
పోయినోళ్లు అందరూ మంచోళ్లే.. ఉన్నోళ్లు పోయిన వారి తీపి గురుతులు అంటారు. నటి రోహిణి అలాంటి ఘటనే గుర్తు చేసుకున్నారు. బాలనాటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న నటి రోహిణి. నటుడు రఘువరన్ గురించి చెప్పాలంటే విలక్షణ నటుడు అన్నదానికి బ్రాండ్ అని పేర్కొనవచ్చును.
కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన కథాపాత్రల్లో నటించి మెప్పించిన నటుడు ఈయన. తమిళంలో పూవిళి వాసలిలే, మనిదన్, ఎన్ బొమ్మ కుట్టి అమ్మావుక్కు, అంజలి, బాషా వంటి పలు చిత్రాల్లో తనదైనశైలిలో నటించి ఆ చిత్రాల విజయంలో భాగమయ్యారు. అలాంటి గొప్ప నటుడి ఆయుషు త్వరగా ముగియడం బాధాకరం. కాగా నటుడు రఘువరన్ నటి రోహిణి 1996లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2004లో మనస్పర్థలు కారణంగా విడిపోయారు.
కాగా రఘువరన్ 2008 మార్చి 19వ తేదీన కన్నుమూశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నటి రోహిణి స్మరించుకుంటూ ఆమె, రఘువరన్ తమ బిడ్డతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో రఘువరన్ జీవించి ఉంటే నేటి సినిమాలు ఆయన కచ్చితంగా ఇష్టపడే వారని, ఒక నటుడుగా చాలా సంతోషించేవారని ఉద్వేగంతో పేర్కొన్నారు. ఆమె ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.