
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు.
ఈటల రాజేందర్‌వి హత్యా రాజకీయాలని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. హత్యా రాజకీయాలను ఆయనక కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. 2014లో బాల్‌రాజ్ అనే వ్యక్తిని ఈటల రాజేందర్ హత్య చేయించారని ఆరోపించారు. ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్‌ను థర్డ్ డిగ్రీ పెట్టించి వేధిస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. 2018 మర్రిపల్లిగూడెంలో ఈటల తనను చంపించే ప్రయత్నం చేశారని అన్నారు. ఎక్కడ హుజురాబాద్‌లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు.
చదవండి: అంతా తెలుసు.. టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్
‘నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటెల రాజేందర్‌ను ఓడించేందుకు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుంది. బీసీలపై గౌరవం ఉంటే ఎందుకు ముదిరాజ్ కోడల్ని, అల్లున్ని తెచ్చుకోలేదు. కోళ్లఫామ్ పెట్టుకున్న వ్యాపారులు దివాళ తీస్తంటే ఈటల రాజేందర్ మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన పెంచే కోళ్లు ఏమైనా బంగారు గుడ్లు పెడుతున్నాయా? ఈటల రాజేందర్ కాస్త ఇవాళ చీటర్ రాజేందర్‌గా మారారు. రోడ్డు పొడిగింపు కోసం అమర వీరుల స్థూపాన్ని తొలగించేందుకు తీర్మానం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన అమరుల స్తూపం శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈటల లేడు’ అని పేర్కొన్నారు.
కాగా ఈటల రాజేందర్ సతీమణి జమున తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిఇసందే. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని జమున వ్యాఖ్యానించారు