ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి స్వల్ప ఊరట | Slight Relief Ips Officer Abhishek Mohanty Relief In Cadre Allocation | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి స్వల్ప ఊరట

Published Thu, Mar 20 2025 7:56 PM | Last Updated on Thu, Mar 20 2025 8:19 PM

Slight Relief Ips Officer Abhishek Mohanty Relief In Cadre Allocation

సాక్షి,హైదరాబాద్‌:  ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి  స్వల్ప ఊరట లభించింది. ఏపీకి వెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ  హైకోర్టు సోమవారం వరకు నిలిపివేసింది. ఇదే అంశంపై కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.  తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.

విభజన సందర్భంగా కేటాయించిన రాష్ట్రం ఏపీలో చేరాలని మహంతికి కేంద్రం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతి  క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్‌ కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు  నిరాకరించింది. దీంతో క్యాట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  

ఆ పిటిషన్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ తిరుమలాదేవీ ధర్మాసనం విచారణ చేపట్టింది. గురువారం ఏపీలో చేర్చాల్చి ఉండటంతో.. సోమవారం వరకు కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement