వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై మళ్లీ కక్ష సాధింపు చర్యలు | Kadapa MLA Madhavi Reddy Targets YSRCP Corporators, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై మళ్లీ కక్ష సాధింపు చర్యలు

Published Thu, Feb 6 2025 4:52 PM | Last Updated on Thu, Feb 6 2025 5:54 PM

Kadapa MLA Madhavi Reddy Targets YSRCP Corporators

వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లే లక్ష్యంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప­గారి మాధవీరెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అన్నీ అనుమతులతో వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్‌ నడుపుతున్న వాటర్‌ప్లాంట్‌ను కూలగొట్టేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 26వ డివిజన్‌ కార్పోరేటర్‌  త్యాగరాజు వాటర్‌ ప్లాంట్‌ను కూలగొట్టాలని అధికారల్ని పురమాయించారు ఎమ్మెల్యే మాదవీ రెడ్డి.తాము వాటర్‌ ప్లాంట్‌ నడపడానికి అన్ని అనుమతులు ఉన్నాయని చూపినా అధికారులు మాత్రం కూలగొట్టేందుకే యత్నిస్తున్నారు. 

తమకు ఎమ్మెల్యే, కమిషనర్‌ ఆదేశాలున్నాయంటూ కూలగొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు మున్సిపల్‌  ిసిబ్బంది సిద్ధమైన క్రమంలో ఆ డివిజన్‌లోని ్స్థానికులు అడ్డుకున్నారు.  దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కక్షసాధింపునకు దిగితే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.  అన్నీ అనుమతులు ఉన్న వాటర్‌ ప్లాంట్‌ను ఎలా కూలగొడతారని కూటమి ప్రభుత్వం చర్యలను ప్రశ్నిస్తున్నారు.
 

వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్‌ వాటర్‌ ప్లాంట్‌ కూలుస్తున్నారన్న సమాచారం అందుకున్న మేయర్‌ సురేష్‌ బాబు అక్కడకు చేరుకున్నారు. ఏ అధికారంతో వాటర్‌ ప్లాంట్‌, ఇళ్లను కూలుస్తారని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వంలో దీనికి అన్ని పట్టాలు మంజూరు అయ్యాయని మేయర్‌ స్పష్టం చేశారు.  ఇది రాజకీయ కక్ష పూరిత చర్య అని. నోటీసులు కూడా లేకుండా తొలగింపునకు ఎలా వచ్చారని అక్కడ ఉన్న అధికారుల్ని ప్రశ్నించారు. దీనికి అధికారులు నీళ్లు నమలగా, ఇక్కడ నుంచి అధికారులు వెళ్లే వరకూ కదిలేది లేదని మేయర్‌ సురేష్‌ బాబు తేల్చిచెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement