ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూస్తే గర్వంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైఎస్ జగన్ ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ‘సాక్షి’ టీవీ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.