తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ వీడనుంది. మంత్రివర్గ కూర్పుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈనెల 10న కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పదిమందితో క్యాబినెట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తుండగా.. దీనిపై పలు ఆసక్తికరమైన విషాయాలు బయటకు వస్తున్నాయి.