ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యముంటే కోర్టు ఆధ్వర్యంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం ముసుగులో రూ.వేలకోట్ల అవినీతికి చంద్రబాబు తెర లేపారన్నారు.