ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు సోమవారం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.