
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా మంత్రి విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తల్లి రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ వెల్లడించారు. కాగా మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కంగనాకు పోటీగా మంత్రి విక్రమాదిత్య సింగ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం ప్రతిభా సింగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత మూడు పర్యాయాలు ఆమె గెలిచారు.
ఈ సందర్భంగా ప్రతిభా సింగ్ మాట్లాడుతూ. మండి ప్రజలు ఎల్లప్పుడూ తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. విక్రమాదిత్యపై కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అన్నారు. గతంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ తాను గెలిచాను అని అన్నారు. హిమాచల్ ప్రజల గురించి కంగనాకు ఏం తెలియదని, ఈ ఎన్నికల్లో ఆమె గెలవదని అన్నారు. ‘దేవ్ భూమి’ హిమాచల్ నుంచి బాలీవుడ్‌కు స్వచ్చంగా తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా జూన్ 1న హిమాచల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి,
చదవండి: కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు విచారణ