K Chandrashekar Rao
-
అధికారంలోకి వస్తే 15 ఏళ్లు మనమే!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే మరో 15 ఏళ్లు కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరిగే అవకాశముందని, మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ తరఫున ఎవరికి బీ ఫామ్ దక్కినా గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ మంగళవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు ‘తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. పార్టీ నేతలకు సమన్వయంతో పాటు ఓపిక అవసరం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు సోషల్ మీడియా విభాగాన్ని కూడా పటిష్టంగా తయారు చేస్తాం. పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్ధవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రజా జీవితంలో అడుగు పెట్టిన తర్వాత అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే వారే నిజమైన రాజకీయ నాయకులు..’అని స్పష్టం చేశారు. పిచ్చి పనులు కాంగ్రెస్‌కు అలవాటే ‘ప్రజలతో ఛీత్కారాలు పొందే లక్షణం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి పనులు చేయడం కూడా వారికి అలవాటే. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత 1989లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే రీతిన వ్యవహరించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు సవ్యంగా పనిచేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు, తాగునీరు, శాంతిభద్రతల సమస్యలు రావడం బాధ కలిగిస్తోంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెప్తున్నవారు తెచ్చిన తెలంగాణను కూడా చెరిపివేస్తారా? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాలను పేర్లు మార్చకుండా నేను కొనసాగించా. వ్యవసాయ స్థిరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధుకు ఎగనామం పెట్టే ప్రయత్నం జరుగుతోంది. సాగు లెక్కలు, ఇతరత్రా కారణాలు పరిగణనలోకి తీసుకుంటే రైతుబంధు అమల్లో అవినీతి మొదలవుతుంది..’అని మాజీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో జెడ్పీ చైర్మన్ల కీలక పాత్ర జెడ్పీ ఛైర్మన్లు రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించారని కేసీఆర్ ప్రశంసించారు. పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జెడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో సహా ఈ భేటీకి హాజరు కాగా, కేసీఆర్ వారిని పేరు పేరునా పలుకరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్లకు జ్ఞాపికలతో పాటు యాదాద్రి ప్రసాదాన్ని కేటీఆర్ అందజేశారు. ఈ భేటీలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్ (ఆదిలాబాద్), కోరిపెల్లి విజయలక్ష్మి (నిర్మల్), దాదన్నగారి విఠల్ రావు (నిజామాబాద్), దఫేదార్ శోభ (కామారెడ్డి), దావా వసంత సురేష్ (జగిత్యాల), పుట్టా మధుకర్ (పెద్దపల్లి), కనుమళ్ల విజయ (కరీంనగర్), న్యాలకొండ అరుణ (రాజన్న సిరిసిల్ల), పటోళ్ల మంజుశ్రీ (సంగారెడ్డి), ర్యాకల హేమలత (మెదక్), వేలేటి రోజారాణి (సిద్దిపేట), శాంతకుమారి (నాగర్ కర్నూల్), బండా నరేందర్ రెడ్డి (నల్లగొండ), గుజ్జ దీపిక (సూర్యాపేట), ఎలిమినేటి సందీప్ రెడ్డి (యాదాద్రి భువనగిరి), ఆంగోత్ బిందు (మహబూబాబాద్), గండ్ర జ్యోతి (వరంగల్ రూరల్), మారపల్లి సు«దీర్ కుమార్ (వరంగల్ అర్బన్), జక్కు శ్రీహర్షిణి (జయశంకర్ భూపాలపల్లి ), బడే నాగజ్యోతి (ములుగు), లింగాల కమల్ రాజ్ (ఖమ్మం) హాజరయ్యారు. -
కేసీఆర్ పరిపాలన తెలంగాణకు వరం: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా హర్షం
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు చేపట్టిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందని తెలిపింది. మెల్బోర్న్లో విశ్వామిత్ర మంత్రి ప్రగడ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రగతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం దిశగా రైతు రుణమాఫీతో పాటు హైదరాబాద్ లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, రైతు పక్షపాతిగా నిలిచిందని, రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని సభ్యులు కొనియాడారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, ఉప్పు సాయిరాం, విశ్వామిత్ర,వినయ్ గౌడ్, సురేష్, ఉదయ్, జమాల్ , సాయి యాదవ్, వేణు , సతీష్ , రాకేష్, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త పాలనకు నాంది.. నేడే సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నుంచి పరిపాలన వ్యవహారాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఉదయం సుదర్శన యాగంతో.. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సుదర్శన యాగంతో శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాలను సిద్ధం చేశారు. శృంగేరి పీఠానికి చెందిన వైదికుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6 గంటలకు యాగం ప్రారంభం కానుంది. మద్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, శోభ దంపతులు పాల్గొంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. కాసేపు సచివాలయంలో కలియదిరిగి.. 6వ అంతస్తులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. తన సీట్లో ఆసీనుడై పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 1.58 – 2.04 గంటల మధ్య మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులు, అదనపు/సంయుక్త/ఉప కార్యదర్శులు, సెక్షన్ అధికారులు, అదనపు సెక్షన్ అధికారులు తమకు కేటాయించిన చాంబర్లు/ సెక్షన్లలో ఆసీనులై ఏవైనా ఫైల్స్‌పై తొలి సంతకాలు చేస్తారు. 2,500 మంది అతిథులకు ఆహ్వానం మధ్యాహ్నం 2.15–2.45 గంటల మధ్య సచివాలయం ప్రాంగణంలో మంత్రులు, సచివాలయ అధికారులు, ఇతర అతిథులతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ప్రారం¿ోత్సవ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, మేయర్లతో సహా మొత్తం 2,500 మంది అతిథులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. మూడేళ్ల 10 నెలల తర్వాత.. పాత సచివాలయ భవనాలను కూల్చి నూతన సచివాలయం కట్టేందుకు 2019 జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. సుమారు మూడేళ్ల 10 నెలల తర్వాత ప్రారం¿ోత్సవం జరుగుతోంది. వాస్తవానికి అన్ని అనుమతులు లభించాక 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించి.. ఈ నెలాఖరు నాటికి 26 నెలల్లో పూర్తి చేశామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇన్నాళ్లూ బీఆర్కేఆర్ భవన్లో తాత్కాలికంగా సచివాలయాన్ని నిర్వహించారు. హైమాస్ట్ లైట్ పోల్‌పై కెమెరా.. మొత్తం 300 కెమెరాలు తొలిరోజున పని మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పనులను చిత్రీకరించేందుకు.. సచివాలయం ఎదురుగా తూర్పు దిశలో రోడ్డుపై ఉన్న భారీ హైమాస్ట్ లైట్ స్తంభంపై ప్రత్యేకంగా కెమెరాను ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా జరిగిన పనులను అది చిత్రిస్తూ వచి్చంది. దాని ఆధారంగా ఇటీవలే ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు కూడా. సీఎం ప్రజాదర్బార్‌కు ఏర్పాట్లు కొత్త సచివాలయం 6వ అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఎం చాంబర్ ఏర్పాటు చేశారు. పూర్తిగా పాలరాతితో సీఎం కార్యాలయం, సిబ్బంది విభాగాలను తీర్చిదిద్దారు. సీఎం ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట 250 మంది కూర్చునే సామర్థ్యంతో ఒక హాల్‌ను ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికిపైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాల్‌ను సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60మంది కూర్చునేలా ఒక హాల్, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాల్ నిర్మించారు. ఈ నాలుగు సమావేశ మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలసి భోజనం చేసేందుకు 25 మంది కూర్చోగలిగే అత్యాధునిక డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. సచివాలయం విశేషాలివీ.. సచివాలయంలో మొత్తం 28 ఎకరాల స్థలం ఉండగా.. 2.45 ఎకరాల(7,79,982 చదరపు అడుగుల)లో.. 265 అడుగుల ఎత్తుతో భవనాన్ని నిర్మించారు. మొత్తం 635 గదులు, 30 సమావేశ మందిరాలు, 34 గుమ్మటాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రధాన భవనం ఆరు అంతస్తులు ఉండగా.. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులు కలిపి మొత్తం 11 అంతస్తులతో నిర్మించారు. సెక్రటేరియట్ ముందువైపు 10 ఎకరాల్లో పచి్చక మైదానం ఉండగా.. కోర్ట్ యార్డు (భవనం మధ్య ఖాళీ భాగంలో) రెండెకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. మొత్తంగా రూ.617 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేయగా.. ఇప్పటివరకు రూ.550 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఇంకా కొన్ని పనులు సాగుతున్నాయి. అనుకున్న దానికంటే 20–30 శాతం వ్యయం ఎక్కువ అవుతోందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త సచివాలయం విస్తీర్ణం వివరాలివీ.. మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు భవనం నిర్మించిన ప్రాంతం: 2.45 ఎకరాలు ల్యాండ్ స్కేపింగ్: 7.72 ఎకరాలు సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్: 2.2 ఎకరాలు పార్కింగ్ సామర్థ్యం: 560 కార్లు, 700 బైకులు ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా: 8,58,530 చదరపు అడుగులు లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు: 14 అడుగులు మొత్తం ఎత్తు: 265 అడుగులు నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి ఉక్కు: 8,000 టన్నులు సిమెంటు: 40,,000 టన్నులు ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు) కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు ఇటుకలు: 11 లక్షలు ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు మార్బుల్: లక్ష చదరపు అడుగులు ధోల్పూర్ రెడ్‌స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు కలప: 7,500 క్యూబిక్ అడుగులు పనిచేసిన కారి్మకులు: మూడు షిప్టుల్లో 12,000 మంది యాక్సెస్ కార్డు ఉంటేనే లోపలికి.. నూతన సచివాలయ భవనంలోకి ప్రవేశించాలంటే ప్రత్యేకంగా రూపొందించే యాక్సెస్ కార్డు పాస్ తప్పనిసరి. ఏదైనా పనిమీద వచ్చేవారు ఏ శాఖ కార్యాలయానికి వెళ్లాలో అక్కడివరకు మాత్రమే వెళ్లగలిగేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండేలా భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు షిఫ్టుల్లో 300 మంది చొప్పున సచివాలయంలో పహారా కాస్తారు. వారికి నిర్ధారిత డ్యూటీ పాయింట్లు ఉంటాయి. – గతంలో పాత సచివాలయంలో కూడా పాస్‌ల జారీ విధానం ఉండేది. ఒకసారి లోనికి వెళ్లాక సీఎం ఉండే సీ బ్లాక్‌లోకి తప్ప మిగతా అన్ని భవనాల్లోకి సులువుగా వెళ్లేందుకు అవకాశం ఉండేది. – సచివాలయంలోకి వెళ్లేందుకు నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. ఇందులో ఆగ్నేయం (గతంలో పెట్రోల్ బంకు ఉండే ప్రాంతం) వైపు ఉండే ద్వారం నుంచి సందర్శకులను అనుమతిస్తారు. సందర్శకులు నిర్ధారిత కార్యాలయానికి వెళ్లేందుకు అక్కడ అనుమతి తీసుకుని, యాక్సెస్ పాస్ పొందాలి. లోపల ఉండే చెకింగ్ పాయింట్ల వద్ద ఆ పాస్‌ను చూపుతూ వెళ్లాలి. ఆ పాస్‌లో ఏ కార్యాలయానికి, ఎటువైపు అనుమతి ఉంటుందో అక్కడికి మాత్రమే సిబ్బంది అనుమతిస్తారు. – మీడియాను కూడా – భవిష్యత్తులో ఫేస్ రీడింగ్‌తో కూడిన యాక్సెస్ కార్డులను జారీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మ్యాన్యువల్‌గా తనిఖీ చేసి పంపే యాక్సెస్ కార్డులను జారీ చేయనున్నారు. – సచివాలయం భద్రత కోసం 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మీడియాకూ ఆంక్షలు! ఆగ్నేయ దిక్కున గేటు సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లోకి మాత్రమే అనుమతిస్తారు. ఏదైనా మంత్రిత్వ శాఖ సమావేశ మందిరాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే.. ముందుగా అధికారులు సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇస్తేనే.. మీడియాను లోపలికి పంపుతారని అధికార వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే సంబంధిత అధికారులు మీడియా సెంటర్ వద్దకే వచ్చి సమాచారం ఇచ్చి వెళ్లేలా యోచన కూడా చేస్తున్నారు. -
KCR: పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న వ్యూహచతురుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాజకీయ జీవితంపై భవిష్యత్తులో పరిశోధనాత్మక గ్రంధాలు రావచ్చు. పలువురు దీనిపై థీసిస్‌లు సమర్పించవచ్చు. ఒక సామాన్య నేత అంచెలంచెలుగా ఎదిగి సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక రెకంగా అది అద్భుతం, అమోఘం. ఒక నాడు తాను స్థాపించిన రాజకీయ పార్టీకి సొంత ఆఫీస్ లేదు. ఎవరో ఇచ్చిన భవంతిలోనో ఆఫీస్ నడపవలసి వచ్చేది. కాని ఈ రోజుబ్రహ్మాండమైన నవాబుల నాటి సంస్కృతితో నిర్మించిన భారీ భవనం. చేతిలో అవసరమైన సొమ్ము ఉండేది కాదు.అన్నిటికి కటకటే! మరి ఇప్పుడు ఆయన పార్టీ ఖాతాలోనే 1200 కోట్ల సొమ్ము. ఒకప్పుడు ఆయన శాసనసభలో ఒకే ఒక్కడు. తనకు కేటాయించిన చాంబర్లో మీడియావారితో కబుర్లతో గడిపేవారు. ఈ రోజు ఆయనను కలుసుకోవడమే కష్టం. తనకు ఒకప్పుడు బాగా తెలిసినవారైనా, ఆయనకు ఇష్టం లేకపోతే అప్పాయింట్ మెంటే దొరకదు. అలా తెలంగాణ ఉద్యమ జీవితాన్ని ఆరంభించిన ఆయన ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ పెద్ద,పెద్ద పార్టీలను కూడా తనదారిలోకి తెచ్చుకున్న ఘనాపాటి. తెలంగాణ జనజీవితాలను నిర్దేశించే నేత గానే కాదు. దేశాన్నే ఏలే స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తున్న నేత. ఇదంతా కేసీఆర్ స్వయంకృషే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనతో ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా తాను అనుకున్న మార్గంలో ముందుకు సాగి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీని స్థాపించి తన సత్తాను చాటుతున్న నేత. ఒకప్పుడు ప్రాంతీయవాది అయినా, ఇప్పుడు ఆయనలో జాతీయవాది కనిపిస్తున్నారు. ఇదంతా రెండు దశాబ్దాల వ్యవధిలోనే. ఎన్నో ఉత్ధాన ,పతనాలు చూశారు. అయినా చలించలేదు. ఒక దశలో పార్టీని ఎత్తివేయవలసి వస్తుందా అన్న ఆందోళన కూడా లేకపోలేదు. అయినా చలించలేదు. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకున్న వ్యూహచతురుడు. ఆయనపై ఎన్ని రకాల విమర్శలైనా ఉండవచ్చు.ఎన్ని ఆరోపణలు ఉండవచ్చు. కుటుంబపాలన అని ప్రత్యర్ధులు ద్వజమెత్తవచ్చు. లోపాలు ఎన్ని ఉన్నాయన్నదాని గురించి కాదు. ఒక వ్యక్తి తన మేధస్సుతో రాజకీయాలలో ఎలా అత్యున్నత స్థానానికి చేరవచ్చని రుజువు చేసిన నేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సాధించి అనర్ఘళంగా ప్రసంగించగల అరుదైన నేత కేసీఆర్. 2001 లో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ఆయన అవమానంగా భావించారు. దానిని జీర్ణించుకోలేకపోయారు. ఈయనలోని అసంతృప్తిని చల్లార్చడానికి ఉప సభాపతి పదవి ఇచ్చినా, ఆయన సంతృప్తి పడలేదు. తనకంటూ అప్పటికే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. ఇది సాద్యమేనా అన్న సంశయం నూటికి తొంభైమందికి ఉండేది. అయినా ఆయనలో ఆత్మ విశ్వాసం తగ్గలేదు. సిద్దిపేట సీటుకు రాజీనామా చేసి, టీడీపీకి గుడ్ బై చెప్పి ఉప ఎన్నికలో పోటీచేసినప్పుడు ఆయన సత్తా తెలియడం ఆరంభం అయింది. చంద్రబాబు ఆయనను ఓడించడానికి చేయని ప్రయత్నం లేదు. విశేషం ఏమిటంటే కేసీఆర్‌ను ఆనాడు పరాజితుడిని చేయడానికి కృషి చేసిన పలువురు ఇప్పుడు ఆయన క్యాబినెట్ లో మంత్రులు లేదా ఆయన ఇచ్చిన నామినెటెడ్ పదవులలో ఉన్న నేతలు. ఉదాహరణకు తలసాని శ్రీనివాసయాదవ్, వేణుగోపాలచారి వంటివారిని తీసుకోవచ్చు. వీరే కాదు. ఇంకా చాలామందే ఉన్నారు. అప్పట్లో ఏపీలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా మళ్లీ పీఠం ఎక్కాలన్న ధ్యేయంతో ఉండడం కేసీఆర్‌కు కలిసి వచ్చింది. నిజానికి అప్పుడు టీఆర్ఎస్తో పొత్తు లేకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. కాని ఎవరి భయం వారిది కదా!తెలంగాణ కాంగ్రెస్ నేతలు జి.వెంకటస్వామి, డి.శ్రీనివాస్ తదితరులు ఎలాగైనా కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ ద్వారా గెలవాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో కాంగ్రెస్ చరిత్ర కన్నా టీఆర్ఎస్ భవిష్యత్తేమారిపోయింది. కేసీఆర్ఏకంగా కేంద్రంలో మంత్రి అయ్యారు. వైఎస్ క్యాబినెట్ లో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అయినా తెలంగాణ రాష్ట్ర సాధన పై పట్టు వీడకపోవడం కేసీఆర్ప్రత్యేకత అని చెప్పాలి. తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడమే కాకుండా, తాను సైతం రాజీనామా చేసి ఉప ఎన్నికల ద్వారా సెంటిమెంట్ ను నిలబెట్టడంలో ఆయన సఫలం అయ్యారు. ఆ ఎన్నికలలో కొన్ని సీట్లలో గెలిచినా, ఓడినా ప్రజలో సానుభూతి సంపాదించడంలో ఆయన విజయవంతం అయ్యారు. అదే సమయంలో సమైక్యవాద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అధికార కాంక్షను కేసీఆర్పెట్టుబడిగా వాడుకోగలిగారు. తనతో పొత్తు పెట్టుకోవాలంటే తెలంగాణపై తీర్మానం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దానికి లొంగిపోయిన చంద్రబాబు అదే ప్రకారం తీర్మానం చేసి టీఆర్ఎస్ తో కలిసి మహాకూటమి కట్టారు. నిజానికి చంద్రబాబుకు మనసులో తెలంగాణ రాష్ట్ర అనుకూలత లేదు. అది అయ్యేదికాదని, ఎలాగైనా కేసీఆర్‌ను మాయచేయవచ్చన్నది ఆయన వ్యూహం. నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతా అన్న సామెత మాదిరి అటు కాంగ్రెస్ ను, ఇటు టీడీపీని తన దారిలోకి తెచ్చుకున్న కేసీఆర్సగం విజయం సాధించినట్లయింది.ఈ మధ్యలో భారీ బహిరంగ సభలు, దేశంలో ఉన్న కొంతమంది ప్రముఖ నేతలను రప్పించి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడించేవారు.అవసరమైతే ఆంద్ర ప్రాంతంపై తనదైన శైలిలో తీవ్ర పదజాలంతో మాట్లాడేవారు. తద్వారా తెలంగాణ ప్రజలలో ప్రత్యేక రాష్ట్ర భావనను బాగా నాటకలిగారు. ఈ తరుణంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా సోనియాగాంధీకి స్వయం నిర్ణయ తెలివితేటలు అంతంతమాత్రమే కావడం కేసీఆర్‌కు కలిసివచ్చిన మరో అంశం. