
దీంతో రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ప్రస్తుతం 81 పరుగుల వద్ద ఉంది.
మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా జట్టు కీలక వికెట్ కోల్పోయింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్టీవ్ స్మిత్ (30 బంతుల్లో 8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ప్రస్తుతం 81 పరుగుల వద్ద ఉంది. ఓపెనర్ జో బర్న్స్ (10 బంతుల్లో 4)ను ఉమేశ్ యాదవ్, మార్నస్ లబుషేన్ (49 బంతుల్లో 28; 1 ఫోర్)ను అశ్విన్ ఔట్ చేశారు. ప్రస్తుతం భారత్ కంటే ఆతిథ్య జట్టు 50 పరుగుల వెనకబడి ఉంది. మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ 34 పరుగులు, ట్రావిస్ హెడ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 195 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. 326 పరుగులు చేసి 131 ఆదిక్యాన్ని సాధించింది.
(చదవండి: బాక్సింగ్ డే టెస్టు: విజయావకాశాలు మనకే!)