
43 శైవక్షేత్రాలకు నడపనున్న టీఎస్‌ఆర్టిసీ
శ్రీశైలానికి అత్యధికంగా 800 సర్విసులు
స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్ర ముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు లు నడపనుంది. 43 శైవ క్షేత్రాలకు 3,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 24వ తేదీ నుంచి 28 వరకు ఈ ప్రత్యే క బస్సులు అందుబాటులో ఉంటా యి. ప్రధానంగా శ్రీశైల క్షేత్రానికి 800, వేములవాడకు 714, ఏడుపా యల జాతరకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సుల చొప్పున నడుపనున్నారు.
అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటా యి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి. ఈ స్పె షల్ బస్సుల్లో 50% అదనపు చార్జీలను వసూలు చేస్తారు. రెగ్యులర్ సర్విస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. శివరాత్రి ఆపరేషన్స్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.
మహిళలకు ఉచితమే..: గత ఏడాది శివరాత్రికన్నా ఈసారి 809 బస్సులను అదనంగా నడపనున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని చెప్పారు. ముందస్తు టికెట్ల బుకింగ్‌ను www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–6944 0000, 040–23450033ను సంప్రదించాలని అధికారులు సూచించారు.