స్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్కు సంబంధించి ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమైంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశంపై 'సాక్షి' దినపత్రిలో... సోమవారం నుంచి సినిమా చూపిస్తాం అన్న శీర్షికపై కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించారు. డి బ్లాక్ వసతి గృహం వద్ద ఎంసీఏ జూనియర్లను...సీనియర్లు వేధించి...చొక్కాలు విప్పి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయటంతో జూనియర్లు భయాందోళనకు గురయ్యారు.