
వ్యక్తిగత డేటా బ్యాకప్‌లో భారతీయులే ముందు
నిత్యం బ్యాకప్‌చేసుకుంటున్న 30% మంది
అమెరికాలో 27,బ్రిటన్‌లో 23 శాతమే
డేటా బ్యాకప్‌లోత్రిముఖ వ్యూహం
వెస్ట్రన్ డిజిటల్ సర్వే వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు.. చివరికి సాధారణ వ్యక్తులకు కూడా నేడు డిజిటల్ డేటా కీలకంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో మన సమాచారం చోరీ చేసినా, రాన్‌సమ్‌వేర్ ఎటాక్‌లతో తస్కరించినా ప్రమాదమే.
ఇందుకు ఏకైక పరిష్కారం డేటా బ్యాకప్ చేసుకోవడమే. డేటా బ్యాకప్‌లో భారతీయులు ముందంజలో ఉంటున్నట్టు వెస్ట్రన్ డిజిటల్ సంస్థ సర్వే వెల్లడించింది. డేటా బ్యాకప్‌కు సంబంధించి ఈ సంస్థ ఇటీవల పలు దేశాల్లో సర్వే నిర్వహించింది. అత్యధికంగా భారతీయులే డేటా బ్యాకప్ చేస్తున్నట్టు సర్వేలో తేలింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
» అత్యధికంగా 30% మంది భారతీయులు నిత్యం తమ డేటా బ్యాకప్ చేసుకుంటున్నారు. తర్వాత స్థానంలో అమెరికా 27%, బ్రిటన్ 23 శాతంతో నిలిచాయి.
» భారతీయుల్లో 77%మంది డేటా బ్యాకప్ కోసం తాము క్లౌడ్ స్టోరేజీని వాడుతున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మొబైల్ (ఇతర డివైజ్) పాడవడంతో లేదా అనుకోకుండా డిలీట్ చేయడం, లేదా సైబర్ ఎటాక్.. ఇలా ఏదో ఒక కారణంగా తమకు డేటాను పోగొట్టుకున్న అనుభవం ఉందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 71 శాతం మంది పేర్కొన్నారు.
» డేటా బ్యాకప్‌కు 3 విధానాలు వాడుతున్నట్టు సర్వే లో వెల్లడైంది. ఇందుకు 3–2–1 సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు సర్వే నిర్వాహకులు తెలిపారు. డేటాకు సంబంధించి 3 కాపీలను పెట్టుకోవాలి. రెండింటిని రెండు వేర్వేరు డివైజ్‌లలో స్టోర్ చేసుకోవాలి. ఒక సాఫ్ట్ కాపీని క్లౌడ్ వంటి స్టోరేజీలో దాచుకోవాలి.