
న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో డోపింగ్ పరీక్షలో దొరికిపోయిన భారత అగ్రశ్రేణి జావె లిన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల శివ్‌పాల్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని 27వ స్థానంలో నిలిచాడు. 2019 ఆసియా చాంపియన్íÙప్‌లో అతను రజతం సాధించాడు.