Fashion: ఫ్యాషన్‌ ఇలాకా.. ట్రిపుల్‌ ధమాకా.. | Three All India Top Class Fashion Designers Show In Hyderabad | Sakshi
Sakshi News home page

Fashion: ఫ్యాషన్‌ ఇలాకా.. ట్రిపుల్‌ ధమాకా..

Published Wed, Sep 4 2024 1:29 PM | Last Updated on Wed, Sep 4 2024 1:29 PM

Three All India Top Class Fashion Designers Show In Hyderabad

ఒకేరోజున 3 స్టోర్స్‌ ప్రారంభోత్సవం

సాక్షి, సిటీబ్యూరో: ఒకేరోజున ముగ్గురు ఆల్‌ ఇండియా టాప్‌ క్లాస్‌ ఫ్యాషన్‌ డిజైనర్లు తమ డిజైన్లతో నగరాన్ని పలకరించారు. తమదైన శైలికి చెందిన అంతర్జాతీయ దుస్తుల శ్రేణిని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే అగ్రగామి డిజైనర్లుగా పేరొందిన ఢిల్లీకి చెందిన అబ్రహమ్, ఠాకూర్‌ ద్వయంతో పాటు రాహుల్‌ మిశ్రాలు హాజరయ్యారు.

అదే విధంగా ప్రముఖ డిజైనర్‌ దుస్తుల బ్రాండ్‌ సత్యపాల్‌.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం1లో ఉన్న సత్వా సిగ్నేచర్‌ టవర్‌లో వరుసగా తమ స్టోర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఒకేరోజున వాటిని ప్రారంభించారు. సిటీ ఫ్యాషన్‌ సర్కిల్‌లో సందడి నింపిన ఈ అత్యాధునిక దుస్తుల స్టోర్ల ప్రారం¿ోత్సవం, లాంచింగ్‌ పారీ్టలకు సినీనటులు తమన్నా, నిహారికా, శోభితా దూళిపాళ్ల, సిరత్‌ కపూర్‌తో పాటు నగరంలోని పలువురు సెలబ్రిటీలు హాజరై డిజైనర్లకు అభినంధనలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులతో డిజైనర్లు తమ కలెక్షన్స్‌ గురించిన విశేషాలను పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement