
ధర్మశాల : బీజేపీ ఎంపీ,బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ‘ఆధార్ కార్డ్’ వివాదంలో చిక్కుకున్నారు.ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో మండీ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన ఆమె తన నియోజకవర్గ ప్రజలతో భేటీ అవుతున్నారు. ఈ తరుణంలో సమస్యల్ని పరిష్కరించమని తన వద్దకు వచ్చే వారు తప్పని సరిగా ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
కంగనా రౌనత్‌పై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత విక్రమాధిత్య సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు నియోజక వర్గ ప్రజలకు ఏదైనా సమస్యలుంటే తనని కలవవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ అవసరం లేదు. మనం ప్రజలకు ప్రతినిధులం.రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి.అది పెద్దదవ్వొచ్చు. చిన్నదవ్వొచ్చు. లేదంటే వారి వ్యక్తిగత పనులు కావొచ్చు.గుర్తింపు కార్డ్ అవసరం లేదుని స్పష్టం చేశారు.ప్రజలు ఐడెంటిటి కార్డ్‌లు తీసుకొని రావాలని చెప్పడం సరైన పద్దతి కాదని ధ్వజమెత్తారు
ప్రజల్ని ఆధార్ కార్డ్ అడగడంపై వస్తున్న విమర్శలకు కంగనా రౌనత్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం టూరిస్ట్‌లకు హాట్‌స్పాట్.ఇక్కడికి అనేక మంది వస్తుంటారు.అందుకే నియోజక వర్గ ప్రజల్ని ఆధార్ కార్డ్ అడిగాను. ప్రతి ఒక్కరి సమస్యల్ని పరిష్కరించడమే నా లక్ష్యం. ఎవరూ ఇబ్బంది పడకూడదు’అని వ్యాఖ్యానించారు. నెటిజన్లు సైతం కంగనా రనౌత్‌ను విమర్శిస్తున్నారు. ఓట్లు అడిగే సమయంలో ఆధార్ కార్డ్ అడగలేదు. ఎన్నికల ముందు ఆధార్ కార్డ్ అవసరం లేదు. మరి ఇప్పుడు ఆధార్ కార్డ్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.