
పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా: కోవూరులో చంద్రబాబు చేపట్టిన రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జన సమీకరణ కోసం రోడ్ షోను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ స్పందన కరువైంది. చివరకు డబ్బులిచ్చి వాహనాల్లో జనాన్ని తరలించినా రోడ్ షో మాత్రం ఫ్లాప్ అయ్యింది.
అధినేత మెప్పుకోసం స్థానిక నేతలు పడరాని పాట్లు పడ్డా జన స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. దాంతో సభా స్థలి వద్ద కనీస సందడి కనిపించలేదు. కొంతమంది మహిళలకు రూ. 200 ఇచ్చి మీటింగ్‌కు తరలించారు. డబ్బులిస్తే తాము వచ్చామని సదరు మహిళలు చెప్పడంతో అసలే నిరాశలో ఉన్న టీడీపీ నేతలకు మరింత తలపోటు ఎక్కువైంది.