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డికి ఏపీ పీఠం అప్పగించి ఉంటే చరిత్ర మరో విధంగా ఉండేదని చాలా మంది నమ్ముతారు. రాష్ట్ర విభజన జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండేదని పలువురు విశ్వసిస్తారు.కాని కాంగ్రెస్ లో వర్గాలు జగన్ పై లేనిపోని పితూరీలు చెప్పి, చివరికి అధిష్టానానికి ఆయనను దూరం చేసి, సొంతంగా పార్టీ పెట్టే పరిస్థితికి తీసుకువెళ్లారు. ప్రజలలో అంత పట్టు లేని రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ నమ్ముకుని మునిగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి అయితే తొలుత తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినా, తర్వాత తిరగబడి పార్టీని గంగలో ముంచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఏపీలో సొంత ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని రాష్ట్రపతి పాలన పెట్టుకునే దశకు వెళ్లడంలోనే ఆ పార్టీ బలహీనత కనిపిస్తుంది. మరో వైపు జగన్ ను తప్పుడు కేసులలో ఇరికించి 16 నెలలపాటు జైలులో ఉంచడం ప్రజలలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. ఇలా కాంగ్రెస్ చేసిన స్వయంకృతాపరాధాలన్నీ కేసీఆర్‌కు వరంగా మారాయి. సోనియా పుట్టిన రోజున తెలంగాణ ప్రకటన చేయడం , ఆ తర్వాత ఆపడం తెలంగాణ ప్రజలలో పెనుమార్పులకు దారి తీసింది. కేసీఆర్తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ తెలుగుదేశం తదితర చిన్నాచితక పార్టీల నేతలను ,ప్రజాసంఘాలను కూడగట్టుకుని తెలంగాణలో ఏకైక పెద్ద నాయకుడుగా ఆవిర్భవించారు. అదే ఆయన పెద్ద విజయం. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న అభిప్రాయానికి ఆయన కట్టుబడి ఉన్నా, కాంగ్రెస్ నాయకత్వం పూర్తి అసమర్దంగా వ్యవహరించడం కేసీఆర్‌కు కలిసి వచ్చింది. అప్పుడు ఆయన రిస్కు తీసుకుని ఒంటరిగా పోటీ చేయడంతో ఆయన రాజకీయ జీవితమే మారిపోయింది. 2014లో ముఖ్యమంత్రి కావడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించగలిగారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఓటు కు నోటు కేసులో బుక్ చేసి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయేలా చేయగలిగారు. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను బలహీనం చేసే కృషిలో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు డజను మందిని టీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. టీడీపీ, సిపిఐ , బిఎస్పి వంటి పార్టీల ఎమ్మెల్యేలు సైతం అదే దారిపట్టారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం కేసీఆర్నెత్తిన పాలు పోసినట్లయింది.ప్రజలలో కాంగ్రెస్,టీడీపీ యాంటి సెంటిమెంట్ ను సృష్టించి మరోసారి అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో రైతు బంధు, 24 గంటలు విద్యుత్ సరఫరా తదితర స్కీములను కూడా ఆయన విజయవంతంగా అమలు చేయడం ఉపకరించింది. 2018లో గెలిచాక మళ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చిపారేశారు. దాంతో ఆ పార్టీ మళ్లీ పుంజుకోవడానికి చాలా కష్టాలు పడవలసి వస్తోంది.సడన్ గా బీజేపీ రూపంలో కొంత ఇబ్బంది వచ్చినా, కాంగ్రెస్ , బీజేపీల నడుమ మరోసారి అధికారం సాధించడానికి ఆయన వ్యూహరచన చేసి 2023 ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఒకప్పుడు ఉప ప్రాంతీయ పార్టీగా రంగంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా (బిఆర్ఎస్ ) మారి జాతీయ పార్టీగా అవతరించడం మరో గొప్ప విశేషం. ఇప్పుడు ఆయన తన నివాసంగా ప్రగతి భవన్ ను కట్టుకున్నారు. సచివాలయానికి ఉన్న భవనాలు కూల్చివేసి అధునాతన సౌధాన్ని నిర్మించారు. ఇలా నాడు పార్టీకి సొంత భవనం లేని స్థితి నుంచి అటు పార్టీపరంగా, ఇటు ప్రభుత్వపరంగా తన ఆధిపత్యాన్ని చాటుతూ దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదగాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. నిజంగానే కేసీఆర్ రాజకీయ ప్రస్తానాన్ని అధ్యయనం చేయడం, పరిశోధన చేయడం ద్వారా ఎన్ని డాక్టరేట్లు అయినా సాధించవచ్చు. కేసీఆర్ ఇప్పుడు ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. అప్పట్లో తన వెనుక ఎవరు ఉన్నారో వెతుక్కోవలసిన పరిస్థితి. మరి ఈనాడు ఆయన చూపు పడితే చాలు అనుకునే నేతలు కోకొల్లలుగా ఉన్న పరిస్థితి. 2023 శాసనసభ ఎన్నికలలో మరోసారి విజయం సాధిస్తే కేసీఆర్ దేశ రాజకీయాలను నిజంగానే ప్రభావితం చేసే స్థాయికి ఎదగవచ్చు. హాట్సాఫ్ టు కేసీఆర్. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ -
కొత్త ఒరవడితో.. సమస్యల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ‘‘మూస ధోరణులు, సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వినూత్నంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. రొటీన్‌గా కాకుండా మరింత గొప్పగా పనిచేయాలి. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పనిచేయగలమని రోజూ ఆలోచించాలి. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా ఆలోచించి చేస్తున్నామనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదగగలం’’ అని అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం సీఎం పురపాలక శాఖ అంశాలు, నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుందని.. అప్పుడే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని చెప్పారు. ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ఉద్యోగుల సమష్టి కృషి కీలకమని స్పష్టం చేశారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిననాడే గుణాత్మక ప్రగతిని ప్రజలకు చేరవేయగలుగుతామన్నారు. నాణ్యమైన సేవలు అందాలి పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా పెరుగుతున్న ప్రజావసరాలను తీర్చడానికి అందరం కలిసి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. ఉమ్మడి పాలనలో శిథిలమైన అన్ని రంగాలను తీర్చిదిద్ది గాడిలో పెట్టగలిగామని, అన్ని రంగాలు వాటంతట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామని చెప్పారు. ‘‘నాడు తెలంగాణలో కనీస వసతులు లేవు. నేడు అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు సమకూరాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతి సాధించింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్నివర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. ఉత్తమ సేవలను అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది సౌకర్యాల పెంపునకు డిమాండ్ పెరుగుతోందంటే ప్రభుత్వంపై ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని కేసీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఒకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానాలు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా ఉంటున్నాయి. ఒకనాటి వలసలు నేడు రివర్స్ అయ్యాయి. 30లక్షల మంది పక్క రాష్ట్రాల నుంచి వలసవచ్చి బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో రాబడులు, ఆర్థిక వనరులు పెరిగాయి. సంస్కరణలతో గడపగడపకూ పాలనను తీసుకుపోతున్నాం. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమానంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల ప్రాథమిక, నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు లేని సమయంలోనే పూర్తి చేయాలి గతంలో వానాకాలం రెండు మూడు నెలలే వర్షాలు పడేవని, ఇప్పుడు వానలు పడే రోజులు పెరిగి నిర్మాణ పనులకు సమయం తగ్గిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అందువల్ల వర్షాలు లేని ఆరేడు నెలల్లోనే పనులు వేగంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలని, నిధులకు కొరత లేదని.. రెండు నెలల్లో తాను స్వయంగా పర్యటించి పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీసుకుని నిజామాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమీక్ష సందర్భంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను సీఎంకు మంత్రి కేటీఆర్ వివరించారు. సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కె.కవిత తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా? -
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై తేల్చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, పార్టీ శ్రేణులంతా ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు. ఎన్నికలకు 10 నెలల సమయమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలి. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడోసారి కూడా మనదే గెలుపు కావాలని ఆకాంక్షించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వాళ్లకు దర్యాప్తు సంస్థలు ఉంటే మనకు కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రసంస్థలో రాష్ట్ర సంస్థలో తేల్చుకుందామని అన్నారు. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. నాకు తెలియకుండా ఏదో చేస్తున్నామనుకుంటే మీ పొరపాటు. మీ ఫోన్లపై నిఘా ఉంటుంది. పార్టీ మారాలని ఎవరైనా ఒత్తిడి తేస్తే నాకు సమాచారం ఇవ్వండి అని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. చదవండి: (ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ) -
నా ఫోన్లూ ట్యాపింగ్.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘‘నా వద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ భాసన్ పేరును, రాజ్‌భవన్‌ను ‘టీఆర్ఎస్ న్యూస్’ అనే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలోకి లాగారు. అందులో రాజ్‌భవన్ పాలుపంచుకుందని ఆరోపణలు చేశారు. నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. తుషార్ కొద్దిరోజుల కింద హైదరాబాద్‌కు వచ్చి నన్ను కలవాలని రెండు మూడు రోజులు కాల్ చేశారు. ఇలా నాకు ఎవరెవరు కాల్ చేస్తున్నారో వాళ్లు (రాష్ట్ర ప్రభుత్వం) కనుక్కున్నారు. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు నెలకొని ఉన్నాయి’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్ పారదర్శకమైన కార్యాలయమని, తాను అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కావాలంటే తన ఫోన్ ఇచ్చేస్తానని, చూసుకోవచ్చని.. అంతా పారదర్శకంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు గవర్నర్ మాటల్లోనే.. ‘‘బిల్లులను ఆమోదించడానికి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఆమోదించే వ్యక్తులకు వాటిని మదింపు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నాకు అవసరమైనంత సమయాన్ని తీసుకుంటాను. నేను బిల్లులపై కూర్చున్నానని, సూపర్ పవర్ అని తప్పుడు ప్రచారాలు చేశారు. ఆరు బిల్లులు పంపించారు. ఒకదాని తర్వాత ఒక బిల్లును పరిశీలిస్తున్నా. నేను నియామకాల ప్రక్రియకు అడ్డంకిగా మారినట్టు తప్పుడు ప్రచారం చేశారు. కేవలం ఒకే నెల అయింది. బిల్లులను మదించడానికి నాకు సమయం వద్దా? బిల్లు పంపించి సింపుల్‌గా ఆమోదించేయాలంటే కుదరదు. వివరాలు కావాలి. వర్సిటీలకు చాన్స్‌లర్‌గా నాకు అన్ని హక్కులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ బోర్డుకు సరైన వ్యక్తి ఉండాలి కదా. నా ఒత్తిడితోనే ప్రభుత్వంలో కదలిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని కోరుతూనే ఉన్నాను. వీసీలందరితో మాట్లాడి వర్సిటీల పరిస్థితులపై ప్రభుత్వానికి పెద్ద రిపోర్టు కూడా పంపాను. ఆ రిపోర్టు ప్రధాన ఎజెండా పోస్టుల భర్తీయే. నేను పదేపదే ఒత్తిడి చేయడంతోనే ఎనిమిదేళ్లు ఖాళీగా ఉన్న 13 వర్సిటీల వీసీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది స్పష్టత మాత్రమే కోరాను వర్సిటీల్లో నియామకాలకు ఇప్పటికే ఒక విధానం ఉండగా కొత్త బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఎలా ఏర్పాటు చేస్తారు, ఏ పద్ధతిని అనుసరిస్తారు?దీనికి చట్టబద్ధత ఉంటుందా? యూజీసీ ఒప్పుకుంటుందా? చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారు? ఏం ప్రొటోకాల్‌ను పాటిస్తారు? ఏటా నియామకాలు చేస్తారా? యూనివర్సిటీ కేంద్రంగా నియామకాలుంటాయా? అన్ని వర్సిటీలను కలిపి కేంద్రీకృతంగా నియామకాలు చేపడతారా? వీటిపై స్పష్టత రావాలి. ఒకవేళ న్యాయపరమైన చిక్కులొస్తే బోధన, బోధనేతర సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందిపడతారు. సత్వర నియామకాల కోసమే బోర్డు అని మీరు అంటున్నారు. బోర్డు ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. పారదర్శకంగా నియామకాలు జరగాలి. పక్షపాతం వల్ల అర్హులైన విద్యావేత్తలు నష్టపోరాదు. అందుకే బిల్లు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాను. ఆరేడు నెలలుగా బిల్లులు ఆపినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక నెల, ఆపై కొన్ని రోజులు మాత్రమే అయింది. రోజూ అనుమానాల నివృత్తి కోసం కొంత సమయం గడుపుతున్నాను. ప్రత్యేక బోర్డులు కలిగిన రాష్ట్రాలను సంప్రదిస్తే.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కిందే అవి పనిచేస్తున్నట్టు తెలిసింది. ప్రజాప్రయోజనాల రీత్యానే స్పష్టత కోరుతూ మంత్రికి లేఖ రాశాను. ఇలాగైతే ప్రగతిభవన్‌కు ప్రజల గొంతు చేరుతుందా? నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నానని, లేఖ అందలేదని మంత్రి (సబితా ఇంద్రారెడ్డి) అనడం ఆశ్చర్యం కలిగించింది. సీఎం నుంచి లేఖ మంత్రికి చేరడానికి, రాజ్‌భవన్ నుంచి గవర్నర్ గొంతు మంత్రికి చేరడానికే ఇంత జాప్యం జరిగితే.. ప్రజల గొంతు ప్రగతిభవన్‌కు ఎలా చేరుతుంది? గవర్నర్ లేఖ రాశారా, లేదా? అని మంత్రి తెలుసుకుని ఉండాల్సింది. వాస్తవం తెలుసుకోకుండా రాజ్‌భవన్‌ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారు. బిల్లుపై స్పష్టత కోసమే మంత్రిని రమ్మన్నాను. అగ్నివీర్ పథకంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళన చేస్తున్న వారిని రాజ్‌భవన్ ఎదుట ఆందోళన చేయాలంటూ (టీఆర్ఎస్) అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పిలుపునివ్వడాన్ని గుర్తుంచుకోవాలి. ముందు ప్రభుత్వ వర్సిటీలను పట్టించుకోండి ప్రభుత్వ వర్సిటీల్లో మెస్‌లు, హాస్టళ్లు దుర్భరంగా ఉన్నాయి. బెడ్లు, టేబుళ్లు. ట్యూ బ్లైట్లు లేవు. పారిశుధ్యం లేదు. కలుషిత ఆహారం నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వర్సిటీలను అభివృద్ధి చేసేందుకు బిల్లు తెస్తారా? వాటి సంఖ్యను పెంచాలనుకుంటారా? ఎందుకు? విద్య వ్యాపారం కాదని సుప్రీంకోర్టు అన్నది. ముందు ప్రభు త్వ వర్సిటీల దుస్థితిని పట్టించుకోండి. ఆ తర్వాత ప్రైవేటు బిల్లు గురించి ఆలోచిద్దాం. గవర్నర్లే వీసీలుగా ఉండాలి వర్సిటీల చాన్స్లర్లుగా గవర్నర్లే ఉండాలి. వారిని తొలగించి సీఎంలను నియమించడంపై విస్తృత చర్చ జరగాలి. సెక్యులరిజంపై వ్యాఖ్యలు చేసినంత మాత్రాన తమిళనాడు గవర్నర్‌ను భర్తరఫ్ చేయాలని అక్కడి ప్రభు త్వం కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదు’ అని తమిళిసై స్పష్టం చేశారు. తెలుగు ప్రజల గురించి అలా అనలేదు తమిళనాడులో తెలుగు ప్రజలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని తాను చెప్పలేదని, తన మాటలను వక్రీకరించారని ఓ ప్రశ్నకు గవర్నర్ తమిళిసై బదులిచ్చారు. తాను కేవలం మాతృభాష గురించి మాట్లాడానని వివరించారు. ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసనలు తెలపాలంటూ పలువురు పిలుపునివ్వడంపై గవర్నర్ స్పందించారు. ప్రధాని పర్యటనతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, దీనిని సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు. అందుకే ఖైదీల క్షమాభిక్షను తిరస్కరించా.. కేంద్ర హోంశాఖ నిబంధనలను పాటించకపోవడంతోనే ఖైదీల క్షమాభిక్ష ప్రతిపాదనలను తిరస్కరించినట్టు గవ ర్నర్ స్పష్టం చేశారు. జీవిత ఖైదీలను వెంటనే విడుదల చేయడం కుదరదని.. క్షణికావేశంలో నేరాలు చేసిన వారికే క్షమాభిక్ష వర్తిస్తుందని పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
ఉక్రెయిన్ విద్యార్థులను ఇక్కడే చదివిద్దాం
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశం నుంచి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా దేశంలోని వైద్య కళాశాలల్లో చదువులు పూర్తి చేయడానికి వారికి అవకాశం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం లేఖ రాశారు. నిబంధనలను సడలించి దేశంలోని వైద్య కళాశాలల్లో సమాన సెమిస్టర్లలో ఉక్రెయిన్ విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని కోరారు. ఒకసారి అవకాశం (వన్ టైమ్ బేసిస్) కింద దామాషా ప్రకారం వైద్య కళాశాలల్లో సీట్లను పెంచాలని సూచించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం కావడంతో ఆ దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో చదువుతున్న 20 వేల భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని, అందులో 700 మందికి పైగా తెలంగాణ విద్యార్థులున్నారని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వారి ఫీజులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఉక్రెయిన్ విద్యార్థుల్లో అధిక శాతం విద్యార్థులు మధ్య తరగతి కుటుంబాల వారేనని సీఎం పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులు తమ జీవిత కాల శ్రమతో దాచిపెట్టుకున్న డబ్బులను ఖర్చు చేసి తమ పిల్లలకు వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు పంపించారని, అయితే యుద్ధం వల్ల విద్యార్థుల చదువులు అర్ధంతరంగా ఆగిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తే ఇక ఉండవు అంతే..) -
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO — Narendra Modi (@narendramodi) February 17, 2022 తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షుని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Warm greetings to Telangana CM Sri KCR garu on his birthday. May God bless him with good health and long life.@TelanganaCMO — YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2022 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/ZNzxoIRZM1 — Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2022 సీఎం కేసీఆర్‌కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.@TelanganaCMO pic.twitter.com/MXUlXKi0Fj — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2022 -
‘మోదీ డ్రామా.. బహిరంగ సభకు జనం రాలేదనే..’
