
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని న్యూహౌజింగ్‌బోర్డు కాలనీలో 15రోజులుగా మమత అనే మహిళ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతోంది. చుట్టుపక్కల ఉండే పేద మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకొని వారితో వ్యభిచారం చేయిస్తోంది.
బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీ సులకు సమాచారం అందడంతో కాలనీలో ఆమె అద్దెకు ఉంటున్న నివాసంలో దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డారు. ఆ సమయంలో వ్యభిచార గృహ నిర్వాహకురాలు మమత పరారైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
చదవండి: (Swetha: ఫేస్‌బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ..)