దాడి చేశారని.. కుట్ర ప్రకారమే ఇలా జరిగిందని మమత ఆరోపించగా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం దీదీని చూడ్డానికి జనాలు భారీ ఎత్తున రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. చదవండి: ఎన్నికల ప్రచారానికి వీల్ చెయిర్లో వస్తా..! -
ఎన్నికల ప్రచారానికి వీల్ చెయిర్లో వస్తా..!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి వార్తతో పశ్చిమబెంగాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీఎంసీ శ్రేణులు బుధవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాయి. ఇది దాడి కాదు ప్రమాదం మాత్రమేనని, చిన్న ప్రమాదాన్నే పెద్దది చేసి చూపుతున్నారని బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. మరోవైపు, కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతా బెనర్జీ సంయమనం పాటించాలని గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అవసరమైతే, వీల్‌చెయిర్‌లో కూర్చునే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తనపై దాడి చేశారన్న మమత ఆరోపణలపై గుర్తు తెలియని వ్యక్తులపై నందిగ్రామ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మమత ఆరోగ్యం స్థిరంగా ఉందని, రక్తంలో సోడియం స్థాయిలు కొంచెం తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. గాయమైన ఎడమ కాలికి కట్టు కట్టామని వివరించారు. ‘ముఖ్యమంత్రికి ఎడమ పాదం, ఎడమ మడమ వద్ద తీవ్రమైన గాయాలయ్యాయి. ఎడమ భుజం, మెడ వద్ద కూడా గాయాలున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. కానీ, గాయమైన కాలి వద్ద నొప్పి తీవ్రంగా ఉంది’ అని తెలిపారు. ఆమెను పరీక్షించిన వైద్య నిపుణులు సర్జరీ అవసరం లేదని తేల్చారన్నారు. సీటీ స్కాన్ సహా మరికొన్ని వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారన్నారు. కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో, నార్త్ 24 పరగణ, హూగ్లీ, హౌరా, బీర్భూమ్, సౌత్ 24 పరగణ, జల్పాయిగురి తదితర ప్రాంతాల్లో గురువారం టీఎంసీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు జరిపాయి. బిరూలియా ప్రాంతంలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్పంగా ఘర్షణ జరిగిందని, కాసేపటికే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చామని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు, శాంతి, సంయమనం పాటించాలని, ప్రజలు ఇబ్బంది పడే చర్యలకు పాల్పడవద్దని అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఒక వీడియో సందేశంలో మమత విజ్ఞప్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే మళ్లీ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, అవసరమైతే వీల్ చైర్‌ను వినియోగిస్తానని స్పష్టం చేశారు. దాడికి ఈసీనే బాధ్యత తీసుకోవాలి మమతా బెనర్జీపై జరిగిన హత్యాయత్నానికి ఎన్నికల సంఘమే బాధ్యత తీసుకోవాలని టీఎంసీ డిమాండ్ చేసింది. సీఎంకు తగిన స్థాయిలో భద్రత కల్పించలేదని ఆరోపించింది. అది మామూలు దాడి కాదని, తమ నేత ప్రాణాలు తీసేందుకు ఉద్దేశించిన కుట్రపూరిత దాడి అని పేర్కొంది. కోల్‌కతాలో ఎన్నికల సంఘం అధికారులకు గురువారం టీఎంసీ నేతలు మమతపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు జరగాలి సీఎం మమతకు అయిన గాయాలపై రాజకీయాలు చేయాలనుకోవడం లేదని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే, మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. మమత బెనర్జీపై జరిగింది దాడి కాదని, చిన్న ప్రమాదం మాత్రమేనని తమకు స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం అందిందని బీజేపీ అధికార ప్రతినిధి సామిక్ భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఆమెకు అయిన గాయాలపై రాజకీయాలు చేయబోమని, అయితే, అది దాడి అని ఆమె ఆరోపిస్తున్నందున మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అన్నీ నిందారోపణలే: ఈసీ మమతపై దాడికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. వారిచ్చిన వినతిపత్రం పూర్తిగా నిందలు, ఆరోపణలతో నిండి ఉందని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం ఏర్పాటు, విధులనే ప్రశ్నించేలా ఉందని ఆక్షేపించింది. ఈ మేరకు టీఎంసీకి ఈసీ ఒక లేఖ పంపించింది. మమత చరాస్తులు 16.72 లక్షలే మమత బెనర్జీ మొత్తం చరాస్తుల విలువ రూ. 16.72 లక్షలు మాత్రమే. ఈ వివరాలను ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. తనకు సొంత వాహనం లేదని, తన పేరుపై ఆస్తులేవీ లేవన్నారు. 2019–20 ఏడాదికి తన ఆదాయం రూ. 10.34 లక్షలని తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం రూ. 69,255 నగదు ఉందని, రూ. 13.53 లక్షల బ్యాంక్ బాలన్స్ ఉందని, రూ.18,490ల విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయని చెప్పారు. రూ.43,837ల విలువైన ఆభరణాలు ఉన్నాయన్నారు. -
మమతా బెనర్జీపై దాడి: ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని మమత ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఘటన గురించి టీఎంసీ నాయకులు బీజేపీపై అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీపై ఎలాంటి దాడి జరగలేదని.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపాడు. నిమై మైతి అనే వ్యక్తికి ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే స్వీట్ షాప్ ఉంది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన నా షాప్ ఎదురుగానే జరిగింది. సాయంత్రం 6.15 గంటలకు మమతా బెనర్జీ ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఒక యూటర్న్ దగ్గర సంఘటన జరిగింది. మమత వాహనంలో నుంచి కొద్దిగా బయటకు వచ్చి.. జనాలకు అభివాదం తెలుపుతున్నారు. ఈ క్రమంలో దీదీని చూడటానికి జనాలు ఒక్కసారిగా పరిగెత్తుకురావడంతో.. కారు డోరు ఆమె కాలికి తగిలి గాయం అయ్యింది. అంతే తప్ప.. ఆమె మీద ఎవరు దాడి చేయలేదు’’ అన్నారు. ఏఎన్ఐ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. దీదీని ఎవరు నెట్టలేదని.. ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని వెల్లడించింది. ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఏఎన్ఐ ఈ ప్రకటన చేసింది. అంతేకాక ఈ ఇద్దరు వ్యక్తులు తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. "సీఎంను చూడటానికి జనం గుమిగూడారు. ఈ గందరగోళంలో ఆమె కాళ్లకి కారు డోర్ తగిలి కింద పడ్డారు. దాంతో దీదీ మెడ, కాలికి గాయాలయ్యాయి. అంతే తప్ప ఆమెను ఎవరు నెట్టలేదు’’అని సుమన్ మైటీ అనే విద్యార్థి ఏఎన్ఐకి తెలిపాడు. మరో ప్రత్యక్ష సాక్షి చిత్రంజన్ దాస్ ఏఎన్ఐతో మాట్లాడుతూ "మమతా బెనర్జీ దేవాలయాల సందర్శన నుంచి తిరిగి వచ్చేటప్పడు కారు తలుపు తెరిచి కూర్చుని ఉన్నారు. దాంతో అది ఆమె కాలికి తగిలి గాయలయ్యాయి’’ అన్నారు. ఇక సీఎం ఆరోగ్య పరిస్థితిపై నేడు టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. మమతా బెనర్జీపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశించారు. తనపై జరిగిన దాడిని మమత కుట్రగా వర్ణించారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని ఆమె ఆరోపించారు. చదవండి: మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు -
మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
కోల్‌కతా : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలయ్యింది. ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో మమత ఇబ్బందులు పడుతున్నట్లు డాక్లర్లు తెలిపారు. ఆమె ఎడమకాలుతో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని, మరో 48 గంటలపాటు మమతా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం మమతకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దాడికి నిరసనగా టీఎంసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఇక మమతపై దాడి నేపథ్యంలో ఇవాళ ప్రకటించాల్సిన మేనిఫెస్టో వాయిదా పడింది. మమత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిపై నేడు టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. మమతా బెనర్జీపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ..రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేసిన అనంతరం వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత సంచలన ఆరోపణలు చేశారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని, తనపై కుట్ర జరగుతోందని పేర్కొన్నారు. The condition of her (Mamata Banerjee) leg is serious. Doctors are treating her. A little more pressure could have resulted in spine injury: TMC MLA Paresh Pal outside SSKM hospital in Kolkata The CM sustained injuries in her left leg in Nandigram yesterday evening. pic.twitter.com/nHhzCoy0Q2 — ANI (@ANI) March 11, 2021 చదవండి : (నందిగ్రామ్ పర్యటనలో మమతపై దాడి!) (సీఎం మమతా బెనర్జీపై దాడి: కాలికి గాయం) -
మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్
-
నందిగ్రామ్ పర్యటనలో మమతపై దాడి!
నందిగ్రామ్/కోల్‌కతా: నందిగ్రామ్ పర్యటనలో తనపై దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. నందిగ్రామ్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు బుధవారం ఆమె నామినేషన్ వేశారు. అనంతరం, వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత వివరించారు. సాయంత్రం 6.15 గంటల సమయంలో రేయపరా వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు. ‘నా కారు వెలుపల నిల్చుని ఉన్నా. కారు డోర్ తెరచి ఉంది. అక్కడి నుంచి కనిపిస్తున్న గుడివైపు చూస్తూ ప్రార్ధించాను. ఆ తరువాత కార్లోకి వెళ్దామనుకుంటుండగా, అకస్మాత్తుగా నలుగురైదుగురు నా దగ్గరకు వచ్చి, కారు డోర్‌ను నా వైపు గట్టిగా నెట్టారు. ఆ డోర్ తగిలి నా ఎడమ కాలికి గాయమైంది. నేను ఒక్కసారిగా ముందుకు పడిపోయాను’ అని వివరించారు. గాయంతో కాలు వాచిందని, జ్వరంగా అనిపిస్తోందని, ఛాతీలో నొప్పిగా ఉందని తెలిపారు. ‘కావాలనే కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది కుట్ర. ఎస్పీ సహా స్థానిక పోలీసులెవరూ ఆ సమయంలో నా దగ్గర లేరు’ అని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వ్యక్తిగత భద్రత సిబ్బంది మమతను కారులో వెనుక సీటులో కూర్చోబెట్టారు. నిజానికి, ఆమె బుధవారం రాత్రి నందిగ్రామ్‌లోనే ఉండాలనుకున్నారు. కానీ, ఈ ఘటన జరగడంతో కోల్‌కతా వెళ్లారు. వెంటనే, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. మమతని స్ట్రెచర్‌పై ఆసుపత్రిలోకి తీసుకువెళ్తున్న సమయంలో భారీగా చేరుకున్న టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. కాలికి ఎక్స్‌రే తీస్తామని, గాయం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందని వైద్యులు తెలిపారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు రాష్ట్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్లారు. గత రెండు రోజులుగా మమత నందిగ్రామ్‌లోనే ఉన్నారు. తమ పార్టీ అధినేత్రిని ఎన్నికల ప్రచారం నుంచి తప్పించే లక్ష్యంతో కొందరు ఈ దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. మరోవైపు, మమతపై దాడిపై బీజేపీ స్పందించింది. చిన్న ప్రమాదాన్ని పెద్ద కుట్రగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్ఘియ డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రచారాలతో సానుభూతి పొందాలనే ప్రయత్నాలు ఫలించబోవని కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర హోం మంత్రి కూడా ఆమెనే. అందువల్ల ఈ వైఫల్యానికి బాధ్యతగా ఆమె రాజీనామా చేయాలి’ అన్నారు. గవర్నర్ పరామర్శ ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మమతను గవర్నర్ జగ్దీప్ ధన్కర్ పరామర్శించారు. ఆయన ఆసుపత్రిలోకి వెళ్తుండగా, ‘గో బ్యాక్’ అంటూ టీఎంసీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు, సీఎంపై దాడి ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర పోలీసులను ఈసీ ఆదేశించింది. నందిగ్రామ్ నుంచి నామినేషన్ హల్దియా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరఫున బరిలో దిగుతున్న ఒకప్పుడు ఆమెకి అత్యంత సన్నిహితుడు, నందిగ్రామ్‌లో బాగా పట్టున్న నేత సువేందు అధికారితో ఆమె తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తనదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల సేకరణకి వ్యతిరేకంగా ఉద్యమించిన తాను నందిగ్రామ్ నుంచి ఎప్పుడూ వట్టి చేతులతో వెళ్లలేదని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షి వెంట రాగా మమత 2.కిలోమీటర్ల మేర రోడ్డు షో నిర్వహించారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం హల్దియా సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ‘‘నందిగ్రామ్ నుంచి నా గెలుపు ఖాయం. ఇక్కడి నుంచి సులభంగా నేను విజయం సాధించగలను. జనవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో నేత ఎవరూ లేకుండా నియోజకవర్గం ఉంది. అప్పుడు సాధారణ ప్రజల ముఖాలు చూసి నేను ఇక్కడ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని దీదీ విలేకరులకు చెప్పారు. నందిగ్రామ్ ఉద్యమ బావుటా నందిగ్రామ్ అన్నది ఒక పేరు కాదు. ఒక ఉద్యమ బావుటా అని మమతా బెనర్జీ ప్రశంసించారు. ‘‘ నేను అందరి పేర్లు మర్చిపోతానేమో, కానీ నందిగ్రామ్ పేరును ఎప్పటికీ మర్చిపోను. ఈ ప్రాంతానికి నేనిచ్చే ప్రాధాన్యత అలాంటిది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. తను ఎప్పుడూ ఇక్కడ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరగలేదని, తన గెలుపు ఇక్కడ ఖాయమన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ఎవరూ విడగొట్టలేరని అన్నారు. నందిగ్రామ్ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు కలిసికట్టుగా పాల్గొన్నాయని ఆమె గుర్తు చేశారు. ఇన్నాళ్లూ భవానీపూర్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన మమతా బెనర్జీ, బీజేపీ చేసిన సవాల్‌తో కేవలం నందిగ్రామ్ నుంచి మాత్రమే పోటీకి దిగారు. ఒక అద్దె ఇంట్లో ఉంటూ తన ప్రచారాన్ని సాగించనున్నారు. మరోవైపు బీజేపీ అ«భ్యర్థిగా గురువారం నందిగ్రామ్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్న సువేందు అధికారి దీటుగా ప్రచారం చేస్తున్నారు. మమతా బెనర్జీ స్థానికురాలు కాదని, తానే ఈ భూమి పుత్రుడినంటూ ప్రచారం చేసుకోవడం విశేషం. -
స్టేజిపై మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ
కోల్‌కతా: త్వరలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోన్న బీజేపీని దీదీ మమతా బెనర్జీ ఒక్కతే ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో తన పార్టీ తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థులందరి తరఫున ఆమె ప్రచారం చేస్తూ.. పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. మరో పక్క టీఎంసీ నాయకులు బహిరంగంగా సిగ్గు మాలిన పనులు చేస్తూ దీదీని ఇరుకున పెడుతున్నారు. తాజాగా టీఎంసీ ఎంపీ బిత్తిరి చర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. బీజేపీ లోక్‌సభ ఎంపీ లాకెట్ చట్టర్జీ తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘‘టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరి కొందరు నాయకులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు. వీరితో పాటు బాన్కురా మహిళా ఎమ్మెల్యే కూడా ఈ ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు. ఇక మీడియా సమక్షంలోనే అందరూ చూస్తుండగా కళ్యాణ్ బెనర్జీ సదరు మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే సదరు మహిళా ఎమ్మెల్యేకు టీఎంసీ ఈ సారి టికెట్ ఇవ్వలేదు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలో బీజేపీ.. ‘‘టీఎంసీ నేతల నీచ బుద్ధులకు ఈ వీడియో నిదర్శనం. గద్దె దించడమే వీరికి సరైన శిక్ష’’ అంటూ విమర్శిస్తోంది. ఈ వీడియోపై టీఎంసీ ఇంతవరకు స్పందించలేదు. చదవండి: తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే.. TMC empowering women...? This is TMC MP Kalyan Banerjee and the woman is outgoing Bankura MLA who was miffed for not getting a ticket. Shame! pic.twitter.com/JUXsZerN6i — Locket Chatterjee (@me_locket) March 9, 2021 -
భారత్ కాస్త నరేంద్రమోదీ దేశంగా రూపు
కోల్కత్తా: దేశంలో పేర్ల మార్పిడిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. మొన్న మొతెరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాగే చూస్తుంటే రేపొద్దున భారతదేశం బదులు నరేంద్ర మోదీ దేశంగా మారుస్తారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ తనను తాను గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ ధ్రువపత్రాలపై, ఇటీవల సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియానికి పేరు మారడాన్ని మమతా గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 స్థానాల్లో మమతాకు బీజేపీకి మధ్య పోరాటం ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేర్కొనే గుజరాత్ వైపు ఒకసారి చూసుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాకు హితవు పలికారు. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదు అని బీజేపీ చేసిన విమర్శలను కొట్టిపారేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఒకవైపు మమతా బెనర్జీ బహిరంగ సభ కొనసాగుతుంటే మరోవైపు తృణమూల్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం గమనార్హం. -
మమతకు కష్టాలు తప్పవేమో, ‘పీపుల్స్ పల్స్’ ఇదే!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యంగా కన్పిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం. పశ్చిమ బెంగాల్లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, రీసెర్చర్ డాక్టర్ సజ్జన్ కుమార్ ఈ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల ఈసారి బీజేపీకి లబ్ది చేకూరే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 160 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో మాత్రమే తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలత కన్పిస్తోంది. 12 స్థానాల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి అనుకూలత ఉంది. దాదాపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ-టీఎంసీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా పోటీ నెలకొంది. రాష్ట్రంలోని 5 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరో 7 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య 1 స్థానంలో మాత్రమే తీవ్రమైన పోటీ నెలకొంది. బెంగాల్‌లోని మెజారిటీ హిందూ ఓటర్లు బీజేపీవైపు పోలరైజ్ అవుతున్నారు. బెంగాల్లో అబ్బాస్ సిద్దిఖీ కారణంగా ముస్లిం ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బ. ఇక రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పరిశీలిస్తే... నార్త్ బెంగాల్ లో బీజేపీ హవా కొనసాగే అవకాశం ఉంది. నార్త్ బెంగాల్ లోని డార్జిలింగ్, కాళింపోంగ్, జల్పాయిగురి, అలిపుర్దౌర్, కూచ్ బిహార్ జిల్లాల్లోని 28 అసెంబ్లీ స్థానాలుండగా, వీటిలో ఏకంగా 22 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. మరో 5 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ మధ్య, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నార్త్ బెంగాల్ లో 75 శాతానికిపైగా హిందువులుండగా, 14 శాతం ముస్లింలు, 4 శాతం క్రిస్టియన్లు, బౌద్ద ఓటర్లున్నారు. సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే.. దాదాపు 35 శాతం మంది ఎస్సీ ఓటర్లున్నారు. వీరిలో అత్యధిక ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్ పాలనపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. నార్త్ బెంగాల్లో మొత్తం ఓటర్లలో 10 శాతానికిపైగా ఎస్టీ ఓటర్లున్నారు. వీరు సైతం అధికార పార్టీ నేతల పనితీరు, అవినీతిపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఈసారి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. మైనారిటీ ఓటర్ల ఆధికంగా ఉన్న నార్త్ దినాజ్ పూర్, సౌత్ దినాజ్ పూర్, మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో టీఎంసీకి అనుకూలత కన్పిస్తోంది. ఈ నాలుగు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో దాదాపు 50 శాతం మంది ముస్లిం సామాజికవర్గం వారే. ఈ జిల్లాల్లోని మొత్తం 49 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 17 స్థానాల్లో టీఎంసీ, 10 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాల్లో లెఫ్ట్ కూటమికి అనుకూలత లభిస్తోంది. మిగిలిన సీట్ల విషయానికొస్తే...4 సీట్లలో టీఎంసీ-బీజేపీ, మరో 4 సీట్లలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా తీవ్రమైన పోటీ నెలకొంది. అలాగే 2 స్థానాల్లో టీఎంసీ-లెఫ్ట్-బీజేపీ, మరో స్థానంలో బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. సెంట్రల్ బెంగాల్ ప్రాంతంలోని బిర్భుం, పశ్చిమ వర్దమాన్+పూర్వవర్ధమాన్, నాదియా జిల్లాల్లో 49 అసెంబ్లీ స్థానాలున్నాయి. సెంట్రల్ బెంగాల్ రీజియన్ పరిధిలో 29 శాతం మంది ఎస్సీలు, 5 శాతానికిపైగా ఎస్టీలు ఉన్నారు. మతాల వారీగా విశ్లేషిస్తే... సెంట్రల్ బెంగాల్ రీజియన్ పరిధిలో 71 శాతానికైగా హిందువులు, 28 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతానికిపైగా బౌద్దులున్నారు. సెంట్రల్ బెంగాల్ పరిధిలోని 49 సీట్లకుగాను 30 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. టీఎంసీకి 11 స్థానాల్లో, లెఫ్ట్ కూటమికి 1 స్థానంలో అనుకూలత కన్పిస్తోంది. అలాగే 7 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ కూటమి మధ్య తీవ్రమైన పోటీ (టఫ్ ఫైట్) నెలకొంది. జంగల్-మహల్ ప్రాంతంలోని పురూలియా, బంకురా, ఝారాగ్రాం, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లోని 42 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో 83 శాతానికిపైగా హిందువులు, 8 శాతానికిపైగా ముస్లింలు, 1 శాతంలోపు బౌద్దులు ఉన్నారు. జంగల్-మహల్ ప్రాంతంలోని 42 అసెంబ్లీ స్థానాలకుగాను 33 సీట్లలో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది. అలాగే టీఎంసీకి 5 స్థానాల్లో మాత్రమే అనుకూలత కన్పిస్తోంది. మిగిలిన 4 సీట్లలో టీఎంసీ-బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సౌత్ బెంగాల్ పరిధిలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలోని హుగ్లి, హౌరా, ఉత్తర 24 పరగణాలు, కోల్ కతా, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 16 శాతం మంది ఎస్సీలు, 1.5 శాతం మంది ఎస్టీలున్నారు. ఈ ప్రాంతంలోని 126 అసెంబ్లీ స్థానాలకుగాను 65 స్థానాల్లో బీజేపీకి అనుకూల గాలి వీస్తోంది. అలాగే 37 స్థానాల్లో టీఎంసీకి అనుకూలత కన్పిస్తోంది. మరో 19 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ, 1 స్థానంలో టీఎంసీ-లెఫ్ట్ కూటమి, 4 స్థానాల్లో టీఎంసీ-బీజేపీ-లెఫ్ట్ కూటమి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
దీదీ మోసం చేశారు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ప్రజలను మోసం చేశారని, అవమానించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. వామపక్ష పాలన తరువాత రాష్ట్రంలో మంచి మార్పు వస్తుందని ఆశించిన ప్రజలను ఆమె మోసం చేశారన్నారు. అవినీతిని, సిండికేట్ రాజ్‌ను పెంచి పోషించారని ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారాన్ని ఆదివారం కోల్‌కతాలో భారీగా జరిగిన ప్రచార సభతో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ ‘నిజమైన మార్పు’ పిలుపునివ్వగానే సభికులు ఉత్సాహంతో ఒక్కసారిగా నినాదాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధిని, ఉపాధి కల్పనను సాధిస్తామని మోదీ హామీ ఇచ్చారు. మమతా బెనర్జీ తమకు ‘దీదీ(సోదరి)’గా నిలుస్తారని రాష్ట్రప్రజలు ఆశిస్తే.. ఆమె మాత్రం తన తన మేనల్లుడికి అత్తగా మాత్రమే వ్యవహరించారని ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తదుపరి సీఎం చేయాలనుకుంటున్నారని బీజేపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కొద్దిమంది సన్నిహితులైన పారిశ్రామికవేత్తల కోసమే మోదీ పని చేస్తున్నారన్న విమర్శలను తిప్పికొడుతూ.. ‘భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలు నాకు సన్నిహితులే. వారికోసమే నేను పనిచేస్తాను. బెంగాల్‌లోని నా స్నేహితులకు 90 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. టీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. బెంగాల్‌లోని తేయాకు కార్మికులు నా స్నేహితులే’ అని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా బెంగాల్‌కు పరాయివారన్న మమత ప్రచారాన్ని కూడా ప్రధాని తిప్పికొట్టారు. ‘ఇదే బెంగాల్‌కు చెందిన శ్యామా ప్రసాద ముఖర్జీ స్ఫూర్తి పునాదిగా ఏర్పడిన బీజేపీ పరాయిది ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు. బీజేపీ అధికారం లోకి వస్తే అసలైన మార్పు తీసుకువస్తామని, ప్రజలందరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. చొరబాట్లను అడ్డుకుంటామని, బుజ్జగిం పు రాజకీయాలు చేయబోమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన దళిత ‘మతువా’ వర్గం వారికి భారత పౌరసత్వం కల్పిస్తామన్నారు. ‘విద్యార్థులకు మెరుగైన విద్య, యువతకు ఉద్యోగాలు లభించడం, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, ప్రజలు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకపోవడమే మేం తీసుకువచ్చే అసలైన మార్పు’ అని వ్యాఖ్యానించారు. భరతమాత ఆశీస్సులతో రాష్ట్రాన్ని ‘బంగారు బంగ్లా’గా మారుస్తామన్నారు. టీఎంసీ ‘ఖేలా హోబె’(ఆట మొదలైంది)’ నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘టీఎంసీ ఖేలా ఖతమ్..ఔర్ వికాస్ షురూ’(టీఎంసీ ఆట ముగిసింది.. అభివృద్ధి ప్రారంభమైంది) అని వ్యాఖ్యానించారు. మార్పు తీసుకువస్తారన్న ప్రజల ఆశలను మమత, ఆమె పార్టీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఎంసీ, లెఫ్ట్, కాంగ్రెస్‌లు ఒకవైపు.. రాష్ట్ర ప్రజలు మరోవైపు ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఓటు బ్యాంకు రాజకీయాలను లెఫ్ట్, టీఎంసీ మరింత ముందుకు తీసుకువెళ్లాయని మండిపడ్డారు. మమత హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నాశనమైందని, అవినీతి పెచ్చుమీరిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా రాష్ట్ర ప్రజలకు అందకుండా అడ్డుకున్నారన్నారు. నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోవడం ఖాయమన్నారు. ‘బెంగాల్లో మీరు చేసిన బురదలో కమలం వికసించనుంది’ అని మమతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ నినాదం అమ్మ, మట్టి, మనిషి నినాదాన్ని గుర్తు చేస్తూ.. ఆమె పాలనలో రాష్ట్రంలో తల్లులు, కూతుర్లు ఏడవని రోజు లేదని, బెంగాల్ మట్టిలో దళారులు, గూండాలు పెరిగారని, మనుషులు తోటి మనుషుల రక్తాన్ని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలను తరలించారు. -
వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో తొలగించండి
న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇచ్చే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో ప్రధాని మోదీ ఫొటోను ప్రచురించవద్దంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్రాన్ని శనివారం కోరింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫొటోను ప్రచురించడం ద్వారా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖ అనంతరం ఈసీ కేంద్రానికి ఈ మేరకు సూచనలు చేసింది. త్వరలో పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కేంద్రానికి ఈసీ రాసిన లేఖలో ఎవరి పేరును పెట్టలేదని, కేవలం ప్రధాని ఫొటోలు కనిపించకుండా ఫిల్టర్లు మాత్రమే వాడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖకు సూచించిందని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రావాల్సిన క్రెడిట్‌ను ప్రధాని తన వైపు మళ్లించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించింది. -
తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే..
-
తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ.. మరో సారి అధికారంలోకి రావాలని టీఎంసీ సీరియస్‌గా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో పాగా వేయడం కోసం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీఎంసీ నాయకులను లాక్కుంటుంది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నాయుకుడు ఒకరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఇన్నాళ్లు టీఎంసీలో ఉండి తప్పు చేశాను.. ఇందుకు తనను క్షమించాల్సిందిగా కోరుతూ.. వేదిక మీద గుంజీళ్లు తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. సుశాంత్ పాల్ అనే నాయకుడు కొద్ది రోజుల క్రితం టీఎంసీ నుంచి బయటకు వచ్చాడు. నేడు ఆయన బీజేపీలో చేరారు. టీఎంసీ మాజీ మినిస్టర్ సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. ‘‘మొదట నేను బీజేపీలోనే ఉన్నాను. కానీ లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం 2005లో టీఎంసీలో చేరాను. అప్పటి నుంచి ఆ పార్టీలో ఉండి తప్పు చేశాను. టీఎంసీ కార్యకర్తగా నాకు అంటుకున్న పాపాల ప్రక్షాళన కోసం నాకు నేనే ఓ చిన్న శిక్ష వేసుకుంటున్నాను’’ అంటూ మూడు సార్లు గుంజీళ్లు తీశారు. పక్కన ఉన్న వారు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ పాల్ మాత్రం ఆగలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. చదవండి: టీఎంసీ కంచుకోటలో పాగాకు బీజేపీ వ్యూహాలు బీజేపీ, టీఎంసీలను ఓడించాలి -
పార్టీల కొట్లాట: 85 ఏళ్ల వృద్ధురాలిపై దాడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు వేడెక్కాయి. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఎంసీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి. రెండు పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటుండగా.. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలు కొందరు బీజేపీ కార్యకర్తతో పాటు అతడి తల్లి 85 ఏళ్ల వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన బెంగాల్ 24 పరగణాస్ జిల్లా నిమ్తాలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. టీఎంసీ కార్యకర్తలు కొందరు బీజేపీ పార్టీ మద్దతుదారు అయిన గోపాల్ మజుందార్ ఇంట్లో ప్రవేశించి అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో గోపాల్ తల్లి. 85 ఏళ్ల వృద్ధురాలు దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాంతో టీఎంసీ కార్యకర్తలు వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సందర్భంగా వృద్ధురాలు మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు బీజేపీ కోసం పని చేస్తున్నాడనే కోపంతో టీఎంసీ గుండాలు తనపై దాడి చేశారు. నా కుమారుడిని కొట్టడంతో నేను తట్టుకోలేకపోయాను. శరీరం సహకరించకపోయినప్పటికి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాను. కానీ వారు నాపై కూడా దాడి చేశారు. వృద్ధురాలిని అని కూడా చూడకుండా నన్ను కొట్టారు. ప్రస్తుతం నేను ఏం మాట్లాడలేకపోతున్నాను.. సరిగా కూర్చోలేకపోతున్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గోపాల్ మజుందార్ మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ గుండాలు శనివారం అర్థరాత్రి 01.20 గంటల ప్రాంతంలో నా ఇంట్లోకి ప్రవేశించారు. నా తలకు గన్ గురిపెట్టారు. కిందపడేసి లాఠీలతో కొట్టడం ప్రారంభించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మా అమ్మపై కూడా దాడి చేశారు. కానీ టీఎంసీ గుండాలు నన్ను ఎంత బెదిరించినా నేను భయపడను. నా ఒంట్లో చివరి రక్తం బొట్టు ఉన్నంతవరకు నేను బీజేపీ కోసమే పని చేస్తాను’’ అని తెలిపారు. గోపాల్ మజుందర్, అతడి తల్లి మాట్లాడిన వీడియోను బీజేపీ తన ట్విట్టర్లో షేర్ చేసింది. టీఎంసీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘‘టీఎంసీ రోజు రోజుకు దిగజారిపోతుంది. ఈ వృద్ధురాలిపై దాడి చేశారనే వార్త నన్ను కలచి వేసింది. ఈ తల్లి ఆవేదన, బాధకు టీఎంసీ సమాధానం చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ జనాలు బీజేపీని గెలిపించి.. టీఎంసీ రాక్షస పాలన నుంచి విముక్తి పొందుతారు’’ అంటూ ట్వీట్ చేశారు. టీఎంసీ కార్యకర్తల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. పాపం ఆ వృద్ధురాలు ఏం నేరం చేసిందని ఆమెపై ఇంత దారుణంగా దాడి చేశారని మండిపడుతున్నారు. -
టీఎంసీ కంచుకోటలో పాగాకు బీజేపీ వ్యూహాలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎవరికి వారు తమ విజయావకాశాలపై గంపెడాశలు పెట్టుకొని వ్యూహరచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారపీఠాన్ని వదులుకొనేందుకు ఇష్టపడని తృణమూల్ కాంగ్రెస్ కమలదళాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వామపక్షాలను పక్కకునెట్టి తృణమూల్ కాంగ్రెస్‌ను అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో నందిగ్రామ్ ఉద్యమంతో పాటు హుగ్లీ ప్రాంతం కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హుగ్లీ జిల్లాలో ఉన్న సింగూర్‌లో బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేసిన ఆందోళన, రాష్ట్రంలో అధికార మార్పుకు కారణమైంది. సింగూర్ నుంచి టాటా మోటార్స్ ఫ్యాక్టరీ వైదొలగడంతో మమతా బెనర్జీ గద్దెనెక్కారు. దీంతో బెంగాల్ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన సింగూరుపై పట్టు నిలుపుకొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. కేవలం టీఎంసీ మాత్రమే కాకుండా మిగతా రాజకీయ పార్టీలు సింగూరు కేంద్రంగా హుగ్లీ జిల్లాలో ఎన్నికలపై వ్యూహ రచనలు సిద్ధం చేసుకున్నాయి. సింగూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే హుగ్లీ జిల్లా వ్యాప్తంగా ప్రజలు గెలిపించుకుంటారనేది విశ్లేషకుల అభిప్రాయం. బెంగాల్ రాజకీయాల్లో 2011లోనే కీలక పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, 2001లోనే సింగూర్‌లో దీనికి బీజం పడింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన రవీంద్రనాథ్ భట్టాచార్య 20 ఏళ్లుగా సింగూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కంటే ముందు వామపక్షాలు, కాంగ్రెస్ పారీ్టలు ఈ స్థానంలో గెలిచాయి. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సింగూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గంపై కాషాయ జెండాను ఎగురవేసిన కమలదళం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 18 స్థానాల్లో తమ సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తోంది. 2011లో టీఎంసీ జయకేతనం 2011లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ హుగ్లీ జిల్లాలోని 18 సీట్లలో 16 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అనంతరం 2016 లోనూ తమ హవాను కొనసాగించడంలో మమతా బెనర్జీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అదే సమయంలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు హుగ్లీ జిల్లాలో కేవలం రెండు సీట్లు గెలుచుకోగా, 2016లో ఒకే స్థానానికి పరిమితం కావాల్సి వచి్చంది. 2011లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, 2016లో మాత్రం ఒక స్థానాన్ని దక్కించుకోగలిగింది. 