
PC: BCCI/IPL.com
Csk vs KKR Live Updates: సీఎస్‌కేను చిత్తు చేసిన కేకేఆర్..
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డికాక్(23 ), రహానే(20 నాటౌట్), రింకూ సింగ్(15 నాటౌట్) రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు.
దూకుడుగా ఆడుతున్న కేకేఆర్..
104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్(9), సునీల్ నరైన్(9) ఉన్నారు.
103 పరుగులకే పరిమితమైన సీఎస్‌కే
చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్ల దాటికి సీఎస్‌కే బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా కేకేఆర్ బౌలర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోయాడు. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్ దూబే(31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. విజయ్ శంకర్(29) కాస్త ఫర్వాలేదన్పించాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు వైభవ్ ఆరోరా, మోయిన్ అలీ తలా వికెట్ సాధించారు.
సీఎస్‌కే ఎనిమిదో వికెట్
ధోని రూపంలో సీఎస్‌కే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ధోని.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 8 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.
72 పరుగులకే 7 వికెట్లు ..
సీఎస్‌కే 72 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అశ్విన్(1), రవీంద్ర జడేజా(0), దీపక్ హుడా(0) వరుస క్రమంలో ఔటయ్యారు.
కష్టాల్లో సీఎస్‌కే..
చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. 65 పరుగులకే సీఎస్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. 29 పరుగులు చేసిన విజయ్ శంకర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔట్ కాగా.. త్రిపాఠి(16) సునీల్ నరైన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
సీఎస్‌కే రెండో వికెట్ డౌన్
రచిన్ రవీంద్ర రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రవీంద్ర.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.
సీఎస్‌కే తొలి వికెట్ డౌన్..
డెవాన్ కాన్వే రూపంలో సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన కాన్వే.. మోయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
3 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 16/0
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(12), రచిన్ రవీంద్ర(4) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2025లో మరో రసవత్తర పోరుకు తేరలేచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఓ మార్పుతో బరిలోకి దిగింది.
స్పెన్సార్ జాన్సన్ స్దానంలో మోయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని వ్యవహరిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో ధోని తిరిగి పగ్గాలు చేపట్టాడు. రుతురాజ్ స్ధానంలో రాహుల్ త్రిపాఠి తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
సీఎస్‌కేతో మ్యాకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్చ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్