
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) సంచలన క్యాచ్‌తో మెరిశాడు. జైశూ అద్బుతమైన క్యాచ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హర్షిత్ రాణా.. మూడో బంతిని బెన్ డకెట్‌కు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డకెట్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
కానీ షాట్ మిస్‌టైమ్ కావడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్‌లో ఉన్న జైశ్వాల్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇక జైశ్వాల్ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ బిత్తర పోయారు.
వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
జైశ్వాల్‌తో పాటు హర్షిత్ రాణా వన్డేల్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి కూడి మోకాలికి గాయమైంది.
తుది జట్లు..
ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్
చదవండి: IND vs ENG1st Odi: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. భారత్‌కు భారీ షాక్
YASHASVI JAISWAL TAKES A BLINDER ON DEBUT. 🤯
- Harshit Rana has 2 early wickets. pic.twitter.com/GxnVvxDOta— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2025