
శాన్‌ఫ్రాన్సిస్కో: విఖ్యాత నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) లీగ్ ఆల్ స్టార్ మ్యాచ్‌కు అమెరికా దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ తొలిసారి దూరమయ్యాడు. 20 ఏళ్ల తర్వాత లెబ్రాన్ జేమ్స్ లేకుండా ఆల్ స్టార్ మ్యాచ్ జరగడం గమనార్హం. 2005 నుంచి ప్రతి సీజన్‌లో ఆల్ స్టార్ మ్యాచ్‌లలో ఆడిన 40 ఏళ్ల లెబ్రాన్ ఈసారి చీలమండ గాయంతో ఆడలేకపోయాడు.
రెగ్యులర్ సీజన్‌లో లాస్‌ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ఆడే లెబ్రాన్ ఆల్ స్టార్ మ్యాచ్‌లలో ఈసారి షకిల్లా ఓనీల్ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సింది. 2005లో తొలిసారి ఆల్ స్టార్ మ్యాచ్‌లో ఆడిన లెబ్రాన్ వరుసగా 20 ఏళ్లపాటు ఈ మేటి మ్యాచ్‌లలో భాగస్వామిగా ఉన్నాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 113 కేజీల బరువున్న లెబ్రాన్ ఇప్పటి వరకు ఎన్‌బీఏ లీగ్‌లో 1,540 మ్యాచ్‌లు ఆడి అత్యధికంగా 41,641 పాయింట్లు స్కోరు చేశాడు.