నీరెక్కడైనా నిప్పులు కక్కుతుందా? కక్కదుగా.. ఓసారి కాలిఫోర్నియా వెళ్లి చూడండి.. అక్కడ నీళ్లు ఇదిగో ఇలా నిప్పులు కక్కుతుంది. యెసెమెటీ నేషనల్ పార్క్‌లోని హార్స్ టెయిల్ జలపాతం ఫిబ్రవరి నెలలో మాత్రం అగ్నిపర్వతం నుంచి జాలువారే లావాను తలపిస్తుంది. దీన్ని వీక్షించేందుకు పర్యాటకులు వెల్లువలా తరలివస్తారు.