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ పర్యటనలో మోదీ డ్రామాలాడారని.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బహిరంగ సభకు జనం రాలేదని నాటకాలు ఆడారని ఎద్దేవా చేశారు. చదవండి: పర్యాటకుల్లా వచ్చి కేసీఆర్‌పై విమర్శలా? ‘‘పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. 371డి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎల్పీ నుండి లేఖ రాస్తున్నాం. ధ్యానం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కొనుగోలు చేయాల్సిందే. తామర పురుగుతో లక్షల ఎకరాల మిర్చి పంటకు నష్టం ఏర్పడింది. పసుపు, పత్తి పంటలకు కూడా నష్టపరిహారం అందించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దయనీయ పరిస్థితిలో ఉంది. పోలీసులు యంత్రాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ గా మార్చుకుంది. సీఎల్పీ బృందం.. గవర్నర్‌తో పాటు రాష్ట్ర డీజీపీని కలవాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల పెంచితే పోరాటం చేస్తాం. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, వనమాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలంటూ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. -
పుస్తకాలు చదివే కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు
కవాడిగూడ (హైదరాబాద్): పుస్తకాలు చదవడంతోనే ప్రజలకు మంచి పరిపాలన అందించడం సాధ్యమవుతుందని, అందుకుని దర్శనమే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల వేలాది పుస్తకాలు చదివి తెలంగాణను సాధించారని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధనకోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజలను చైతన్య పరిచి రాష్ట్రానికి తన జీవితాన్ని అర్పించారని మంత్రి వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌కు బోనాలతో స్వాగతం పలికారు. చిందు ఎల్లమ్మ వేదికపై జరిగిన సమావేశంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు ఎల్లప్పుడు పూర్తి సహకారం ఉంటుందని హామీనిచ్చారు. గోల్కొండ పత్రికతో కవులు, రచయిత సంఖ్య తెలియజెప్పారు నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతంలో కవులు రచయితలు లేరన్న సందర్భంలో సు రవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక నిర్వహిస్తూ తెలంగాణలో కవులు రచయితల సంఖ్యను చెప్పిన మహోన్నత వ్యక్తి అని మంత్రి గుర్తు చేశారు. నిరంతరం బుక్‌ఫెయిర్ నిర్వహించేందుకు రవీంద్రభారతిలో స్థలం కేటాయిస్తామని బుక్‌ఫెయిర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. గౌ రీశంకర్ మాట్లాడుతూ బుక్‌ఫెయిర్‌ను పుస్త క ప్రేమికులు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సాంస్కృతిశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. సోమవారం జరగనున్న బాపూజీ 106వ జయంతి సందర్భంగా ఆయన చేసిన స్ఫూర్తిదాయక నిస్వార్థ సేవలను సీఎం స్మరించుకున్నారు. సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది బాపూజీ అని కొనియాడారు. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన అన్ని పోరాటాల్లో అదే స్ఫూర్తిని కొనసాగించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధనకు, సహకార రంగాల పటిష్టతకు తన జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా.. దేశవ్యాప్తం గా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందన్నారు. బా పూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. -
హుజురాబాద్‌లో పోటీకి కేసీఆర్ సై అంటే.. బరిలోకి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోటీచేస్తే ఆయనకు పోటీగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో దళితబంధు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్..ఆయన దత్తత గ్రామం వాసాలమర్రిలో సైతం ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కేసీఆర్ కలవగానే హుజూరాబాద్ ఉపఎన్నికలు వాయిదా పడ్డాయని, దీంతో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి పోస్టు కూడా వాయిదా పడిపోయిందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్లు కలసి లోపాయికారీగా పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోదీని కలసి కేసీఆర్ అక్రమాలపై విచారణకు ఆదేశించేలా పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. -
రేపు హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
కరీంనగర్: రేపు(సోమవారం) హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. కాగా శనివారం హుజూరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయినా చేసేది ప్రభుత్వమేనని.. వ్యక్తులు కాదన్నారు. దళితుల కోసం రాజీనామా చేశానని ప్రవీణ్‌కుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దందళిత బంధుకు ప్రవీణ్‌కుమార్ వ్యతిరేకమా? అని గాదరి కిశోర్ ప్రశ్నించారు. కాగా దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్‌ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలి, తెలంగాణలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులు కట్టారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అని ఆయన నిలదీశారు. -
ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. అయినా దక్కని గవర్నర్, రాజ్యసభ పదవులు
సాక్షి, యాదాద్రి: సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. 2020 జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా వేసుకున్న వెత్కుపల్లి.. సంవత్సరంన్నర కాలంలోనే బయటకు వచ్చారు. ఆ పార్టీ విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు పంపించారు. అయితే, నర్సింహులు టీఆర్ఎస్లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న మోత్కుపల్లికి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికారని, ఆ నేపథ్యంలో ఆయన బీజేపీకి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు అంటున్నారు. కేసీఆర్ మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకొని ఎస్సీ సాధికారిత కార్యక్రమంలో భాగస్వామిని చేసే అవకాశాలున్నాయంటున్నారు. మోత్కుపల్లి, కేసీఆర్ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కాలంలో మంచి మిత్రులు కావడం గమనార్హం. రాజకీయ విభేదాలతో ఇంతకాలం దూరంగా ఉన్నారు. అంతేకాదు.. పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. కలిసి పనిచేసే సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మోత్కుపల్లి అనుచరులు చెబుతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు ఇప్పటికే మెజార్టీగా టీఆర్ఎస్లో ఉన్నారు. కొందరు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. మోత్కుపల్లి టీఆర్ఎస్లోకి వస్తున్నారన్న సంకేతాలతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్కని గవర్నర్, రాజ్యసభ పదవులు మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత. టీడీపీ, బీజేపీ పొత్తులో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నర్‌గా అవకాశం కోసం ఎదురు చూశారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో తనకు గవర్నర్ పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే, చంద్రబాబునాయుడు వల్లే తనకు గవర్నర్ పదవి రాలేదని అలాగే.. ఇస్తామన్న రాజ్యసభ పదవి కూడా ఇవ్వకుండా డబ్బున్న వాళ్లకు అమ్ముకున్నాడని మోత్కుపల్లి చంద్రబాబు పై అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనకు ఏ పదవీ దక్కకుండాపోయింది. తాజా బీజేపీలో చేరిన ఆయనకు జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి వస్తుందన్న ప్రచారం జరిగింది. అలాగే గవర్నర్ పదవుల్లో కూడా అవకాశం ఉందన్న నమ్మకం ఆయన అనుచరుల్లో వ్యక్తమైంది. అవేవీ రాకపోవడంతో మోత్కుపల్లి అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ నేతనైన తన సేవలను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదన్న కారణంతో రాజీనామా చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచి ఆయన రికార్డు విజయాలను నమోదు చేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్ స్థాపింన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుం టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985లో టీడీపీ నుం, 1989 ఇండిపెండెంట్‌గా, 1994 టీడీపీ నుం గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ నుంచి ఆలేరులో గెలుపొందిన ఆయన 2004లో టీడీపీ తరపున ఆలేరులోనే ఓటమిపాలయ్యారు. 2008లో జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయ్యారు. ఆ తర్వాత 2009లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2014లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అంతేకాకుండా నర్సింహులు 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి బహిష్కరణ అనంతరం ప్రజావేదిక ఏర్పాటు చేసి ముందస్తు ఎన్నికల్లో బీఎల్ఎఫ్ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమిని చవిచూశారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో గనులు, విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. -
Land Value: తెలంగాణలో పెరిగిన భూమి విలువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/ అపార్ట్మెంట్ల విలువలను ప్రభుత్వం సవరించింది. అలాగే రిజి స్ట్రేషన్ ఫీజు కూడా పెంచింది. సవరించిన ప్రభుత్వ భూముల విలువలు, పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నం.58) జారీ చేశా రు. దీంతో ఎనిమిదేళ్ల (2013 తర్వాత)కు భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు రిజి స్ట్రేషన్ల ఫీజును పెంచినట్టయింది. ఏ మూలనైనా రూ.75 వేలు భూముల విలువల సవరణలో భాగంగా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోనైనా వ్యవసాయ భూమి ఎకరానికి రూ.75 వేలు కనిష్ట విలువగా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ తర్వాత ప్రాంతం, భూమి విలువ లను బట్టి 30–50% పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజం కనీసం రూ.200గా ఖరారు చేసిన ప్రభుత్వం వాటి విలువలను కూడా 50, 40, 30 శాతం శ్లాబుల్లో సవరించింది. ఇక, ఫ్లాట్లు/అపార్ట్మెంట్ల విషయంలో చదరపు అడుగు కనీసం రూ.1,000గా నిర్ధారించింది. వీటి విలువలను ఆయా ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా వర్గీకరించి 20, 30 శాతం శ్లాబుల్లో పెంచుతూ సవరించింది. 1.5 శాతం పెరిగిన స్టాంపు డ్యూటీ ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఇందులో స్టాంపు డ్యూటీ గతంలో 4% ఉండగా దాన్ని 5.5 శాతానికి పెంచింది. ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద 1.5 శాతం, రిజిస్ట్రేషన్ కింద 0.5 శాతం ఫీజును యథాతథంగా కొనసాగించింది. రాష్ట్రంలోని భూములు, ఆస్తుల విలువల సవరణ.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఎలా జరుగుతుందన్న దానిపై ‘సాక్షి’ ఈనెల 18న ‘సాగుభూమి రూ.75 వేలు’ శీర్షికన సవివరంగా కథనాన్ని ప్రచురించడం గమనార్హం. అదనపు ఫీజు చెల్లించాలి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసుకున్న వారు కూడా ఈ నెల 22 నుంచి పెరిగిన విలువలు, రిజిస్ట్రేషన్ల ఫీజు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మాడ్యూల్‌ను ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనంగా చెల్లించాల్సిన ఫీజును రిజిస్ట్రేషన్ జరిగే రోజు చెల్లించవచ్చని తెలిపారు. భూముల విలువల సవరణ, రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు విషయంలో ఎలాంటి సందేహాలున్నా 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా లేదా ‘ఏఎస్సీఎంఆర్ఓఎట్దిరేట్తెలంగాణడాట్జీవోవీడాట్ఇన్’ కు ఈ మెయిల్ పంపడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించారు. నిలిచిన కార్యకలాపాలు సవరించిన మార్కెట్ విలువలు, పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజును అప్లోడ్ చేయడం కోసం అటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇటు ధరణి పోర్టల్‌లో కార్యకలాపాలను మంగళవారం నుంచే నిలిపివేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ధరణి పోర్టల్ బంద్ కాగా, సాయంత్రం 5 గంటల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లను సాంకేతిక బృందాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం కల్లా ఈ వివరాలన్నీ సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు సర్వర్ ద్వారా అప్లోడ్ కానున్నాయి. బుధవారం బక్రీద్ కారణంగా ఎలాగూ ప్రభుత్వ సెలవు ఉన్నందున గురువారం నుంచి కొత్త విలువలు, చార్జీలు అమల్లోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం ప్రభుత్వ సెలవు అయినా సబ్ రిజిస్ట్రార్లు, తహశీల్దార్లు కార్యాలయాలకు వచ్చి తమ తమ మండలాలు, తమ పరిధిలోనికి వచ్చే ప్రాంతాలకు సంబంధించి అప్లోడ్ అయిన వివరాలను పరిశీలిస్తారని, గురువారం నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ రిజిస్ట్రేషన్ల ఫీజును మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు పెంచుతున్నట్టు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. తెలంగాణతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు ఎక్కువ ఉన్నాయని, తమిళనాడులో 11, కేరళలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 7.5 శాతం చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇప్పటివరకు విలువలు సవరించలేదని తెలిపారు. మరోవైపు ఐటీ, ఫార్మా, పర్యాటక, మౌలిక వసతుల రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించడం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో సాగు ఆయకట్టు పెరగడంతో భూముల విలువలు పెరిగాయని వివరించారు. దీంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 50 శాతం అదనపు ఆదాయం అంచనా ప్రభుత్వ విలువల సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ద్వారా దాదాపు 50 శాతం అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏటా రూ.6 వేల కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తుండగా, తాజా మార్పులతో అది రూ.9 వేల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం లెక్కలు కడుతోంది. కానీ, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వస్తాయని భావిస్తోన్న రూ.9 వేల కోట్లకు తోడు మరో రూ.3 వేల కోట్లను కూడా ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఎలా పెరుగుతాయంటే... వ్యవసాయ భూములకు ఇలా.. ఈనెల 22 నుంచి అమల్లోకి వచ్చే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ల ఫీజు ప్రకారం వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ల కింద చెల్లించాల్సిన ఫీజు పెరగనుంది. ఉదాహరణకు ఎకరం భూమి ప్రభుత్వ విలువ గతంలో రూ.20 వేలు ఉంటే ఆ భూమికి రూ.1,200 (6 శాతం) ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.75 వేలు అయింది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతానికి పెరిగింది. అంటే ఇప్పుడు అదే ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రూ.5,625 చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ ప్లాట్లకు ఇలా... ఖాళీ స్థలాల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తించనుంది. మండల కేంద్రాల స్థాయిలో గతంలో చదరపు గజం రూ.201–1,000గా ఉన్న విలువను 50 శాతానికి పెంచారు. అంటే రూ.1,000 చదరపు గజం విలువ ఇప్పుడు రూ.1,500 అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 6 నుంచి 7.5 శాతానికి పెరిగింది. కాబట్టి ఇప్పుడు 100 గజాల ఖాళీ స్థలాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు రూ.11,250 చెల్లించాల్సి ఉంటుంది. అదే గతంలో అయితే రూ.6,000 కడితే సరిపోయేది. ఫ్లాట్లు/ అపార్ట్మెంట్లకు ఇలా.. లక్షలోపు జనాభా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఫ్లాట్లు/అపార్ట్మెంట్లకు చదరపు అడుగుకు కనీస ధర రూ.1,000గా నిర్ణయించారు. గతంలో రూ.800 ఉండేది. ఈ ధర ప్రకారం 700 చదరపు అడుగుల ఫ్లాటును రిజిస్టర్ చేసుకునేందుకు గాను 6 శాతం ఫీజు చొప్పున రూ.33,600 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సవరించిన ధరల ప్రకారం చదరపు అడుగుకు రూ.1,000 చొప్పున రూ. 52,500 (7.5 శాతం ) రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/ అపార్ట్మెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. -
కొత్త జోనల్ విధానంతో స్థానికులకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు రూపొందించి చట్టం చేయడం, అది రాష్ట్రపతి ఆమోదం పొందడం చిరస్మరణీయమని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. ఈ విధానానికి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు, అందుకనుగుణంగా 50 వేల కొత్త ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, కార్యదర్శి, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కలిశారు. ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి విన్నవించిన సమస్యలివీ.. ఆర్డర్‌టుసర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జోనల్ విధానాన్ని అనుసరించి వారి స్వస్థలాలకు/ జిల్లాలకు ఆప్షన్ ద్వారా పంపించడానికి చర్యలు తీసుకుని ఆర్డర్‌టుసర్వ్‌ను రద్దు చేయాలి. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం పీఆర్సీ సూచన మేరకు ఒక శాతం మూల వేతనాన్ని ప్రభుత్వ కార్పస్ ఫండ్‌కు ఇవ్వడానికి రాష్ట్రంలోని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు తదితర ఉద్యోగులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేసేలా జీవో విడుదల చేయాలి. ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో ఉన్న వ్యత్యాసాలను సవరించడానికి అనమలీస్ కమిటీని ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీలతో ఏర్పాటు చేయాలి. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలి. ఆంధ్రాలో మిగిలి ఉన్న జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ స్థాయి, గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ శాఖల్లో జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయాలి. -
సొంతింటికి వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్
బంజారాహిల్స్ (హైదరాబాద్): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీమణి శోభతో కలిసి సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం.14 నందినగర్‌లోని తన సొంత ఇంటికి వచ్చారు. కొంత కాలంగా ఈ ఇంటిలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించేందుకు వచ్చారు. పావుగంట పాటు సీఎం కేసీఆర్ పనులను చూసి పలుచోట్ల మార్పులు, చేర్పులు సూచించారు. ఇదిలా ఉండగా ఆయన మనవడు హిమాన్షు ఉదయం ఈ ఇంటికి వచ్చి గంటపాటు ఉండి వెళ్లారు. -
కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే..
అమరావతి: తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లపై కేంద్రం, కేఆర్ఎంబీ వద్ద వాదనలు వినిపిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్ వదిలి కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? అని సజ్జల ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా... న్యాయం మావైపే ఉందని ఆయన అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్‌కు వచ్చి తెలంగాణ తమ వాదన వినిపిస్తే బాగుంటుందని ఆయన కోరారు. సమస్య ఇక్కడే పరిష్కారం అయ్యేది.. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని అన్నారు. న్యాయబద్ధ హక్కు కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు. కేఆర్ఎంబీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్షించారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు కేఆర్ఎంబీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. విద్యుత్ పేరుతో అక్రమంగా నీటిని వృథా చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడగడం అసంబద్ధం అని ఆయన విమర్శించారు. విభజన జరిగినప్పుడే ఎవరి వాటా ఏంటనేది నిర్ణయించారని సజ్జల గుర్తు చేశారు. ఇక ఈ సమస్యంతా చంద్రబాబు వల్లే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోజు తెలంగాణ ప్రాజెక్ట్‌లపై మాట్లాడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. నాడు పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి సీఎంని విమర్శించడం అర్ధరహితమిని, కృష్ణా జలాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. -
27న అఖిల పక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించనుంది. రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ’సీఎం దళిత సాధికారత’ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం ఈ నెల 27న ప్రగతి భవన్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం ప్రారంభంకానున్న ఈ సమావేశం రోజంతా కొనసాగనుంది. అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల శాసనసభా పక్షనేతలు కూడా పాల్గొంటారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు పంపించనున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభధ్రంకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి కోరారు. దళితుల సమస్యల పట్ల అవగాహన కలిగి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను ఆహ్వానించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దళితుల సంక్షేమానికి సర్కారు కృషి ‘నూతన తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మారుమూలన ఉన్న దళితులు తమ జీవితాల్లో గుణాత్మక అభివృద్ధిని మరింతగా సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలో, ఈ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరం చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం.’ అని కేసీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల విరామం తర్వాత రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఇది రెండోసారి. తొలిసారిగా 2014 డిసెంబర్ 16న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పు అంశంపై రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష భేటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించారు. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్ళీ అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు. 2017 జనవరి 27న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. కానీ ఇందులో కొన్ని పార్టీల నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఇది అఖిలపక్ష భేటీ అని ప్రభుత్వం కూడా చెప్పుకోలేదు. అయితే అసైన్డ్ భూముల సమస్యలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇప్పుడు సుమారు ఆరేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: ఈడీ విచారణకు హాజరుకాని ఎంపీ నామా -
కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి?
హైదరాబాద్: గులాబీ గూటికి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ అండ లేకుండానే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారా? అంటూ ఈటల రాజేందర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి? ఈటెల బీజేపీలో చేరి పెట్రోల్-డీజిల్ తగ్గిస్తారా? పోలవరం తరహాలో తెలంగాణకు జాతీయస్థాయి ప్రాజెక్టు రప్పిస్తారా? ఈటెలకు మర్యాద ఇవ్వలేదు అంటే ఎలా? మంత్రి పదవి ఇచ్చారు చాలదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈటలపై నమ్మకంతో కేసీఆర్ ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని పొడిగిన విషయం గుర్తుచేసుకోవాలి అన్నారు. ఈటల వ్యక్తిగతంగా జరిగిన తప్పును నిరూపించుకోలేక నిరాశలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్లు ఈటలను పెంచి పోషించిన కేసీఆర్‌పై అబండాలు వెయ్యడం సరైంది కాదని, అన్నం పెట్టిన పార్టీపై విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇక ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరవరరావుని జైల్లో పెట్టిన పార్టీలో ఎలా జాయిన్ అవుతారని అన్నారు. బీజేపీపై నెలక్రితం చేసిన విమర్శలు ఈటలకు గుర్తులేవా? అని ఆయన అడిగారు. నాడు దయ్యంలా కనిపించిన బీజేపీ.. నేడు దైవం అయ్యిందా? అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. చదవండి: వారు గాడిదపై ప్రయాణిస్తున్నట్టున్నారు! -
లాక్డౌన్: రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
-
Telangana: నేటి నుంచి బడి బంద్..
ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఈనెల 24వ తేదీ నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమా ప్రథమ, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ప్రకటించింది. మిగతా సెమిస్టర్ల వారికి ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని ఆదేశించింది. జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు తమ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని ఆదేశించాయి. అయితే సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించాయి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కూడా తమ పరిధిలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంటర్మీడియట్లో వచ్చే నెల ఏడో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. విద్యాసంస్థల మూసివేత నేపథ్యంలో ప్రాక్టికల్స్ వాయిదా పడే పరిస్థితి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కరోనా కేసులు పెరిగితే.. ప్రాక్టికల్స్‌కు బదులుగా ఇంటర్నల్ అసెస్మెంట్తో మార్కులు వేసే పరిస్థితి ఉండొ చ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తృతి నేపథ్యంలో విద్యాసంస్థలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని నాలుగు రోజుల కిందట సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం శాసనసభలో ప్రకటన చేశారు. పద్దులపై చర్చ సందర్భంగా మంత్రులు సమాధానం చెప్తున్న సమయంలో అత్యవసర ప్రకటన ఉం దంటూ స్పీకర్ పోచారం వెల్లడించారు. ఆ వెంటనే సబితారెడ్డి స్కూళ్లు, కాలేజీల మూసివేతకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘దేశంలో మరోసారి కరోనా తీవ్రంగా వ్యాపి స్తోంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి. దానివల్ల కరోనా విజృంభించే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని విజ్ఞప్తులు వచ్చా యి. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట.. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ బుధవారం (24 మార్చి) నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య కళాశాలలు మినహా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలకు వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించినట్టుగా ఆన్లైన్ శిక్షణ తరగతులు కొనసాగుతాయి..’’ అని సబితారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని ఆమె కోరారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష బోధన ప్రారంభమై 50 రోజులు కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చిలో విద్యా సంస్థలను మూసివేసింది. చాలా వరకు పరీక్షలను కూడా రద్దు చేసి, విద్యార్థులను ప్రమోట్ చేసింది. తర్వాత జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం కూడా వాయిదా పడింది. చివరికి విద్యార్థులు నష్టపోతున్నారనే ఆలోచనతో.. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్/ డిజిటల్ విద్యా బోధనను ప్రారంభించింది. చాలా వరకు కార్పొరేట్, పెద్ద ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ విద్యా బోధన చేపట్టగా.. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలను (టీశాట్, దూరదర్శన్ పాఠాలు, యూట్యూబ్‌లో వీడియో పాఠాలు) పాఠాలను ప్రారంభించారు. సాధారణ స్కూళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలలకు అమలుచేసిన డిజిటల్ పాఠాలనే విద్యార్థులకు సూచించాయి. ఇలా ఐదు నెలలు కొనసాగాయి.కరోనా నిబంధనల్లో చాలా వరకు సడలింపులు ఇవ్వడం, సాధారణ జనజీవనం మొదలుకావడం, ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒత్తిడి తేవడంతో.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో అన్ని కోర్సులకు, స్కూళ్లలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించవచ్చని ఫిబ్రవరి 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యాజమాన్యాలు స్కూళ్లు, కాలేజీలు తెరిచాయి. తర్వాత అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారికి కూడా ప్రత్యక్ష బోధన మొదలైంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలు చేసుకున్నాయి. కానీ మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో విద్యాసంస్థల మూసివేతకు సర్కారు నిర్ణయం తీసుకుంది. అన్నింటిలో ఆన్లైన్ తరగతులనే కొనసాగించాలని ప్రకటించింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై తర్వాత నిర్ణయం విద్యాసంస్థల మూసివేతపై అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన అనంతరం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి అనుగుణంగా పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన కూడా డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల బంద్‌కు సంబంధించి చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే గతంలో ఆన్లైన్ విద్యా బోధన నిర్వహించినపుడు ప్రభుత్వ టీచర్లు, కాలేజీల లెక్చరర్లు రొటేషన్ పద్ధతితో 50 శాతం చొప్పున హాజరయ్యారు. ఇప్పుడు వారి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం మే ఒకటో తేదీ నుంచి ఇంటర్, అదే నెల 17వ తేదీ నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేస్తున్నామని.. టెన్త్, ఇంటర్, ఇతర పరీక్షల విషయంలో ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆయా పరీక్షలకు ఇంకా సమయం ఉందని చెప్పారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. హైదరాబాద్‌లోని అన్ని చెరువులు పూర్తిగా నిండాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులకు గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. ( డ్రైనేజీ సిస్టం దారుణంగా ఉంది: కిషన్‌రెడ్డి ) కాగా, భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకునేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత సోమవారం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి రూ.లక్ష.. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున తక్షణసాయం, వరదతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థికసహాయం అందజేస్తామని చెప్పారు. ఈ సహాయం అందించేందుకు మున్సిపల్ శాఖకు.. రూ.550 కోట్లు విడుదల చేశారు. -
రైతులు తొందరపడకండి : సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గరనుండి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వానాకాలం పంటల కొనుగోలు అంశంపై మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రికార్డుస్థాయిలో ఈ వానాకాలం మొత్తం 134.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, అందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.36 లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్షల ఎకరాల్లో కంది సాగైందని సీఎం తెలిపారు. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని వరి ధాన్యం 17శాతం తేమకు లోబడి తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. (ఆ అధికారం అపెక్స్ కౌన్సిల్‌దే: షెకావత్) తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని సీఎం రైతులను కోరారు. వరి ధాన్యం కొనుగోలుపై ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయని, ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పత్తిని కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విషయంలో సీసీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రైతులకు ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పెద్దపల్లి జెడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
అపెక్స్ భేటీలో దీటైన సమాధానం
సాక్షి, హైదరాబాద్: ‘నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే కయ్యం పెట్టుకుంటోంది. అపెక్స్ సమావేశంలో ఆ రాష్ట్రం చేస్తున్న వాదనలకు దీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను స్పష్టం చేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, ఏడేళ్ల అలసత్వాన్ని ఎండగట్టాలి. తెలంగాణ హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ‘రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం.. దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాలి. 2014, జూన్ 2న తెలంగాణ ఏర్పడితే జూన్ 14న ప్రధానికి లేఖ రాశాం. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 సెక్షన్ 3 ప్రకారం.. ప్రత్యేక ట్రబ్యునల్ వేసైనా తెలంగాణకు నీటి కేటాయింపులు జరపాలని కోరాం. తెలంగాణ, ఏపీ మధ్య లేదా నదీ పరివాహక రాష్ట్రాల మధ్య అయినా.. నీటి పంపిణీ జరపాలని విజ్ఞప్తి చేశాం. ఏడేళ్లు దాటినా ఆ లేఖకు ఈ నాటికి స్పందన లేదు. పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారు. కానీ, కేంద్రం చేస్తుంది ఏమీ లేదు. 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలి. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలి’అని కేసీఆర్ అధికారులకు చెప్పారు. తెలంగాణ కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. -
మొదలైన రాజకీయ వేడి.. నేతలతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరో మినీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనతో పాటు పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీకి ఆశావాహులు సిద్ధంగా ఉండగా.. గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో ప్రధాన పార్టీలు పడ్డాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టిసారించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పార్టీ నాయకత్వం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రంగంలోకి దిగిన కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో విడతల వారిగా సమీక్షలు నిర్వహించారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, డబుల్ బెడ్రూంల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం నిర్వహించారు. (అంతుపట్టని రహస్యం: కేసీఆర్ వ్యూహమేంటి?) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలతో పాటు అభ్యర్థల ఎంపికలపై తీసుకువాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి మేయర్ బొంత రామ్మోహన్‌ను బరిలో నిలిపేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. పట్టభద్రుల కోటా ఎన్నికలో తీవ్ర పోటీ ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత, ఉద్యోగుల్లో నిరాశ విపక్షాలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీతో సత్సంబంధాలు, స్థానిక యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్మోహన్‌ను బరిలో నిలిపితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేటి భేటీలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికపై కూడా సీఎం పార్టీ నేతలతో చర్చించనున్నారు. (‘మండలి’ స్థానంపై.. పార్టీల గురి!) -
అంతుపట్టని రహస్యం: కేసీఆర్ వ్యూహమేంటి?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నో విమర్శలు, వివాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. స్పష్టమైన మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో సునాయాసంగా నెగ్గిన బిల్లులు, రాజ్యసభలో మాత్రం పెను దుమారాన్నే సృష్టించాయి. బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్ వైదొలగడంతో రాజుకున్న రగడ.. రాజ్యసభలో బిల్లు ప్రతులను చింపివేసే వరకు వెళ్లింది. విపక్షాల నిరసనలు, ఆందోళనల నడమనే పెద్దల సభలోనూ బిల్లులు ఆమోదం పొందాయని డిప్యూటీ చైర్మన్ ప్రకటించడంతో అధికార పక్షం హర్షం వ్యక్తం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఆమోదించుకున్న వివాదాస్పద బిల్లులపై వివాదం ఇప్పడే ముగిసిపోలేదని దీనిపై పెద్ద ఎత్తున పోరును ముందుకు తీసుకుపోతామని కాంగ్రెస్ నేతృత్వంలోనే విపక్ష పార్టీలు ప్రకటించాయి. బిల్లు ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన ఘటనలు ఉత్తర భారతదేశంతో పాటు దక్షినాదినా కనిపించాయి. అయితే ఈ బిల్లుకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చించాల్సిన అంశం. (సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) జాతీయ స్థాయిలో ఉద్యమం.. అయితే గత ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు అనుకూలంగా మెలిగిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బిల్లులు రైతులను కార్పొరేట్ వర్గాలు దోచుకునే విధంగా ఉన్నాయని, అది తేనెపూసిన కత్తి మాదిరిగా ఉందని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టిన మద్దతు తెలిపిన టీఆర్ఎస్ తాజాగా తిరుగుబాటు చేయడం వెనుక రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ సైతం సాగుతోంది. వ్యవసాయ బిల్లులతో పాటు కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లును కూడా కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రల హక్కులను కాలరాసే విధంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనిపై జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రుల అందరితో (బీజేపీయేతర) చర్చించాల్సిన అవసరం ఉందని ఇదివరకే స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లులపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే పెను ఉద్యమానికి సైతం తెరలేపుతామని హెచ్చరించారు. ఈ రెండు పరిణాలమాలతో పాటు బీజేపీ సర్కార్‌పై కేసీఆర్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ వ్యూహమేంటదానిపై సర్వత్రా చర్చసాగుతోంది. (కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి) కేసీఆర్ రచించిన వ్యూహం.. రానున్న రెండు నెలల్లో తెలంగాణలో పలు ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేసింది. దానితో పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓ మండలి స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఈ స్థానానికి సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఉన్న బీజేపీ నుంచి అసలైన పోటీ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల అభిప్రాయం. దీనిలో భాగంగానే బీజేపీ వ్యతిరేకంగా నడుచుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీనే ఎదురైయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇస్తే రైతు వ్యతిరేక సందేశం వెళ్లే అవకాశం ఉందని కేసీఆర్ ఊహించినట్లు తెలిసింది. మరోవైపు కీలకమైన ఎన్నికల ముందు బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు టీఆర్ఎస్ రచించిన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పార్లమెంట్ బిల్లు ఆమోదం తరువాత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలు చూస్తే ఇది నిజమనే భావన కలుగక మానదు. (ఉత్కంఠగా పోరులో విజయం ఎవరిదో..!) హరీష్, తలసాని ఆగ్రహం.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్ రంగంపై తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ప్రమాదకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశమంతా దుబ్బాక వైపు చూస్తున్నది. ఢిల్లీ దిమ్మతిరిగేలా తెలంగాణ ప్రజల మనోగతాన్ని దుబ్బాక ఓటర్లు దేశానికి తెలియజేయాలి’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతాంగానికి అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ఇతర పార్టీలతో కలిసి పోరాడుతుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు, అలాగే విద్యుత్ సంస్కరణలతో రైతులకు నష్టం జరుగుతుందని, ఈ మేరకు పార్లమెంటులో పోరాడాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారని వివరించారు. దేశ సంస్కృతిని కార్పొరేట్‌కు అమ్మేశారు! దేశ వ్యవసాయ సంస్కృతిని కార్పొరేట్‌కు అమ్మేశారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నిప్పులు చెరిగారు. ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మీరు వ్యవసాయ దేశాన్ని కార్పొరేట్ దేశంగా మార్చారు. మీరు తెచ్చింది కేవలం చారిత్రక బిల్లు కాదు.. విప్లవాత్మక బిల్లు..’అంటూ ఎద్దేవా చేశారు. రైతులు కార్పొరేట్ల వద్దకు వెళ్లి ధరను నిర్ధారించేంత సమఉజ్జీలు కాదని, ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామన్నారు. బంగారు బాతు లాంటి వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చంపాలనుకుంటోందని మండిపడ్డారు. కరోనా వల్ల దేశ జీడీపీ 23 శాతం మేర క్షీణించినప్పటికీ వ్యవసాయ రంగ వాటా మాత్రం తగ్గలేదని వివరించారు. రాజ్యాంగానికి, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ బిల్లుల రూపకల్పన జరిగిందన్నారు. ఇది రాష్ట్రాల హక్కులు కాలరాయడమేనని మండిపడ్డారు. రాజ్యాంగంపై నేరుగా జరిగిన దాడిగా అభివర్ణించారు. వ్యవసాయం, సంబంధిత అంశా లు ఎప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలని సూచించారు. దీనిపై రాష్ట్రాలతో సంప్రదించకపోవడాన్ని తప్పుపట్టారు. రాజకీయ పార్టీల, ప్రజాభిప్రాయం సేకరించలేదన్నారు. రైతులను ఈ బిల్లులు భూమి లేని వ్యవసాయ కూలీలుగా మార్చుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు తీరని నష్టం జరుగుతుందని, అందువల్ల ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కేశవరావు స్పష్టం చేశారు. డిప్యూటీ చైర్మన్‌కు ఆ అధికారం ఉండదు సభ అనంతరం విజయ్‌చౌక్ వద్ద ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేశ్‌రెడ్డి, బడుగు లింగయ్య, సంతోష్, పి.రాములు, రంజిత్‌రెడ్డి, దయాకర్, బీబీ పాటిల్‌తో కలసి కేకే విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసేందుకు సభానియమాలను డిప్యూటీ చైర్మన్ తుంగలో తొక్కారని ఆరోపించారు. అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ 12 పార్టీలకు చెందిన 25 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును రాజ్యసభ ఇన్చార్జి అధికారికి ఇచ్చినట్లు చెప్పారు. తీర్మానం పరిష్కారమయ్యేవరకు డిప్యూటీ చైర్మన్‌కు సభా కార్యకలాపాలు నిర్వహించే అధికారం ఉండదని కేశవరావు తెలిపారు. ‘వ్యవసాయంపై ప్రభుత్వం తెచ్చిన మూడు ఆర్డినెన్సులలో రెండింటిని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. వాటిపై చర్చ సజావుగానే జరిగినా ఓటింగ్‌కు వచ్చేసరికి డిప్యూటీ చైర్మన్ పక్షపాతపూరితంగా వ్యవహరించారు. బిల్లులు తిరస్కరించాలని రెండు చట్టబద్ధ తీర్మానాలు ప్రతిపాదించినా పట్టించుకోలేదు. సవరణలు సూచించినా ఖాతరు చేయలేదు. ఎవరి మాటా వినిపించుకోకుండా బిల్లులు ఆమోదం పొందాయని ప్రకటించారు. నా అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా రాజ్యాంగాన్ని వెన్నుపోటు పొడవడం, నియమాలను చెత్తకుండీలో పడేయడం ఎప్పుడూ చూడలేదు’అని కేశవరావు అన్నారు. మరో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు రోడ్లెక్కారు. కోట్ల మంది దేశప్రజలకు అన్నం పెట్టేౖ రెతులను మనం రక్షించుకోవాలి. లోక్‌సభలో సంఖ్యాబలంతో బిల్లులు ఆమోదించారు. రాజ్యసభలో ఓటింగ్ పెడితే ఓడిపోతామనే భయంతో మూజువాణి ఓటుతో ఆమోదింపచేసుకొని ప్రజాçస్వామ్యం గొంతునొక్కారు. బిల్లులు నిజంగా అంత బాగుంటే అందరినీ సమన్వయపరచడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఎవరితోనూ చర్చలు, సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఎందుకు ఆమోదింపచేసుకున్నారు? ఇది నిజంగా రైతుల పాలిట బ్లాక్ డే’అని అన్నారు. -
కేసీఆర్ తరువాత టీఆర్ఎస్ బాస్ ఎవరు..?
వెబ్ స్పెషల్ : తెలంగాణ ఉద్యమ చరిత్రలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానముంది. ఆరు దశాబ్ధాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కే చంద్రశేఖర్‌రావు నిర్వహించిన మలిదశ పోరాటం ప్రజానీకం మరువలేనిది. కేవలం స్వరాష్ట్రమే ధ్వేయంగా 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ స్థాపన మొదలు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు బిగించిన పిడికిలి వదలకుండా పోరాటం చేసిన నేతగా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్ కీర్తి గడించారు. వలస పాలకుల పెత్తనానికి చరమగీతం పాడుతూ ఉద్యమాన్ని ముందుండి నడిపించి, మూడుకోట్ల తెలంగాణ పౌరుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన గులాబీ బాస్‌గా ప్రజల గుండెల్లో చోటుదక్కించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే 2014లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఆ తరువాత రాజకీయంగా తెలంగాణ గడ్డపై తనకు ఎదురేలేదని నిరూపించుకున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ గులాబీ జెండాను రెపరెపలాడిస్తున్నారు. సంక్షేమ పథకాలే బలంగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు నీరాజనాలు పలికారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా బంపర్ మెజార్టీ అందించారు. తెలంగాణలో తనకు ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించారు. కేసీఆర్ తరువాత నాయకుడు ఎవరు..? అయితే ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, 2024 ఎన్నికల నాటికి సీఎం బాధ్యతల నుంచి తప్పకుంటారని ఓ బలమైన వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వారసుడు ఎవరు అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం మొదలైననాటి నుంచి ఆయన మేనళ్లుడు, ప్రస్తుత మంత్రి హరీష్‌తో పాటు కుమారుడు, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాకరామారావు కూడా ఆయన వెంట ఉన్నారు. అయితే కేటీఆర్ కంటే హరీష్ ఉద్యమం తొలినాళ్ల నుంచీ క్రియాశీలక రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా హరీష్ కంటే కేటీఆర్‌దే పై చేయి అని రాజీకీయ విశ్లేషకుల మాట. హరీష్ ఎంత సీనియర్ అయిన్పటికీ కేసీఆర్ వారసుడిగా కేటీఆర్‌కే తొలి ప్రాధాన్యత ఉంటుందని, ఆయన తరువాత పార్టీతో పాటు ప్రభుత్వ పగ్గాలను సైతం కేటీఆర్‌యే అందుకుంటారని అభిప్రాయపడుతున్నారు. తండ్రి విజయం వెనుక తారకరాముడు.. కేసీఆర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ అనతికాలంలోనే రాజకీయాలను వంటపట్టించుకున్నారు. పాలనలో, వ్యూహ రచనలోనైనా తనదైన శైలిని అలవరుచుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లితే రాష్ట్ర పార్టీ బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారనే ప్రశ్న రాజకీయ వర్గల్లో ఉత్నన్నమవుతోంది. కాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి కేటీఆర్ పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అయితే కేసీఆర్ విజయం వెనుక ఆయన తనయుడు పాత్ర ఎంతో ఉంది. ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించి.. తెలంగాణ వాదాన్ని ముందుండి నడిపించారు. 2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. సుమారు దశాబ్ధాల కాలం క్రితం ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితంలో ఓటమిని ఏనాడు రుచిచూడని నేతగా గుర్తింపుపొందారు. ఈ క్రమంలోనే తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందారు. శాసన సభ్యుడిగా, మంత్రిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2018 డిసెంబరు 17న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ఈ క్రమంలోనే 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి... ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖలకు కొత్త రూపులను దిద్దుతున్నారు. కేటీఆర్‌కు పట్టాభిషేకం.. హరీష్‌రావు ఎక్కడా..? అయితే తొలినుంచి ఉద్యమంలోనూ, టీఆర్ఎస్లోనూ ముఖ్యపాత్ర పోషిస్తూ కేసీఆర్ విజయంలో సగభాగంగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్న హరీష్‌రావును కేసీఆర్ పక్కకుపెడుతున్నారనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సైతం ఇలాంటి వ్యాఖ్యలను అనేక సందర్భాల్లో చేశారు. అంతేకాకుండా కేసీఆర్‌కు వ్యతిరేకంగా హరీష్ పావులు కదుపుతున్నారని, ఏదో ఒకరోజు బీజేపీ నేతలతో చేతులు కలుపుతారనీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హరీష్‌రావును ఆహ్వానించకపోవడం అప్పట్లో రాజకీయ వర్గల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖామంత్రిగా విధులు నిర్వర్తించిన హారీష్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ తొలుత విడుదల చేసిన లిస్ట్‌లో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయిర్ జాబితాలో హరీష్‌రావు పేరు లేకపోవడం తీవ్ర దుమారం రేపింది. హరీష్‌ను కేసీఆర్ కావాలనే పక్కనపెడుతున్నారనే అప్పట్లో వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ తరుణంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి... పార్టీ పూర్తి పగ్గాలను కేటీఆర్‌కు అప్పగించారు కేసీఆర్. వనవాసం అనంతరం అయోధ్యలో రాముడి పట్టాభిషేకం జరిపిన రీతిలో కేటీఆర్ పట్టాభిషేకం జరిపించారు. దీంతో కేసీఆర్ అనంతరం టీఆర్ఎస్ బాస్ ఎవరూ అనేదానికి సీఎం స్పష్టమైన సంకేతాలు ఇవ్వకనే ఇచ్చారనేది అర్థమవుతోంది. మరోవైపు 2024 ఎన్నికల నాటికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని ఆ సమయానికి సీఎం బాధ్యతల్లో మార్పులు చేస్తారని రాజకీయ వర్గల్లో చర్చసాగుతోంది. అయితే కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తే హరీష్ పరిస్థితి ఏంటీ..? ఆయన వర్గం మద్దతు తెలుపుతుందా..? కేటీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారు అనేది రాజకీయ వర్గల్లో వస్తున్న ప్రశ్నలు. వీటన్నింటికీ కేసీఆర్‌యే భవిష్యత్‌లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు వేచిచూద్దాం. -
జాతీయ స్థాయిలో పార్టీపై కేసీఆర్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. కొత్త రాజకీయ పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని కొట్టిపారేశారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై భవిష్యత్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్సీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎం మాట్లాడారు. (10న రెవెన్యూ చట్టంపై ప్రకటన) దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఏ ఒక్కరూ ఆశామాషీగా తీసుకోవద్దని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సభ్యులకు హితబోధ చేశారు. అన్ని అంశాలపై సభలో చర్చిద్దామన్నారు. పూర్తి సమాచారంతో అందరూ మాట్లాడాలని సూచించారు. రెవిన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారతాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం నివాళి అర్పించారు. ఆయన మృతితో దుబ్బాకలో ఉప ఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థి ఎంపికపై కొంత ఉత్కంఠ ఉన్నా.. సోలిపేట కుటుంబంలోనే ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత సమావేశమైన కేబినెట్ కొత్త రెవెన్యూ చట్టం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం సభ్యులతో చర్చించనున్నారు. -
తిట్లు, శాపనార్థాలు వద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ‘అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు, నిందలు, అసహనానికి శాసనసభ వేదిక కావద్దు. ఇలాంటి ధోరణికి తావు లేకుండా అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పు వచ్చి స్ఫూర్తి వంతమైన చర్చలు జరగాలి’ అని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు ఆకాంక్షించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరిం చాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో పలువురు మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహ ణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ‘చట్టాలు రూపొందించడం, బడ్జెట్ ఆమోదం, వాటి అమలు తదితరాలపై విశ్లేషణకు అసెం బ్లీలో వాస్తవాల ఆధారంగా ప్రజలకు ఉపయోగ పడే చర్చ జరగాలి. తద్వారా ప్రజాస్వామ్యం బలోపేతమై ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు వెలువడతాయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆచరణాత్మక సలహాలు స్వీకరించేందుకు సిద్ధం.. ‘ఏ పార్టీకి చెందిన సభ్యులైనా అన్ని విషయాలను వాస్తవాలు ప్రతిబింబించేలా, క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దంపట్టేలా సభలో మాట్లాడవచ్చు. వాటికి సమా ధానం, వివరణ ఇచ్చేందుకు, ఆచర ణాత్మక సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు సంబం«ధించిన అన్ని అంశాలపై అసెం బ్లీలో కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అధికారపక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబం«ధించిన ప్రతి అంశాన్నీ సభలో ప్రస్తావించాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. రాజకీయ పక్షాలు ప్రతిపాదించే అంశాలపై ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చ సందర్భంగా ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు, చర్చకు వచ్చే అన్ని అంశాలపై పూర్తి సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఘనంగా నివాళి అర్పిస్తామని సీఎం వెల్లడించారు. బీఏసీలో ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలు కరోనా వ్యాప్తి, నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు–నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలు. భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం–తీసుకోవాల్సిన చర్యలు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు. కొత్త రెవెన్యూ చట్టం. జీఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న నష్టం. రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణి. నియంత్రిత పద్ధతిలో పంటల సాగుతోపాటు వ్యవసాయ రంగం. పీవీ శతజయంతి ఉత్సవాలు. -
మంత్రులతో కేసీఆర్ భేటీ: వ్యూహాలపై చర్చ
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, విప్‌లతో సమావేశం నిర్వహించారు. సభలో విపక్షాలు కోరిన అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని, ఎన్ని రోజులైనా అసెంబ్లీని నిర్వహిద్దామని సీఎం అన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు మంత్రులు సిద్ధం కావాలని సూచించారు. అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కారాదని పేర్కొన్నారు. జీఎస్టీ అమలులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభలోనే చర్చించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే ఈనెల 7న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు మంత్రులు, విప్‌లు పాల్గొన్నారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కురావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదా చట్టానికి తుదిరూపునిచ్చి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొత్తచట్టం రూపకల్పనపై సీఎం గత వారమే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మరోవైపు దివంగత మాజీ ప్రధానమంత్రి, పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని కేసీఆర్ ఇదివరకే వెల్లడించారు. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండండి ఈ నెల 7 నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. బీఆర్కేఆర్ భవన్లో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శాసనసభలో పెండింగులో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని, అసెంబ్లీ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాసన మండలి సమావేశాలకు సీనియర్ అధికారులు హాజరయ్యేలా చూడాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించి నోట్స్ చేసుకోవాలన్నారు. -
కేంద్రం నిర్ణయంపై కేసీఆర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు లేఖ రాశారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా జీఎస్టీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవే అని.. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రా ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయిందని, ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రతిపాదనలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి చెందినట్లే అని పేర్కొన్నారు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశం అవుతుందన్నారు. కరోనా క్లిష్ట సమయంలోరుణాలపై ఆంక్షలు సహేతుకం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మంగళవారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు.. ‘జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ బిల్లును సమర్థించింది. మొట్టమొదలు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది తెలంగాణ ప్రభుత్వమే. జీఎస్టీ ఫలాలు దీర్ఘకాలికంగా ఉండి.. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రావడానికి దోహదపడుతుందని అనుకున్నాం. సీఎస్టీని రద్దు చేసే సమయంలో పూర్తి పరిహారాన్ని అందజేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్రాలు సీఎస్టీ పరిహారాన్ని తిరస్కరించాయి. సరిగ్గా ఇదే కారణంపై రాష్ర్టాల ఒత్తిడి మేరకు రెవెన్యూ నష్టాన్ని పూడ్చడానికి ప్రతి రెండు నెలలకోసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించే విధంగా చట్టంలో కచ్చితంగా నిబంధన ఉన్నా.. జీఎస్టీ పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోంది. (ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!) ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదు. కోవిడ్-19 కారణంగా 2020, ఏప్రిల్‌లో నుంచి తెలంగాణ ప్రభుత్వం 83 శాతం రెవెన్యూను నష్టపోయింది. అదే సమయంలో రాష్ట్రాల అవసరాలు, పేమేంట్ల భారం పెరిగిపోయింది. మార్కెట్ బారోయింగ్స్ ద్వారా, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవర్ డ్రాఫ్ట్ ల ద్వారా ఈ పరిణామాల నుంచి గట్టెక్కాల్సి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ, విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉన్న కారణంగా రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ బారోయింగ్‌లకు కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని’ సీఎం లేఖలో పేర్కొన్నారు. -
స్వామిగౌడ్ ఆగ్రహం: టీఆర్ఎస్లో గుబులు
సాక్షి, హైదరాబాద్ : ప్రశాంతంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ప్రకంపనలు రేపుతున్నారు. ఇటీవల వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించడం గులాబీ దళంలో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాక్షితో ముచ్చటించిన స్వామిగౌడ్ టీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఉద్యమకారులను కలుపుకుని పోవడంలేదని ఆగ్రహం చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చూసి హేళన చేసిన వారికి నేడు ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభించిందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (‘గవర్నర్ కోటా’ కసరత్తు షురూ!) గతకొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వడంలేదని తెలిపారు. ఉద్యమ సమయంలో వెన్నంటి ఉండి నడిచిన వారికి కూడా కలిసే సమయం ఇవ్వకపోతే మరెవ్వరికి ఇస్తారని టీఆర్ఎస్ బాస్‌పై కొపగించుకున్నారు. అయితే ప్రస్తుతం తనకు పార్టీ మారే ఆలోచన లేదని, ఉద్యమకారులను, బడుగు బలహీన వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీ టికెట్ తనకు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ తన స్థానంలో మరొకరికి టికెట్ కేటాయించారని గుర్తుచేశారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా.. గతేడాది ఏప్రిల్‌లో శాసనమండలి సభ్యుడిగా, మండలి చైర్మన్‌గా పదవీ కాల పరిమితి పూర్తి చేసుకున్న స్వామిగౌడ్ కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించట్లేదు. గతంలో గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయిన స్వామిగౌడ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీకి ఆసక్తి చూపినా అవకాశం లభించలేదు. ఏదేని ముఖ్యమైన కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఆశించినా పార్టీ అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!
సాక్షి, మెదక్ : తండ్రుల అకాల మృతితో తనయులు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇరువురు నేతల అకాల మృతితో ఏర్పడ్డ దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయ రంగు పులుముకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో తమ కుటుంబానికి బాసటగా ఉంటానని రాజకీయంగా మిమ్మల్ని ఆదుకుంటానాని హామీ ఇచ్చారు. తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనాల కమిటీ చైర్మన్ కొనసాగుతూ సందర్భంలోనే ఎమ్మెల్యే అకాల మృతి తో వారి కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇరువురు నేతల పుత్రులు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొమ్మాట నియోజకవర్గంలో మొదలై నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన దుబ్బాక నియోజకవర్గం ఆనాడు టీడీపీకి కంచుకోట తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ వశమైంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఎన్నికలో పోటీ నుంచి తప్పుకుని రామలింగారెడ్డి కి మద్దతు ఇస్తే భవిష్యత్తులో పార్టీలో లో మంచి గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీ స్థాయి పదవిని కట్ట పెడతామని అప్పట్లోనే సీఎం కేసీఆర్ చెరుకు ముత్యంరెడ్డి కి హామీ ఇచ్చారు. ఆ తర్వాత చెరుకు ముత్యంరెడ్డి గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కి భరోసాగా ఉంటామని తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఆ తదుపరి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగుతూ క్రియాశీలక కార్యక్రమాలలో కొనసాగుతున్నారు. ఇద్దరికీ హామీ ఇచ్చిన సీఎం.. దుబ్బాక ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు ఆరో తేదీన అనారోగ్య కారణంతో మరణించడం వల్ల దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే రామలింగారెడ్డి అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల సభ్యులను ఓదార్చి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రామలింగారెడ్డి సతీమణి లేదా తనయుడికి సముచిత స్థానం కల్పించాలని ఆలోచనలో ఉన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరికొంతమంది నాయకులు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇరువురు నేతల మృతితో టికెట్ ఎవరికీ కేటాయించాలి అనే సందిగ్ధంలో అధికార పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. క్రింది స్థాయి నాయకుల్లో ఇదే అంశం ప్రస్తుతం చర్చకు వస్తుంది. ఇదే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పించినా మరొకరితో కంటే అయ్యే అవకాశం ఉంది. కనుక ఇరువురు నేతల కుటుంబాలకు ఒకరికి ఎమ్మెల్యేగా మరొకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ పలు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు గా ఉన్నాడు. . అధిష్టానంపై ఒత్తిడి అయితే ముందు తన తండ్రి ముత్యంరెడ్డి హామీ ఇచ్చారు గనుక తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి తనయుడు సోలిపేట సతీష్ రెడ్డి కూడా దుబ్బాక నియోజక వర్గంలో యువజన కార్యక్రమాలకు సంబంధించి అనేక పనులు నిర్వహిస్తూ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక బరిలో ఎవర్నినిలబెడతారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆశావాహులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని మరికొందరు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ లోపు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా దుబ్బాక నియోజకవర్గం పై పట్టు సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపొందలని పక్కా ప్రణాళిక బీజేపీ పార్టీ నుండి మాధవనేని రఘునందనరావు, తోట కమలాకర్‌రెడ్డి దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మద్దుల సోమేశ్వర్ రెడ్డి నరసింహారెడ్డి కర్నాల శ్రీనివాస్ తో పాటు మరొక ముగ్గురు నేతలు దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఉప ఎన్నిక సమయం మరో ఐదు మాసాలు ఉండగానే దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ పార్టీలో లో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి తనయులు పోటీ పడడం తమకు కలిసొస్తుందని భావించిన బీజేపీ ఇప్పటికే ప్రచారం గెలుపు ప్రణాళిక మొదలుపెట్టి ముందువరుసలో నిల్చుంది. గతంలో లో దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్ రావు ఈసారి ఎలాగైనా గెలుపొందలని పక్కా ప్రణాళికతో పార్టీ ప్రచార కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. తోట కమలాకర్ రెడ్డి తనకు టికెట్ కేటాయిస్తే యువత ఓటు బ్యాంకుతో ఎలాగైనా విజయం సాధిస్తాం అన్నా భీమాను వ్యక్తం చేస్తున్నాడు. దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ గెలుపు భీమా గా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆశావహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర క్యూ కడుతున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి ముత్యం రెడ్డి అనుచర గణం 70000 ఓట్ల మెజార్టీతో రామలింగారెడ్డిని గెలిపించారు. కానీ త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు ఇరువురు నేతలు ఒకే పార్టీ నుండి కనుక పోటీ చేస్తే సీటు దుబ్బాక స్థానం బీజేపీ కి అనుకూలంగా మారనుంది. అధిష్టానం బుజ్జగింపు ఏ ఒక్కరూ వెనక్కి తగ్గినా ఆ సీటు టీఆర్ఎస్ ఖాతాలోనే సురక్షితంగా ఉంటుందని విశ్లేషణ కొనసాగుతుంది. ప్రతి పార్టీలోనూ ఇద్దరు ముగ్గురు పోటీకి దిగడం అధిష్టానం పిలుపుమేరకు టికెట్ ఒకరికి కేటాయిస్తే ఎవరైతే తప్పుకోకుండా పోటీలో ఉండాలనుకుంటున్నారో వారే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచే పరిస్థితులు దుబ్బాక నియోజక వర్గంలో మొదలవుతున్నాయి. -
పీవీపై కేసీఆర్ సంచలన నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. అలాగే నెక్లెస్‌రోడ్డుకు పీవీ జ్ఞాన్ మార్గ్‌గా పేరు పెట్టాలని, హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్ ఏర్పాటుకు కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో పీవీ శతజయంతి వేడుకల నిర్వహణపై శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ సాహసోపేతమైన భూ సంస్కరణలు అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. (సంస్కరణల ఆద్యుడు పీవీ) ఆయన సంస్కరణల ఫలితంగానే తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులకు భూమి వచ్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడంతో పాటు..అనేక రంగాల్లో సంస్కరణలు తెచ్చిన పీవీ ఆదర్శప్రాయుడని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పీవీకి మరింత గౌరవం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లక్నేపల్లి, వంగర గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశ,విదేశాల్లో కూడా పీవీ శత జయంతి వేడుకలు నిర్వహించాలన్నారు. పార్లమెంట్లో మాజీ ప్రధాని విగ్రహం ప్రతిష్టించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. (ధీశాలి.. సంస్కరణశీలి) -
శ్రీశైలం ప్రమాదం : రాత్రంతా ప్రయత్నించాం కానీ..
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో చోటుచుకున్న ప్రమాదం చాలా దురదృష్టకరమని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు ఇంజనీర్లుతో పాటు ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, తాము ఎంతో చింతిస్తున్నామని అన్నారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అక్కడకు చేరుకున్నామని, సిబ్బందిని కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేశామని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రితో కలిసి ఆ రోజు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని కానీ తమ వల్లకాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ప్రభాకర్‌రావు ప్రమాద వివరాలను వెల్లడించారు. ‘ప్రమాదం అనంతరం విద్యుత్ కేంద్రంలో కరెంట్ పోయింది. దీనితో లోపల అంధకారమయ్యింది. పొగతో ఆక్సిజన్ లభించలేదు. పొగను బయటకు పంపించేందుకు చాలా కష్టపడ్డాం. అయినా దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. విద్యుత్ కేంద్రలో ప్రమాదం జరిగితే వెంటనే ఆటోమేటిక్ ట్రిప్ కావాలి. కానీ కాలేదు ఎందుకు ట్రిప్ కాలేదు అనేదానిపై కమిటీ వేశాం. ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పవర్ పోవడంతో వెంటిలేషన్ ఆగిపోయింది, దీనితో ఎమర్జెన్సీ వే కూడా తెరుచుకోలేదు. గత 30 రోజుల నుండి చాలా చక్కగా జరుగుతున్నాయి. రోజుకు 128 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది గతంలో కూడా ఎన్టీపీసీ లో బాయిలర్ బ్లాస్ట్ అయింది. ఆ ప్రమాదంలో దాదాపు 30 చనిపోయారు. తమిళనాడులో కూడా గతంలో ఇలాంటి సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తు మన దగ్గర కూడా జరిగింది దీనిపై కమిటీ వేశామ్. కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తారు.ప్రభుత్వం నుండి ఇప్పటికే వాళ్లకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాం. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం. త్వరలోనే వాళ్ళ కుటుంబాలకు జెన్కో నుంచీ సహాయం అందజేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగిన రాష్ట్రాల్లో ఇంత మొత్తంలో ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు’అని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై త్వరలోనే కమిటీ పూర్తి నివేదికను అందిస్తుందని ప్రభాకర్‌రావు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, క్యాబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రగతి భవన్లో పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీపైన ఆరుసార్లు అంతర్గతంగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖ 2298 కొత్త ఖాళీలను భర్తీ చేసే ముందు సంబంధిత పోస్టులను, ఉద్యోగులను రెషనలైజ్(హేతుబద్ధీకరణ) చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంతర్గతంగా చర్చలు నిర్వహించి ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మెదటి సారిగా... పరిశుభ్రమైన పట్టణాలు, ప్రణాళిక భద్దమైన పట్టణాలు, ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలన్న ముఖ్యమంత్రి అలోచనల మేరకు రూపోదించిన నూతన పురపాలక చట్టానికి అనుగణంగా ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రజలకి వేగంగా పౌర సేవలు అందించడంతో పాటు పట్టణ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. దీంతో పురపాలనలో నూతన మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు అయన తెలిపారు. ఈమేరకు ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని ఉంచే లక్ష్యంలో వార్డు అఫీసర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇలా అన్ని వార్డుల్లో ఒక అధికారి ఉండడం దేశంలోనే మెదటిసారని మంత్రి కేటీఆర్ అన్నారు. పురపాలక చట్టం నిర్ధేశించిన పారిధుధ్ద్యం, హారితహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పురసేవల అమలు మెదలైన కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఈ వార్డు అఫీసర్ల నియామకం దోహాదం చేస్తుందన్నారు. భర్తీ అత్యంత పారదర్శకంగా.. ఖాళీల భర్తీ తర్వాత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు, పురపాలక శాఖ నూతన చట్టం ప్రకారం స్పూర్తితో ముందుకు పోయేందుకు వీలుకలుగుతుందన్నారు. వార్డు అఫీసర్ల నియామకం ద్వారా ప్రజలకు పురపాలక శాఖకు అవసరమైన వారధి ఎర్పడుతుందని, తద్వారా పురపాలనా అంటే పౌర పాలన అనే స్పూర్తి నిజం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. పురపాలకశాఖ ఇంజనీరింగ్ పనులంలో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యం అరికట్టేందుకు ఇద్దరు ఛీప్ ఇంజనీర్లను ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. వీరికి సహాయంగా ఇద్దరు లేదా ముగ్గురు ఏస్.ఈలు కూడా ఉంటే ప్రతిపాదనలకు కూడా అమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. వీటి భర్తీ అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : సచివాలయ ఆవరణలో నల్ల పోచమ్మ ఆలయం, మసీదులు కూల్చివేతలకు బాధ్యులైన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రావన్ దాసోజు, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం శ్రవణ్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను, మత పరమైన విశ్వాసాలను గాయపరుస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చట్ట విరుద్ధంగా, రాజ్యంగానికి వ్యతిరేకంగా నియంతత్వ పోకడలతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అత్యంత ప్రాచీనమైన ప్రార్థనా స్థలాలను మూడో కంటికి తెలియకుండా చట్ట వ్యతిరేకంగా దుర్మార్గంగా కూల్చివేశారని విమర్శించారు. వీటిలో ఓమసీదు 1889 వ సంవత్సరంలో ఆనాటి నిజాం రాజు నిర్మించిన తెలంగాణ వారసత్వ సంపద అని, అంతేకాకుండా సీ బ్లాక్ పక్కనే ఉన్న మసీదు ఇఫ్తార్ - ఏ - ముతామాది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రార్థనా మందిరమని గుర్తుచేశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్ పాల్గొన్నారు. -
శ్రీశైలం ప్రమాదం: పరిహారం ప్రకటించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాషియా ప్రకటించి అండగా నిలిచింది. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రమాదం అనంతరం అత్యున్నత స్థాయి అధికారులతో అత్యవసర సమావేశమైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. (విషాదం: లోపలున్న 9 మందీ మృతి) గురువారం అర్థరాత్రి అనంతరం చోటుచేసుకున్న ప్రమాదంలో 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఘటనలో మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఇదివరకు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది ఉద్యోగులు మృత్యువాత పడటం బాధకరమన్నారు. మృతుల వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ కిరణ్, పాల్వంచ 8. టెక్నీషియన్ మహేష్ కుమార్ 9.హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్ -
వరదలపై పాలసీ
సాక్షి, హైదరాబాద్: వానలు, వరదలు సంభ విస్తే అనుసరించాల్సిన ప్రణాళికను గత పాల కులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రూపొందించి తెలంగాణను పట్టించు కోలేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తెలంగాణలో వానలు, వరదలు, విపత్తులు వచ్చినా పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విప త్తుల నిర్వహణ వ్యూహాన్ని తయారు చేసుకోవా లన్నారు. ‘ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ’ పేరిట తయారయ్యే ఈ పాలసీ శాశ్వత ప్రాతిపదికన ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వరదల మూలంగా తలెత్తిన పరిస్థితిపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కె. తారక రామారావు, నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఉగ్ర గోదావరి..) మరో 3, 4 రోజులు కీలకం... ‘నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండటంతోపాటు వాగులు, వంకలు, నదులు పొంగుతున్నాయి. ప్రస్తుతం పరిస్తితి అదుపులో ఉన్నా మరో మూడు నాలుగు రోజులు అత్యంత కీలకం. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికితోడు ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. (ఇంకా వరద బురదలోనే..) ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకొని నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలి. కంట్రోల్ రూమ్‌లలో రెవెన్యూ, పోలీస్, జలవనరులు, విద్యుత్ తదితర శాఖల ప్రతినిధులుండాలి. సహాయక చర్యలకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నందున ఖర్చుకు వెనకాడకుండా పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి’ అని కేసీఆర్ ఆదేశించారు. జిల్లాలవారీగా పరిస్థితిపై ఆరా.. జిల్లాలవారీగా వర్షాల పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్... వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘గోదావరికి భారీ వరద వచ్చే అవకాశం ఉన్నందున ఏటూరునాగారం, మంగపేట మండలాలతోపాటు పరీవాహక ప్రాంతంలోని ముంపు గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భద్రాచలం పట్టణంలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిషన్ కాకతీయ ద్వారా చెరువు కట్టలు పటిష్టంగా తయారు కావడంతో నిలువ సామర్థ్యం పెరగడంతో బుంగలు పడకుండా నివారించగలిగాం. ఇంకా పనులు చేపట్టని కొన్ని చిన్న కుంటలకే నష్టం జరిగింది. చెరువులకు మరింత వరద వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి’ అని సీఎం సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు.. ‘విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడటమే అత్యంత ముఖ్యమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. ముంపు ప్రమాదంపై అధికార యంత్రాంగానికి ప్రజలు సమాచారం ఇవ్వాలి. కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లు, కాజ్‌వేల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి భోజనం, ఇతర వసతులు, కోవిడ్ రక్షణకు మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానికంగా ఉంటూ సహాయ చర్యలు పర్యక్షించాలి. వానలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేయాలి. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు పట్టణాలు, గ్రామాల నుంచి నివేదికలు తెప్పించుకొని నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం ‘భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాన్ని అధికార యంత్రాంగం రూపొందించుకోవాలి. ఏ స్థాయిలో వర్షం వస్తే ఎక్కడ ఎంత నీరు వస్తుంది? ఏ నదికి ఎంత వరద వస్తుంది? అప్పుడు ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది వంటి అంశాలను అధ్యయనం చేయాలి. భారీ వర్షాలు పడినా లోతట్టు ప్రాంతాలను ఎలా కాపాడాలి? ఎక్కడెక్కడ రోడ్లపైకి నీరు వచ్చే అవకాశం ఉంది వంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి వ్యూహం ఖరారు చేయాలి. అన్ని పట్టణాల్లో మున్సిపల్, పోలీసు విభాగాలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి వెంటనే రంగంలోకి దిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్‌షీట్ తయారు చేసి నదులు పొంగినప్పుడు తలెత్తే పరిస్థితులను నమోదు చేయడంతోపాటు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధులతోపాటు ఇతర వ్యా«ధులపై వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యుత్ సిబ్బందికి అభినందన... ప్రకృతి విపత్తు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడటంతోపాటు గ్రిడ్ ఫెయిల్ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్ సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. ‘ఉమ్మడి ఏపీలోనూ లేని రీతిలో ఈ ఏడాది తెలంగాణలో 13,168 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే ఏడాది ఓ సందర్భంలో 4,200 మెగావాట్ల అత్యంత కనిష్టానికి కూడా విద్యుత్ డిమాండ్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రిడ్ కుప్పకూలకుండా తెలంగాణ విద్యుత్ సంస్థలు పనిచేశాయి’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ శాఖ సైతం హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారీ నష్టం కలగకుండా చర్యలు తీసుకుందన్నారు. -
ప్రగతి భవన్లో నిరాడంబరంగా జెండా వందనం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని సైనిక అమర వీరుల స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు. సైనిక అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోవిడ్–19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సీనియర్ సైనిక అధికారులు లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణ్, మేజర్ జనరల్ ఆర్కే సింగ్, బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏటా గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి ప్రగతి భవన్లో నిరాడంబరంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని సైతం సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నారు. -
జలదిగ్బంధంలో ఓరుగల్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జలప్రళయం.. ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది. కాలనీలు, గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రామప్ప, పాకాల, లక్నవరం సహా చెరువులు, కుంటలు మత్తళ్లు దుముకుతుండగా, జంపన్నవాగు, చలివాగు, మోరంచ, కటాక్షపురం వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 421 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేడారం సమీపంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మారుమూల ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. చరిత్రలో మొదటిసారిగా జంపన్నవాగు పొంగిపొర్లిందని చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలివాగు ప్రమాదకర స్థాయికి చేరింది. వరంగల్ రూరల్ జిల్లా నడికుడ వాగులో ఓ ప్రైవేట్ బస్సు కొట్టుకుపోగా.. అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో టూరిజం అధికారులు లక్నవరం, బొగతలకు సందర్శకులను అనుమతించడం లేదు. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు మత్తడి ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే.. చెన్నారావుపేట మండలంలో నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్ కాజ్వే పై నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో నర్సంపేట వైపు రాకపోకలు ఆగిపోయాయి. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పిత్తి నిలిచిపోయింది. నీట మునిగిన కాలనీలు వరంగల్ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కాలనీలన్నీ జలమయమయ్యాయి. హన్మకొండ నయీంనగర్ దగ్గర ‘నాలా’పొంగడం.. చింతగట్టు దగ్గర రోడ్డు పైన నీళ్లు వెళ్లడంతో కరీంనగర్ రహదారి వైపు శనివారం రాత్రి వరకు రాకపోకలు నిలిచాయి. ఖిలా వరంగల్ పరిధిలోని ఉర్సు బీఆర్ నగర్ నీట మునిగింది. దాదాపు 500 ఇళ్లలోకి నీరు చేరింది. గిర్మాజీపేట, శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. హన్మకొండలోని అంబేద్కర్ నగర్, కాకతీయ కాలనీ వడ్డెర వీధి ముంపునకు గురయ్యాయి. నగరంలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సమ్మయ్యనగర్ పూర్తిగా మునిగిపోవడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోపాలపురం చెరువు ప్రమాదకరంగా మారింది. పైగా చెరువుకు గండి పడే అవకాశం ఉన్నట్లుగా తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టులకు వరద పోటు భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది. కాళేశ్వరం వద్ద శనివారం 10.10 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది. దిగువన కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ వద్ద 7 లక్షల క్యూసెక్కులు తరలిపోతోంది. అలాగే, మహదేవపూర్ మండలం అన్నారంలోని సరస్వతీ బ్యారేజీలో మానేరు నుంచి వరద తాకిడి పెరుగుతుండటంతో 66 గేట్లకు గాను 51గేట్లు ఎత్తారు. మానేరు వాగుతో పాటు ఇతర వాగుల ద్వారా బ్యారేజీకి ఇన్‌ఫ్లో 3.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లు ఎత్తడంతో దిగువకు అవుట్‌ఫ్లో 4 లక్షల క్యూసెక్కుల వరద తరలిపోతుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అలాగే, గోదావరి, ప్రాణహిత నదుల నుంచి భారి ప్రవాహాలు వస్తుండటంతో లక్ష్మీబ్యారేజీలో 85 గేట్లకు గాను 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక! భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం తెల్లవారుజామున నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో కేంద్ర జల వనరుల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, సాయంత్రం 6 గంటలకు 46 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరికకు రెండు అడుగుల దూరంలోనే ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఆ నీటిని సైతం గోదావరిలోకే వదులుతుండటంతో నది ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పాలేరు, వైరా రిజర్వాయర్లు అలుగుపోస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టుకు గరిష్ట స్థాయిలో నీరు చేరడంతో 12 గేట్లు ఎత్తి 86 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2016 తర్వాత ఒకేసారి 12 గేట్లు ఎత్తడం ఇదే ప్రథమం. ఇక జిల్లావ్యాప్తంగా శనివారం 16.18 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అప్రమత్తంగా ఉండండి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో మాట్లాడారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని, కలెక్టర్, పోలీస్ అధికారులతో కలసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని ఫలితంగా కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని, అలాగే వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నం కావచ్చని సీఎం చెప్పారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వీటిని వినియోగించనున్నారు. -
రెవెన్యూ అనకొండలు
సాక్షి, హైదరాబాద్ : గతేడాది జూలైలో కేశంపేట తహసీల్దార్ లావణ్యపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో రూ.93 లక్షల నగదు దొరికితే అక్కడికి వెళ్లిన వారి కళ్లు తిరిగాయి. తాజాగా లావణ్య రికార్డును బద్దలు కొట్టేలా కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1.10 లక్షల నోట్ల కట్టలతో పట్టుబడడంతో అంతా నోరెళ్లబెట్టారు. రెవెన్యూశాఖలో వేళ్లూనుకున్న అవినీతికి ఈ రెండు ఘటనలూ నిదర్శనం. అవినీతికి చిరునామాగా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావ తారాల లీలలకు మాత్రం బ్రేకులు పడడంలేదు. భూ ముల విలువలకు రెక్కలు రావడం.. భూ వివాదాలు పెరిగిపోవడాన్ని ఆసరా చేసుకుంటున్న కొందరు అధికారులు డబ్బు మూటలకు ఆశపడుతున్నారు. దాయాదులు వివాదమైనా, సరిహద్దు తగాదైనా, న్యాయపరమైన చిక్కులైనా, సాంకేతిక సమస్యలైనా జాన్తానై అంటూ అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా ‘షాక్’పేట రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని షేక్‌పేట మండల తహసీల్దార్ వివాదాస్పద భూ వ్యవహారంలో తలదూర్చి ఏసీబీకి చిక్కారు. తహసీల్దార్ సుజాత ఇంటిపై దాడి చేసిన అధికారులు.. సుమారు రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే భూ వివాదంలో ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలిచిన ఆర్ఐ కూడా భారీ నగదుతో ఏసీబీకి పట్టుబట్టారు. ఆ కేసులో సుజాత భర్త ఆత్మహత్య చేసుకోవడం, ఫిర్యాదుదారుడిపై కూడా ఆరోపణలు రావడంతో ఆ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రెవెన్యూశాఖలో లంచాల ఆరోపణల నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం కూడా రెవెన్యూశాఖపై ఆరోపణలు, ఏసీబీ కేసుల విషయంలో ఎలాంటి మార్పులు రాకపోగా.. అందరూ తిరిగి పాతబాటే పట్టడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్వో నుంచి జాయింట్ కలెక్టర్ల వరకు అవినీతిపర్వాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ మూడు జిల్లాల్లోనే తిష్ట.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు. అలాగే వారిని కదలించడానికి ఎవరూ సాహసించరు. దశాబ్దాల కాలంగా నయాబ్ తహసీల్దార్ నుంచి అదనపు కలెక్టర్ల వరకు అదే జిల్లాలో కొలువులు చేస్తున్నారు. రంగారెడ్డి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి మేడ్చల్, మేడ్చల్ నుంచి రంగారెడ్డి ఇలా ఈ మూడు జిల్లాల్లోనే సర్వీసు పూర్తి చేసుకుం టున్నా.. ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. విలువైన భూములను డీల్ చేసే క్రమం లో బడాబాబులు, ప్రజాప్రతినిధులతో ఏర్పడిన పరిచయాన్ని పలుకుబడిగా మార్చుకొని ప్రభుత్వ స్థాయిలో చక్రం తిప్పుతున్న అధికారులు తమ కుర్చీలకు ఎసరు రాకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ కాదూ కూడదని ప్రభుత్వం ఇతర జిల్లాలకు బదిలీ చేసినా.. సెలవుపై వెలుతున్నారే తప్ప బాధ్యతలు తీసుకోవడంలేదు. -
ప్రగతి భవన్‌లోనే పంద్రాగస్ట్
సాక్షి, హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆగస్టు 15న ఉదయం 10.30 గంటలకు తన అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనడం ఆనవాయితీ. కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాపించి ఉన్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించాల్సిన ఈ వేడుకలను ఈసారి ప్రగతిభవన్‌కే పరి మితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. జిల్లా స్థాయిలో మంత్రులు, విప్‌లు.. జిల్లాస్థాయిలో మంత్రులు, ఇతర ముఖ్యులు స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా సంబంధిత జిల్లా కలెక్టరేట్లలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ముఖ్య అతిథుల జాబితాను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్ (జగిత్యాల), పువ్వాడ అజయ్‌కుమార్(ఖమ్మం), గంగుల కమలాకర్ (కరీంనగర్), వి.శ్రీనివాస్‌గౌడ్ (మహబూబ్‌నగర్), సత్యవతిరాథోడ్ (మహబూబాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (మెదక్), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్ మల్కాజ్గిరి), ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), వేముల ప్రశాంత్‌రెడ్డి (నిజా మాబాద్), ఈటల రాజేందర్ (పెద్దపల్లి), కె.తారకరామారావు (రాజన్న సిరిసిల్ల), రంగారెడ్డి (పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి), ఎండీ మహమూద్ అలీ (సంగారెడ్డి), టీ హరీశ్‌రావు (సిద్దిపేట), గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి), ఎర్రబెల్లి దయాకర్‌రావు (వరంగల్ రూరల్) అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (కామారెడ్డి), డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ (వికారాబాద్), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(నల్లగొండ), మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ (నారాయణపేట), చీఫ్ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు (జనగామ), దాస్యం వినయభాస్కర్ (వరంగల్ అర్బన్), ప్రభుత్వ విప్‌లు గంప గోవర్దన్ (ఆదిలాబాద్), రేగల కాంతారావు (భద్రాద్రి కొత్తగూడెం), టీ భానుప్రసాదరావు (జయశంకర్భూపాలపల్లి), కె.దామోదర్‌రెడ్డి (జోగులాంబ గద్వాల), అరికెపుడి గాంధీ (కుమ్రంభీం ఆసిఫాబాద్), బాల్క సుమన్ (మంచిర్యాల), ఎంఎస్ ప్రభాకర్‌రావు (ములుగు), గువ్వల బాలరాజు (నాగర్‌కర్నూల్), గొంగిడి సునీత (యాదాద్రి భువనగిరి) జిల్లా స్థాయిలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు, డీసీసీబీ/డీసీఎంఎస్ చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లాస్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. ఉదయం 9.30 గంటలకు వీరంతా తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించింది. మండల స్థాయిలో ఎంపీపీలు, గ్రామస్థాయిలో సర్పంచ్‌లు జాతీయను జెండాను ఆవిష్కరించాలని స్పష్టం చేసింది. కరోనా మమహ్మరి నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లను వినియోగించాలని ఆదేశించింది. -
సీఈలకే అధికారాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని.. సాగునీటి వసతులు పెరిగాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిం దన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరుల శాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు. జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలు ఉండగా.. వాటి సంఖ్యను 19కి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హౌస్‌లు, కాలువలు, సబ్స్టేషన్లు అన్నీ సీఈ పరిధి కిందికే వస్తాయి. గతంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ వంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై కేవలం జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగుతుంది. కాకతీయుల కాల్వల పునరుద్ధరణకు ఆదేశం.. మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పాకాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలనిæ అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించ వచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కాకతీయులు నిర్మించిన పాకాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమేనని వ్యాఖ్యా నించారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, డిప్యూటీ ఈఎన్సీ అనిత, డీడీఏ చందర్రావు, ఎస్ఈ ఆర్.కోటేశ్వర్ రావు, ఈఈలు కె.ప్రసాద్, ఎస్.విజయ్ కుమార్, డీఈఈ వెంకట నారాయణ, ఏఈఈ శివకుమార్, కేపీఎంఏ రత్నం పాల్గొన్నారు. -
రూ.400 కోట్లతో సచివాలయం నిర్మాణం
సాక్షి, హైదరాబాద్ : కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి రూ.400 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు జారీచేసింది. చెన్నైకు చెందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్స్ సంస్థ రూపకల్పన చేసిన కొత్త సచివాలయం భవన డిజై¯Œ ను ఆమోదించడంతో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి మూడు రోజుల క్రితం పరిపాలనా అనుమతులను సాధారణ పరిపాలన శాఖ జారీచేసింది. సచివాలయం నిర్మాణం కోసం మరో వారం రోజుల్లో గ్లోబల్ టెండర్లను పిలవనున్నారు. నెలాఖరులోగా పనులను ప్రారంభించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా సచివాలయం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తైంది. శిథిలాల తరలింపు ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. మరో వారం లేదా పదిరోజుల్లోగా శిథిలాల తరలింపు పూర్తి చేసి, కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా మొత్తం స్థలాన్ని చదును చేయనుంది. -
కరోనా.. పాఠం నేర్వాలి
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి వ్యాప్తితో ఎదురవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై కేంద్ర, రాష్ట్రాలు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడిపై 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌తోపాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, వైద్య శాఖ విభాగాధిపతులు శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి, గంగాధర్, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ఆయన మాటల్లోనే... వైద్య రంగం బలోపేతం కావాలి... ‘కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలి. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక రచించాలి. కేంద్ర, రాష్ట్రాలు కలసి ఈ ప్రణాళిక అమలు చేయాలి. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలి. గతంలోనూ అనేక వైరస్లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కరోనా లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకొనేలా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలి. ఐఎంఏ లాంటి సంస్థలను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఇది దేశానికి మంచి చేసే చర్య. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏన్ని వచ్చినా సరే తట్టుకొని నిలబడే విధంగా వైద్యరంగం తయారు కావాలి. దీని కోసం మీరు (ప్రధాని) చొరవ తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్రాలు కలసికట్టుగా పనిచేసి దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి చర్యలు... తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతంగా ఉంది. మరణాల రేటు 0.7 శాతంగా ఉంది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధం గా ఉంచాం. ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తోంది.’ -
భూములను పల్లీల్లా పంచిపెడతారా?
సాక్షి, హైదరాబాద్ : విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకు పల్లీల్లా పంచిపెడతారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎకరా రూ.2.5 కోట్లు విలువైన భూమిని రూ.5 లక్షలకు ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దర్శక, నిర్మాత ఎన్.శంకర్‌కు శంకర్పల్లి సమీపంలోని మోకిల్లాలో ఐదెకరాల భూమిని రూ.5 లక్షల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జె.శంకర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. రూ.50 కోట్లతో స్టూడియో నిర్మిస్తున్నారని శంకర్ తరఫున న్యాయవాది గోవిందరెడ్డి నివేదించారు. ప్రస్తుతం నిర్మాణం ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా.. భూమిని చదును చేయడంతోపాటు ప్రహరీగోడ నిర్మించామని, ధర్మాసనం ఆదేశాలతో యథాతథ స్థితి కొనసాగిస్తున్నామని తెలిపారు. ‘స్టూడియో నిర్మించి 300 మందికి ఉపాధి కల్పిస్తామని చెబితే ఇంత తక్కువ ధరకు భూమిని కేటాయిస్తారా? భూముల కేటాయింపులకు సంబంధించి ఒక స్పష్టమైన విధానం ఉండాలి. అక్కడ భూమి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇంత తక్కువ ధరకు భూమిని కేటాయించడానికి కారణాలేంటి? ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకునేలా ఉండాలి. ఈ భూ కేటాయింపుల్లో ప్రభుత్వ తీరు ఎంత మాత్రం సమర్థనీయంగా లేదు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలకు సైతం ఒక ప్రాతిపదిక ఉండాలి. భూకేటాయింపులు నిబంధనల మేరకే జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తెలియజేసేందుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాత«థస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు చేసే అధికారం ప్రజాప్రతినిధులకు లేదు సాక్షి, హైదరాబాద్: సచివాలయం ఆవరణలో నిధి ఉందనే విషయంపై దర్యాప్తు చేయడానికి మీరెవరని, అలా దర్యాప్తు చేసే అధికారం ప్రజాప్రతినిధులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ సచివాలయంలోని జీ బ్లాక్‌లో నిధి ఉందని భావిస్తే.. ఆర్కియాలజీ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించింది. సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి అనుమతించాలంటూ కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాపీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. సచివాలయం భవనాల కూల్చివేత ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ గతనెల 27, 30 తేదీల్లో డీజీపీకి వినతిపత్రం ఇచ్చినా అనుమతించలేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. అత్యంత పురాతనమైన ఆలయం, మసీదును పొరపాటున కూల్చామని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే వీటిని కూల్చారా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉందని, అలాగే జీ బ్లాక్ కింద నిధి ఉందనే వార్తలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో వాస్తవాలేంటో తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులుగా భవనాల కూల్చివేత ప్రాంతానికి అనుమతించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వినతిపత్రంపై డీజీపీ కార్యాలయం ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల గడువు కావాలని అభ్యర్థించడంతో.. ధర్మాసనం అందుకు అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది సాదాసీదాగా స్వాతంత్య్ర వేడుకలు.. 50 మందికి మించరాదు సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సాదాసీదాగా నిర్వహించాలని అన్ని కోర్టులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం కేవలం 50 మందికి మించకుండా, 20 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించాలని, ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించడంతోపాటు, న్యాయస్థానం ఆవరణను శానిటైజేషన్ చేయాలని అందరూ మాస్క్‌లు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకలకు మాజీ న్యాయమూర్తులు, సిబ్బందిని ఆహ్వానించరాదని స్పష్టం చేశారు. హైకోర్టు పీపీ పదవీకాలం పొడిగింపు సాక్షి, హైదరాబాద్: హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్‌లో పీపీగా ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు. క్రిమినల్ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి.. 1980లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి సంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1998–2002 మధ్య సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2003 నుంచి హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బార్ కౌన్సిల్ సభ్యుడిగా, ప్రస్తుతం తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. -
కరోనాపై నేరపూరిత నిర్లక్క్ష్యం : జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్ : కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కోవిడ్ మేనేజ్మెంట్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టులు నిలదీయడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ను గద్దె దింపి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందు కు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, వనపర్తి, నారాయణ పేట్, వికారాబాద్ జిల్లాల్లో బీజేపీ కార్యాల యాలకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా(ఆన్లైన్ ద్వా రా) ఆయా కార్యాలయాల పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రపంచానికే దారి చూపుతున్న మోదీ.. కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికే దారి చూపుతున్నారని, డబ్ల్యూ హెచ్‌వో, యూఎన్ లాంటి సంస్థలు కూడా భారత్‌ను చూసి నేర్చుకోవాలని కితాబు ఇచ్చా యని నడ్డా గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం అందించేందుకు ‘ఆయుష్మాన్ భారత్’ప్రవేశపెడితే కేసీఆర్ సర్కార్ దీన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని, దీంతో ఎంతోమంది నిరుపేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారని పేర్కొన్నారు. ఆక్సిజన్ అందక ఒక జర్నలిస్టు మృతి చెందడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. తెలంగాణలో మోదీ తరహా పాలన కావాలని కోరుకుంటున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఎంఐఎం, కమ్యూనిస్టు కార్యాలయాలు సంఘవిద్రోహ శక్తులు, ఉగ్రవాదులకు అడ్డాగా మారాయని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంటే కేసీఆర్ సర్కార్ బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని, టీఆర్ఎస్ను గద్దె దింపి బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అర్థంలేని వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహపూర్వకంగా మెలిగి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలుచేద్దామని చెప్పాం. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆం«ద్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం’అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వాపరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం, ఏపీ అభిప్రాయాలపై చర్చించారు. కేంద్రానిది కూడా తప్పే.. ‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’అని సీఎం అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించాలని నిర్ణయించారు. ‘శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరపెడుతోంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు. అది జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్ర హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు.. ‘గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వాటికి నీటి కేటాయింపులు కూడా జరిగాయి. సీడబ్ల్యూసీ సహా ఇతర సంస్థల నుంచి అనుమతులు వచ్చాయి. దాదాపు రూ.23వేల కోట్ల మేర నిధుల ఖర్చు చేశారు. 31,500 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం, అవివేకం. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైనప్పటికీ వాటిని పూర్తిచేయలేదు. పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారు. దీనివల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరవు. చాలా ప్రాజెక్టుల డిజైన్ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా చేయలేదు. అందువల్ల తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీ డిజైన్ చేసి నిర్మిస్తున్నాం. దీన్ని తప్పుబట్టడంలో అర్థంలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడంలేదనే అసంతృప్తితోనే, నీటి పారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది’అని కేసీఆర్ వివరించారు. అవన్నీ రీ డిజైన్ చేసిన ప్రాజెక్టులు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్‌సాగర్–ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మసాగర్ నిర్మిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పెన్‌గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏఏ అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చేనాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసినవారికి, సందేహాలు వెలిబుచ్చినవారికి తిరుగులేని సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించారు. ‘గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటినీ కొనసాగించాలని నిర్ణయించారు. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం’అని సీఎం పేర్కొన్నారు. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ చెప్పిందని, దాని ప్రకారం తెలంగాణ మంచినీటి కోసం వాడే 110 టీఎంసీల్లో 22 టీఎంసీలను మాత్రమే లెక్కకు తీసుకోవాలని స్పష్టంచేశారు. సాగునీటిలో తెలంగాణకు అంతులేని అన్యాయం... ‘సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగింది. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయి. నీటివాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ బచావత్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణనలోకి తీసుకోలేదని స్వయంగా ట్రిబ్యునల్ గ్రహించి, తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జూరాలతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగాం. ఆర్డీఎస్ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చితే.. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదు. ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయం చేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చింది. ఇలా సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉంది. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉంది. గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంటు ఏరియా ఎక్కువ. నది ప్రవహించేది తెలంగాణలోనే ఎక్కువ. రాష్ట్రానికి అవసరాలు కూడా ఉన్నాయి. సముద్రంలో కలిసే 2వేల టీఎంసీలలో తెలంగాణకు కనీసం వెయ్యి టీఎంసీలు కేటాయించాలి’అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. -
దుబ్బాక ఎమ్మెల్యే ‘సోలిపేట’ కన్నుమూత
సాక్షి, సిద్దిపేట : అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి (57) గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కాలిపై కురుపుతో బాధపడుతున్న ఆయన 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి 2.15 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం ఆయన స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పెద్దసంఖ్యలో అభిమానులు చిట్టాపూర్ తరలివచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కాలిపై కురుపుతో ఆస్పత్రిలో చేరి.. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కొంతకాలంగా కుడికాలుపై కురుపుతో బాధపడుతున్నారు. అది కాస్తా పెద్దదవడంతో జూలై 22న చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ డాక్టర్లు కాలికి శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇన్ఫెక్షన్ అయి.. శరీరమంతా వ్యాపించింది. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులతోపాటు, మెదడుకు కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో రామలింగారెడ్డి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్‌శాఖ మంత్రి తారకరామారావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి.. సోలిపేట ఆరోగ్య విషయమై డాక్టర్లతో సంప్రదించారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. అప్పటికే మూత్రపిండాలు, కాలేయం పనిచేయకపోవడంతో పది రోజులు మృత్యువుతో పోరాడిన సోలిపేట బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో గురువారం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని ఉదయాన్నే చిట్టాపూర్‌కు తరలించారు. సొంతింటి వద్ద పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నీ తానై అంత్యక్రియల ఏర్పాట్లను చూశారు. స్వయంగా పాడె మోసి రామలింగారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై సోలిపేట భౌతికకాయాన్ని ఉంచి చిట్టాపూర్‌లోని కూడవెల్లి వాగు ఒడ్డున ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ కుమారుడు సతీష్ తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు. కంటతడి పెట్టిన కేసీఆర్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి వార్త వినగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో సోలిపేట చికిత్స పొం దుతుండగానే పలుమార్లు ఆరోగ్య పరిస్థితి పై సీఎం ఆరాతీశారు. సోలిపేట మరణ వార్త తెలియగానే ప్రగతి భవన్ నుంచి హుటాహుటిన చిట్టాపూర్ చేరుకున్నారు. రామలింగారెడ్డి పార్థివదేహంపై పూలమాల ఉంచి నివా ళి అర్పించారు. కన్నీటి పర్యంతమవుతూ.. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డి వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటా నని ధైర్యం చెప్పారు. ఉద్యమకాలం నుంచి సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్దిసేపు అక్కడే విషణ్ణవదనంతో కూర్చుండిపోయా రు. రామలింగారెడ్డి ఆస్పత్రిలో చికిత్సపొం దిన తీరును, ఆయన మరణానికి కారణాల ను మంత్రి హరీశ్‌రావును అడిగి తెలుసుకు న్నారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని హరీశ్‌రావుకు చెప్పి వెళ్లిపోయారు. ప్రముఖుల నివాళి.. రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు చిట్టాపూర్‌కు చేరుకున్నారు. సోలిపేట పార్థివదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు, ఈటల రాజేందర్, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతిరాథోడ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి శుభాష్‌రెడ్డి, బోడెపూడి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, జోగు రామన్న, పెద్ది సుదర్శన్‌రెడ్డి, హన్మంత్ షిండే, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు హాజరై నివాళులర్పించారు. తీరని లోటు.. గవర్నర్, సీఎం సహా పలువురి నివాళి దుబ్బాక ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా సోలిపేట అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ అన్నారు. సోలి పేట మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దిగ్భ్రాంతి రామలింగారెడ్డి మృతి పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్ర మార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన సేవలు మరువలేనివి: బండి సంజయ్ సోలిపేట అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా సిద్దిపేటకు తీరని లోటని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రామలింగారెడ్డి కుటుంబీకులకు జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్ : కొత్త సచివాలయ భవనాన్ని ఏడాది కాలంలోనే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, రోడ్లు.. ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో ప్రధాన భవనాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది. భవన నిర్మాణానికి వీలుగా 4 రకాల విభాగాల నుంచి అనుమతులు పొందాల్సి ఉండటంతో అధికారులు ఆ కసరత్తు ప్రారంభించారు. అనుమతులు వచ్చేలోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. గుమ్మటం ఎత్తే 111 అడుగులు.. డెక్కన్–కాకతీయ శైలిలో రూపుదిద్దుకోబోతున్న తెలంగాణ సచివాలయ భవనం ఎత్తు 278 అడుగులు. ఇందులో మధ్యభాగంలో ఉండే ప్రధాన గుమ్మటం ఎత్తే ఏకంగా 111 అడుగులు కావటం విశేషం. మొత్తం ఏడంతస్తులుగా ఉండే భవనంలో.. ఈ గుమ్మటం ఎత్తు ఇంచుమించు 4 అంతస్తులతో సమానంగా ఉండనుందంటే దాని ఆకృతి ఎంత పెద్దదో ఊహించవచ్చు. ఇక గుమ్మటంపై 11 అడుగుల ఎత్తుతో నాలుగు సింహాలతో కూడిన అశోకముద్ర అలరారనుంది. భవనం పైభాగం మధ్యలో విశాలమైన స్కైలాంజ్ నిర్మిస్తున్నారు. ఇది గుమ్మటం దిగువ భాగమన్నమాట. ఈ స్కైలాంజ్ 50 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దానిపైన 50 అడుగుల ఎత్తుతో గుమ్మటం పైభాగం ఉంటుంది. నాలుగువైపులా రోడ్డు.. పాత సచివాలయానికి మూడు వైపులనే రోడ్డు ఉంది. కానీ కొత్త సచివాలయ భవనానికి వెనక వైపు కూడా రోడ్డు నిర్మించనున్నారు. వెరసి నాలుగువైపులా రోడ్డు ఉండబోతోంది. రోడ్డు రూపంలో గతంలో ఎదురైన వాస్తు దోషం.. దీంతో సరిదిద్దినట్టు కానుందని సమాచారం. మింట్ భవనం–సచివాలయం మధ్య నుంచి ఇప్పుడు కొత్తగా రోడ్డును నిర్మించనున్నారు. గతంలో జీ బ్లాక్ ఉన్న ప్రాంతానికి కాస్త అటుఇటుగా ప్రధాన భవనం నిర్మితం కానుంది. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ ప్రాంతం కొత్త సచివాలయ ప్రహరీ ఆవలివైపు చేరనుండటం విశేషం. ప్రస్తుతమున్న తెలంగాణ సచివాలయ ప్రవేశద్వారం కనుమరుగు కానుంది. హుస్సేన్‌సాగర్ వైపు ఉన్న పాత ప్రవేశద్వారమే ఉండనుంది. –ప్రవేశద్వారం వద్ద ఉండే పోర్టికో పైన జాతీయపతాక దిమ్మె ఏర్పాటు చేస్తున్నారు. –కొత్త సచివాలయ బేస్మెట్కు రాజస్తాన్‌లోని ధోల్పూర్లో లభించే ఎర్ర రాతిని వినియోగించనున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనాన్ని ఈ రాతితోనే నిర్మించారు. –ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఏడో అంతస్తు కిటికీలు బుల్లెట్ ప్రూఫ్‌తో ఉండనున్నాయి. –భవనం మొత్తం తెలుపు రంగుతో తళతళలాడనుండగా, కిటికీలు మాత్రం నీలిరంగు అద్దాలతో కొత్త అందాలు ఒలకబోయనున్నాయి. –ఇక ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450 కోట్లు. –మరో ఐదారు రోజుల్లో కూల్చివేత శిథిలాల పూర్తిగా తొలగించనున్నారు. ఆ వెంటనే పర్యావరణ అనుమతులు, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ, ఎయిర్‌పోర్టు అథారిటీల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నారు. -
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ను వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని కోరింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబం« దించిన డిజైన్లను ఆమోదించింది. బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు కరోనా వ్యాప్తి – వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స– ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. ‘కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని వైద్య నిపుణులు కేబినెట్ కు వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేబినెట్ ఉద్ఘాటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్ ప్రజలను కోరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎంత డబ్బుకైనా వెనకాడేది లేదని స్పష్టం చేసింది. – రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్, డెక్సామితజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. కోవిడ్ చికిత్సపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి. – పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలి. 10 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలి. – రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలి. – ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించుకునేందుకు కలెక్టర్లకు అధికారం. – కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. – ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెలవారీగా ఖచ్చితంగా విడుదల చేయాలి. –ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. – ప్రతీ రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు పెట్టాలనే సీఎం నిర్ణయాన్ని కేబినెట్ అభినందించింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. వలస కార్మికుల సంక్షేమానికి పాలసీ లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా కళ్లారా చూసిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్నవారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులు ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. టీఎస్–బీపాస్‌కు ఆమోదం భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్–బీపాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టీఎస్–ఐపాస్ లాగానే టీఎస్–బీపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానిక సంస్థలకు వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాత విద్యుత్ బిల్లుల బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది – ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. – కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించింది. –దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానించింది. – రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ దాదాపు రెండున్నర గంటలు చర్చించింది. నియంత్రిత పద్ధతిలో 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10–12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. -
తెలంగాణ: నేడు కీలక కేబినెట్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవ్వనుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోనుంది. కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. చెన్నైకి చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్–పొన్ని జంట రూపొందించిన సచివాలయం డిజైన్‌ను ఇప్పటికే సీఎం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ డిజైన్‌కు మెరుగులు దిద్ది తుదిరూపు ఇచ్చేందుకు గత రెండు వారాలుగా సీఎం కేసీఆర్ కసరత్తు నిర్వహించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది డిజైన్‌ను ఆమోదించడంతో పాటు నిర్మాణ పనుల అంచనా వ్యయం, టెండర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో సచివాలయం భవనాన్ని నిర్మించాలని సీఎం యోచిస్తున్నారు. సీఎం, మంత్రులు, శాఖల కార్యద ర్శులు అందరూ ఒకే గొడుగు కింద పని చేసేందుకు సకల సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్టప్ ఏరియాతో కొత్త సచివాలయ భవనాన్ని దాదాపు రూ.450 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి. ఒక్కో ప్రభుత్వ శాఖకు చెందిన మంత్రి, కార్యదర్శి, ఇతర అధికారులు, సిబ్బంది అందరూ ఒకే దగ్గర ఉండేలా సచి వాలయం నిర్మాణం ఉండనుంది. సచివాలయం అణు వణువు వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించాలని, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేయడా నికి అవకాశం ఉండరాదని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం డిజైన్‌కు తుదిరూపం ఇచ్చి కేబినెట్ ముందు ఉంచనున్నారు. ఇక డిజిటల్ చదువు..! కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో విద్యా సంస్థలను తెరవడం ఏ మాత్రం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్య, డిజిటల్ బోధన తరగతులు ప్రారంభించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఆగస్టు 31 వరకు విద్యా సంస్థలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యార్థులకు డీడీ యాదగిరి, టీ–శాట్ చానళ్ల ద్వారా వీడియో పాఠాలను ప్రసారం చేసే అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. వీటికి సంబంధించిన తేదీలను ప్రకటించే అవకాశముంది. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సైతం డీడీ యాదగిరి, టీ–శాట్ ద్వారా వీడియో పాఠాలు ప్రసారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రం ఆగస్టు 17 నుంచి ఆన్లైన్ పాఠాలు ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా నియంత్రణ ఎలా..? నగరాలు, పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో కరోనా నియంత్రణ, టెస్టుల నిర్వహణ, రోగులకు వైద్య సదుపాయాలు కల్పించే అంశాలపై మంత్రివర్గం చర్చించి పలు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పీహెచ్సీ స్థాయిలో వైద్యులకు కరోనా చికిత్సపై శిక్షణ ఇవ్వడం, టెస్టులు నిర్వహణకు ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశముంది. వీటితో పాటు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం తీరు తెన్నులు, రైతు వేదికల నిర్మాణం తదితర అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, రిటైర్మెంట్ వయసు పెంపు, పీఆర్సీ అమలు, లాక్డౌన్ కాలంలో కోత పెట్టిన సగం జీతాలను చెల్లించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి. వీటిపై ప్రభుత్వం నుంచి ఏమైనా నిర్ణయాలు రావచ్చని ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు. కేబినెట్ ఎజెండాలో ఈ విషయాలు లేకపోయిన టేబుల్ ఎజెండాగా వీటిని కేబినెట్ ముందు పెట్టి ఏమైన నిర్ణయాలు తీసుకోవచ్చని సచివాలయ ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. -
ఈనెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విభృంభణ కొనసాగుతున్న తరుణంలో ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. కరోనా నియంత్రణ, వైరస్ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులను కేబినెట్ చర్చించనుంది. అలాగే కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు వంటి అంశాలు మంత్రిమండలి ముందుకు చర్చకు రానున్నాయి. -
తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్
-
తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా పరిస్థితులపై ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదివారం ఫోన్ చేసి కరోనా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మోదీ ఫోన్ చేశారు. కరోనా తీవ్రత, కట్టడికి చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. అలాగే వైరస్‌ను నివారించుటకు పలు సూచనలు, సలహాలు సైతం చేశారు. (కొనసాగుతున్న మహమ్మారి విజృంభణ) మరోవైపు వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న బిహార్, అసోం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ముచ్చటించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా పరీక్షలను రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు మోదీ అభినందనలు తెలిపారు. కాగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్ మంత్రాన్ని పాటిస్తున్నాయి. -
సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్
-
సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : సచివాలయం కూల్చివేత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పాత భవనాల కూల్చివేతకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో పాత వాటిని తొలగించడానికి కేంద్ర పర్యవరణ శాఖ అనుమతులు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం నూతన నిర్మాణాలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమన్న అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ప్రస్తుతమున్న భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపింది. అలాగే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. (సచివాలయ వివాదం : సర్కార్‌కు ఊరట) ఈ మేరకు కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. అంతకుముందు రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం కూల్చివేతలకు ముందస్తు పర్యావరణ అనుమతి అవసరంలేదని హైకోర్టుకు నివేదించింది. దీంతో ఆయా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కాగా ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సచివాలయం నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. -
విద్యార్థులకు శుభవార్త: కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల భలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కళాశాల్లో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన సర్కార్.. దానిలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్ననికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని అధికారులు గతంలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కాలేజీల్లో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. (ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం) డ్రాపవుట్స్ నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారు. -
విద్యాశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వర్సిటీ పరీక్షల నిర్వహణ, విద్యార్థులను ప్రమోట్ చేసే అంశంపై సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అధికారులు అడిగి తెలుసుకున్నారు. వారి సూచనల మేరకు ఫైనలియర్ విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు సైతం యూజీసీ వాయిదా వేసింది. -
టెన్త్ పరీక్షలు : కేసీఆర్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో టెన్త్ పరీక్షల నిర్వహణపై విద్యామంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్య అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించాలా? లేదా ప్రమోట్ చేయాలా? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, ప్రముఖలతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది. పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రమోట్ చేస్తేనే బాగుంటుందని ప్రభుత్వానికి ఇప్పటికే సూచనలు, సలహాలు అందుతున్నాయి. వాటిపై కూడా రేపటి సమావేశంలో చర్చించనున్నారు.(టెన్త్ పరీక్షలు మళ్లీ వాయిదా) కాగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పరీక్షలను వాయిదా వేసి మిగతా జిల్లాల్లో నిర్వహించుకోవచ్చని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులతో చర్చించిన కేసీఆర్ రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని భావించి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురైయ్యారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం స్థాయిలో కీలక సమావేశం ఏర్పాటు చేసి పదో తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కరోనా నివారణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. -
తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అధికారులతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి తీర్పుపై చర్చించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు శనివారం సాయంత్రం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల వాయిదాకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రెండుసార్లు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం భావించింది. అనేక కోణాల్లో సమాలోచనల అనంతరం మొత్తం పరీక్షలను వాయిదా వేసి పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఒక్కసారే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. (టెన్త్ పరీక్షలపై హైకోర్టు తీర్పు) ప్రభుత్వ తాజా నిర్ణయంపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కాగా రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరతూ.. బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు నిర్వహణకు అనుమతినిస్తూ.. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
కేసీఆర్ కీలక నిర్ణయం : నిషేధం ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదోవిడత లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనూ జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే లాక్డౌన్ వర్తించనుంది. కంటైన్మెంట్ కాని ప్రాంతాల్లో జూన్ 7 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. అలాగే అంతరాష్ట్ర సర్వీసులపై కేంద్రం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అంతరాష్ట్ర రాకపోకలకు అనుమతినిచ్చింది. దీంతో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వాహనాలు గ్రీన్‌సిగ్నల్ పడింది. అయితే బస్సులను ఎప్పటి నుంచి అనుమతించాలనేదానిపై ప్రభుత్వం తేదీని ప్రకటించనుంది. ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్ 1వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమలవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. (మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ) ఆదివారం ప్రగతి భవన్లో అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కంటైన్మెంట్ జోన్లో లాక్డౌన్ జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఇక జూన్ 8వ తేదీ నుంచి మతపరమైన స్థలాలు, ప్రార్థన మందిరాలను ప్రజల దర్శనార్థం తెరుచుకోవచ్చని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. వీటికి తోడు హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు ఇతర ఆతిథ్య సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. అయితే వీటిపై పూర్తి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం వదిలేసింది. (‘నమస్తే ట్రంప్’తోనే వైరస్ వ్యాప్తి..! ) -
‘కొండ’నెక్కిన గోదారి గంగమ్మ!
-
వారం రోజుల్లోనే పెద్ద తీపి కబురు చెప్తా: కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రైతులకు వారం రోజుల్లోనే పెద్ద తీపికబురు చెబుతానని ప్రకటించారు. భారత్‌లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు కోసం భూములు ఇచ్చినవారి త్యాగాలు వెలకట్టలేనివని సీఎం పేర్కొన్నారు. భూములు కోల్పోయినవారందరికీ పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు వచ్చాయని అన్నారు. నిర్వాసితుల త్యాగాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. (చదవండి: కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం.. ) కష్టాల పాటల నుంచి పసిడి పంటలవైపు.. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ప్రారంభం ఉజ్వల ఘట్టమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఏ లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామో ఆ కల సంపూర్ణంగా, సాదృశ్యంగా సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ అపురూపమైన ప్రాజెక్టు అని సీఎం వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల్లోనే దుమ్ముగూడెం దగ్గర సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టు కోసం సమ్మక్క సాగర్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. హుస్నాబాద్ దగ్గర గౌరవెళ్లి, గండిపెల్లి ప్రాజెక్టు కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ పేరుతెచ్చుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితం కష్టాల పాటలు పాడుకున్న తెలంగాణ ఇప్పుడు పసిడి పంటల రాష్ట్రంగా మారిందని కేసీఆర్ వెల్లడించారు. (చదవండి: తెలంగాణ సాగునీటి కల సాకారం) -
దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రిప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. టాలీవుడ్ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. సినిమా షూటింగులు, ప్రిప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున ప్రిప్రొడక్షన్, షూటింగుల నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న ప్రిప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. (కేసీఆర్‌తో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ) సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని కేసీఆర్ అన్నారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సీఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, అప్పటికే పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు. -
సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాలని ఈ భేటీలో కోరారు. షూటింగ్‌లు ఎప్పుడు ఆరంభించాలి? థియేటర్లను ఎప్పుడు తెరవాలి? వంటి విషయాల గురించి ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించారు. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున పరిమిత సంఖ్యలో షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని సీఎంను కోరారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూనే షూటింగ్స్ జరుపుకుంటామని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఆయా రంగాల్లో ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. అదే తరహాలో సినీ రంగంలో ముఖ్యంగా షూటింగ్స్ నిర్వహించడానికి వీలు కల్పించాలని కోరారు. సినీ ప్రముఖుల విజ్ఞప్తిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భేటీ అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. షూటింగ్స్‌పై ఇప్పటికే విధి విధానాలు తయారు చేసామని మరో రెండుసార్లు సమావేశమై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా ఇదివరకే చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో జరిగిన సమావేశంలో అనుమతులు కోరిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తో సమావేశానికి హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, సురేష్‌బాబు, దిల్ రాజు, కొరటాల శివ, జెమిని కిరణ్, సి.కల్యాణ్ హాజరు అయ్యారు. (సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం) -
కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలోనూ తెలంగాణ రాష్ట్రం తన సత్తా చాటింది. ఐటీ ఎగుమతుల్లో వరుసగా ఐదోసారి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదికి గాను తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించింది. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం సమర్పించారు. 2019-20 ఏడాదిలో జాతీయ జాతీయ వృద్ది రేటు 8.9శాతంగా నమోదు కాగా.. రాష్ట్ర ఎగుమతులు 17.93 శాతంగా నమోదు అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఐటీశాఖ మంత్రిని సీఎం కేసీఆర్ అభినందించారు. కరోనా కష్టకాలంలోనూ ఐటీ పరిశ్రమను సజావుగా నడిపించారని కితాబిచ్చారు. భవిష్యత్‌లోనూ ఇదే పట్టుదలను ప్రదర్శించాలని సీఎం సూచించారు. కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు 2018-19లో రూ. 1,09,219 కోట్లు ఉండగా.. అది 2019-20లో రూ. 1,28,807 కోట్లకు పెరిగింది. -
కరోనా : తెలంగాణపై కేంద్రం ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాపై ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్‌లో తీవ్ర నష్టం ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి గురువారం లేఖ రాశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. (తెలంగాణలో కొత్తగా 27 కేసులు) దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కవ పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడింది. ఇక కేంద్ర ఆరోగ్యశాఖ రాసిన లేఖపై రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఐసీఎంఆర్ నిబంధల ప్రకారమే కరోనా పరీక్షలు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. పరీక్షలపై ప్రజలెవరూ ఆందోళన చెందటం లేదని వివరించారు. (24 గంటల్లో 132 మంది మృతి) కాగా కేంద్రం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటించిన ఫ్యాకేజీ అంతా అబద్ధమంటూ కేసీఆర్ విమర్శలు చేశారు. దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తన చర్చ జరుగుతున్న క్రమంలోనే కరోనా టెస్టులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. -
రాయలసీమకు నీళ్లు ఎందుకు పోవద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : సముద్రం పాలయ్యే నీళ్లు సీమకు తరలించడంలో తప్పేం లేదని, రాయలసీమకు నీళ్లు ఎందుకు పోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తెలిసీ తెలియక మాట్లాడేవారి గురించి తాను పట్టించుకోనన్నారు. నీటి వాటాలకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అందరికి మంచి జరగాలన్నదే మా ఆశ. ప్రజల అవసరాల కోసం నీళ్లు తీసుకోవటంలో తప్పులేదు. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు. చంద్రబాబు బాబ్లీ బోగస్ పంచాయితీతో ఏం వచ్చింది?. దాని వల్ల ఒక్క టీఎంసీ కూడా సాధించలేదు. ఘర్షణ వాతావరణం ఏ రాష్ట్రానికి అవసరం లేదు. మాకు రెండు నాల్కలు లేవు. గోదావరిలో మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేద’’ని స్పష్టం చేశారు. చదవండి : కేంద్రం తన పరువు తానే తీసుకుంది: కేసీఆర్ -
త్వరగా సొంతూళ్లకు చేర్చండి
సాక్షి, హైదరాబాద్ : ‘మండు వేసవిలో పిల్లలు, కుటుంబాలతో లక్షల మంది వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తుండటం అత్యంత బాధాకరం. వీలైనంత త్వరగా వారిని సొంతూళ్లకు పంపించాలి. అప్పటిదాకా ఆహార, వసతి, వైద్య సదుపాయాలను కల్పిస్తామన్న హామీ ఇవ్వాలి. వారి హక్కులను, గౌరవాన్ని నిలబెట్టాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వంద మందికిపైగా పౌర సంఘాల ప్రతినిధులు, ప్రముఖ యాక్టివిస్టులతో కూడిన కోవిడ్–19 అడ్వొకసీ లాక్డౌన్ కలెక్టివ్ విజ్ఞప్తి చేసింది. క్షేత్రస్థాయిలో వలస కార్మికుల ఆకలిదప్పికలను తీర్చుతూ వారికి చేదోడువాదోడుగా ఉంటున్న ఈ సంస్థ గత వారం రోజులుగా తమ దృష్టికి వచ్చిన అంశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ నుంచి ఇప్పటివరకు 45 రైళ్ల ద్వారా 50,822 మంది వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపించారని వార్తలొచ్చాయి. స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న కార్మికుల సంఖ్యతో పోలిస్తే వారిని తరలించేందుకు ఏర్పాటుచేస్తున్న శ్రామిక్ రైళ్ల సంఖ్య చాలా తక్కువ. అది కూడా రాత్రిపూట, ఊరి అవతల స్టేషన్ల నుంచి రైళ్లను నడుపుతుండటంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. పోలీసు స్టేషన్లలో వలస కార్మికుల నమోదు నెమ్మదిగా జరుగుతోంది. ఒక్కో స్టేషన్లో రోజుకు 200 మందికి మించి నమోదు చేసుకోవడం లేదు. ఠాణాల ముందు రోజుల తరబడి బారులు తీరి నిలబడాల్సి వస్తోంది. కార్మికుల నివాస ప్రాంతాలకు వెళ్లి మూకుమ్మడి నమోదు కార్యక్రమం చేపడితే ఉపయోగంగా ఉంటుంది. మూవ్మెంట్ పాస్ ఫర్ రైల్వే స్టేషన్ పాసుల్లో కార్మికుల వివరాలతోపాటు సంతకం చేసే అధికారి పేరు కూడా ఉండాలి. చాలా పాసుల్లో అధికారి సంతకం, తేదీ లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కార్మికులను ఆర్టీసీ బస్సుల ద్వారా స్వరాష్ట్రాలకు పంపడానికి ఆయా ప్రభుత్వాలతో చర్చించి చర్యలు చేపట్టాలి. వలస కార్మికులంతా స్వస్థలాలకు చేరే దాకా ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలి. ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో రోజుకు రెండుసార్లు ఆహారం అందజేసే ఏర్పాట్లు చేయాలి. స్వరాష్ట్రాలకు వెళ్లే అవకాశం లేక రాష్ట్రంలో చిక్కుకుపోయిన ప్రతి వలస కార్మిక కుటుంబానికీ 12 కేజీల బియ్యం, రూ.1,500 నగదు ఇచ్చే జీవోను మరో మూడు నెలలు అమలు చేయాలి. కార్మికులను కొట్టడం, వేధించడం, తరిమేయడం చేయవద్దని రైల్వే స్టేషన్లు, ఇతర చోట్లలో పని చేస్తున్న పోలీసులకు ఆదేశాలివ్వాలి. వలస కార్మికులకు సమాచారంతోపాటు సహాయం అందించడానికి ప్రతి రైల్వేస్టేషన్, ప్రతి పోలీసు స్టేషన్, తాలూకా ఆఫీసులు, కీలక రహదారుల కూడళ్ల వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలి. ప్రయాణ, వైద్య అనుమతి పత్రాల పేరుతో వలస కార్మికుల నుంచి డబ్బు గుంజుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ–పాసులు, ఎస్ఎంఎస్–1, ఎస్ఎంఎస్–2లలో విషయమంతా ఆంగ్లంలో ఉండటంతో కార్మికులకు అర్థం కావట్లేదు. పాసు ఇవ్వడానికీ, ఎస్సెమ్మెస్–2 (అదే అసలు అనుమతి పత్రం) రావడానికీ మధ్య చాలా వ్యవధి ఉండడం కూడా పెద్ద సమస్యే అవుతోంది. దుండిగల్, మాదాపూర్, ముషీరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు లింగంపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, మేడ్చల్, సికింద్రాబాద్ స్టేషన్ల వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. పోలీసులు తరిమేస్తుంటే నిరాశతో వెనుదిరుగుతున్నారు. చాలా చోట్ల రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు కార్మికులకు వాహన వసతి కల్పించట్లేదు. కాలికి కట్టుతో కనిపిస్తున్న ఈ బాలుడు కర్ణాటక నుంచి కుటుంబంతో కలసి ఉత్తరప్రదేశ్ వెళ్తూ హైదరాబాద్ శివార్లలో శనివారం ఇలా సేదతీరుతూ కనిపించాడు. ఎర్రటి ఎండలో నడిచి నడిచి కాళ్లకు పుండ్లు పడటంతో అతని తల్లిదండ్రులు కేవలం ఓ బట్టను ఇలా కాలికి చుట్టారు. వలస కార్మికుల కోసం మేడ్చల్ హైవేపై స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన సహాయ శిబిరం దగ్గర్లో ఓ తల్లి వారం రోజుల పసిగుడ్డుతో దుమ్ములో నిస్సహాయంగా కూర్చొని ఉండగా అక్కడి వారు గమనించారు. బిడ్డ ఒంటిపై బట్టలు కూడా లేవు. భూమిక వుమెన్స్ కలెక్టివ్ నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి తన కారులో ఉన్న టవల్‌ను ఆ శిశువుపై కప్పేందుకు ఇవ్వడంతోపాటు 700 కి.మీ. దూరంలో ఉన్న గడ్చిరోలి జిల్లాలోని ఆమె సొంతూరుకు వెళ్లేందుకు రూ. 20 వేలతో కారును ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు పోలీసుల నుంచి అనుమతి ఇప్పించారు. శనివారం ఈ మహిళ తన పాపతో ఇంటికి క్షేమంగా చేరుకుంది. వారం రోజుల పసిపాపతో ఉన్న ఈమె పేరు చమేలీ. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో భర్త, పసిపాపతో కలసి సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన పయనమైంది. వారి కష్టాన్ని చూసి చలించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సొంతూరుకు పంపేందుకు వీలుగా నగర శివార్ల వరకు తన వాహనంలో దింపారు. అక్కడి నుంచి ఓ ట్రక్కులో ఆ కుటుంబం శనివారం రాత్రి స్వరాష్ట్రం బయలుదేరింది. -
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై చర్చించేందుకు సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ భేటీ జరిగింది. కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ పొడిగింపుపై ముఖ్యంగా మంత్రి మండలి చర్చించింది. గ్రీన్జోన్లలో మద్యం షాపులు తెరవడంతోపాటు.. మద్యం ధరలను పెంచే విషయాన్ని కేబినెట్ పరిశీలించనుంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈనెలాఖరు వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్డౌన్ పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. (మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా మద్యం విక్రయం) అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్లోనూ లాక్డౌన్ పొడిగించనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. పొరుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరవడంతో తెలంగాణలో షాపులు తెరుస్తారా..? లేదా అనేది ఉత్కంఠగా మారింది. దీనిపై నేటి మీడియా సమావేశంలో కేసీఆర్ తుది నిర్ణయం వెల్లడించనున్నారు. -
లాక్డౌన్: కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 17 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రకటించిన విధంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఆంక్షల నుంచి సడలింపులు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, చికిత్స, తాజా పరిస్థితులతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 5న ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశమై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. (దేశవ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు) కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. మరోవైపు తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రజా రవాణతో పాటు మద్యం దుకాణాలు తెరవడం అనేది కీలకంగా మారింది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం మద్యం అమ్మకాలకు అప్పుడే అనుమతులు ఇవ్వకపోవచ్చు అనేది ప్రముఖంగా వినిపిస్తోంది. బస్సులు నడపడం, మద్యం అమ్మకాలకు సామాజిక దూరం అనేది ఖచ్చితమైన నేపథ్యంలో అది కష్టతరమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అమలుకు ఉన్న అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా అంటురోగాల నియంత్రణ చట్టం, విపత్తుల నిర్వహణ చట్టాల ప్రకారం సడలింపులతో నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో లాక్‌డౌన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. (లాక్డౌన్ ఎత్తివేస్తే ఇక అంతే) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అన్నపూర్ణ మన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి వసతి పెరుగుతున్నందున రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతోందని, రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారుతోందని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. పంటల విస్తీర్ణం, దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు, 2,500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశిం చారు. యాసంగి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో రైతులు తీవ్ర వ్యథకు గురయ్యారని, తెలంగాణ వచ్చిన తర్వాత రైతు సంక్షేమం– వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి కొంత మెరుగైందని, ఈ విషయంలో మరింత కృషి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే... ఏటా 3 కోట్ల ఎకరాల్లో సాగు.. ‘ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరి, కృష్ణా నదుల్లో భవిష్యత్తులో 1300 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం కలుగుతుంది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో సాగునీటి లభ్యత పెరిగింది. ప్రాజెక్టులు, చెరువులు, బోర్ల ద్వారా కోటీ 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు, 10 లక్షల ఎకరాల్లో 3 పంటలు పండే చాన్స్ ఉంది. ఏడాదికి తెలంగాణలో 3 కోట్ల ఎకరాల్లో పంట పండుతుంది. ఇందులో కోటికి పైగా ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతుంది. ఇప్పుడు పండుతున్న పంటకు రెట్టింపుకన్నా ఎక్కువ దిగుబడులు వస్తాయి. ఈ దిగుబడులకు మద్దతు ధర వచ్చే వ్యూహాన్ని ఖరారు చేయడం మన కర్తవ్యం. వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ, రైతుబంధు సమితి ఈ దిశగా అడుగులు వేయాలి. పౌర సరఫరాల సంస్థ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రైతులకు మద్దతు ధర ఇవ్వడంతోపాటు ప్రజలకు బియ్యం, పప్పుల వంటి ఆహార దినుసులను తక్కువ ధరల్లో అందించే విధంగా పౌర సరఫరాల సంస్థ తన కార్యకలాపాలను విస్తరించుకోవాలి. ధాన్యం, కందులు, శెనగలు, పెసర్లు వంటివి కొనుగోలు చేసి, వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా బియ్యం, పప్పులు తదితర వినిమయ సరుకులుగా మార్చి ప్రజలకు అందించాలి. దీనివల్ల అటు రైతులకు మేలు కలుగుతుంది. ఇటు ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహార దినుసులు లభిస్తాయి. ఈ దిశగా సంస్థ కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. చదవండి: గుడుంబా గుప్పు.. పల్లెకు ముప్పు వ్యవసాయ శాఖ చెప్పిన పంటే పండించాలి రైతులంతా ఒకే పంట వేసే విధానం పోవాలి. ప్రజలకు అవసరమైన, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వ్యవసాయ శాఖ గుర్తించాలి. రైతులు అవే వేయాలి. ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేయడానికి అనువైనదో వ్యవసాయ శాఖ మార్గదర్శకం చేయాలి. ఎవరు ఏ పంట వేస్తున్నారో కచ్చితంగా రికార్డు చేయాలి. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. నియంత్రిత పద్ధతిలో పంటలు వేయాలి. నియంత్రిత పద్ధతిలోనే కొనుగోళ్లు జరగాలి. ఇందుకు అవసరమైతే ప్రస్తుత చట్టంలో మార్పులు తేవడానికి కూడా సిద్ధం. మే నెలలోనే ఎరువులు కొనుక్కోవాలి సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ఎరువులు, విత్తనాల అవసరం గతంలో కన్నా పెరగనుంది. ఈ వర్షాకాలంలో 22.30 లక్షల టన్నుల ఎరువులు అవసరం. జూన్‌లో వాడడానికి అవసరమైన ఎరువులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. రెతులు వాటిని మే మాసంలోనే కొనుగోలు చేయాలి. రైతులంతా ఒకేసారి ఎరువుల దుకాణాల మీద పడకుండా ఏఈవోలు వారిని సమన్వయపరచాలి. విత్తనోత్పత్తి చేసే రైతులు నేరుగా కంపెనీలతో ఒప్పందం చేసుకుని సాగు చేయాలి. నకిలీ ఎరువులు, పురుగుమందులు, కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే కఠినాతి కఠినంగా శిక్షిస్తాం. అదనంగా గోదాముల నిర్మాణం... గత ఐదేళ్లలో చేసిన కృషి వల్ల 22.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గోదాము ఉండాలి. ప్రభుత్వ స్థలాల లభ్యతను బట్టి మండల కేంద్రాల్లో కూడా నిర్మించాలి. ఏడెనిమిది నెలల్లోనే వీటి నిర్మాణం పూర్తి కావాలి. 5వేల ఎకరాలకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశాం. ప్రతీ క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని కూడా నియమించాం. క్లస్టర్లవారీగా రైతులు ఎప్పటికప్పుడు కలుసుకుని చర్చించుకోవడానికి వీలుగా వెంటనే క్లస్టర్‌కు ఒకటి చొప్పున 2,500 రైతువేదికలు నిర్మించాలి’అని సీఎం ఆదేశించారు. చదవండి: ఆన్లైన్ విద్య.. ఆబ్జెక్టివ్ పరీక్షలు! -
ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ సంబురం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సోమవారం పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 9.30కి కార్యాలయ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో పార్టీ నేతలను తెలంగాణ భవన్‌లోకి అనుమతించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తున్న కేసీఆర్. చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేకే తదితరులు రక్తదాన శిబిరం ఏర్పాటు ఆవిర్భావ దినం సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పలువురు నేతలు రక్తదానం చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ వారం పాటు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యకర్తలకు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. జై కొడితే జంగు సైరనయ్యింది కేటీఆర్ ట్వీట్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సామాజిక మా«ధ్యమ వేదిక ట్విట్టర్ ద్వారా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలంలో తాను పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఒక్క పిడికిలి బిగిస్తే బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు. ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది. స్ఫూర్తిప్రదాతా వందనం. ఉద్యమ సూర్యుడా వందనం. 20 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
కరోనా.. తగ్గుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తంచేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో దేశ పరిస్థితి కూడా తెలుస్తుందని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, జరుగుతున్న సహాయక కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ నిరోధానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు సరిగ్గా అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్మెంట్లలో అమలవుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. కంటైన్మెంట్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాలు అందజేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మరణాలు రేటు జాతీయ సగటుకన్నా తక్కువ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. చదవండి: వందేళ్ల క్రితం ఏం జరిగింది..? భవిష్యత్తు కార్యాచరణపై నేడు స్పష్టత.. లాక్‌డౌన్‌ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా> తగ్గిపోయే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. ‘‘సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితి వివరిస్తారు. దేశవ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా ఈ కాన్ఫరెన్స్‌లో అభిప్రాయాలు వస్తాయి. తద్వారా భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’అని తెలిపారు. సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, శాంత కుమారి, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
జలదృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా..
సాక్షి, హైదరాబాద్ : ‘ఒక లక్ష్యంతో ఆవిర్భవించిన రాజకీయ పార్టీ దేశంలో 2 దశాబ్దాల పాటు మనగలగడం ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైంది. తానెంచుకున్న ఎజెం డాను విజయవంతంగా అమలుచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లడం కూడా ప్రజల సహకారంతోనే సాధ్యమవుతోంది’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ‘జలదృశ్యం’నుంచి ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి.. కేసీఆర్ నాయకత్వంలో ఒక సుజల దృశ్యాన్ని ఆవిష్కరించే స్థాయికి చేరుకుందన్నారు. టీఆర్ఎస్ 19ఏళ్లు పూర్తిచేసుకుని ఏప్రిల్ 27న 20వ పడిలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆదివారం మీడియాతో ప్రగతిభవన్‌లో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అంతకుముందు ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతిభవన్‌లో రక్తదానం చేశారు. ఉద్యమ నేత.. పాలనాదక్షుడు ‘పదునైన ఉద్యమ నాయకుడు పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకోవడం కేసీఆర్‌లో చూశా’అని అరుణ్‌జైట్లీ గతంలో ఓసారి అన్నారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒక లక్ష్యాన్ని అనుకుని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్‌రావు వంటి ఎందరో మేధావులు, తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ సాధ్యమైంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన టీఆర్ఎస్ రెండు దశాబ్దాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. స్వాతంత్య్రం తర్వాత జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో రెండు దశాబ్దాలుగా మనుగడ సాధించిన పార్టీలు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నాయి. రెండు దశాబ్దాలకు పైబడి ప్రజా జీవితంలో ఉన్న ఒకపార్టీకి ఇంత ఆదరణ, అభిమానం లభించడం అపురూపం. ప్రస్తుతం 60లక్షల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ను అజేయశక్తిగా నిలిపిన కార్యకర్తలు, ప్రజలకు శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా. ఆదివారం ప్రగతి భవన్లో రక్తదానం చేస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణలో ‘పంచ విప్లవం’ గతంలో బెంగాల్, గుజరాత్ నమూనాల తరహాలో, ప్రస్తుతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తోంది. తెలంగాణలో జల విప్లవం ఆధారంగా రెండో హరిత విప్లవం, నీలి విప్లవం (మత్స్యసంపద), క్షీర విప్లవం (పాడి పరిశ్రమ), పింక్ రివల్యూషన్ (మాంస పరిశ్రమ) అనే పంచవిప్లవం రాబోతోంది. వీటి ద్వారా రాష్ట్ర ముఖచిత్రం శాశ్వతంగా మారడంతో పాటు, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. భవిష్యత్తులో దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం చేరుతుంది. కేసీఆర్ కృషితో ‘తెలంగాణ మోడల్’ తెలంగాణ అస్తిత్వ పోరాట ఫలితంగా ఈరోజు తెలంగాణ సంస్కృతి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తనదైన ముద్ర వేయడంతోపాటు, తెలంగాణ మోడల్‌ను రూపొందించడంలో కేసీఆర్ కృషి, పట్టుదల ఉన్నాయి. నిధులు, నీళ్లు, నియామకాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా నడిపించి, రాజకీయ పార్టీలను ఒప్పించి తూలనాడిన వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నాం. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉందనేందుకు జిల్లా పరిషత్ మొదలుకుని అన్ని రకాల ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇళ్లపై గులాబీ జెండాలు రెపరెపలాడాలి రెండోసారి అధికారంలోకి వచ్చాక గతేడాది పార్లమెంటు ఎన్నికలు, ఈ ఏడాది కరోనా మూలంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకోలేకపోతున్నాం. సోమవారం పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై గులాబీ జెండాలు ఎగురవేసి సంఘీభావం తెలపాలి. ఏరియా ఆసుపత్రులు, బ్లడ్‌బ్యాంకులను సంప్రదించి భౌతికదూరం పాటిస్తూ వారంపాటు రక్తదానం చేయండి. హడావుడి లేకుండా సేవా కార్యక్రమాలను నిర్వర్తించాలి. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. కరోనా నుంచి కుదుటపడ్డాక కార్యకర్తలకు శిక్షణ ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పునరంకితమవుదాం. టీఆర్ఎస్, కేసీఆర్ తప్ప ఇంకెవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని నమ్మి ప్రజలు మాకు మద్దతు పలుకుతున్నారు. దేశ రాజకీయాలపై టీఆర్ఎస్ పరోక్ష ముద్ర దేశ రాజకీయాలపై పరోక్షంగా ముద్ర వేస్తున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే మంచి పాత్ర పోషించాలనుకున్నాం. పార్లమెంటులో శాసించే స్థాయిలో టీఆర్ఎస్ లేకున్నా తెలంగాణ మోడల్, కేసీఆర్ పాలనను కేంద్రం, ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలే దీనికి ఉదాహరణ. సెకండ్ ఇన్ కమాండ్‌గానే కొనసాగుతా పార్టీలో సెకండ్ ఇన్ కమాండ్‌గానే కొనసాగుతా. కేసీఆర్ కార్యదక్షత, నాయకత్వం తెలంగాణకు మరో 15–20ఏళ్లు అవసరం. నాతో సహా ఈటల రాజేందర్, హరీశ్ వంటి ఎంతోమంది నాయకులం కేసీఆర్ శిక్షణలో ఎదుగుతున్నాం. ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే వెయ్యి శాతం క్రెడిట్ కేసీఆర్‌దే. మేం డబ్బా కొట్టుకోవట్లేదు. కానీ దేశంలో క్వాలిటీ లీడర్షిప్ తెలంగాణలోనే ఉంది. కేసీఆర్ నాయకత్వంపై పుస్తకాలు, గ్రంథాలు రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజం. కాంగ్రెస్‌తో సహా ఎవరూ ