Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Farmers Likely To Move High Court For Lands Captures Of Capital1
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి

Sonia Gandhi And Rahul Gandhi Names In ED Chargesheet2
నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. చార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్‌ పేర్లు

ఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు ఈడీ భారీ షాకిచ్చింది. వీరిద్దరి పేర్లను ఈడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల జప్తునకు నోటీసులిచ్చిన ఈడీ.. తాజాగా సోనియా, రాహుల్‌ పేర్లను చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఈనెల 25వ తేదీన రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది.కాగా, కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఏజెఎల్‌, యంగ్ ఇండియన్‌పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్.. నేషనల్ హెరాల్డ్ న్యూస్‌ ప్లాట్‌ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్‌లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. యంగ్ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఆరోపించింది. సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రయత్నించిందని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే రూ. 661 కోట్ల ఏజెఎల్‌ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులిచ్చింది. ఈడీ కార్యాలయాల వద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునేషనల్ హెరాల్డ్ కేసు చార్జి షీట్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్‌ పార్టీ నిరసనకు సిద్‌ధమైంది. రేపు(బుధవారం) ఈడి కార్యాలయాలవద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందిన, ప్రతిపక్షాలపై ఇది నేరుగా చేస్తున్న దాడిగా అభివర్ణించింది. ప్రతీకార రాజకీయాలకు ఇది పరాకాష్టని,ఈ అంశంపై తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.

Two Telangana nationals die in Dubai3
దుబాయ్‌లో తెలంగాణవాసుల హత్య

సోన్‌/నిర్మల్‌/ధర్మపురి/ఆర్మూర్‌ టౌన్‌: పొట్టకూటి కోసం దుబాయ్‌ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వీరు దుబాయ్‌లోని అల్‌క్యూజ్‌ ప్రాంతంలో మోడర్న్‌ బేకరీలో పనిచేస్తున్నారు. వీరితోపాటు అక్కడే పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి వీరిని కత్తితో విచక్షణారహితంగా నరికి చంపారు. మతవిద్వేషంతోనే వారిని చంపినట్లు అక్కడ ఉంటున్న తెలంగాణవాసులు చెప్పారు. బేకరీలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తానీ దాడిలో నిర్మల్‌ జిల్లాకు చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్‌ (40), జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ మరణించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన దేగాం సాగర్‌కు గాయాలయ్యాయి. సాగర్‌ను సహోద్యోగులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చేరవేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించినట్లు వారి బంధువులు చెప్పారు. చిన్న బిడ్డను చూడకుండానే..నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలానికి చెందిన ప్రేమ్‌సాగర్‌ (40) ఇరవై ఏళ్లుగా గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం దుబాయ్‌లోని మోడర్న్‌ బేకరీలో యంత్రం ఆపరేట్‌ చేసే పనిలో చేరాడు. ప్రేమ్‌సాగర్‌కు తల్లి లక్ష్మి, భార్య ప్రమీల (35), కూతుళ్లు విజ్ఞశ్రీ (9), సహస్ర(2) ఉన్నారు. పదిరోజుల క్రితమే ప్రేమ్‌సాగర్‌ నాన్నమ్మ ముత్తమ్మ (90) చనిపోయారు. ఆమె పెద్దకర్మ చేసిన శుక్రవారం రోజే ప్రేమ్‌సాగర్‌ హత్యకు గురయ్యాడు. ప్రేమ్‌సాగర్‌ మృతి వార్తను ఆయన కుటుంబసభ్యులకు చెప్పలేదు. ప్రేమ్‌సాగర్‌ తన చిన్నకూతురు సహస్ర తల్లి కడుపులో ఉన్నప్పుడే దుబాయ్‌ వెళ్లాడు. తను పుట్టినప్పటి నుంచి గ్రామానికి రాలేదు. బిడ్డను చూడకుండానే ఆయన తనువు చాలించడం స్థానికులను కలచివేస్తోంది. కాగా, దుబాయ్‌లో మరణించిన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్‌ (42)కు భార్య మంజుల, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. శ్రీనివాస్‌ మృతి విషయం ఆయన తల్లి రాజవ్వకు ఇంకా చెప్పలేదు. ప్రేమ్‌సాగర్‌ కుటుంబానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అండగా నిలిచారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురా>వడంతోపాటు నిందితులపై కఠినచర్యలు తీసుకునేలా చూడాలని విదేశాంగ శాఖను కోరారు.విదేశాంగ శాఖ మంత్రికి కిషన్‌రెడ్డి లేఖసాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఓ పాకిస్తానీ హత్య చేసిన ఘటనపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆదేశాలకు అనుగుణంగా దుబాయ్‌ లోని భారత కాన్సులేట్‌ అధికారులు.. బుర్‌ దుబాయ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను తెలుసుకున్నారు. ఉద్దేశపూర్వక హత్యకేసుగా నమోదు చేశామని పోలీసులు వారికి చెప్పారు. కాగా, ఇద్దరు తెలంగాణ కార్మికులు మరణించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విచారం వ్యక్తం చేశారు. భారత కాన్సులేట్‌ ద్వారా దుబాయ్‌ పోలీసులు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఆయన ప్రేమ్‌ సాగర్‌ సోదరుడు అష్టపు సందీప్‌తోనూ మాట్లాడారు.

Sensex and Nifty surge over 2 Percent on global markets rally after Trump relaxes tariffs on electronics4
సెన్సెక్స్‌ప్రెస్‌!

ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార సుంకాల నుంచి ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తులను మినహాయించడంతో పాటు ఆటోమొబైల్స్‌పై సుంకాలు సవరించే వీలుందని సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ స్టాక్‌ సూచీలు మంగళవారం 2% ర్యాలీ చేశాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 65 డాలర్లకు దిగిరావడం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత అంశాలూ కలిసొచ్చాయి.ఫలితంగా సెన్సెక్స్‌ 1,578 పాయింట్లు పెరిగి 76,735 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 500 పాయింట్లు బలపడి 23,329 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్‌ 1,695 పాయింట్ల లాభంతో 76,852 వద్ద, నిఫ్టీ 539 పాయింట్లు పెరిగి 23,368 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. విస్తృత స్థాయిలో అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ లాభాలు నిలుపుకోలిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 76,907 వద్ద, నిఫ్టీ 23,368 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి. రంగాల వారీగా సూచీలు రియల్టీ 6%, ఇండ్రస్టియల్, క్యాపిటల్‌ గూడ్స్‌ 4%, ఆటో, కన్జూమర్‌ డిస్క్రిషనరీ, ఫైనాన్సియల్‌ సర్విసెస్, మెటల్‌ షేర్లు మూడుశాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ సూచీలు 3% ర్యాలీ చేశాయి. లాభాల బాటలో అంతర్జాతీయ మార్కెట్లు ఆసియాలో సింగపూర్‌ స్ట్రెయిట్‌ టైమ్స్, తైవాన్‌ వెయిటెడ్‌ 2%, జపాన్‌ నికాయ్, కొరియా కోస్పీ, ఇండోనేషియా జకార్తా ఒకశాతం పెరిగాయి. హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్, చైనా షాంఘై అరశాతం రాణించాయి. యూరప్‌లో ఫ్రాన్స్‌ సీఏసీ 1%, జర్మనీ డాక్స్‌ 1.50%, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 1.5% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్‌ సూచీలు అరశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌ షేర్ల దన్ను: ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు కస్టమర్లకు బదిలీలో భాగంగా పలు బ్యాంకులు డిపాజిట్ల రేట్లు తగ్గిస్తున్నాయి. ఈ ప్రక్రియతో బ్యాంకుల నికర వడ్డీరేట్ల మార్జిన్ల ఒత్తిళ్లు తగ్గొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ జెఫ్ఫారీస్‌ అంచనా వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 3%, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు 7%, యాక్సిస్‌ బ్యాంక్‌ 4 శాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ ఆర్జించిన మొత్తం పాయింట్ల ఈ నాలుగు షేర్ల వాటాయే 750 పాయింట్లు కావడం విశేషం.ఆటో షేర్ల పరుగులు: ఆటో మొబైల్స్‌ పరిశ్రమపై గతంలో విధించిన సుంకాలు సవరించే వీలుందని ట్రంప్‌ సంకేతాలతో ఆటో షేర్లు పరుగులు పెట్టాయి. సంవర్ధన మదర్శన్‌సుమీ 8%, భారత్‌ ఫోర్జ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 7%, టాటా మోటార్స్, ఎంఆర్‌ఎఫ్‌ 4.50% ర్యాలీ చేశాయి. హీరో మోటోకార్ప్‌ 4%, ఐషర్‌ మోటార్స్‌ 3.50%, టీవీఎస్‌ మోటార్, అశోక్‌ లేలాండ్, బజాజ్‌ ఆటో 3% లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, మారుతీ 2% పెరిగాయి.రూపాయి రెండోరోజూ ర్యాలీ దేశీయ ఈక్విటీ మార్కెట్‌ అనూహ్య ర్యాలీ, అమెరికా కరెన్సీ బలోపేతంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 30 పైసలు బలపడి 85.50 వద్ద స్థిరపడింది. క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం, దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదుకావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు భారత కరెన్సీ బలపడేందుకు తోడ్పడ్డాయి. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్‌ 85.85 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 85.59 స్థాయి వద్ద గరిష్టాన్ని తాకింది. 2 రోజుల్లో రూ.18.42 లక్షల కోట్లు దలాల్‌ స్ట్రీట్‌లో రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.18.42 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.412.24 లక్షల కోట్ల(4.81 ట్రిలియన్‌ డాలర్లు)కు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.8 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది.

YouTuber reached the top of Tirumala Hill with a drone5
నిద్దరోతున్న నిఘా!

తిరుమల : కలియుగ దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో నిఘా వ్యవస్థ నిద్దరోతోంది. విరామం లేకుండా దర్శనాలతో స్వామి వారికి మాత్రం కంటి మీద కునుకు లేకపోగా, భద్రతా యంత్రాంగం మాత్రం నిద్ర మత్తులో జోగుతోంది. నిత్యం భక్త జన సందోహంంతో ఉండే ఏడు కొండలపై భద్రత కరువైందని తాజాగా డ్రోన్‌ ఘటన నిరూపించింది. వరుస ఘటనలతో అభాసుపాలవుతున్నా సమర్థించుకోవడం.. ఎదురు దాడి చేయడం తప్ప పాలకులు గుణపాఠం నేర్వడం లేదు. నిఘా వైఫల్యాలు టీటీడీ అధికారులకు తల నొప్పులు తెచ్చి పెడుతున్నాయి. మూడంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్‌ పోలీస్, అక్టోపస్‌తోపాటు పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి. ప్రత్యేకంగా 2 వేల సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిసూ్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పసిగట్టే అనాలిటిక్స్‌ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది.శ్రీవారి ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు, వివిధ సముదాయాల వద్ద అత్యంత నాణ్యతగా చిత్రీకరించే అధునాతన నిఘా కెమెరాలను అమర్చారు. దీంతో గతంలో ఎలాంటి సమాచారం అయినా టీటీడీ నిఘా విభాగం, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సెకండ్ల వ్యవధిలో విజిలెన్స్‌ విభాగానికి చేరేది. దొంగతనాలు, మిస్సింగ్స్‌ ఇలా అనేక ఘటనలను సులభంగా గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా క్రియాశీలక పాత్ర పోషించేది నిఘా వ్యవస్థ. అలాంటి వ్యవస్థకు ఏమైందో ఏమోగానీ పది నెలలుగా మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తోందని వరుసగా జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా డ్రోన్‌ కలకలంరాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన అన్షుమన్‌ తరెజా అనే ఓ యూట్యూబర్‌ మంగళవారం సాయంత్రం తిరుమల ఆలయంపై డ్రోన్‌ ఎగురవేసి తీవ్ర కలకలం సృష్టించాడు. శ్రీహరి ఆలయంపై దాదాపు 10 నిమిషాల పాటు ఎగిరిన డ్రోన్‌ ద్వారా వివిధ కోణాల్లో చిత్రీకరించాడు. శ్రీవారి ఆలయం మహా ద్వారం మొదలుకొనిం ఆనంద నిలయం వరకు ఏరియల్‌ వ్యూను చిత్రీకరించాడు. నిత్యం రద్దీగా ఉండే.. అధిక సంఖ్యలో నిఘా నేత్రాలు ఉన్న కళ్యాణకట్ట సమీపంలోని హరినామ సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చుని డ్రోన్‌ను ఆపరేట్‌ చేశారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ ఎగురుతుండటాన్ని గమనించిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఎవరికి తెలియజేయాలో తోచక చూసూ్తనే ఉండిపోయారు. పైగా దర్శనం కోసం వచ్చినందున వారి వద్ద సెల్‌ ఫోన్లు కూడా లేవు. ఈ క్రమంలో 12 నిమిషాల అనంతరం శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ ఎగురుతున్నట్లు టీటీడీ విజిలెన్స్‌ ఎట్టకేలకు గుర్తించింది. హుటాహుటిన అక్కడికి వెళ్లిన భద్రత సిబ్బంది డ్రోన్‌తో సహా తరెజాను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, 2 వేల కెమెరాలతో నిఘా ఉన్నా, వందల సంఖ్యలో శ్రీవారి ఆలయం చుట్టూ విజిలెన్స్‌ పహారా ఉన్నా, అంత సేపటి వరకు డ్రోన్‌ ఎగురుతుండటాన్ని గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇటీవల ఎగ్‌ బిర్యానీ, మద్యం తాగి ఓ యువకుడు హల్‌చల్‌ చేసిన వ్యవహారం మరిచిపోక ముందే ఇప్పుడీ డ్రోన్‌ కలకలం రేపింది. ‘ఇంత పటిష్ట యంత్రాంగం, భద్రత ఏర్పాట్లు ఉన్నప్పటికీ 12 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని ఓ యువకుడు డ్రోన్‌తో చిత్రీకరించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆలోగా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే.. అని తలుచుకుంటేనే భయమేస్తోంది. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు, తొక్కిసలాట, తరచుగా అపచారాలు.. ఎందుకిలా’ అని పలువురు భక్తులు వాపోయారు. అలిపిరి వద్ద చెక్‌ చేయలేదా?సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల బ్యాగులను, వ్యక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది, ఎస్పీఎఫ్‌ సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు. బ్యాగులను స్కానింగ్‌ చేసి అందులో నిషేధిత వస్తువులు ఉంటే వాటిని గుర్తించి, తొలగించి పంపుతారు. అయితే రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన యూట్యూబర్‌ అన్షుమన్‌ తరేజా తిరుమలకు తనతో పాటు డ్రోన్‌ను ఎలా తెచ్చుకున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది.

IPL 2025: Punjab kings vs Kolkata Knight Riders Live Updates6
పంజాబ్ కింగ్స్ సంచ‌ల‌న విజ‌యం..

Punjab kings vs Kolkata Knight Riders Live Updates:పంజాబ్ కింగ్స్ సంచ‌ల‌న విజ‌యం..ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 16 ప‌రుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. 112 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేధించ‌డంలో కేకేఆర్ చ‌త‌క‌ల‌ప‌డింది. పంజాబ్ బౌల‌ర్ల దాటికి 15. 1 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 95 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పంజాబ్ స్పిన్న‌ర్ యుజేంద్ర చాహ‌ల్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి కేకేఆర్ ప‌త‌నాన్ని శాసించాడు. త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 28 ప‌రుగులిచ్చి 4 వికెట్లను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అత‌డితో పాటు అర్ష్‌దీప్‌, మార్కో జానెస‌న్ అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. జానెస‌న్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్‌, మాక్స్‌వెల్‌, బ్రాట్‌లెట్ త‌లా వికెట్ సాధించారు.చాహ‌ల్ మ్యాజిక్‌.. క‌ష్టాల్లో పంజాబ్‌స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో కేకేఆర్ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోతుంది. 76 ప‌రుగుల‌కే కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ 7 వికెట్ల న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌స్సెల్‌(1), హ‌ర్షిత్ రాణా(1) ఉన్నారు. కేకేఆర్ విజ‌యానికి 48 బంతుల్లో 35 ప‌రుగులు కావాలి.కేకేఆర్ మూడో వికెట్ డౌన్‌..ర‌హానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన ర‌హానే.. చ‌హ‌ల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి వెంక‌టేశ్ అయ్య‌ర్ వ‌చ్చాడు.దూకుడుగా ఆడుతున్న ర‌ఘువ‌న్షి, ర‌హానే..6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ రెండు వికెట్ల న‌ష్టానికి 55 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌ఘువ‌న్షి(31), ర‌హానే(13) ఉన్నారు.రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌..112 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవ‌ర్‌లో జాన్సెన్ బౌలింగ్‌లో సునీల్ న‌రైన్‌(5) క్లీన్ బౌల్డ్ కాగా.. రెండో ఓవ‌ర్‌లో బ్రాట్‌లెట్ బౌలింగ్‌లో డికాక్‌(2) ఔట‌య్యాడు.చెల‌రేగిన కేకేఆర్ బౌల‌ర్లు.. 111 ప‌రుగులకే పంజాబ్ ఆలౌట్‌ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ బౌల‌ర్లు చేల‌రేగారు. కేకేఆర్ బౌల‌ర్ల దాటికి పంజాబ్ 15.3 ఓవ‌ర్ల‌లో కేవలం 111 ప‌రుగులకే కుప్ప‌కూలింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రానా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్ త‌లా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు నోకియా, వైభ‌వ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(30) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ప్రియాన్ష్ ఆర్య‌(22), శ‌శాంక్ సింగ్‌(18) కాస్త ఫ‌ర్వాలేద‌న్పించారు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(0), గ్లెన్ మాక్స్‌వెల్‌(7) తీవ్ర నిరాశ‌ప‌రిచారు.పీక‌ల్లోతు క‌ష్టాల్లో పంజాబ్ కింగ్స్‌..86 ప‌రుగుల‌కే పంజాబ్ కింగ్స్ 8 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 11 ఓవ‌ర్ వేసిన సునీల్ న‌రైన్‌.. తొలి బంతికి గ్లెన్ మాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ కాగా, ఆఖ‌రి బంతికి మార్కో జానెస‌న్ క్లీన్ బౌల్డ‌య్యాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ 8 వికెట్ల న‌ష్టానికి 90 ప‌రుగులు చేసింది.ప‌వ‌ర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు..పంజాబ్ కింగ్స్ ప‌వ‌ర్ ప్లేలోనే నాలుగో వికెట్ కోల్పోయింది. జోష్ ఇంగ్లిష్‌(2) వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. ఫ్ర‌బ్‌సిమ్రాన్ సింగ్‌(30) హర్షిత్ రాణా బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ 4 వికెట్ల న‌ష్టానికి 54 ప‌రుగులు చేసింది.పంజాబ్‌కు షాక్‌.. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లుప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన ఆర్య‌.. హ‌ర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత అదే ఓవ‌ర్‌లో నాలుగో బంతికి శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట‌య్యాడు. 4 ఓవ‌ర్లు ముగిసే సరికి పంజాబ్ రెండు వికెట్ల న‌ష్టానికి పంజాబ్ 39 ప‌రుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్‌..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 33 ప‌రుగులు చేసింది. క్రీజులో ఆర్య‌(16), ప్ర‌భుసిమ్రాన్ సింగ్‌(17) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో బ్లాక్ బాస్ట‌ర్ మ్యాచ్‌కు స‌మ‌యం అస‌న్న‌మైంది. ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. మార్క‌స్ స్టోయినిష్, లాకీ ఫెర్గూస‌న్ స్ధానాల్లో జోష్ ఇంగ్లిష్‌, బెర్ట్‌ల‌ట్ వ‌చ్చాడు. వీరిద్దిరికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. కేకేఆర్ కూడా త‌మ తుది జ‌ట్టులో ఓ మార్పు చేసింది. కేకేఆర్ కూడా త‌మ తుది జ‌ట్టులో ఓ మార్పు చేసింది. మోయిన్ అలీ స్ధానంలో అన్రిచ్ నోర్జే వ‌చ్చాడు.తుది జ‌ట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నెహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, వరుణ్ చక్ర‌వ‌ర్తి

Kolkata Knight Riders lost to Punjab Kings by 16 runs7
111 తోనే పంజాబ్‌ పండుగ

సొంత మైదానంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై పంజాబ్‌ కింగ్స్‌ పడుతూ లేస్తూ 111 పరుగులు చేసింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ ముగిసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో నంబర్‌వన్‌ స్థానానికి కూడా దూసుకుపోతుంది. ఎంత వేగంగా ఛేదిస్తారనే దానిపైనే చర్చ. 62/2 స్కోరుతో జట్టు గెలుపు దిశగా సాగింది. కానీ ఒక్కసారిగా అనూహ్యం జరిగింది. యుజువేంద్ర చహల్‌ పదునైన స్పిన్‌తో కేకేఆర్‌ పతనానికి శ్రీకారం చుట్టాడు. 17 పరుగుల వ్యవధిలో కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది. అయితే రసెల్‌ ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో మళ్లీ కేకేఆర్‌ విజయంపై అంచనాలు... కానీ యాన్సెన్‌ బంతితో రసెల్‌ ఆట ముగిసింది... మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఆలౌట్‌... పంజాబ్‌ అభిమానులతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. శనివారం 245 పరుగులు చేసి కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌...ఇప్పుడు ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. ముల్లాన్‌పూర్‌: ఐపీఎల్‌లో అరుదుగా కనిపించే తక్కువ స్కోర్ల మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ 15.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. రఘువంశీ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యుజువేంద్ర చహల్‌ (4/28) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఓపెనింగ్‌ మినహా... తొలి 19 బంతుల్లో 39/0... తర్వాతి 17 బంతుల్లో 15/4... పవర్‌ప్లేలో పంజాబ్‌ ఆటతీరు ఇది. ఓపెనర్ల ఆటతీరు చూస్తే ఈ మైదానంలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే భారీ స్కోరు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. నోర్జే ఓవర్లో ప్రియాన్ష్ఆర్య (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రెండు ఫోర్లు కొట్టగా... అరోరా వేసిన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా 4, 6, 4 బాదాడు. అదే ఓవర్లో ప్రియాన్ష్ కూడా ఫోర్‌ కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. రాణా తొలి బంతిని ప్రియాకూ సిక్స్‌ కొట్టే వరకు అంతా బాగుంది. కానీ ఆ తర్వాతి బంతి నుంచే కోల్‌కతా బౌలర్ల జోరు మొదలైంది. అదే ఓవర్లో ప్రియాన్ష్ , శ్రేయస్‌ అయ్యర్‌ (0)లను అవుట్‌ చేసిన రాణా తన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ను కూడా వెనక్కి పంపాడు. అంతకు ముందే సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఇన్‌గ్లిస్‌ (2) కూడా వరుణ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 54/4కు చేరింది. ఇక ఆ తర్వాత పంజాబ్‌ కోలుకోలేకపోయింది. నైట్‌రైడర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పవర్‌ప్లే తర్వాత ఆడిన 57 బంతుల్లో 57 పరుగులు మాత్రమే చేసిన జట్టు 6 వికెట్లు కోల్పోయింది. వధేరా (10), మ్యాక్స్‌వెల్‌ (7), ఇంపాక్ట్‌ సబ్‌గా వచ్చిన సూర్యాంశ్‌ (4) ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శశాంక్‌ సింగ్‌ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా విఫలమయ్యాడు. టపటపా... ఛేదనలో కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. మూడు బంతుల వ్యవధిలో ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు నరైన్‌ (5), డికాక్‌ (2) వెనుదిరిగారు. అయితే అజింక్య రహానే (17), రఘువంశీ కలిసి కొన్ని చక్కటి షాట్లతో మూడో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రహానే వెనుదిరిగిన తర్వాత కేకేఆర్‌ పతనం వేగంగా సాగిపోయింది. ఒక్కరు కూడా పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేకపోయారు. చివర్లో రసెల్‌ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రహానే దురదృష్టవశాత్తూ ఎల్బీపై రివ్యూ కోరకపోవడం కూడా కేకేఆర్‌కు నష్టం కలిగించింది. అతని అవుట్‌ తర్వాతే పరిస్థితి మారింది. బాల్‌ ట్రాకింగ్‌లో ప్రభావం ఆఫ్‌ స్టంప్‌ బయట కనిపించింది. రివ్యూ కోరితే అతను నాటౌట్‌గా తేలేవాడు. చహల్‌ మ్యాజిక్‌ టోర్నీ తొలి 5 మ్యాచ్‌లలో ఏకంగా 83.50 సగటు, 11.13 చెత్త ఎకానమీతో కేవలం 2 వికెట్లు... 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓవర్ల కోటా పూర్తి... వేలంలో రూ.18 కోట్లతో అమ్ముడుపోయిన చహల్‌ పేలవ ఫామ్‌ ఇది. కచ్చితంగా రాణించాల్సిన తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను మ్యాజిక్‌ చూపించాడు. వరుస ఓవర్లలో రహానే, రఘువంశీలను అవుట్‌ చేసి పంజాబ్‌ శిబిరంలో ఆశలు రేపిన అతను కీలక సమయంలో వరుస బంతుల్లో రింకూ, రమణ్‌దీప్‌లను వెనక్కి పంపి విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తనకున్న గుర్తింపును నిలబెట్టుకుంటూ మళ్లీ రేసులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో నేడుఢిల్లీ X రాజస్తాన్‌ వేదిక: న్యూఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్(సి) రమణ్‌దీప్‌ (బి) రాణా 22; ప్రభ్‌సిమ్రన్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రాణా 30; శ్రేయస్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రాణా 0; ఇన్‌గ్లిస్‌ (బి) వరుణ్‌ 2; వధేరా (సి) వెంకటేశ్‌ (బి) నోర్జే 10; మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ 7; సూర్యాంశ్‌ (సి) డికాక్‌ (బి) నరైన్‌ 4; శశాంక్‌ (ఎల్బీ) (బి) అరోరా 18; యాన్సెన్‌ (బి) నరైన్‌ 1; బార్ట్‌లెట్‌ (రనౌట్‌) 11; అర్ష్ దీప్ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.3 ఓవర్లలో ఆలౌట్‌) 111. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–42, 4–54, 5–74, 6–76, 7–80, 8–86, 9–109, 10–111. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 2.3–0–26–1, నోర్జే 3–0–23–1, హర్షిత్‌ రాణా 3–0–25–3, వరుణ్‌ చక్రవర్తి 4–0–21–2, నరైన్‌ 3–0–14–2. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) సూర్యాంశ్‌ (బి) బార్ట్‌లెట్‌ 2; నరైన్‌ (బి) యాన్సెన్‌ 5; రహానే (ఎల్బీ) (బి) చహల్‌ 17; రఘువంశీ (సి) బార్ట్‌లెట్‌ (బి) చహల్‌ 37; వెంకటేశ్‌ (ఎల్బీ) (బి) మ్యాక్స్‌వెల్‌ 7; రింకూ సింగ్‌ (స్టంప్డ్‌) ఇన్‌గ్లిస్‌ (బి) చహల్‌ 2; రసెల్‌ (బి) యాన్సెన్‌ 17; రమణ్‌దీప్‌ (సి) శ్రేయస్‌ (బి) చహల్‌ 0; రాణా (బి) యాన్సెన్‌ 3; అరోరా (సి) ఇన్‌గ్లిస్‌ (బి) అర్ష్ దీప్ 0; నోర్జే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్‌) 95. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–62, 4–72, 5–74, 6–76, 7–76, 8–79, 9–95, 10–95. బౌలింగ్‌: యాన్సెన్‌ 3.1–0–17–3, బార్ట్‌లెట్‌ 3–0–30–1, అర్ష్ దీప్ 3–1–11–1, చహల్‌ 4–0–28–4, మ్యాక్స్‌వెల్‌ 2–0–5–1.

Employee Resignation On Toilet Paper Sparks Viral On Social Media8
‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్‌పై ఉద్యోగి రాజీనామా లేఖ

బెంగళూరు: ‘నేనో సంస్థలో పనిచేస్తున్నా. సదరు సంస్థ నన్ను ఉద్యోగిలా కాకుండా టాయిలెట్‌ పేపర్‌లా ట్రీట్‌ చేసింది. అందుకే ఈ కంపెనీకి నేను రాజీనామా చేస్తున్నా’నంటూ ఓ ఉద్యోగి తన జాబ్‌కు రిజైన్‌ చేశాడు. ప్రస్తుతం, టాయిలెట్‌ పేపర్‌ మీద (Toilet Paper Resignation) రాసిన ఆ రిజిగ్నేషన్‌ లెటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందిరిజిగ్నేషన్ లెటర్‌ అంటే ఫ్రమ్‌ నుంచి టూ వరకు ఉద్యోగి వివరాలు, రిజిగ్నేషన్‌కి గల కారణాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఇటీవల కాలంలో పలువురు ఉద్యోగులు కట్టె.. కొట్టె.. తెచ్చె అన్నట్లు మూడే మూడు ముక్కల్లో రాజీనామా గురించి తేల్చేస్తున్నారు. హెచ్‌ఆర్‌లకు రిజిగ్నేషన్‌ లెటర్లు పంపిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం ఓ ఉద్యోగి ఏడే ఏడు పదాల్లో తన రిజిగ్నేషన్‌ను సమర్పించాడు. ఇప్పుడు మరో ఉద్యోగి ఓ టాయిలెట్‌ పేపర్‌ మీద తన రిజిగ్నేషన్‌ చేశాడు. సింగపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన లింక్డిన్‌ పోస్టులో సదరు ఉద్యోగి ఇచ్చిన రాజీనామా లేఖను పోస్టు చేశారు. ఆ పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నన్ను ఈ కంపెనీ టాయిలెట్ పేపర్‌లా (Felt Like Toilet Paper) ఉపయోగించుకుంది. అవసరం ఉన్నప్పుడు వాడుకుంది. అవసరం తీరిన తర్వాత నన్ను వదిలేసింది అంటూ ఉద్యోగి కంపెనీపై తన బాధను వెళ్లగక్కాడు. తన స్వహస్తాలతో రాసిన టాయిలెట్‌ పేపర్‌ రిజిగ్నేషన్‌లో ఈ కంపెనీ నాకు ఎలా విలువ ఇవ్వలేదో, అదే విధంగా నేను కూడా ఆ కంపెనీకి విలువ ఇవ్వాలని అనుకోవడం లేదు. అందుకే టాయిలెట్‌ పేపర్‌ మీద నా రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఆ కంపెనీ డైరెక్టర్ ఏంజెలా యెఓహ్ స్వయంగా లింక్డిన్‌లో షేర్‌ చేయడమే కాదు. ఉద్యోగుల పట్ల సంస్థలు ఎలా ఉండాలో తెలిపారు. ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేసే వెళ్లే సమయంలో కృతజ్ఞతతో వెళ్లేలా మనం వాళ్లను సంతోషంగా ఉంచాలి. వారి విలువను గుర్తించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

Ex Minister Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu9
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్‌ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు

సాక్షి, విజయవాడ: ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత.. తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా?. ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా?. 40 అంతస్తుల బిల్డింగ్‌లు ప్రజలకు ఒరిగేదేంటి. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?’’ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.‘‘ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?. అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా?. చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ?. మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబూ’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.చంద్రబాబు పి4 స్కీంపై సెటైర్లు చంద్రబాబు పి4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు. పి4 విధానం అంటున్నారు మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా?పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు.

Cm Revanth Reddy Warning To Mlas10
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం.. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్‌ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.సీఎల్పీ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ కేటగిరైజేషన్‌పై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.‘‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం..ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు...బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది...కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్న బియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement