సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్ ప్రభుత్వం విముఖత చూపింది. ఇవాళ సాయంత్రం లోపు కేసును సీబీఐకి అప్పగించాలని ఆ రాష్ట్ర హైకోర్డు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది బెంగాల్ ప్రభుత్వం.
బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, జైదీప్ గుప్తా, గోపాల్ శంకరనారాయణన్ ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ముందు సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ చేసిన పిటిషన్ వేశారు. అయితే ఆ పత్రాలను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందు ఉంచాలని పిటిషనర్‌కు సూచించింది బెంచ్.
రేషన్ బియ్యానికి సంబంధించిన కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో, అతని అనుచరులు అధికారులపై దాడిచేశారు. ఈ ఘటన జరిగిన తరువాత షాజహాన్ పరారయ్యాడు. మరోవైపు షాజహాన్ దురాగతాలపై అప్పుడే వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. తమపై అత్యచారాలు జరుగుతున్నాయంటూ సందేశ్‌ఖాలీ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
సుమారు 50 రోజులకు పైగా పరారీలో ఉన్న షాజహాన్‌ను పోలీసులు ఫిబ్రవరి 29న అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు సామాన్యుడు కాదని.. ప్రజాప్రతినిధి అని.. దర్యాప్తు అనేది సాధారణ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటానికే తప్ప కేసుకు సంబంధించిన నిజాలను దాచి పెట్టడానికి కాదని చెబుతూ.. సిట్ ఏర్పాటును సైతం రద్దు చేసి కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు బెంగాల్ పోలీస్ శాఖను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment