
PC: BCCI/IPL.com
ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 18 వ సీజన్ వరకూ ప్రతీ సీజన్‌లోనూ మ్యాచ్ ఆడిన నాలుగో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో సీజన్‌లో సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తరపున ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన పాండే.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో పాండే కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఉన్నారు. పాండే ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్(2008)లో ముంబై ఇండియన్స్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్-2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున పాండే సత్తాచాటాడు.
అనంతరం 2011-2013 వరకు పూణే వారియర్స్ ఇండియాకు మనీశ్ ప్రాతనిథ్యం వహించాడు. 2014 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌లోకి పాండే వచ్చాడు. ఆ ఏడాది కేకేఆర్ టైటిల్ సాధించడంలో పాండే కీలక పాత్ర పోషించాడు. 2014 నుంచి 2017 వరకు కేకేఆర్ తరపున ఆడిన పాండే.. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వచ్చాడు.
2018 నుంచి 2021 వరకు ఎస్ఆర్‌హెచ్‌కు పాండే ప్రాతినిథ్యం వహించాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్, 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పాండే ఆడాడు. మళ్లీ ఇప్పుడు తన సొంతగూటికి పాండే చేరాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 172 మ్యాచులు ఆడిన పాండే.. అందులో 3869 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఒక సెంచరీ.. 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కాగా ధోనీ, కోహ్లి, రోహిత్‌లు మొత్తం 18 ఎడిషన్‌లలోనూ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో కోహ్లి ఒక్కడే అన్ని మ్యాచ్‌లూ ఒకే ప్రాంఛైజీ తరపున ఆడాడు. ఈ టోర్నీ తొట్టతొలి సీజన్ నుంచి కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు.
చదవండి: PAK vs NZ: పాక్‌తో రెండో వన్డే.. కివీస్‌కు భారీ షాక్! ఆరేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