
అమరావతి, సాక్షి: వాతావరణ శాఖ హెచ్చరికలను పట్టించుకోకుండా ముంపు పరిస్థితికి కారణమైన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు సహాయక చర్యల విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నాలుగు రోజులు గడిచినా.. ఇంకా విజయవాడ జలదిగ్బంధంలోనే ఉండిపోయింది.
అయితే స్వయంగా తానే గ్రౌండ్‌లెవల్‌లో ఉన్నానంటూ ఫొటోలకు ఫోజులు, బిల్డప్‌లు ఇచ్చుకుంటున్న చంద్రబాబు.. తాజాగా వరదలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో.. సాక్షి రిపోర్టర్ కరకట్టలోని చంద్రబాబు నివాసం మునిగిన విషయాన్ని ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా.. ఆ విజువల్స్, ఫొటోలు చూపించారు. అయితే..
అదంతా అబద్ధం అంటూ సాక్షి విలేఖరికి అంతెత్తు ఎగిరిపడ్డారు సీఎం చంద్రబాబు. విజయవాడలో చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అందరి ఇళ్లలాగే మా ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏంటి?.. అంటూ అసహనం ప్రదర్శించారాయన.