2019లో బీజేపీ బోణీ 2016 ఎన్నికల్లో హుగ్లీ జిల్లాలో ఖాతా తెరవలేకపోయిన బీజేపీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హుగ్లీ లోక్‌సభ సీటును గెలుచుకుంది. దీంతో హుగ్లీ జిల్లాలో కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించేందుకు తమకు అవకాశం లభించిందని కమలదళం ఆశపడుతోంది. కేవలం హుగ్లీనే కాక అరాంబాగ్ లోక్‌సభ స్థానాన్ని కేవలం 1,142 ఓట్ల తేడాతో బీజేపీ కోల్పోయింది. హూగ్లీ జిల్లాలోని మూడవ లోక్‌సభ స్థానమైన శ్రీరాంపూర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కళ్యాణ్ బెనర్జీ గెలిచి మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే హుగ్లీ జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని రెండింటిలో తమ ప్రభావాన్ని పెంచుకున్న బీజేపీ నాయకులు, మిగతా ప్రాంతాలపై దృష్టిపెట్టారు. రెండు దశల్లో పోలింగ్ హుగ్లీ జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 6వ తేదీన జంగీపాడ, హరిపాల్, ధానియాఖాలి, తారకేశ్వర్, పుర్సురా, అరాంబాగ్, గోఘాట్, ఖానకుల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 10న హుగ్లీలోని ఉత్తర్‌పాడా, శ్రీరాంపూర్, చాంప్దానీ, సింగూర్, చందన్నగర్, చుంచుడా, బాలాగఢ్, పాండువా, సప్తగ్రామ్, చండితల్లా అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అప్పటి హవా కొనసాగేనా? 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 18 అసెంబ్లీ స్థానాల్లో నాలుగైదు సీట్లు మినహా మిగిలిన సీట్లు కాషాయం కైవసమయ్యాయి. ఆరాంబాగ్, హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు, మూడు అసెంబ్లీ స్థానాలను మినహాయించి, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. హుగ్లీ లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమలదళాన్ని ప్రజలు ఆదరించారు. దీంతో బీజేపి అభ్యర్థి లాకెట్ ఛటర్జీ హుగ్లీ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోగా, ఆరాంబాగ్ లోక్‌సభ స్థానంలో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి కేవలం ఒకటిన్నర వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో హుగ్లీ జిల్లాలో బోణీ కొట్టలేకపోయినప్పటికీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరణకు తోడు ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కమలదళం భావిస్తోంది. చదవండి: బీజేపీ, టీఎంసీలను ఓడించాలి బెంగాల్ ఎన్నికలు: పీకే ఆసక్తికర ట్వీట్ -
అందుకే బెంగాల్లో 8 విడతల్లో ఎన్నికలు: సీఈసీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల సమరానికి నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 శాసన సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో జరుగనున్న ఎలక్షన్ ఫలితాలు మే 2న వెలువరించనున్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ మరోసారి ఓటర్ల మనసును చూరగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు... అభివృద్ధి కావాలో... అవినీతి, కట్ మనీ కల్చర్ కావాలో తేల్చుకోండి అంటూ బీజేపీ ప్రచార దూకుడు పెంచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా బీజేపీ ప్రధాన నేతలంతా బెంగాల్లో పర్యటిస్తూ మమత సర్కారుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో(2016) 294 స్థానాలకు గానూ టీఎంసీ 211, వామపక్షాలు 79 గెలుచుకోగా బీజేపీ కేవలం 3 స్థానాలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని మమతకు షాకిచ్చింది. అదే జోరులో టీఎంసీ కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతో టీఎంసీ- బీజేపీల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది. ఈ విషయం గురించి సీఈసీ సునీల్ అరోరా మాట్లాడుతూ.. ‘‘రాజకీయ పార్టీల పేర్ల ప్రస్తావన అనవసరం. శాంతి భద్రతలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించినప్పుడు, ఈసారి ఎనిమిది విడతల్లో ఎన్నికల నిర్వహణ పెద్ద విషయమేమీ కాదు’’ అని పేర్కొన్నారు. పోలింగ్ తేదీలు: ►తొలి విడత: మార్చి 27 ►రెండో విడత: ఏప్రిల్ 1 ►మూడో విడత: ఏప్రిల్ 6 ►నాలుగో విడత: ఏప్రిల్ 10 ►ఐదో విడత: ఏప్రిల్ 17 ►ఆరో విడత: ఏప్రిల్ 22 ►ఏడో విడత: ఏప్రిల్ 26 ►ఎనిమిదో విడత: ఏప్రిల్ 29 చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. -
బెంగాల్లో సిండికేట్ రాజ్యం
చుచుర(పశ్చిమబెంగాల్)/ధెమాజి(అస్సాం): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు పెంచారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అధికార పార్టీ ఆధ్వర్యంలో సిండికేట్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఆ సిండికేట్‌కు ‘కట్ మనీ’ చెల్లించకుండా సామాన్యులకు ఏ పనీ కావడం లేదన్నారు. ‘చివరకు ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా.. ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా కట్ మనీ ఇవ్వాల్సిందే. సిండికేట్ అనుమతి లేకుండా ఏ పనీ కాదు’అని విమర్శించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రముఖులను, సాంస్కృతిక వారసత్వాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సురక్షిత తాగు నీటిని అందించే కేంద్ర ప్రభుత్వ ‘జల్‌జీవన్’పథకాన్ని కూడా రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయకుండా రాష్ట్రంలోని మహిళలను ఇబ్బందులు పెడ్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలుకాకుండా అడ్డుకుని రైతులకు, పేదలకు వాటి ప్రయోజనాలు లభించకుండా చేశారని ఆరోపించారు. హూగ్లీ జిల్లాలో ఒక బహిరంగ సభను ఉద్దేశించి సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ పర్యటన సందర్భంగా నొవాపాడా నుంచి దక్షిణేశ్వర్ వరకు మెట్రో రైలు ఎక్స్‌టెన్షన్‌తో పాటు పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దక్షిణేశ్వర్లో 160 ఏళ్ల నాటి ప్రఖ్యాత కాళీ మాత ఆలయం ఉంది. స్వయం సమృద్ధ భారత్‌కు పశ్చిమబెంగాల్ చాలా కీలకమైన కేంద్రమని ప్రధాని పేర్కొన్నారు. అస్సాంను అభివృద్ధి చేయలేదు గతంలో అస్సాంను పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు. అస్సాంను, ఈశాన్య రాష్ట్రాలను దశాబ్దాల తరబడి గాలికి వదిలేశాయని మండిపడ్డారు. అస్సాంలో సోమవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ‘స్వాతంత్య్రం అనంతరం దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వారు దిస్పూర్ ఢిల్లీకి చాలా దూరమని భావించారు. కానీ ఇప్పుడు ఢిల్లీ దూరంలో లేదు. మీ దర్వాజా ముందే ఉంది’అని ధెమాజి జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మార్చి 7వ తేదీలోపు ప్రకటించే అవకాశముందని ప్రధాని సంకేతాలిచ్చారు. ‘ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 7లోపు ప్రకటిస్తారని నేను అంచనా వేస్తున్నా’అని అన్నారు. ప్రధాని అస్సాంలో పర్యటించి రూ. 20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘రక్షణ’ తయారీపై నిర్లక్ష్యం రక్షణ రంగ పరికరాల తయారీలో భారత్ వేగంగా సామర్థ్యాలను పెంచుకుంటోందని మోదీ అన్నారు. స్వాతంత్య్రానికి ముందే భారత్‌లో వందలాది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, ప్రపంచ యుద్ధాల సమయంలో ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల ఎగుమతి జరిగిందని గుర్తు చేశారు. తదనంతర కాలంలో, వాటిని పట్టించుకోలేదని, వాటిని బలోపేతం చేసేందుకు కృషి చేయలేదని విమర్శించారు. రక్షణ రంగానికి తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపుల సమర్థ వాడకంపై వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. -
అమిత్ షాకు బెంగాల్ కోర్టు సమన్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధుల(ఎంపీ, ఎమ్మెల్యే) కోర్టు శుక్రవారం అమిత్ షాకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అమిత్ షాపై దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా ‘‘ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు అమిత్ షా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టు ముందు హాజరు కావాలి’’ అని బిధన్నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాక అమిత్ షా మీద ఐపీసీ సెక్షన్ 500 కింద నమోదైన పరువు నష్టం కేసులో సమాధానం ఇవ్వాలని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. 2018 ఆగస్టు 11న కోల్‌కతాలో మాయో రోడ్లో బీజేపీ చేపట్టిన ఓ ర్యాలీలో టీఎంసీ ఎంపీ బెనర్జీని కించపరిచేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని.. బెనర్జీ లాయర్ సంజయ్ బసు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. చదవండి: దమ్ముంటే నా మేనల్లుడిపై పోటీ చేయ్ -
దమ్ముంటే నా మేనల్లుడిపై పోటీ చేయ్
కోల్కత్తా: అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు సెగ పుట్టిస్తున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య విమర్శల జోరు నడుస్తోంది. పరివర్తన్ యాత్రలో అమిత్ షా మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లక్ష్యంగా విమర్శలు చేయగా దానికి మమతా ధీటుగా స్పందిస్తున్నారు. తాజాగా తన మేనల్లుడిపై ఆరోపణలు చేస్తున్న అమిత్ షాకు సవాల్ విసిరారు. దమ్ముంటే నా అల్లుడు అభిషేక్ బెనర్జీపై అమిత్ షా పోటీ చేయాలని కోరారు. ఆ తర్వాత నాపై పోటీ చేయండి అని సలహా ఇచ్చారు. మొదట అభిషేక్ బెనర్జీపై పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. గురువారం దక్షిణ 24 పరగణాల జిల్లా పైలాన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడారు. రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్నా ప్రజా తీర్పు కోసం తన అల్లుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశాడని వివరించారు. అమిత్ షా చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తన అల్లుడిపై విమర్శలు చేసే ముందు మీ కుమారుడు 2019లో చేసిన ఘన కార్యంపై స్పందించాలని మమతా విజ్ఞప్తి చేశారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉండి కోట్లాది రూపాయలు దోచుకోలేదా అని ప్రశ్నించారు. అతడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే దమ్ము ఉందా? నిలదీశారు. ఈ విధంగా తృణమూల్, బీజేపీ మధ్య విమర్శల వాన కురుస్తోంది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాష్ట్రంలో సెగలు పుట్టిస్తున్నారు. ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్‌కే: బీజేపీకి సున్నా పుదుచ్చేరి సంక్షోభం: గవర్నర్ కీలక నిర్ణయం -
2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’!
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్ని నరేంద్ర మోదీని ఢీకొట్టే బలమైన ప్రధాని అభ్యర్థి కోసం గాలించాయి. చాలా మంది నాయకులు తాము ఆ రేసులో ఉన్నట్లు ప్రకటించారు. అయితే మోదీతో తలపడటం అంటే ప్రకటనలు చేసినంత సులభం కాదు. ఆ విషయం విపక్షాలకు, జనాలకు బాగానే అర్థం అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం బెంగాల్లో ఎన్నికల దంగల్ నడుస్తోది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో బెంగాల్లో 18 సీట్లు సాధించిన బీజేపి ఈ సారి మరింత బలపడాలని భావిస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మతకంగా తీసుకుంది బీజేపీ. ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎక్కడా తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటూ బీజేపీతో తలపడుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ-టీఎంసీ మధ్య నడుస్తోన్న వార్ చూస్తే.. మోదీని సమర్థవంతంగా ఎదుర్కొగల నాయకురాలు దీదీనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తాజాగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తూర్పు భారతదేశ మహిళ 2024లో ప్రధాని పీఠం అధిరోహించవచ్చన్నారు. ఇండియా టూడే కాన్క్లేవ్ ఈస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై స్పందిచారు. ఈ సందర్భంగా డెరెక్ మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రజలు తమ కోసం పని చేసే ఓ పురుషుడు, మహిళ ప్రధానిగా రావాలని ఎదరుచూస్తున్నారు. తూర్పు భారతదేశానికి చెందిన మహిళ 2024లో ప్రధాని పదవి చేపడతారని అని నా నమ్మకం’’ అంటూ పరోక్షంగా దీదీనే 2024 ప్రధాని అభ్యర్థి అని వెల్లడించారు. మోదీ, మమతల మధ్య అదే తేడా ఇక మోదీ, మమతల మధ్య అసలు ఎలాంటి పోలిక లేదన్నారు డెరెక్. ‘‘అసలు వారిద్దరిని ఎలా పోలుస్తాం. రాజకీయ వాతావరణంలో గౌరవనీయులైన ప్రధానిని ఇలా పోల్చడం కరెక్ట్ కాదు. అయితే వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటంటే ఒకరు హామీలను నేరవేర్చే వారు.. మరొకరేమో కేవలం ప్రచారానికే పరిమితం అవుతారు’’ అంటూ పరోక్షంగా దీదీపై ప్రశంసలు, మోదీపై విమర్శలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను కూడా విమర్శించారు. పార్లమెంట్లో టీఎంసీ లేవనెత్తిన పలు అంశాలపై బీజేపీ ఇంత వరకు సమాధానం చెప్పలేదని డెరెక్ ఓ బ్రెయిన్ మండిపడ్డారు. ‘‘బీజేపీ.. బెంగాల్లో కూడా మత రాజకీయాలు చేయాలని చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే అభివృద్ధి గురించి ప్రచారం చేయకుండా.. కేవలం మతపరమైన అంశాలనే ప్రచారం చేస్తోంది. అరుణ్ జైట్లీ ఉంటే ఇలా జరగనిచ్చేవారు కారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది గుజరాత్ జింఖానా బ్యాచ్. మతం తప్ప వారికి మరో అంశం తెలీదు’’ అంటూ డెరెక్ ఓ బ్రెయిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం బెంగాల్ అసెంబ్లీలో ‘జై శ్రీరాం’..! -
ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఏడాదిలోనే కేంద్ర మాజీ మంత్రి దినేశ్ త్రివేది తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. అయితే ఆయన ఎప్పటి నుంచో బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందించారు. ఆ తెల్లారి ఆయన రాజ్యసభకు రాజీనామా చేయడం బెంగాల్లో కీలక పరిణామంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన దినేశ్ త్రివేదిని గతేడాది తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభకు పంపించింది. అయితే పశ్చిమబెంగాల్లో రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయి. బీజేపీలోకి తృణమూల్ పార్టీ నాయకుల వలసలు పెరగడంతో ఈ క్రమంలోనే ఆయన కూడా రాజ్యసభకు రాజీనామా చేశారని తెలుస్తోంది. రాజీనామా చేసిన సందర్భంగా దినేశ్ త్రివేది బెంగాల్లో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస జరుగుతున్నా నేను నిస్సహాయుడిగా మిగిలిపోయా. బెంగాల్లో జరుగుతున్న హింసతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లనుంది. ఇక్కడ కూర్చోవడం నాకు చాలా వింతగా అనిపిస్తోంది. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. ఇక్కడ కూర్చున్నా నేనేమీ మాట్లాడలేకపోతున్నా. మరి ఏం లాభం. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని త్రివేది ప్రకటించారు. ‘పార్టీ ఆదేశాలను పాటించాలని ఉన్నా తాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా. నన్ను ఇక్కడికి పంపినందుకు పార్టీకి కృతజ్ఞతలు. నేను రాష్ట్రానికి సేవ చేయాలని అనుకుంటున్నా’ అని దినేశ్ త్రివేది చెప్పారు. ఆయన రాజీనామా తృణమూల్‌ను షాక్‌కు గురి చేసింది. అయితే ముందు నుంచే ఆయన రాజీనామా సంకేతాలు ఇచ్చారు. గురువారమే దినేష్ త్రివేదీ.. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అభినందించారు. ఆయన ఇలా చేస్తారని అనుకోలేదని తృణమూల్ కాంగ్రెస ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. 1980లో కాంగ్రెస్ పార్టీతో ఆయన రాజకీయ జీవితం మొదలైంది. అనంతరం జనతా దళ్‌లో చేరారు. ఆ తర్వాత 1998లో దినేశ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా దినేశ్ త్రివేది బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇంకా తృణమూల్ పార్టీకి ఆయన రాజీనామా చేయలేదు. -
మమత సర్కారుకు టాటా
నవద్వీప్/మాల్డా: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని పశ్చిమ బెంగాల్ ప్రజలు నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆయన శనివారం బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని నవద్వీప్ నుంచి పరివర్తన్ యాత్ర (రథయాత్ర)ను ప్రారంభించారు. బెంగాల్లో మార్పునకు సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో తృణమూల్ ప్రభుత్వం పరిపాలనను రాజకీయంగా, పోలీసు వ్యవస్థను నేరమయంగా, అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చేసిందని దుయ్యబట్టారు. మా, మాటీ, మానుష్(తల్లి, భూమి, ప్రజలు) అనే తృణమూల్ నినాదం కనుమరుగైందన్నారు. తల్లిని అగౌరవపర్చారని, భూమిని లూటీ చేశారని, ప్రజలకు రక్షణ కల్పించలేకపోయారన్నారు. బెంగాల్లో దౌర్జన్య పాలన ‘జైశ్రీరామ్’ నినాదంలో తప్పేముందని నడ్డా ప్రశ్నించారు. ఈ నినాదాన్ని మమతా బెనర్జీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సొంత దేశ సంస్కృతితో అనుసంధానం కావడం తప్పు ఎలా అవుతుందన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సంస్కృతిని నిరాకరిస్తున్నారని ఆక్షేపించారు. బెంగాల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగుతోందని మండిపడ్డారు. 130 మంది బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని, తనపైనా జరిగిందని వెల్లడించారు. బెంగాల్ రైతులకు తీరని ద్రోహం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయకుండా మమత ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ద్రోహం చేసిందని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాల్డాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కృషక్ సురక్ష అభియాన్, ఏక్ ముట్టీ చావల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్ షోలో పాలుపంచుకున్నారు. రైతన్నల సంక్షేమానికి బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించారు. రైతులు తాము పండించిన పంటలకు పెట్టబడి వ్యయం కంటే 1.5 శాతం అధిక ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇటీవలే 100వ కిసాన్ రైలును ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ రైళ్లలో రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చని వెల్లడించారు. ‘జైశ్రీరామ్’ అంటే కోపమెందుకో? మమత సర్కార్, టీఎంసీకిæ ప్రజలు ‘నమస్తే, టాటా’ చెప్పబోతున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. ‘జైశ్రీరామ్’ నినాదాలు వినగానే మమతా బెనర్జీకి ఎందుకు కోపం వస్తోందో అర్థం కావడం లేదన్నారు. మాల్డా జిల్లాలోని షాహాపూర్ గ్రామంలో ‘కృషక్ సురక్ష సహ–భోజ్’లో భాగంగా నడ్డా స్థానిక రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. -
బెంగాల్ అసెంబ్లీలో ‘జై శ్రీరాం’..!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రోజురోజుకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయంగానే కాకుండా శాసనపరంగా కూడా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సంప్రదాయానికి భిన్నంగా సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలయ్యాయి. దీనికి తోడు ఆర్థిక మంత్రి కాకుండా ముఖ్యమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడం పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సాధారణంగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగం ఉండాలి. కానీ గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌ను ఆహ్వానించకపోవడం.. ఆర్థిక మంత్రి అమిత్ మిత్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పి సీఎం స్థాయిలో మమత బడ్జెట్ ప్రసంగం చేశారు. దీదీ చర్యపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. గవర్నర్ ప్రసంగం ఏది, ఆర్థిక మంత్రి ఎక్కడ, మీరెందుకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని చెప్పి నిరసనకు దిగారు. అవేవి పట్టించుకోకుండా మమత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ సమావేశాలను బహిష్కరించారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో చట్టాలు చేసే కీలకమైన శాసనసభలో మతపరమైన నినాదాలు చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. బీజేపీ ఎమ్మెల్యేల తీరును ఖండించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రానుండడంతో రూ.2.99 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మమత సర్కారు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే రాష్ట్రంలో టీఎంసీ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రి మమత వివరించారు. -
అద్దంలో చూస్కోండి: బీజేపీ నేతలకు మమత సలహా
కోల్కత్తా: బంగారంలాంటి భారతదేశాన్ని నాశనం చేసిన బీజేపీ.. ఇప్పుడు బెంగాల్‌ను బంగారంలా మారుస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బంగారు బెంగాల్‌గా మారుస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ముఖాలు ఒకసారి అద్దంలో చూసుకోవాలని బీజేపీ నాయకులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పశ్చిమబెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో విమర్శల జోరు కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్టూ ఆ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే బెంగాల్లో టీఎంసీ, బీజేపీలు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కోల్‌కత్తాలో నిర్వహించిన ఓ సమావేశంలో మమతా బీజేపీపై దుమ్మెత్తిపోశారు. బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదని, ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా మరే పార్టీకి లేదని స్పష్టం చేశారు. దేశాన్ని బీజేపీ విక్రయానికి పెట్టిందని మమత ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాహిత పాలనను అందిస్తున్నదని పేర్కొన్నారు. బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే ముందు బీజేపీ నేతలు ఒకసారి అద్దంలో ముఖాలు చూసుకోవాలని హేళన చేశారు. బీజేపీ నాయకులే తిరుగుబాటుదారులని ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై, రైతుల ఉద్యమం విషయమై బీజేపీని విమర్శించారు. ఈ విధంగా బెంగాల్లో రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టీఎంసీ, బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ.. తొలిసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఆరాట పడుతోంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
మమత డీలా.. మరో ఎమ్మెల్యే బీజేపీలోకి
కోల్కత్తా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పశ్చిమబెంగాల్లో రాజకీయాలు రంజుగా మారాయి. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా బెంగాల్‌కు కేటాయింపులు జరగడంతో బీజేపీ ఉత్సాహంగా ఉంది. దీంతో పాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరగడంతో బీజేపీ జోరు మీద ఉండగా ఎమ్మెల్యేల జంపింగ్‌తో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డీలా పడ్డారు. తాజాగా మరో ఎమ్మెల్యే టీఎంసీని వీడి బీజేపీలోకి చేరారు. మమతాబెనర్జీకి అండదండగా ఉన్న సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీతో సహా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనే డైమండ్ హార్బర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పి సోమవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంగళవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకులు ముకుల్ రాయ్, సువేందు అధికారి సమక్షంలో దీపక్ హల్దార్ బీజేపీలో చేరారు. ఆయనతో కలిపి మొత్తం 13 మంది తృణమూల్ కాంగ్రెస్‌ను వీడడంతో మమతా బెనర్జీ డీలా పడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ నిరాశలో ఉంది.