
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2021 దరఖాస్తుల గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. షెడ్యూలు ప్రకారం ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 18వ తేదీతో ముగియనుందని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గడువును పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు.