Police Department
-
కూటమి కుట్రలతో ఐపీఎస్‌ల బెంబేలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలు, అరాచకాలను అమలు చేయలేక పోలీసు శాఖ బెంబేలెత్తుతోంది. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఏకంగా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తుండడంతో పోలీసు ఉన్నతాధికారులు హడలెత్తిపోతున్నారు. కొందరు మానసిక ఒత్తిడితో అస్వస్థత పాలవుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ హఠాత్తుగా అస్వస్థతకు గురికావడం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనపై వరుస కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో పాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఒత్తిడి తీవ్రం చేశారు. కాకాణిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను హైదారాబాద్‌కు పంపించారు. ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్‌లు అంతటితో సంతృప్తి చెందలేదు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నమోదైన పలు కేసుల్లో కాకాణి పేరును ఇరికించాలని కూడా ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రతి రోజూ నిలదీస్తున్నారు. ఈ పరిణామాలతో ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఓ పరిమితి వరకు నిబంధనలకు కాస్త అటూ ఇటూగా ఉల్లంఘించగలంగానీ... బరితెగించి అక్రమ కేసులు, వేధింపులు ఐపీఎస్ అధికారిగా తనకు సాధ్యం కాదని ఆయన భావించారు. చట్ట పరిధిలోనే కేసులను దర్యాప్తు చేయగలను తప్ప.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు సాధనంగా మారలేనంటూ ఆయన లోలోన మథన పడుతున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తీవ్రంగా మందలించిన పోలీస్ బాస్కాకాణిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని నిలదీస్తూ.. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఎస్పీ కృష్ణకాంత్‌పై గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్పీపై మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఆయన తన నివాసంలో మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఒత్తిడితో ఎస్పీ కృష్ణకాంత్ బీపీ పడిపోయిందని వైద్యులు చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొత్త ఎస్పీగా టీడీపీ వీర విధేయ సుబ్బారాయుడు!రెడ్‌బుక్ కుట్ర అమలులో అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరించనందుకు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఆయనను బదిలీ చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ సానుభూతిపరుల కుటుంబానికి చెందిన, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. తిరుపతి ఎస్పీగా నియమితులయ్యారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో పోలీసుల వైఫల్యంతో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యుడిగా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. కానీ, బదిలీతో సరిపెట్టింది. అనంతరం ‘ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్’ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో సభ్యుడిగా సుబ్బారాయుడును నియమించారు. -
హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే
హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఉద్దేశపూర్వకంగా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు కాదా? ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూపేలా ఉన్నాయి. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తూ ఆ ఇన్స్పెక్టర్కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం. – హైకోర్టు న్యాయమూర్తి సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద అడ్డగోలుగా కేసులు పెడుతున్న పోలీసులపై హైకోర్టు మరోమారు నిప్పులు చెరిగింది. పోలీసుల చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని తేల్చి చెప్పింది. కోర్టులన్నా.. కోర్టులిచ్చిన ఆదేశాలన్నా పోలీసులకు లెక్కేలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు అధికారాన్ని, న్యాయ పాలనను పోలీసులు సవాలు చేస్తున్నారంది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడింది. తమ ఆదేశాలున్నా కూడా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై పోలీసులు అదనపు సెక్షన్ల కింద కేసు పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. సెక్షన్ 111ను చాలా అరుదుగానే ఉపయోగించాలని, అవసరమైన సందర్భాల్లో మాత్రమే దానిని ఉపయోగించాలని తాము గతంలో ఓ కేసులో ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పామంది. అయినా కూడా పోలీసులు సెక్షన్ 111 కింద కేసులు పెడుతూనే ఉన్నారంటూ ఆక్షేపించింది. ఇలా ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోసాని కృష్ణ మురళిపై తమ ఆదేశాలకు విరుద్ధంగా అదనపు సెక్షన్లు చేర్చడాన్ని తప్పు పట్టింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారంది. తద్వారా ఆయన పరిధి దాటి వ్యవహరించారని తేల్చింది. మురళీకృష్ణ చర్యలు కోర్టు ధిక్కారమేనని తెలిపింది. ఇందుకు గాను ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మురళీకృష్ణను హైకోర్టు ఆదేశించింది. పోసానిపై సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ నాయుడిని తిట్టారంటూ ఫిర్యాదు టీటీడీ చైర్మన్, టీవీ 5 యజమాని బొల్లినేని రాజగోపాల్ నాయుడుని పోసాని కృష్ణ మురళి దూషించారని, వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారంటూ టీవీ 5 ఉద్యోగి బొజ్జా సుధాకర్ గత ఏడాది నవంబర్ 14న సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవే కావడంతో, పోసానికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) నోటీసు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూళ్లూరుపేట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఈ నెల 7న పోసాని కృష్ణమురళికి సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల్లో గతంలో నమోదు చేసిన సెక్షన్నే కాకుండా బీఎన్ఎస్ సెక్షన్ 111తో పాటు పలు ఇతర సెక్షన్లను కూడా జత చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ కొట్టేయాలంటూ పోసాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు.పోలీసుల చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేస్తున్నాయి..ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘సెక్షన్ 111ను దురుద్దేశ పూర్వకంగా, ఎలాపడితే అలా వాడటానికి వీల్లేదని ఇదే హైకోర్టు ఇప్పటికే పప్పుల చలమారెడ్డి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. సెక్షన్ 111ను ఏ సందర్భాల్లో వాడాలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళిపై గతంలో నమోదు చేసిన కేసులో తాజాగా జారీ చేసిన నోటీసులో అదనపు సెక్షన్లు చేర్చడం, అందులోనూ సెక్షన్ 111ను చేర్చడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇన్స్పెక్టర్ చర్యలు కోర్టు ఆదేశాలను అణగదొక్కే విధంగా ఉన్నాయి. అంతేకాక కోర్టు ఆదేశాలను సైతం ఇన్స్పెక్టర్ అతిక్రమించారు. అతని చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసేలా కూడా ఉన్నాయి. కేసు దర్యాప్తు విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా పోసానికి జారీ చేసిన నోటీసుల్లో అదనపు సెక్షన్లు చేర్చారు. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారు. అందువల్ల ఇన్స్పెక్టర్కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు.ఇప్పుడు అదనపు సెక్షన్లు విస్మయకరంపిటిషనర్ తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో సెక్షన్ 35(3) కింద నోటీసులిచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిందన్నారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా సెక్షన్ 35(3) కింద పోసానికి నోటీసులు జారీ చేశారని, అయితే విస్మయకరంగా ఆ నోటీసుల్లో పలు అదనపు సెక్షన్లను జత చేశారని చెప్పారు. మహిళలను కించ పరిచారంటూ కూడా కేసు పెట్టారన్నారు. టీటీడీ చైర్మన్‌ను దూషించారంటూనే మహిళలకు ఉద్దేశించిన చట్టం కింద కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సాయిరోహిత్ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాల మేరకు పోసానికి సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చామన్నారు. అదనపు సెక్షన్ల నమోదు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. దీనిపై పూర్తి వివరాలు సమరి్పంచేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. -
70 మంది లిస్ట్ తీశాం.. ఎవ్వరినీ వదలం
-
వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం
-
కేసులు ఎత్తేయండి.. హెచ్‌సీయూ విద్యార్థులపై భట్టి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన సమావేశమైంది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ శివధర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (యూహెచ్‌టీఏ), పౌర సమాజ ప్రతినిధులు కూడా వారితో సమావేశమై పలు డిమాండ్లు ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్కడ పోలీసు పహారా తప్పనిసరి పౌర సమాజ ప్రతినిధులు, యూహెచ్‌టీఏ ప్రస్తావించిన పలు అంశాలు, డిమాండ్లపై మంత్రుల ఉప కమిటీ కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాల ఉప సంహరణ కోసం హెచ్‌సీయూ వీసీకి లేఖ రాస్తామని హామీ ఇచి్చంది. విద్యార్థులు, హాస్టళ్ల భద్రతకు సంబంధించి వీసీ హామీ ఇస్తే బలగాలను ఉపసంహరిస్తామని పేర్కొంది. అయితే వివాదానికి కేంద్ర బింధువుగా ఉన్న 400 ఎకరాల్లో మాత్రం పోలీసు బందోబస్తు కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 400 ఎకరాల భూమిని రక్షించేందుకు పోలీసు పహారా తప్పనిసరి అని పేర్కొన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరినీ 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేమని తెలిపారు. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని, అయితే సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు యూనివర్సిటీకి రాలేమని చెప్పారు. అయితే విద్యార్థులపై కేసులను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకునేలా పోలీసు, న్యాయ శాఖతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. డిమాండ్లు అంగీకరిస్తేనే జేఏసీ నేతలు వస్తారు: యూహెచ్‌టీఏ మంత్రుల సబ్ కమిటీని కలిసిన యూనివర్సిటీ అధ్యాపక, పౌర సమాజ ప్రతినిధులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్‌ను సందర్శించే ముందు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టాన్ని అంచనా వేయడంతో పాటు జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సమావేశానికి హాజరు కాలేదని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. పైన పేర్కొన్న తక్షణ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మంత్రుల కమిటీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారని యూహెచ్‌టీఏ, పౌర సమాజ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రొఫెసర్లు సౌమ్య, శ్రీపర్ణ దాస్, భంగ్యా భూక్యా, పౌర సమాజ ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, వి.సంధ్య, కె.సజయ, ఇమ్రాన్ సిద్దికీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!
సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో కీలక విభాగాల అధిపతి పోస్టు దక్కించుకునేందుకు సాధారణంగా ఉన్నతాధికారులు పోటీ పడతారు. అలాంటిది టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పోలీసు శాఖలో కీలక పోస్టులంటేనే సీనియర్ ఐపీఎస్‌లు హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా సీఐడీ, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చీఫ్ పోస్టుల పేరు చెబితేనే కంపించిపోతున్నారు. అవి మాకొద్దు..! అప్రాధాన్య పోస్టులైనా ఫర్వాలేదు..! వీలైతే కేంద్ర సర్వీసులకు పంపండి..! అని మొర పెట్టుకుంటున్నారు. ముఖ్యనేతల కుట్రలను అమలు చేసేందుకు నిరాకరించి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ బాటలో సాగేందుకు పలువురు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భారీ కుదుపులు ఉండొచ్చని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. తలొగ్గిన వారికి పెద్దపీట.. పోలీసు శాఖలో సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు అత్యంత కీలకమైనవి. కీలక కేసుల్లో సమర్థ దర్యాప్తు, అవినీతి నిర్మూలన ప్రాతిపదికన ఆ మూడు విభాగాల అధిపతులుగా సీనియర్ ఐపీఎస్‌లను నియమించడం సంప్రదాయంగా వస్తోంది. టీడీపీ సర్కారు దీనికి మంగళం పాడింది. తాము సూచించిన వారికి వ్యతిరేకంగా అక్రమ కేసులు నమోదు చేయడం, అక్రమంగా నిర్బంధించడం, బెదిరించడం, హింసించడం, వేధించడమే అర్హతగా నిర్ణయించింది. అందుకు తలొగ్గిన సీనియర్ ఐపీఎస్ అధికారులనే సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు అధిపతులుగా నియమించింది. విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా ఉంటూ రెడ్‌బుక్ కుట్రల అమలుకు అనుగుణంగా నివేదికలు రూపొందించినందువల్లే హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారన్నది పోలీసు శాఖలో బహిరంగ రహస్యం.ఐరాసకు అయ్యన్నార్...!చంద్రబాబుపై గతంలో సీఐడీ పూర్తి ఆధారాలతో నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్‌రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక కుంభకోణాల కేసులను అర్ధంతరంగా క్లోజ్ చేయాలన్న షరతు మీదే సీఐడీ అధిపతిగా రవి శంకర్ అయ్యన్నార్ను నియమించారు. మొదట్లో అందుకు తలూపినా అది అంత సులభం కాదనే వాస్తవం అయ్యన్నార్‌కు అర్థమైంది. వేధించినా.. బలవంతంగా 164 సీఆర్సీపీ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించినా అవన్నీ తరువాత తన మెడకే చుట్టుకుంటాయని ఆయన గ్రహించడంతో కొద్ది నెలలుగా ఆయన కాస్త ఉదాసీనంగా ఉంటున్నారు. దీంతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు నుంచి రవి శంకర్ అయ్యన్నార్ను తప్పించి విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖర్‌బాబుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ అయ్యన్నార్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐక్యరాజ్య సమితి (యూఎన్వో) ఆఫ్రికా దేశాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు ఆపరేషన్ల విభాగానికి వెళ్లేందుకు ఆయనకు మార్గం సుగమమైనట్లు సమాచారం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలుస్తోంది.ఇక ఏసీబీ చీఫ్‌గా ఉన్న అతుల్ సింగ్ కూడా తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుకు డిప్యుటేషన్‌పై పంపాలని లేదంటే రాష్ట్రంలోనే ఏదైన అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. ఇక ఆ ఇద్దరే..!ఇద్దరు ఉన్నతాధికారులు తప్పుకొంటుండటంతో సీఐడీ, ఏసీబీ అధిపతులుగా ఎవరిని నియమిస్తారన్నది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. బరితెగించి కుట్రలను అమలు చేసే సీనియర్ ఐపీఎస్‌ల కోసం ప్రభుత్వ పెద్దలు జల్లెడ పడుతున్నారు. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబే ప్రభుత్వం దృష్టిలో అర్హులుగా ఉన్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తా నిర్వహిస్తున్న విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ డీజీ పోస్టులో సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యంను నియమించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఆయన ఐటీ–ఆర్టీజీఎస్ శాఖల ముఖ్యకార్యదర్శి పోస్టు కోసం పట్టుబడుతున్నారు. శాంతి–భద్రతల విభాగం అదనపు డీజీగా ఉన్న మధుసూదన్‌రెడ్డి తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతున్నారు. -
పరిధి దాటొద్దు.. పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు
వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ.. పోలీసులు దాటడానికి వీల్లేదు. పోలీసులు పరిధులు దాటుతున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు. మేజి్రస్టేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలి. రొటీన్‌గా వ్యవహరించవద్దు. సాక్షి, అమరావతి: పౌరుల అరెస్ట్ విషయంలో పోలీసులు పరిధులు దాటి వ్యవహరిస్తుండటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పౌరులు పరిధి దాటవచ్చునేమో గానీ, పోలీసులు మాత్రం పరిధులు దాటడానికి ఎంత మాత్రం వీల్లేదని హెచ్చరించింది. ‘రాష్ట్ర యంత్రాంగంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకం. సమాజం.. ముఖ్యంగా వ్యక్తుల రక్షణ, భద్రతపై పోలీసు వ్యవస్థ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు పరిధులు దాటుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలని, రొటీన్‌గా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని దేశంలోని డీజీపీలందరికీ పంపాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. కస్టడీ విషయంలో వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాల ద్వారా డీజీపీలకు గుర్తు చేస్తున్నామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారంటూ పిటిషన్హరియాణాకు చెందిన విజయ్ పాల్‌కు తన పొరుగు వారైన మమతా సింగ్ తదితరులతో వివాదం ఏర్పడింది. దీంతో పోలీసులు విజయ్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పేరుతో పోలీసులు తన పట్ల చట్ట విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు తనను కొట్టారంటూ విజయ్‌పాల్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని ఆయన హైకోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు 2023లో కొట్టేసింది. దీనిపై విజయ్‌పాల్ అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఘటనా స్థలంతో పాటు అటు తర్వాత పోలీస్‌స్టేషన్‌లో కూడా పోలీసులు తనపై దాడి చేశారని విజయ్‌పాల్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తన అరెస్ట్ గురించి తన సోదరుడు జిల్లా ఎస్పీకి ఈ–మెయిల్ పంపారని, దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయారన్నారు. తనను కస్టడీలోకి తీసుకున్న రెండు గంటల తర్వాత తనపై కేసు నమోదు చేశారని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు హర్యానా డీజీపీ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. దీంతో డీజీపీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత పలు విచారణల అనంతరం గత వారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఇరుపక్షాలు కోర్టు ముందుంచిన రికార్డులను పరిశీలించిన ధర్మాసనం, విజయ్‌పాల్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తేల్చింది. ఓ వ్యక్తి క్రిమినల్ అయినప్పటికీ, అతని విషయంలో కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలని చట్టం చెబుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. విజయ్‌పాల్‌పై నమోదైన కేసులో కింది కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యాన్ని మూసి వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులను హెచ్చరించింది. తన కింది అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదన్న రీతిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేసింది. ఓ వ్యక్తి అరెస్ట్ విషయంలో పోలీసులకు అధికారాలు కల్పిస్తున్న సీఆర్పీసీ సెక్షన్ 41(1)(బీ)(2)లో నిర్ధేశించిన చెక్‌లిస్ట్ పట్ల తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమంది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తమ ముందు ఉంచిన ఈ చెక్లిస్ట్ను ఓ ఫార్మాలిటీగానే భావిస్తున్నామంది. ఈ చెక్లిస్ట్ను అనుమతించే విషయంలో మేజిస్ట్రేట్ సైతం మెదడు ఉపయోగించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పోలీసులపై రెడ్ బుక్ జులుం
-
వైఎస్ జగన్ హయాంలో ఏపీ పోలీస్ శాఖకు దేశంలోనే అత్యున్నత ర్యాంక్
-
హద్దు మీరొద్దు.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోంది. చాలా క్యాజువల్‌గా కేసులు పెడుతున్నారు. వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి. ఎవరో ఒకరిని అరెస్టు చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. -హైకోర్టు ధర్మాసనం తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేం చేయలేం..! మీరు మరో మార్గం చూసుకోండని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదు.. మా మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారు. వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల ‘అతి’పై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే, సమస్య వచ్చినప్పుడు వాళ్లొచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్‌కు లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వర్తించాలంది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను (కోర్టు) కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారని, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్‌గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి.. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే.. ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్పా? దానిపై రీల్ చేయడం తప్పా? అని పోలీసులను నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా? అని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, ఈ విషయాన్ని తాము ఒప్పుకుని తీరాల్సిందేనని పేర్కొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మేజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించామని హైకోర్టు గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి, రీల్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్ చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించింది. అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు, నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను తమకు పంపాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.అక్రమ నిర్భంధంపై హెబియస్ కార్పస్..పోలీసులు తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్ గతేడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ నిర్వహించింది. అభినయ్ తరఫున న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించగా, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపించారు.తప్పుల మీద తప్పులు...డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసు పెడతారా? అది కూడా అరెస్టు సమయంలో రూ.300 దొరికాయంటూ! అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. నానాపటేకర్ నటించిన వజూద్ సినిమాలో పోలీసులు వ్యవహరించిన రీతిలో ఈ కేసులో పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం బేఖాతరు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనల గురించి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుని పోలీసుల చర్యలను సమర్థించే ప్రయత్నం చేయగా ధర్మాసనం ఆయన్ను వారించింది. తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దని హితవు పలికింది.అరెస్ట్ చేయడానికే కేసు పెడతామంటే ఎలా..?“ప్రేమ్‌కుమార్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? పైగా కర్నూలు నుంచి 8–9 గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్ట్ చేస్తారా? ఆయననేమన్నా పారిపోతున్నారా? ప్రేమ్‌కుమార్ రీల్‌ను సోషల్ మీడియాలో చూశానంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం.. మీరు పోలోమంటూ కర్నూలు నుంచి అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం! అంతేకాదు.. అరెస్ట్ చేసి పలు ప్రదేశాలు తిప్పారు. ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? ఉన్నతాధికారుల మెప్పు కోసం పనిచేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓ వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడి వ్యక్తులను పంచాయతీదారులుగా చూపాలి. కానీ ఈ కేసులో కర్నూలు పోలీసులు తమ వెంట అక్కడి నుంచే పంచాయతీదారులను తెచ్చుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. మీరు ఇలాంటివి చేస్తుంటే, మేం కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు. మీరు ఇలాగే వ్యవహరిస్తుంటే చాలా సమస్యలు వస్తాయి. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య’ అని ధర్మాసనం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎలా పడితే అలా చేసే ముందు బాగా ఆలోచించుకోండి...!“గుంటూరులో ప్రేమ్ కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కర్నూలు పోలీసులు కేసు ఎలా పెడతారు? మీకున్న పరిధి ఏమిటి? అసలు కర్నూలు నుంచి గుంటూరుకు వచ్చేందుకు మీ జిల్లా ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్నారా? మేం ఇప్పుడు అనుమతి ఉందా? అని అడిగాం కాబట్టి వచ్చే విచారణ నాటికి అనుమతి తెస్తారు. ప్రేమ్‌కుమార్ అరెస్ట్ గురించి గుంటూరు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. కానీ వారికి మీరెప్పుడు సమాచారం ఇచ్చారు? మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల చర్యలు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది. ప్రేమ్ కుమార్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన కర్నూలు త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో.. ఫిర్యాదులు అందగానే ఎన్ని కేసుల్లో ఇలా అప్పటికప్పుడు అరెస్టులు చేశారు? ఎన్ని కేసుల్లో ఇలా అర్ధరాత్రులు వెళ్లారు? మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేమీ చేయలేం.. మీరు మరో మార్గం చూసుకోండని మమ్మల్ని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు వారి సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా వాళ్లు ఫాలో కావడం లేదు. ఇక్కడ మా మేజిస్ట్రేట్ల తప్పు కూడా ఉంది. ఈ కేసులో ప్రేమ్‌కుమార్ నేరాలు చేయడమే అలవాటైన వ్యకిŠాత్గ పేర్కొంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో రాస్తే మేజిస్ట్రేట్ దాన్ని కనీస స్థాయిలో కూడా పరిశీలించలేదు. రూ.300 వసూలు చేయడం అలవాటైన నేరం కిందకు వస్తుందా? అనే విషయాన్ని కూడా గమనించలేదు. ఈ కేసుకు సంబంధించిన అన్నీ రికార్డులను మేం పరిశీలించాలనుకుంటున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు రికార్డులను తమ ముందుంచాలని కర్నూలు త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో, మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.పౌర స్వేచ్ఛపై “సుప్రీం’ ఏం చెప్పిందంటే...“ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..’’“స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది’’“భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి’’– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో “సుప్రీం కోర్టు’’ కీలక వ్యాఖ్యలు -
‘రెడ్‌బుక్’కు సహకరించని వారిపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, సీఐడీ విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగొచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను కీలక పోస్టులో నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా.. ⇒ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీని బదిలీచేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయనపట్ల టీడీపీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖపట్నం వంటి కీలక నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అందుకు శంఖబత్ర బాగ్చీ సహకరించడంలేదని ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో విశాఖపట్నం సీపీగా ప్రస్తుత గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అక్రమాలకు ఆయన ఏకపక్షంగా కొమ్ముకాసిన విషయం తెలిసిందే. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం ఆపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వివాదంపై దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో ఆయన్నే సభ్యునిగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. నిబంధనలతో నిమిత్తం లేకుండా టీడీపీ పెద్దల ఆదేశాలను అమలుచేస్తారనే నమ్మకంతోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖ పోలీస్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ అలాగే, నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన సీఐడీ విభాగంలో ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను కూడా బదిలీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్ ఇన్చార్జ్గా ఈయన ఉన్నారు. దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడికి ఆయన ఏమాత్రం లొంగలేదు. నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తా.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతానని వినీత్ స్పష్టంచేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయన్ను బదిలీచేస్తే అభాసుపాలవుతామని ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేశారు. అందుకే ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ పేరుతో ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేయాలని చూస్తున్నారు. ⇒ ఇక దీర్ఘకాలిక సెలవు ముగించుకుని వచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించనుంది. ఆయనకు పోలీసు శాఖలో పోస్టు ఇస్తారా లేదా ఇతర శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐటీ శాఖలో ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ మరోవైపు.. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్ ఇంకా రాష్ట్రంలో రిపోర్టు చేయలేదు. మరో ఐపీఎస్ అభిషేక్ మహంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు ఏపీలో రిపోర్ట్ చేసిన అనంతరం వారిని ఏ పోస్టుల్లో నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ వారంలోనే బదిలీ చేసే అవకాశాలున్నాయని పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
పోలీస్ శాఖలో ‘గుప్తా’ధిపత్య పోరు
సాక్షి, అమరావతి: ఆయన తీరు సందేహాస్పదం... కాదు ఆయనే తీరే వివాదాస్పదం ఆయన మాట వినొద్దు... కాదుకాదు ఆయన మాట అసలే వినొద్దు నాకు సీఎంవో మద్దతు ఉంది.. కాదు కాదు సీఎంవో అండ నాకే..ఇదీ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు తీరు. డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి మధ్య విభేదాలు అనతికాలంలోనే పతాక స్థాయికి చేరాయి. ఓవైపు ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలకు వత్తాసు పలుకుతూ మరోవైపు శాఖపై ఆధిపత్యం కోసం ఇద్దరూ ఎత్తులు పైఎత్తుల్లో మునిగితేలుతున్నారని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో ఇతర సీనియర్ అధికారులు, జిల్లా అధికారులు తీవ్ర సంకట స్థితి ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం కీలక ఫైళ్ల పరిష్కారంపై పడుతోంది.డీజీపీ గుప్తాపై ఓ కన్నేసి ఉండమన్నారు‘డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాపై సీఎం చంద్రబాబుకు పూర్తి విశ్వాసం లేదు. అందుకే నన్ను కీలకమైన శాంతిభద్రతల విభాగం అదనపు డీజీగా నియమించారు’ అంటూ మధుసూదన్‌రెడ్డి కొందరు సీనియర్ అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు ఐజీగా ఉన్నప్పటి నుంచి డీజీపీ గుప్తా ట్రాక్ రికార్డు సక్రమంగా లేదన్నది కూడా ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని ఆయన చెప్పినట్టు సమాచారం. ఆయనపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు రావడం, ప్రత్యేకంగా విచారణ నిర్వహించిన ఉదంతాలను కూడా పదేపదే ప్రస్తావిస్తున్నారు. డీజీపీ గుప్తా కదలికలు, వ్యవహార శైలిపై కన్నేసి ఉండాలని స్వయానా సీఎం చంద్రబాబు తనకు సూచించినట్లు మధుసూదన్‌రెడ్డి చెప్పుకోవడం ఆసక్తికరం. అయితే, తన గురించి మధుసూదన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు డీజీపీ గుప్తాకు తెలిశాయి. దాంతో ‘‘అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి వద్దకు ఫైళ్లు పంపాల్సిన అవసరం లేదు. అన్ని ఫైళ్లు నేరుగా నాకే పంపండి’’ అంటూ అధికారులను మౌఖికంగా ఆదేశించారని సమాచారం.అంతేకాక, మధుసూదన్‌రెడ్డి చాంబర్లోకి ఎవరెవరు వెళ్తున్నారు? ఆయన్ను ఎవరు కలుస్తున్నారనే ప్రతి అంశాన్ని డీజీపీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అనంతరం వారిని పిలిపించి మాట్లాడుతూ.. మీరు అదనపు డీజీని కలవాల్సిన అవసరం లేదని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు. జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు కూడా అదే విషయం సూచించినట్టు సమాచారం.ఈ పరిణామాలతో ఎవరితో మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందో..? అసలు ఎవరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎక్కువ పరపతి ఉందో అన్నది అర్థం కాక పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు తికమక పడుతున్నారు. డీజీపీ.. ఓ చిరుద్యోగి.. ఓ వ్యాపారిడీజీపీ హరీశ్కూమర్ గుప్తా వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. రామకృష్ణ అనే ఓ కిందిస్థాయి ఉద్యోగి, తెనాలికి చెందిన వ్యాపారి శ్రీనివాస్ ద్వారా ప్రైవేటు వ్యవహారాలు సాగిస్తున్న విషయం శాఖలో బాగా వ్యాపించింది. దీనివెనుక మధుసూదన్‌రెడ్డి ప్రమేయం ఉందని డీజీపీ గుప్తా శిబిరం ఆరోపిస్తోంది. చిరుద్యోగి అయిన రామకృష్ణ ఏకంగా జిల్లాల్లోని పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ డీజీపీ చెప్పారంటూ పెద్ద పెద్ద డీల్స్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డీజీపీ సమ్మతి లేకుండా ఒక చిరుద్యోగి అంతటి సాహసం చేయరు కదా? అని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక హరీశ్‌కుమార్ గుప్తా గుంటూరు ఐజీగా ఉన్నప్పటి నుంచి శ్రీనివాస్ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. సీఐల పోస్టింగ్‌లలో శ్రీనివాస్ భారీఎత్తున ముడుపుల వసూళ్లు సాగించినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో దానిపై ఏకంగా విచారణ సంఘం గుంటూరులో ఓపెన్‌హౌస్ నిర్వహించడం గమనార్హం. హరీశ్‌గుప్తా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ డీజీ అయ్యాక వ్యాపారి శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చాడు. విజిలెన్స్ దాడుల పేరుతో రాష్ట్రంలో గ్రానైట్, హోల్‌సేల్, రియల్ ఎస్టేట్, పెట్రోల్ బంకుల యజమానులతో పాటు పలువురు బడా వ్యాపారులను బెదిరించారని చెబుతారు. గుప్తా డీజీపీ కాగానే శ్రీనివాస్ మరింత చెలరేగి రాష్ట్రవ్యాప్తంగా సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడు. డీజీపీ పదవీ కాలం ఆగస్టులో ముగియనుంది. ఆలోగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది ఈ ద్వయం లక్ష్యంగా ఉంది. అనంతరం డీజీపీకి పొడిగింపు లభిస్తే సరి.. లేదంటే అవకాశం కోల్పోతామన్నది వారి ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే రామకృష్ణ, వ్యాపారి శ్రీనివాస్‌లు డీజీపీ గుప్తా పేరుతో సాగిస్తున్న సెటిల్మెంట్లు పోలీస్ శాఖతో పాటు వ్యాపారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
సహజ వనరుల దోపిడీకి ఖాకీ కవచం!
సాక్షి టాస్క్‌పోర్స్: సర్వేపల్లి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో సహజ వనరుల దోపిడీ మూడు ఇసుక లారీలు.. ఆరు గ్రావెల్ వాహనాలు అనే రీతిలో విచ్చలవిడిగా సాగుతోంది. దీన్ని అరికట్టాల్సిన పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు సహకారం అందిస్తున్నారు. పొదలకూరు మండలం ఇరువూరు రీచ్ నుంచి రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది. నిశిరాత్రి భారీ యంత్రాలు ఉపయోగించి పెన్నా నదిలో తవ్వకాలు జరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహనాల్లో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు స్థానిక షాడో ఎమ్మెల్యే సహకారంతోపాటు పోలీస్ శాఖ అండగా ఉండడంతో అక్రమార్కులు బరి తెగించి వ్యవహరిస్తున్నారు.కోర్టు స్టేలో ఉన్న రీచ్ నుంచి..పొదలకూరు మండలం ఇరువూరు రీచ్ కోర్టు స్టే పరిధిలో ఉంది. అక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధి ఈ రీచ్‌ను ఓ ఇసుకాసురుడికి అ«నధికారికంగా అప్పగించారు. పగలు రాత్రి తేడా లేకుండా నదిలో భారీ యంత్రాలు ఉంచి లోడింగ్ చేస్తున్నారు. 30 టన్నుల సామర్థ్యం ఉన్న 50 టిప్పర్ల ద్వారా నిత్యం ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.10 వేలు వంతున వసూలు చేస్తున్నారు. కోర్టు స్టే పరిధిలో ఉన్న రీచ్‌లో ఇసుక లూటీ జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.ఇతర రాష్ట్రాలకు తరలింపు..ఇరువూరు రీచ్ నుంచి ఇసుకను రాత్రి వేళ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పెన్నా నది ఇసుకకు తమిళనాడు, బెంగళూరుతోపాటు తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీసిటీ డిమాండ్ ఉంది. అక్కడ ఇసుక టన్ను రూ.3 వేలు వరకు పలుకుతోంది. హైవే పోలీస్స్టేషన్లు, రవాణా శాఖ, విజిలెన్స్, మైనింగ్ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ అక్రమ రవాణా చేస్తున్నారు. ఇరువూరు రీచ్ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక వాహనాలను జిల్లా మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇటీవల పట్టుకున్నారు.దాదాపు 20 వాహనాల్లో ఇసుక లోడింగ్ చేసి తరలిస్తుండగా స్థానిక పోలీసులు సహకారం అందించపోవడంతో రెండు టిప్పర్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారం వరకు అక్రమ రవాణాకు తాత్కాలికంగా తెరపడినా మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.నెల్లూరు రూరల్‌లో గ్రావెల్..నెల్లూరు రూరల్ నియోజకవర్గం గొల్లకందుకూరు తిప్పను గ్రావెల్ మాఫియా పీల్చి పిప్పి చేస్తోంది. రాత్రి వేళ భారీ యంత్రాలు ఉపయోగించి నిత్యం పదుల సంఖ్యలో పొదలకూరు, నెల్లూరు రూరల్ పరిధిలోని లే అవుట్లకు గ్రావెల్ తరలిస్తున్నారు. గ్రావెల్‌కు డిమాండ్ ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. రోజూ దాదాపు 40 టిప్పర్లతో అక్రమ రవాణా సాగిస్తున్నారు.ట్రాఫిక్ క్లియర్ చేసి లారీలను పంపేసిన ఎస్సై..కోర్టు స్టే పరిధిలో ఉన్న ఇరువూరు రీచ్, గొల్లకందుకూరు తిప్ప నుంచి అక్రమంగా ఇసుక, గ్రావెల్ తరలిస్తున్న లారీలు గురువారం రాత్రి పొదలకూరు మండలం తాటిపర్తిలో శ్రీరుక్మిణి సమేత పాండురంగస్వామి బ్రహ్మోత్సవాల వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి భారీగా చేరుకున్నాయి. ఈ సమయంలో అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సై హనీఫ్ వాటిని నిలువరించగా స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ కాల్ రావడంతో చేసేది లేక అప్పటికప్పుడు రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసి లారీలను పొదలకూరు వైపు పంపారు. ఈ ఘటనను కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసులే ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు కొమ్ముకాస్తూ దగ్గరుండి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి పంపటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. -
ఖాకీ రాజ్యం కళ్లు తెరవదా!
వ్యక్తి హక్కును తృణీకరించి అరాచకం రాజ్యమేలేచోట వ్యక్తికిగానీ, సమాజానికిగానీ రక్షణ ఉండ దంటాడు ఆఫ్రో–అమెరికన్ రచయిత ఫ్రెడరిక్ డగ్లస్. జనాన్ని అన్ని విధాలా ఏమార్చి తొమ్మిది నెలల క్రితం అందలం ఎక్కిన కూటమి సర్కారు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాలా ఆ పరిస్థితే కొన సాగుతోంది. ఎన్నికల్లో అడ్డూ ఆపూ లేకుండా ఇచ్చిన హామీలేమయ్యాయని అడిగితే... వరస వైఫ ల్యాలను ఎండగడితే... తప్పుడు ప్రచారాలను నిలదీస్తే... జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. ప్రాథ మిక హక్కయిన భావప్రకటనా స్వేచ్ఛ బందీ అవుతోంది. అడుగడుగునా పౌరుల హక్కులను హరి స్తున్న పోలీసుల తీరును సహించబోమని రాష్ట్ర హైకోర్టు ఇప్పటికి మూడు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఈ తోలు మందం ప్రభుత్వానికి వివేకం కలిగినట్టు లేదు. అందుకే మంగళ వారం జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ మన్మథరావులతో కూడిన ధర్మాసనం మరో రెండు కేసుల్లో పోలీసులకు అక్షింతలు వేయాల్సివచ్చింది. పోలీసులైనాసరే చట్టానికి లోబడే వ్యవహరించాలని చీవాట్లుపెట్టింది. ఊహల ఆధారంగా కేసులు పెట్టడం, బెయిల్ రాకుండా తప్పుడు సెక్షన్లు బనాయించటం సహించబోమంది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకొచ్చి కూడా అరెస్టు చేస్తారంది. ఈ వ్యాఖ్యలు చాలు... ఏపీలో పాలన ఎంత నిరంకుశంగా ఉందో చెప్పడానికి! మనసంటే తెలియని, మనుషులంటే లక్ష్యంలేని కూటమి నాయకులకూ, కార్యకర్తలకూ మూడు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటున్నాయి! అంటురోగం ప్రబలినట్టు, ఊరంతా ఒకేసారి పూన కాలు వ్యాపించినట్టు వీరంతా ఉన్నట్టుండి ఫిర్యాదులు చేస్తున్నారు. ఏమైంది వీళ్లకు? ఇదే తీరు కొనసాగిస్తే చట్టాన్ని సవరించి ఇలాంటి కేసుల్లో మొదటగా ఫిర్యాదీదారులను సైకియా ట్రిస్టుల దగ్గరకు పంపాలని... ఎన్నాళ్లుగా మనోభావాలు దెబ్బతిని వున్నాయో, పర్యవసానంగా వారిలో కనబడిన వైపరీత్యాలేమిటో కుటుంబసభ్యుల నుంచి తెలుసుకోవాలనీ నిబంధనలు చేర్చాలన్న డిమాండ్ బయల్దేరినా ఆశ్చర్యం లేదు. ఆ పనిచేస్తే ఇలాంటివారి రోగం కుదురుతుంది. అధికారంలో ఉన్నవారి మెప్పు పొందేందుకు ఫిర్యాదు అందిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా పోలీసులు అరెస్టులకు దిగుతున్నారు. గొలుసు కేసులతో వందలాది కిలోమీటర్ల దూరంలోవుండే పోలీస్ స్టేషన్లకు మార్చి మార్చి తిప్పుతున్నారు. ఎవరిపై ఎన్ని కేసులు పెడుతున్నారో గమనిస్తే ఎవ రంటే పాలకులు వణుకుతున్నారో అర్థమవుతుంది. ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి సంగతే తీసుకుంటే, 67 ఏళ్ల ఆ పెద్దమనిషిపై లెక్కకు మిక్కిలి కేసులు పెట్టారు. ఒకటి రెండు కేసుల్లో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు తగిలించి అరెస్టు చేస్తున్నారు. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుని పలు అనారోగ్య సమస్యలతో ఉన్న పోసానిని కేసుల పేరుతో వందల మైళ్లు తిప్పుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డిపై పెట్టిన కేసు గమనిస్తే పోలీసుల అత్యుత్సాహం అర్థమవుతుంది. ఒక కేసులో మేజిస్ట్రేట్ ఆయన రిమాండ్‌ను తిరస్కరించి విడుదల చేయాలని ఆదేశించిన వెంటనే పోలీసులు అతి తెలివి ప్రదర్శించి తిరిగి అవే ఆరోపణలతో ఆయనను మరో సారి అరెస్టు చే శారు. ఈసారి న్యాయస్థానం ఆయన్ను రిమాండ్‌కు తరలించింది. ఈ విషయంలో పోలీసుల పనితీరును హైకోర్టు ధర్మాసనం నిశితంగా విమర్శించింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇష్టానుసారం అరెస్టు చేయటం, చట్టనిబంధనలను తుంగలో తొక్కడం చెల్లదని పేర్కొంది. ఈ విషయంలో యాంత్రికంగా వ్యవహరించినందుకు మేజిస్ట్రేట్‌ను తప్పుబట్టింది. తాచెడ్డ కోతి వనమంతా చెరచినట్టు పోలీసుల తీరు వల్ల కిందిస్థాయి న్యాయస్థానాలకు సైతం మందలింపులు తప్పటం లేదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పరు. ఆయన బంధువులకు సమాచారం ఇవ్వరు. అసలు ఆయనపై వున్న కేసులేమిటో చెప్పరు. ఇవి పాటించలేదని తెలిశాక కూడా యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతున్న వైనాన్ని ధర్మాసనం ప్రత్యేకించి ప్రస్తావించింది. ఈ ధోరణి సరికాదని మందలించింది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టు విషయంలో కూడా న్యాయమూర్తులు ఈ విధంగానే స్పందించారు. వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా రూపొందించిన ఒక చిన్న రూపకం పోలీసులకు అభ్యంతర కరంగా తోచింది. అంతే... నిరుడు డిసెంబర్లో అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటలకు కర్నూలు పోలీసులు తలు పులు బద్దలుకొట్టి ప్రేమ్‌కుమార్ భార్యాపిల్లలను వేరే గదిలో బంధించి ఆయన్ను ఈడ్చుకెళ్లారు. హాస్యాస్పదమైన విషయమేమంటే వినయ్‌కుమార్ దగ్గర దొరికిన రూ. 300 అక్రమ వసూళ్లట! పైగా సంఘటిత నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపించి బీఎన్ఎస్లోని సెక్షన్ 111 బనాయించారు. ఈ రెండు కేసుల విషయంలో మాత్రమే కాదు... ఇంతకు మునుపు మరో మూడు కేసుల్లో కూడా పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. డీజీపీని రప్పించాల్సివస్తుందని హెచ్చరించింది. అయినా పోలీసుల తీరు మారడం లేదు. ఈ తెలివితక్కువ చర్యల్ని ఘనకార్యాలుగా భావిస్తూ పాలకులు సిగ్గువిడిచి ఊరేగుతున్నారు. తమకు ఎదురులేదని విర్రవీగుతున్నారు. అలవిమాలిన హామీలిచ్చి, ఈవీఎంలను నమ్ముకుని, డబ్బు సంచులు గుమ్మరించి అందలం ఎక్కిన కూటమి ఇకముందూ ఇదే దోవలో అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చని కలలు కంటోంది. తప్పు మీద తప్పు చేస్తూ పోతోంది. ఈ క్రమంలో పోలీసులను ఉపయోగించుకుని సంఘటిత నేరాలకు పాల్పడుతోంది. ఎల్లకాలమూ ఈ వ్యవహారం సాగదు. జనం నిజం గ్రహించారు. కీలెరిగి వాత పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. -
దయ్యాల వేద పఠనం!
తెర వెనుక కత్తుల కోలాటమాడుతున్నవారు తెరముందుకొచ్చి శాంతి కపోతాలను వదులుతున్నారు. రోత చేష్టల రంగమార్తాండులు శ్రీరంగనీతులు బోధిస్తున్నారు. అదిగో దొంగ ఇదిగోదొంగ అంటూ గజదొంగలే అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో కంచె చేను మేస్తున్నది. పోలీసు వ్యవస్థను ప్రతిపక్షంపైకి పాలకులు ఉసిగొల్పుతున్నారు. ఇదే కదా, అసలు సిసలైన వ్యవస్థీకృత నేరం. అత్యున్నత స్థాయి పోలీసు అధికారి మంత్రి వర్గం ముందు హాజరై ఓ గొప్ప వాగ్దానం చేశాడని వార్తలు వెలువడ్డాయి. ప్రతిపక్షాన్నీ, దాని అభిమానులనూ వేటాడే పనిలో మరింత వేగం పెంచుతారట. దీన్నేమంటాము? నేరమే అధికారమై కొలువు దీరడం కాదా? నేరమే అధికారమై కొరడా ఝుళిపించడం కాదా?నేరమే అధికారమై ప్రజల్నే నేరస్థుల్ని చేస్తుంటే నోరుండీ ఊరక కూర్చున్న ప్రతి ఒక్కడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఈరోజు వేటాడుతున్నది ప్రతిపక్షాన్నే కావచ్చు. రక్తం రుచి మరిగిన పులికి పరిమితులూ, షరతులూ వర్తి స్తాయా? ఉపవాస దీక్షలేమైనా అడ్డొస్తాయా? పౌరహక్కులను పాదాల కింద తొక్కేయడానికి అలవాటుపడ్డ పోలీస్ రాజ్యం కూడా అంతే! ఈ రోజున వాడు తడుతున్నది నీ ఇంటి తలుపును కాకపోవచ్చు. నేడు కాకపోతే రేపు లేదా మరునాడు... నువ్వు నీ హక్కుల్ని గురించి ప్రశ్నించిన రోజున నీ ఇంటి ముంగిట కూడా ఆ బూట్ల చప్పుడు వినిపిస్తుంది.నేరమే అధికారమై ప్రశ్నిస్తున్న ప్రతివాడి మీద నేరస్థుడనే ముద్ర వేసే ధోరణిని ఆదిలోనే ప్రతిఘటించకపోతే ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదమేర్పడుతుంది. అధికారంలోకి రావడానికి అసత్యాలకూ, అభూత కల్పనలకూ ఒడిగట్టారు గనుక ప్రభుత్వపక్ష స్వభావాన్ని నేరపూరితమైనదిగా భావించ వలసి వస్తున్నది. అసత్యాలూ, అభూత కల్పనలన్నీ ఒక్కొ క్కటిగా రుజువౌతూ వస్తున్నాయి గనుక నేరమే అధికారం రూపు దాల్చిందని అనుకోవలసి వస్తున్నది. గతకాలపు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందనీ, 14 లక్షల కోట్ల అప్పు చేశారనీ కూటమి పక్షం ఊరూవాడా ఏకంచేసి ప్రచారం చేసింది. మొన్ననే రాష్ట్ర శాసనసభలో సాక్షాత్తూ ఆర్థికమంత్రి పాత ప్రచారానికి విరుద్ధమైన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3 లక్షల 39 వేల కోట్లేనని తేల్చారు. ఎంత గుండెలు తీసిన బంట్లు వీరు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా, ప్రభుత్వ నేరపూరిత స్వభావాన్ని నిర్ధారణ చేయడానికి?అప్పుల ప్రస్తావన మచ్చుకు మాత్రమే. ఇటువంటి బేషరమ్ ప్రచారాలు చాలా చేసింది కూటమి. సామాన్య ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద కూటమి జూదమాడింది. వారి కలల అలల మీద ఆటలాడింది. ఏమార్చడానికి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లోకి గిరాటేసింది. కుర్చీ మీద కూర్చొని నవమాసాలు గడిచిపోయాయి. హామీల డెలివరీ ఆనవాళ్లే లేవు. ఉండకపోవచ్చు కూడా. బడ్జెట్లో కొన్ని హామీలకు మాత్రమే అరకొర కేటాయింపులు చూపారు. మిగతా వాటి ఊసే లేదు. నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. ఆడబిడ్డలకు నెలకు పదిహేను వేలిస్తామన్నారు. మోసం చేశారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలిస్తా మన్నారు. దానికి ఒక ఏడాది ఎగనామం పెట్టి, ఈసారి బడ్జెట్లో అవసరమైన సొమ్ములో సగం మాత్రమే కేటాయించారు.ఇంతవరకూ ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు చేరలేదు.రైతుకు ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. రైతన్న ఎదురు చూస్తూనే ఉన్నాడు.సాయం సంగతి దేవుడెరుగు. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. జగన్ హయాంలో ఇరవై నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు ఆరేడు నుంచి పదివేల దాకా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు రాలేదు. అన్ని పంటల కథలూ దాదాపు ఇంతే! కాల్వల కింద వేసుకున్న వరి పైర్లు కూడా నీటి తడులు లేక ఎండిపోతున్న వైనాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడే చూస్తున్నాము. మహిళలకు ఉచిత బస్సు ఇంకా డిపో దాటి రోడ్డెక్కలేదు. అప్పుడే దానిమీద మాట మార్చడం మొదలైంది. ఉచిత బస్సును ఒక్క జిల్లాకే పరిమితం చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు.ఈ రకంగా హామీల ఎగవేతతోపాటు పాలనా వైఫల్యాలతో ఆదిలోనే అప్రతిష్ఠ మూటగట్టుకున్న కూటమి సర్కార్ విమర్శ కుల నోళ్లు మూయించి, అసత్యాలను ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీపై దాడిని కేంద్రీకరించి, భారత న్యాయసంహితలోని 111వ సెక్షన్‌ను ఈ దాడికి ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసే వారిపై ఈ సెక్షన్ వాడకూడదని ఏపీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి సర్కార్ చెవికెక్కించుకోలేదు. కిడ్నాపులు, దోపిడీలు, భూకబ్జాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక నేరాలు వగైరా ముఠాలుగా ఏర్పడి చేసే నేరాలు (వ్యవస్థీకృత నేరాలు) ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.సోషల్ మీడియాలో చేసే విమర్శలను ఈ పరిధిలోకి తెచ్చి రాష్ట్ర సర్కార్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రత్యర్థుల పట్ల కక్షపూరిత వైఖరి కారణంగానే సర్కార్ ఈ కుట్రకు తెరతీసిందనుకోవాలి. సోషల్ మీడియాలో చేసే విమర్శల వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉన్నదనీ, ఇదంతా వ్యవస్థీకృతంగా జరుతున్నదనీ ఓ స్క్రీన్‌ప్లేను తయారుచేసి, దానికి అనుగుణంగా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయాలనీ, తద్వారా ఆ పార్టీని బలహీన పరచాలనే పన్నాగం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇందు కోసం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల మీద కేసులు పెట్టాలనీ, వేధించాలనీ జిలాల్ల వారీగా టార్గెట్లు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇటీవల పోలీసు ఉన్నతాధికారి నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో కూడా ఈ టార్గెట్లను చేరుకునేలా సహకరించాలనే ఆదేశాలిచ్చినట్టు వచ్చిన వార్తలు నిజమైతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. గత ప్రభుత్వ హయాంలో కూటమి అగ్రనాయకులంతా బరితెగించి మాట్లాడిన బూతుల ఆడియోలు, చెప్పులు చూపెట్టిన వీడియోలు కోకొల్లలు. వీరికి భిన్నంగా వైసీపీ అధినేత ఏనాడూ ఏ ఒక్క అసభ్యకర వ్యాఖ్యానం చేయలేదు. అయినా సరే, వీరి బూతులకు బదు లిచ్చిన నేతలపై అక్రమ కేసులకు తెగబడుతున్నారు.మొన్నటి మంత్రివర్గ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత ఒక పోలీస్ ఉన్నతాధికారి హాజరై ఒక వింత సందేశాన్ని వినిపించినట్టు యెల్లో మీడియా టాప్ న్యూస్‌గా ప్రచారంచేసింది. బహుశా కూటమి పెద్దల తాజా కుట్రలో భాగంగానే ఈ వింత కథను ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయిన రంగన్న అనే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ మరణం అనుమానాస్పదమేనని ఆ ఉన్నతాధికారి మంత్రులకు ఉపదేశించారట! అనారోగ్యంతో ఉన్న తన భర్తను పోలీసులు వేధించారనీ, అందువల్లనే అయన చనిపోయాడనీ రంగన్న భార్య మీడియాతో మాట్లాడిన మాట లను వారెందుకు పరిశీలనలోకి తీసుకోలేదో తెలియదు మరి!అంతటితో ఆగలేదు. ఈమధ్యకాలంలో చనిపోయిన వ్యక్తులను వివేకానంద హత్య కేసుకు లింకు చేస్తూ అవన్నీ అనుమానాస్పద మరణాలేనని చెప్పడానికి పూనుకోవడం, మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్టు కథలు అల్లడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయట! జగన్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమా నాలు చూరగొన్న డ్రైవర్ నారాయణ కేన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొంతకాలం క్రితం చనిపోయాడు. అందులో కూడా అనుమానం ఉన్నదట! నీచమైన కుట్రలకు పరాకాష్ట డాక్టర్ గంగిరెడ్డి పేరును కూడా ఇందులోకి లాగడం. డాక్టర్గంగిరెడ్డి భారతమ్మ తండ్రి. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. ఆయన మరణం కూడా అనుమానమేనట! పోలీస్ అధికారి ఏం చెప్పాడో తెలియదుగానీ ‘ఈనాడు’ మాత్రం అరపేజీ ఫిక్షన్ రాసి పారేసింది.తాము చెప్పదలుచుకున్న కథలో ఆవగింజంత నిజమైనా ఉండాలన్న నియమం వారికేమాత్రం లేదు. చెప్పింది ప్రచారం చేసిపెట్టడానికి మోచేతి కింద వందిమాగధ మీడియా సిద్ధంగా ఉన్నది. చేతిలో అధికారం ఉన్నది. వ్యవస్థల మెడలకు బిగించిన ఇనుప గొలుసులు తమ చేతిలోనే ఉన్నాయి. ఉసిగొలిపితే చాలు. కేసులు పెట్టడం ఎంత పని? ఇప్పుడిదే కూటమి సర్కార్ సింగిల్ పాయింట్ ఎజెండా! దయ్యాలు వేదాలు వల్లించినట్టు,తోడేళ్లు – గుంటనక్కలూ శాకాహార ప్రతిజ్ఞలు చేసినట్టు ఈ పెద్దలంతా సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రజా సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడటం కంటే ఎబ్బెట్టు దృశ్యాలు ఇంకేముంటాయి? అటువంటి ఎబ్బెట్టు దృశ్యాన్ని ఈమధ్యనే విశాఖతీరంలో చూడవలసి వచ్చింది.తెలంగాణ పునరాలోచన?తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై సరిగ్గా పదిహేను మాసాలైంది. అరవై మాసాల (ఐదేళ్ల) పాలన కోసం ప్రజలు ఎన్నుకున్నారనుకుంటే అందులో పావు భాగం ప్రయాణం పూర్తయిందన్నమాట. నిజానికి ఈపాటికే ప్రభుత్వం పూర్తిగా కుదురుకొని దాని ఎజెండాను పరుగెత్తించే క్రమంలో ఉండాలి. కానీ, ఎందుకనో ఇప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ప్రభు త్వంలోని మంత్రుల మధ్య, మంత్రులకు అధికారులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక ఇటువంటివన్నీ షరా మామూలేనని ఆ పార్టీ నేతలు సమర్థించుకోవచ్చు గాక. కానీ, ఈ వాదనను అంగీకరించడానికి జనం సిద్ధంగా లేరు.శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా పోటీ చేసి, ముఖ్యమంత్రితో సహా యంత్రాంగమంతా రంగంలోకి దిగి కూడా ఓటమి పాలైంది. అది కూడా బీజేపీ చేతిలో! రాష్ట్ర వ్యాప్తంగా బలమైన పునాది, కార్యకర్తల బలం, నాయకత్వ ఇమేజ్ ఉన్న బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయి ఉంటే కనీసం గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ఉత్తరాది పార్టీగా తాము విమర్శించే బీజేపీ చేతిలోభంగపడటం కచ్చితంగా కాంగ్రెస్ సర్కార్‌కు ఇబ్బందికరమైన విషయమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.అయితే ఈ ఆరోపణకు సరైన ఆధారం కనిపించడం లేదు. బీఆర్ఎస్ గనుక లోపాయకారిగానైనా బీజేపీకి పూర్తిగా సహకరించి ఉంటే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు అంత భారీస్థాయిలో ఓట్లు పడేవి కావు. బీసీ నినాదం వల్లనే హరికృష్ణ పెద్దసంఖ్యలో ఓట్లు సంపాదించారనే వాదన కూడా ఉన్నది. కానీ తెలంగాణ బీసీ సమూహాల్లో సామాజిక విధేయత కన్నా రాజకీయ విధేయతే ఎక్కువ. బీఆర్ఎస్కు విధేయంగా ఉండే ఓటర్లలో బీసీలే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కనుక బీఆర్ఎస్ ఓట్లు పెద్దసంఖ్యలో హరికృష్ణకు బదిలీ అయుండవచ్చనే అభిప్రాయం ఉన్నది.కేవలం వ్యక్తిగత సంబంధాల మీద ఆధారపడి పెద్దగా ఆర్థిక దన్ను లేకుండానే బీజేపీ, కాంగ్రెస్‌లకు హరికృష్ణ గట్టి పోటీ ఇవ్వగలిగినప్పుడు, బీఆర్ఎస్ రంగంలో ఉన్నట్లయితే గెలిచేది కాదా అనే చర్చ కూడా మొదలైంది. పోటీ చేయకపోవడానికి బీఆర్ఎస్కు ఉన్న కారణాలేమిటో అధికారికంగా తెలియదు. పార్టీ గుర్తుపై ఎన్నికై అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఆ స్థానాల్లో ఉపఎన్నికలు రావాలని బీఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సహకారం అవసరమని కూడా ఆ పార్టీ భావిస్తుండవచ్చు. అందుకోసమే కౌన్సిల్ బరికి బీఆర్ఎస్ దూరం జరిగిందనే అభిప్రాయం కూడా ఉన్నది.తెలంగాణలో తమ పార్టీ బాగా బలపడిందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. నిజంగానే అర్బన్, సెమీ ఆర్బన్ ప్రాంతాల్లో కొంత హిందూత్వ ప్రభావం ఆ పార్టీకి ఉపకరిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ యువతలో వీరహిందూత్వ ప్రచారం బాగానే పనిచేస్తున్నది. బంజారా, ఇతర గిరిజన తెగల్లో ప్రాబల్యం సంపాదించడానికి కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నది. ఈ పరిణామాలు సహజంగానే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కలవరం కలిగిస్తాయి.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక చిన్న లిట్మస్ టెస్ట్ అందుబాటులో ఉన్నది. పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెచప్పుడు వింటే చాలు. అనర్హత విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలగా ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచే ప్రసక్తే లేదని ఫిరాయింపుదారులు బలంగా నమ్ము తున్నారు. కొందరు బహిరంగంగా తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. గోడ దూకినవారు మళ్లీ గోడెక్కి కూర్చుంటు న్నారు. మరికొందరు అంతర్గతంగా మథనపడుతున్నారు.అంతే తేడా!ప్రయాణంలో పాతిక శాతం కూడా పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్నది. ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది. ఈ పరిస్థితి రావడా నికి ప్రభుత్వంలో సమన్వయ లోపం, అనుభవ రాహిత్యం కూడా ప్రధాన కారణాలే! రైతులకు రెండు లక్షల రుణమాఫీకింద 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రైతాంగపు సానుభూతిని మాత్రం సంపాదించలేకపోయింది. రెండు లక్షల మీద ఐదువేలో పదివేలో వడ్డీ మిగిలిపోయిన వారికెవరికీ రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల 30 శాతంమందికి మాఫీ జరగలేదు. దానికితోడు రైతుబంధు నిలిచి పోవడం, గతంతో పోలిస్తే గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, వేసంగి పంటకు నీళ్లివ్వలేకపోవడం, ఎప్పుడో మరిచిపోయిన కరెంటు కోతలు, మోటార్లు కాలిపోవడాలు మళ్లీ ప్రత్యక్షం కావ డంతో రైతాంగంలో వ్యతిరేకత పెరుగుతున్నది.ఆర్థిక మందగమనం అనే పరిణామం దేశవ్యాప్తంగా ఉన్నదే కావచ్చు. కానీ తెలంగాణలో స్వయంగా ప్రభుత్వమే పూనుకొని హైడ్రా అనే అసందర్భ శరభ నాట్యం చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇది రాష్ట్రమంతటా డబ్బు చలా మణిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానికితోడు కేసీఆర్ హయాంలో రైతుబంధు, దళిత బంధు వగైరా స్కీముల ద్వారా ఏటా జనం చేతుల్లోకి చేరిన వేలకోట్ల రూపాయలు ఆగి పోయాయి.అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనే నా«థుడు దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. ఆరోగ్యశ్రీ నిధులు సకాలానికి అందక, ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు జరగక, రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వివిధ వర్గాల ప్రజలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజా దర్బార్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇటువంటి కారణాలేమీ లేవు. కేవలం నాయకత్వ అహంకారపూరిత ధోరణి ప్రజలకు దూరం చేసింది. నిరుద్యోగ యువత సమస్య లను విని వారిని సాంత్వన పరచడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. దసరా సెలవుల్లో ఇళ్లకు చేరుకున్న ఈ యువత తల్లిదండ్రులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకాలు కొన్ని గురితప్పాయి. కొందరు ఎమ్మెల్యేల అహంకారం, అవినీతి కూడా జనంలో ఏహ్యభావం ఏర్పడ్డానికి కారణమై ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. అంతే తప్ప విస్తార జనబాహుళ్యం బీఆర్ఎస్ హయాంలో ఇక్కట్లపాలైన దాఖలాలు లేవు.చేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేకపోగా కొన్ని సంక్షోభాలను పిలిచి మరీ అక్కున చేర్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మారకుంటే చేదు అనుభవాలను చవిచూడక తప్పక పోవచ్చు. ఈ వేసవి కష్టాలను, మంచినీటి కటకటను ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతున్నదో చూడవలసి ఉన్నది. మరో పక్కన గత కేసీఆర్ పాలనే ఈ పాలనకంటే బాగున్నదని బలపడుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చగలరో కూడా చూడాలి. ఈ వేసవి పరీక్షలో గనుక కాగ్రెస్ ఫెయిలయితే వచ్చే రజతోత్సవ సభలో కేసీఆర్ పాంచజన్యం పూరించడం ఖాయం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రెడ్‌బుక్ రాజ్యాంగం..బాబు నియంతృత్వం.. చినబాబు నిరంకుశత్వం
రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా విధ్వంసానికి బరితెగిస్తోంది. టీడీపీ కూటమి నియంతృత్వ పాలన రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కులను పాశవికంగా అణచివేస్తోంది. చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియను భ్రష్టు పట్టిస్తోంది. ధర్మబద్ధ న్యాయ ప్రక్రియను మంటగలుపుతోంది. అందుకోసం పోలీసు శాఖ ద్వారా అధికారిక గూండాగిరీకి పాల్పడుతోంది. సీఐడీ విభాగాన్ని తమ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకుంటోంది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పచ్చ కుట్రలకు అంతకంతకూ పదునుపెడుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు తీరే చంద్రబాబు కుతంత్రానికి తాజాగా మరో తార్కాణం. ఏకంగా 164 సీఆర్పీసీ పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదుకు తెగబడటం బాబు కుట్రకు పరాకాష్ట.ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కుతంత్రంలో తాజా పర్వం. ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి వికటాట్టహాసం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ రాజ్యాంగ అమానుష పాలనలో మరెన్ని దారుణాలను చూడాల్సి వస్తుందోనని యావత్ రాష్ట్రం బెంబేలెత్తిపోతోంది. సాక్షి, అమరావతి/సాక్షి రాయచోటి/రాయచోటి, గచ్చిబౌలి: చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రెడ్‌బుక్ కుట్రకు బరితెగించింది. ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తన రాజకీయ వికృతరూపాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నారు. గతంలో కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆయనపై టీడీపీ, జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి. తద్వారా తాము ఎప్పుడు అనుకుంటే అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు ముందస్తు పన్నాగం పన్నాయి. ఆ ఫిర్యాదులపై పోసాని కృష్ణ మురళిని ఇప్పటివరకు విచారించడంగానీ ఇతరత్రా దర్యాప్తు ప్రక్రియగానీ కొనసాగలేదు. కానీ హఠాత్తుగా బుధవారం ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించడం గమనార్హం. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి ఆయన్ను పోలీసులు బలవంతంగా తమ వాహనంలో తరలించారు. అసలు సంబేపల్లి పోలీస్ స్టేషన్లో తనపై ఎవరు ఫిర్యాదు చేశారు..? ఏ విషయంలో ఫిర్యాదు చేశారో చెప్పాలని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానమే ఇవ్వలేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఓ నోటీసు ఇచ్చి తమతో తీసుకుపోయారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం లేదు... పోసాని అరెస్ట్ గురించి ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా చెప్పలేదు. యూనిఫాంలో ఇద్దరు పోలీసులు, మఫ్టీలో మరో ఇద్దరు పోలీసులు వచ్చి ఆయన్ను బలవంతంగా తమతో తీసుకుపోయారు. పోసాని అనారోగ్యంతో ఉన్నారని, కనీసం మందులు అయినా తీసుకెళ్లనివ్వాలని కుటుంబ సభ్యులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. తమ న్యాయవాది వచ్చే వరకు ఆగాలని అభ్యర్ధించినా ఆలకించకుండా బలవంతంగా తమతో తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం పోలీసులు ఎవర్ని అయినా అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలి. వారు న్యాయ సహాయం పొందేందుకు అవకాశం కల్పించాలి. కనీసం ఈ ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా పోలీసులు పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తమతో తీసుకుపోయారు. కాగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్టు సంబేపల్లి పోలీసులు చెప్పారు. కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చిన సమాచారంలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నంబరు ఇవ్వడం గమనార్హం. అంటే ఉద్దేశపూర్వకంగానే వేర్వేరు పోలీస్ స్టేషన్ల వివరాలు ఇచ్చి ఆయన కుటుంబ సభ్యులకు సందిగ్దంలోకి నెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేస్తున్నందున తరువాత న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తకుండా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ వేశారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే పక్కా ముందస్తు కుట్రతోనే పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసినట్టు తేటతెల్లమవుతోంది. 111, ఇతర సెక్షన్ల కింద కేసులు..సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 111, 196, 353, 299, 366(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు నమోదు చేశారు.నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశంపోసానిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు నిర్ధారించారు. పోలీసు వాహనంలో అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిపారు. కోర్టుకు హాజరు పరిచేముందు పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఓబులవారిపల్లె పీఎస్, సంబేపల్లె పీఎస్‌లలో పోసానిపై కేసులు నమోదైనట్లు చర్చించుకుంటున్నారు. గురువారం ఉదయం రాజంపేట లేదా రైల్వేకోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోసానికి దారిలో వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం.ముందస్తు కుట్రతోనే అక్రమ ఫిర్యాదులు...పోసాని కృష్ణ మురళిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదే ముందస్తు కుట్రలకు తెరతీసింది. అందులో భాగంగానే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతోపాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు. ఒకే రోజు ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయడం గమనార్హం. వాటిలో కొన్ని కేసులను ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది కూడా. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాసనసభ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది. అందులో భాగంగానే గతంలో ఎప్పుడో చేసిన ఫిర్యాదుపై ప్రస్తుతం స్పందిస్తూ పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసింది. -
కేసులు పెట్టడం.. లోపలేయడం.. కొట్టడం..: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారు... అంటూ నిలదీసింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే తప్ప, ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారంటూ మండిపడింది. ఇలాంటి తీరును తాము సహించబోమని పోలీసులను హెచ్చరించింది. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే, ఆ వివరాలను తమ ముందుంచేవారని, దర్యాప్తు చేయలేదు కాబట్టే, ఏ వివరాలను సమర్పించలేదని పేర్కొంది. రమణపై 27 కేసులు ఉన్నాయని చెబుతున్నారని, అలాంటప్పుడు ఈ కేసుల్లో దర్యాప్తు వివరాలను ఎందుకు తమ ముందుంచలేదని పోలీసులను ప్రశ్నించింది. రమణ అరెస్ట్ వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని గత విచారణ సమయంలో తాము ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేసింది. తమ ఆదేశాల మేరకు ఈ విషయంలో డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. రమణ అరెస్ట్ విషయంలో నివేదికలు ఇవ్వడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం కమిషనర్లకు మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారంటూ బొసా లక్ష్మి పిటిషన్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం మద్దిపాలెంలోని చైతన్యనగర్‌కి చెందిన బొసా రమణను కొద్దికాలం కిందట పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణ అరెస్ట్ విషయంలో పొదిలి, దర్శి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)ల వివరణ కోరింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని వారు కోర్టుకు చెప్పారు. ఇచ్ఛాపురం పోలీసులు మరో కేసులో రమణను అరెస్ట్ చేశారని తెలిపారు. దీంతో హైకోర్టు ఇచ్ఛాపురం ఎస్‌హెచ్‌వోను ప్రతివాదిగా చేర్చింది. అనంతరం ఇచ్ఛాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు, పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.వెంకటేశ్వర్లు వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ముందు హాజరైన ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు... లక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ధర్మాసనం ఆదేశాల మేరకు సీఐలు చిన్నం నాయుడు, వెంకటేశ్వర్లు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. రమణను తమ ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పింది. ఇలాంటి నిర్లక్ష్యపు తీరును తాము ఎంత మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పొదిలి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తరఫు న్యాయవాది స్పందిస్తూ, బొసా రమణపై 27 కేసులున్నాయని తెలిపారు. రమణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసులో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం మినహా దర్యాప్తు చేయడం లేదని పేర్కొంది. -
తూతూ మంత్రం.. ప్రజా సమస్యల పరిష్కారం!
సాక్షి, అమరావతి: ప్రజా వినతులకు సరైన పరిష్కారం చూపకుండా ప్రభుత్వం మ..మ.. అనిపిస్తోంది. నామమాత్రపు చర్యలతో సరిపెడుతోంది. చాలా వినతులను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజా వినతుల పరిష్కారంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరు సక్రమంగా లేదని ప్రకటించారు.గత ఏడాది జూలై 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ వరకు 7.42 లక్షల ప్రజా వినతులు రాగా, అందులో ఇంకా 2.91 లక్షలు పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి. మరోవైపు కొన్ని వినతులు పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ అందులో వాస్తవం ఉండటం లేదని ప్రభుత్వ అధ్యయనంలోనే తేలింది. ప్రజా వినతుల పరిష్కార పరిస్థితి ఇదీ... » పోలీసు శాఖ ప్రజా వినతులను పరిష్కరిస్తున్న తీరుపై 70 శాతం అర్జీదారులు అసంతృప్తి చేశారు. » మున్సిపల్ శాఖపై 69 శాతం మంది అసంతృప్తి. » స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై 67 శాతం సంతృప్తి వ్యక్తమైంది. » రెవెన్యూ శాఖలోను 60 శాతం అసంతృప్తి వ్యక్తంచేశారు. అత్యధికంగా రెవెన్యూలో మ్యుటేషన్, విస్తీర్ణంలో తేడాలపై సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీల సరవణలు, భూ కమతాల పంపిణీ, పట్టాదారు పాస్‌పుస్తకాల గురించి వినతులు వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా సంబంధిత వీఆర్వోలకు బదిలీ చేస్తున్నారు. వీఆర్వో నివేదిక ఆధారంగా అధికారులు ఎండార్స్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో పిటీషనర్ల దగ్గరకు వెళ్లడం లేదు. ప్రాథమిక విచారణ చేయడం లేదు. » ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన కొన్ని కేసుల్లో అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎండార్స్మెంట్లు ఇస్తున్నారు. కానీ, చాలా కేసుల్లో నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని ఫిర్యాదులను అప్లోడ్ చేయడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పేర్కొంటున్నారు. అటువంటి వాటిపై నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోవడం లేదు. » అర్జీదారుల వినతి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్నిచోట్ల ఫిర్యాదులను తిరిగి తెరిచినా సరైన చర్యలు తీసుకోవడం లేదు. » వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి శాఖల వారీగా చేసిన సర్వేకు, సీఎంవో చేసిన సర్వేకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. సీఎంవో నిర్వహించి సర్వేలో ఎక్కువ శాఖల్లో ప్రజల వినతుల పరిష్కారం పట్ల సంతృప్త స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. -
డీజీపీని కోర్టుకు పిలుస్తాం: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తుండటమే కాక, నిర్బంధంలో ఉన్న వారిని తమ ముందు హాజరు పరచాలంటూ తామిస్తున్న ఆదేశాలను పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నిప్పులు చెరిగింది. పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది. చాలా దూరం వెళుతుండటం సరికాదని హెచ్చరించింది. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా.. అంటూ నిలదీసింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మేజి్రస్టేట్ ముందు హాజరు పరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరు పరచాలన్న ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించింది. ఈ కేసు చాలా చిన్నదని, ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయని.. దీనిపై కోర్టు సమయం వృథా చేసుకోరాదంటూ ఇచ్ఛాపురం ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు తరఫు న్యాయవాది చెప్పడంపై హైకోర్టు ఒకింత విస్మయం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యలు మీకు చిన్న విషయంగా కనిపిస్తోందా? అంటూ నిలదీసింది. మీరు మొన్నటి వరకు ఆ వైపు (కక్షిదారులు) ఉన్నారని, ఇప్పుడు ఈ వైపు (అధికారుల వైపు) ఉన్నారని, అయితే న్యాయం అందరికీ ఒక్కటేనన్న విషయం మర్చిపోవద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని డీజీపీ, ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాంగ్మూలం నమోదు చేశాక మళ్లీ నోటీసా? ⇒ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం జిల్లా మద్దిపాలెంలోని చైతన్యనగర్‌కు చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రమణ భార్య బొసా లక్ష్మీ తన భర్తను ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ఎదుట హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ⇒ ఈ వ్యాజ్యంపై జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. రమణను తాము అరెస్ట్ చేయలేదని పొదిలి, దర్శి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)లు హైకోర్టుకు నివేదించారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్‌రెడ్డి మాత్రం రమణ పోలీసుల అక్రమ నిర్బంధంలోనే ఉన్నారని వివరించారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సమయంలో రమణను తమ ముందు హాజరు పరచాలంటూ గత ఏడాది నవంబర్ 11న ప్రకాశం జిల్లా ఎస్పీ, పొదిలి, దర్శి స్టేషన్ హౌజ్ ఆఫీసర్లను ఆదేశించింది. ⇒ నవంబర్ 13న కేసు విచారణకు రాగా, రమణను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ను స్థానిక కోర్టు ముందు హాజరు పరచగా, కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసులో ఇచ్ఛాపురం ఎస్‌హెచ్‌వోను ప్రతివాదిగా చేర్చింది. అలాగే పొదిలి, ఇచ్ఛాపురం ఎస్‌హెచ్‌వోలను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్‌హెచ్‌వోలు ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు అంగీకరిస్తూ రమణ వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఆ తర్వాత సెక్షన్ 41ఏ నోటీసు తీసుకోవడానికి రమణ నిరాకరించడంతో ఆయన్ను అరెస్ట్ చేసి, అనంతరం విడిచి పెట్టామని పొదిలి ఎస్‌హెచ్‌వో చెప్పారు. ⇒ తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. పొదిలి ఎస్‌హెచ్‌వో తీరుపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిని అలా ఎలా అరెస్ట్ చేస్తారని, ఓసారి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదంది. బాధ్యతాయుతమైన అధికారి అయి ఉండి, ఓ వ్యక్తిని అలా అరెస్ట్ చేసి, ఇలా వదిలేశామని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. అరెస్ట్, విడుదల విషయంలో ఎలాంటి రికార్డు నిర్వహించక పోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. -
రెడ్‌బుక్ కుట్రతో.. గాడి తప్పిన పోలీసింగ్
సాక్షి, అమరావతి: ⇒ విజయవాడ వరదల్లో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు తగినంత మంది పోలీసుఅధికారులనువినియోగించని ప్రభుత్వం ఫలితం.. దాదాపు 50మంది దుర్మరణం ⇒ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీని పర్యవేక్షించేందుకు తిరుపతిలో తగినంత మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించని ప్రభుత్వం.. ఫలితం.. తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల మృతి ⇒ సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నా సైబర్ పోలీసు వ్యవస్థను పటిష్టం చేయని ప్రభుత్వం ఫలితం.. గత ఏడాదిలో ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టిన సైబర్ ముఠాలు ⇒ ఇక రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, లైంగిక దాడులు అంతులేకుండా సాగిపోతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైఫల్యాలకు అంతన్నదే లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ అన్నదే కనిపించకుండా పోయింది. శాంతిభద్రతలు దిగజారిపోయాయి. అయినా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో సమర్ధులైన పోలీసు అధికారులు తగినంత మంది లేరా? లేకేం.. ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే.. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం. ఇది నిఖార్సైన నిజం. ఎందుకంటే.. అధికారులపై రెడ్‌బుక్ కక్ష. సీనియర్ ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అనేక మంది పోలీసు సిబ్బందిపై రెడ్‌బుక్ కక్ష. డజన్ల కొద్దీ అధికారులను వెయిటింగ్లో, వేకెన్సీ రిజర్వ్‌లోనో లేదంటే సస్పెన్షన్‌లోనే పెట్టేసి, చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేస్తోంది. శాంతి భద్రతలు దిగజారుతున్నా, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, మహిళలపై అత్యాచారలు పెచ్చుమీరిపోయినా, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయినా, సామాన్యుల కష్టార్జితం సైబర్ ముఠాల పాలవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో మునిగిపోయి, అధికారులందరినీ పక్కన పెట్టేసింది. ‘వెయిటింగ్’లో పెట్టు...‘వీఆర్’లో ఉంచూ వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ (వీఆర్).. ఈ రెండు పదాల మధ్యే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు వ్యవస్థ కునారిల్లిపోతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక మంది పోలీసు అధికారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. ఐదుగురు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్లో ఉంచి, మరో నలుగురు ఐపీఎస్ అధికారులను కక్ష పూరితంగా సస్పెండ్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం అంతటితో ఆగ లేదు. నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు కలిపి మొత్తం 59 మందిని వెయిటింగ్‌లోనే ఉంచింది. పరిపాలన పరమైన అంశాలతో నలుగురైదురుగురికి స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సర్వసాధారణం. తర్వాత వారిని ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సది్వనియోగం చేసుకోవడం రివాజు. కానీ ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసి, వారందరినీ పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. వారిలో నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, ఒక ఏఆర్ డీఎస్పీ ఉన్నారు. – ఇక శాంతి–భద్రతల పరిరక్షణ, ఇతర పోలీసు విధుల్లో అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి పోలీసు అధికారులపట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే దురీ్నతి ప్రదర్శిస్తోంది. ఏకంగా 90 మంది సీఐలకు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు రేంజ్లో 28 మంది, కర్నూలు రేంజ్లో 21 మంది, ఏలూరు రేంజ్లో 24 మంది, విశాఖపట్నం రేంజ్లో 17 మంది సీఐలను ‘వీఆర్’లో పెట్టింది. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మంది ఎస్సైలను ‘వీఆర్’లో ఉంచింది. దీంతో పని చేసే పోలీసు అధికారుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిపోయింది. అమాంతంగా పెరిగిన నేరాలు– ఘోరాలు అధికారులపై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను వెయిటింగ్లో, వీఆర్‌లో పెట్టడంతో పోలీసు వ్యవస్థ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేకపోతోంది. దాంతో శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయి. దోపిడీలు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. 2024లో సైబర్ నేరాలపై ఏకంగా 7.23లక్షల ఫిర్యాదులు వచ్చినా పోలీసు వ్యవస్థ సత్వరం స్పందించలేకపోయింది. దాంతో సైబర్ ముఠాలు సామాన్యుల నుంచి ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టాయి. రాష్ట్రంలో 17,282 దోపిడీలు, దొంగతనాలు జరిగినా ఆ కేసులను పోలీసు శాఖ ఛేదించలేకపోతోంది. రోడ్డు ప్రమదాలు భారీగా పెరుగుతున్నా రహదారి భద్రతకు తగినంత మంది పోలీసులకు నియోగించలేకపోతోంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కక్ష రాజకీయాలకే పరిమితమవుతూ ప్రజల భద్రతను గాలికొదిలేసింది. -
మన్యంలోకి మళ్లీ మావోలు!
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్ట్‌ల కదలికలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. 2022లో ఏవోబీ నుంచి మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులకు తరలివెళ్లిన మావోయిస్ట్ నేతలు ఏవోబీకి తిరిగొస్తున్నారు. ఏవోబీలో కార్యకలాపాలు విస్తరించాలన్న మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు వారు తిరిగొస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు శాఖను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. 2022లో ఏవోబీని విడిచిపెట్టి.. రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలో పోలీసు శాఖ సమర్థ పనితీరుతోపాటు గిరిజన ప్రాంతాల్లో భారీ స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టింది. ఏవోబీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగును ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా నిర్మూలించింది. మావోయిస్ట్ కార్యకలాపాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసింది. ఏవోబీలో 20 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించిన మావోయిస్ట్‌లు దాదాపు పూర్తిగా పట్టుకోల్పోయారు. ఒకప్పుడు 500 మంది నేతలు, 1,500 మంది మిలీషియా సభ్యులతో పోలీసులకు సవాల్ విసిరిన మావోయిస్ట్ పార్టీ బలం పూర్తిగా నీరుగారిపోయింది. కేవలం 20 మంది నేతలు, 100 మంది మిలీషియా సభ్యులకు పరిమితమైపోయింది. వారిలో కూడా క్రియాశీలంగా కేవలం 50 మంది మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమై మిగిలి ఉన్న మావోయిస్ట్ నేతలు, క్రియాశీల నేతలను మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులకు తరలివెళ్లాలని ఆదేశించింది. ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌తోపాటు ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని సురక్షిత స్థావరాలకు 2022 చివరిలో తరలివెళ్లిపోయారు. అప్పటినుంచి రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాక్ టు ఏవోబీ ఇటీవల కాలంలో మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌లలో ఆ రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లతో విరుచుకుపడుతున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 287 మంది మావోయిస్ట్‌లు ఎన్కౌంటర్లలో హత మవ్వగా.. వెయ్యి మందికిపైగా అరెస్టయ్యారు. వారిలో 190 మంది ఛత్తీస్‌గఢ్‌లోనే హతమవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు ఇక ఏమాత్రం సురక్షిత స్థానం కాదని చెబుతూ ఏవోబీకి చెందిన 20 మంది మావోయిస్ట్ నేతలతోపాటు మొత్తం 50 మంది మావోయిస్ట్‌లను వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. దాంతో మావోయిస్ట్ నేతలు దశలవారీగా ఏవోబీలోకి వస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. రాష్ట్ర పోలీసు శాఖను ఈ విషయంపై అప్రమత్తం చేశాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని దాదాపు 20 మండలాల్లో మావోయిస్ట్‌లు, మిలీషియా సభ్యుల కదలికలు మెల్లగా ఊపందుకున్నట్టు రాష్ట్ర పోలీసు శాఖ గుర్తించింది. మావోయిస్ట్‌ల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నాయి. -
ఫ్యూచర్ సిటీ.. పోలీసుల పోటీ!
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు వర్గాల్లో ప్రస్తుతం ‘ఫోర్త్ సిటీ’ హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. శివారు ప్రాంతాల్లోని జోన్, డివిజన్ పోలీసు పోస్టులకు డిమాండ్ విపరీతంగా ఏర్పడింది. ఫోర్త్ సిటీ ప్రతిపాదనతో శివార్లలో రియల్ ఎస్టేట్ బూమ్ ఊపందుకోవడంతో ఇదే అదనుగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు వారి ‘ఫ్యూచర్’ను చక్కదిద్దుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలోనే ఖాకీల బదిలీలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులు ప్రభుత్వంలోని ప్రముఖులను, నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఖాకీలు, బిల్డర్లు.. చెట్టాపట్టాల్.. ⇒ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యువత అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ హబ్‌గా ఫోర్త్ సిటీని నిర్మించాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే నాలుగో నగరంలో ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాలకు ప్రాతినిధ్యమిస్తున్నారు. ⇒ రంగారెడ్డి జిల్లాలోని బేగరికంచె, మీర్ఖాన్పేట, ముచ్చర్ల ప్రాంతాలలో రానున్న ఫోర్త్ సిటీ కోసం ప్రభుత్వం ఇప్పటికే 13,973 ఎకరాల భూమిని సేకరించింది. మరో 15 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేయనుంది. స్థిరాస్తి నిపుణులు అంచనా ప్రకారం ఫోర్త్ సిటీ ప్రతిపాదన తర్వాత ఆయా ప్రాంతాలలో భూముల ధరలు 30– 40 శాతం మేర పెరిగాయి. ⇒ ముచ్చర్ల, దాసర్లపల్లి, కడ్తాల్, నేదునూర్, కందుకూరు, మీర్ఖాన్పేట, తుమ్మలూరు, మహేశ్వరం, గూడూరు, పంజగూడ, నాగిరెడ్డిగూడ, మక్త మాదారం, ఆమన్‌గల్, యాచారం ప్రాంతాల్లోని భూములకు డిమాండ్ పెరిగింది. రియల్టర్లతో పోలీసులు సత్సంబంధాలు కొనసాగిస్తారనే అభిప్రాయం ఉంది. దీంతో తమ అనుయాయులు పోస్టింగ్‌ల్లో ఉంటే స్థిరాస్తి క్రయ విక్రయాలు, తగాదాలలో ఇబ్బందులు తలెత్తవని పలువురు బిల్డర్లు భావిస్తున్నారు. జోన్, డివిజన్ పోస్టులకు పైరవీలు.. మహేశ్వరం మండలంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేయడంతో.. శివారు ప్రాంతాల్లోని జోన్, డివిజన్ పోలీసు పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. మహేశ్వరం, యాదాద్రి– భువనగిరి, శంషాబాద్ డీసీపీలతో పాటు మెదక్, వికారాబాద్ ఎస్పీ పోస్టింగ్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా ప్రాంతాలకు కొత్త పోలీసు బాస్‌లను నియమించినప్పటికీ.. ఏడాది కాలం పూర్తవడంతో బదిలీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీంతో ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా.. మహేశ్వరం జోన్ పరిధిలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం డివిజన్లతో పాటు ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) పోస్టులకు పైరవీలు తుది దశకు చేరుకున్నాయి.ఫ్యూచర్‌కు డైనమిక్ ఐఏఎస్.. ఫోర్త్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు, భారీ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి సీనియర్ ఐఎఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇంధనం, రెవెన్యూ శాఖల్లోని పలువురు డైనమిక్ ఐఏఎస్‌లను నాలుగో నగరి బాధ్యతలు అప్పగించేందుకు త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయనన్నట్లు తెలిసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ, భద్రత, నిర్వహణ కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), గ్రేటర్ నోయిడా ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అథారిటీ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో ఈ అథారిటీ కార్యాచరణ, విధి విధానాలు ఉండనున్నాయి. -
కానిస్టేబుల్‌తో ఎస్ఐ వివాహేతర సంబంధం.. భార్య ఫిర్యాదు
సాక్షి, నల్లగొండ: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా ఓ పోలీసు అధికారి.. వివాహిత అయిన కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య.. పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్నేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న భార్య జ్యోతి.. మహేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వారించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వీరిద్దరూ తమ తీరు మార్చుకోలేదు. ఇక, తాజాగా వీరిద్దరి కాల్ రికార్డింగ్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరోవైపు భర్తపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా మహేందర్ భార్య జ్యోతి మాట్లాడుతూ.. ఐదారేళ్లుగా వసంతతో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. మహేందర్‌ను శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలి. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలి. లేకపోతే మాకు మెర్సీ కిల్లింగ్‌కు అవకాశం కల్పించాలి. వసంతకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె భర్తకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. వసంత కూడా నాపై దాడి చేసింది. నన్ను కొట్టి ఇంట్లో ఉన్న బంగారం నగదు ఎత్తుకెళ్లింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
-
హద్దు మీరితే లోపలేయండి
సాక్షి, హైదరాబాద్: ‘బాధితులను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నేరగాళ్లు రాజకీయ నాయకులైనా, అధికారులైనా సరే.. ఎలాంటి హోదా ఉండదు. ప్రొటోకాల్ వర్తించదు. నేరం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి. పోలీస్స్టేషన్లకు వచ్చి డాబూ దర్పం ప్రదర్శిస్తూ హడావుడి చేసేవాళ్లను సక్కగా తీసుకుపోయి బొక్కలో వేయండి. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజాప్రతినిధులకు పోలీసులు మర్యాద ఇవ్వడం ఎంత ముఖ్యమో..పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజాప్రతిధులు సహా ఎవరైనా పోలీసులతో మర్యాదగా ప్రవర్తించడం అంతే ముఖ్యం.పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించేవారి పట్ల మర్యాదగా ఉండాల్సిన పనిలేదు. ఈ మేరకు ఈ వేదిక నుంచే పోలీస్ శాఖలోని అన్ని స్థాయిల సిబ్బందికి.. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా నేను ఈ విషయంలో స్పష్టత ఇస్తున్నా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో హోంశాఖ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్నిమాపక శాఖకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.ఆ తర్వాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీజీపీ జితేందర్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అగ్నిమాపక శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డిప్యూటీ సీఎంతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు.ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో పనిచేశారు. కానీ గత ఏడాదిగా పైరవీలకు తావులేకుండా సమర్థత ఆధారంగా పోస్టింగ్‌లు ఇస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్లు లేనందున రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయి. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసుల చేతుల్లోనే ఉంది. ప్రజా ప్రభుత్వంలో 4 కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛ అనే ఏడో గ్యారంటీని అమలు చేశాం..’ అని సీఎం పేర్కొన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాల కేసుల్లో 6 నెలల్లోనే శిక్ష‘గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారితో పాటు సైబర్ నేరాలు సవాల్ విసురుతున్నాయి. డ్రగ్స్ కట్టడికి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుంది. కాబట్టి డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలి. డ్రగ్స్, సైబర్ నేరాల కేసుల్లో ఆరు నెలల్లోనే విచారణ పూర్తి చేసి శిక్షలు విధించేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. డ్రగ్స్, సైబర్ క్రైం నియంత్రణ కోసం బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులను డేటా అనాలసిస్ కోసం వాడుకోవాలని డీజీపీని ఆదేశిస్తున్నా. అదేవిధంగా నగరాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పోలీసులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి‘క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖ సిబ్బంది దాన్ని ఉల్లంఘించడం సరికాదు. పోలీసులు ఆందో ళనలు చేయడం వల్ల సమస్యల పరిష్కారం మరింత జఠిలం అవుతుంది. పోలీస్ సిబ్బంది తమ సమ స్యలేవైనా ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి. అధికా రుల వద్ద పరిష్కారం కాకపోతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తేవాలి. అక్కడా పరిష్కారం కాక పోతే నేను స్వయంగా పోలీసుల సమస్యలు పరిష్క రించే బాధ్యత తీసుకుంటా..’అని సీఎం తెలిపారు. అందరి కోసం పోలీస్: డిప్యూటీ సీఎం ప్రజా ప్రభుత్వంలో కొంతమంది అవసరాల కోసం కాకుండా, సమాజ అవసరాల కోసం మాత్రమే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ నగరంతో పా టు రాష్ట్రాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కో సం ఫ్రెండ్లీ పోలీస్ కార్యాచరణ ప్రణాళిక తీసుకుని ముందుకు వెళుతున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ పోలీస్ సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉందని, డయల్ 100కు సమాచారం అందిన పది నిమిషాల్లోనే బాధి తుల వద్దకు చేరుకుంటున్నామని చెప్పారు. ఆకట్టుకున్న విన్యాసాలు..అబ్బురపర్చిన జాగిలాలు విజయోత్సవాల్లో భాగంగా ఆక్టోపస్ సిబ్బంది ప్రద ర్శించిన విన్యాసాలు అలరించాయి. పోలీస్ బ్యాండ్ బృందాలు ఆకట్టుకున్నాయి. పోలీస్ జాగిలాలు తమ ప్రదర్శనతో అబ్బురపరిచాయి. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మేయర్ విజ యలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అగ్ని మాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఐపీఎస్ లు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.మానవీయ కోణంలోనే ట్రాన్స్జెండర్లకు బాధ్యతలు‘సమాజంలో నిరాదరణకు గురైన ట్రాన్స్జెండర్లను మానవీయ కోణంలో ఆదుకునేందుకే వారికి తాత్కాలిక విధానంలో ట్రాఫిక్ అసి స్టెంట్లుగా విధులు అప్పగిస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచించే ట్రాన్స్జెండర్లను నేను గతంలో చూశా. అందుకే వారికి ట్రాఫిక్ విధులు అప్పగించి, నెలకు గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 50 మంది ట్రాన్స్జెండర్లకు నియామక పత్రాలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెంచుతాం. ఇందిరమ్మ, డబుల్ బెడ్రూం ఇళ్లు ట్రాన్స్జెండర్లకు ఇస్తాం. అన్ని విధాలా అండగా ఉంటాం. ఈ అవకాశాన్ని ఉపయో గించుకుని ట్రాన్స్జెండర్లు క్రమశిక్షణతో మెల గాలి..’ అని ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు.హోంగార్డులకు రోజుకు రూ.వెయ్యి⇒ వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.100 నుంచి రూ.200కు పెంపు⇒ వచ్చే జనవరి నుంచి అమలుహోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా వారికి సీఎం రేవంత్‌రెడ్డి వరాలు ప్రకటించారు. ‘పోలీసు లతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డులకు భరోసా ఇస్తున్నా. రాష్ట్రంలో దాదాపు 14 వేల మందికి పైగా హోంగార్డులు పనిచేస్తున్నారు. డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా మీ సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నాం. రోజువారీ భత్యాన్ని రూ.921 నుంచి రూ.1,000కి పెంచుతున్నాం.అలాగే వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోంగార్డులు ప్రమాదవశాత్తు కానీ, సహజ మరణం కానీ పొందితే కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి మెరుగైన వైద్య సహాయాన్ని కూడా హోంగార్డులకు అందిస్తాం. ఈ నిర్ణయాలన్నీ 2025 జనవరి 1 నుంచి అమల్లోకి తెస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
టీడీపీ నేతలపై YSRCP ఇచ్చిన ఫిర్యాదులపై..
-
ఇవి మీకు కనిపించవా?.. పోలీసులపై నారాయణస్వామి ఆగ్రహం
-
దొంగ కేసులు.. పెయిడ్ ఆర్టిస్టులు.. పోలీసులపై ఆర్కే రోజా ఫైర్
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అమానుష కాండను కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడమే వారు చేసిన నేరం. వారిపై అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా ...వారిని అక్రమంగా నిర్బంధించి భౌతికంగా దాడులు చేస్తూ ...కసి తీరిన తరువాతే అరెస్ట్ చూపిస్తోంది. మానవ హక్కులను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ ...రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దమనకాండకు ప్రభుత్వ ముఖ్యనేతే ప్రధాన కుట్రదారు కాగా... కీలక పోలీసు అధికారులు పాత్రధారులు, పర్యవేక్షకులు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపోయారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం వారిలో కనిపిస్తోంది. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా కాలరాస్తున్న సర్కారు దమననీతిపై న్యాయపోరాటానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు తమ విద్యుక్తధర్మాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా తలాడిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దమనకాండను కొనసాగిస్తున్న పోలీసు అధికారులపైనా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. వీరికి పలువురు మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకారులు, పలు పౌరసంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే ‘పచ్చ’పాత పోలీసు అధికారులందరూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడడం తథ్యమని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయి. అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే... ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. అంటే ఈ అమానుష కాండను కొనసాగించేందుకు ప్రభుత్వ పెద్దలు రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని దీనినిబట్టి స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులను వారు సంతృప్తిచెందే స్థాయిలో భౌతికంగా హింసించారా లేదా అన్నది వీడియో కాల్ ద్వారా పర్యవేక్షిస్తుండటం ప్రభుత్వ కక్షకు పరాకాష్టగా నిలుస్తోంది. ఆ రాక్షసకాండ ఇలా సాగుతోంది... ఎన్ని కేసులు.. ఎక్కడికి తరలిస్తున్నారు? రాష్ట్రంలో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం ఎడాపెడా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఒక్కో యాక్టివిస్టుపై ఒకటికి మించిన కేసులు నమోదు చేయడమే కాకుండా... వేర్వేరు జిల్లాల్లో కేసులు నమోదు చేస్తోంది. వారిని పోలీసులు హఠాత్తుగా అదుపులోకి తీసుకుని తమతో పట్టుకుపోతున్నారు. ఏ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుందీ... ఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారన్న కనీస సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. దాంతో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాకబు చేస్తే అసలు తాము ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కరడుగట్టిన నేరస్తులా? అక్రమంగా అదుపులోకి తీసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులపై ప్రయోగించినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతికంగా హింసిస్తున్నారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని..లేకపోతే మరిన్ని రోజులు చిత్రవధ తప్పదని హెచ్చరిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిర్ధారణ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించామని పోలీసులు మాటలతో చెబితే ఉన్నతాధికారులు సంతృప్తి చెందడం లేదు. పోలీసు అధికారులు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఓ ఉన్నతాధికారికి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ తాము ఆశించినస్థాయిలో ప్రయోగించారా లేదా అన్నది ఆ ఉన్నతాధికారి వీడియో కాల్ ద్వారా పరిశీలిస్తారు. ఆయన సంతృప్తి చెందితే ఆ విషయాన్ని తన బిగ్ బాస్‌కు నివేదిస్తారు. ఆయన అనుమతి ఇచ్చిన తరువాతే... ఒకే ఇక చాలు... అరెస్ట్ చూపించండి అని ఆ ఉన్నతాధికారి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చెబుతారు.చిత్రహింసల తర్వాతే అరెస్ట్..ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినస్థాయిలో థర్డ్ డిగ్రీని ప్రయోగించారని నిర్ధారించుకున్న తరువాతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా మూడు రోజుల నుంచి వారం రోజులపాటు సాగుతోంది. కుట్రపూరిత, కక్ష పూరిత రాజకీయాలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా దుర్వినియోగం చేయలేదని పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులను గుండాల మాదిరిగా మార్చి రాజకీయ అరాచకం సాగిస్తుండటం విభ్రాంతికరమని మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో పోలీసు అధికారులు భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఇకపై టీజీ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖ సిబ్బంది, అధికారులు ధరించే యూనిఫాంకు సంబంధించిన.. పోలీస్ టోపీ, బెల్ట్, బ్యాడ్జీలపై టీఎస్‌కు బదులుగా టీజీ అని ఉండేలా లోగోలో మార్పు చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాడ్జీలపై టీఎస్పీ స్థానంలో టీజీపీ, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, టీఎస్ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ, టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండేలా మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను ఆదేశించారు. -
మహిళా పోలీసుల్ని అంగీకరించే పరిస్థితి లేదు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోకి మహిళలు రావడానికి వారి కుటుంబాలు అంగీకరించడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిస్తూ.. గత ప్రభుత్వంలో మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీస్ డ్రెస్ కూడా వేయించాలని చూశారన్నారు. దానిపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించారని చెప్పారు. వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో కొనసాగిస్తారా, మహిళా, శిశు సంక్షేమ శాఖలో కొసాగిస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికే అవగాహన లేకపోవడం వల్ల వారంతా మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు.విశాఖ మెట్రో ఎప్పుడుచింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం పనులు 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. త్వరగా పూర్తిచేయండని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ఎర్రకాలువ వరద వల్ల రైతులకు ఏటా నష్టం వాటిల్లుతోందని.. మరమ్మతులకు కనీసం రూ.50 కోట్లు కేటాయించమని అడిగితే ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ ప్రయోజనాలు వర్తించవుమినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన గత ప్రభుత్వం 3,939 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని విద్యా శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మిగిలిన 600 పోస్టుల భర్తీకి చర్చిస్తామన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు. వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని బుచ్చయ్య చౌదరి ప్రశ్నకు సమాధానంగా మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో హజ్ యాత్రికుల ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇచ్చేవారని.. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనూ ఇవ్వాలని ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మర్ కోరారు.‘సాక్షి’పై అక్కసుఅసెంబ్లీ వేదికగా మరోసారి సాక్షి పత్రికపై జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నోరుపారేసుకున్నారు. వైఎస్సార్సీపీ కరపత్రిక, అవినీతి పత్రిక అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నట్టు.. సాక్షి పత్రిక చదవడం ఆరోగ్యానికి హానికరం అని మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
పోలీసులపై పొన్నవోలు ఫైర్
-
అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్ట
‘‘మేము ఎలా పాలన సాగించినా ఎవరూ నోరెత్తకూడదు.. ఇది మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం.. తప్పు పట్టడానికి మీరెవరు? కాదు కూడదని మా నిర్ణయాలను ప్రశ్నిస్తే నాలుగు తగిలించడంతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి. సుప్రీంకోర్టు, హైకోర్టుల సంగతి మా లాయర్లు చూసుకుంటారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను కూడా వదిలి పెట్టం. మేం చెప్పినట్లు ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టడానికి పోలీసులున్నారు. ఆ విధంగా వాళ్లను ట్యూన్ చేసుకున్నాం. ఎవరైనా తోక జాడించి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చేస్తామో.. ఎలాంటి కేసులు పెడతామో మాకే తెలియదు’’ అన్నట్లు కూటమి సర్కారు గుడ్లురు ముతోంది. నియంతృత్వమే తమ చట్టం అని, రెడ్‌బుక్ తమ రాజ్యాంగమని స్పష్టం చేస్తోంది. తాలిబన్లు సైతం విస్తుపోయేలా వికటాట్టహాసం చేస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజ్యమేలుతోంది. పక్కన పేర్కొన్న దయనీయ సంఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉండటం ప్రజాస్వామ్య వాదులను విస్మయ పరుస్తోంది.సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వారిపైకి పోలీసులను ఉసిగొలుపుతోంది. రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు చట్టం, రాజ్యాంగం అనే వాటికి తిలోదకాలు వదిలారు. అధికార పారీ్టల నేతలు చెప్పిన వారందరిపై ఉన్నవీ లేనివీ కల్పించి ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరు పరచాలన్న చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, మైనర్లు అని కూడా చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా ఊళ్లపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. నిద్రిస్తున్న వారిని అపహరించుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పరు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి అడిగితే మాకేం తెలీదనే సమాధానం వస్తుంది. పోలీసు వాహనాల్లో కుక్కి.. కొడుతూ ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగితే లాఠీలే సమాధానమిస్తున్నాయి. మేం చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తే పోలీసుల బూట్లే మాట్లాడుతున్నాయి. ఒక్కొక్కరిపై రెండు మూడు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తిప్పుతున్నారు. మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 110కి పైగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. ఇవన్నీ బాధితుల తరఫున లాయర్లు, గ్రామ పెద్దలు నిలదీస్తేనే అధికారికంగా ప్రకటించినవి కావడం గమనార్హం. అరెస్టు చూపకుండా వేధిస్తున్న కేసులు వేలల్లో ఉన్నాయనడం అక్షర సత్యం. ఒక్కో కేసులో ఒకరు మొదలు 10–20 మందిని సైతం నిందితులుగా చేరుస్తూ వేధిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తున్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న ఆదేశాలు తమకు పట్టవన్నట్టు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాలు హెబియస్ కార్పస్ పిటీషన్లతో హైకోర్టును ఆశ్రయించినా సరే తమ నియంతృత్వాన్ని నిర్భీతిగా సమర్ధించుకోవడం దుర్మార్గం. ఇదీ చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యం. మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగం! సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల పోలీసులు మహిళ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించడం దారుణం. మూడు రోజుల పాటు ఆమెను, ఆమె భర్తను చిత్రహింసలకు గురిచేశారు. ‘నన్ను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. నా భర్త వెంకటరెడ్డినీ చిత్రహింసలకు గురిచేశారు. చిలకలూరిపేట సీఐ రమేష్ దుర్భాషలాడారు. నోరెత్తితే ఇష్టానుసారం కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వద్ద జొన్నవాడలోని రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లినప్పుడు మమ్మల్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సీఐ రమేష్ బృందం అదుపులోకి తీసుకుంది. చిలకలూరిపేట, ఒంగోలుకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు’ అని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. తుదకు ఆమె తరఫు వారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో శుక్రవారం సాయంత్రం కొత్త పేట పోలీసులు గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే విషయాన్ని ఆమె మెజిస్ట్రేట్ ఎదుటే చెప్పారు. పోలీసులు కొట్టడంతో అయిన గాయాలను సైతం చూపించారు. ఈమెపై ఏకంగా 6 అక్రమ కేసులు బనాయించారు. నా భర్తను చంపేస్తారేమో.. ‘సోషల్ మీడియా యాక్టివిస్టు అయిన నా భర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు చంపేస్తారేమోనని భయంగా ఉంది. రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంత వరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడం లేదు. ఐ టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లు మా ఆయన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విచారణలో కూడా ఈ విషయం తేలింది. అయినా ఇప్పుడు దీనిపై కుట్ర చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆయనేదో అంతర్జాతీయ టెర్రరిస్ట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని రవీందర్‌రెడ్డి భార్య కళ్యాణి శనివారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టగా నిలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళలను వేధించినట్లా? కూటమి ప్రభుత్వ పెద్దలు నివసిస్తున్న విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అరాచకాలు, దుర్మార్గాలకు అంతే లేకుండా పోయింది. ఓ పోస్టును సాకుగా చేసుకుని కూటమి నాయకుడొకరు తన పార్టీ కార్యకర్తలతో ఈ నెల 2వ తేదీన పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులిప్పించాడు. అదే రోజు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ 42 కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో 172 మందికి నోటీసులిచ్చారు. శుక్రవారం నాటికి మొత్తంగా 260 మందికి నోటీసులు ఇచ్చారు. కూటమి సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే.. అమ్మాయిలపై తప్పుడు పోస్టు పెట్టారని అభాండాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘నేను ఇటీవల ఓ వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన పోస్ట్‌ను చూశాను. ఈ మాత్రం దానికే నాకు సైబర్ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు’ అని గుంటూరుకు చెందిన ఆకుల మురళి అనే వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. ఇది నేరమట!శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈనెల 1వ తేదీన బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్ కోసం గంటలతరబడి వేచి ఉంటూ సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు వెంటనే ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదే విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామ ఉప సర్పంచ్ మడ్డు జస్వంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతని పాలిట ఇదే పాపమైపోయింది. పాలక పార్టీ పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన్ను భయపెట్టాలని కూడా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆయన ఇంట్లో లేడు. గంటల కొద్దీ అక్కడే ఉండి ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా వేధించారు. ఆ తర్వాత ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే జస్వంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ రోజు కార్తీక పూజ నిర్వహిస్తున్నామని, భోజనం చేసి వస్తానన్నా కూడా వదల్లేదు. ఫోన్‌ను కూడా లాగేసుకున్నారు. ఏం కేసు పెట్టారని అడిగినా అప్పుడు చెప్పలేదు. తర్వాత లాయర్ సాయంతో బయటకు వచ్చాడు. అయినా ఇప్పటికీ ఎప్పుడుపడితే అప్పుడు స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు చేసి పిలిపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. 192 బీఎన్ఎస్ సెక్షన్‌తో ఎఫ్ఐఆర్ (150/24) నమోదు చేశారు. శాంతిభద్రతలు నిల్.. వేధింపులు ఫుల్! వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వీటిని అరికట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 177 మంది హత్యకు గురయ్యారు. 500కుపైగా హత్యాయత్నాలు జరిగాయి. 2 వేలకుపైగా దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. అత్యాచార పర్వానికి అంతు లేకుండా పోయింది. ఇళ్లల్లో ఉండే చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్ధినులు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. అయినా శాంతిభద్రతలతో తమకు సంబంధం లేదన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలిక కిడ్నాప్‌కు గురికాగానే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి బతికుండేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడితే ఏ మేరకు శిక్ష వేశారో పాలకులే చెప్పాలి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. ఇలాంటి వారందరిపై ఏ చర్యలూ లేవు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టిన వారిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగినా ఇక్కడ మాత్రం ఏ చర్యలూ లేవు. అన్నా.. వాడిక ఆర్నెల్లు నడవలేడు⇒ సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారి ఆచూకీ తెలియనీయకుండా, కోర్టులోనూ హాజరు పరచకుండా ఊళ్లు.. ఊళ్లు తిప్పుతూ.. వారిని ఏ విధంగా వేధిస్తున్నారో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. ‘అన్నా.. మీరు చెప్పినట్లే వాడిని కుమ్మేశాను. ఏడాది.. కనీసం ఆర్నెల్లు వాడు నడవలేడు. ఆ తర్వాత కూడా వాడు కుంటుకుంటూ నడవాల్సిందే’ అని ఇటీవల ఓ ఎస్ఐ అధికార పార్టీ నేతకు చెప్పడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ⇒ అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సంజీవరెడ్డిని ఈ నెల 6వ తేదీ రాత్రి పుట్టపర్తి అర్బన్ సీఐ సునీత సిబ్బందితో వచ్చి ఇంటి నుంచి బలంవంతంగా లాక్కెళ్లింది. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆచూకీ తెలియడం లేదు. ⇒ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారనే కారణంతో విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వెంకటేష్, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్‌పై కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా తమకు ఊడిగం చేసే పోలీసులు ఎక్కడ ఉంటే అక్కడ అక్రమ కేసులు ఇష్టారాజ్యంగా నమోదు అవుతున్నాయి. ఇంకా వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు కసరత్తు సాగిస్తున్నారు.⇒ వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబీఎన్ వంటి ఎల్లో మీడియా ఈ అరాచకానికి కొమ్ము కాస్తుండటం దారుణం. నిబద్ధత కలిగిన ఇతర మీడియా సంస్థలు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బరితెగించి సాగిస్తున్న ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బాధితుల తరఫున న్యాయ పోరాటానికి దిగింది. చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వాన్ని నిలదీస్తోంది. -
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే.. అంతే!
-
అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం
సాక్షి అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు, అక్రమ నిర్బంధాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమ నిర్బంధాల విషయంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధానికి సంబంధించి రెండు పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ ఫుటేజీలను సంబంధిత మేజిస్ట్రేట్ల ఎదుట సీల్డ్ కవర్లలో అందచేయాలని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తుల అరెస్ట్ విషయంలో చట్ట నిబంధనలు పాటించి తీరాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పింది. లేని పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి తేవద్దని హెచ్చరించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛతో ముడిపడి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. చట్ట నిబంధనలు పాటించేలా పోలీసులను చైతన్య పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త తిరుపతి లోకేష్‌ను సోమవారం తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్భందించారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ఎక్కువ అయిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టును ఆశ్రయించిన బాధిత కుటుంబాలు..టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారంటూ పలువురిని పోలీసులు అక్రమంగా నిర్భంధంలోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల్లో 101 మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. తమవారిని పోలీసులు కోర్టు ముందు హాజరు పర్చకుండా అక్రమ నిర్బంధంలో ఉంచడంపై బాధిత కుటుంబాలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా నిర్భందించిన తమ కుటుంబ సభ్యులను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచేలా ఆదేశించాలంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది.పౌరుల స్వేచ్ఛను కాపాడతాం..విచారణ సందర్భంగా తిరుపతి లోకేష్ తరఫు న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ కుటుంబం పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న 411 మందికి నోటీసులు ఇచ్చారని నివేదించారు. వారిలో 120 మంది విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారని తెలిపారు. తిరుపతి లోకేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 5వతేదీన విశాఖ నుంచి విజయవాడ తరలించారన్నారు. లోకేష్ సోదరుడిని పిలిపించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ధర్మాసనానికి నివేదించారు. ప్రస్తుతం లోకేష్ జాడ తెలియడం లేదన్నారు. ఈ సమయంలో కోర్టులో ఉన్న విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జానకి రామయ్యతో ధర్మాసనం నేరుగా మాట్లాడింది. తిరుపతి లోకేష్ సోషల్ మీడియా ద్వారా ఓ గ్రూప్ నిర్వహిస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆయన కోర్టుకు చెప్పారు. దీనిపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశామన్నారు. ఫోన్ చేయడంతో తన బావతో కలిసి లోకేష్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారన్నారు. లోకేష్‌ని విచారించిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపామన్నారు. నేరానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలతో ఈ నెల 10న హాజరు కావాలని ఆయనకు సూచించినట్లు చెప్పారు. జానకి రామయ్య చెప్పిన వివరాలను రికార్డు చేసిన ధర్మాసనం.. సోమవారం ఉదయం 10:30 గంటలకు లోకేష్‌ను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది . ఈ నెల 4వతేదీ నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సీల్డ్ కవర్లో విజయవాడ మెజిస్ట్రేట్‌కు సమర్పించాలని ఆదేశించింది. అరెస్ట్ చేసిన 24 గంటలలోపు నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలను పాటించి తీరాలని లేదంటే తమ జోక్యం తప్పదని తేల్చి చెప్పింది. పౌరుల స్వేచ్ఛను కాపాడటం ఈ కోర్టు బాధ్యత అని స్పష్టం చేసింది. అంతకు ముందు పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ్త సోషల్ మీడియా ద్వారా కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. ఇలాంటి వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొనగా, దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చట్ట నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.టేకులపల్లి స్టేషన్ ఫుటేజీ కూడా..అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఆత్మకూరుకు చెందిన జింకల నాగరాజు అక్రమ నిర్భందంపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించించింది. టేకులపల్లి స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచి సంబంధిత మేజిస్ట్రేట్ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. -
Big Question: సర్కారు వారి అరాచకం.. లా అండ్ ఆర్డర్ రెడ్ బుక్ సేవలో పోలీసులు
-
పోలీసులకు ‘ఆంబిస్’ అస్త్రం!
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆంబిస్ (ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం)ను వాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన 60 మంది సిబ్బందికి రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో టీఓటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కమిషనరేట్లలో కలిపి ఐదు పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద ఆంబిస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవసరమైన సాఫ్ట్వేర్లను సైతం అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పారు. ఆంబిస్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయని, అవసరమైన సమాచారాన్ని నూతన సెర్చింగ్ పద్ధతుల్లో పొందేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించారు. ఏమిటీ ఆంబిస్? నేర దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలు, అర చేతిముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2017 నుంచి ఆఫిస్ (ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం) సాంకేతికతను వినియోగిస్తోంది. దీన్ని మరింత ఆధునీకరిస్తూ ఆంబిస్ (ఏఎంబీఐఎస్)ను అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ చట్టం–2022 ప్రకారం నేరస్థుల వేలి ముద్రలు, చేతి ముద్రలతోపాటు ఐరిష్ స్కాన్, ముఖ చిత్రాలు (ఫేషియల్ ఇమేజెస్), కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం సేకరించడం తప్పనిసరి చేశారు. ఇలా వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు తెలంగాణ పోలీసులు ఈ నూతన ఆంబిస్ సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ఆంబిస్ పూర్తిగా ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇది న్యూరల్ నెట్వర్క్ ఆధారిత ఫింగర్‌ప్రింట్ ఆల్గారిథమ్స్ ఆధారంగా నడుస్తుంది. నేరస్థులకు సంబంధించిన డేటాను విశ్లేషించడంలోనూ ఈ సాంకేతికత ఎంతో వేగంగా స్పందిస్తుంది. సమాచార సేకరణలో అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు నేరం జరిగిన స్థలంలో దొరికిన వేలిముద్రలను మాత్రమే పోల్చాలనుకుంటే అవి మాత్రమే పోల్చి ఫలితాన్ని ఈ సాంకేతికత ఇస్తుంది. గతంలో ఉన్న సాంకేతికతతో పోలిస్తే ఈ ఆంబిస్ సాంకేతికత కచ్చితత్వం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పోలీస్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ డేటాను సైతం అనుమానితుల ఫేషియల్ ఇమేజ్‌లతో పోల్చేందుకు ఇందులో వీలుంది. ఈ తరహా న్యూరల్ నెట్వర్క్ టెక్నాలజీని ప్రస్తుతం రష్యాలో మాత్రమే వినియోగిస్తున్నారు. రష్యా తర్వాత భారత్‌లో తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం గమనార్హం. -
వేధించకుంటే వేటే!
టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేయాలి. అక్రమ కేసులు పెట్టి వేధించాలి. థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి. రాజ్యాంగ హక్కులు, సుప్రీంకోర్టు తీర్పులు పట్టించుకోకూడదు. కాదు కూడదంటే వేటు తప్పదు. – ఇది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పాటిస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగ దుర్నీతిసాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధికార కూటమి పారీ్టల నేతలు చెప్పినట్లుగా పోలీసు వ్యవస్థ నడుచుకోవాలని, ఎవరైనా ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే శంకరగిరి మాన్యాలకు పంపుతామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడమే ఇందుకు నిదర్శనం. ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడును వైఎస్సార్ జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న హర్షవర్దన్ రాజును టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు యథేచ్ఛగా అక్రమాలకు తెగించారు. తాజాగా తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేసి, చిత్రహింసలకు గురి చేయాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 41 ఎ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటాంగానీ అక్రమంగా అరెస్ట్ చేయడం సాధ్యం కాదని ఎస్పీ వారితో చెప్పినట్టు తెలిసింది. దాంతో ఆయనపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహించారు. విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీనిని సాకుగా తీసుకున్న చంద్రబాబు.. వైఎస్సార్ జిల్లా ఎస్పీపై వేటు వేయడం ద్వారా ఐపీఎస్ అధికారులను లోబరుచుకోవచ్చన్న మైండ్‌గేమ్‌కు తెరలేపినట్లు సమాచారం. వెంటనే ఎస్పీని బదిలీ చేయడంతో పాటు టీడీపీ మాజీ ఎంపీకి సమీప బంధువైన కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్‌ను ప్రత్యేకంగా వైఎస్సార్ జిల్లాకు పంపారు. డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, స్టేషన్ హౌస్ అఫీసర్లకు ఒక స్థానంలో కనీసం రెండేళ్లపాటు విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని ‘ప్రకాశ్‌సింగ్ వెర్సస్ భారత ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పును తమకు వర్తింప చేయాలని డీజీపీ, సీఎస్‌లు కోరుతున్న నేపథ్యంలో హర్షవర్దన్‌రాజు విషయంలో పాటించక పోవడం గమనార్హం. ఈ విషయమై పోలీసువర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా, వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొండ్రెడ్డి పల్లెకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని జిల్లా పోలీసులు కడప తాలూకా స్టేషన్‌కు తీసుకుని వచ్చి ఓ కేసులో 41ఎ నోటీసు ఇచ్చి పంపించారు. అతన్ని అరెస్ట్ చేయలేదనే నెపంతో, ఇతర కారణాలను చూపిస్తూ జిల్లా ఎస్పీని బదిలీ చేశారు. చిన్నచౌక్ సీఐని సస్పెండ్ చేశారు. కడప తాలూకా సీఐపై కూడా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్నగరంపాలెం: రిమాండ్ ముద్దాయి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన ఘటనలో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ విధించిన గుంటూరు జిల్లా కోర్టు.. రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో అనిల్‌కుమార్‌ను ఏలూరు సమీపంలోని ఓ రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు ఎస్కార్ట్ సిబ్బంది తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఒక ఆర్ఎస్ఐతో పాటు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులిచ్చారు. -
రాజ్ పాకాలకు నోటీసులు
శంకర్పల్లి: మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో అనుమతి లేని పార్టీ నిర్వహణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. సోమవారం రాత్రి 11 గంటలకల్లా తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విషయంలో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను 48 గంటల్లో విచారణకు హాజరవుతానని పేర్కొంటూ న్యాయవాదుల ద్వారా పోలీసులకు లేఖ అందజేశారు. ఇంటికి అనుమతులు లేవన్న అధికారులు రాజ్ పాకాలకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే 691, 692 లలో శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో సుమారు 8 ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 1,500 గజాల విస్తీర్ణంలో జీ+1 ఇంటి నిర్మాణం చేపట్టారు. జన్వాడ గ్రామం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ఇంటికి శ్రీమాతే ప్రాపర్టీస్ పేరుతో 7– 90 ఇంటి నంబర్‌తో పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో పాల్గొన్నవారి విచారణ రాజ్ పాకాల ఇంట్లో పార్టీకి హాజరైన వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇప్పటికే ముగ్గురికి నోటీసులిచ్చి విచారించగా.. మరో ముగ్గురు స్వచ్ఛందంగా పీఎస్‌కు వచ్చి, వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. మిగతా 32 మందికి రెండు రోజుల్లో నోటీసులిచ్చి, విచారిస్తామని వెల్లడించారు. కేసుపై ఏసీపీ సమీక్ష రాజ్ పాకాల ఇంట్లో పార్టీ కేసును నార్సింగి ఏసీపీ రమణగౌడ్ పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఆయన స్టేషన్‌కు వచ్చి, కేసు దర్యాప్తు తీరు, ఇతర వివరాలను తెలుసుకున్నారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరి విచారణకు హాజరుకాకపోతే తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయన సూచనలు చేసినట్టు తెలిసింది. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 10 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బందిని మోకిల పీఎస్‌కు పంపించారు. ఫోన్ సీజ్‌లో ట్విస్ట్ ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్‌తోపాటు ఆయన ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్‌కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్‌ను ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ చర్యలు
-
హోంగార్డులపై ‘కారుణ్య’మేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో క్షేత్రస్థాయి విధుల్లో అత్యంత కీలకమైన హోంగార్డులు.. అరకొర జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నెలలో ఒక్కో తేదీన వేతనాలు వస్తున్నాయని.. ఒక్కోసారి సగం నెల గడిచినా జీతాలు అందని పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు. తమకు కనీస జీవన భద్రత లేదని, హోంగార్డు చనిపోతే కారుణ్య నియామకంగానీ, మరేదైనా తీరులోగాని వారి కుటుంబాలకు న్యాయం జరగడం లేదని చెప్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళన బాట పట్టాలనే యోచనతో ఉన్నామని అంటున్నారు. సీఎం హామీలు అమలు చేయాలంటూ..హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్ గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని హోంగార్డులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హోంగార్డుల వేతన సవరణతోపాటు సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారని చెప్తున్నారు. ఇక తాజాగా శంకుస్థాపన చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి.. హోంగార్డు నుంచి డీజీపీ వరకు అందరి పిల్లలు అందులో చదువుతారని పలుమార్లు పేర్కొన్నారు. అయితే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ జీవోలో మాత్రం హోంగార్డుల ప్రస్తావన లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి విధుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేసే తమకు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారని పోలీసు అమరవీరుల దినోత్సవం రోజు ఆశతో ఎదురుచూశామని, కానీ అలాంటి హామీ ఏదీ రాలేదని వాపోతున్నారు. యూనిఫాం అలవెన్స్, స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ సహా పలు కీలక హామీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచీ పెండింగ్‌లో ఉన్నాయని... కాంగ్రెస్ ప్రభు త్వంలోనైనా అవి పరిష్కారం అవుతాయన్న ఆశతో ఉన్నామని చెప్తున్నారు. కదలని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ ఫైల్.. హోంగార్డులను సైతం లాస్ట్ పేగ్రేడ్ కింద తీసుకుని, వారిని స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ (ఎస్పీఏ)గా మార్చాలని 2017లో ప్రతిపాదన సిద్ధం చేశారు. రిక్రూట్మెంట్లో లోటుపాట్లను సరిదిద్ది, వారిని పర్మినెంట్ చేసి దీన్ని అమలు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే పలు కారణాలతో ఇది పెండింగ్‌లో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13వేల మంది జనరల్ డ్యూటీ హోంగార్డులు, మరో 2,500 మంది వరకు ఓడీ (అదర్ డిపార్ట్మెంట్) హోంగార్డులు పనిచేస్తున్నారు. -
తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం
-
39 మంది సస్పెండ్.. పోలీసు శాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అందులో వివిధ బెటాలియన్లకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. టీజీఎస్పీ బెటాలియన్లలో ఆందోళనలకు నేతృత్వం వహించిన, ఇంటర్వ్యూలు ఇచ్చినవారిని గుర్తించి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అంతకుముందు టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలపై డీజీపీ జితేందర్ ప్రకటన విడుదల చేశారు. వారి సమస్యలను సానుభూతితో పరిశీలిస్తామని, సిబ్బంది యథావిధిగా విధుల్లో చేరాలని హామీ ఇస్తూనే.. క్రమశిక్షణ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. టీజీఎస్పీ సిబ్బంది పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించరాదని.. నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 39 మంది టీజీఎస్పీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిరసనలు, ఆందోళనలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, తదనుగుణంగా చర్యలు చేపడతామని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ విధానాలే.. ఉమ్మడి ఏపీలో టీజీఎస్పీ పోలీసు సిబ్బంది విధులకు అనుసరించిన విధివిధానాలే తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగుతున్నాయని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీస్ ఎంపిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులు కోరుకున్న విధంగా జరిగాయన్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు లేనివిధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవులు, అదనపు సరెండర్ లీవులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పండుగలు, సెలవుల్లో సిబ్బంది విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నామని ఆ ప్రకటనలో డీజీపీ వివరించారు. టీజీఎస్పీ సిబ్బందికి ఉన్నతాధికారుల కౌన్సెలింగ్.. టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనబాట పట్టడంతో పోలీస్ ఉన్నతాధికారులు వారికి పలు అంశాలపై కౌన్సెలింగ్ చేపట్టారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి? వారి సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలేమిటనే అంశాలను వివరిస్తున్నారు. ఈ మేరకు మొదటి, ఎనిమిదో బెటాలియన్ల సిబ్బందికి శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, టీజీఎస్పీ అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్లు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వరంగల్‌లో సీపీ వరంగల్, 12వ బెటాలియన్‌లో నల్లగొండ జిల్లా ఎస్పీ, సిరిసిల్లలో స్థానిక ఎస్పీ, డిచ్‌పల్లిలో కామారెడ్డి ఎస్పీలు సిబ్బందితో మాట్లాడారు. -
డ్రగ్స్ దందాలో టీవీ చానల్ అధినేత
సాక్షి, హైదరాబాద్: ఆయనో మీడియా అధినేత.. తండ్రి స్థాపించిన టీవీ చానల్ నిర్వహణ పగ్గాలు వారసత్వంగా పొందారు. గతంలోనే పలు వివాదాలు ఆయన్ను చుట్టుముట్టగా, ఇటీవల ఓ ‘సొసైటీ’ వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర వివాదాస్పదమైంది. తాజాగా ఆయనకు సంబంధించిన మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు, అనుమానితులతో సదరు న్యూస్ చానల్ యజమానికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 మంది డ్రగ్స్ వినియోగదారులు, అనుమానితులతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో పటిష్ట నిఘా వేసి ఉంచారు. కొన్నాళ్లుగా పరిశీలిస్తున్న పోలీసులు రాష్ట్ర పోలీసు విభాగం కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకప్పుడు ఏదైనా కేసులో దొరికిన డ్రగ్ పెడ్లర్ వద్దే దర్యాప్తు, విచారణ ఆగిపోయేది. తద్వారా మాదకద్రవ్యాల దందాకు కళ్లెం పడట్లేదని భావించిన పోలీసు విభాగం కొత్త పంథా అనుసరించడం మొదలెట్టింది. డ్రగ్స్ విక్రేతలు, ఖరీదు చేసే వారితో పాటు అనుమానితులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సైతం సమకూర్చుకుంది. ఏదైనా ఓ కేసులో డ్రగ్ సప్లయర్, పెడ్లర్, కన్జ్యూమర్లతో పాటు వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను ఆద్యంతం పరిశీలిస్తోంది. ఆయా వివరాలతో ప్రత్యేకంగా డేటాబేస్ సైతం రూపొందిస్తోంది. దాన్ని కేంద్రం ఆ«దీనంలోని క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ అండ్ ట్రాకింగ్ సిస్టంతో (సీసీటీఎన్ఎస్) అనుసంధానించింది. ఓ కేసు దర్యాప్తులో దొరికిన తీగ పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్ వినియోగదారుడికి సంబంధించిన కాల్‌డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరికొంత లోతుగా ఆరా తీశారు. దీంతో ఆయనకు ఈ డ్రగ్ వినియోగదారుడితో పాటు మరో రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న 14 మందితో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో డ్రగ్స్ వినియోగదారులతో పాటు ఆ కేసుల్లో అనుమానితులు సైతం ఉన్నారు. కొందరితో చాలా కాలంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారని తెలిసింది. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు సైతం ఉండటం గమనార్హం. కదలికలపై కన్ను డ్రగ్స్ దందా చేస్తున్న వారితో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఉన్నత కుటుంబాల్లో ఈ జాఢ్యం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఈ వర్గాల్లో పెరిగిన డిమాండ్‌తోనే సింథటిక్ డ్రగ్స్ దందా జోరందుకుంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఇటీవలి కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ మీడియా సంస్థ అధినేతకే మాదకద్రవ్యాల వినియోగదారుడు, ఆ కేసుల్లో అనుమానితులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు ఆ జాబితాలోని వారిపై నిఘా ఉంచడంతో పాటు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 2011 నుంచి సంబంధాలు మీడియా ఛానల్ అధినేతకు, మాదకద్రవ్యాల కేసుల్లో అనుమానితులు, వినియోగదారులుగా ఉన్న వారి మధ్య జరిగిన సంప్రదింపులు భారీ స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మందితో 2,500 కాల్స్ ఉన్నట్లు తెలిసింది. వీటిలో అత్యధికం ఇన్కమింగ్ కాల్స్ కాగా ఎస్సెమ్మెస్‌ల్లో మాత్రం ఎక్కువగా ఔట్ గోయింగ్ ఉన్నాయి. వీరిలో కొందరితో ఆయన 2011 నుంచి సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం. వారి మధ్య వందల నిమిషాల సేపు సంప్రదింపులు జరిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండటంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. -
ఉన్మాదంతో దాడులు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కొందరు ఉన్మాదం, భావోద్వేగంతో మందిరాలు, మజీద్‌లపై దాడులు చేస్తూ.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ గుడి సంఘటన సహా ఇటీవల జరిగిన మరికొన్ని ఘటనలు ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరా లకు పాల్పడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా సమాజానికి చెడు చేసేవారి విషయంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ఎంతో తెలివైనదని, మత విద్వేషాలను అరికట్టడంలో ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని చెప్పారు. ‘పోలీస్ అమరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే)’సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసు అమరుల స్మారకం వద్ద నివాళులు అరి్పంచారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రజల భద్రత కోసం ఉగ్రవాదులు, మావోయిస్టుల చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకం. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ఏ చిన్న తప్పు జరిగినా ప్రభుత్వం, పోలీసుల ప్రతిష్ట పోతుంది. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. పోలీసులపై ప్రజల్లో గౌరవం పెరిగేలా పనిచేయాలి. ఒకరి దగ్గర చేయిచాచే పరిస్థితి ఉండకూడదు. ఖద్దరు, ఖాకీలను సమాజం నిశితంగా గమనిస్తుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునేలా నడుచుకోవాలి..’’ అని సీఎం రేవంత్ సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠినంగా ఉంటాం సరికొత్త పంథాలో జరుగుతున్న సైబర్ నేరాలు, యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలని, బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని పోలీసులకు సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిబ్బందిని, కృత్రిమ మేధ (ఏఐ)ను వాడుకోవాలని డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసు అమరులపై రాసిన ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లతో కలిసి సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల వద్దకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ఒక్కరిని పలకరించారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఐడీ డీజీ శిఖాగోయల్, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరులకు భారీగా ఎక్స్‌గ్రేషియా.. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా అమరులైన పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.కోటి.. ఎస్సై, సీఐలకు రూ.1.25 కోట్లు, డీఎస్పీ, ఏఎస్పీలకు రూ.1.50 కోట్లు, ఎస్పీ స్థాయి నుంచి ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యానికి గురైన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలకు రూ.50 లక్షలు, ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ వరకు రూ.60 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. ఇక తీవ్రంగా గాయపడిన వారిలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్పీ వరకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇస్తామని.. ఎస్పీ, ఆపై ర్యాంకు అధికారులు తీవ్రంగా గాయపడితే రూ.12 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇటీవల మృతి చెందిన ఐపీఎస్ రాజీవ్‌రతన్ కుమారుడికి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్‌గా, కమాండెంట్ మురళి కుమారుడికి డిప్యూటీ ఎమ్మార్వోగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. పోలీస్ అమరుడు ఆది ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతిచెందిన గ్రేహౌండ్స్ జూనియర్ కమెండో ఆది ప్రవీణ్ కుటుంబాన్ని గోషామహల్ స్టేడియం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆది ప్రవీణ్ భార్య రాథోడ్ లత, కుమారులు ఆది హర్ష, ఆది వివాన్లకు పోలీసు స్మారక చిహ్నం జ్ఞాపికను అందించారు. ఆది ప్రవీణ్ భార్య లతకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియా పెంపుపై సీఎంకు ధన్యవాదాలు పోలీసు అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇవ్వడం, పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. -
ప్రజలు – పోలీసుల బంధం బలపడాలి
1959 అక్టోబర్ 21వ తేదీన భారత–చైనా సరిహద్దులోని ఆక్సాయిచిన్ ప్రాంతంలో పదిమంది కేంద్ర పోలీసు రిజర్వు దళానికి చెందిన జవానులు విధినిర్వహణలో వీర మరణం పొందారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి సంఘటన అది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ’పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని’ పాటిస్తున్నాం.ఈనాడు అనేక కారణాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది. సమ్మెలు, ఆందోళనలు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం, మత సంఘర్షణలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వం తరఫున శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. బలవంతుల నుండి బలహీనులకు పోలీసులు రక్షణ కల్పించాలి. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించాలి. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతలకు అవసరమైన చర్యలు గైకొనేట ప్పుడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. మిగతా ప్రభుత్వ శాఖలకూ పోలీసు శాఖకూ మధ్య పనితీరులో చాలా భేదం ఉంది. పోలీసులు అవసరమైతే అవిశ్రాంతంగా శాంతి భద్రతల కోసం 24 గంటలూ పనిచేయాలి. పండుగలు వచ్చినప్పుడు అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ, పోలీసులు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితి! సమయానికి ఆహారం, నిద్ర లేని కారణంగా వారి ఆరోగ్యంపై దాని దుష్ప్రభావం పడుతుంది.1861 కంటే ముందు మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం లేదు. సైనికులే శాంతి భద్రతలను పరిరక్షించేవారు. సిపాయిల తిరుగు బాటు అనంతరం 1861 పోలీసు యాక్టు ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విభాగాన్ని ఆంగ్లేయ పాలకులు ఏర్పాటు చేశారు. 1902లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఆంగ్లేయ పాలకులు స్వతంత్ర సము పార్జన కోసం పోరాడుతున్న భారతీయులను అణచి వేయడం కోసం, భారతీయుల హక్కులను హరించడం కోసం పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రా నంతరం శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ జాబి తాలో చేర్చడం వలన పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది. పోలీసుల పనితీరుపై ఈ నాటికీ ప్రజలకు సదభి ప్రాయం లేదు. పోలీసులకు కూడా తాము ప్రజల కోసం నిరంతరం కష్టపడినా ప్రజల నుండి రావలసిన సహకారం, ఆదరణ లభించడం లేదన్న అభిప్రాయముంది. పోలీసు ప్రజాసంబంధాలు బాగుపడాలంటే ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు సరియైన సమయంలో సరియైన రీతిలో స్పందించాలి. కొన్ని సందర్భాలలో ఫిర్యాదు దారులు చేసిన ఫిర్యాదుల పరిష్కారం పోలీసుల పరిధిలో ఉండక పోవచ్చు. అటువంటప్పుడు వారు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో వివరించాలి. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించాలి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా 2006 సెప్టెంబర్ 22న సుప్రీం కోర్టు పోలీసుల పనితీరుకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. అందులో ముఖ్యమైనవి: 1) కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రస్థాయి భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. భద్రతా మండలి శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను సమీక్షించి అవసరమైన చర్యలు గైకొనాలి. 2) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థాపక బోర్డును ఏర్పాటు చేయాలి. 3) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర/జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల అథారిటీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఆ పై స్థాయి అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలి. 4) డీజీపీ నియామకం కోసం ముగ్గురు సీని యర్ ఐపీఎస్ అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఒక జాబి తాను రూపొందించాలి. అందులో నుండి ఒకరిని వారి యోగ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. ఈ రకంగా నియమించబడ్డ వారు వారి పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండు సంవత్సరాలు ఆ పద విలో కొనసాగాలి. 5) పోలీసు వ్యవస్థలో కార్యాచరణ విధులు నిర్వహించే ఐజీపీ, డీఐజీ, ఎస్పీల పదవీ కాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. 6) పోలీసు శాఖలో శాంతి భద్రతల విధులను, విచారణ (ఇన్వెస్టిగేషన్) విధులను వేరు చేయాలి. పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేయాలంటే ఈ మార్గదర్శకాలను అమలుచేయాలి. – డా. పి. మోహన్‌రావు విశ్రాంత ప్రొఫెసర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ హైదరాబాద్(రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం) -
మావోయిస్టు పార్టీ అగ్రనేత సుజాత అరెస్టు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా అలియాస్ కల్పన అలియాస్ ఝాన్సీ అలియాస్ పద్మను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67 ఏళ్ల సుజాత వైద్య చికిత్స నిమిత్తం బస్తర్ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పక్కాగా అందిన సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. పోలీసు అధికారులు మాత్రం ఈ విషయం ధ్రువీకరించడం లేదు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అదంతా మీడియాలో వస్తున్న ప్రచారమని చెబుతున్నారు. దీంతో సుజాత నిజంగానే అరెస్టయ్యారా? లేక లొంగిపోయారా? అనే అంశంపై స్పష్టత కరువైంది. ఈమెపై కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది. లొంగుబాటుకు ప్రయత్నాలు? సుజాత వయోభారంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఇటీవల దండకారణ్యం, అబూజ్‌మఢ్ అడవుల్లో పోలీసులు, భద్రతా దళాల నిర్బంధం పెరిగిపోయింది. ఇంకోవైపు వయోభారం, అనారోగ్యం సమస్యలతో సుజాత ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం తెలంగాణలోకి వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండురోజుల కిందటే సుజాతకు సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు అందినట్టు సమాచారం. కిషన్జీతో వివాహం? మహబూబ్‌నగర్‌కు చెందిన సుజాత డిగ్రీ చేయడానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో పరిచయం అయింది. క్రమంగా విప్లవ భావాల వైపు ఆకర్షితురాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా విప్లవ బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళలు ఇప్పటికే వివిధ ఎన్కౌంటర్లలో చనిపోయారు. సుజాత దాదాపు 43 ఏళ్లు నక్సలైట్/మావోయిస్టు పార్టీల్లో పని చేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీతో సుజాతకు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్‌జీ పదిహేనేళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి చిదంబరానికి నేరుగా సవాల్ విసిరిన మావోయిస్టుగా సంచలనం సృష్టించారు. పదమూడేళ్ల కిందట ఎన్కౌంటర్లో చనిపోయారు. -
నగరంపై పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: సాధారణ పరిస్థితుల్లోనే గణేశ్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక ఊరేగింపు, నిమజ్జనాలను సజావుగా పూర్తి చేయడం నగర పోలీసులకు పెద్ద సవాలు. అలాంటిది ఈసారి మంగళవారం ఒకేరోజు.. హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు కీలక చెరువుల్లో నిమజ్జనాలు, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం జరగనుండటంతో పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్థాయిలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రతి ఏడాదీ సామూహిక ఊరేగింపు, నిమజ్జనం నేపథ్యంలో ఉత్తరాది సహా వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రముఖులు నగరానికి వస్తుంటారు. వీరిలో ఆర్ఎస్ఎస్ సహా వివిధ సంస్థలకు చెందిన వారు ఉంటారు. చార్మినార్, ఎంజే మార్కెట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో వీరి ప్రసంగాలు ఉంటాయి. దీంతో పోలీసులు ఆయాచోట్ల అదనంగా జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పాతబస్తీ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ప్రధాన రహదారి కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి. దీనికి తోడు ఈసారి సెపె్టంబర్ 17 పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. దీనికి ముందు ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఈ రెండు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ చిక్కులు మరింత పెరుగుతాయని భావిస్తున్న పోలీసు అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయనతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి కూడా హాజరుకానున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ క్యాడర్ పరేడ్ గ్రౌండ్స్‌కు తరలిరానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పోలీసు అధికారులు..ఆయా కార్యక్రమాల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. సోమవారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అధికారులు విధుల్లో ఉండనున్నారు. అవసరమైన స్థాయిలో అదనపు బలగాలను రంగంలోకి దింపి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, టీజీఎస్ఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లతో పాటు కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సివిల్, సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సున్నిత, అనుమానిత ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులతో ప్రత్యేక గస్తీ, నిఘా ఏర్పాటు చేస్తున్నారు. పాతబస్తీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం అర్ధరాత్రి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. నిమజ్జనం బుధవారం ఉదయం వరకు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తుండగా, గురువారం నగరంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉండటంతో దానికీ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు. -
చిన్నారి అంతులేని ధైర్యం : కన్నీటి పర్యంతమైన పోలీస్ ఆఫీసర్
చిన్న వయసులో అరుదైన కేన్సర్‌తో పోరాడుతూ తన కల నెరవేర్చుకోవాలని ఆశపడింది టెక్సాస్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి అబిగైల్ అరియాస్. ఆరేళ్ల వయసులో ఏళ్ల గౌరవ పోలీసు అధికారిగా ప్రమాణం చేస్తూ అక్కడున్నవారందరి గుండెల్ని బరువెక్కించింది. అంతేకాదు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న టెక్సాస్‌లోని ఫ్రీ పోర్ట్ అధికారి కంటతడి పెట్టిన వీడియో సంచలనంగా మారింది. అసలు స్టోరీ ఏంటంటే.2012, జూన్ 28న రూబెన్ , ఇలీన్ అరియాస్లకు అబిగైల్ అరియాస్ జన్మించింది. అబిగైల్‌కు ఏతాన్కు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఎంతో సంతోషంగా జీవితం కొనసాగుతున్న తరుణంలో 2017లో, అరియాస్కు ఫోర్త్ స్టేజ్ విల్మ్స్ ట్యూమర్ అనే అరుదైన కిడ్నీ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇలాంటి కేన్సర్‌లో పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. చికిత్సలో భాగంగా ఆ చిన్నారి ఒకటీ రెండూ కాదు, ఏకంగా 90 రౌండ్ల కీమోథెరపీలను, దాని సైడ్ ఎఫెక్ట్స్‌ను ధైర్యంగా కనిపించింది. కానీ ఆరు నెలలకే కేన్సర్మళ్లీ తిరగ బెట్టింది. 2018లో ఊపిరితిత్తులకు పాకింది. చివరకు ఈ మహమ్మారి ముందు అబిగైల్ అరియాస్ ధైర్యం ఓడిపోయింది. 2019, నవంబరులో ఆమె కన్నుమూసింది. కానీ చనిపోయే సమయంలో కూడా అంతే నిబ్బరంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపర్చింది. చాలా చిన్నవయసులో అంతటి నిబ్బరాన్నిచూపించిన ఆమె మరణంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గఅయితే చనిపోవడానికి ముందు తన కలను సాకారం చేసుకునే క్రమంలో 2019 ఫిబ్రవరిలో అబిగైల్ ఫిబ్రవరిలో గౌరవ ఫ్రీపోర్ట్ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసింది. అద్భుతమైన చిరువ్వుతో మొత్తం డిపార్ట్‌మెంట్‌నే ఆకట్టుకుంది. ముఖ్యంగా పోలీస్ యూనిఫాం ధరించి అరియాస్ 758 పోలీస్‌ఆఫీసర్‌గా ధైర్యంగా తన సంఘాన్ని రక్షిస్తానని ,సేవ చేస్తానని వాగ్దానం చేసింది. ఈ సందర్భంగా ఫ్రీపోర్ట్ పోలీస్ చీఫ్ రేమండ్ గారివే కన్నీటి పర్యంతమైనారు. ఆమె జ్ఞాపకాలను శాశ్వతంగా పదిలపర్చుకున్నారు.A police chief in Texas was brought to tears when he swore in a 6-year-old girl as an honorary officer. She has an incurable cancer, and wants to become a cop so she can fight the "bad guys in her body" 💖 pic.twitter.com/Muc2moj0l6— Kevin W. (@Brink_Thinker) August 29, 2024 ఆమె మనోధైర్యం, జీవితం పట్ల ఆమెకున్న స్ఫూర్తి ఫ్రీపోర్ట్ నుంచి అమెరికాలోని పోలీసు డిపార్ట్మెంట్లకు దాకా చేరింది. ఆమె కోసం ప్రార్థనలు చేశారు. పాటలు పాడారు. వరల్డ్ సిరీస్ గేమ్ 1కి ముందు ఆమె హ్యూస్టన్ ఆస్ట్రోస్ స్టార్ జోస్ అల్టువేని కలుసుకుంది. ఆమె చనిపోయిన తరువాత పోలీస్ చీఫ్ రేమండ్ గారివే సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఆఫీసర్ 758 కేన్సర్ ఫైడ్ పౌండేషన్ కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోరికలను తీర్చేందుకు కృషి చేస్తోంది. -
పేరులో చిన్న.. అవినీతి మిన్న
ఆయనెక్కడ పనిచేసినా అవినీతిలో మునిగితేలుతారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తారు. స్టేషన్‌కొచ్చే బాధితుల బాధలు విని సాంత్వన చేకూర్చడం మాని, ఆ సమస్య పరిష్కరిస్తే తనకెంత ముట్టజెబుతారో అడుగుతారు. విసుగెత్తిన ఓ బాధితుడు గతంలో ఏసీబీ అధికారులకు సమాచారమిస్తే.. చివరి నిమిషంలో వారికి చిక్కకుండా ఉడాయించారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చి సస్పెన్షన్‌కు గురయ్యారు. అవినీతికి కేరాఫ్‌గా చెప్పుకునే అలాంటి వ్యక్తి నేడు కూటమి ప్రభుత్వంలో ఓ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకుని పోస్టింగ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఖాకీ వనంలో కలుపు మొక్కగా పేరుగాంచిన పోలీసు అధికారి చిన్నగౌస్కు మళ్లీ పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అత్యంత అవినీతిపరుడిగా ముద్రవేసుకున్న చిన్న గౌస్.. అధికారులను మేనేజ్ చేయడంలోనూ, ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా లోపాయికారీగా వ్యవహరించడంలోనూ అత్యంత నేర్పరి అని పేరుంది. ఎమ్మెల్యే, మంత్రుల అండతో పోలీసు డిపార్ట్మెంట్లోని పెద్దలను కూడా లెక్కచేయరనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏ స్టేషన్లో పనిచేసినా వివాదాస్పద పోలీసుగా, అవినీతిపరుడిగా ముద్రపడటం గమనార్హం. గతంలో సస్పెండ్ అయిన ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చి తమకు అనుకూలంగా పనిచేయించుకోవాలని నేడు అమాత్యులు, టీడీపీ నాయకులు భావిస్తున్నారు.రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే సమయంలో.. గతంలో రామగిరి పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేసిన చిన్నగౌస్.. ఓ కేసులో అవినీతికి సంబంధించి ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారనే సమయంలో జంప్ అయ్యారు. వరకట్న వేధింపుల కేసులో వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసి చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో రామగిరి ఎస్ఐ, సీఐ చిన్నగౌస్ ప్రధాన నిందితులు. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎస్ఐ పట్టుబడ్డారు గానీ చిన్నగౌస్ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత ఆయన్ను అప్పటి ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇప్పటివరకూ సస్పెన్షన్ ఎత్తేయలేదు. నేడు ప్రభుత్వం మారడంతో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఉరవకొండ సీఐగా వచ్చేందుకు టీడీపీ నేతలను ఆశ్రయించినట్టు సమాచారం. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా వచ్చి.. వాస్తవానికి చిన్నగౌస్ సివిల్ పోలీస్ విభాగానికి చెందిన వారు కాదు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత మినిస్టీరియల్ కోటాలో భాగంగా సివిల్ పోలీస్ విభాగంలోకి చేరారు. కంబదూరు మొదలుకొని పలు స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. ఎక్కడ పనిచేసినా వివాదం సృష్టించడం, సెటిల్ మెంట్లు చేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య అని పోలీసు విభాగంలో చెప్పుకుంటారు. రాజకీయ నేతలకు వంతపాడి, వారితో అంటకాగుతూ వారి ప్రత్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంలో గౌస్‌కు మించిన వారు మరొకరు లేరనే పేరుంది. అలాంటి వ్యక్తికి నేడు సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని చూస్తుండటం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
పోలీసుల పనితీరులో మార్పు రావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు కావాలని చెప్పారు. హోం శాఖ వ్యవహారాలపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగును డ్రోన్ల ద్వారా గుర్తించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వచ్చే నెలలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ర్యాలీలు చేపట్టాలని ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో ఓ సైబర్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రేహౌండ్స్ సెంటర్, ఏపీ పోలీసు అకాడమీ, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సెంటర్, ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి నిధులను రాబట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ ఆధునీకరణకు రూ.61 కోట్లు విడుదల చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించారు. అనంతరం హోం మంత్రి అనిత మాట్లాడుతూ నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళా కళాశాలలు, వైద్య కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. పోలీసు శాఖకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు. కన్నయ్యనాయుడికి సత్కారం కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చిన సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడును సీఎం చంద్రబాబు సత్కరించారు. వెలగపూడిలోని సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబును బుధవారం కన్నయ్యనాయుడు కలిశారు. వరద ఉద్ధృతిలోనూ తాత్కాలిక గేటు అమర్చి.. నీటి వృథాకు అడ్డుకట్ట వేసిన కన్నయ్యనాయుడును సీఎం చంద్రబాబు శాలువా కప్పి సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను సమకూర్చుకోండిఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలుపై కేంద్రం ఇస్తున్న సబ్సీడీలను వినియోగించుకుని 1,253 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఇప్పటికే ప్రతిపాదించిన 1,489 డీజిల్ బస్సులనూ సమకూర్చుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రవాణా శాఖపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్‌లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలని సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే చార్జింగ్ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలన్నారు. -
పోలీసు శాఖలో ‘రెడ్‌బుక్’ రూల్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు శాఖలో మంత్రి నారా లోకేశ్ ‘రెడ్‌బుక్’ రాజ్యమేలుతోంది. కూటమి ప్రభుత్వం పోలీసు అధికారుల బదిలీలను ‘రెడ్‌బుక్’ను అనుసరించి కక్షపూరిత వైఖరితోనే చేపడుతోంది. సీఐ నుంచి ఐపీఎస్‌ల వరకు అధికారులపై వేధింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే 24 మంది ఐపీఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిన సందర్భం లేదు. ఇదే అత్యంత వివాదాస్పద రీతిలో డీఎస్పీలను బదిలీ చేసింది. బుధవారం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఏకంగా 57 మంది డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం గమనార్హం. వీరందరినీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష పూరిత ధోరణికి ఇది మరో నిదర్శనమని స్పష్టమవుతోంది. తుళ్లూరు డీఎస్పీ ఇ. అశోక్ కుమార్ గౌడ్, రాజంపేట డీఎస్పీ చైతన్యను మంగళవారం బదిలీ చేసి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశించింది. తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ బుధవారం రిటైర్ అయ్యారు. ఇలా రిటైర్మెంట్కు ఒక రోజు ముందు బదిలీ చేయడం, మరో చోట పోస్టింగ్ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించడం నిబంధనలకు విరుద్ధం. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ డీజీపీ ద్వారాకా తిరుమలరావును కలిసి తన అసంతృప్తిని తెలియజేసినట్లు సమాచారం. పోలీసు అధికారుల పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిపై పోలీసువర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. -
సీటుకు నోటు! టీడీపీ నేతల వసూళ్ల పర్వం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ పెద్దలు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే పచ్చముఠాలు ఇసుక దోపిడీ నుంచి భూ దందాలతో బరి తెగిస్తున్నాయి. అంతటితో సంతృప్తి చెందకుండా ఇది బదిలీల సీజన్ కావడంతో అందులోనూ సొమ్ము చేసుకుంటున్నాయి. వేలం పాటల తరహాలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సాగిపోతోంది. బదిలీలలో పైరవీలు నడుస్తుండడంతో అధికారులంతా అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేశ్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ, మహిళలపై అఘాయిత్యాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితి దారుణంగా ఉండగా మరోపక్క అధికార పార్టీ నేతలు బదిలీలలో అందినకాడికి వసూలు చేసుకుంటున్నారు! ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో బదిలీలను అవకాశంగా మార్చుకుని వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఉద్యోగుల బదిలీలు జరుగుతుండటంతో హోదాను బట్టి రేటు నిర్ణయించి వసూళ్లకు దిగారు. తమ్ముడు తమ్ముడే..! పేకాట పేకాటే! అన్నట్లుగా తమకు కొమ్ము కాసే ఖాకీలను నియమించుకోవడంతోపాటు పోలీస్ స్టేషన్లకు అందే నెలవారీ మామూళ్లపైనా కన్నేశారు. ఇకపై నేరుగా తమకే ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. రూ.కోట్లలో బేరసారాలు..కొత్త సర్కారు కొలువుదీరిన వెంటనే బదిలీలపై కూటమి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమకు అనుకూలంగా వ్యవహరించే వారికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించాలన్నా, కోరుకున్న చోటకు పోస్టింగ్ ఇవ్వాలన్నా అధికారి స్థాయి, పరిధిని బట్టి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీవోల నుంచి ఎమ్మార్వోల దాకా ఎస్ఐ నుంచి సీఐ దాకా రేట్లు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. తిరుపతి ఆర్డీవో పోస్టు కోసం ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి ఇస్తామంటూ అధికార పార్టీ నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీర్ఘకాలం జిల్లాలో పనిచేసిన ఓ అధికారి రూ.3 కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ తహశీల్దార్ తిరుపతి రూరల్ ఎమ్మార్వో పోస్టు కోసం భారీ మొత్తం ఇస్తానంటూ అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. కొమ్ము కాయాల్సిందే...!కూటమి నేతలకు కొమ్ము కాయడంతోపాటు మామూళ్లు అందించే ఖాకీలపై కన్నేసి ఉంచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ సీఐ పోస్టు కోసం స్థానిక ఎమ్మెల్యే రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావటంతో గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించేందుకు సైతం రేట్లు నిర్ణయించడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ⇒ కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కోసం ఓ సీఐ రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకోగా ప్రస్తుతం రూ.10 లక్షలు ఇచ్చారు. లెటర్, డీవో (డ్యూటీ ఆర్డర్) రాగానే మిగతాది చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ సర్కిల్‌కు భారీ ఆదాయం ఉంది. కర్నూలు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్‌తో పాటు మట్కా, పేకాట, రేషన్ బియ్యం అక్రమ రవాణా తదితర వ్యవహారాలతో పాటు నిత్యం స్టేషన్లో పంచాయతీలు జరుగుతుంటాయి. దీంతో డబ్బులు కట్టినా ఇక్కడ సంపాదనకు ఢోకా లేదనే భరోసాతో ఆఫర్ ఇచ్చారు. ⇒ ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ కోసం ఓ సీఐ రూ.20 లక్షలు స్థానిక నేతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆదోనిలో పని చేసిన ఆయన ప్రస్తుతం లూప్లైన్లో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆయనకు లెటర్ ఇవ్వగా త్రిసభ్య కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇక ఎమ్మిగనూరు టౌన్ సర్కిల్‌కు కూడా రూ.20 లక్షలకు స్థానిక నేతతో బేరం కుదిరినట్లు సమాచారం. ⇒ నంద్యాలలో ఆర్డీవో, తహసీల్దార్ కుర్చీ కోసం ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. నంద్యాల లోని రెవెన్యూ శాఖ అధికారి కుర్చీ కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పని చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో డివిజన్ స్థాయి పోస్టు కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు చెల్లించేందుకు పలువురు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో డీఎస్పీ పోస్టు కోసం రూ.10 లక్షలు, చాగలమర్రి ఎస్ఐ పోస్టుకు రూ.5 లక్షల చొప్పున స్థానిక ప్రజాప్రతినిధి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ⇒ కాకినాడ జిల్లాలో కాకినాడ సహా ప్రధాన సర్కిళ్లలో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరింది. ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ డివిజన్లోని సర్కిల్స్‌లో నియోజక వర్గ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉండగా పిఠాపురం సమీప సర్కిల్స్‌లో స్థానిక నేతల అనుచరుల హవా రాజ్యమేలుతోంది. గతంలో పలు వివాదాలు మూటగట్టుకుని బదిలీపై పొరుగు సర్కిల్స్‌కు వెళ్లిన ఇన్స్పెక్టర్లు డబ్బు కట్టలతో నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం కాకినాడ టూ టౌన్ నుంచి బదిలీపై వెళ్లిన ఓ సీఐ లక్షలు సమర్పించైనా తిరిగి వచ్చేయాలనే పట్టుదలతో నియోజకవర్గ నేతతో సంప్రదింపులు జరుపుతున్నారు. జిల్లాలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు బదిలీల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి రూ.30 నుంచి రూ.40 లక్షలు ఇచ్చుకునేలా బేరసారాలు జరుగుతున్నాయి. పలువురు పంచాయతీ సెక్రటరీలు ప్రస్తుతం ఉన్న మండలంలోనే కొనసాగేందుకు మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఓ మహిళా అధికారి కాకినాడ జిల్లాలో అదే పోస్టులో కొనసాగేందుకు ఓ ప్రజాప్రతినిధికి రూ.20 లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. జిల్లా పరిషత్‌లో ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పని చేసిన ఒక అధికారి తిరిగి అదే పోస్టు కోసం రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు!⇒ అనంతపురంలో ఆదాయం బాగున్న ఓ పోలీస్‌స్టేషన్‌కు సీఐగా వచ్చేందుకు ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరో డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రూ.5 లక్షల దాకా ఇస్తానని చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురం జిల్లాకే చెందిన ఓ అధికారి పుట్టపర్తి బదిలీ అయ్యేందుకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. పరిటాల కుటుంబానికి సన్నిహితుడైన ఆయన పుట్టపర్తిలో ఓ జిల్లా శాఖ ఇన్‌చార్జీగా వచ్చేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. రూ.15 లక్షలు ఇస్తానని పరిటాల కుటుంబం ద్వారా ఓ మంత్రిని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. కందికుంట వెంకట ప్రసాద్, పరిటాల సునీతకు తొత్తుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కదిరి లేదా ధర్మవరం సబ్ డివిజన్లో సీఐ పోస్టు కోసం రూ.10 లక్షలు చెల్లించేందుకు రెడీగా ఉన్నారు.⇒ శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ తమకు కావాల్సిన ఎమ్మార్వో, ఎస్ఐ, సీఐల జాబితా తయారు చేసుకున్నారు. ఇక అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం!⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో తమ వద్దకు వచ్చిన అధికారుల పేర్లు నమోదు చేసుకుంటున్న ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా వారి గురించి ఆరా తీస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తమకు అనుకూలంగా పనిచేసిన అధికారులను తిరిగి తెచ్చుకునే పనిలో ఉన్నారు. చేపల చెరువులతోపాటు పందాలు, పేకాట ఎక్కువగా జరిగే భీమవరం, ఉండి, ఆచంటలో పోస్టింగ్‌కు భారీగా డిమాండ్ ఉంది. అమలాపురం రూరల్ సీఐ బదిలీ వ్యవహారం టీడీపీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీయటంతో ఈ పంచాయతీ టీడీపీ అధిష్టానం, డీజీపీ వద్దకు వెళ్లింది. ⇒ ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరంలో ఎస్ఈ పోస్టు కోసం ఐదుగురు పోటీ పడుతుండగా మాజీ మంత్రి జవహర్ బావమరిది కూడా లైన్లో ఉన్నారు. పోస్టు కోసం రూ.50 లక్షల ఇచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. ⇒ అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి ప్రాంతాల్లో పని చేసేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో రెండు జాబితాలు సిద్ధం చేశారు.⇒ విశాఖ పరిధిలో పెందుర్తి, సబ్బవరం, పరవాడలో తహశీల్దారు, ఎస్ఐ, సీఐ పోస్టులకు గిరాకీ ఉంది. జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జీ రెండు జాబితాలు సిద్ధం చేసుకున్నారు. భీమిలిలోనూ అధికార పార్టీకి చెందిన కీలక నేత బేరాలు కుదుర్చుకున్నారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభంలో చేరేవారి జాబితా సిద్ధమైంది.⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కందుకూరు, గుడ్లూరు, కావలి రూరల్, కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, ఆత్మకూరు, పొదలకూరు, నెల్లూరు వేదాయపాలెం, నవాబుపేట, నెల్లూరు రూరల్, వెంకటాచలం అర్బన్ పోలీసుస్టేషన్లలో పోస్టింగ్‌లకు భారీ డిమాండ్ ఉంది. ⇒ ప్రకాశం జిల్లాలో టీడీపీ పెద్దల సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించాలని కొన్ని సర్కిళ్ల పరిధిలో తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. తహసీల్దార్లు ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ⇒ విజయనగరం జిల్లాలో ఏ పదవిలోనూ లేకపోయినా టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు తన బంగ్లా నుంచే యంత్రాంగాన్ని శాసిస్తున్నారు. ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో అధికారులు ఆమె అనుచరుల చుట్టూ తిరుగుతున్నారు. కీలక స్థానాల కోసం అదితి కొన్ని పేర్లు కలెక్టరుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో దాదాపుగా తమ కులం వారికే పోస్టింగ్‌లు ఇచ్చేలా ఆయన తండ్రి కొండలరావు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల (జనసేన) ఎమ్మెల్యే లోకం మాధవి కూడా తమకు అనుకూలమైన తహసీల్దార్ల పేర్లను కలెక్టరేట్‌కు పంపినట్లు సమాచారం. కిమిడి కళావెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, కోళ్ల లలితకుమారి సైతం ఇప్పటికే సిఫారసు లేఖలను కలెక్టరేట్‌కు పంపించారు. ⇒ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కొత్తపేట, లాలాపేట పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌లన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. కొత్తపేటకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐని, లాలాపేటకు కాపు సామాజిక వర్గానికి చెందిన సీఐని నియమించండంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాత గుంటూరు స్టేషన్‌కు మాత్రమే సీఐ నియామకాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు అప్పగించినట్లు చెబుతున్నారు. -
యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ
నైనిటాల్: సహజీవనం చేస్తున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై ఉత్తరాఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) ఇంకా అమల్లో రాలేదు. అయినప్పటికీ ఈ చట్టం కింద 48 గంటల్లోగా రిజిస్టర్ చేసుకున్న పక్షంలో పిటిషన్‌దారుగా ఉన్న జంటకు ఆరు వారాలపాటు రక్షణ కల్పించాలంటూ పోలీసు శాఖను ఆదేశిస్తూ జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, జస్టిస్ పంకజ్ పురోహిత్ల డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున జూనియర్ న్యాయవాది హాజరయ్యారు. రాష్ట్రంలో యూసీసీ అమలుపై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదనే విషయం ఆయనకు తెలియదు. అవగాహనా లోపం వల్ల ఇలా జరిగింది. దీనిపై హైకోర్టులో రీ కాల్ పిటిషన్ వేస్తాం. హైకోర్టు ఈ తీర్పును సవరించి, మళ్లీ ఉత్తర్వులు జారీ చేస్తుంది’అని చెప్పారు. అదే సమయంలో, ఆ జంటకు పోలీసులు రక్షణ కల్పిస్తారని కూడా ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. వేర్వేరు మతాలకు చెందిన తమ కుటుంబాల నుంచి ముప్పుందంటూ సహజీవనం చేస్తున్న 26 ఏళ్ల హిందూ మహిళ, 21 ఏళ్ల ముస్లిం యువకుడు వేసిన పిటిషన్ ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిపాదించిన యూసీసీ ప్రకారం యువ జంటలు తాము సహజీవనం చేస్తున్న రోజు నుంచి నెల రోజుల్లోగా అధికారుల వద్ద నమోదు చేసుకోకుంటే జరిమానా విధించొచ్చు. -
రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు.. మెసేజ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావటంతో సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసినట్టు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వివిధ బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో బ్యాంకు గుర్తు (లోగో), పేరు.. బ్యాంకు అధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్ అకౌంట్‌ని సృష్టించి వాటి నుంచి మోసపూరితమైన లింకులు (ఏపీకే ఫైల్స్) పంపుతున్నారని అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు గురువారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.బ్యాంకుల పేరిట వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, వాటిని డౌన్లోడ్ చేస్తే మన మొబైల్‌ఫోన్ సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళుతుందని తెలిపారు. అదేవిధంగా మన ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లకు సైతం మనం పంపినట్టుగా ఈ మోసపూరితమైన లింకులు వెళతాయని హెచ్చరించారు. దీనివల్ల మీ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే బ్లూ కలర్ లింకులను గానీ, ఏపీకే ఫైళ్లనుకానీ డౌన్లోడ్ చేసుకుంటే, సైబర్ నేరగాళ్లు మీ గూగుల్ పే, ఫోన్‌పే నంబర్ల నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు, ఇతర వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఇలాంటి ఆన్లైన్ మోసానికి గురయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
రిటైర్డ్ ఐపీఎస్ ల గుప్పిట్లో పొలిసు శాఖ
-
ముగ్గురి మాటే శాసనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పోలీసు శాఖలోకి రాజ్యాంగేతర శక్తులు ప్రవేశించాయి. రిటైరైపోయిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల గుప్పిట్లో పోలీసు శాఖ చిక్కుకుంది. రిటైర్డ్ డీజీ ఏబీవీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ల మాటే శాసనంగా చలామణి అవుతోంది.సర్వీసు మొత్తం అత్యంత వివాదాస్పదంగా ముద్రపడ్డ ఈ ముగ్గురూ ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో పోలీసు శాఖపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఈ అధికారులు ఎస్సై నుంచి డీజీపీ స్థాయి అధి కారిని కూడా శాసిస్తున్నారు. వారి ప్రాపకం పొందిన అధికారులకే పోస్టింగులు ఇస్తున్నారు. వారు చెప్పి నట్టల్లా ఆడాలని, చెప్పిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని షరతులు పెడుతున్నారు. ఇందుకు ఒప్పుకొన్న వారికే సీఎంవో కటాక్షం లభించి, పోస్టింగులు వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసు శాఖలో ఈ ముగ్గురి మాటే శాసనం.సర్వీసు అంతా అవినీతి, అక్రమాలు, వివాదాలే..ఈ ముగ్గురు అధికారుల సర్వీసు మొత్తం వివాదాస్పదమే. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరు చెలరేగిపోయారు. పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. ఆశ్రిత పక్షపాతం, రాజకీయ కక్ష సాధింపులతో ఫక్తు రాజకీయ నేతల మాదిరిగానే వ్యవహరించారు. వీరిలో డీజీ హోదాలో ఇటీవల రిటైరైన ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసు అంతా అత్యంత వివాదాస్పదం. గతంలో నిఘా విభాగం అధిపతిగా చేసినప్పుడు వైఎస్సార్సీపీ నేతలను వేధించడం, ప్రలోభాలకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, టీడీపీలో చేర్పించడంలో ప్రధాన పాత్రధారి. టీడీపీ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు ఈయన ఏకంగా కేంద్ర భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలను కొనడం సంచలనం సృష్టించింది. తన కుమారుడి కంపెనీ ద్వారా పెగాసస్ కంపెనీ స్పైవేర్‌ను అక్రమంగా కొన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొన్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర శాసన సభలోనే చెప్పడం సంచలనం రేపింది.» పూర్వపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ అవినీతి, వివాదాలకు మారుపేరుగా ముద్ర పడ్డారు. ఆయన రాయలసీమలో పని చేసినప్పుడు ఫ్యాక్షనిస్టులతో అంటకాగి శాంతి భద్రతలను గాలికొదిలేశారు. 2018లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగితే.. డీజీపీగా ఉన్న ఠాకూర్ కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఏకపక్షంగా ఆ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అప్పటి రాష్ట్ర పోలీస్ బాస్‌గా ఉన్న ఈయన మాత్రం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ఇంత చేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన సీనియారిటీని గౌరవించి కీలక పోస్టింగులు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీగా గౌరవనీయమైన పోస్టులో రిటైరయ్యే అవకాశం కల్పించింది. రిటైరైన తరువాత కూడా కీలక పదవిలో నియమించింది. ఆయన మాత్రం పచ్చ రాజకీయ వాసనలను వీడలేదు. ఇటీవలి ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో మకాం వేసి మరీ ఆ పార్టీ కోసం పని చేశారు. పోలీసు అధికారులను బెదిరించారు. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసేందుకూ సాహసించారు. ఎన్నికల్లో టీడీపీ అక్రమాల కుట్రలో కీలకంగా వ్యవహరించారు. డీఐజీ స్థాయిలో రిటైరైన ఘట్టమనేని శ్రీనివాస్ గత ఐదేళ్లుగా టీడీపీ బ్యాక్ ఆఫీసులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా పని చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం పంపిణీని ఆయనే పర్యవేక్షించారు.ఇవిగో ఉదాహరణలురాజధాని ప్రాంతంలో కీలక జిల్లా పోలీసు అధికారి పోస్టు ఆశించిన ఓ ఐజీ స్థాయి అధికారిని కొన్ని రోజుల క్రితం వీరు పిలిపించారు. వైఎస్సార్సీపీ నేతలు ఎవరెవరి మీద ఎక్కడెక్కడ అక్రమ కేసులు ఎలా పెట్టవచ్చో ఒక లిస్టు తయారు చేసి ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం తాము పెట్టిస్తున్న అక్రమ కేసులను పర్యవేక్షించాలని, జిల్లా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో మాట్లాడుతూ కేసుల నమోదు, వేధింపులు వేగవంతం చేసేట్టు చూడాలని కూడా చెప్పారు. తాము సంతృప్తి చెందితే ఆయన ఆశించిన కీలక పోస్టింగ్ ఇస్తామని షరతు విధించారు. దాంతో ఆ అధికారి వారు చెప్పిన పని చేశారు. వైఎస్సార్సీపీ నేతల మీద అక్రమ కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆయన పనితీరుతో ఆ ముగ్గురు రిటైర్డ్ అధికారులు సంతృప్తి చెంది పచ్చ జెండా ఊపారు. దాంతో ప్రభుత్వం ఆయనకు రాజధాని ప్రాంతంలో కీలక పోలీసు అధికారిగా పోస్టింగ్ ఇచ్చింది.» ఇటీవలి ఎన్నికల్లో గుంటూరులో అత్యంత వివాదాస్పద అధికారిగా మారిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా పోస్టింగ్ కోసం వీరి వద్దకు వచ్చారు. ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాశాను కాబట్టి కీలక పోస్టింగ్ కావాలని కోరారు. ఆయనకు కూడా ఇదే విధమైన షరతు విధించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడితో ఏమాత్రం సంబంధం లేని వారిని ఆ కేసులో ఇరికించాలని, వేధించాలని చెప్పారు. అలా చేస్తేనే మరింత ప్రాధాన్యమున్న పోస్టింగ్ ఇస్తామని చెప్పారు. » జిల్లాల ఎస్పీలతో సహా శనివారం బదిలీ చేసిన 37 మంది ఐపీఎస్ జాబితా తయారు చేసిందీ ఈ ముగ్గురే. ఇటీవలి ఎన్నికల్లో ఏకపక్షంగా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టి వేధించి తీవ్ర వివాదాస్పదమైన బిందుమాధవ్ నాయుడును కర్నూలు జిల్లా ఎస్పీగా నియమించారు. టీడీపీ సీనియర్ నేతకు సమీప బంధువైన కోయ ప్రవీణ్‌ను కర్నూలు రేంజ్ డీఐజీగా నియమించారు. టీడీపీకీ అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తారని పేరు బడ్డ దామోదర్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ విధంగా మొత్తం ఐపీఎస్‌ల నియామ కాలన్నీ ఈ ముగ్గురు రిటైర్డ్ అధికారుల ఎంపిక మేరకే చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చెప్పినట్లు చేస్తేనే పోస్టింగులుఈ ముగ్గురికీ ప్రభుత్వం ఎలాంటి నామినేటెడ్ పదవులు, ఇతరత్రా అధికారిక హోదా ఏదీ ఇవ్వలేదు. అయినా వారు చెప్పిందే చేయాలని ముఖ్య నేత పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. తద్వారా పోలీసు శాఖను ఈ ముగ్గురే నియంత్రిస్తారని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య నేత కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో ఈ ముగ్గురూ చెలరేగిపోతున్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా పంచేసుకుని ఎస్సై నుంచి డీజీపీ వరకూ యావత్ పోలీసు వ్యవస్థనే గుప్పిట్లోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీలు, డీఐజీల పోస్టింగులు అన్నీ వీరే ఖరారు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ ముగ్గురి కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ సాగుతోంది. శనివారం 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, అంతకుముందు కొన్ని రోజుల క్రితం అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారుల బదిలీలన్నీ ఈ ముగ్గురి ఎంపిక మేరకే జరిగాయి. వీరు ముగ్గురూ ఐపీఎస్ అధికారులను పిలిపించుకుని మాట్లాడి సంతృప్తి చెందిన తరువాతే వారి ఫైళ్లు ముందుకు కదిలాయి. అనంతరమే పెద్ద బాబు, చిన బాబు ఆమోదముద్ర వేశారు. ఐపీఎస్‌లే కాదు.. సీఐల పోస్టింగులు కూడా వీరి కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఐపీఎస్ నుంచి సీఐ వరకు పోస్టింగులకు రేటు కూడా ఫిక్స్ చేస్తున్నట్లు పోలీసు శాఖలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల మీద అక్రమ కేసులు ఎలా పెడతారు? ఎలా వేధిస్తారు? అంటూ పోస్టింగులకు ముందు అధికారులను వీరు ముగ్గురూ ప్రశ్నిస్తున్నారు. తాము సంతృప్తి చెందితేనే పోస్టింగుల జాబితాలో వారి పేరు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన బదిలీలన్నీ అదే ప్రాతిపదికన చేశారు. -
బాలల భద్రత తక్షణ కర్తవ్యం
ఎన్ని చట్టాలు వచ్చినా పిల్లలపై ఘోరాలు కొనసాగుతూ ఉండడం బాధాకరం. జూన్ నెలలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్‌మిల్ దగ్గర ఆరేళ్ల బాలిక, మియాపూర్ నడిగడ్డ తండా వద్ద 12 ఏళ్ల బాలిక లైంగిక హింస, హత్యలకు గురవ్వడం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వలస వెళ్ళిన నిరు పేద కుటుంబాలకు చెందిన ఈ బాలికలు సామజిక మాధ్యమాల మద్దతుకు కూడా నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకూ ఒక బాలల పరిరరక్షక విధానం లేదు. సమగ్ర విధానం రూపొందించి, రాష్ట్రంలోని అన్ని సంస్థలలో అమలు పరిచేట్లు చూడటం బాలలపై లైంగిక నేరాలనుంచి రక్షణ (పోక్సో) చట్టం – 2012, నిబంధన 3 (5) ప్రకారం తప్పనిసరి. పోక్సో చట్టం ప్రకారం బాల స్నేహ పూర్వక ప్రత్యేక న్యాయస్థానాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఏదైనా సంస్థ పరిధిలో బాలలపై నేరం జరిగినా, జరిగే అవకాశం ఉన్నా ఆ సంస్థ అధిపతి లేక యజమాని వెంటనే పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. ఈ బాధ్యత నిర్వహణలో విఫలమైతే ఏడాది జైలుశిక్ష విధించ వచ్చు. పోక్సో చట్టం నిబంధన 3 (4) ప్రకారం బాలలు సందర్శించే అన్ని సంస్థలు, పాఠశాలలు, క్రెష్‌లలో సిబ్బంది, ఉపాధ్యాయులకు ఏమైనా నేర చరిత్ర ఉన్నదా అని పోలీసు శాఖచే వారి నేపథ్య తనిఖీ క్రమబద్ధంగా చేయడం తప్పనిసరి. చట్ట పరమైన రక్షణ, పోక్సో చట్టం కింద పడేశిక్షల తీవ్రత గురించి అవగాహన పెంచితే నేరాలు తగ్గవచ్చు. 18 ఏళ్ళ లోపు బాలలపై లైంగిక హింస చేస్తే 20 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ నేరం బంధువులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల సిబ్బంది, వసతి గృహ సిబ్బంది చేస్తే మరణ శిక్షకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే తమిళనాడు, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పోక్సో చట్టం ప్రకారం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానాలు త్వరితంగా విచారణ పూర్తి చేసి బాలలపై లైంగిక దాడి చేసిన నేరస్థులకు మరణ శిక్షలు విధించాయి.ఆంధ్రప్రదేశ్ 2019లో ‘దిశ’ హత్యకు ప్రతిస్పందనగా ‘దిశ చట్టం’ (ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019), మహారాష్ట్ర ‘శక్తి క్రిమినల్ చట్టాల (మహారాష్ట్ర సవరణ) చట్టం 2020’ అమలు చేసే ప్రయత్నం చేశాయి. ఈ చట్టాల ప్రకారం బాలలు, మహిళలపై జరిగిన నేరాల పరిశోధన, న్యాయ విచారణ త్వరితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రపతి అనుమతి రానందున ఈ రెండు చట్టాలు అమలు లోకి రాలేదు. నారాయణపేట జిల్లాలో జూన్ 13న సంజీవ్ అనే వ్యక్తిపై ప్రాణాంతక దాడి జరుగుతున్న సమయంలో 100 నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని తెలిసింది. తెలంగాణలో ‘112 ఇండియా’, ‘దిశ’ వంటి ఎమర్జెన్సీ యాప్‌లను వెంటనే అందుబాటులోకి తీసుకు రావాలి. ఆంధ్రప్రదేశ్ దిశ యాప్ 1.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ మధ్య ప్రవేశపెట్టిన టీ–సేఫ్ యాప్ ప్రయాణాల్లో అత్యవసర సాయం కోసం, హెల్ప్ లైన్ 100 డయల్ చేసేందుకు పని చేస్తుంది. కానీ 112 ఇండియా, దిశ వంటి యాప్‌లలో పోలీసులతో పాటు ఇతరులకు కూడా తక్షణ సమాచారం చేరవేసే అవకాశం ఉంది. ఫోన్ గట్టిగా ఊపడం ద్వారా కూడా తక్షణ సందేశం పంపవచ్చు. మొబైలు ఫోన్ హ్యాండ్ సెట్ ప్యానిక్ బటన్, జీపీఎస్ నిబంధనలు– 2016 ప్రకారం... ఫీచర్ ఫోన్లో 5 లేక 9 నంబర్‌ను స్మార్ట్ ఫోన్లో అయితే ఆన్–ఆఫ్ మీట 3 సార్లు నొక్కితే పోలీసు అత్యవసర హెల్ప్ లైన్‌కు సందేశం వెళ్ళాలి. ఈ విషయంపై ప్రజలలో అవగాహన అవసరం. ఏ దేశానికైనా అత్యంత విలువైన ఆస్తిపాస్తులు బాలలు. వారిని కాపాడటం కోసం అన్ని మార్గాలూ వెదకాలి. శ్రీనివాస్ మాధవ్ వ్యాసకర్త ఆర్టీఐ కార్యకర్త ‘ 9247 159 343 -
టీడీపీ నేతల దౌర్జన్యం.. కుటుంబమంతా రాత్రి అడవిలోనే..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకానికి భయపడి ఓ కుటుంబం రాత్రంతా అడవిలో తలదాచుకుంది. రాత్రివేళలో క్రూర మృగాలు, పాములు, ఇతర విష పురుగుల మధ్య అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ప్రజాస్వామ్య దేశ చరిత్రలో ఇంతటి అరాచకం ఎప్పుడైనా కన్నామా? విన్నామా?.. కానీ ఇది పచ్చి నిజం. సోమల మండలం కమ్మపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం దీనగాథ ఇది. శుక్రవారం టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటిపై దాడి చేశారు. సుబ్రమణ్యంరెడ్డిని బయటకు ఈడ్చుకు వచ్చి తీవ్రంగా కొట్టారు. రకరకాలుగా హింసించారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలన్నింటినీ తరలించుకుపోయారు. బట్టీ మొత్తాన్ని ధ్వంసం చేశారు. సుబ్రమణ్యంరెడ్డి పొలంలో పండించిన టమాటా కోతకొచ్చింది. ఈ పంటను మార్కెట్‌కు తరలించకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయన పశువులకు గడ్డి కూడా వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు తెలిపినా స్పందన లేకపోవడంతో సుబ్రమణ్యం రెడ్డి కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమీపంలోని అడవిలోకి పారిపోయింది. శుక్రవారం రాత్రంతా అడవిలోనే గడిపింది. శనివారం కొందరు వ్యక్తులు వారి వద్దకు వెళ్లి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి వేరే ప్రాంతంలో ఉంచారు. ఆయన తమను శరణుకోరి.. టీడీపీలో చేరితే క్షమించి వదిలేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. లేదంటే విడిచిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. టీడీపీ నేతల తీరుపై పుంగనూరు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు పనిచేసే వారని, ఇటువంటి అరాచకం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లావ్యాప్తంగా దాడులుటీడీపీ నేతలు వారిపై కేసులు రాకుండా బెంగళూరు నుంచి గూండాలను తెచ్చి దాడులు చేయిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో ఎవరెవరు వైఎస్సార్సీపీకి పనిచేశారో గుర్తించి మరీ దాడులు చేయిస్తున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ నేతలు, వారి గూండాల దౌర్జన్యాలు, దాడులతో చిత్తూరు జిల్లా అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఊర్లొదిలి వేరే ప్రాంతాల్లో తలదాచుకొంటున్నారు. ఇప్పటివరకు 55 కుటుంబాలు స్వగ్రామాలను వీడి వెళ్లాయి. శ్రీకాళహస్తి రూరల్ మండలం ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురం గ్రామాల నుంచి 75 కుటుంబాలను టీడీపీ నేతలు వెళ్లగొట్టారు. వీరంతా తమను శరణు కోరి, టీడీపీలో చేరితేనే వారిని, వారి ఆస్తులను వదిలేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.రక్షణ కోరినా స్పందించని పోలీసులుటీడీపీ కూటమి దాడులు, దౌర్జన్యాలపై అనేకమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పోలీసులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన సమయంలో ఇరువురి మధ్య సంభాషణలను బాధితులు రికార్డు చేసుకున్నారు. ఆ రికార్డులను వింటే.. రక్షణ కల్పించాల్సిన పోలీసులేనా అలా మాట్లాడేది అనిపించకమానదు. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల దౌర్జన్యాలు, దాడులు ఆగకపోవడం, పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు. -
సంగీతాన్ని నమ్ముకున్న పోలీసులు..
ఫిన్లండ్ తీరనగరం ఎస్పో బీచ్‌లో యువతీ యువకులు తరచు గోలగోలగా పార్టీలు చేసుకోవడం, ఆగడాలకు పాల్పడటం, బీచ్‌కు వచ్చే సాధారణ జనాలతో దురుసుగా ప్రవర్తించడం కొంతకాలంగా సమస్యగా ఉంటూ వచ్చింది. అదుపులేని యువత తరచుగా ఆగడాలకు పాల్పడుతుండటం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది.ఫిర్యాదులు వచ్చిప్పుడల్లా నిందితులను నిర్బంధంలోకి తీసుకోవడం, వారి మీద కేసులు పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నా, వాటి వల్ల పెద్దగా ఫలితాలు కనిపించలేదు. ఆకతాయి యువతను బీచ్‌కు దూరంగా ఉంచడానికి ఏదో ఒకటి చేయాలని, సాధారణ ప్రజలు బీచ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంచరించే వాతావరణం కల్పించాలని పోలీసులు నిశ్చయించుకున్నారు.అయితే, వారు మన పోలీసుల మాదిరిగా లాఠీలను నమ్ముకోలేదు, సంగీతాన్ని నమ్ముకున్నారు. పాప్, ర్యాప్లాంటి హోరెత్తించే సంగీతాన్ని ఇష్టపడే యువతకు శాస్త్రీయ సంగీతం అంటే సరిపడదని తెలివైన పోలీసు అధికారి ఒకరు గుర్తించారు.ప్రయోగాత్మకంగా బీచ్‌లో జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రతిచోటా లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేసి, శాస్త్రీయ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతం ధాటికి ఆకతాయి యువత క్రమంగా బీచ్‌వైపు రావడం మానుకున్నారు. పోలీసుల సంగీతం చిట్కా ఫలించడంతో ఎస్పో నగరవాసులూ ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇవి చదవండి: ఈ వింతజీవి గురించి మేరెప్పుడైనా విన్నారా..!? -
రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాలపై నిఘా పెట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాలపై నిఘా పెట్టి నేరస్తులను పట్టు కోవాలి. ప్రజలు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులుగా వచ్చాము. మాకు మితిమీరిన సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరికి ఎంత అవసరమో అంతే భద్రత ఇవ్వాలి. భద్రత విషయంలో నాతో సహా ఎవరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వా ల్సిన అవసరం లేదు. భద్రత, ఇతర విషయాల్లో కొన్నిసార్లు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. ఆ ఉత్సాహాన్ని నేరాల నియంత్రణపై చూపాలి’ అని ముఖ్యమంత్రి డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులకు హితవు పలికారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల అధికారులు, సిబ్బందితో నగరంలో శాంతిభద్రతలపై సీఎం సమీక్షించారు. వారికి కీలక సూచనలు చేశారు.డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి సామర్థ్యాలు పెంచుకోవాలితెలంగాణకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి గంజాయి వస్తోందనే సమాచారం ఉందని సీఎం రేవంత్ చెప్పారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా అప్రమత్తంగా ఉంటూ ఉగ్రమూకలు చొరబడకుండా పహారా కాస్తోందో.. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అలా పహారా కాసి తెలంగాణలోకి గంజాయి, డ్రగ్స్ రాకుండా చూడాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టేందుకు అవసరమైన సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. సింగరేణి కాలనీలో ఒక బాధితుని కుటుంబాన్ని, ఔటర్ రింగ్‌రోడ్డులో ఒక బాధితుడైన డాక్టర్‌ను పరామర్శించడానికి వెళ్తే వారంతా గంజాయికి అలవాటుపడిన వ్యక్తుల వల్లే బాధితులుగా మారామని చెప్పారన్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని.. తాము రూ. వందల కోట్లు సంపాదించినా ఉపయోగం లేకుండాపోయిందంటూ పలువురు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఇందుకు ప్రధాన కారణం పోలీసు వ్యవస్థ రాజకీయ నిఘాపై శ్రద్ధపెట్టి నేరస్తులను వదిలేయడమేనని సీఎం అభిప్రాయపడ్డారు.పోలీసు కుటుంబం నుంచే వచ్చాపోలీసుల పిల్లలు తాము పోలీసుల కుటుంబాల నుంచి వచ్చామని చెప్పుకొనేందుకు ఇబ్బంది పడతారని, అందుకు కారణం పోలీసు శాఖపై సమాజంలో ఉన్న దురభిప్రాయ మేనని సీఎం రేవంత్ అన్నారు. ఆ అభిప్రాయం మారాలని, తన తండ్రి, తన అన్న పోలీసు అని గర్వంగా చెప్పుకునేలా పోలీసుల ప్రవర్తన ఉండాలని ఆయన సూచించారు. తన సోదరుడు భూపాల్‌రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్‌గా పనిచేసి తనను చదివించారని, తన అన్న పెంపకం వల్లే తాను సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ వెల్లడించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పోలీసు శాఖ సమస్యలు పరిష్కరించుకోకుంటే ఇక జీవితకాలంలో ఎప్పటికీ పరిష్కారం కావన్నారు. పోలీసుల పిల్లలకు ఉచిత విద్యసైనిక స్కూళ్ల మాదిరే పోలీసు పిల్లల కోసం పోలీసు స్కూళ్లు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో పోలీసు స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందులో ఉంటుందని, హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు చదువుకోవచ్చని చెప్పారు. సామర్థ్యం, పనితీరుతోనే బదిలీలు కోరుకోవాలని సీఎం సూచించారు. సామర్థ్యం ఉన్నవారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని, అందుకు రిటైర్డ్ ఐపీఎస్ సందీప్ శాండిల్య ఉదాహరణ అని పేర్కొన్నారు. రిటైరైనప్పటికీ సందీప్ శాండిల్యకు మాత్రమే ప్రభుత్వం పదవీకాలం పొడిగించిన విషయం గుర్తించాలన్నారు.పైసలతో పోస్టింగ్‌లు కుదరదు!‘పైసలతో పోస్టింగ్‌లు తెచ్చుకుందామంటే కుదరదు. పనితీరు ఆధారంగానే బదిలీలు ఉంటాయి. డబ్బు పెట్టి పోస్టింగ్‌లు తెచ్చుకొని మళ్లీ డబ్బు దండుకోవాలంటే ఏసీబీ వెంటపడుతుంది’ అని సీఎం రేవంత్ పోలీసు అధికారులను హెచ్చరించినట్లు సమాచారం.తెలంగాణ బ్రాండ్ హైదరాబాద్..తెలంగాణ బ్రాండే హైదరాబాద్ అని, హైదరాబాద్ పోలీ సులంటే తెలంగాణకు గుండె లాంటి వారని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్‌లో నేరాలను, అరాచకాలను అరికట్టకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అందుకే హైదరాబాద్ ఇమేజ్ను కాపాడాలన్నారు. -
అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్
వేసపోగు శ్యామల... హైదరాబాద్, సైఫాబాద్ ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ. ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘2024 పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్’కి ఆహ్వానం అందుకున్నారామె. ఈ నెల 12 నుంచి 21 వరకు యూఎస్ఏలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్‌ల్యాండ్‌లో జరగనున్న పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలలో పాల్గొంటున్న సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.‘‘నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, కర్నూలు పట్టణంలోని సిమెంట్‌నగర్‌లో. నాన్న మిలటరీ ఆఫీసర్ అమ్మ స్టాఫ్‌నర్స్. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లిని నేను. మా పేరెంట్స్ మమ్మల్నందరినీ బాగా చదివించారు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక అన్న మిలటరీలో ఉన్నారు. ఒక అక్క, నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. నా ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నగరంలోని గోపాల్పురం. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారిణిని. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఖోఖో, కబడీ, త్రో బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్‌లో లెక్కలేనన్ని పతకాలందుకున్నాను. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జాతీయస్థాయి పతకాలందుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేను ఇప్పుడు మీ ముందు ఇంత అడ్వెంచరస్‌గా కనిపిస్తున్నానంటే కారణం ఈ నేపథ్యమే.ఈ ఉద్యోగం ఆడవాళ్లకెందుకు?స్త్రీపురుష సమానత్వ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. మాలాంటి ఎందరో పోలీసింగ్, దేశరక్షణ వంటి క్లిష్టమైన విధులను భుజాలకెత్తుకున్నాం. కానీ సమాజం మాత్రం అంత ముందు చూపుతో లేదన్న వాస్తవాన్ని మా డిపార్ట్మెంట్లోనే చూశాను. ‘ఆఫ్టరాల్ ఉమన్, జస్ట్ కానిస్టేబుల్, యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వస్తారు, వెళ్తారు. జీతం దండగ’ అనే మాటలు మేము వినాలనే అనేవాళ్లు. నాలో కసి ఎంతగా పెరిగిపోయిందంటే... వాహనం కొనేటప్పుడు చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్ తీసుకున్నాను. ‘ఏ అసైన్మెంట్ అయినా ఇవ్వండి’ అన్నాను చాలెంజింగ్‌గా. నైట్ పెట్రోలింగ్ చేయమన్నారు.అది కూడా సింగిల్‌గా. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా వరుసగా 60రోజులు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు బైక్ మీద హైదరాబాద్ సిటీ పెట్రోలింగ్ చేశాను. ఆ డ్యూటీతో వార్తాపత్రికలు, టీవీలు నన్ను స్టార్‌ని చేశాయి. ‘ఎంటైర్ ఆల్ ఇండియా చాలెంజింగ్ ఉమన్ ఆఫీసర్’ అని అప్పటి సీపీ అంజనీకుమార్ సత్కరించారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌గా ఏసీపీ రంగారావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నాను.బుల్లెట్ పై వస్తా... ఆకతాయిల భరతం పడతా!పోలీసులంటే శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, భరోసా, షీ టీమ్స్, తెలంగాణ స్టేట్ పోలీస్ కౌన్సెలింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు– వ్యాప్తికి కారణం కావద్దనే ప్రచారం, ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ... ‘మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకోవడం, కాలరాసుకోవడం రెండూ మన నిర్ణయాల మీదనే ఉంటాయ’ని చెప్పేదాన్ని. గణేశ్ ఉత్సవాల సమయంలో మహిళలను తాకుతూ విసిగించడం, మెడల్లో దండలు అపహరించే పోకిరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మా డి΄ార్ట్‌మెంట్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల భరతం పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. సరదాకొద్దీ సోలో రైడ్లుచిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌లా పెరిగాను. బైక్ అంటే నా దృష్టిలో డ్యూటీ చేయడానికి ఉపకరించే వాహనం కాదు. బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. ‘వరల్డ్ మోటార్‌సైకిల్ డే’ సందర్భంగా బైక్ రైడ్ చేశాను. బైకర్లీగ్ విజేతను కూడా. ‘ఉమన్ సేఫ్ రైడర్ ఇన్ తెలంగాణ’ పురస్కారం కూడా అందుకున్నాను. అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే ఇష్టం.గుర్గావ్లో ΄ారాషూట్ డైవింగ్, పారాగ్లైడింగ్ చేశాను. నా సాహసాలకు గాను సావిత్రిబాయి ఫూలే పురస్కారం, సోషల్ సర్వీస్‌కు గాను హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలు. మొత్తం నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నాను.పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆటల పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పతకాలందుకున్నాను. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం యూఎస్‌లో జరిగే క్రీడలకు ఆహ్వానం అందింది. వీసా కూడా వచ్చింది. నా దగ్గరున్న డబ్బు ఖర్చయి పోయింది. యూఎస్ వెళ్లిరావడానికి స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచంలోని 50 దేశాల క్రీడాకారులు ΄ాల్గొనే ఈ పోటీలకు వెళ్లగలిగితే మాత్రం భారత్‌కు విజేతగా పతకాలతో తిరిగి వస్తాను’’ అన్నారు శ్యామల మెండైన ఆత్మవిశ్వాసంతో. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్చ్ఠ్బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. -
‘నీట్’ నిందితులకు నార్కో బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు!
పాట్నా/దేవగఢ్: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బిహార్ పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నీట్ అసలైన ప్రశ్నపత్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) నుంచి సేకరించారు. పేపర్ లీకేజీకి సంబంధించి గత నెలలో పాటా్నలోని ఓ ఇంట్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న ప్రశ్నపత్రాలతో ఈ ప్రశ్నపత్రాలను సరిపోల్చనున్నారు. ఫోరెన్సిక్ టెస్టు తర్వాత సరిపోల్చే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన నిందితులకు నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఈడీ సైతం దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సార్.. లెటర్ ప్లీజ్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇప్పుడు ఏ నేత ఇంటి ఎదుట చూసినా పలువురు పాత పోలీసులు తారసపడుతున్నారు. ‘సార్.. పోస్టింగు కోసం లెటర్ కావాలి.. ఇప్పటివరకూ లూప్లైన్లో ఉన్నాం. మీరు లెటరిస్తే వెళ్లి పోస్టింగుల్లో చేరతాం’ అంటూ పైరవీలు ప్రారంభించారు. ఇది కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకే పరిమితం కాలేదు.రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా పోస్టింగులు తెచ్చుకోవాలని మెజారిటీ పోలీసు అధికారులు ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు.సామాజికవర్గాల వారీగా..పోలీసు పైరవీల్లో తొలి ప్రాధాన్యం సామాజికవర్గానికే. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబా ద్, రాచకొండల్లో ఈ పోకడ తక్కువే గానీ, జిల్లాలో పోలీసు పోస్టింగుల్లో తొలి ప్రాధాన్యం మా త్రం సామాజికవర్గానిదే. ఈ క్రమంలోనే నేతలు కూడా తమ సామాజికవర్గాల అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. ఆ తరువాతే సమర్థత, పనితీ రు, విశ్వసనీయత, పాత పరిచయాలు తదితర విషయాలను బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసు అధికారుల్లో చాలామంది తమ సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులను లెటర్ల కోసం ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు.ఐఏఎస్‌ల, ఐపీఎస్ బదిలీలతో..గత ప్రభుత్వ హయాంలో ఉన్న పలువురు ఐఏఎ స్, ఐపీఎస్ అధికారులను ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ ఎన్నికల ముందు బదిలీ చేసింది. తరువాత వారిస్థానాల్లో కొత్త అధికారులను నియమించింది. ఇటీవల పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో తనదైన ముద్ర వేసేలా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈనెల 15వ తేదీన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను మార్చింది.సోమవారం సాయంత్రం తొలి విడతగా పలువురు ఐపీఎస్‌లను బదిలీచేసింది. జగిత్యాల ఎస్పీగా సురేశ్ కుమార్‌ను నియమించింది. ఇక్కడ పనిచేసిన సన్ప్రతీసింగ్ను సూర్యాపేటకు బదిలీ చేసింది. మరో విడతలో మరికొందరిని కూడా బదిలీ చేయనుంది. దీంతో ఎస్సై నుంచి ఏసీపీ వరకు రెండో విడత ఐపీఎస్ బదిలీ లకోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఐపీఎస్ అధికారుల్లో చాలామంది ఎన్నికల సంఘం నియమించిన వారే ఉన్నారు.ఒకవేళ ఎవరైనా కిందిస్థాయి అధికారి ఫలానా చోట పోస్టింగ్ కావాలని లెటర్ తెచ్చుకున్నా.. సదరు ఐపీఎస్ అధికారి వ్యతిరేకించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ అలా అంటే మొదటికే మోసం వస్తుంది. వారి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని భావిస్తున్నారు. అందుకే, ఈ విషయంలో కిందిస్థాయి పోలీసు అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.వారు వద్దంటే వద్దు..మరోవైపు గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులకు పోస్టింగుల కోసం లెటర్లు ఇవ్వొద్దని కొందరు నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదని, తమ డిపార్టుమెంటు ప్రభుత్వం చెప్పినట్లు వింటుందే తప్ప, తామేపార్టీ పక్షం కాదని స్పష్టంచేస్తున్నారు. దీన్ని ముందుగానే గుర్తించిన ఉమ్మడి జిల్లాలో కొందరు తెలివైన అధికారులు ఏకంగా పొరుగు జిల్లాల్లో పోస్టింగులు సాధించుకుని డ్యూటీలు చేస్తుండటం గమనార్హం.కరీంనగర్ హాట్ కేక్..కరీంనగర్ కమిషనరేట్ పోలీసు వర్గాల్లో హాట్‌కేక్‌గా మారింది. చాలామంది పోలీసు అధికారులు పిల్లల చదువుల కోసం ఇక్కడే పోస్టింగులు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో నాలుగు ఆకులు ఎక్కువే చదివిన సీనియర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇతర కమిషనరేట్లకు వలసవెళ్లారు.ఇప్పుడు ఎన్నికల సీజన్ ముగిసింది. దీంతో తిరిగి వెనక్కి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక సుదీర్ఘకాలంగా లూప్లైన్లో ఉన్నవారు, గత ప్రభుత్వ హయాంలో పోస్టింగులు దక్కని వారు సైతం ఈసారి ఎలాగైనా లా అండ్ ఆర్డర్లో ఉండేందుకు, నాయకులను కలుస్తూ లెటర్లు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
హ్యాకింగ్.. ‘పోలీస్’ షేకింగ్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన రెండు కీలక యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడం కలకలం సృష్టిస్తోంది. సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీస్‌కు చెందిన హాక్ ఐ యాప్‌తోపాటు పోలీస్ అంతర్గత విధుల్లో అత్యంత కీలకమైన టీఎస్‌కాప్ యాప్‌ను సైతం హ్యాక్ చేశారు. వీటి నుంచి హ్యాకర్లు పోలీస్ శాఖకు సంబంధించిన కీలక డేటాను, ఫొటోలను చేజిక్కించుకుని.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కేసులను పరిష్కరించే పోలీసులు తమ సొంత యాప్‌లు హ్యాక్ గురైన విషయాన్ని గుర్తించడంలో మాత్రం ఆలస్యం జరిగింది. హాక్ ఐ యాప్ హ్యాకింగ్ గురైన తర్వాత వారం రోజులకు టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అయిందని.. రెండింటి హ్యాకింగ్ ఒకే హ్యాకర్ కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. హాక్ ఐ యాప్ హ్యాకింగ్‌కు గురవడంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పటికే ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌శాఖకు సంబంధించిన కీలక యాప్‌ల హ్యాకింగ్ నిజమేనని.. రెండింటిని హ్యాక్ చేసింది ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అన్నది తేల్చాల్సి ఉందని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కీలక వ్యవహారాలన్నీ అందులోనే.. తెలంగాణ పోలీసుల రోజువారీ విధుల్లో టీఎస్‌కాప్ యా ప్ది ప్రధాన భూమిక. 2018లో ప్రారంభించిన ఈ యాప్‌లో పాత నేరస్తుల సమాచారం, క్షేత్రస్థాయిలో నిందితులను గుర్తించేందుకు అవసరమైన ఫేషియల్ రికగ్నిషన్ యాప్, సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్), రవాణాశాఖ సమాచారం వంటి మొత్తం 54 సర్విసులు పోలీసులకు క్షేత్రస్థాయి విధుల కోసం అందుబాటులో ఉంటాయి. లక్షలాది మంది నేర స్తుల ఫొటోలు, వేలిముద్రలు, ఇతర వివరాలు, గత కొన్నేళ్లలో నమోదైన నేరాల వివరాలు, రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులలో నిందితులు, బాధితుల ఫోన్ నంబర్లు, దర్యాప్తులో అవసరం మేరకు ఆధార్‌కార్డు, ఇతర ధ్రువపత్రాల వివరాలు, వాహనాల నంబర్లు, సీసీ టీవీ కెమెరాల జియో ట్యాగింగ్ వివరాలు, క్రైం సీన్ ఫొటోలు, వీడియో లు, సాక్షుల స్టేట్మెంట్ రికార్డులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వివరాలు ఇలా చాలా సమాచారాన్ని టీఎస్‌కాప్ యాప్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇంత కీలమైన యాప్ హ్యాక అవడంపై పోలీస్‌శాఖలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆన్లైన్లో డేటా అమ్మకం? టీఎస్‌కాప్ యాప్‌లోని యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి.. తన డిజిటల్దత్తా పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్లో ‘టీఎస్‌కాప్ సహా మొత్తం తెలంగాణ కాప్‌ల నెట్‌వర్క్‌ను ఎవరో హ్యాక్ చేశారు.ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీ.. యాప్‌లో పాస్‌వర్డ్‌లను ప్లెయిన్ టెక్ట్స్‌గా పొందుపర్చడం, యాప్ సీసీటీఎన్ఎస్కు కనెక్ట్ అయి ఉండటం వంటివి సులభంగా హ్యాక్ అవడానికి కారణాలై ఉండొచ్చు’’అని పేర్కొన్నారు. హ్యాకర్ కొనుగోలుదారులను ప్రలోభపెట్టడానికి ఆన్లైన్ ఫోరమ్‌లలో నమూనా డేటాను పోస్ట్ చేశాడని., నేరస్తుల రికార్డులు, తుపాకీ లైసెన్సులు, ఇతర డేటాను కూడా పొందుపర్చాడని తెలిపారు. హ్యాకింగ్ క్రైం ఫోరం అయిన బ్రీచ్ ఫోరమ్స్‌లో పేర్కొన్న ప్రకారం.. టీఎస్‌కాప్, హాక్ ఐ నుంచి లీకైన డేటాలో 2 లక్షల మంది యూజర్ల పేర్లు, ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు , అడ్రస్‌లు 1,30,000 ౖ రికార్డులు, 20 వేల ప్రయాణ వివరాల రికార్డులను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కీలక విభాగాలు, పోలీస్ అధికారుల వివరాలు కూడా..? హాక్ ఐ, టీఎస్‌కాప్ యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడంతో.. సైబర్ నేరగాళ్ల చేతికి ఏసీబీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, సీసీఆర్బీ, సీసీఎస్, సీఐడీ, కంట్రోల్ రూమ్‌లు, సీపీ ఆఫీస్‌లు, డీసీఆర్బీలు, గ్రేహౌండ్స్, జీఆర్పీ, ఇంటెలిజెన్స్, ఐటీ కమ్యూనికేషన్స్, లా అండ్ ఆర్డర్, ఎస్పీ ఆఫీసులు, ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్‌లు, స్పెషల్ యూనిట్లు, టాస్‌్కఫోర్స్, ట్రాఫిక్, టీజీఎస్పీ ఇలా చాలా విభాగాల సమాచారం చిక్కి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి కూడా.. ‘‘అధికారుల పేర్లు, పోలీసు స్టేషన్ అనుబంధాలు, హోదాలు, ఫొటోలతో సహా సమాచారం డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు, వందల మంది పోలీసు అధికారుల వివరాలు అందులో ఉన్నాయి’’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న టీఎస్‌కాప్ యాప్‌కు గతంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నుంచి ‘సాధికార పోలీసు విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’విభాగంలో అవార్డు దక్కింది. అలాంటి టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు సులువుగా ఉండే పాస్వర్డ్లు పెట్టుకోవడంతో హ్యాకింగ్ సులువైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డేటా బ్రీచ్‌పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
డీజీపీ, పలువురు కమిషనర్ల మార్పు?
సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల హడావుడి, కోడ్ ముగియడంతో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తనదైన టీంను సెట్ చేసుకోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని, పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. డీజీపీ, పలువురు పోలీస్ కమిషనర్లు సహా పలు కీలక పోస్టుల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం తప్పదనే చర్చ జోరుగా నడుస్తోంది. కీలక బాధ్యతల్లో కొత్త అధికారులను నియమించడంతో పాటు ఇప్పటికే ఒకటికి మించి అదనపు పోస్టులతో పని భారం ఉన్న అధికారులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒకట్రెండురోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉందని సమాచారం. శివధర్‌రెడ్డి వైపు సర్కారు మొగ్గు ప్రస్తుతం డీజీపీ (హెచ్ఓపీఎఫ్–హెడ్ఆఫ్ పోలీస్ ఫోర్స్)గా ఉన్న రవిగుప్తా స్థానంలో కొత్త డీజీపీ (హెచ్ఓపీఎఫ్)గా సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, జితేందర్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీజీ ర్యాంకులో ఉన్న సీవీ ఆనంద్ అత్యంత కీలకమైన ఏసీబీ డీజీ పోస్టులో ఉన్నారు. డీజీ ర్యాంకులో ఉన్న మరో అధికారి జితేందర్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐపీఎస్ శివధర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అడిషనల్ డీజీ ర్యాంకులో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్‌రెడ్డిని ఇటీవల ఏర్పడిన రెండు డీజీపీ ర్యాంకు ఖాళీల భర్తీలో భాగంగా పదోన్నతి ఇచ్చి పోలీస్ బాస్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరికి డీజీపీలుగా పదోన్నతి ప్రస్తుతం డీజీపీ ర్యాంకులో నలుగురు సీనియర్ ఐపీఎస్‌లు కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తాతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో అనూహ్యంగా రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా బదిలీ అయిన అంజనీకుమార్, సీవీ ఆనంద్, జితేందర్ ఉన్నారు. డీజీపీ ర్యాంకులోనే విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్‌రతన్ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు.అదేవిధంగా టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేసిన సందీప్ శాండిల్య కొద్దిరోజుల క్రితం పదవీ విరమణ పొందారు. ఇలా రెండు డీజీపీ ర్యాంకులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్న శివధర్‌రెడ్డిలకు డీజీపీలుగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆ ముగ్గురు కమిషనర్లు కూడా.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిõÙక్ మొహంతి, వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్జా, రామగుండం సీపీ శ్రీనివాసులుకు స్థాన చలనం కలిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం ఉంది. ఇంటిలిజెన్స్ ఏడీజీ పోస్టులో ఉన్న శివధర్‌రెడ్డికి డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తే ఆ స్థానంలోకి మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్‌రెడ్డి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్న శిఖా గోయల్ వద్ద కీలక పోస్టులైన సీఐడీ, మహిళా భద్రత విభాగం, టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర ఐపీఎస్‌లకు అప్పగించే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అత్యంత కీలకమైన ట్రాఫిక్ అడిషనల్ సీపీ, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ, క్రైమ్స్ అడిషనల్ సీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఐజీగా ఉన్న విశ్వప్రసాద్కే మళ్లీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ పోస్టును ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చాలా జిల్లాల ఎస్పీలు, డీసీపీలు ఎన్నికల బదిలీల్లో భాగంగా పోస్టింగ్‌లు పొందారు. వారిలో కొందరిని ప్రభుత్వం తమ ప్రాధాన్యాల మేరకు బదిలీ చేసి, ఆ స్థానాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.హైదరాబాద్‌కూ కొత్త సీపీ?రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సహా మొత్తం 9 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. కాగా త్వరలో జరగనున్న బదిలీల్లో ఎక్కువ మంది పోలీస్ కమిషనర్లకు స్థాన చలనం తప్పదనే వార్తలు వస్తున్నాయి. కమిషనర్ల తీరుపై రాజకీయ నాయకులు, సొంత శాఖలోని అధికారులు, సామాన్యుల నుంచి వచ్చిన ప్రతి స్పందనలు ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీ పోస్టుకు టీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్, రైల్వే, రోడ్డు భద్రత అడిషనల్ డీజీగా ఉన్న మహేశ్ భగవత్, అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న నాగిరెడ్డి పోటీలో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా రాచకొండ సీపీగా ఉన్న సు«దీర్‌బాబు అనూహ్యంగా బదిలీ కావడంతో ఐజీ తరుణ్ జోషీకి రాచకొండ సీపీగా బాధ్యతలు అప్పగించారు. అయితే సు«దీర్‌బాబు తిరిగి సీపీగా వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు గతంలో ఈ పోస్టులో పనిచేసి, పౌరసరఫరాల కమిషనర్‌గా బదిలీ అయిన డీఎస్ చౌహాన్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
కౌంటింగ్ ముంగిట మరో కుట్ర
సాక్షి, అమరావతి: కీలకమైన ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఒత్తిడికి ఎన్నికల కమిషన్ (ఈసీ), రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి వ్యవహరిస్తున్నారన్నది మరోసారి స్పష్టమైంది. అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు హఠాత్తుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదీ పంజాబ్ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆయన పోలింగ్ ముగిసిన తరువాత వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న దామోదర్‌ను హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని.. కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీచేయడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది. టీడీపీకి వీర విధేయుడు.. 2007 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ దామోదర్ అత్యంత వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారి మధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు అండతో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. పశి్చమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నాన్ కేడర్ ఎస్పీ అయినప్పటికీ దామోదర్‌ను 2019 సంవత్సరంలో ఎన్నికల కోసమని విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. వైఎస్సార్సీపీ పటిష్టంగా ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల పోలింగ్ రోజున టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులతో బీభత్సం సృష్టించి కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని బంధించాయి.దాదాపు నాలుగు గంటలపాటు టీడీపీ రౌడీమూకలు స్వైర విహారం చేసినా పోలీసులు, ఎస్పీగా ఉన్న దామోదర్ సైతం పట్టించుకోలేదు. సరికదా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించలేదు. అప్పట్లో విశాఖపట్నం డీఐజీ స్పందించి అదనపు బలగాలను కురుపాం పంపించడంతో నాలుగు గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదీ దామోదర్ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ట్రాక్ రికార్డ్.అలాంటి అధికారికి కంట్రోల్ రూమ్ బాధ్యతలా?ఎన్నికల విధుల్లో ఉద్దేశపూర్వకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్ దామోదర్‌కు ప్రస్తుతం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, ఈసీకి నోడల్ అధికారిగా ఉన్న అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబాత్ర బాగ్చీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా విధ్వంసకర సంఘటనలు జరిగితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అందుకోసం జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేయడం ఆయన బాధ్యత. అంటే.. డీజీపీ తరఫున జిల్లా ఎస్పీలకు ఆయనే ఆదేశాలు జారీచేస్తారు.2019 ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో విఫలమైన ఆయన ప్రస్తుతం కంట్రోల్ రూమ్ బాధ్యతలను ఎలా నిర్వహించగలరని డీజీపీ, అదనపు డీజీ భావించారో అర్థంకావడంలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే దామోదర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇటీవల పోలింగ్ రోజున పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డాయి.అదే రీతిలో కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యానికి కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయినాసరే.. టీడీపీకి అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన దామోదర్‌కు కంట్రోల్ రూమ్ బాధ్యతలు అప్పగించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకు.. టీడీపీ గూండా మూకలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎస్పీలను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
502 ప్రాంతాల్లో ఏపీ పోలీసుల కార్డెన్ సెర్చ్
-
ఏపీలో కౌంటింగ్ భద్రతపై పోలీస్ శాఖ పత్యేక దృష్టి
-
పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న అక్కసుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్‌కు దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్ తరువాత సైతం బడుగు, బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడులను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్సార్సీపీ నేతలు వాపోతున్నారు. పోలింగ్ రోజు, తరువాత పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగింది. ఓటేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీలపై దాడి రెంటచింతల మండలం తుమృకోటలో మే 13న ఓటు వేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలపై టీడీపీలోని అగ్రకుల నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే క్యూలైన్లలో ఉన్న మహిళల్ని కొట్టడంతోపాటు వారిని బయటకు తరిమేసిన టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలింగ్ బూత్‌లో ఏజెంట్లను బయటకు గెంటేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తున్న మహిళల తలలు పగులగొట్టారు. దీంతో బాధిత మహిళలు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఆ ఒక్క కులమే గ్రామంలో బతకాలా.. దళితులకు ఓటు వేసే హక్కులేదా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్య నాయక్, కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావు నాయక్, నాగేశ్వరరావు నాయక్‌లపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. పాలువాయిగేటు బూత్‌లలో అరాచకం పాలువాయిగేటు గ్రామంలో టీడీపీ గూండాలు ఈ నెల 13న ఉదయం 6.30 గంటల సమయంలో ప్రవేశించి గ్రామంలోని 201, 202 పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీకి చెందిన వారిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరిరావు బరితెగించి ఓటర్లపై దౌర్జన్యానికి దిగారు. 202 బూత్‌లోకి వెళ్లి ఓటర్లను భయాందోళనకు గురిచేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్‌కు, నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి, ఎస్పీ బిందుమాధవ్, జేసీ శ్యామ్‌ప్రసాద్ తదితర ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ సమయంలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో వచ్చి వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, శ్రీను, మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా టీడీపీ వర్గీయులు పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు నంబూరి శేషగిరిరావు. అతనిపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని రక్షించాడంటూ చంద్రబాబు ఫోన్లో పరామర్శించడంపై పాలువాయిగేటు గ్రామ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పోలింగ్ ముగిశాక బుడగ జంగాలపైనా దాడి కారంపూడి మండలం పేటసన్నెగండ్ల శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్ ముగిశాక వారి ఇళ్లపై దాడి చేశారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ఇళ్లలోని సామాన్లు, చివరకు ఫ్యాన్లు, బల్బులను కూడా పగులగొట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో కారును ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో పోతురాజుగుట్టలోని వారంతా ప్రాణభయంతో పారిపోయి వేరేచోట తలదాచుకున్నారు. ‘ఏరా.. టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఊరొదిలి పారిపోయిన బడుగు జీవులు గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్ల వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ రౌడీలు, గూండాలను తీసుకొచ్చి పోలింగ్ రోజు రాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులకు పాల్పడి ధ్వంసరచన సాగించారు. బైక్‌లు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామగ్రితోపాటు టీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని వైఎస్సార్సీపీ నేతలు పొలాల్లోకి పారిపోయి అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు, మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారని తెలిసి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. పోలీసులకు విషయం తెలిసినా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన బాధితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్‌కుమార్, కాసు మహేష్‌రెడ్డిపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయంటే వారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నాయకుల్ని గ్రామాలు దాటించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా చొరబడ్డారు. మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని పురుషులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ముస్లిం వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. కంభంపాడులో విధ్వంసకాండ పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్ రోజున వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలపైనా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య), సతీమణి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు అంజిమ్మ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడ్డారు. పలుమార్లు ఎస్సీ, బీసీ కాలనీలకు టీడీపీ రౌడీ మూక వెళ్లి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఎస్సీలపై దాష్టీకం చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా మే 13వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీకి ఎస్సీలు ఓటు వేశారన్న అక్కసుతో వారిపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి కాలనీకి చెందిన ఎస్సీలు గ్రామంలోని ప్లాంట్‌నుంచి మంచినీరు తీసుకువెళ్లకుండా టీడీపీ నేతలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. ఓటేయకుండా అడ్డుకున్నారు ఓటేద్దామని పోలింగ్ బూత్‌కు వెళితే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో ఇంటికి పారిపోయా. అధికారులకు చెప్పినా చూస్తూ నిలబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడం మేలని ఓటేయకుండా తిరిగొచ్చేశా. –కర్రా ఏసుపాదం, ఎస్సీ మహిళ, తుమృకోట ఓటు వేయలేకపోయా ఓటు వేయాలని రెండుసార్లు పోలింగ్ బూత్‌కు వెళ్లాను. అక్కడ యుద్ధ వాతావరణం చూసి భయపడి ఇంటికి వచ్చేశా. టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తూ బడుగులను భయపెట్టి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. – నందిగం పున్నమ్మ, ఎస్సీ మహిళ, తుమృకోట నా భర్తను కొట్టారు ఓటు వేయడానికి వెళ్లిన నా భర్త దీపావత్ స్వామినాయక్‌ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టారు. నన్ను కూడా ఓటు వేయకుండా బెదిరించారు. పోలింగ్ బూత్‌ల వద్ద దాడులు చేయడంతో మా కాలనీలో ఎవరూ ఓటు వేయలేదు. అధికారులు మాకు రక్షణ కలి్పంచలేకపోవడం వల్ల ప్రాణ భయంతో ఓటు వేయడానికి వెళ్లలేదు. – దీపావత్ రమణ, ఎస్టీ మహిళ, తుమృకోట ప్రాణభయంతో పరుగులు పెట్టా ఓటు వేయవద్దని.. వేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు బెదిరించారు. గ్రామస్తులు లెక్కచేయకపోవడంతో రిగ్గింగ్ చేయాలనే తలంపుతో దళితులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టా. – కత్తి భూలక్ష్మి, ఎస్సీ మహిళ, పాలువాయిగేటు, రెంటచింతల మండలం వైఎస్సార్ సీపీకి ఓటు వేశామని దాడి టీడీపీ నేతలు పోలింగ్ రోజు మా ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్టు కొట్టారు. మా ఆస్తులను ధ్వంసం చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. నాతో మరో నలుగురిని కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. బీభత్సం చేశారు. – గొర్ల సైదులు, జంగాల కాలనీ, పేటసన్నెగండ్ల , కారంపూడి -
ఎన్నికల సంఘం సఛ్చీలతను నిరూపించుకోవాలి
సాక్షి, అమరావతి: మాచర్లతో పాటు పల్నాడు ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ కోరింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన పాల్వాయిగేట్ పోలింగ్ స్టేషన్‌లోని వెబ్ కామ్ ఫుటేజి బయటకు ఎలా వచ్చిందో దర్యాప్తు చేయాలని కోరింది. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి వెబ్ కామ్‌లో రికార్డయిన వీడియో ఓ పార్టీ నేత అయిన లోకేశ్‌కు ఎలా చేరిందో ఎన్నికల కమిషన్ స్పష్టం చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. సున్నితమైన అంశం వీడియోను లోకేశ్ ఎక్స్ ఖాతా ద్వారా పబ్లిక్ డొమైన్లో పెట్టడమే కాకుండా, ట్వీట్ చేయడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారం వెనుక కొంతమంది ఎన్నికల కమిషన్ అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. కోర్టుకు మాత్రమే సమర్పించాల్సిన ఈ వీడియోను బహిర్గతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని ఇతర పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఘటనల వీడియోలను కూడా విడుదల చేయాలని కోరారు. ఈ పరిణామాలన్నీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అధికారుల సఛ్చీలతపై అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు. ఒక్క మాచర్లలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది, పోలీస్ అధికారులు సైతం ఓ పార్టికి కొమ్ముకాసేలా వ్యవహరించారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. పౌరులకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేనప్పుడు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఏ విధంగా సగటు ఓటరుకు నమ్మకం కలుగుతుందని ప్రశి్నంచారు. ఇతర పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఘటనలపైనా ఇదే తరహాలో చర్యలు తీసుకుంటే ఎన్నికల కమిషన్‌పై విశ్వాసం పెరుగుతుందన్నారు. ఇతర వీడియోలను బయటపెట్టడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బా«ధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికల సంఘం సఛ్చీలతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. -
అంతకు మించి అరాచకం!
సాక్షి, అమరావతి: ఎన్నికల హింసకు తెగబడ్డ పచ్చ ముఠాలు ఈ కుట్రలకు పదును పెడుతుండటం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. పోలింగ్ సందర్భంగా యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ రౌడీ మూకలు ఓట్ల లెక్కింపు రోజు మరింత బరి తెగించేందుకు పథకం రూపొందించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారితోపాటు అదుపులోకి తీసుకున్న వారిలో 75% మంది టీడీపీకి చెందినవారే కావడం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలకు అద్దంపడుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అలజడులు రేకెత్తించడం, జూన్ 4న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టించేందుకు భారీ కుట్రలకు తెర తీశాయి. పచ్చ ముఠాలు, అల్లరి మూకలు విసురుతున్న సవాల్‌ను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ సందర్భంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు కార్డన్ – సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు శాఖసోదాలు నిర్వహిస్తోంది. నేర చరితులను అదుపులోకి తీసుకుంటోంది. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలను, రికార్డులు లేని వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టింది. బదిలీలతో అల్లరి మూకల అరాచకం..రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకలు యథేచ్చగా విధ్వంస కాండకు తెగబడ్డాయి. చంద్రబాబు, పురందేశ్వరిఈసీపై ఒత్తిడి తెచ్చి పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పన్నాగాన్ని అమలు చేశారు. ప్రధానంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులు, రాడ్లతో విరుచుకుపడటంతోపాటు బాంబు దాడులకు కూడా తెగబడి బీభత్సం సృష్టించాయి.గూండాగిరీ అంతా పచ్చముఠాదేపోలింగ్‌కు ముందు, అనంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినవారిని గుర్తించి పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఎన్నికల ముందు నమోదైన కేసులతో ప్రమేయం ఉన్న 1,522 మందిని గుర్తించి కొందరిని అరెస్ట్ చేసింది. మిగిలిన వారికి 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. వీరితో దాదాపు 1,300 మంది టీడీపీ వర్గీయులే కావడం గమనార్హం. ఇక పోలింగ్ రోజు దాడులు, ఘర్షణల కేసుల్లో ప్రమేయం ఉన్న 2,790 మందిని గుర్తించగా కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. పోలింగ్ రోజుల అరాచకాలకు తెగబడ్డ వారిలో దాదాపు 2,400 మంది టీడీపీకి చెందిన వారే కావడం ఆ పార్టీ కుట్రలను బట్టబయలు చేస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 85 మందిపై హిస్టరీ షీట్లను తెరవగా వీరిలో 58 మంది టీడీపీ వర్గీయులే ఉన్నారు. టీడీపీకి చెందిన ముగ్గురిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించగా మరో ఇద్దరిని జిల్లాల నుంచి బహిష్కరించారు. పోలీసుశాఖ గత మూడు రోజులుగా 301 సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ – సెర్చ్ ఆపరేషన్ల ద్వారా విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎటువంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేసింది. 482 లీటర్ల సారాయి, 3,332 లీటర్ల అక్రమ మద్యం, 436 లీటర్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలకు తెగబడే ప్రమాదం ఉన్నందున పటిష్ట బందోబస్తు కల్పించారు. 350 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలకు కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు 24/7 మూడంచెల భద్రతతో పహరా కాస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలను సమకూర్చారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద వెయ్యికి పైగా అధునాతన ఫేస్ రికగ్నైజేషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్), ఎస్పీ/ పోలీస్ కమిషనర్లు పాసులు జారీ చేసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలనకు వచ్చిన అధికారులు, సిబ్బంది వివరాలను నమోదు చేస్తున్నారు. వీడియోగ్రఫీ ద్వారానే లోపలికి అనుమతిస్తున్నారు. అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పటిష్ట నిఘా కోసం స్ట్రాంగ్ రూమ్‌ల చుట్టూ ఫ్లడ్ లైట్లను అమర్చారు. స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్న ప్రదేశానికి 2 కి.మీ. పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించి డ్రోన్లు, బెల్లూను ఎగురవేయడాన్ని నిషేధించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించే ప్రక్రియను ఖరారు చేశారు.అమలులో నిషేధాజ్ఞలుస్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలున్న నగరాలు, పట్టణాల్లో ఓట్ల లెక్కింపు ముగిసేవరకూ వరకూ పోలీసు శాఖ నిషేధాజ్ఞలను విధించింది. 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమలులో ఉంటాయని ప్రకటించింది. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కర్రలు, కత్తులు, రాడ్లు, ఇతర ఆయుధాలతో సంచరించకూడదని హెచ్చరించింది. పెట్రోల్ బంకుల్లో విడిగా పెట్రోల్, డీజిల్ విక్రయించకూడదని ఆదేశించింది. అసత్య వార్తలు, ఫేక్ న్యూస్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయకూడదని పేర్కొంది.ప్రజలు సహకరించాలి: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాఅసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తాం. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. సంయమనం పాటించాలి. చట్టవ్యతిరేక, అసాంఘిక శక్తుల కదలికల గురించి టోల్ ఫ్రీ నంబర్లు 100, 112లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమివ్వాలి.కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టంఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశంపై ఈసీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. రాష్ట్రంలో 33 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. లెక్కింపు త్వరగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ప్రతిపాదించారు. పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత 15 రోజుల వరకు 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే కొనసాగనున్నాయి. -
బదిలీలతో బరితెగింపు
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్ బృందం ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్ అధికారుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసపోలింగ్‌కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అదనపు సెక్షన్లు చేర్చండి..విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్ స్పష్టం చేసింది.నాలుగు బృందాలు..పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్సీపీ పేర్కొంది. పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్ ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.హక్కులు కాలరాశారు: రావెల కిషోర్ బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 33 కేసులు.. 1,370 మంది నిందితులుపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారు. మరో 94 మందికి సెక్షన్ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. -
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా ?
-
టీడీపీ అరాచకం.. తలలు పగిలినా, ఎస్పీ ఫోన్ కూడా ఎత్తలేదు
-
ప్రశాంత ఎన్నికలకు ‘పోలీస్’ కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ సన్నద్ధమవుతున్నది. ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్గదర్శకాలను పాటిస్తూ కార్యాచరణను ఖరారు చేసింది. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే 14,141 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు పోలీస్ శాఖ గుర్తించింది. ప్రస్తుతం.. 46,165 పోలింగ్ కేంద్రాలు.. మరో 887 కేంద్రాలకు ప్రతిపాదనలు.. 2024 సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే 46,165 పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. అదనంగా మరో 887 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రతిపాదనలను పంపారు. దీనిపై ఈసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే 14,141 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రానికి చెందిన 1,14,950మంది సివిల్ పోలీసులు, 52 కంపెనీల రాష్ట్ర సాయుధ బలగాలతోపాటు అదనంగా 491 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను నియోగించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో భద్రతా విధుల్లో నియోగించాలని నిర్ణయించారు. ఇక 14,141 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్‌ను నిశితంగా పర్యవేక్షిస్తారు. ఇక ఒక మైక్రో అబ్జర్వర్‌ను ఆ పోలింగ్ కేంద్రాల్లో ఒక మైక్రో అబ్జర్వర్‌ను కూడా నియమించాలని ఈసీ నిర్ణయించింది. ఆ పోలింగ్ కేంద్రాల పరిధిలో రాష్ట్ర పోలీసు, కేంద్ర సాయుధ బలగాలు క్రమం తప్పకుండా తరచూ కవాతు నిర్వహిస్తాయి. ఆ పరిధిలో పెండింగ్ నాన్‌బెయిలబుల్ వారంట్లను త్వరితగతిన జారీ చేయాలని ఇప్పటికే ఆదేశించింది. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన, ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్నవారి కదలికలపై నిఘాను పటిష్టపరిచారు. జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఎప్పటికప్పుడు బందోబస్తు, నిఘా చర్యలను పర్యవేక్షిస్తూ ఎన్నికల ప్రధాన అధికారికి నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.జైళ్లలోనూ నిఘా పటిష్టం.. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లోని జైళ్లను తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. జైళ్ల మాన్యువల్ సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఇక గతంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం జైళ్లలో ఉన్న ఖైదీలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇప్పటికే అటువంటి ఖైదీలకు ములాఖత్‌లు రద్దు చేశారు. ఎన్నికలు ముగిసేవరకు ఖైదీలను ఒక జైలు నుంచి మరో జైలుకు తరలించకూడదని నిర్ణయించారు. న్యాయస్థానం ఆదేశాలు ఉంటే తప్పా ఖైదీలను ఇతర జైళ్లకు తరలించ వద్దని ఆదేశించారు. -
ప్రశాంత పోలింగ్‌కు టెక్ పోలీసింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. అందుకోసం మరింత విస్తృతంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సమాయత్తమైంది. ప్రధానంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం దాదాపు లేదు. కానీ మన రాష్ట్ర సరిహద్దులకు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులకు ఇంకా పట్టుండటంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం సదా అప్రమత్తంగా ఉంటోంది.ఇక ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిస్తారని పోలీసు శాఖ భావిస్తోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు తెగబడే అవకాశం ఉందని, ఉనికి చాటుకునేందుకైనా ఎక్కడో ఒకచోట పోలింగ్‌ను భగ్నం చేసేందుకు యత్నించవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో మన రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకే ఏవోబీలోని మారుమూల గ్రామాలు, గూడేల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా వాడుకోనుంది. ♦ ఏవోబీలో పోలింగ్ నిర్వహణ కోసం డ్రోన టెక్నాలజీని తొలిసారిగా వినియోగించాలని నిర్ణయించింది. జమ్ము–కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని తొలిసారిగా ఈ ఎన్నికల కోసం ఏవోబీలో ప్రవేశపెట్టనుంది.శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పోలీసు నిఘా విధుల కోసం డ్రోన్లను ఉపయోగించనున్నారు. మొత్తం ఏవోబీ అంతా నిఘా పెట్టేందుకు అవసరమైన డ్రోన్లను ఇప్పటికే పోలీసు శాఖ తెప్పించింది. ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మావోయిస్టులు, అనుమానితుల కదలికలపై ఈ డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. ♦ ఏవోబీ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శాటిలైట్ మ్యాపింగ్ చేసేందుకు పోలీసు శాఖ కార్యాచరణ చేపట్టింది. గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ కోసం గతంలో పోలీసు శాఖ ఎంపిక చేసిన ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసింది. ఈసారి మొత్తం ఏవోబీ ప్రాంతాన్ని శాటిలైట్ మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది.ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉన్న ప్రధాన మార్గాలు, అడ్డదారులు, డొంకదారులతోసహా మొత్తం ప్రాంతాన్ని శాటిలైట్ మ్యాపింగ్ చేయనున్నారు. తద్వారా మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశించేందుకు యత్నిస్తే వెంటనే గుర్తించి పోలీసు బలగాలను అప్రమత్తం చేయవచ్చని పోలీసు శాఖ భావిస్తోంది. ♦ ప్రశాంత పోలింగ్ నిర్వహించేందుకు ఏవోబీ అంతటిని పోలీసు, గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పట్టనున్నాయి. అందుకోసం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కూంబింగ్‌లో ఉన్న పోలీసులపై మావోయిస్టులు దొంగదెబ్బ తీయకుండా ఆధునిక జీపీఎస్ టెక్నాలజీని వారికి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలింగ్ విధుల కోసం ఏవోబీలో మోహరించే భద్రతా బలగాలు కూడా అదే జీపీఎస్ టెక్నాలజీని వినియోగించుకోనున్నాయి. -
ప్రజాగళం: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌లో..
కావలి/కోవెలకుంట్ల: ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల కంటే హంతకులే నయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, నంద్యాల జిల్లా బనగానపల్లెల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వానికి ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు. కేసు పెడతారు. తర్వాత సీబీసీఐడీ వారు వస్తారు. వాళ్లు అరెస్ట్ చేస్తారు. జైల్లో పెడతారు. జైల్లో కొడతారు. టార్చర్ చేస్తారు. కొంతమంది పోలీసులు చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు’ అంటూ పోలీసుల ఆత్మగౌరవాన్ని, నిబద్ధతను కించపరిచేలా మాట్లాడారు. ఇక.. అధికారం కోసం మళ్లీ ఆయన ఇస్తున్న ఎన్నికల హామీలపై సెటైర్లు పడుతున్నాయి. అధికారంలోకి వస్తే ‘వర్క్ ఫ్రం హోం’ తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్(ఈ స్కాంలోనే ఆయన అరెస్టైంది)తో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి లాభాల బాట పట్టిస్తానన్నారు. ఒకప్పుడు ఏ నోటితో అయితే వలంటీర్లను విమర్శించారో.. ఇప్పుడు అదే వలంటీర్లపై వరాల జల్లు కురిపించే యత్నం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లను తొలగించబోమని చెప్పారు. మళ్లీ అరిగిపోయిన రీల్ వేసి.. హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసింది తానేనన్నారు. హైటెక్ సిటీ, ఔటర్‌రింగ్‌రోడ్, విమానాశ్రయం అంటే తన పేరే గుర్తుచేసుకుంటారని చెప్పారు. టెక్నాలజీ, సెల్ఫోన్లు, పవర్ సెక్టార్ తన చలువేనన్నారు. బస్సులోనే పడిగాపులు: సభకు జనాలు రాకపోవడంతో చంద్రబాబు గంటకుపైగా బస్సులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజాగళం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక్కొక్కరికి రూ. 500 వంతున ఇచ్చి తీసుకువచ్చిన జనాలు కూడా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగారు. కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిపై అసంతృప్తితోనే పార్టీ నేతలు, కార్యకర్తలు సభకు ముఖం చాటేశారని చెబుతున్నారు. ఆటోల్లో తీసుకువచ్చిన జనాలకు ‘రాజరాజేశ్వరి ఐస్’ కంపెనీ పేరుతో ఉన్న స్లిప్పులను సభాస్థలి వద్దే పంపిణీ చేశారు. వెళ్లేటప్పుడు స్లిప్ ఇచ్చి రూ.500 తీసుకోవాలని సూచించారు. పోలీసులు, ఎన్నికల నిఘా సిబ్బంది ముందే స్లిప్పులు పంపిణీ చేస్తున్నా ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక వ్యక్తుల పేర్లు
-
Phone tapping case: బెదిరింపుల దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. అనుకోకుండా దొరికిన అవకాశంతో.. ప్రభాకర్‌రావుతో పాటు హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ రావు తదితరులు.. విదేశాల నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల వరకు వాటిని కేవలం విపక్షాలపై నిఘా కోసమే వాడారు. అయితే వారి ఫోన్లు రికార్డు చేస్తుండగా వెలుగులోకి వచ్చిన అంశాలను గమనించిన తర్వాత, వాటిని ఆర్థిక లబ్ధికి అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని దీని కోసం వినియోగించారు. బెదిరింపుల దందా ప్రారంభించేందుకు ప్రభాకర్‌రావు తనవారైన మరింత మందిని ఎస్ఐబీలోకి తీసుకువచ్చారు. ఎలక్టోరల్ బాండ్లూ కొనిపించారు.. ప్రభాకర్‌రావు బృందం టార్గెట్ చేసిన వారిలో పలువురు ఫార్మా కంపెనీల యజమానులు, బడా బిల్డర్లు, నగల దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. వీరి గురించిన సమాచారం తెలిసిన తర్వాత వారి కార్యాలయాలు, నివాసాల సమీపంలోకి ట్యాపింగ్ ఉపకరణాలతో బృందాలను పంపేవారు. బృందాల్లో ఉన్నవారు బాధితుల ఫోన్లలో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేసుకుని వచ్చి ప్రణీత్‌రావుకు అప్పగించేవారు. వీటిని విశ్లేషించేందుకు పర్వతనగర్‌లోని వార్‌రూమ్‌లో ఓ ప్రత్యేక బృందం పని చేసేది. ఇలా ఆయా వ్యాపారుల వ్యక్తిగత జీవితాలు, బలహీనతలు తదితరాలను గుర్తించే ప్రణీత్‌రావు.. విషయాన్ని ప్రభాకర్‌రావుతో పాటు రాధాకిషన్‌రావు దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆపై రంగంలోకి దిగే వీరి సైన్యాలు వారిని బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. బెదిరింపులకు లొంగని కొందరు వ్యాపారుల వాట్సాప్‌లకు ట్యాపింగ్‌లో బయటపడిన సంభాషణల ఆడియోలను పంపి లొంగదీసుకున్నట్లు తెలిసింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్టోరల్ బాండ్ల విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా చేసినట్లు సమాచారం. ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. సాక్షి, యాదాద్రి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రధాన నింతుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్ఐగా, భువనగిరిలో సీఐగా విధులు నిర్వర్తించారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. వీరి దందా వెలుగు చూసిన నేపథ్యంలో వారితో ఆ సమయంలో అంటకాగిన పోలీస్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. టెక్నాలజీ వాడకంలో భుజంగరావు దిట్ట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని గుర్తించడంలో అప్పుడు డీఎస్పీగా ఉన్న నాయిని భుజంగరావు ట్యాపింగ్ సహా టెక్నాలజీ వాడకంలో తన నైపుణ్యాన్ని వినియోగించారు. కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. వాటి ఆధారంగా జిల్లా కోర్టు నింతునికి ఉరి శిక్ష విధించింది. 2021లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్ ఫర్ ఎక్స్లెంట్ ఇన్వెస్టిగేషన్ (అద్భుత పరిశోధన)తో సత్కరించింది. ప్రస్తుతం ఆయన జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. డీజీపీ స్థాయి వారి ఫోన్లూ ట్యాప్ ఈ ట్యాపింగ్ టీమ్ పోలీసు విభాగంలోని వారిని కూడా వదిలిపెట్టలేదు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఆయనకంటే తక్కువ, ఎక్కువ హోదాల్లో ఉన్న వారి ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. పలువురు ఐపీఎస్‌లతో పాటు ఐఏఎస్ అధికారుల పైనా నిఘా ఉంచినట్లు తెలిసింది. నగర పోలీసు కమిషనర్‌గా పని చేసి డీజీపీగా వెళ్లిన ఓ అధికారి సైతం ప్రభాకర్‌రావు చర్యల్ని అడ్డుకోలేకపోయారు. దీంతో ఆయన ఓ దశలో సాధారణ ఫోన్, వాట్సాప్‌లు కాకుండా సిగ్నల్ యాప్ వాడాలని ఎస్పీలు, ఇతర అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు అప్పట్లో ఐజీలు, డీఐజీలుగా పని చేసిన వాళ్లు కూడా దీని ద్వారానే ఎస్పీలతో సంప్రదింపులు జరిపారంటే వారి అభద్రతా భావాన్ని అంచనా వేయవచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా శనివారం అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను తదుపరి దర్యాప్తు నిమిత్తం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
16 ఏళ్ల డిమాండ్..16 రోజుల్లో పరిష్కారం
సాక్షి, అమరావతి: పోలీసులు ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే యోధులు... కానీ వారి ఆత్మగౌరవం, సంక్షేమం గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలే లేవు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసుల ఆత్మగౌరవాన్ని పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని మరింతగా ఇనుమడింపజేశారు. పోలీసుల సంక్షేమం కోసం కీలక విధాన నిర్ణయాలు తీసుకున్నారు. సర్వీసు నిబంధనలు, ఆర్థిక ప్రయోజనాలు, ఇతరత్రా ప్రయోజనాలు కల్పించే విధాన నిర్ణయాలను సత్వరం ఆమోదించడంపట్ల దాదాపు లక్షమంది పోలీసు అధికారులు, సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోరిన వెంటనే పరిష్కారం బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన తమ యూనిఫామ్‌లో మార్పులు చేయాలని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) కానిస్టేబుళ్లు 16ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ యూనిఫామ్ తమ ఆత్మగౌరవానికి భంగకరంగా ఉందని చెబుతూ వచ్చినా ఇన్నేళ్లు ఫలితం లేకపోయింది. కానీ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్జగన్మోమన్రెడ్డిని కలసి తమ యూనిఫామ్‌లో మార్పులు చేయాలని కోరారు. వారు కోరిన 16రోజుల్లోనే ఏఆర్, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుళ్ల యూనిఫామ్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బ్యారెట్ టోపీ స్థానంలో పీక్ టోపీని ప్రవేశపెట్టింది. కానిస్టేబుల్ నుంచి రిజర్వ్ ఎస్ఐ స్థాయివరకు నలుపు రంగు విజిల్ కార్డ్‌ను తీసుకువచ్చింది. ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు విజిల్ కార్డ్‌తోపాటు పోలీస్ యాంబ్లమ్ ఉన్న నలుపు బకిల్ ఉన్న బెల్ట్‌ను యూనిఫామ్‌లో భాగం చేసింది. దాంతో ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల ఆత్మ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎస్ఐలకు గెజిటెడ్ హోదా రాష్ట్రంలో ఎస్ఐలకు గెజిటెడ్ అధికారి హోదా కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొత్త పీఆర్సీ ద్వారా ఆమేరకు సిఫార్సు చేయనున్నట్టుగా ప్రకటించింది. ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట పోలీసుల ఆర్థిక ప్రయోజనాలు కల్పించే డిమాండ్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సత్వరం చర్యలు తీసుకున్నారు. ఎస్ఎల్ఆర్, ఏఎస్ఎల్ఎస్ బిల్లులను మార్చి 31లోగా చెల్లించాలని ఆర్థిక శాఖను వారం రోజుల క్రితమే ఆదేశించారు. ► పోలీసులకు వివిధ రిస్క్ అలవెన్సుల మంజూరు. ► పోలీసులకు 24 ఏళ్ల సర్వీసు ఇంక్రిమెంట్‌ను కొనసాగిస్తూనే 30 ఏళ్ల సర్వీసుకు ప్రత్యేక ఇంక్రిమెంట్. ► ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు మారే పోలీసులకు 6, 12, 18, 24 ఇంక్రిమెంట్ల మంజూరు అమరవీరుల పిల్లలకు రిజర్వేషన్ విధి నిర్వహణలో ఆశువులు బాసిన పోలీసు అమరవీరుల కుంటుంబాలకు మరింత ప్రయోజనం కలిగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల కుటుంబాల పిల్లలకు ఇంజినీరింగ్, వైద్య విద్య తదితర కోర్సుల్లో 2శాతం రిజర్వేషన్ కల్పించారు. దశాబ్దాలుగా అమరవీరుల కుటుంబాల పిల్లలకు కేవలం 0.25 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్‌ను ఏకంగా 2 శాతానికి పెంచడంతో అమరవీరుల కుటుంబాల్లోని పిల్లలు ఇంజినీరింగ్, వైద్య విద్య, ఇతర ఉన్నత కోర్సుల్లో చేరి ఉజ్వల భవిష్యత్‌ను సాధించేందుకు ముఖ్యమంత్రి అండగా నిలిచారు. ఇతర ప్రయోజనాలు ► సర్వీసుకు సంబంధించిన సమస్యలను విన్నవించుకునేందుకు ఇప్పటివరకు సరైన వేదికలేకపోవడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దీనికి పరిష్కారంగా డీజీపీ కార్యాలయంలో, జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లలో ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు. ► కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో పోలీసు ఆసుపత్రులను ఏర్పాటు చేయడంతోపాటు వైద్య అధికారులను నియమించాలని సీఎం ఆదేశం. ► మహిళా పోలీసులకు అదనంగా ఏడాదికి అయిదు క్యాజువల్ లీవులు మంజూరు చేయడంతోపాటు చైల్డ్ కేర్ లీవులను 150 రోజుల నుంచి 180 రోజులకు పెంపు. ► విధి నిర్వహణలో భాగంగా రాజధానికి వచ్చే మహిళా పోలీసులకు ప్రత్యేక వసతి సౌకర్యం. ► పోలీసులకు ఎల్టీసీ సౌకర్యం పునరుద్ధరణ ► పోలీసు అధికారుల సంఘానికి తొలిసారిగా రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో భాగం చేశారు. ఇటీవల నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకున్నారు. -
విశాఖలో నకిలీ ఎస్ఐల ఘరానా మోసం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): పోలీసు ఎస్సైల వేషమేసి, పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఘరానా మోసగాడైన హనుమంతు రమేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. బాధితుల కథనం ప్రకారం.. మోసాలతోనే బతికే హనుమంతు రమేష్ (47) అడవివరంలోని ఆర్ఆర్ టవర్స్‌లో ఉంటున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు (అక్కచెల్లెళ్లు) ఉండగా ఇటీవల మరో ప్రియరాలితో ఉంటున్నాడు. గత కొంతకాలంగా ప్రియురాలు, మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించారు. వీరికి పలువురు మధ్యవర్తులు సహకరించారు. హనుమంతు, ప్రియురాలు, మిగతా వారు పోలీసు ఎస్సైల గెటప్‌లో రావడంతో వారంతా నమ్మేశారు. దాదాపు 30 మంది నుంచి రూ.3 కోట్ల వరకు దండుకొని మాయమయ్యారు. హైదరాబాద్‌లో అదుపులోకి.. బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసు కమిషనర్ సూచనలతో టాస్‌్కఫోర్స్ బృందాలు హైదరాబాద్ వెళ్లి హనుమంతు రమేష్ ను, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిద్దరినీ గురువారం సాయంత్రం టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం నగర పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా దివ్యాంగ సురక్ష యాప్
-
ఇవాళ ఇక్కడికి.. రేపు ఎక్కడికో
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌లు మొదలు డీఎస్పీల వరకు ఇటీవల పోలీస్‌శాఖలో పెద్ద ఎత్తున బదిలీ లు జరిగాయి. అయితే సివిల్ డీఎస్పీల పోస్టింగ్‌లు మారుస్తూ జరిగిన వరుస బదిలీలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 12న ఏకంగా 110 మంది సివిల్ డీఎస్పీలు, 14వ తేదీన మరో 95మంది, 15న మరో 26 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ఆ తర్వాత ఈనెల 17న వెల్లడైన ఉత్తర్వుల్లోనూ మరో 61 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ప్రతిశాఖలోనూ బదిలీల ప్రక్రియ అత్యంత సహజమే అయినా, ఒకసారి ఇచ్చిన పోస్టింగ్ మారుస్తూ...లేదంటే అప్పటికే ట్రాన్స్ఫర్ చేసిన వారిని తిరిగి అక్కడే కొనసాగి స్తున్నట్టు పేర్కొంటూ వరుస ఉత్తర్వులు వెలువడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘పట్టు’నిలుపుకుని.. ‘అనుకూల’పోస్టింగ్‌లు కొందరు అధికారులు బదిలీ అయినా తమ ‘పట్టు’నిలుపుకొని తిరిగి అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. మరికొందరు బదిలీ అయిన స్థానంలో చేరకముందే రోజుల వ్యవధిలోనే ‘అనుకూల’పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారన్న ప్రచా రం జరుగుతోంది. ఒకే సారి పెద్ద సంఖ్యలో బదిలీ జరిగినప్పుడు కొద్దిమేర పోస్టింగ్‌ల్లో మార్పులు సహజమే కానీ గత మూడు రోజుల్లో విడుదల చేసిన పోస్టింగ్ ఉత్తర్వులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎప్పుడు ఎక్కడికో అనే ఆందోళనలో కొందరు ఒక రోజు వచ్చిన ఆర్డర్ కాపీలో ఉన్న పోస్టింగ్‌లు ఆ తర్వాతి బదిలీ ఉత్తర్వులు వచ్చే సరికి మారిపోతుండడం కొంతమందిని మాత్రం కలవరానికి గురి చేస్తోంది. ఎప్పుడు ఎక్కడికి బదిలీ అవుతామో..అక్కడి నుంచి మళ్లీ ఎక్కడికి మారుస్తున్నారో అన్న గందరగోళం నెలకొందని కొందరు అధికారులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన వారికే మళ్లీ కీలకస్థానాల్లో పోస్టింగ్‌లు దక్కుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ‘పోలీసులపై రాజకీయ పెత్తనం ఉండబోదు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్‌లో చెప్పినా, వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదని కొందరు వాపోతున్నారు. -
15 రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పదిహేను రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గ్రూప్–1లో 60 కొత్త ఖాళీల భర్తీ చేపడతామని తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్ధం కావాలని, ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో.. 441 మంది సింగరేణి కార్మీకుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను సీఎం అందజేశారు. అనంతరం మాట్లాడారు. గత ప్రభుత్వంలో సింగరేణి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తాము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్ సాక్షిగా నియామక పత్రాలను అందజేస్తున్నామన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మీకుల పాత్రను ఎవరూ తగ్గించలేరని, పారీ్టలు విఫలమైన సమయంలోనూ కార్మీకులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. సింగరేణి అండగా నిలిచింది రాష్ట్రంలోని గత ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని, కేంద్రం కూడా సింగరేణికి అనేక అడ్డంకులు సృష్టించిందని సీఎం ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్‌కు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిందన్నారు. సింగరేణిలో 80శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించే అంశంపై చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కారుణ్య నియామకాల వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవ లక్షి్మ, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సింగరేణి ఎండీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతి ప్రయాణం సాఫీగా..
చౌటుప్పల్, కోదాడ : సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు జీఎంఆర్ సంస్థ, పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై పండగ వేళ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగకు తమ స్వస్థలాలకు వెళ్తారు. ముఖ్యంగా హైదరాబాద్, ఆ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేవారితో 65వ నంబర్ హైవేపై విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మినహా మిగతా అన్ని ప్రాంతాలకు రోడ్డుమార్గంలో వెళ్లే వారికి ఇదే ప్రధాన రహదారి. లెక్కకు మించిన వాహనాలు బారులు తీరడంతో సంక్రాంతి సమయంలో ఈ హైవేపై ట్రాఫిక్ నత్తనడకన సాగుతుంది. ఇక సంక్రాంతికి ముందు రోజైతే టోల్గేట్ల వద్ద గంటల తరబడి స్తంభించిపోతుంది. ఇక ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఇక అంతే. ఈ నేపథ్యంలో.. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు దృష్టిలో ఉంచుకుని జీఎంఆర్ సంస్థ ఇప్పటికే తగు చర్యలు చేపట్టింది. మరోవైపు పోలీసులు కూడా అవసరమైన చర్యలు చేపట్టారు. కాగా స్వస్థలాలకు బయలుదేరిన ప్రయాణికులతో గురువారం నాడే హైవేపై రద్దీ పెరిగింది. సొంతవాహనాలపైనే రాక పోకలు సంక్రాంతి సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. గతంలో ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునేవారు. ప్రస్తుతం ఎక్కువగా సొంత వాహనాల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్లు, బస్సుల్లోని రద్దీని తట్టుకోలేక కొందరు అద్దె వాహనాలను తీసుకొని స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారు. దీంతో హైవేపై రద్దీ ఏర్పడుతోంది. గతేడాది సంక్రాంతి పండుగ సమయంలో రోజూ 55 నుంచి 60 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 70 నుంచి 75 వేల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్లాక్స్పాట్ల వద్ద భద్రంగా వెళ్లాలి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించినప్పటికీ వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు 275 కి.మీ. దూరం ఉండగా అందులో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం నుంచి కృష్ణా జిల్లా నందిగామ శివారు వరకు 181 కి.మీ. మేర టోల్రోడ్డు ఉంది. కాగా ఈ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్లు) చాలా ఉన్నాయి. ఆయా ప్రాంతాలను అధికారులు గుర్తించారు. దండుమల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం, పంతంగి, రెడ్డిబావి, పెద్దకాపర్తి, చిట్యాల, గోపలాయిపల్లి, ఏపీ లింగోటం, కట్టంగూర్, పద్మానగర్ జంక్షన్, ఇనుపాముల, కొర్లపహాడ్, టేకుమట్ల, చీకటిగూడెం, సూర్యాపేట శివారు (జనగామ క్రాస్‌రోడ్డు), మునగాల, ముకుందాపురం, ఆకు పాముల బైపాస్, కొమరబండ వై జంక్షన్ కట్టకొమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, రామాపురం క్రాస్‌రోడ్డు, నవాబ్‌పేట, షేర్‌మహమ్మద్‌పేట ప్రాంతాలను ప్రధాన బ్లాక్స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణకు లైటింగ్, సైన్ బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టారు. రేడియం స్టిక్కర్లతో కూడిన రోడ్ మార్జిన్ మార్కింగ్‌లూ వేశారు. ప్రతి 20 కిలోమీటర్లకుఒక అంబులెన్స్ సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీఎంఆర్ సంస్థ ఎన్హెచ్ఏఐ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌తో కూడిన వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ క్రేన్లను సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో టోల్‌ప్లాజా పరిధిలో షిప్టుకు 20మంది చొప్పున అదనపు సిబ్బందిని జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసర ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలు ఉన్నా యి. పోలీస్‌శాఖ ప్రతి టోల్‌ప్లాజా వద్ద 20 మంది పోలీస్‌లతో ప్రత్యేక టీమ్‌లను నియమించనుంది. రిస్క్ మేనేజ్మెంట్ టీమ్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా 1033 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. పొద్దునే ప్రయాణం వద్దు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉదయం పొగమంచు అధికంగా ఉంటోంది. దీని వల్ల రహదారిపై ప్రమా దాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. ఉదయం పొగమంచు తగ్గిన తర్వాతే ప్రయాణాలు పెట్టుకోవాలని కూడా పోలీసులు చెపుతున్నారు. రహదారిపై ప్రమాదం జరిగే చాన్స్ ఉన్న ప్రదేశాలను ముందుగానే తెలుసుకుని జాగ్రత్తగాప్రయాణించాలని పేర్కొంటున్నారు. ఫాస్టాగ్ సరిచూసుకోండి వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ వ్యాలిడిటీ ఉందో లేదో చూసుకోవాలి. సరిపడా నగదు ఉందో లేదో గమనించాలి. బ్లాక్‌లిస్టులో పడితే తిరిగి అప్డేట్ కావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్నా నగదు లేకపోతే టోల్ బూత్‌లోకి వెళ్లాక ఆ విషయం తెలిస్తే లైన్లోనే చిక్కుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడు రీచార్జ్ చేసినా సేవలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. అక్కడ కాస్త జాగ్రత్త అబ్దుల్లాపూర్ మెట్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ వరకు 24 కిలోమీటర్ల మేర విజయవాడ జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వనస్థలిపురం నుంచి దండుమల్కాపూర్ వరకు పనులు ప్రారంభంగా కాగా నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో మాత్రమే రోడ్డు విస్తరణ పూర్తి దశకు చేరుకుంది. చాలా చోట్ల రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వాహనాల సంఖ్య పెరిగిన సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు హైదరాబాద్ – విజయవాడ హైవేపై ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్ పెంచాం. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపకుండా, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా పరిధిలో కొన్ని ప్రధాన బ్లాక్ స్పాట్స్ గుర్తించాం. ఇక్కడ ప్రమాదాలు సంభవించకుండా నిబంధనలు అమలు చేస్తున్నాం. స్పీడ్ లిమిట్ బ్లింక్ లైట్స్ ఏర్పాటుతో రోడ్డుపై లైనింగ్ వేస్తాం. హైవే వెంట ఉన్న గ్రామాల ప్రజలకు, రైతులకు రాంగ్ రూట్లో వెళ్లవద్దని చెబుతున్నాం. –రాహుల్‌హెగ్డే, ఎస్పీ, సూర్యాపేట జిల్లా సురక్షిత ప్రయాణానికి తగిన ఏర్పాట్లు సంక్రాంతి పండుగ రద్దీని ఇప్పటికే అంచనా వేశాం. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీధర్‌రెడ్డి, జీఎంఆర్ సంస్థ మేనేజర్ రోడ్డుపై వాహనాలు నిలపొద్దు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్ల వద్ద అధికారులు వేగాన్ని, వాహనాలను నియంత్రించడానికి స్పీడ్ కంట్రోల్ స్టాపర్లను, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించడంతో పాటు రోడ్డుమీద ఉన్న స్పీడ్ స్టాపర్లను గమనించాలని, అతివేగంగా వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై వాహనాలను నిలపవద్దని కోరుతున్నారు. -
కానిస్టేబుల్ నియామకాలకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో 15,750 కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఎంపిక పరీక్షలో అభ్యర్థులకు నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు ప్రకటించాలన్న సింగిల్ జడ్జి తీర్పును ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)ను ధర్మాసనం ఆదేశించింది. ఆ కమిటీల నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించి నాలుగు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పుతో.. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం 2022 ఆగస్టు 30న తుది రాతపరీక్ష జరిగింది. అందులో దాదాపు 23 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు అభ్యర్థులు పేర్కొన్నారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతోపాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ‘‘ఈ పరీక్షలో నాలుగు ప్రశ్నలను మినహాయించి అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలి. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదు. 57 ప్రశ్న తప్పుగా ఉంది. వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలి. ఈ మార్పులతో పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేసి, ఫలితాలను ప్రకటించాలి. తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’’అని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించలేదని, ఆ తీర్పును కొట్టివేయాలని కోరింది. ఆ పని నిపుణుల కమిటీలే చేయాలి రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశర్వర్రావుల ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నట్టు పేర్కొంది. రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించే నియామక పరీక్షల్లో తలెత్తే సమస్యల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ప్రశ్నలు తొలగించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి పనులను నిపుణుల కమిటీలే చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రశ్నల తప్పిదాలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అభ్యర్థులలో విశ్వాసం పెంపొందించేలా పారదర్శకంగా రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని నియామక బోర్టును ఆదేశించింది. ఒక కమిటీలో ఉన్న సభ్యులు మరో కమిటీలో ఉండకూడదని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు ఊరట రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 4వ తేదీనే ఫలితాలు ప్రకటించింది. మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ.. జాబితాను విడుదల చేసింది. ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. వారందరికీ హైకోర్టు ధర్మాసనం తీర్పుతో ఊరట లభించింది. -
పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు
సాక్షి, హైదరాబాద్: విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు అగ్నిమాపక శాఖ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో మొత్తం 636 మంది సిబ్బందికి ఈ పతకాల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 89 మందికి ఉత్తమ సేవా, 42 మందికి కఠిన సేవా, 435 మందికి సేవా పతకాలు లభించాయి. 9 మందికి మహోన్నత సేవా పతకాలు లభించాయి. ఏసీబీలో ఐదుగురికి ఉత్తమ సేవా, ముగ్గురికి సేవా పతకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ముగ్గురికి ఉత్తమ సేవా, ఏడుగురికి సేవా పతకాలు లభించాయి. అగ్నిమాపక శాఖలో ఆరుగురికి శౌర్య పతకాలు, ముగ్గురు ఉత్తమ సేవా, 13 మంది సేవా పతకాలు పొందారు. ఎస్పీఎఫ్లో ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురికి ఉత్తమ సేవా, 15 మందికి సేవా పతకాలు, ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఉపేందర్‌కు శౌర్య పతకం లభించింది. -
భారమైతే బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ శాఖ గ్రామసభలను నిర్వహిస్తుందని, పోలీసుశాఖ వాటిని గాడిలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం అమల్లో ఏవైనా ఇబ్బందులుంటే సీఎస్, డీజీపీకి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. పని చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇష్టం లేకపోయినా చెప్పాలని.. వేరే చోటికి బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉండి ఏమీ చేయబోమంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం ఎవరికైనా ఇష్టం లేకున్నా.. ఎక్కువగా పనిచేయాల్సి వస్తోందని, 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది ఎందుకని అనిపించినా చెప్పండి. అలాంటి వారిని వేరే చోటికి బదిలీ చేస్తాం. 18 గంటల పని ఉండని ప్రాంతానికి బదిలీ చేయడంలో అభ్యంతరం లేదు. అధికారుల సూచనలు, సలహాలను ఓపెన్ మైండ్‌తో స్వీకరిస్తాం. అధికారుల పనితీరుకు నీతి, నిజాయతీలే పెద్ద కొలమానం. పోస్టింగ్స్‌లో వాటినే పరిగణనలోకి తీసుకుంటాం..’’అని రేవంత్ చెప్పారు. ప్రజా పాలనకు ప్రత్యేకాధికారులు ప్రజాపాలనలో భాగంగా ప్రతి మండలంలో రోజూ రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మండలంలో రెండు బృందాలుంటే ఒక బృందానికి ఎమ్మార్వో, మరో బృందానికి ఎంపీడీవో బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కోసం 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తామని చెప్పారు. ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలని.. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నిరక్షరాస్యుల దరఖాస్తులను నింపించడానికి అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. దరఖాస్తులకు అవసరమైన డేటా, ఆధార్‌కార్డు, ఫోటో వంటివి తేవాలని ప్రజలకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. అమరవీరులు, ఉద్యమకారులపై ఎఫ్ఐఆర్, కేసుల వివరాలను సేకరించాల్సి ఉంటుందని, ముందే అప్లికేషన్లు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజాపాలన కింద సేకరించిన దరఖాస్తులను డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిని స్రూ్కటినీ చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామసభలు, ప్రజాపాలన పరిస్థితిని సమీక్షించుకుందామన్నారు. అద్దాల మేడలు కట్టి అభివృద్ధి అంటే ఎలా? ‘‘అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరసలోని పేదలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందినట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది..’’అని రేవంత్ చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే పూర్తి బాధ్యత పెట్టామని, వారిపై నమ్మకంతో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి ‘‘తెలంగాణ ప్రజలు గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. అభివృద్ధిని విస్మరిస్తే వారి ప్రతిస్పందన చాలా కటువుగా ఉంటుంది. అది మీరంతా ఇటీవలే చూశారు..’’అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోకుంటే ఎంతటి వారినైనా ఇంటికి పంపించగలరని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వమే.. కానీ.. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమేనని.. అయితే ప్రజలతో శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. అధికారుల్లో మానవీయ కోణం ఉంటే ప్రజల సమస్యల్లో 90శాతం సమస్యలు అక్కడే పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. రూల్స్‌ను అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో సానుకూల (పాజిటివ్) దృక్పథం, ధోరణితో ముందుకెళ్లాలన్నారు. అలా కాకుండా ఏ కాగితం వచ్చినా ఎలా తిరస్కరించాలన్న ఆలోచనా ధోరణి ఉంటే అభివృద్ధి, సంక్షేమం సరైన దిశగా ప్రయాణించవని స్పష్టం చేశారు. పాత ప్రభుత్వ పద్ధతులను మానుకుంటే మంచిది డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలని.. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్లు, ఎస్పీలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ వచ్చిన దశాబ్దకాలం తర్వాత ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని.. ఈ ప్రభుత్వం తమదేనన్న నమ్మకం, భరోసాను ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని సూచించారు. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మార్చుకోవాలని, ఆ మైండ్‌సెట్ ఇక ముందు ఉండకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. మిగతా గ్యారంటీలను కూడా వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారుకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
48.47% పెరిగిన సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంతో పోలిస్తే సైబర్ నేరాల నమోదు 48.47 శాతం పెరిగినట్టు తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది. ఆర్థిక నేరాలు, మోసాలు సైతం పెరిగినట్టు క్రైమ్ ఇన్ తెలంగాణ–2022 పుస్తకం వెల్లడించింది. తెలంగాణ సీఐడీ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన క్రైమ్ ఇన్ తెలంగాణ–2022 పుస్తకాన్ని సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్‌తో కలిసి డీజీపీ రవిగుప్తా మంగళవారం డీజీపీ కార్యాలయంలో విడుదల చేశారు. 2021తో పోలిస్తే తెలంగాణలో 2022లో ఆర్థిక నేరాల్లో 41.37 శాతం పెరుగుదల నమోదైందనీ, అదేవిధంగా మోసాలకు సంబంధించిన కేసుల్లోనూ 43.3 శాతం పెరుగుదల ఉన్నట్టు పుస్తకంలో వెల్లడించారు. నేషనల్ క్రైమ్‌రికార్డ్స్‌బ్యూరో(ఎన్సీబీఆర్) తరహాలోనే రాష్ట్ర సీఐడీలోని స్టేట్‌క్రైమ్ రికార్డ్స్బ్యూరో(ఎస్సీఆర్బీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నేరాల నమోదు, నేరాల సరళిని తెలియజేసేలా పూర్తి వివరాలతో కూడిన ‘‘క్రైం ఇన్ తెలంగాణ–2022’’పుస్తకాన్ని రూపొందించారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఈ తరహాలో క్రైం ఇన్ తెలంగాణ పుస్తకాన్ని రూపొందించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 10.25 లక్షల సీసీటీవీ కెమెరాలు రాష్ట్రంలో సీసీటీవీ కెమెరాల సంఖ్య 10,25, 849కు చేరినట్టు క్రైం ఇన్ తెలంగాణ–2022 పుస్తకం వెల్లడించింది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 1,74,205 సీసీటీవీ కెమెరాలను కొత్తగా ఏర్పాటు చేశారు. కాగా 2022లో నమోదైన 18,234 కేసులను ఛేదించడంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీ కీలకంగా పనిచేసినట్టు పేర్కొంది. ఎన్సీఆర్బీ 2022 నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత భద్రమైన నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచినట్టు పుస్తకంలో పేర్కొన్నారు. భద్రమైన నగరాల్లో మొదటి స్థానంలో కోల్‌కతా, రెండో స్థానంలో పుణే నిలిచింది. కాగా, క్రైమ్ ఇన్ తెలంగాణ–2022 పుస్తకం రూపొందించడంలో కీలకంగా పనిచేసిన ఎస్సీఆర్బీ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు సీహెచ్ చెన్నయ్య, సర్దార్ సింగ్, ఇన్స్పెక్టర్లు ఎస్ శేఖర్‌రెడ్డి, ఎన్ నవీన్‌బాబు, హెడ్ కానిస్టేబుళ్లు పి కృష్ణకుమారి, ఎన్ హుస్సేన్‌లను డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ అభినందించారు. -
ఆమెకు అదే ఉద్యోగం ఎందుకు ఇవ్వొద్దు?: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అడిగారు. నళినికి ఉద్యొగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీ.ఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాలమీద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా చాలా మంది తిరిగి ఉద్యొగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని సీఎం అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో మార్మోగిన పేరు డీఎస్పీ నళిని. తెలంగాణ కోసం ఉద్యమించే నా అన్నాచెల్లెళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారామే. అక్కడితో ఆగకుండా తన డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. అనంతరం ఉద్యమంలో భాగంగా ఆమె ఢిల్లీలో రెండు సార్లు దీక్షకు సైతం కూర్చున్నారు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఆమె ప్రస్తావన పుష్కరకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇక నళినికి రాష్ట్రం ఏర్పడిని అనంతరం.. గత ప్రభుత్వంలో గానీ ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అయితే ప్రభుత్వం మారగా ఇప్పుడైనా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నళిని ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారని, ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమెను డిసెంబర్ 4, 2011న సస్పెండ్ చేయడంతో మీడియాలో సంచలనంగా మారారు. ఆమెను దేశ ద్రోహంకు పాల్పడినట్లు నిందించడంపై అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారని ఆమె గుర్తు చేసుకొంటున్నారు. ఇక ఆమె డిఎస్పీ ఉద్యోగంపై రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం వంటివి అన్ని ఉద్యమంలో భాగంగానే చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె ఎవరినీ కలవలేదు. -
వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశా రు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఉండే, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలకు చదువుకొనేలా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఆ పాఠశాలలు ఉండాలని.. ఉత్తర, దక్షిణ తెలంగాణలలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెంటనే హోంగార్డుల నియామకాలు పోలీసు శాఖలో ఏడెనిమిదేళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీసు సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం హోంగార్డుల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్నారు. మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగమివ్వండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి పోలీసుశాఖలో అదే ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఉన్నతాధికారులను సీఎం ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే చేర్చుకోవాలని సీఎస్, డీజీపీలకు సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగానికి సంబంధించి అవరోధాలేమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. గతంలో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ సమీక్ష సమావేశాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన ముస్లిం పెద్దలు శుక్రవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలసి సన్మానించారు. మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలను అందచేశారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులొద్దు తన కాన్వాయ్ ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ జామ్‌లతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రోడ్డు పై మూడు, నాలుగు లేన్లు ఉంటే.. ఒక లేన్‌లో సీఎం కాన్వాయ్ వెళ్లేలా చూడాలని సూచించారు. కాన్వాయ్‌లో ప్రస్తుతమున్న 15 వాహనాల సంఖ్యను 9కి తగ్గించాలన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, తరచూ సమస్య లున్న చోటుకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. సీఎం సమీక్ష తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నళినిపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్, వైద్య..ఆరోగ్య శాఖలపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ పోలీస్ అధికారిణి నళిని అంశాన్ని అధికారుల వద్ద ప్రస్తావించిన ఆయన.. ఆమెకు తిరిగి అదే ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఓడిపోయాక.. తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారు. అలాంటిది తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని వదులుకున్న నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడం న్యాయమే. ఆమెకు అదే పొజిషన్ అప్పజెప్పండి. ఒకవేళ పోలీస్ శాఖలో తీసుకునేందుకు రూల్స్ అడ్డువస్తే.. మరేయితర డిపార్ట్మెంట్లోకి అయినా తీసుకోండి’’ అని సీఎం రేవంత్, సీఎస్.. డీజీపీలను ఆదేశించారు. పన్నెండేళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఆమె అనుకూలంగా పని చేశారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారామె. పారదర్శకంగా నియామకాలు చేపట్టండి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలు చేపట్టాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత పారద్శకంగా, అవకతవకలకు తావులేకుండా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారాయన. హోంగార్డుల నియామకాలను కూడా చేపట్టాలన్నారు. అలాగే.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన నియామాకాల పై నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ లాగే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ఉంటుందని, ఉత్తర, దక్షిణ తెలంగాణ లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. టైం టు టైం ఆలోచన చేయండి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయ అధికారుల్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలా వచ్చే ప్రజల కోసం మంత్రుల ఛాంబర్లో నిర్దిష్టమైన టైం ఏర్పాట్లపై అధ్యయనం చేయాలని సూచించారాయన. అలాగే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటివారంలో ఒకట్రెండు రోజులపాటు సభలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తే.. అక్కడి ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. ప్రతీ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు సభలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కరానికి చోరవ చూపాలని అధికారులకు సూచించారాయన. అలాగే.. ఫిర్యాదుల్ని డిజిటలైజేషన్ చేయాలని, ప్రజా వాణికి వస్తున్న స్పందన దృష్ట్యా ఇంకా టేబుల్స్ పెంచాలని అధికారులకు చెప్పారు. అవసరం అయితే శిక్షణ లో ఉన్న ఐఎఎస్ ల సేవలను వినియోగించుకోవాలన్నారు. -
తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు తెలంగాణ పోలీస్ శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2009 నుంచి 2014 జూన్ రెండో తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమీషనర్లను తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను ఎత్తివేయనుంది. ఇది కూడా చదవండి: దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..! -
కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జ రగనున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీ య ఘటనలకు తావులేకుండా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండా లని పోలీస్ అధికారులు, సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహణపై పోలీస్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థుల గెలుపోటముల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలతో పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యా లీల సందర్భంగా దాడులు, ప్రతిదాడులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించారని, మరో రెండురోజులు ఇదే స్ఫూర్తితో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ కోరారు. -
ఇక పోలీసు అధికారుల పల్లె నిద్ర
సాక్షి, అమరావతి: మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసు శాఖ సిద్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘాను మరింత పటిష్టం చేయనుంది. అందుకోసం పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో విస్తృతంగా చర్చిస్తారు. అలాగే ఆ గ్రామాల్లోని సమస్యలను కూడా తెలుసుకుంటారు. గ్రామంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గ్రామాలవారీగా డేటాను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తించారు. చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పల్లెనిద్ర.. పోలీసుస్టేషన్ల వారీగా అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు. జైలు నుంచి విడుదలై వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. అనంతరం ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. ముఖ్యంగా జిల్లాలవారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లె నిద్ర చేపడతారు. తొలిగా కార్యక్రమం చేపట్టనున్న చిత్తూరు జిల్లాలో సాధారణ గ్రామాలు 1,169, సమస్యాత్మక గ్రామాలు 597 ఉన్నట్టుగా గుర్తించారు. నియోజకవర్గాలవారీగా అయితే చిత్తూరులో 48, జీడీ నెల్లూరులో 75, పూతలపట్టులో 74, పుంగనూరులో 123, పలమనేరులో 132, కుప్పంలో 76, నగరిలో 76 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి రెండు గ్రామాల చొప్పున పల్లె నిద్ర నిర్వహించాలని నిర్ణయించారు. యాప్ ద్వారా డేటా సేకరణ.. వివిధ కేటగిరీలుగా గ్రామాల వారీగా పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ డేటాను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ అందుబాటులో ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏదైనా సమస్య తలెత్తినా, ఘటన జరిగినా వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది. శాంతిభద్రతల పరిరక్షణ.. అసాంఘిక శక్తుల కట్టడి.. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో మొత్తం పోలీసు యంత్రాంగం భాగస్వామ్యమవుతుంది. ప్రతి గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. దీంతో ప్రస్తుతం ఉన్న పోలీసు అధికారులకే కాదు.. తర్వాత బదిలీపై వచ్చే అధికారులకు కూడా డేటా ఉపయోగపడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన మార్గనిర్దేశం కూడా చేస్తాం. – రిశాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా -
ఈ–చలానా కేసులో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్ అరెస్టు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసు డిపార్టుమెంట్లో జరిగిన ఈ–చలానా కుంభకోణంలో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్‌ను అరెస్టు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు తెలిపారు. మంగళవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారం మొత్తం 2018–19లో జరిగిందని తమ విచారణలో స్పష్టమైందన్నారు. 2018లో అప్పటి డీజీపీ సాంబశివరావు ఎటువంటి టెండర్లు లేకుండానే తొమ్మిది జిల్లాల్లో మోటారు వాహనాల చలానాల వసూళ్లను డేటా ఎవాన్ సొల్యూషన్స్‌కు అప్పగించారని, ఆ తర్వాత 2019లో కేవలం ఒక్క రూపాయికే టెండర్ వేసిన ఆ సంస్థకు కట్టబెట్టారన్నారు. ఆడిటింగ్ జరగకుండానే టెండర్ కట్టబెట్టడంతో రూ. 36.53 కోట్లు దారి మళ్లినట్లు తమ విచారణలో తేలిందన్నారు. డేటా ఎవాన్ సొల్యూషన్స్‌తో పాటు రోజర్ పీఈ అనే సంస్థ ద్వారా అవకతవకలకు తెరలేపారన్నారు. చలానాల ద్వారా కలెక్ట్ అయిన మొత్తం డైరెక్ట్‌గా డీజీ అకౌంట్‌కు వెళ్లకుండా రేజర్‌పే ద్వారా రోజర్ పీఈకు మళ్లినట్లు గుర్తించామన్నారు. ఈ విధంగా దారిమళ్లిన సొమ్ముతో అమెజాన్ క్లౌడ్ సర్వీస్‌ను కొనుగోలు చేసి దాని ద్వారా 50 నుంచి 60 సంస్థలకు సర్విసులు ఇస్తున్నారని చెప్పారు. ఈ సర్వీసుల ద్వారా సుమారు రూ. 25 కోట్లు డేటా ఎవాన్ సొల్యూషన్ సంస్థకు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేసేలా కోర్టు ద్వారా చర్యలు చేపట్టామన్నారు. 2019 తర్వాత సుమారు 16 ఆస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించామని, వాటిని సీజ్ చేసి ఎటువంటి లావాదేవీలు జరగకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సీరియస్‌గా ప్రభుత్వం.. ప్రజల సొమ్ము ఈ విధంగా దారి మళ్లడంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని పాలరాజు చెప్పారు. 2018 నుంచి ఇప్పటివరకూ ఎంత సొమ్ము, ఏ ఖాతాలకు మళ్లింది అనే అంశాలపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కొంత డబ్బు పలు ప్రైవేటు ఖాతాలకు మళ్లించారని, ఆ ఖాతాలను కూడా సీజ్ చేశామని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రస్తుత డీజీపీ అంతర్గత విచారణకు ఆదేశించారన్నారు. టెండర్ కట్టబెట్టడంలో ఎవరు బాధ్యులనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–చలానా వసూలు చేయకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఐసీ ద్వారా వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కేసు విషయంలో కంపెనీలోని మిగిలిన డైరెక్టర్ల పాత్రపై కూడా విచారణ జరిపి వారి తప్పు ఉంటే అరెస్టు చేస్తామని ఐజీ పాలరాజు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణదినానికి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: పోలీస్ అమరవీరుల సంస్మరణదినం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులర్పించనున్నారు. ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణదినం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం నుంచి 31 వరకు విజయవాడలో ‘ఓపెన్ హౌస్’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. అక్టోబర్ 24 నుంచి 27వరకు పోలీసు ఉద్యోగుల పిల్లలకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, 28న జిల్లా, రాష్ట్ర పోలీస్ కార్యాలయాల్లో వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వారి వైద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ..ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేస్తోంది. ఏపీతోపాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా చికిత్స పొందే అవకాశాన్ని కల్పించింది. గతేడాదిలో 11,486 మంది పోలీసు కుటుంబాలు నగదు రహిత విధానంలో రూ.42.40 కోట్ల విలువైన వైద్య సేవలను పొందాయి. పోలీస్ శాఖ భద్రతా పథకం ద్వారా పోలీసులకు రుణాలు అందిస్తోంది. ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణ రుణాలు రూ.98.85 కోట్లు, ఉన్నత చదువుల కోసం రూ.11.66 కోట్లు, వివాహ రుణాలు రూ.3.95 కోట్లు, వ్యక్తిగత రుణాలు రూ.99.20 కోట్లు మంజూరు చేసింది. పోలీస్ ప్రమాద బీమా పథకం కోసం ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎస్బీఐ ఖాతా ఉన్నవారికి రూ.40 లక్షలు, యాక్సిస్ ఖాతా ఉన్నవారికి రూ.60 లక్షలు, హెచ్డీఎఫ్సీ ఖాతా ఉన్నవారికి రూ.70 లక్షలు బీమా పరిహారం కోసం ఒప్పందాలు చేసుకుంది. బీమా పరిహార మొత్తాన్ని రూ.85 లక్షలకు పెంచేందుకు ఆయా బ్యాంకులతో పోలీస్ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వాటితోపాటు సాధారణ మృతికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తోంది. సర్విస్‌లో ఉంటూ చనిపోయిన పోలీసుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకం కింద పోస్టింగులు కల్పిస్తోంది. గతేడాదిలో 244 మంది పోలీసులు చనిపోగా వారిలో 186 కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హులైన 436 మందికి ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన ధరఖాస్తులు పలు దశల్లో ఉన్నాయి. వారికి కూడా త్వరలోనే ఉద్యోగాలు కల్పించనున్నారు. -
TS Election 2023: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా..
మెదక్: ఎన్నికల నియమావళిని అడ్డుపెట్టుకొని కొందరు కిందిస్థాయి పోలీస్ సిబ్బంది చేస్తున్న పనులకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న డబ్బును పోలీసులు సీజ్ చేసి కలెక్టరేట్‌కు తరలిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు పోలీసులు ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం బ్యాంక్‌ల వద్ద రైతులు, సామాన్య ప్రజల డబ్బులు సీజ్ చేస్తున్నారు. సివిల్ డ్రెస్‌లో మాటువేసి డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తున్న వారిని పట్టుకొని ఎలాంటి ఆధారాలు లేవని పట్టుకెళ్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఆ డబ్బును తెచ్చుకోవడానికి రోజుల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. 'శివ్వంపేట మండలం గుండ్లపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డి, శ్రావణ్, జీవన్‌రెడ్డి ముగ్గురు స్నేహితులు. వీరిలో రాజశేఖర్‌రెడ్డి, శ్రావణ్ ఫౌల్ట్రీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి డబ్బులు అవసరం ఉండి అదే గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి అనే మిత్రుడి వద్ద రూ. లక్ష అప్పు అడిగారు. ఈనెల 17న జీవన్‌రెడ్డి శివ్వంపేట మండలంలోని శభాష్‌పల్లిలోని ఐసీఐసీ బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసి అందులో నుంచి శ్రావణ్, రాజశేఖర్‌రెడ్డికి చెరో రూ. 50 వేల చొప్పున ఇచ్చాడు. ఈ క్రమంలో అప్పటికే బ్యాంకు వద్ద మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ వీరిని గమనించి సమాచారం ఉన్నతాధికారులు తెలిపారు. శ్రావణ్, రాజశేఖర్‌రెడ్డిలు కారులో వెళ్తుండగా వారిని ఆపి చెక్ చేయగా ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష ఉన్నాయి. వెంటనే నగదును సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసి ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి పంపించారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల చొప్పునే ఉంది కదా అని అడిగితే ఇద్దరూ కారులోనే వెళ్తున్నారు కదా అని పోలీసులు బదులిస్తున్నారు. ఆ డబ్బు కోసం నాలుగు రోజులుగా మెదక్ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.' ఓచర్ రాసిందే కానిస్టేబుల్.. శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామానికి చెందిన నాగయ్య అనే రైతు ఈ నెల 17న రూ.70 వేలకు పాడిగేదెను కొనుగోలు చేశారు. వాటి డబ్బులు కట్టేందుకు ఈనెల 17న శివ్వంపేటలోని ఏపీజీవీబీ బ్యాంక్‌కు వచ్చి తన అకౌంట్లో ఉన్న రూ.1.49 లక్షలను డ్రా చేయాలని కోరగా, అక్కడే మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ ఓచర్‌ను నింపి సదరు రైతుకు ఇచ్చింది. రైతు డబ్బులు డ్రా చేసుకొని బయటకి రాగానే అప్పటికే యూనిఫామ్‌లో ఉన్న లేడీ కానిస్టేబుల్ ఇతర సిబ్బందితో కలిసి రైతును పట్టుకొని నగదును సీజ్ చేసింది. వాటిని మెదక్‌లోని గ్రీవెన్స్ కమిటీకి పంపించారు. ఆ రైతు నాలుగు రోజులుగా డబ్బుల కోసం తిరుగుతున్నారు. ఇలా పోలీసుల అతిమూలంగా సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మెప్పు కోసం.. తప్పు! ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబాలకు గురిచేయకుండా అవినీతిపరుల డబ్బు, మద్యం, ఇతర కానుకలను సీజ్ చేయాలి. కానీ, అమాయకులైన వారిని పట్టుకొని డబ్బును సీజ్ చేయడం సరికాదు. అధికారుల మెప్పు పొందడం కోసం ఇలా చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓచర్ రాసిచ్చి.. డబ్బు పట్టించింది.. నేను రూ.70 వేలు పెట్టి గేదెను కొన్నాను. బ్యాంకులో సివిల్ డ్రెస్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్ రూ.1.49 లక్షలకు సంబంధించిన ఓచర్ రాసి ఇచ్చింది. బయటకు రాగానే పట్టిచ్చింది. డబ్బుల కోసం నాలుగు రోజుల నుంచి కలెక్టరేట్‌కు తిరుగుతున్నాను. ఈ రోజు రేపు ఇస్తామని అధికారులు తిప్పుతున్నారు. – నాగయ్య, రైతు ఎదుల్లాపూర్ బ్యాంకుల్లో ఉండాలనే నిబంధన లేదు.. పోలీసులు బ్యాంకుల్లో మఫ్టీలో ఉండాలనే నిబంధన లేదు. ఆధారాలు లేకుండా రూ. 50 వేల కన్న ఎక్కువ తరలిస్తే పోలీసులు పట్టుకుంటారు. ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం కానిస్టేబుల్స్ ఇలాంటి పని చేస్తే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. – అదనపు ఎస్పీ మహేందర్ -
21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌ను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే 21 నుంచి 31 వరకు పోలీసు ఫ్లాగ్‌డే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, విధినిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల నుంచి ప్రజలు ఇంకా ఏ రకమైన సేవలు ఆశిస్తున్నారన్న అంశాలపై ఈ పది రోజులలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ పోలీసు స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి, పోలీసు శాఖ కృషిని, సేవలను పౌరులకు తెలియచెబుతామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ‘పోలీసులకు–పని జీవిత సమతుల్యత’, ’సమాజంలో లింగ సమానత్వాన్ని కాపాడటంలో పోలీసుల పాత్ర’ అనే అంశాలపై ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి అధికారులకు కూడా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు అమరుల ఇళ్లను సందర్శించి వారి కుటుంబాల బాగోగులు, వారి అవసరాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని డీజీపీ ఆదేశించారు. -
నోట్ దిస్ పాయింట్.. రూ.50 వేల వరకు తీసుకెళ్లేందుకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం వెలువడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు విభాగం ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుచేయడం ప్రారంభించింది. ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి వినియోగించే అక్రమ మద్యం, నగదుపై డేగకన్ను వేసింది. సోమ, మంగళవారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి స్వా«దీనం చేసుకుంది. ఎన్నికల క్రతువు ముగిసేవరకు ఈ తనిఖీలు సాగనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వృత్తి, వ్యాపార, క్రయవిక్రయాల కోసం నగదు తరలించే వారిలో అనేక సందేహాలున్నాయి. కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రూ.50 వేలకు మించితే... ఓ వ్యక్తి తన వెంట రూ.50 వేల వరకు మాత్రమే నగదును తీసుకెళ్లవచ్చు. అంతకుమించిన మొత్తం తీసుకెళ్లాలంటే దాని మూలాలను నిరూపించే ఆధారాలు కచ్చితంగా కలిగి ఉండాలి. వ్యాపారులు దానికి సంబంధించిన పత్రాలు, లావాదేవీల బిల్లులు కలిగి ఉండాల్సిందే. సాధారణ వ్యక్తులు తీసుకెళ్తుంటే బ్యాంకు నుంచి డ్రా చేసిన పత్రాలు లేదా ఆ నగదు ఎక్కడ నుంచి వచి్చందో, ఎందుకు వినియోగిస్తున్నామో చెప్పడానికి అవసరమైన ఇతర ఆధారాలు చూపించాలి. ♦ రూ.2 లక్షలకు మించిన నగదు తలింపును మాత్రం పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ మొత్తం తమ వద్దకు ఎలా వచి్చంది? ఏం చేయబోతున్నారు? అనే వాటికి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో పోలీసులు నగదు స్వా ధీనం చేసుకుంటారు. ఇలా సీజ్ చేసిన నగదు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే అది జిల్లా ఎన్నికల అధికారి నియమించే కమిటీ వద్దకు వెళ్తుంది. ♦ నలుగురు సభ్యులతో ఉండే ఈ జిల్లా కమిటీ ఎదుట నగదు యజమాని హాజరై నగదు మూలం, అవసరాలకు సంబంధించి వివరణ ఇవ్వాలి. దీనిపై కమిటీ సంతృప్తి చెందితే నగదు తిరిగి అప్పగిస్తుంది. లేదంటే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఆదేశిస్తుంది. ♦ పోలీసులు స్వాదీనం చేసుకున్న నగదు రూ.10 లక్షలకు మించితే విషయం ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. నగదును స్వా«దీనం చేసుకునే ఆ అధికారులు బాధ్యులకు నోటీసులు జారీ చేస్తారు. వారిచ్చే సమాధానాన్ని వివిధ కోణాల్లో పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటారు. ♦ కొత్త బంగారం, వెండి నగలు, వస్తువులతోపాటు గిఫ్ట్ ఆర్టికల్స్, కుక్కర్లు, క్రికెట్ కిట్స్ వంటి సామగ్రి విలువ రూ.10 వేలకు మించితే పోలీసులు స్వా«దీనం చేసుకుంటారు. యజమానులు వాటిని వ్యాపార నిమిత్తం తరలిస్తున్నట్లు పత్రాలు చూపించి, నిరూపించుకుంటేనే తిరిగి అప్పగిస్తారు. లేదంటే విషయం ఎన్నికల అధికారుల వద్దకు వెళ్తుంది. ♦ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సైతం తాము ఖరీదు చేసే ప్రచార, ఇతర సామగ్రికి సంబంధించి విక్రేతలకు రూ.10 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయకూడదు. అంతకంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయాలంటే చెక్కులు, ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. అభ్యర్థి లేదా అతని ఏజెంట్ కూడా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. ♦ పోలీసులు స్వా«దీనం చేసుకున్న నగదు (రూ.50 వేలలోపు అయినా), వస్తువులు (రూ.10 వేల కంటే తక్కువ విలువైనవి అయినా) ఓటర్లను ప్రలోభ పెట్టడానికని ఆధారాలు లభిస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. బాధ్యులపై ఐపీసీ 171(బీ) రెడ్‌విత్ 171(సీ) సెక్షన్లతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 123 ప్రకారం వీటిని రిజిస్టర్ చేసి దర్యాప్తుచేస్తారు. బాధ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశమూ ఉంది. -
హోంగార్డులు.. ఎన్ని పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో పని చేస్తున్న హోంగార్డులకు సెప్టెంబర్ నెల గౌరవ వేతనం ఆదివారానికీ అందలేదు. ప్రతి నెలా ఒకటి–రెండు తారీఖుల్లో వచ్చే జీతం కొన్ని నెలలుగా ఆలస్యం అవుతోంది. ఈసారి 8వ తేదీ వచ్చినా ఇప్పటికీ అందకపోవడంతో ఈ చిరుద్యోగులు బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమ సిబిల్ స్కోరు దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. రాజధానిలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసుల సంఖ్యకు సమానంగా హోంగార్డులు ఉన్నారు. పోలీసుస్టేషన్ల వారీగా హోంగార్డ్స్ జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు ప్రతి నెలా హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతాయి. ఈ బిల్లుల తయారీ మొత్తం ఇప్పటికీ మాన్యువల్‌గానే జరుగుతోంది. ఆ మధ్యన కొన్నాళ్ళు బయోమెట్రిక్ వ్యవస్థ ప్రవేశపెట్టినా.. అనివార్య కారణాలతో తొలగించారు. హోంగార్డులు పని చేసే ఠాణాలు, కార్యాలయాల్లో ఉండే అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలతోనే ప్రస్తుతం వీరి హాజరు గణిస్తున్నారు. ప్రతి నెలా 20వ తేదీ నుంచి మరుసటి నెల్లో 19వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు దీనికి సంబంధించి హాజరుపట్టీ తయారు చేస్తుంటారు. పోలీసు స్టేషన్లు, ప్రత్యేక విభాగాలు, ఇతర కార్యాలయాల నుంచి నుంచి హెడ్–క్వార్టర్స్ లేదా అడ్మిన్ అధికారులకు వెళ్లే ఈ హాజరు ఫైల్ అక్కడ అప్రూవ్ అయ్యాక మాత్రమే హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి సంబంధిత కమిషనర్ ఆఫీస్‌కు వచ్చిన తర్వాతే జీతాలు లెక్కించి బ్యాంకు ద్వారా హోంగార్డుల ఖాతాలో పడాల్సి ఉంది. గతంలో ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలగా పరిగణించే వాళ్ళు. మాన్యువల్‌గా జరుగుతున్న పనుల కారణంగా కొన్నేళ్ళ క్రితం వరకు జీతాల చెల్లింపు ఆలస్యమై ప్రతినెలా 15వ తేదీ తరవాతే హోంగార్డులకు అందేవి. అయితే దీనిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు నెల లెక్కింపును 20 నుంచి 19వ తేదీ వరకు మార్చారు. అయినప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా కాస్త ఆలస్యంగానే జీతాలు వస్తున్నాయని హోంగార్డ్స్ వాపోతున్నారు. ఈ విభాగంలో గడిచిన కొన్నేళ్ళలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. వీటికి చెక్ చెప్పడంతో పాటు హోంగార్డులకూ ప్రతి నెలా ఒకటి–రెండు తేదీల్లో జీతాలు ఇచ్చేందుకు అవసరమైన ఆధునిక టెక్నాలజీ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టట్లేదు. గతంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలన్నీ హోంగార్డుల ‘హాజరు’ ఆధారంగా జరిగినవే. హోంగార్డుల హాజరును నమోదు చేయడానికి పోలీసుస్టేషన్ల వారీగా మరోసారి బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి, లోపాలకు అధిగమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభకోణాలకు ఆస్కారం లేకుండా పోవడంతో పాటు జీతాల బిల్లుల తయారీ పేపర్‌తో పని లేకుండా వేగంగా జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ సర్వర్ కమాండెంట్ కార్యాలయంలో ఉంచితే... హాజ రు అక్కడే నమోదు అవుతుంది. ఫలితంగా కచ్చితత్వం ఉండటంతో పాటు జీతా ల బిల్లులు సైతం ఆలస్యం కావు. కేవలం పర్మిషన్లు, ఆన్డ్యూటీల్లో ఉన్న హోంగార్డుల వివరాలను మాత్రం ఈ కార్యాలయానికి మాన్యువల్‌గా, నేరుగా పంపితే సరిపోతుంది. ఉన్నతాధికారులు ఈ కోణంపై దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆలస్యానికి కారణాలు ఏవైనా ఇబ్బందులు పడుతున్నది మాత్రం పోలీసుశాఖలో ‘బడుగు జీవులు’ అయిన హోంగార్డులే. తమకు గృహరుణాలు, ఇతర లోన్లు ఉన్నాయని, వీటి ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలోనే కట్ అ వుతాయని చెప్తున్నారు. జీతాల ఆలస్యం కారణంగా ఇది సాధ్యంకాక తమ సిబిల్ స్కోర్లు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని తమ బాధలు తీర్చాలని హోంగార్డులు వేడుకోంటున్నారు. -
ఒకేరోజు.. ఒకే చోట.. 6,166 యూనిట్ల రక్తదానం
పెద్దపల్లిరూరల్: తలసేమియా, రోడ్డు ప్రమాద బాధితులు, ఇతర రోగులకు అత్యవసరమైన రక్తాన్ని దానం చేయాలనే ఆలోచన ఆదర్శణీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా పోలీసు శాఖ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ మైదానంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, డీసీపీ వైభవ్ గైక్వాడ్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్‌గోపాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6006 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 6,166 యూనిట్ల రక్తాన్ని ఈ శిబిరంలో సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోకూడా ఒకేరోజు 6,166 యూనిట్ల రక్తం సేకరించిన సందర్భాలు లేవన్నారు. ఇది గిన్నిస్ బుక్ లో నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిబిరం ద్వారా సేకరించిన రక్తయూనిట్లను రాష్ట్రంలోని అన్నిజిల్లాలకు అందించేలా రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందాన్నిచ్చిందని సీపీ రెమారాజేశ్వరి అన్నారు. కాగా, ఈ రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ దంపతులు రక్తదానం చేశారు. అనంతరం పలుమార్లు రక్తదానం చేసిన వారిని మంత్రి తదితరులు సన్మానించారు. -
ఎరువుల అక్రమ రవాణాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు. -
నాగ్‌పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్
నాగ్‌పూర్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాగ్‌పూర్ పోలీస్ శాఖ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్‌తో ముందుకొచ్చింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రియేటివ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలై కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని ప్రమోషనల్ యాడ్‌గా మార్చి సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు నాగ్‌పూర్ సిటీ పోలీసులు. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ వివిధ గెటప్‌లను వివిధ రకాల పాస్‌వర్డ్‌లుగా ఉదహరిస్తూ ఒక్కో సోషల్ మీడియా అకౌంట్‌కు ఒక్కో పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్లు ఏమీ చేయలేరని తెలిపింది. ఇంకేముంది ఈ ట్వీట్ అతి తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్లో స్వైరవిహారం చేయడం మొదలుపెట్టింది. Jab aap aise passwords rakhte ho na, toh koi bhi fraudster tik nahi sakta.#KingKhanPasswords #CyberSafety #NagpurCityPolice pic.twitter.com/lby0zr3ixJ — Nagpur City Police (@NagpurPolice) September 6, 2023 ఇది కూడా చదవండి: అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు -
నేరం చేస్తే అంతే సంగతులు!
20 నెలల్లోనే ఉరి శిక్ష అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ మౌలాలి అదే గ్రామానికి చెందిన సరళమ్మ, గంగులమ్మలను హత్య చేసి అనంతరం 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు తగిన ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో కేవలం 20 నెలల్లోనే విచారణ ప్రక్రియ పూర్తి చేసిన న్యాయస్థానం సయ్యద్ మౌలాలికి ఉరి శిక్ష విధించింది. ఆ ఇద్దరికీ 20 ఏళ్ల జైలు 2022లో బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో 2022లో ఓ యువతిపై పాలుబోయిన విజయ్‌కృష్ణ, పాలుచూరి నిఖిల్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసును కూడా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో దర్యాప్తు చేసిన పోలీసులు 15 రోజుల్లోనే చార్జ్‌షిట్ దాఖలు చేశారు. తగిన ఆధారాలతో నేరాన్ని నిరూపించారు. దాంతో న్యాయస్థానం దోషులు పాలుబోయిన విజయ్ కృష్ణ, పాలుచూరి నిఖిల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సాక్షి, అమరావతి: ఎవరైనా నేరానికి పాల్పడితే శిక్ష పడాల్సిందే అన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకోసం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ (నేరారోపణ ఆధారిత పోలీసింగ్) విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏళ్ల కొద్దీ దర్యాప్తు.. ఆధారాల సేకరణకు నానా తంటాలు.. సుదీర్ఘ కాలం విచారణ.. వెరసి నేరం జరిగి ఏళ్లు గడుస్తున్నా దోషులు దర్జాగా బయట తిరిగే పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. ఇలాంటి అస్తవ్యస్త విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. నేరానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకోవడం అసంభవం అన్నట్టుగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసింది. దాంతో గతంలో ఎన్నడూలేని రీతిలో రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తున్నాయి. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా.. నేరాలకు పాల్పడే వారికి సత్వర శిక్షలు విధించేలా చేయడంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం 2022 జూన్ నుంచి పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టింది. పోలీసు అధికారులకు ప్రత్యేకంగా కేసుల బాధ్యతలు అప్పగించింది. పోలీస్ జిల్లా యూనిట్ల అధికారులకు ఐదేసి కేసుల చొప్పున అప్పగించింది. ఆ కేసుల దర్యాప్తు, విచారణను వారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు పదేసి చొప్పున కేసులు అప్పగించి దర్యాప్తును సత్వరం పూర్తి చేసి చార్జిషిట్లు దాఖలు చేసేలా పర్యవేక్షించింది. దాంతో దోషులను గుర్తించి.. దోషులు చేసిన నేరాన్ని న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేస్తోంది. సత్వరమే శిక్షలు ఈ విధానం సత్పలితాలిస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అందులోనూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయడం పోలీసు శాఖ సమర్థతకు అద్దం పడుతోంది. 2022 నుంచి ఇప్పటివరకు కన్విక్షన్ బేస్డ్ విధానంలో 122 కేసులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వాటిలో ఏకంగా 109 కేసుల్లో తగిన ఆధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాలు శిక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే దాదాపు 90 శాతం కేసుల్లో నేరస్తులకు సత్వరమే శిక్షలుపడటం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. నేరాల తీవ్రతను బట్టి దోషులకు కఠిన శిక్షలు విధించడం కూడా నేరస్తుల పట్ల పోలీసు వ్యవస్థ ఏమాత్రం ఉదాసీనంగా లేదన్న సందేశాన్నిస్తోంది. -
ఐదెకరాల్లో గంజాయి పంట ధ్వంసం
జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా)/అనకాపల్లి టౌన్: గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయతీ గాదిగుంట గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న ఐదు ఎకరాల్లోని గంజాయి పంటను ఎస్ఐ శ్రీనివాస్‌తో కూడిన బృందం మంగళవారం గుర్తించింది. గ్రామస్తుల సహకారంతో గంజాయి మొక్కలను ఒక చోటకు చేర్చి తగులబెట్టారు. పారిపోతున్న ముగ్గురు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం కొత్తూరు ఏఎంఏఎల్ కళాశాల కూడలిలో మంగళవారం 280 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ జంక్షన్లో ఎస్ఐ సింహాచలం వాహనాలను సాధారణ తనిఖీ చేస్తుండగా అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళ్తున్న కారులో గంజాయి బయటపడింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కారు డ్రైవర్ తూము బాలిరెడ్డిని అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గంజాయి విలువ సుమారు రూ.5.5 లక్షలు ఉంటుందని సీఐ దాడి మోహన్‌రావు చెప్పారు. -
తుపాకీ ‘గురి’ తప్పుతోంది!
ఒకవైపు ఉద్యోగంలో ఒత్తిళ్లు... మరోవైపు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు. ఇవన్నీ ఖాకీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయుధ సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడిలోకి జారిపోయి విచక్షణ కోల్పోతున్నారు. విధి నిర్వహణ కోసం ఇచ్చే ఆయుధంతో ఆ మానసిక స్థితిలో ఎదుటివారిని హతమార్చేలా విచక్షణ కోల్పోతున్నారు. లేదంటే తమను తాము కాల్చుకుని ఎంతో విలువైన జీవితాన్ని, కుటుంబాన్ని విషాదాంతం చేస్తున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు ఇలా ఎందుకు చేస్తున్నారు? సాక్షి, హైదరాబాద్ :ఇటీవల జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విష యం తెలిసిందే. తన మతిలేని చర్యతో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ టికారామ్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు బలయ్యారు. వీరిలో హైదరాబాద్ బజార్‌ఘాట్‌కు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ ఉన్నారు. సాయుధ అధికారిగా ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు ఇలా చేస్తుండటంపై పోలీసు వర్గాల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వృత్తిపరమైన పని ఒత్తిడిని జయించేందుకు పోలీస్‌శాఖ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? తదితర అంశాలపై పోలీస్ ఉన్నతాధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. 13 ఏళ్లలో 1,532 మంది.. ♦ గత 13 ఏళ్లలో కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్‌ఎస్‌జీలకు చెందిన 1,532 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సాయుధ బలగాల్లో ఆత్మహత్యలపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది (2023)లోనూ జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు 71 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. వీటిని నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో నమోదైన పోలీసు ఆత్మహత్యలు కొన్ని... ♦ జనగాం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ గత ఏప్రిల్ 6న తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు ఉదయం శ్రీనివాస్ భార్య స్వరూప బాత్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది తట్టుకోలేకే శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ♦ 2016లో ఆదిలాబాద్ జిల్లా కెరిమెరిలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2019లో హెడ్ కానిస్టేబుల్ డి.ప్రకాశ్ రెడ్డి తన పైఅధికారి సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవనర్మణం పొందారు. ♦ 2020లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సీఆర్పీఎఫ్ కానిస్టే బుల్ రూపేషానంద్ కుటుంబ సమ స్యల ఒత్తిడికి లోనై తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2020 నవంబర్‌లో సికింద్రాబాద్‌లో ఓ బ్యాంక్ వద్ద గార్డ్ డ్యూటీలో ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మధు తుపాకీతో కాల్చు కుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ♦ 2017 జూన్‌లో సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్‌రెడ్డి తన సర్విస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అధికారుల వేధింపులే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేంద్ర టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఏముంది? ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా తోటి సిబ్బందిపై కాల్పులు జరపడానికి కార ణాలు విశ్లేíÙంచేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్‌్కఫోర్స్ కమిటీ గత జనవరిలో ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. అందులో పేర్కొన్న ప్రధా న అంశాలు సర్వీ స్–వ ర్కింగ్ కండిషన్స్, వ్యక్తిగత, కుటుంబ కారణాలు సాయుధ పోలీసుల ఆత్మహత్యలకు, తోటి సిబ్బంది, ఇతరులపై కాల్పులు జరపడానికి కారణమవు తున్నాయని తెలిపింది. శిక్షణ నుంచే అలవాటు చేయాలి.. పోలీస్ ఉద్యోగం అంటేనే 24 గంటలూ విధుల్లో ఉండాలి. ఇప్పటితో పోలిస్తే గతంలోనే విపరీతమైన పని ఒత్తిడి ఉండేది. అప్పట్లో ఒకవైపు శాంతిభద్రతల సమస్యలు.. మరోవైపు నక్సల్ సమస్యలు ఉండేవి. ఇలా అనేక రకాల మేం ఉద్యోగానికి వచ్చిన తొలిరోజుల్లో పనిచేశాం. కానీ కాలంతోపాటు ఆ పరిస్థితులు మారాయి. ఇప్పుడు కూడా పోలీస్ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదే. అయితే ఆ పని ఒత్తిడి ఇటీవలే పెరిగింది కాదు. అయితే, పరిస్థితులను తట్టుకునేంతగా ఇప్పటి సిబ్బంది మానసికంగా ధృడంగా ఉండట్లేదన్నది నా అభిప్రాయం. శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచేలా ప్రత్యేక శిక్షణ అవసరం. మానసిక ఒత్తిడిని తట్టుకునేలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలన్నది ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే అలవడేలా యువ అధికారులు, సిబ్బందిని తీర్చి దిద్దాలి. అప్పుడే ఆత్మహత్యలు జరగకుండా నివారించగల్గుతాం అని నా అభిప్రాయం. – నారాయణ, రిటైర్డ్ ఎస్పీ కేంద్ర టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఏముందంటే... ♦ సాయుధ బలగాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు... పనిగంటలు పెరగడం, సరైన విశ్రాంతి లేకపోవడం, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారితో పోలిస్తే విధుల్లో సంతృప్తి లేకపోవడం, అన్నింటికి మించి సాంఘికంగా తమను దూరం పెడుతున్నారన్న భావన పెరగడం, కుటుంబ మద్దతు లేకపోవడం, సిబ్బంది ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే సరైన యంత్రాంగం లేకవపోవడం. పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ సైతం అవసరం ♦ తీరిక లేని ఉద్యోగంతో పని ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ విధుల్లోనూ అనేక రకాల పరిస్థితులను వారు చక్కబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులకు, సిబ్బందికి పోలీస్ సెన్సిటివిటీ ట్రైనింగ్ ఇవ్వడం ఎంతో ముఖ్యం. నేను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న వారికి కొన్ని తరగతులు తీసుకున్నాను. శిక్షణ సమయంలో నేర్చుకున్న విషయాలను వారు ఉద్యోగంలోకి వచ్చాక ఆచరిస్తే మానసిక ఒత్తిడిని జయించవచ్చు. మానసికంగానూ దృఢంగా ఉంటే వృత్తిగత జీవితంతోపాటు వ్యక్తిగతంగానూ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. – డా.ప్రజ్ఞ రష్మీ, సైకాలజిస్ట్ -
మీ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్‌ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్‌ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్‌ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్‌కు మెసేజ్ చేస్తే.. సెల్‌ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్‌బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్‌గా వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్‌ఫోన్‌ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్‌కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్‌పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్‌లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్‌ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ పీఎస్‌లో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి, వంశీ చంద్ రెడ్డి, మరోనేత సంపత్ కుమార్ లపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు సెక్షన్ 504 శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సెక్షన్ 506 బెదిరింపులకు పాల్పడడం కింద కేసు నమోదు చేశారు ఎస్పీ మనోహర్. మరోవైపు మహబూబ్ నగర్-- జడ్చర్ల, భూత్పూర్ పోలీసు స్టేషన్లలోనూ రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. -
29 మంది ఏపీ అధికారులకు పోలీస్ పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ దేశంలో మొత్తం 954 మంది అధికారులకు సోమవారం పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఒకరిని రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం, 229 మందిని పోలీస్ శౌర్య పతకాలు, 82 మందిని రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందిని ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 1 రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం, 10 ప్రతిభా పోలీస్ పతకాలు, 18 పోలీస్ శౌర్య పతకాలు లభించాయి. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను రాష్ట్రానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) శంఖబ్రత బాగ్చి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపికైనవారు.. 1. దాడిరెడ్డి మురళీధర్‌రెడ్డి, సీఐ, కర్నూల్ టౌన్ 2. సింగులూరి వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు 3. కొండపు ఆనందరెడ్డి, డీసీపీ, విశాఖపట్నం సిటీ 4. సుంకర మునిస్వామి, ఆర్ఐ, మంగళగిరి 5. బెండి కాశీపతి, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, విశాఖపట్నం 6. జమ్మలమడుగు నిసార్ అహ్మద్ బాషా, ఏఎస్ఐ 7. బెహార నాగభూషణరావు, ఏఎస్ఐ 8. కన్నూజు వాసు, ఇన్స్పెక్టర్, గుంటూరు 9. మంద సత్యనారాయణ, ఏఎస్ఐ 10. తోట బ్రహ్మయ్య, డీఎస్పీ రాష్ట్రం నుంచి పోలీస్ శౌర్య పతకాలకు ఎంపికైనవారు.. 1. కనపాకల హేమసుందరరావు (ఏఏసీ) 2. మార్పు సుదర్శనరావు (ఎస్సీ) 3. జక్కు దేముడు (జేసీ) 4. పొన్నాడ లవకుమార్ (ఏఏసీ) 5. చిక్కంగౌరి వెంకట రామచంద్రరావు (ఎస్సీ) 6. ముర సత్యనారాయణరావు (జేసీ) 7. మట్టపర్తి సుబ్రహ్మణ్యం (జేసీ) 8. శంఖబతుల వీరవెంకట సత్యనారాయణ (జేసీ) 9. ప్రగడ పోశయ్య (జేసీ) 10. ఏడిగగండ్లూరు అశోక్ కుమార్ (అడిషనల్ ఎస్పీ) 11. పైల పార్వతీశం (ఎస్సీ) 12. గొర్లి రమణబాబు (జేసీ) 13. షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్) 14. గుల్లిపల్లి నాగేంద్ర (జేసీ) 15. కోమట్ల రామచంద్రారెడ్డి (జేసీ) 16. దాసరి సురేష్ బాబు (జేసీ) 17. ఏపూరి మధుసూదన్‌రావు (జేసీ) 18. పాళ్యం మహేశ్వరరెడ్డి (ఏఏసీ) -
అడిషనల్ డీజీ విజయ్‌కుమార్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ / న్యూఢిల్లీ: పోలీస్‌శాఖలో విశిష్ట సేవలకుగాను సీనియర్ ఐపీఎస్ అధికారి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ మదాడి రమణకుమార్‌లకు కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ పోలీస్ పతకాలు దక్కాయి. ఈ ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్ట్వ్ గిష్డ్ సర్విస్) కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 954 మందికి పోలీస్ పతకాలు సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీటిలో ఒకరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్యపతకం, 229 మందికి పోలీస్ శౌర్యపతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు దక్కాయి. విజయ్‌కుమార్ : తెలంగాణ నుంచి జాతీయస్థాయిలో పోలీస్ పతకాలు దక్కిన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ 1997 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందినవారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అ డిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన గతంలో కేంద్ర ప్రభుత్వ డిప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్‌లో పదేళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్ సిటీ, మాదాపూర్ డీసీపీగా, కడప, నల్లగొండ జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. రమణకుమార్: రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం దక్కిన మరో అధికారి మదాడి రమణకుమార్ ప్రస్తుతం సంగారెడ్డి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన సుదీర్ఘకాలంపాటు ఏసీబీలో పనిచేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో పనిచేస్తున్న ఎస్పీ భాస్కరన్‌కు పోలీస్ శౌర్య పతకం దక్కింది. భాస్కరన్ సహా మొత్తం 22 మందికి పోలీస్ శౌర్య పతకాలు(పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ–పీఎంజీ) , ఉత్తమ ప్రతిభా పోలీస్ పతకాలు (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పది మందికి దక్కాయి. నలుగురు జైలు అధికారులకు కూడా... నలుగురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీ.హెచ్.కైలాశ్, హెడ్‌వార్డర్ జి.మల్లారెడ్డిలు ప్రతిభా పతకాలకు ఎంపికయ్యారు. జహీరాబాద్ ఫైర్‌స్టేషన్‌కు చెందిన లీడింగ్ ఫైర్‌మ్యాన్ శ్రీనివాస్‌కు ఫైర్ సర్విస్ ప్రతిభా పురస్కారం దక్కింది. హోంగార్డులు కె.సుందర్‌లాల్, చీర్ల కృష్ణ సాగర్లకు హోమ్గార్డ్స్ – సివిల్ డిఫెన్స్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరిద్దరూ బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించడంతో ఈ అవార్డుకు ఎంపిక చేశారు. -
రాజకీయ నేతలకు అనుకూలంగానే పోలీసు బదిలీలు.. ట్రాన్స్‘ఫర్’పై ఈసీ దృష్టి!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పోలీస్‌శాఖలో భారీఎత్తున జరిగిన బదిలీలపై ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టి పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లాంగ్ స్టాండింగ్‌గా వివిధ శాఖల్లో ఉన్న అధికారుల బది లీకి ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పోలీస్‌శాఖ విషయానికి వచ్చేసరికి కొందరు రాజకీయనేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారనే విషయం ఈసీ దృష్టికొచ్చింది. ఇలా కొత్త స్థానాల్లోకి వచ్చిన వారితో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడం సాధ్యం కాదనే భావనలో ఉంది. ఈ వ్యవహారంపై మాజీ ఐపీఎస్‌లతో పాటు నిఘావర్గాల ద్వారా సమాచారం సేకరిస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోడ్ అమలులోకి వస్తుంది. ఆపై ప్రస్తుతం జరిగిన బదిలీల్లో అనేక స్థానాలు ప్రక్షాళన చేయాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. ఈసారి గతానికి భిన్నంగా ఎందుకంటే... పోలీసు విభాగంలో బదిలీలు సర్వసాధారణం. నిర్ణీత కాలపరిమితితో బదిలీలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బదిలీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి గతానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఒకే పోస్టులో లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న అధికారులతోపాటు, భారీ సంఖ్యలో పదోన్నతుల నేపథ్యంలో నాన్‌కేడర్ ఎస్పీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు భారీ సంఖ్యలో అధికారులకు స్థానచలనం తప్పలేదు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి స్టేషన్ హౌస్ఆఫీసర్లుగా ఉండే ఎస్ఐ పోస్టుల నుంచి నాన్‌కేడర్ ఎస్పీల వరకు అన్నింటిలోనూ రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువైంది. ఓ అధికారి సమర్థత ఆధారంగా కాకుండా ఆయనకు ఎక్కడ పోస్టింగ్ కావాలో అక్కడి రాజకీయ నాయకులు ఇచ్చే సిఫార్సుల ఆధారంగా పోస్టింగ్ లభించింది. ఫోకల్ పోస్టులుగా పిలిచే శాంతిభద్రతల విభాగంతోపాటు మరికొన్ని కీలక వింగ్స్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని పోస్టుల్లో బదిలీల బంతాట తమ సామాజికవర్గం కాదనో, విధేయులుగా ఉండరనో, ముక్కుసూటి అధికారులని భావించిన వారి బదిలీల విషయంలో బంతాట తప్పలేదు. పోస్టింగ్ వచి్చనవారు, ఆ పోస్టులో చేరకుండా, చేరినా ఆ సీట్లలో కూర్చోకుండా, కూర్చున్నా ఒక్కరోజు కూడా విధులు నిర్వర్తించకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. పెద్దస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పిస్తూ కొత్తగా వచి్చన అధికారులూ బదిలీ అయ్యేలా చేసి తమ పంతం నెగ్గించుకున్నారు. ప్రత్యేక బృందాలతో వివరాల సేకరణ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గత నెలలో హైదరాబాద్‌కు వచి్చన ఎన్నికల సంఘం అధికారులు పోలీసు సహా వివిధ విభాగాలతో భేటీ అయ్యారు. పోలీస్‌శాఖలో రాజకీయ నేతల సమ్మతి, సిఫార్సు ఆధారంగా పోస్టుల్లోకి వచి్చన వారి ప్రభావం ఎన్నికల ప్రక్రియపై ఉంటుందని ఈసీ గుర్తించింది. దీనిపై వివరాలు సేకరించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నట్టు తెలిసింది. వీటిలో మాజీ ఐపీఎస్ అధికారులతో పాటు నిఘా వర్గాలకు చెందిన వారు ఉంటారని సమాచారం. రాష్ట్రంలో వివాదాస్పదమైన బదిలీల్లో కొన్ని... – మహబూబాబాద్ జిల్లాలోని ఓ డివిజన్లో ముగ్గురు డీఎస్పీలు నాలుగుసార్లు బదిలీ అయ్యారు. ఇవి కేవలం పక్షం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. – నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ డీఎస్పీ పోస్టింగ్ వివాదాస్పదమైంది. అక్కడకు వచ్చిన అధికారిని కొన్ని రోజుల్లో మార్చేశారు. ఆయన స్థానంలో అక్కడే ఇన్స్పెక్టర్గా పనిచేసి, ఇటీవలే పదోన్నతి పొంది, రేంజ్‌కు వెళ్లిన అధికారిని తీసుకొచ్చారు. – నిజామాబాద్ జిల్లాలో ఓ అధికారి ఏడాది క్రితమే డీఎస్పీగా ఓ డివిజన్లో చేరారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ మధ్య విభేదాలతో ఈయన బదిలీ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే పట్టుపట్టి మరీ తనకు అనుకూలమైన పాత అధికారినే తెచ్చుకున్నారు. – హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎస్ఐ నుంచి ఏసీపీ వరకు అనేక పోస్టింగులు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ రాజకీయ ఒత్తిళ్లతో విధులు నిర్వర్తించలేకపోయారు. చివరకు ఈయన బదిలీ కాగా, నేతలను అనుకూలమైన వ్యక్తికే పోస్టింగ్ వచ్చింది. – వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఓ ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన అధికారి తన పలుకుబడితే అదే సబ్‌డివిజన్‌లోని మరో పోలీస్‌స్టేషన్‌కు మారారు. స్థానిక నేతల అండదండలతోనే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. -
పంద్రాగస్టుకు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: వచ్చేనెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి 77వ భారత స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూస్తూ విస్తృత ఏర్పాట్లుచేయాలన్నారు. అదేరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి కూడా ఏర్పాట్లుచేయాలని సీఎస్ వారిని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీస్ కమిషనర్ పర్యవేక్షించాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటుచేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులందరికీ ప్రొటోకాల్ సహా తగిన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కూడా సీఎస్ సూచించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు.. మరోవైపు.. వీడియో లింక్ ద్వారా సమావేశంలో పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పరంగా విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏర్పాట్లన్నింటినీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఏపీఎస్పీ అదనపు డీజీపీలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారని చెప్పారు. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. శకటాల ప్రదర్శనకు ఇప్పటివరకూ 13 శాఖలు ముందుకొచ్చాయని, పర్యాటక శాఖ శకటం కూడా ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ఈ వేడుకలను ప్రజలందరూ తిలకించేందుకు వీలుగా స్క్రీన్లు ఏర్పాటుచేయడంతోపాటు ఆలిండియా రేడియో, దూరదర్శన్ సహా వివిధ చానాళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. ఇక వేడుకల అనంతరం ఆయా శకటాలను విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో తిప్పనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు.. అనంతరం.. ఎన్టీఅర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొనేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కూడా మాట్లాడారు. అంతకుముందు.. రాష్ట్ర ప్రొటోకాల్ విభాగం సంచాలకులు ఎం. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వివిధ శాఖలపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మహిళా కమిషన్ల ముందుకు నవ్య కేసు
ధర్మసాగర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వివాదాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలమీద విచారణ చేపట్టి నివేదిక అందజేయాల్సిందిగా మహిళా కమిషన్లు పోలీసు శాఖను ఆదేశించాయి. కాగా, ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరుల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సర్పంచ్ నవ్య శనివారం మరోసారి మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే వద్ద నయాపైసా కూడా తీసుకోలేదని మరోమారు స్పష్టం చేశారు. సీడీఎఫ్ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యే రాజయ్యపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టనని.. అందరి బండారం బయట పెడతానని ఆమె హెచ్చరించారు. నోటీసులు జారీ చేసిన పోలీసులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు ఆయన పీఏ శ్రీనివాస్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, తన భర్త ప్రవీణ్‌పై నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేతోపాటు మిగతావారిపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు, ఫోన్ రికార్డులు, డాక్యుమెంటరీ సాక్ష్యం, ఇతర ఏ విధమైన ఆధారాలు ఉన్నా తమకు అందజేయాలని ధర్మసాగర్ పోలీసులు, కాజీపేట ఏసీపీ ఆమెకు వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. కాగా, ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారని మీడియా నవ్యను ప్రశ్నించగా అడ్వొకేట్ ద్వారా తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు అప్పగిస్తానని తెలిపారు. -
మత్తులో పోలీసు సిబ్బంది హల్చల్
దొడ్డబళ్లాపురం: విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది మద్యం మత్తులో హల్చల్ చేశారు. ఈఘటన మాగడి పట్టణంలో జరిగింది. ఏఎస్ఐ మంజునాథ్, కుదూరు క్రైం పీసీ నారాయణ, మరో ఇద్దరు పోలీసులు మాగడి పోలీస్‌స్టేషన్ నుంచి ఓ ఖైదీని తీసుకుని రామనగర జిల్లా కారాగృహం వెళ్లారు. ఖైదీని అక్కడ వదిలి తిరిగి వస్తూ మార్గం మధ్యలో మద్యం తాగారు. షర్టులు విప్పి కారు డ్రైవర్‌తో గొడవపడ్డారు. ఇదేమని ప్రశ్నించిన స్థానికులను దుర్భాషలాడారు. స్థానికులు ఈదృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. -
నిజామాబాద్ జిల్లా పోలీసుల్లో రాజకీయ బదిలీలు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ జిల్లాలో పోలీసుల బదిలీలకు రాజకీయ రంగు పట్టుకుంది. జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గం ప్రజాప్రతినిధి అనుగ్రహం ఉన్నా, బదిలీ ఎప్పుడు జరుగుతుందోనని ఎస్సైలు, సీఐలు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరిలో నిజామాబాద్ ఏసీపీగా పని చేసిన వెంకటేశ్వర్ రెండేళ్లు కాకుండానే బదిలీ పై వెళ్లడంతో అప్పుడు పోలీస్‌వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫా ర్సు లేఖలతో వచ్చినా పూర్తికాలం పని చేస్తామా లేదా అనే సందేహాలు ఉన్నాయి. గత కొంతకాలంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలు, సీఐలు, ఏసీపీల బదిలీలు పరంపర కొనసాగుతునే ఉన్నాయి. పోలీస్‌శాఖలో రాజకీయరంగు పులుమడంతో జిల్లాలో పోలీసులకు గుర్తింపు లేకుండాపోతుంది. జిల్లా పోలీస్‌శాఖలో ఎస్సైలు, సీఐలను కొందరు ప్రజాప్రతినిధులు తమకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో ఎన్నికల బదిలీలు ఉండగా జిల్లాకు కొన్ని రోజుల క్రితం వచ్చిన సీఐలు బదిలీలు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధిని కలిస్తే చాలు.. జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు జరిగే కార్యక్రమాలకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు తమ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులకు కాకుండా వేరే నియోజకవర్గ ప్రతినిధిని కలిస్తే చాలు ఆ పోలీస్ అధికారి పోస్టు ఉంటుందా? ఊడుతుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారికి చోటుచేసుకుంది. సదరు అధికారికి పోస్టింగ్ ఉత్తర్వులు వచ్చే వరకు తెలియకపోవడం శోచనీయం. ఈ పోలీస్ అధికారి పరిధిలో మూడు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉంటారు. ఓ కార్యక్రమంలో సదరు ప్రజాప్రతినిధి వచ్చిన సమయంలో భద్రత కల్పించడంతో వారం తర్వాత బదిలీ వెలువడటం కొసమెరుపు. ఈక్రమంలో ఫిబ్రవరి నుంచి ఏసీపీతోపాటు సీఐ పలువురు బదిలీ అయ్యారు. ఎన్నికల కోసమే.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా లో పోలీసుశాఖలో బదిలీలు జరుగుతాయనే చర్చ జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉన్నవారి కోసం పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడం, తమకు సహకరించడం లేదనే సాకుతో బదిలీలు చేయడం జిల్లాలో కొనసాగుతునే ఉంది. కానీ పోలీస్‌శాఖ బదిలీల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకోవడంతో పోలీసులు పనిచేయడంలో ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటికే జిల్లా పోలీస్‌కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈక్రమంలో వచ్చే నెలలో పోలీస్‌శాఖలో బదిలీలు జరుగుతాయనే చర్చ కొనసాగుతోంది. -
నాడు భయం భయం.. నేడు భద్రతకు భరోసా
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతికతతో బలోపేతమైన పోలీసు వ్యవస్థ.. పెరిగిన భద్రత.. తగ్గిన నేరాలు.. నేరస్తులకు సత్వర శిక్షలు.. వెరసి ప్రజలకు పూర్తి భరోసా.. ఇదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు. శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ప్రజల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న వినూత్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. దిశ యాప్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేస్తోంది. రాష్ట్రంలో నేరాలు తగ్గాయని, భద్రత పెరిగిందని జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదికలు వెల్లడిస్తున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. పూర్తి భద్రతతో ప్రజలు సంతోషంగా ఉండటం మాత్రం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది. టీడీపీకి కొమ్ముకాసే పచ్చ పత్రికలకూ కంటగింపుగా మారింది. అందుకే రాష్ట్రంలో భద్రతపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. విశాఖపట్నంలో ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ను గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించి కిడ్నాపర్లను అరెస్టు చేయడం పట్ల అంతటా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కానీ పచ్చ మీడియా మాత్రం వక్రీకరణలతో అక్కసు వెళ్లగక్కుతుండటం దిగజారుడు పాత్రికేయ విలువలకు అద్దం పడుతోంది. కానీ ఎన్సీఆర్బీ నివేదికలు, ప్రజల సంతృప్తికర స్థాయి అసలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. శాంతిభద్రతలు భేష్ గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేసింది. రాష్ట్ర స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ స్థాయి వరకు ఎక్కడా సరైన పర్యవేక్షణ, జవాబుదారీతనం ఉండేవి కావు. దాంతో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అల్లరి మూకలు, రౌడీ గ్యాంగ్‌లు, కరడుగట్టిన నేరస్తులు చెలరేగిపోయారు. నేరాల రేటు పెరుగుతున్నా సరే నియంత్రణ చర్యలే లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. నేరాల కట్టడికి పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. తత్ఫలితంగా రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు గణనీయంగా తగ్గాయి. అందుకు ఎన్సీఆర్బీ గణాంకాలే నిదర్శనం. మహిళా భద్రతకు దిశా నిర్దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పోలీసు శాఖ ప్రవేశపెట్టిన దిశ యాప్, దిశ వ్యవస్థ మహిళా భద్రతకు పూర్తి భరోసానిస్తున్నాయి. దిశ యాప్ ద్వారా ఎవరైనా సంప్రదించిన 5–10 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కల్పిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 1.24 లక్షల ఎస్‌వోఎస్ కాల్స్ వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి రెండుసార్లు ఎస్‌వోఎస్ బటన్ నొక్కి చూస్తారు. అటువంటివి కాకుండా పోలీసులు చర్యలు తీసుకోదగ్గ 28,585 కాల్స్ వచ్చాయి. వీటికి పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆపదలో ఉన్న 2,300 మంది మహిళలకు తక్షణం భద్రత కల్పించారు. 423 మందిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చారు. దిశ యాప్ ద్వారా సగటున రోజూ 250 కాల్స్ రావడం ఈ వ్యవస్థ పట్ల మహిళల్లో ఏర్పడిన భరోసాకు నిదర్శనం. -
కన్నబిడ్డలను కాల్చి చంపిన కసాయి తండ్రి
అమెరికా: అమెరికాలో ఓ కసాయి తండ్రి ముక్కుపచ్చలారని తన ముగ్గురు కుమారులపై కనికరం లేకుండా కాల్పులు జరిపి కడతేర్చాడు. అంతకంటే ముందు అతని దురుద్దేశాన్ని గ్రహించిన ఆ పిల్లల తల్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె పైన కూడా కాల్పులు జరిపాడు. అతని కుమార్తె మాత్రం ఎలాగోలా అక్కడి నుండి బయటపడిన ప్రాణాలు దక్కించుకుంది. విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ ఒకేచోట.. ఓహియో ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల చాడ్ డోర్ మాన్ తన ముగ్గురు మగ పిల్లలను నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపాడు. వారి వయసులు 3, 4, 7 సంవత్సరాలు. మొదట ఇద్దరిని కాల్చి చంపగా మూడో కుమారుడు భయంతో పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగులు తీశాడు. అయినా కూడా ఆ తండ్రి అతడిని విడిచిపెట్టలేదు. పొలాల్లోకి వెళ్లి కుమారుడిని వెంటాడి మరీ పట్టుకుని తీసుకొచ్చి అదే ఇంట్లో కాల్చి చంపాడు. అంతకుముందే పిల్లల తల్లి వారిని చంపవద్దని వారించినందుకు ఆమె పైన కూడా కాల్పులు జరిపాడు. ఆమె అక్కడే కుప్పకూలింది. ప్లాన్ ప్రకారమే.. ఇంతటి ఘోర మారణకాండను కళ్లారా చూసిన కుమార్తె మాత్రం బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది. మా నాన్న అందరినీ చంపేస్తున్నాడని చుట్టుపక్కలవారికి సమాచారం అందించింది. దీంతో స్థానికులు పోలీసులకు కబురు పెట్టగా వారు వచ్చి అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని ఆసుపత్రికి తరలించారు. విచారణలో డోర్ మాన్ ఎప్పటినుంచో పిల్లలను చంపాలనుకుంటున్నట్లు, ప్రణాళిక ప్రకారమే వారిని చంపినట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి -
TS: ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84 శాతం మంది అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది, కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 4,564మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్ ఎస్సై 43,708 మంది, ఐటీ అండ్ కమ్యునికేషన్ ఎస్సై పోస్టులకు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులకు 1,779 మంది, ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి అభ్యర్ధులు సాధించిన మర్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్ సైట్లో తమ వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చని పేర్కొంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఇతర కమ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ. 3 వేలు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని సూచించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయికి పోలీసు వ్యవస్థ.. స్నేహపూర్వక పోలీసు విధానం.. దశాబ్దాలుగా బ్రహ్మపదార్థంగా అంతుచిక్కకుండా ఉన్న ఈ రెండు లక్ష్యాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించి చూపించింది. అందుకోసం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రజలు భయ పడకుండా, శాంతి భద్రతలతో జీవించేలా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దింది. అక్రమ వ్యాపారాల నిరోధానికి కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని నెలకొల్పింది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన గంజాయి సాగును కూకటివేళ్లతో సహా పెకలించివేసింది. నాటు సారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో నేరాల కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు, అల్లర్లు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికలే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. వ్యవస్థాగతంగా బలోపేతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లా పోలీసు కార్యాలయాలు 26కు పెరిగాయి. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి కొత్తగా 16 సబ్ డివిజన్లు, 19 పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేసింది. 2019కు ముందు 98 సబ్ డివిజన్లు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. 2019కు ముందు 197 పోలీస్ సర్కిళ్లు ఉండగా ప్రస్తుతం 216కు చేరాయి. ఇక ఏడాదికి 6,500 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశంలోనే విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త వ్యవస్థను సృష్టించింది. రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి గస్తీ విధులు కేటాయిస్తోంది. అసాంఘిక శక్తులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడం, రౌడీషీట్లు తెరవడం మొదలైన చర్యలతో నేరాలకు ఆస్కారం లేకుండా చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన భద్రత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడులు, వేధింపుల కేసుల్లో తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. దర్యాప్తు వేగంగా చేస్తూ త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేస్తోంది. దాంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపుల కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో 2,382 కేసులు నమోదు కాగా 2022లో 2,229 కేసులకు తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో 15 శాతం కేసులు తగ్గాయి. గంజాయి, నాటు సారాపై ఉక్కుపాదం గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం కొత్తగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసి మరీ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న గంజాయి దందాను కూకటివేళ్లతోసహా పెకలించి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. ముందుగా గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసి ప్రత్యేక బృందాలను నియమించి మరీ కట్టడి చేసింది. మొత్తం 384 గ్రామాల్లో మూడు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ నిర్వహించింది. మొత్తం 9,093 ఎకరాల్లో ఏకంగా రూ.11,659 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేసింది. స్మగ్లింగ్‌ను అడ్డుకుని భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేసింది. 2022లో 2 లక్షల కేజీలు, 2023లో ఇప్పటివరకు 3.32 లక్షల కేజీల గంజాయి నిల్వలను కాల్చి బూడిద చేసింది. ♦ దశాబ్దాలుగా గంజాయి సాగే జీవనాధారంగా చేసుకున్న గిరిజనుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచి్చంది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. గతంలో గంజాయి సాగు చేసిన 7,328 ఎకరాల్లో కాఫీ, నిమ్మ, జీడి, కొబ్బరి, రాజ్మా, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తుండటం ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పునకు నిదర్శనం. ♦ అదే రీతిలో నాటుసారా దందాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తింపు పొందిన మొత్తం 2,202 గ్రామాల్లో ఏకంగా 2,184 గ్రామాల్లో సారా బట్టీలన్నవే లేకుండా చేసింది. నాటు సారా కాచే వారిని ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తోంది. మిగతా కొద్ది గ్రామాల్లోనూ త్వరలోనే నాటు సారా రూపుమాపడానికి చర్యలు చేపట్టింది. ఈ నాలుగేళ్లలో నాటు సారా, అక్రమ మద్యం దందాపై విస్తృతంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది. 2019లో 527 కేసులు, 2020లో 922 కేసులు, 2021లో 1,691 కేసులు, 2022లో 1,379 కేసులు నమోదు చేయడం విశేషం. దాంతో రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం దందా గణనీయంగా తగ్గింది. 2023లో ఇప్పటివరకు 497 కేసులే నమోదు కావడమే దీనికి నిదర్శనం. పదే పదే అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కింద ఇప్పటివరకు 705 కేసులు నమోదు చేయడం గమనార్హం. రహదారి భద్రతకు ప్రాధాన్యం ఎక్కువమందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్య – ఆరోగ్య శాఖలతో సంయుక్త కార్యాచరణ చేపట్టింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై బ్లాక్ స్పాట్లను జియో ట్యాగింగ్ చేసి ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తోంది. ఆ ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేకంగా అంబులెన్స్‌ల ఏర్పాటు మొదలైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 2019లో 20,575 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2022నాటికి 19వేలకు తగ్గాయి. హత్యలు, ఘర్షణలు కట్టడి ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నాలుగేళ్లుగా హత్యలు, ఘర్షణలు గణనీయంగా తగ్గాయి. 2018తో పోలిస్తే 2022కి రాష్ట్రంలో హత్యలు 6 శాతం తగ్గగా, అల్లర్లు 36 శాతం తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో 2023 మొదటి త్రైమాసికాన్ని పోలిస్తే హత్యలు 15 శాతం తగ్గాయి. సైబర్ నేరాల కట్టడి యావత్ ప్రపంచానికే సవాల్‌గా మారిన సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు శాఖ ముందుంది. సైబర్ నేరాల కట్టడికి పోలిసు శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా సెల్స్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సైబర్ మిత్ర యాప్, 1930 రిపోర్టింగ్ సెల్ సెంటర్లను నెలకొల్పింది. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. లోన్ యాప్‌ల వేధింపుల కట్టడికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. సైబర్ నేరాల బాధితులు గతంలో ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. శాంత్రిభద్రతల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఘర్షణలు, అల్లర్లు, హత్యలను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. గంజాయి, నాటు సారా కట్టడికి విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. – డీజీపీ కేవీ రాజేంద్రానాథ్ రెడ్డి ప్రజల భద్రతకు భరోసానిస్తున్నారు రాష్ట్రంలో నాలుగేళ్లుగా శాంతి భద్రతలు గణనీయంగా మెరుగయ్యాయి. ఘర్షణలు, అల్లర్లకు అవకాశం లేకుండా పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేస్తోంది. బాధితుల ఫిర్యాదులపట్ల సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మేమున్నాం అనే నమ్మకాన్ని పోలీసు యంత్రాంగం కల్పిస్తోంది. – డా.ర్యాలీ శ్రీనివాస్, గోదావరి కవి, తెలుగు అధ్యాపకుడు, రామచంద్రాపురం, కోనసీమ జిల్లా ప్రశాంత పరిస్థితులు నెలకొల్పారు ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే సానుకూల పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల ద్వారా పోలీసు వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకురావడం గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దాంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానం ఆచరణలోకి వచ్చింది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. –సి. స్వరాజ్యలక్ష్మి, రిటైర్డ్ ప్రిన్సిపల్, శ్రీ పద్మావతి డిగ్రీ–పీజీ కళాశాల, తిరుపతి -
బ్లాక్ స్పాట్స్‌పై నజర్
సాక్షి, హైదరాబాద్ : తరచూ ప్రమాదాలు జరుగుతున్న రోడ్లపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌తోపాటు రోడ్లు, భవనాలు, ఆరోగ్య, స్థానిక మున్సిపల్‌శాఖ అధికారుల సమన్వయంతో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో.. మరోమారు ప్రమాదాలకు తావులేకుండా తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే.. కొంత కాలం తర్వాత ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలోంచి తొలగిస్తున్నట్టు అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,002 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. 2022 నాటికి వాటి సంఖ్య 951కి తగ్గింది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు ప్రమాదానికి కారణం రోడ్డు మలుపు లేదా ఇరుకుగా ఉండటం అయితే.. వెంటనే ఆ ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేసి రోడ్డు వెడల్పు చేయడం, లేదా మూల మలుపు ప్రమాదకరంగా లేకుండా మార్చడం వంటి ఇంజనీరింగ్ చర్యలతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారు. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్లాక్ స్పాట్లలో రోడ్డు సరిగా కనిపించేలా మార్కింగ్‌లు పెట్టడం.. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్స్ వేయడం, గుంతలు పూడ్చడం వంటి తాత్కాలిక చర్యలను తీసుకుంటారు. బ్లాక్ స్పాట్ అంటే..? బ్లాక్ స్పాట్లను రెండు విధాలుగా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో గత మూడేళ్లలో ఐదుకు మించి రోడ్డు ప్రమాదాలు జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు. ఏదైనా రోడ్డులో 500 మీటర్ల పరిధిలో జరిగిన ప్రమాదంలో పది మంది కంటే ఎక్కువ మంది చనిపోయినా (అక్కడ జరిగిన ప్రమాదాల సంఖ్యతో సంబంధం లేకుండా) ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా పరిగణిస్తారు. -
రెండు మూడు రోజులకు ఒక పోలీసు మృతి.. ఐదేళ్లలో 821 మంది
తమ ప్రాణాలను పణంగా పెట్టి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులను వివిధ అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో ఒక్క ముంబైలోనే 821 మంది పోలీసులు మృతి చెందినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి సగటున రెండు, మూడు రోజులకు ఒక పోలీసు మృతి చెందుతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై నిత్యం వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంటుంది. ముంబైలో నివాసముంటున్న దాదాపు కోటిన్నర జనాభాకు రక్షణ కల్పించాలంటే పోలీసులకు ఒక సవాలుగా మారుతుంది. సాధారణంగా పోలీసులపై నేరాలను నియంత్రించడం, శాంతి, భద్రతలు కాపాడటం, ట్రాఫిక్ నియమాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి సారించడం తదితర కీలక బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలను నేరవేర్చే ప్రయత్నంలో పోలీసులు తమ ఆర్యోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదనంగా కొన్ని గంటలు విధులు నిర్వహించడం, పై అధికారుల ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత విశ్రాంతి లభించకపోవడం వంటి కారణాలతో పోలీసులు వివిధ అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా గుండెపోటు, రక్తపోటు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలతో ఐదేళ్లలో 821 మంది పోలీసులు మృత్యవాత పడ్డారు. ఇందులో అత్యధికంగా గుండెపోటుకు సంబంధించిన వేర్వేరు సమస్యలతో 168 మంది మృతి చెందారు. అదేవిధంగా కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ ముంబై పోలీసు శాఖకు చెందిన 123 మంది చనిపోయారు. ఇదే ఐదేళ్ల కాలవ్యవధిలో 31 మంది పోలీసులు ఆత్యహత్య చేసుకున్నారు. అందుకు కుటుంబ కలహాలే ప్రధాన కారణం కాగా.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రెండో స్థానంలో ఉన్నాయి. ఇందులో కేన్సర్, కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులున్నాయి. ఆత్మహత్యల్లో ఉరేసుకోవడం, భవనం పైనుంచి దూకడం, సరీ్వసు రివాల్వర్‌తో కాల్చుకోవడం, రైలు కింద పడటం లాంటి సంఘటనలున్నాయి. చదవండి: డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ! ఎప్పుడూ చర్చల్లోనే పోలీసులు.. ముంబై పోలీసుల ఆరోగ్య సమస్య అంశం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. అయినప్పటికీ నిర్లక్ష్యం జరుగుతోంది. 2018 నుంచి 2023 ఏప్రిల్ వరకు ఏకంగా 821 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడినట్లు అధికారికంగా లభించిన గుణంకాలు చెబుతున్నాయి. ముంబై నగరం ఎప్పుడు ఏదో కారణంతో బిజీగా ఉంటుంది. ఒకపక్క దేశ ఆర్థిక రాజధాని, మరోపక్క రాష్ట్ర రాజకీయాలకు ప్రధాన నిలయం కావడంతో తరుచూ వీఐపీల రాకపోకలు, రాజకీయ సభలు, సమావేశాలు, ప్రముఖుల భేటీ వల్ల వారికి బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత ముంబై పోలీసులపై ఉంది. అంతేగాకండా వివిధ మతాల పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఉంటాయి. దీంతో శాంతి, భద్రతలు అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసుల వారాంతపు, దీర్ఘకాలిక సెలవులు రద్దు చేస్తారు. అలాగే పోలీసులకు రోజుకు ఎనిమిది గంటలు విధులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. కానీ ప్రత్యక్షంగా అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. దీనికి తోడు ముంబై జనాభాతో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో పోలీసులపై అదనపు భారం పడుతుంది. ఫలితంగా వారి ఆర్యోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మండే ఎండలూ కారణమే.. గత రెండు నెలల నుంచి ముంబైలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీని ప్రభావం కూడా పోలీసుల ఆరోగ్యంపై పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 43 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇందులో ఏడుగురు పోలీసులు డ్యూటీలో ఉండగానే మృత్యువాత పడ్డారు. పోలీసులు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు పోలీసు సంక్షేమ శాఖ తరఫున అనేక సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలు, వర్క్‌షాపులు జరుగుతుంటాయి. కానీ అడపాదడపా చేపట్టడం వల్ల అనుకున్నంతమేర స్పందన రావడం లేదు. 2020–2022 కాలవ్యవధిలో ముంబైలోని ప్రముఖ టాటా కేన్సర్ ఆస్పత్రి 2,738 మంది పోలీసులకు కేన్సర్ పరీక్షలు నిర్వహించింది. 2023, ఫిబ్రవరిలో 15 రోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయగా అందులో కేవలం 325 మంది పోలీసులు పాల్గొన్నారు. అదే నెలలో యునైటెడ్ వే తరఫున ఫస్ట్ ఎయిడ్ అంశంపై శిక్షణ శిబిరం జరిగింది. సుమారు 45 వేల మంది ముంబై పోలీసుల కోసం చేపట్టిన ఈ శిబిరం సఫలీకృతం కాలేదు. -
‘3 నెలల్లో ఫిట్‌గా మారండి.. లేదా ఇంటికి వెళ్లిపోండి’
పోలీసులకు ఎత్తు, సరైన బరువు, శారీరక ధృడత్వం ఎంతో ముఖ్యం. అందుకే పోలీస్‌కు ఎంపికయ్యే సమయంలో రాత పరీక్షలతోపాటు ఈవెంట్స్‌లో కూడా తప్పక క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అయితే పోలీస్ విధుల్లో చేరాక చాలా మందికి ఫిట్నెస్ కోల్పోవడం చూస్తుంటాం.. ఇక వయసు మీదపడుతున్న వారికైతే పొట్ట అమాంతం ముందుకు వచ్చేస్తుంటుంది. కొందరిని అయితే యూనిఫాంలో చూస్తే తప్ప వారిని పోలీసులని గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలోని పోలీసులును ఫిట్ మార్చేందుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్‌లతో సహా అన్ని విభాగాల్లోని పోలీసులందరూ ఫిట్‌గా ఉండాలని సూచించింది. పోలీసులు ఫిట్ మారడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ తర్వాత వారి బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ)నమోదు చేయనున్నట్లు తెలిపింది. ఏపీఎస్, ఏపీఎస్ అధికారులతో సహా అస్సాం పోలీసు సిబ్బంది అందరికి ఆగస్టు 15 వరకు మూడు నెలల సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. ఆ తరువాత 15 రోజులకు వారి బీఎమ్ఐ లెక్కగట్టనున్నట్లు పేర్కొన్నారు. ఊబకాయం కేటగిరిలో(BMI 30+) ఉన్నవారికి బరువు తగ్గించుకోవడానికి మరో మూడు నెలల సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అప్పటికీ ఫలితం కనిపించకపోతే తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకునే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే హైపోథైరాయిడిజం వంటి వైద్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. బీఎంఐ లెక్కించుకునే వారిలో మొదటి వ్యక్తి తానేనని డీఐజీ తెలిపారు. ఇక అస్సాంలో 7,000 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు.. -
నెల్లూరులో విశాఖపట్నం పోలీసులు
నెల్లూరు(క్రైమ్): విశాఖపట్నం కిడ్నీ రాకెట్ కేసు విచారణలో భాగంగా అక్కడి పోలీసు ప్రత్యేక బృందం సోమవారం నెల్లూరుకు వచ్చింది. నెల్లూరు మినీబైపాస్‌రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడికి ఆ కేసుతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బాలాజీనగర్ పోలీసుల సహకారంతో సదరు వైద్యుడి ఆస్పత్రికి చేరుకున్నారు. మొదట సదరు వైద్యుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని అక్కడి సిబ్బంది చెప్పడంతో కొన్ని గంటలపాటు పోలీసు సిబ్బంది అక్కడే వేచిచూశారు. ఎంత సేపటికి వైద్యుడు బయటకు రాకపోవడంతో పోలీసులు ఆస్పత్రిలోకి ప్రవేశించి వైద్యుడి కోసం గాలించగా కనిపించలేదు. దీంతో పోలీసులు అతని కోసం గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో విశాఖపట్నం పోలీసులు వెనుదిరిగారు. ఈ విషయం నగరంలో చర్చనీయాంశంగా మారింది. -
నంబర్ లేకుంటే కటకటాలే!
హైదరాబాద్: నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌పై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయిన, కనిపించకుండా ప్లేట్‌ను వంచినా, మాస్క్ వేసినా, అస్పష్ట నెంబర్ ప్లేట్‌తో నడిపినా, ట్యాంపరింగ్ చేసినా కేంద్ర మోటారు వాహన చట్టంసెక్షన్ 192 కింద కేసులు నమోదు చేస్తున్నారు. చార్జిషీట్లు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాచకొండ పరిధిలో 49 వేలకు పైగా నెంబర్ ప్లేట్ టాంపరింగ్ కేసులు నమోదయ్యాయి. పునరావృతమైతే అంతే.. కొత్త వాహనాలు 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ తెలిపారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌తో తొలిసారి చిక్కిన వాహనదారులు వెంటనే వాటిని సరిచేసుకోవాలని, ఇదే తప్పు పునరావృతం ఐతే కిమినల్ కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. ఆరుగురికి జైలు శిక్ష.. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తూ రెండోసారి పట్టుబడిన ఆరుగురు నిందితులకు న్యాయస్థానం జరిమానా, జైలు శిక్ష విధించింది. వీరిలో అత్యధిక మందికి రూ.5 వేల వరకు జరిమానా విధించారు. అలాగే మూడు నుంచి ఐదు రోజుల వరకు జైలు శిక్ష కూడా విధించారు. ఇకపై నెంబర్ప్లేట్లు లేని వాహనాలు నడిపే వారందరిపై కేసులు నమోదు చేసి చార్జిషీట్లు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాల వల్ల నేరాలకు ఆస్కారం ఉంటుందని, అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. -
కొత్త బండి.. రెండు హెల్మెట్లు!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తుండటం... కొన్ని సందర్భాల్లో వాహనదారులు హెల్మెట్ ధరించినా వెనుక కూర్చొనే వ్యక్తులకు (పిలియన్ రైడర్) హెల్మెట్ లేక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటంతో ఈ తరహా ప్రమాదాలను నివారించాలని పోలీసులు భావిస్తున్నారు. వాహనదారుడితోపాటు వెనుక కూర్చొనే వారు సైతం హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రతిపాదనతో ముందుకు వెళ్లనున్నారు. ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలోనే రెండు నాణ్యమైనహెల్మెట్లను కొనడాన్ని తప్పనిసరి చేస్తే మరింత ఫలితం ఉంటుందని యోచిస్తున్నారు. నూతన ద్విచక్ర వాహన ధరతోపాటు రెండు నాణ్యమైన హెల్మెట్ల ధరను సైతం జోడించి షోరూంలు విక్రయించేలా చూడాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపాలనుకుంటున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీన్ని అమలు చేసేలా రవాణా శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పోలీసు శాఖ తరఫున కోరనున్నట్లు చెప్పారు. ఇలా రెండు హెల్మెట్ల వాడకం క్రమంగా పెరిగితే రోడ్డు ప్రమాదాలు జరిగినా ద్విచక్రవాహనదారుల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని ఆ అధికారి పేర్కొన్నారు. -
నేషనల్ హైవేలుకాదు..లోకల్ రోడ్లే డేంజర్!
సాక్షి, హైదరాబాద్ : విశాలంగా ఉండే జాతీయ రహదారులు.. వేగంగా దూసుకెళ్లే వాహనాలు... దీంతో అక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని అనుకోవడం సహజం. కానీ గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్ర రహదారులే యమ డేంజర్ అని పోలీస్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ రహదా రుల్లో ప్రయాణంతో పోలిస్తే వాహనదారులు స్థానిక రోడ్లపై నడిపేటప్పుడు అంత్యంత నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలుస్తోంది. పక్క ఊరికే కదా వెళ్లేది.. పది కిలోమీటర్ల దూరానికే హెల్మెట్ ఎందుకు? ఊర్లో కూడా హెల్మెట్ పెట్టుకుని తిరగాలా? కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా అడిగేదెవరు..? అన్న ధీమాతో వెళుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నట్టు వెల్లడవుతోంది. నిర్లక్ష్యమే మృత్యుపాశం.. వాహనదారుల నిర్లక్ష్యమే వారి పాలిట మృత్యువై వెంటాడుతోంది. జాతీయ రహదారులతో పోలిస్తే.. స్థానిక రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం రోడ్డు భద్రత నియమాలను లెక్క చేయడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతులు ద్విచక్రవాహనదారులే ఉంటున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించకపోవడం.. హెల్మెట్ పెట్టుకున్నా.. దాన్ని సరిగా లాక్ చేయకపోవడం మరణాలకు ప్రధాన కారణాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దూరం ఎంతైనా సరే.. తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను అలవర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా కారులో సీటుబెల్ట్, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ వాడకం తప్పక అలవాటు చేసుకోవాలని చెపుతున్నారు. పట్టణ, గ్రామీణప్రాంతాల వారీగా 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు.. పట్టణ ప్రాంతాల్లో మొత్తం రోడ్డు ప్రమాదాలు - 12203 మృతుల సంఖ్య - 2873 గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రోడ్డు ప్రమాదాలు - 9416 మృతుల సంఖ్య - 4684 రాష్ట్రంలో 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య ఇలా.. -
తొలి వికెట్ సీఐ ధనుంజయనాయుడే
దొండపర్తి (విశాఖ దక్షిణ): నగర పోలీస్ శాఖలో ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. తొలుతగా ముగ్గురు ఇన్స్పెక్టర్లపై వేటు పడింది. ఏడాది కాలంగా పోలీస్ శాఖలో షాడో కమిషనర్‌గా చక్రం తిప్పిన సిటీ స్పెషల్ బ్రాంచ్–2 సీఐ సి.హెచ్.ధనుంజయ నాయుడుతో పాటు మల్కాపురం సీఐ బి.లూధర్‌బాబు, హార్బర్ సీఐ పి.శోభన్‌బాబులను విశాఖ రేంజ్‌కు సరెండ్ చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఊహించినట్టుగానే వేటు.. పోలీస్ శాఖలో సీఐ ధనుంజనాయుడు ఏడాది పాటు ఒక వెలుగు వెలిగారు. షాడో కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడిచింది. కమిషరేట్ పరిధిలో ఎవరికి ఏ పని అవసరమైనా, ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా అతడిని సంప్రదిస్తే అయిపోతుందన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కొన్ని బదిలీల విషయంలో రూ.లక్షలు వసూలు చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. బహిరంగంగానే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆ వాదనలకు మరింత బలం చేకూరినట్టయింది. అయితే కొత్త కమిషనర్ వచ్చిన కొద్ది రోజుల్లోనే తొలి వికెట్ ధనుంజయనాయుడే అని పోలీస్ శాఖలో ఏ ఇద్దరు కలిసినా చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. కమిషనరేట్‌లో గుసుగసులకు తగ్గట్టుగానే ప్రక్షాళన ఆయన నుంచే ప్రారంభమైనట్లు ఈ వేటుతో స్పష్టమవుతోంది. ఆయనతో పాటు అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారన్న ఆరోపణలపై మల్కాపురం సీఐ లూధర్‌బాబు, హార్బర్ సీఐ, కోర్టు లైజన్ ఆఫీసర్ పి.శోభన్‌బాబులపై వేటు పడినట్టు తెలుస్తోంది. పోలీసు శాఖలో గుబులు : పోలీస్ కమిషనర్ సీఎం.త్రివిక్రమ్ వర్మ ప్రక్షాళనలకు పూనుకోవడంతో పోలీస్ శాఖలో గుబులు మొదలైంది. నిన్న మొన్నటి వరకు పైవాళ్ల ఆశీర్వాదాలు ఉన్నాయన్న ధీమాతో రెచ్చిపోయిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కీలక స్టేషన్లలో పోస్టింగ్‌లు సాధించిన వారిలో అలజడి రేగుతోంది. తరువాత ఎవరిపై వేటు పడనుందోనన్న భయం పట్టుకుంది. త్వరలో మరికొంత మందిపై వేటు? నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంత మంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల తీరు పట్ల అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు అవినీతి ఆరోపణలతో పాటు మరోవైపు కేసుల నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని కేసుల విషయంలో ఫిర్యాదుదారులపైనే బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. కేసుల నమోదు సంఖ్య విషయంలో కూడా తప్పుడు లెక్కలు చూపించినట్లు ఉన్నతాధికారులు ఆలస్యంగా గ్రహించి కొద్ది నెలల క్రితం మూడు స్టేషన్ల సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించిన సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా నగరంలో జరిగిన భారీ కార్యక్రమాలు వీవీఐపీ, వీఐపీ పర్యటనల విషయంలో పోలీసుల ఓవర్ యాక్షన్‌పై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటిపై పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ ఇప్పటికే దృష్టి సారించినట్లు సమాచారం. పోలీస్ శాఖలో సమూల ప్రక్షాళన దిశగా చర్యలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహిరించే సీఐలు, ఎస్ఐలపై దృష్టి పెట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటువంటి వారి జాబితాను సిద్ధం చేసి దశల వారీగా ఒక్కొక్కరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
AP: 50 మంది డీఎస్పీలు బదిలీ
సాక్షి, అమరావతి: ఏపీలో 50 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల బదిలీల వివరాలు -
రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం..
ఏటూరునాగారం: పోలీస్ వాహనం అదుపుతప్పి ఎస్సైతోపాటు ప్రైవేట్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు, ఐజీ రవివర్మలు ములుగు జిల్లా వెంకటాపురం(కె) పోలీస్‌స్టేషన్ తనిఖీ చేశారు. అనంతరం భద్రాచలం వైపు వెళ్తుండగా ఏటూరునాగారం సెకండ్ ఎస్సై ఇంద్రయ్య(59).. ప్రైవేటు డ్రైవర్ రాజు(23), కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను తీసుకొని ఎస్కార్ట్‌గా వెళ్లారు. వాహనం అతివేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడి, పల్టీలు కొట్టింది. ముందు కూర్చున్న ఎస్సై, డ్రైవర్ వాహనంలోంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఎస్సై ఇంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందారు. రాజు చెట్లపొదల్లో పడి మృతిచెందాడు. కానిస్టేబుల్ మెట్టు శ్రీనివాస్ వాహనంలో సీటును గట్టిగా పట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన తేరుకుని స్థానిక ఎస్సై రమే‹Ùకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శ్రీనివాస్‌ను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: సర్పంచ్ కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం -
డాన్లు–గాడ్ఫాదర్ల లంకె ఛేదించాలి!
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ నేతల పోషణలో, ప్రభుత్వ సంస్థల సంబంధంలో ఉంటూ మాఫియా ఇంతకాలం పెరుగుతూ వచ్చింది. పోలీసు శాఖ, బ్యూరోక్రసీ దశాబ్దాలుగా మాఫియాతో పరస్పర ప్రయోజనకరమైన సహజీవనంలో భాగమైపోయాయి. ఈ సంబంధం దేశంలోని పలు ప్రాంతాల్లో కాలానుగుణంగా పేరుమోసిన డాన్లను సృష్టిస్తూ వచ్చింది. చేదు వాస్తవం ఏమిటంటే– నేరస్థులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య గల ఈ సంబంధాన్ని ఛేదించనట్లయితే... చట్టసభల్లోకి నేరస్థుల ప్రవేశాన్ని నిరోధించడానికి తగు చర్యలు చేపట్టనట్లయితే, నేర న్యాయవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనట్లయితే, బాహ్య ఒత్తిళ్ల నుంచి పోలీసులను బయటపడవేయనట్లయితే... పరిస్థితి మరింత ఘోరంగా దిగజారిపోతుంది. పోలీసు శాఖలో కొనసాగిన నా 35 సంవత్స రాల సర్వీసులో, సరైనవిధంగా కానీ, తప్పు పద్ధతిలో కానీ ఒక మాఫియా డాన్‌ను చంపిన ఘటన సాధారణ ప్రజానీకంలో ఇంత ఆసక్తిని రేకెత్తించి, ఇంత వివాదాన్ని సృష్టించిన ఉదంతం నాకయితే గుర్తు లేదు. నిజానికి, సీన్ నుంచి కీలక పాత్ర ధారులను పక్కనబెట్టి, జరుగుతున్న సందడిని మాత్రమే ఎవరైనా గమనించినట్లయితే, ఆ శోధన ఒక పాపులర్ నేత హత్యకు గురయ్యా డన్న ముగింపునకు వచ్చి ఉండేది. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల తీవ్రత కంటే ఉత్తరప్రదేశ్‌లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని పట్టాలు తప్పించేందుకు ప్రతిపక్షం ప్రదర్శిస్తున్న కృతనిశ్చయాన్ని అది ఎక్కువగా ప్రతిఫలించి ఉండేది. నిర్దిష్ట వివరాల్లోకి వస్తే, 1993 నాటికే... ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులతో సంబంధాలను కలిగి, వారి రక్షణలో ఉంటున్న మాఫియా సంస్థల కార్యకలాపాల గురించిన సమాచారాన్ని పొందడానికి నాటి ప్రభుత్వం ఎన్.ఎన్. వోహ్రా కమిటీని నియమించింది. దీనిపై పని ప్రారంభించిన కమిటీ, ‘ప్రభుత్వ యంత్రాంగానికి ప్రాసంగికత లేకుండా చేసి, మాఫియా నెట్వర్క్ వాస్తవానికి ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది’ అని తేల్చిచెప్పింది. ఈ కమిటీ అంతిమంగా కొన్ని సిఫార్సులను చేసింది. కానీ వాటిపై తదుపరి కార్యాచరణ లేకుండాపోయింది. పార్లమెంటులో దీనిపై తీవ్ర చర్చోపచర్చలు జరిగాయి. అయినా ఫలితం లేదు. క్రమంగా పోలీసు శాఖ, బ్యూరోక్రసీ ఈ పరస్పర ప్రయోజనకరమైన సహజీవనంలో భాగమైపోయాయి. ఈ అక్రమ సంబంధం దేశంలోని పలు ప్రాంతాల్లో కాలానుగుణంగా పేరుమోసిన మాఫియా డాన్లను సృష్టిస్తూ వచ్చింది. యూపీలో ముఖ్తార్ అన్సారీ, అతీఖ్ అహ్మద్, శ్రీ ప్రకాశ్ శుక్లా వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు. ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మూలించాలి ఈ సంబంధాన్ని ఎలా ఛేదించవచ్చు? మొదటగా, మాఫియాను రాజకీయ నాయకులు పోషిస్తూ, కాపాడటాన్ని తప్పకుండా నిలిపివేయాలి. రెండు, దాని ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మూలించాలి. మూడు, మాఫియా డాన్లను చట్టానికి జవాబుదారీగా చేయాలి. నాలుగు, ఈ అవినీతి సంబంధంలో భాగంగా ఉన్న పోలీసు అధి కారులు, బ్యూరోక్రాట్ల రెక్కలు కత్తిరించాలి. ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో మాఫియాకు అత్యున్నత స్థాయిలో ఎలాంటి రాజకీయ రక్షణా లేకుండా పోయింది. దాని ఆర్థిక సామ్రాజ్యాన్ని గణనీయంగా తగ్గించి వేశారు. యూపీ పోలీసుల ప్రకారం– అతీఖ్ అహ్మద్, అతడి కుటుంబ సంపదలో రూ.1,169.20 కోట్లను జప్తు చేయడం, స్వాధీనపర్చు కోవడం లేదా నాశనం చేయడం జరిగింది. దీనికి తోడుగా, 12 మంది ముఠా నేతలు, వారి 29 మంది అనుయాయులకు శిక్ష పడేలా చేశారు. ముఖ్తార్ అన్సారీకి పదేళ్ల జైలుశిక్ష పడగా, అతీఖ్ అహ్మద్‌కు యావజ్జీవం పడింది. ఎట్టకేలకు న్యాయచక్రాలు కదలడం ప్రారంభించాయి. అయితే ఈ మార్గం సజావుగా లేదు. ఏప్రిల్ 15న అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్‌ను తప్పనిసరి వైద్య పరీక్షలకు తీసుకువెళ్తుండగా ముగ్గురు గుర్తు తెలియని యువ నేరస్థులు వారిని కాల్చిచంపారు. నిందితులకు రక్షణగా ఉంటున్న భద్రతా సిబ్బంది చేష్టలుడిగి చూస్తుండిపోయారు. వారి స్పందన పేలవంగా ఉండిపోయింది. జరిగింది దురదృష్టకరమైనది. దాన్ని అధిగమించి ఉండవచ్చు. కానీ, ఈ సమయంలో రాష్ట్ర పోలీసులు ఆ నేరంలో భాగస్వాములయ్యారని ఆరోపించడం న్యాయం కాకపోవచ్చు. న్యాయ విచారణ జరగాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించింది. బాందా, హమీర్పుర్, కాస్గంజ్ నుంచి వచ్చిన ఈ ముగ్గురు యువకులు ఎలా ఒక్కటయ్యారు? వారిని ఈ పనిలోకి ఎవరు దింపారు? వారి ఉద్దేశం ఏమిటి? వారికి ఎవరు డబ్బులిచ్చారు? వారికి టర్కీ పిస్టల్స్ ఎవరు అందించారు? హత్యాఘటనలో వారు చేసిన నినాదాలను ఎవరైనా వారికి నేర్పించారా వంటి సంబంధిత విషయాలన్నీ న్యాయ విచారణ, పోలీసు దర్యాప్తులో తేలవలసి ఉంది. ఒక్కసారిగా ఫేమస్ అయిపోవాలన్న కోరికతోనే ఈ హత్యలకు పూనుకున్నామని ఈ ముగ్గురు హంతకులు ఇచ్చిన వివరణ నమ్మేలా లేదు. అతీఖ్ కుమారుడు అసద్ అహ్మద్, అతడి అనుచరుడు గులామ్ హుస్సేన్‌లను ఏప్రిల్ 13న యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎన్కౌంటర్ అని చెబుతున్న దానిలో చంపేశారు. 2005లో జరిగిన రాజు పాల్, మరో ఇద్దరు పోలీసుల హత్యలో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ హత్యతో వీరికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. తాజా ఘటనపై తప్పకుండా న్యాయ విచారణ జరిపించాల్సి ఉంది. ఈలోగా నిందాత్మక క్రీడ మొదలైపోయింది. న్యాయవిచారణ వెల్లడించాల్సింది ఇప్పటికే తెలిసి ఉన్న వాస్తవాలను కాదు. ఒక ‘టాంగావాలా’ వేలాది కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టేలా, అధికారులు సైతం మోకాళ్లపై వంగేంత అధికార కేంద్రంగా అతగాడిని మార్చేసిన రాజకీయ నేతలు, పార్టీలు ఏవి అనే విషయాన్ని న్యాయవిచారణ బయటపెట్టాల్సి ఉంది. పాశ్చాత్య మీడియా సైతం ఈ హత్యలకు విశేష ప్రాముఖ్య తనిచ్చింది. కానీ ఈ సందర్భంగా వాటి కపటత్వం బయటపడుతోంది. ఒక మాజీ ఎంపీ హత్యకు గురయ్యాడని ‘బీబీసీ’ నివేదించడమే కాదు, అతడిని మాఫియా డాన్‌గా కాకుండా రాబిన్ హుడ్‌గా అభివర్ణించింది. ‘న్యూయార్క్ టైమ్స్’ అయితే, భారత్ చట్టవ్యతిరేక హింసవైపు దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ అమెరికాలోనే ప్రతి సంవత్సరం సగటున వెయ్యి మంది పౌరులు (2022లో 1,096 మంది, 2021లో 1,048 మంది) పోలీసుల కాల్పుల్లో హత్యకు గురవుతున్నారనే విషయాన్ని మర్చిపోయింది. ఇది సమష్టి బాధ్యత మరోవైపున జరిగిన తప్పులన్నింటి భారాన్ని పోలీసులు మోయవలసి వస్తోంది. బహుశా అందుకు వారు అర్హులే కావచ్చు. రాజకీయ వర్గానికి కూడా కొంత జవాబుదారీతనం ఉండకూడదా? మాఫియాను పెంచి పోషించింది వారే మరి. ఈ విషయంలో న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం లేదా? మునుపటి అలహాబాద్ జిల్లాలో నేర న్యాయ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లు నేతృత్వం వహిస్తున్న సమయంలోనే అతీఖ్ అహ్మద్ పెరిగాడు. అతీఖ్, అతడి అనుయాయులపై ఉన్న 54 కేసులు ఇప్పటికీ విచారణ దశలోనే ఎందుకు ఉంటున్నాయి? అందులో 1979 నాటి పాత హత్య కేసు కూడా ఉందని గుర్తించాలి. దేశంలో నేర న్యాయవ్యవస్థ వాస్తవానికి కుప్పగూలిపోతోందని జస్టిస్ వీఎస్ మలిమథ్ 2003 లోనే హెచ్చరించారు. మరి దిద్దుబాటు చర్యలు చేపట్టారా? పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం గురించి ఎవరైనా పట్టించుకున్న పాపాన పోయారా? చేదు వాస్తవం ఏమిటంటే– నేరస్థులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య సంబంధాన్ని మనం ఛేదించనట్లయితే... శాసనసభలు, పార్లమెంట్‌లోకి నేరస్థుల ప్రవేశాన్ని నిరోధించడానికి మనం తగిన చర్యలు చేపట్టనట్లయితే, నేర న్యాయవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనట్లయితే, బాహ్య ఒత్తిళ్ల నుంచి పోలీసులను బయటపడవేయనట్లయితే పరిస్థితి మరింత ఘోరంగా దిగజారి పోతుంది! ప్రకాశ్ సింగ్ వ్యాసకర్త మాజీ పోలీసు అధికారి;పోలీసు సంస్కరణల కోసం పనిచేస్తున్నారు. (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
పరిహాసమైన ప్రజాస్వామ్యం
కంచే చేను మేస్తే? ధర్మం, న్యాయం కాపాడాల్సిన పాలకులే... అధర్మానికి కాపు కాస్తే? మాఫియా డాన్ల అడుగులకు మడుగులొత్తితే? పోలీసు, న్యాయవ్యవస్థలు దోషులుగా నిర్ధారించిన వారిని సైతం శిక్షాకాలం పూర్తి కాక ముందే రకరకాల సాకులతో బాహ్యప్రపంచంలోకి వదిలేస్తుంటే ఏమనాలి? ఎవరికి చెప్పాలి? పార్టీలు, పాలకుల మీద ఏవగింపు గలిగే ఇలాంటి చర్యల వరుసలో తాజా ఉదాహరణ – హంతకుడు ఆనంద్ మోహన్ సింగ్‌ను పాలకులు నిస్సిగ్గుగా జైలు నుంచి బయటకొదిలేసిన సంఘటన. ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యను దారుణంగా చంపి, జైలు ఊచలు లెక్క బెడుతున్న ఈ బడా నేరస్థుడు గురువారం బిహార్‌లోని సహరసా జైలు నుంచి విడుదలైన తీరు నివ్వెరపరుస్తోంది అందుకే. నిరుడు బీజేపీతో బంధం తెంచుకున్నాక ఓట్ల పునాదిని విస్తరించుకొనేందుకు తంటాలు పడుతున్న బిహార్ సీఎం నితీశ్ బలమైన తోమర్ రాజ్‌పుత్ వర్గానికి చెందిన ఆనంద్‌లో అద్భుతమైన అవకాశాన్ని చూశారని ఆరోపణ వినిపిస్తోంది. స్వార్థ ప్రయోజనాలే పరమా వధిగా దోషుల్ని వదిలేసే దిగజారుడు పనిలో పార్టీలన్నీ పోటీ పడుతుండడం ఆగ్రహం రేపుతోంది. ఐఏఎస్ అధికారి, గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన కృష్ణయ్యను 1994లో దారుణంగా హత్య చేశాడీ ఆనంద్ మోహన్. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దళితుడు. విధినిర్వహణలోని ఆయనను ముజఫర్‌పూర్‌లో ప్రభుత్వ వాహనం నుంచి లాగి, హేయంగా కొట్టి చంపడానికి 1994 డిసెంబర్ 5న అల్లరిమూకను రెచ్చగొట్టింది ఆనంద్ మోహన్. 2007లో ట్రయల్ కోర్ట్ దోషికి మరణశిక్ష విధించింది. ఏడాది తర్వాత పాట్నా హైకోర్ట్ దాన్ని జీవితకాల శిక్షగా తగ్గించింది. ఈ తీర్పును ఆనంద్ సుప్రీమ్‌లో సవాలు చేసినా, ఇప్పటి దాకా కోర్ట్›ఉపశమనమేమీ ఇవ్వలేదు. అలా 2007 నుంచి జైలులో ఉన్న వ్యక్తిపై బిహార్ సర్కార్ ఎక్కడ లేని అక్కర చూపింది. ఈ నెలలోనే ‘బిహార్ ప్రిజన్ మ్యాన్యువల్ 2012’లో 481వ రూల్‌ను మార్చింది. ‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారి హత్యలో దోషి అయిన ఖైదీని విడుదల చేయరాద’న్న నిబంధనను నిర్లజ్జగా తొలగించింది. ఫలితంగా – జైలులో 14 ఏళ్ళు, 20 ఏళ్ళు గడిపిన మరో 27 మంది ఖైదీలతో పాటు ఈ నేరస్థుడికీ అన్యాయంగా స్వేచ్ఛ లభించింది. పౌర సమాజం నుంచి ప్రతిపక్షాల దాకా అందరూ తీవ్రంగా వ్యతిరేకించినా, నితీశ్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. బిహార్‌లో రాజకీయాలకూ, నేరస్థులకూ మధ్య అనాదిగా పొడిచిన పొత్తుకు ఇది ప్రతీక. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ పలుకుబడి సామాన్యమేమీ కాదు. శివ్‌హర్ లోక్‌సభా స్థానంలో గతంలో ఎంపీగా గెలిచాడు. కృష్ణయ్య హత్యతో జైలులో ఉంటేనేం, అతని భార్య లవ్లీ ఆనంద్ ఒకసారి ఎంపీ అయ్యారు. 2010 అసెంబ్లీ, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పక్షాన పోటీ చేశారు. వారి కుమారుడు చేతన్ ఆనంద్ ప్రస్తుతం ఎమ్మెల్యే. తల్లీకొడుకులిద్దరూ బిహార్ అధికార సంకీర్ణ కూటమిలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సభ్యులే. కుమారుడి వివాహ నిశ్చితార్థం కోసం ఆనంద్ ఇటీవల 15 రోజులు పెరోల్ మీద బయటే ఉన్నాడు. సదరు నిశ్చితార్థానికి సాక్షాత్తూ బిహార్ సీఎం సహా అధికార కూటమి నేతలందరూ హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. పెరోల్ ముగిసిన ఆనంద్ ఏప్రిల్ 26న జైలుకు చేరాడో లేదో, సర్కార్ సవరించిన నిబంధనల పుణ్యమా అని మర్నాడే బయటకొచ్చేశాడు. వివిధ రాష్ట్రాల్లోని పాలకుల అవసరానికి తగ్గట్టు నియమ నిబంధనలు మారిపోతున్నాయి. వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. వెరసి, జైళ్ళలోని దోషుల శిక్షాకాలాన్ని తగ్గించి బయటకు వదిలేస్తున్న లజ్జాకరమైన ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గత ఆగస్ట్‌లో బయటపడ్డ బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషుల నుంచి తాజా ఆనంద్ మోహన్ దాకా అన్ని వ్యవహారాలూ అలాంటివే. బీజేపీ నుంచి జేడీ–యూ దాకా అన్ని పార్టీలూ ఈ తిలా పాపంలో తలా పిడికెడు పంచుకున్నవే. ఓటు రాజకీయాలు, సమర్థకుల సంరక్షణ – ఇలా ఈ విడుదల వెనుక పైకి కనిపించని కారణాలు అనేకం. గద్దె మీది పెద్దల పరోక్ష సాయంతో బయటపడ్డ వీరికి సమర్థకుల నుంచి లభి స్తున్న స్వాగత సత్కారాలు, నీరాజనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఆనంద్ విడుదలతో జరిగిన బైక్ ర్యాలీలు, మిఠాయి పంపిణీలూ అచ్చంగా అలాంటివే. రేపిస్టులనూ, హంతకులనూ గౌరవించి, ఆరాధించే సంస్కృతికి అన్ని పార్టీలూ, అనుయాయులూ దిగజారుతున్న తీరు జుగుప్సా కరం. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఈ ఘటనల్లో వ్యవస్థలు భాగమైపోతూ ఉండడం శోచనీయం. చేసిన నేరం తాలూకు తీవ్రత, దోషుల వ్యక్తిగత చరిత్రలను బట్టి ఏ కేసుకా కేసు ప్రత్యేకమైనదే. కానీ, అన్నిటినీ ఒకే గాటన కడుతూ, కావాల్సినవారిని కాపాడుకొనే రీతిలో నిర్ణీత కాలవ్యవధి దాటి జైలులో ఉన్నవారందరినీ వదిలేయవచ్చని తీర్మానించడం సబబేనా? అలాంటప్పుడు బాధితులకు సరైన న్యాయం ఏ రకంగా జరిగినట్టు? పశ్చాత్తాపం, పరిణత సత్ప్రవర్తన లాంటివి శిక్షాకాలపు తగ్గింపునకు గీటురాళ్ళు కావాలి. కేవలం జైలులో గడిపిన రోజులే లెక్కలోకి తీసుకుంటే, బాజాప్తాగా బయటకొచ్చిన దోషి రేపు మరో నేరానికి పాల్పడడని నమ్మకం ఏమిటి? బాధిత కుటుంబాల కళ్ళెదుటే నేరస్థులు నిష్పూచీగా తిరుగుతుంటే, చట్టం, న్యాయం పట్ల సామాన్యుడు విశ్వాసం కోల్పోతే ఆ పాపం ఎవరిది? తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావిడి పడుతున్న పార్టీలు, ప్రభుత్వాలు ఇవన్నీ లోతైన ప్రభావం చూపే పరిణామాలని ఇకనైనా తెలివిడి తెచ్చుకోవాలి. ఈ దేశంలో చట్టాలన్నీ అధికార బలగానికి చుట్టాలేనన్న భావన బలపడితే ప్రజాస్వామ్యానికే చేటు. -
30న కానిస్టేబుల్ పోస్టులకు తుది రాతపరీక్ష
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసు శాఖలోని వివిధ విభాగాల కానిస్టేబుల్ పోస్టులకు తుదిరాత పరీక్షను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు. ఉమ్మడి 9 జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది రాతపరీక్ష నిర్వహించనున్నారు. సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల రెండు పరీక్షలకు సైతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకే పరీక్షకేంద్రాన్ని కేటాయించనున్నట్టు చైర్మన్ స్పష్టం చేశారు. కానిస్టేబుల్ తుది రాతపరీక్ష హాల్‌టికెట్లను అభ్యర్థులు సోమవారం(ఈ నెల 24) ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు www.tslprb.com వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఉన్న అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
అక్రమ వలసలపై పోలీసుల ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారు మోసపోకుండా చర్య లు చేపడుతున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపా రు. రాష్ట్రంలో గుర్తింపులేని విదేశీ నియామక సంస్థలు, అక్రమ నియామక సంస్థలు, టూరిస్ట్ ఏజెన్సీలపై గట్టి నిఘా ఉంచామన్నారు. ‘విదేశాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగుల భద్రత, క్రమబద్దీకరణ– పోలీస్ శాఖ చేపట్టాల్సిన చర్యలు’ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో శుక్రవా రం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడు తూ విదేశీ వలసలలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని, ప్రధానంగా నర్సింగ్, పారామెడికల్ రంగాల్లో సుశిక్షితులైనవారిని మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాలకు పంపించడంలో ముందంజలో ఉందన్నారు. గల్ఫ్‌దేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల మోసాల కు గురవుతున్నారన్నారు. ప్రధానంగా కువైట్, ఖ తార్, బెహ్రెయిన్, సౌదీ అరేబియా, మలేసియా, దుబాయ్‌లకు వెళ్లే బలహీనవర్గాలు, నిరక్షరాస్యులు ఎక్కువగా మోసాలకు గురవుతున్నారన్నారు. గతేడాది 3.70 లక్షల మంది వలస భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఔసఫ్ సయీద్ మాట్లాడుతూ అక్రమంగా విదే శాలకు పంపే ఏజెన్సీలపై కఠినచర్యలు చేపట్టేందుకు 1983 ఇమిగ్రేషన్ చట్టం స్థానంలో సరికొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. గతేడాది లో భారత్ నుంచి 3.70 లక్షలమంది కా ర్మి కులు వివిధ దేశాలకు వలసవెళ్లారన్నారు. పాస్‌పోర్ట్ వెరి ఫికేషన్ అత్యంత వేగంగా చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సీఎస్‌తోనూ సమావేశం సురక్షిత, చట్టబద్ధ వలసలను ప్రోత్సహించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో చేస్తున్న సంప్రదింపులలో భాగంగా డాక్టర్ ఔసఫ్ సయీద్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని బీఆర్కేఆర్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో కా ర్మి క శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాణి కుముదిని, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
టాటూలు.. మెహందీలు వద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో కొలువు కోసం కలలుకంటున్న యువత కీలక ‘పరీక్ష’కు సమయం ఆసన్నమైంది. శనివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఎస్సై తుదిరాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సివిల్ ఎస్సై, కమ్యూనికేషన్ ఎస్సై, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ తుది రాతపరీక్షకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రాథమిక రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షల సమయంలో నమోదైన వేలిముద్రలతో సరిపోలితేనే పరీక్షకు అనుమతిస్తారు. ఒకరికి బదులు వేరొక అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకత కోసం ఈ విధానాన్ని పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గత రెండు రిక్రూట్మెంట్ల నుంచి అమల్లోకి తెచ్చారు. అభ్యర్థులు చేతులకు మెహందీ(గోరింటాకు), టాటూలు వేసుకోవద్దని, వాటి కారణంగా బయోమెట్రిక్ హాజరులో ఇబ్బంది తలెత్తితే పరీక్షకు అనుమతించబోరని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి విధిగా హాల్‌టికెట్ ఏ 4 సైజులో ప్రింటవుట్ తీసుకోవడంతోపాటు దానిలో సూచించిన ప్రాంతంలో పాస్‌పోర్ట్ సైజు ఫొటో(ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసింది) అతికించి తేవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో అతికించకుండా వచ్చే అభ్యర్థులను పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా నో ఎంట్రీ... సివిల్ ఎస్సై పోస్టుకు 1,01,052 మంది, కమ్యూనికేషన్ ఎస్సై పోస్టుకు 11,151 మంది, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సైకి 2,762 మంది, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుకు 4,820 మంది పార్ట్–2 దరఖాస్తులు(తుది రాతపరీక్ష కోసం దరఖాస్తు) పూర్తి చేశారు. వీరంతా శని, ఆదివారాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ల్లో జరిగే తుది రాతపరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పూర్తి సాంకేతికత.. పక్కాగా ఏర్పాట్లు లక్షకుపైగా యువత నెలలుగా తుది రాతపరీక్షకు సన్నద్ధమయ్యారు. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా పక్కాగా ఎస్సై తుది రాతపరీక్ష నిర్వహణకు పోలీస్ నియామక మండలి పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. పరీక్షకేంద్రాల్లో అవసరమైనచోట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షపత్రాల లీకేజీల నేపథ్యంలో ఎస్సై తుది రాతపరీక్షలో పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షకేంద్రాలున్న హైదరాబాద్, సికింద్రాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలున్నాయి: డీజీపీ ఎస్సై తుది రాత పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, చాలా రూట్లలో శనివారం ఉదయం 8–30 నుంచి 10–30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకునేలా జాగ్రత్తపడాలని సూచించారు. -
హైదరాబాద్‌లో కాల్పులు.. ఒకరి మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలోని షబాబ్ బిల్డింగ్స్ ప్రాంతంలో క్రాంతి అనే వ్యక్తి, అతని అనుచరులు జరిపిన కాల్పుల్లో రాహుల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కాల్పులు జరిపిన వెంటనే క్రాంతి, అతని అనుచరులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే టప్పాచబుత్ర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
వినూత్న నిర్ణయం.. పోలీసులకు శాశ్వత ఫోన్ నంబర్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోలీసుశాఖ మరో వినూత్న నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. డిపార్ట్మెంటులో ప్రతి పోలీసు అధికారికి శాశ్వత సెల్‌ఫోన్ నెంబర్‌ను కేటాయించింది. ఇందుకోసం దాదాపు 55 వేల మంది సిమ్‌కార్డులను కొనుగోలు చేసింది. కరీంనగర్, రామగుండం, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతోపాటు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర వింగ్స్ ప్రధాన కార్యాలయాలకు సిమ్‌కార్డులు చేరుకున్నాయి. ఇప్పటికే సగానికిపైగా పోలీసు అధికారులు సిమ్‌కార్డులను పొందగా మిగిలిన సిబ్బందికి ఈ వారాంతంలోగా అందజేయనున్నారు. పోలీసుల విధి నిర్వహణలో ఎక్కడా కమ్యూనికేషన్లో ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతోనే పోలీసులందరికీ శాశ్వత సెల్‌ఫోన్ నంబర్లు ఇవ్వాలని డీజీపీ అంజనీకుమార్ ఇటీవల నిర్ణయించారు. ఏంటి లాభాలు? కానిస్టేబుల్ మొదలు డీజీపీ స్థాయి అధికారి దాకా అందరికీ ఇస్తున్న శాశ్వత నంబర్లను వారి హెచ్ఆర్ఎంఎస్, బ్యాంకు ఖాతా, పీఎఫ్‌లకు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా ఇకపై వ్యక్తిగత నంబర్‌ను వాటికి అనుంసంధానించే బాధ తప్పుతుంది. విధుల్లో చేరిన తొలిరోజు నుంచి రిటైరయ్యే రోజు వరకు ఫోన్ నంబర్ ఉద్యోగితోనే ఉంటుంది. అదే సమయంలో ఉన్నతాధికారులు ఫలానా అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకొనేందుకు అతని ఎంప్లాయ్ ఐడీ ద్వారా సులువుగా గుర్తించవచ్చు. క్షణాల్లో అతని నంబర్ ఉన్నతాధికారి సెల్‌ఫోన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంటే ఏ అధికారి ఎక్కడ ఉన్నా.. వెంటనే అతనితో ఉన్నతాధికారులు సంప్రదించి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. అదే సమయంలో వారు స్టేషన్ లేదా వింగ్, టీములు మారినప్పుడు సంబంధిత ఫోన్ నంబర్ ఎలాగూ ఉంటుంది. ఉదాహరణకు ఒక ఎస్సైకి డిపార్ట్మెంటు ఇచ్చే శాశ్వత నంబర్‌తోపాటు అతను పనిచేసే స్టేషన్లో ఎస్సైకి ఇచ్చే మరో నంబర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మారిన నెట్వర్క్.. పోలీసులను వేగవంతమైన నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు పోలీసు శాఖ బీఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్‌టెల్‌కు మారింది. అది కూడా అత్యాధునిక 5జీ నెట్‌వర్క్‌తో. ఈ సిమ్ ఎంప్లాయి ఐడీతో వస్తుంది. ప్రతి అధికారికి రోజుకు 2 జీబీ, 100 ఉచిత ఎస్ఎంఎస్లు చేసుకునే సదుపాయం ఉంటుంది. తాము వాడే చాలా యాప్స్ డేటాను అధికంగా తీసుకుంటున్నాయని... 5జీకి మారాక యాప్స్ మరింత సమర్థంగా పనిచేస్తున్నాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసు అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలను పసిగట్టే పోలీసులకు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ఏ అధికారిని ఆదేశించాలన్నా ఈ విధానం వల్ల క్షణాల్లో సంప్రదించడం సాధ్యం కానుందని చెబుతున్నారు. -
పోలీసులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
ఏలూరు టౌన్: పోలీసులకు ఇవ్వాల్సిన అలవెన్సు బకాయిలు మంజూరు చేయటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు జీతాల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకున్నా.. అలవెన్సుల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడంతో పోలీసులకు ఆర్థిక భరోసా లభించింది. బకాయిల చెల్లింపులతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలన గాడిలో పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపులపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. పోలీసులకు ఊరట.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి పశ్చిమలో సుమారు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ, హెచ్‌సీ, కానిస్టేబుల్ వరకూ అలవెన్సుల బకాయిలు మంజూరవుతున్నాయి. సుమారు 11 నెలలుగా పేరుకుపోయిన ట్రావెలింగ్ అలవెన్సు బకాయిలు ఒకేసారి విడుదల చేయటంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏ, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ రుణాలు సైతం మంజూరు చేయటంతో పోలీసులు సంతోషంగా ఉన్నారు. ఇక సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్ బకాయిలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, అవికూడ త్వరలోనే మంజూరు చేస్తారని అంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. రెండు జిల్లాల్లోనూ సుమారు ఆయా బకాయిల చెల్లింపులు రూ.8 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఒక్క టీఏ అలవెన్సు బకాయిలు మాత్రమే సుమారుగా రూ. 3.82 కోట్ల నుంచి రూ.4.12 కోట్ల వరకూ ఉందని అధికారులు అంటున్నారు. వీటితోపాటు హెచ్ఆర్ఏ, ఇతర బకాయిలు చూస్తే రెండు జిల్లాలోనూ పోలీసుల శాఖకు రూ.8 కోట్ల వరకూ బకాయిలు చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ రుణాలు సైతం విడుదల కావటంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ శాఖలో సీఐలు– 30 , సబ్ ఇన్స్పెక్టర్లు –120, ఏఎస్ఐ –150, హెడ్ కానిస్టేబుల్స్ – 450 , కానిస్టేబుల్స్ – 1850 మంది ఉన్నారు. మొత్తంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2600 మంది వరకూ పోలీస్ సిబ్బంది ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట పోలీస్ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రా«ధాన్యత ఇస్తున్నాం. సిబ్బంది అనారోగ్యంతో మరణిస్తే సంక్షేమ నిధి నుంచి ఆర్థికంగా ఆదుకుంటున్నాం. తాజాగా ప్రభుత్వం అలవెన్సు బకాయిలు విడుదల చేసింది. టీఏ అలవెన్సులు, హెల్త్, హెచ్ఆర్ఏ ఇలా అన్నీ మంజూరు చేశారు. – రాహుల్‌దేవ్ శర్మ, ఏలూరు ఎస్పీ బకాయిల చెల్లింపులు హర్షణీయం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలీస్ సిబ్బందికి చాలా కాలంగా చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించడం హర్షణీయం. సిబ్బందికి ఏ సమస్య వచ్చినా పోలీస్ అధికారుల సంఘం వారికి అండగా ఉంటుంది. పోలీస్ సిబ్బందికి 11 నెలల టీఏ అలవెన్సులతోపాటు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, హెల్త్ అలవెన్సులు సైతం విడుదల చేశారు. సిబ్బందికి అలవెన్సులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. – ఆర్.నాగేశ్వరరావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఏలూరు -
Telangana: సంవత్సరాంతంలో రాజకీయ ఒడిదుడుకులు
సాక్షి, హైదరాబాద్: ‘ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకర ఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ పరిణామాలు విపరీతమైన రాజకీయ ఒడిదుడుకులకు కారణమవుతాయి. అక్టోబర్ 31కి రాహువు, కేతు గ్రహాలు మారుతున్నందున.. ఈ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుంది’అని శృంగేరీ ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. అధికార పక్షంలోని కొందరినుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో అధికారంలోని పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచించారు. ఈ ఏడాది బుధుడు రాజుగా ఉన్నందున.. ఈ పరిణామాలను ప్రభుత్వం నిలువరించగలదన్నారు. సప్తమాధిపతి అయిన గురువు అష్ట్టమంలో మౌఢ్య స్థితిలో ఉన్నందున ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం బాగా కష్టపడాల్సి వస్తుందని వెల్లడించారు. శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఉదయం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పక్షాన ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగాన్ని పఠించారు. కొన్నేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నా..సామాజిక అశాంతి నెలకొంటుందని వెల్లడించారు. అశాంతి ఏర్పడ్డా, పోలీసు శాఖ సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గురుడు జలాశయ కారకుడు అయినందున రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలుగా మారతాయి. కేంద్ర, రాష్ట్రాలు విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. వర్సిటీల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలకు అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానాలు కీలక తీర్పులు ఇవ్వబోతున్నాయి. వచ్చే మార్చిలో ప్రకృతి ఉపద్రవాలు, మత ఘర్షణలు, సామాజిక అశాంతికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. బుధుడు భాగ్యమందు మంచి స్థితిలో ఉన్నందున రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతుంది. ధన భాగ్యాధిపతి శుక్రుడు కావటంతో ఆర్థిక రంగం కొంత పురోగమిస్తుంది. కీలక పథకాలను కొనసాగించాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారు. విద్య, వైజ్ఞానిక రంగాల్లో పరిశోధనలు సాగుతాయి. ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైన ఎండలు కాసే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్లలో భారీ వర్షాలు కురుస్తాయి. మంచి పంటలు పండుతాయి. గురు, శుక్ర మౌఢ్యాలు 40 రోజులు మాత్రమే ఉన్నందున రాష్ట్రంలో శుభకార్యాలు విపరీతంగా జరుగుతాయి. పాల ఉత్పత్తి బాగా పెరగనున్నా.. పాలల్లో, ఆహారపదార్థాల్లో కల్తీ సమస్య కూడా పెరుగుతుంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో తుపానులు ఏర్పడతాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు గంగా పుష్కరాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోవాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన కర్కాటక రాశికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నా యని సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. ఆదా యం 11 వ్యయం 8 రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుందని, రాహువులో రవి దశ ముగిసి చంద్ర దశ నడుస్తోందని, జనవరి 17న అష్టమ శని దోశం ఏర్పడినందున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోగలిగితే అవాంతరాలను అధిగమించే వీలుంటుందన్నారు. కాగా, మంచి వానలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగం సూచించటం పట్ల ఆనందంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పండితులను సన్మానించారు. -
షాకింగ్! టీఎస్పీఎస్సీకి హ్యాకింగ్ బెడద.. పరీక్షలు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: టౌన్‌ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈవారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన అర్హత పరీక్షలు ఆకస్మికంగా వాయిదాపడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్ష తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ క్రమంలో కమిషన్ అధికారుల కంటే ముందుగా ఈ వివరాలను ఎవరో పరిశీలించినట్లు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్తగా పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు ఆదివారంనాటి పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పోలీసు కేసు నమోదు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహణలో హ్యాకింగ్ జరిగినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు అనుమానిస్తున్నారు. కమిషన్‌కు సంబంధించిన అత్యంత గోప్యతతో కూడిన ఫైళ్లు కంప్యూటర్లో తెరిచి ఉన్నట్లు అనుమానించిన అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా పరీక్షను వాయిదా వేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసు అధికారులు, సైబర్ సెక్యూరిటీస్ విభాగం అధికారులతో కలిసి విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహించిన తర్వాత సమస్య వెలుగు చూసే కంటే ముందస్తుగా దానిని వాయిదా వేయడం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ అధికారులు చెబుతున్నారు. అంతర్గత విచారణ షురూ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన సమాచారం లీకైందనే అనుమానాలపై కమిషన్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు సైతం ఈ అంశాన్ని సవాలుగా తీసుకున్నట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాల్లో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిన టీఎస్పీఎస్సీలో ఇలాంటి అపశ్రుతులు రావడంతో పరపతి దెబ్బతింటుందనే భావనతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పంతోనే పరీక్షల వాయిదా వేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
నకిలీ హోంగార్డుల కేసు ఏసీబీకి..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో వెలుగుచూసిన నకిలీ హోంగార్డుల నియామకం కుంభకోణం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి బదిలీ అయింది. కేసును పోలీసుశాఖ నుంచి ఏసీబీకి బదిలీచేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు కేవలం ఏడుగురు నిందితులుగా ఉన్న ఈ కేసులో ఇప్పుడు మరో 86 మందిని చేర్చారు. మొత్తం నిందితులు 93 మందిలో.. నకిలీ హోంగార్డులు 90 మంది, విధుల నుంచి తొలగించిన హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. అక్రమాలకు పాల్పడినవారిలో వణుకు ఈ కేసు దర్యాప్తును ఏసీబీ చేపట్టడంతో అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు, పోలీసుల్లో వణుకు మొదలైంది. నకిలీ హోంగార్డుల నుంచి టీడీపీ నేతలు వసూలు చేసిన రూ.5 కోట్లలో చిత్తూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత సింహభాగాన్ని చినబాబుకు ముట్టచెప్పినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో డీఎస్పీలు, జిల్లా పోలీసుశాఖకార్యాలయంలో పనిచేసే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, నాటి ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో సాక్ష్యాలు సేకరించి నిందితులకు ఉచ్చు బిగించడంపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు. దొడ్డిదారిన నియమించిన అధికారులు 2014 నుంచి 2019 వరకు విడతలవారీగా చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో 90 మంది హోంగార్డులను చేర్చారు. పోలీసుశాఖ నుంచి నోటిఫికేషన్ లేకుండా, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా కొందరు పోలీసు అధికారులు, తెలుగుదేశం నేతలు కలిసి వీరిని చేర్పించేశారు. ఈ దొడ్డిదారి నియామకాల్లో నాటి టీడీపీ ప్రభుత్వ మంత్రి నుంచి జిల్లాకు చెందిన టీడీపీ తమ్ముళ్లు ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. టీడీపీ నేతలు చెప్పిందే చాలు అన్నట్టు.. పోలీసుశాఖలోని పెద్ద హోదాల్లో పనిచేసిన అధికారులు ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ హోంగార్డులను ఆన్–పేమెంట్ కింద టీటీడీ, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ, విద్యుత్‌శాఖ, రవాణాశాఖ, లా అండ్ ఆర్డర్ విభాగాల్లో చొప్పించేశారు. దొడ్డిదారిన, తప్పుడు డ్యూటీ ఆర్డర్ (డీవో)లతో పోస్టులు పొందిన నకిలీ హోంగార్డులకు ప్రభుత్వం రూ.12 కోట్లకుపైగా వేతనాలు కూడా చెల్లించింది. ఈ బాగోతాన్ని గుర్తించిన చిత్తూరు జిల్లా పోలీసుశాఖ గతేడాది జూలై 16వ తేదీన ఏఆర్ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డిసెంబర్ 11న ఏడుగురిని (నకిలీ హోంగార్డులు నలుగురు, విధుల నుంచి తొలగించిన హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్‌ను) అరెస్టు చేశారు. రూ.కోట్లు చేతులు మారడం, పోలీసుశాఖలోని ఉద్యోగుల ప్రమేయం ఉండటంతో డీజీపీ ఈ కేసును ఏసీబీకి బదిలీ చేశారు. -
పక్కాగా ‘పోలీస్’ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ కొలువుల భర్తీలో కీలకమైన తుది రాత పరీక్షల నిర్వహణకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. అవకతవకలకు తావులేకుండా పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగిస్తోంది. పోలీస్ శాఖతోపాటు ఎక్సైజ్, రవాణా శాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. అన్ని పోస్టులకు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు. మార్చి 11న తుది రాత పరీక్షలు మొదలుకానున్నాయి. ఆ రోజు ఐటీ, కమ్యూనికేషన్స్ ఎస్ఐ, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ పోస్టులకు పరీక్ష జరగనుండగా, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మార్చి 26న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై తుది రాత పరీక్ష, ఏప్రిల్ 2న కానిస్టేబుల్ మెకానిక్, డ్రైవర్ పోస్టులకు, ఏప్రిల్ 8, 9 తేదీల్లో సివిల్ ఎస్సై పోస్టులకు, ఏప్రిల్ 30న సివిల్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ.. అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాత పరీక్షలకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ ఏఎస్సై, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, కానిస్టేబుల్, మెకానిక్‌వంటి పోస్టుల అభ్యర్థులకు హైదరాబాద్‌లోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్ ఎస్సైలకు హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో అభ్యర్థులు పాల్గొనే కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు హైదరాబాద్‌తోపాటు పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. -
సత్ఫలితాలిస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్
సాక్షి, అమరావతి: దిశ స్పూర్తితో మహిళలపై జరిగిన నేరాల్లో బాధ్యులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా రాష్ట్ర పోలీస్ శాఖ అవలంభిస్తున్న కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానం సత్ఫలితాలిస్తోంది. ఈ విధానాన్ని గత ఏడాది జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోక్సో, మహిళలు హత్య, అత్యాచారం, ఇతర వేధింపులకు గురైన కేసులను జిల్లాకు ఐదు చొప్పున ఎంపికచేసి ఏడురోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి, దాదాపు 108 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో 48 కేసుల్లో కోర్టు విచారణ పూర్తయి నేరస్తులకు జీవితఖైదుతో పాటు, ఏడు నుంచి 25 సంవత్సరాల వరకు జైలుశిక్ష పడింది. 13 కేసుల్లో విచారణ పూర్తయి తీర్పులు రిజర్వ్ అయ్యాయి. 47 కేసుల్లో విచారణ ముగింపుదశలో ఉంది. మరోవైపు గత ఏడాది నమోదైన 101 పోక్సో కేసుల్లో నేరస్తులకు కోర్టుల్లో కఠిన శిక్షలు పడ్డాయి. దిశ స్ఫూర్తితో పోలీస్ శాఖ చేసిన కృషితో ఈ ఏడాది రాయచోటి, కోనసీమల్లో మహిళలు అత్యాచారం, హత్యకు గురైన కేసులు, ఏలూరు జిల్లాలో తల్లీకూతుళ్ల అమానూష హత్య, బాపట్లలో ప్రేమ పేరుతో వేధింపులకు గురై యువతి హత్యాయత్నం సహా పలు కేసుల్లో ఏడురోజుల్లోనే పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా.. ఈ విధానంలో ఎస్పీలు తమ పరిధిలో నమోదైన మహిళలు, యువతులు, చిన్నారులపై జరిగిన ఐదు తీవ్రమైన నేరాల కేసులను ప్రాధాన్యమైనవిగా ఎంపిక చేస్తారు. ఈ కేసులను.. ప్రతిరోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్షిస్తారు. తద్వారా కేసు ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్షపడటమేగాక ఒక్క నేరస్తుడు కూడా తప్పించుకోకుండా అవకాశం ఉంటుంది. ఈ కేసులపై ఐపీఎస్ అధికారి ప్రత్యేకశ్రద్ధ తీసుకోవడంతో నేరస్తులు సాక్షులను బెదిరించే ఘటనలకు ఆస్కారం ఉండదు. డీజీపీ సైతం తన రోజువారీ ఎస్పీల టెలీకాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా ఈ కేసులపై చర్చిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. సమష్టి కృషితోనే సాధ్యం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం సత్ఫలితాలిస్తోంది. నేరస్తులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నుంచి అన్ని స్థాయిల్లోని అధికారుల సమష్టికృషితోనే ఇది సాధ్యం అవుతోంది. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు అనుగుణంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. – కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ -
ప్లాస్టిక్ కవర్లో పసివాడి ప్రాణం
గుంటూరు ఈస్ట్: నవమాసాలు మోసిన తల్లి... ‘కని’కరం లేకుండా 48గంటల్లోనే తన బిడ్డను వదిలేసింది. పేగు తెంచి పంచిన పసి ప్రాణాన్ని తన పొత్తిళ్లలో అదుముకుని అల్లారుముద్దుగా చూసుకోకుండా... చెత్తను విసిరేసినంత సులభంగా ప్లాస్టిక్ కవర్లో పెట్టి పాడుబడిన ఇంట్లో పడేసింది. తల్లి స్పర్శ కోసం గుక్కపెట్టిన ఆ శిశువు ఏడుపు విని పక్క ఇంట్లో ఉంటున్న మరో మాతృమూర్తి వచ్చి ఆ బిడ్డను కాపాడారు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరులో ఆదివారం జరిగింది. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని గుంటూరువారితోట 5వ లైనులో ఓ పాడుబడిన భవనం పై నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ శిశువు ఏడుపు వినిపించడంతో పక్క ఇంట్లో ఉన్న మహిళ చూసేందుకు వెళ్లారు. అక్కడ పాలిథిన్ క్యారీ బ్యాగులో మగ శిశువు కనిపించాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తపేట పోలీసులు ఘటనస్థలానికి వెళ్లి ఆ శిశువుని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పిల్లల విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువు పుట్టి రెండు రోజులు అయి ఉంటుందని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆ శిశువు ఉన్న పాడుబడిన భవనం చుట్టూ హాస్పిటల్స్ ఉండటంతో సమీపంలోనే డెలివరీ అయి ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. -
పోలీస్ డ్యూటీ మీట్లో సత్తా చాటిన ఏపీ పోలీసులు
సాక్షి, అమరావతి: అఖిల భారత డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు పోలీస్ డ్యూటీ మీట్ జరిపారు. పోలీస్ వృత్తి నైపుణ్యాలకు సంబంధించి మొత్తం 11 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 24 రాష్ట్రాల పోలీస్ విభాగాలు, కేంద్ర పోలీస్ బలగాలకు చెందిన మొత్తం రెండు వేల మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పోలీస్ అధికారులు రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఓ కాంస్య పతకంతో మొత్తం ఆరు పతకాలు గెలుచుకుని దేశంలో మూడో స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర పోలీస్ అధికారులను డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం అభినందించారు. పోలీస్ శాఖ నుంచి స్వర్ణ పతక విజేతలకు రూ.3లక్షలు, రజత పతక విజేతలకు రూ.2లక్షలు, కాంస్య పతక విజేతకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతులు అందించారు. -
AP: ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు డీజీపీ అభినందన
అమరావతి: దేశంలోనే వృత్తి నైపుణ్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏపీ పోలీస్ అధికారులను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అభినందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఐదు రోజుల పాటు జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్-2022లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వృతి నైపుణ్యంలో ఆరు పతకాల( 2 బంగారు పతకాలు, 3 రజత పతకాలు, 1 కాంస్యం పతకం)తో దేశంలో అత్యధిక మెడల్స్ గెలుచుకున్న మూడో రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు అత్యధిక స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణం, కాంస్యం, రజిత పతకాలు సాధించిన ఎపి పోలీస్ అధికారుల బృంధాన్ని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. కాగా, ఫిబ్రవరి 13వ తేదీ నుండి 17 తేదీ వరకూ భోపాల్‌లో జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటి మీట్-2022 లో వృతి నైపుణ్యమునకు సంబందించిన 11 విభాగాల్లో దేశంలోని 24 రాష్ట్రాలతో పాటు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్‌కు చెందిన మొత్తం 28 టీమ్‌లతో సుమారు 2000 మందికి పైగా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా పతకాలు సాదించిన ఏపీ పోలీస్ అధికారులకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నగదు బహుమతిని అందించారు. స్వర్ణం పతక విజేతలకు 10 వేలు రూపాయలు, రజత పతక విజేతలకు 8 వేల రూపాయలు, కాంస్యం పతక విజేతలకు ఐదు వేల రూపాయల నగదు బహుమతితో అభినందించి ప్రోత్సాహం అందించారు. అంతే కాకుండా పోలీస్ శాఖలో వృతి నైపుణ్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకి , పతకాలు సాదించిన విజేతలకి పోలీస్ శాఖ నుండి ప్రత్యేకంగా స్వర్ణ పతాకం సాదించిన విజేతకు మూడు లక్షల నగదు(మూడు ఇంక్రిమెంట్లు) కాంస్యం పతక విజేతలకు రెండు లక్షల నగదు(రెండు ఇంక్రిమెంట్లు), రజత పతక విజేతలకు లక్ష నగదు (ఒక ఇంక్రిమెంట్)బహుమతితో అభినందించి ప్రోత్సాహం అందించారు. -
మీరు ఎప్పుడూ సంఘ విద్రోహ శక్తుల మధ్యనే ఉంటున్నారు.. జాగ్రత్త!!
మీరు ఎప్పుడూ సంఘ విద్రోహ శక్తుల మధ్యనే ఉంటున్నారు.. జాగ్రత్త!! -
ఎస్ఐ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షకు 1.51లక్షల మంది హాజరు
సాక్షి, అమరావతి: ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 411 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 నగరాలు, పట్టణాల్లోని 292 కేంద్రాల్లో ప్రిలిమినరీ రాత పరీక్షకు 1,51,243 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ‘ప్రాథమిక కీ’ని సోమవారం ఉదయం 11గంటలకు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని రాష్ట్ర పోలీసు నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు ఆ ప్రాథమిక ‘కీ’ని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రాథమిక కీ’పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ ఉదయం 11గంటలలోపు తమకు మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. వెబ్సైట్లో పొందుపరిచిన నిర్ణీత ఫార్మాట్లోనే అభ్యంతరాలను తమకు మెయిల్ చేయాలని కూడా పేర్కొంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రెండు వారాల్లో వెల్లడిస్తామని, అభ్యర్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పోలీసు నియామక మండలి వెల్లడించింది. ► ప్రాథమిక కీ డౌన్లోడ్ చేసుకోడానికి వెబ్సైట్: slprb.ap.gov.in ► ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్లో పంపాల్సిన మెయిల్ ఐడీ: CTSI& PWT @slprb.appolice.gov.in