Leander Paes Join TMC కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన టీఎంసీ.. గోవాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. గోవాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం టీఎంసీలోకి వలసలు భారీగా పెరిగాయి. రాజకీయ నాయకులతో పాటు.. సెలబ్రిటీలు కూడా టీఎంసీలో చేరుతున్నారు.
తాజాగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ టీఎంసీలో చేరారు. ఆయనతో పాటు నటి నసిఫా అలీ, సామాజిక కార్యకర్త మృణాళిని దేశప్రభు శనివారం టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని టీఎంసీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. వీరంతా మమతా బెనర్జీ సమక్షంలో వీరు పార్టీలో చేరినట్లు ప్రకటించారు.
We are extremely delighted to share that Shri @Leander joined us today in the presence of our Hon'ble Chairperson @MamataOfficial!
— All India Trinamool Congress (@AITCofficial) October 29, 2021
Together, we shall ensure that every single person in this nation sees the Dawn of Democracy that we have been waiting for since 2014!
(చదవండి: ‘ఈ సైకిల్స్’ ఆవిష్కరణలో పేస్ ఇలా పడిపోయాడేంటి?)
టీఎంసీలో చేరిన అనంతరం లియాండ్ పేస్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యాను. రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. దేశంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. దీదీ నిజమైన చాంపియన్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment