
Oath To Vote: ఓటుతో దుమ్ము రేపుదాం
సాక్షి: రాబోయే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం సాక్షి మీడియా గ్రూప్ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి ప్రతి ఓటరు ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసలు "ఓత్ టు వోట్" (OATH TO VOTE) నినాదం ఏమిటంటే..
'ఓటు హక్కు కలిగిన ఓటరు ఈ వెబ్ సైట్ https://o2v.sakshi.com/?utm_source=sakshio2v కు లాగిన్ అయి తమ ఓటు హక్కును 2023 ఎన్నికలలో తప్పకుండా వినియోగించుకుంటామని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) ద్వారా ప్రమాణం చేయాలి. అంతేకాదు ఆ ప్రమాణానికి సంబంధించి ప్రమాణపత్రం కూడా ఇమెయిల్ రూపంలో వెంటనే పొందవచ్చు.'
ఎన్నికల్లో ప్రతిసారి ఎవరో ఒకరు తమ విలువైన ఓటు హక్కును వాడుకోక పోవడం వల్ల ఆ ఓటు కాస్త మురిగిపోతుంది. దీనివల్ల ప్రభుత్వాలతోపాటు మన జీవితాలూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ‘‘ఏం ఓటు మీ హక్కు కాదా? మీకు తగిన అభ్యర్థిని మీరు ఎన్నుకోలేరా?’’ ఒక్కసారి ఆలోచించండి. గెలిచేది వారైతే గెలిపించేది మనమని అర్థం చేసుకోండి. వారు గెలిచి చేసే పాలన కన్నా మనం గెలిపించుకుని చేయించుకునే పాలనే మిన్న అని గుర్తించండి.
ఓటు హక్కును వాడుకునే అవకాశాలు మున్ముందూ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మనముందున్న ఎన్నికలు మనకొచ్చిన తాజా అవకాశం. మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరనుకున్న రేపటి భవిష్యత్తు మారిపోతుందన్న నమ్మకంతో ముందుకు కదలండి. ‘ఓత్ టు వోట్’ ద్వారా మీరేంటో నిరూపించుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి..