నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli) మెకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లికి గాయమైనట్లు టాస్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
నిజంగా భారత్‌కు ఇది గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నహాకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌తో కోహ్లి తన ఫామ్‌ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ గాయం కారణంగా విరాట్‌కే బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
అతడి స్దానంలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వన్డేల్లో భారత తరపున అరంగేట్రం చేశాడు. జైశ్వాల్‌తో పాటు యువ పేసర్ హర్షిత్ రాణా వన్డేల్లోకి అడుగుపెట్టాడు. మహ్మద్ షమీతో పాటు కొత్త బంతిని రాణా పంచుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
సచిన్ రికార్డుపై కన్ను..
కాగా విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ వరల్డ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. ఒకవేళ నాగ్‌పూర్ వన్డేలో కోహ్లి ఆడి ఉంటే సచిన్ రికార్డు బద్దులయ్యే అవకాశముండేంది.
తుది జట్లు..
ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్
చదవండి: Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్‌తో పాటు అతడి అరంగేట్రం
Comments
Please login to add a commentAdd a comment