
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ 60, సాయి సుదర్శన్ 56 పరుగులతో రాణించారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది.
ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది. ఈ దశలో లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకుని గుజరాత్‌ను ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేశారు. రూథర్‌ఫోర్డ్ 22, బట్లర్ 16, షారుక్ ఖాన్ 11 (నాటౌట్), సుందర్ 2, తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదనకు దిగిన లక్నో 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ గైర్హాజరీలో రిషబ్ పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. పంత్ 17, మార్క్రమ్ 38 క్రీజ్‌లో ఉన్నారు.
శార్దూల్ డబుల్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్ టీ20ల్లో 200 వికెట్లు పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన శార్దూల్ 3, 4 బంతులకు వరుసగా రూథర్‌ఫోర్డ్, తెవాటియా వికెట్లు తీశాడు. టీ20ల్లో 200 వికెట్లు తీసిన 18వ భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా 103వ బౌలర్‌గా శార్దూల్ రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 467 మ్యాచ్‌ల్లో 637 వికెట్లు తీశాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 316 మ్యాచ్‌ల్లో 365 వికెట్లు తీశాడు.
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-3 బౌలర్లు
రషీద్ ఖాన్- 637
డ్వేన్ బ్రావో- 631
సునీల్ నరైన్- 579
టీ20ల్లో 200 వికెట్లు తీసిన భారత బౌలర్లు..
చహల్-365
పియూశ్ చావ్లా- 319
భువనేశ్వర్ కుమార్- 315
అశ్విన్- 315
బుమ్రా- 295
అమిత్ మిశ్రా- 285
హర్షల్ పటేల్- 248
అక్షర్ పటేల్- 239
హర్భజన్ సింగ్- 235
జయదేవ్ ఉనద్కత్- 234
రవీంద్ర జడేజా- 227
సందీప్ శర్మ- 219
అర్షదీప్ సింగ్- 213
మహ్మద్ షమీ- 209
కుల్దీప్ యాదవ్- 208
ఉమేశ్ యాదవ్- 202
హార్దిక్ పాండ్యా-200
శార్దూల్ ఠాకూర్- 200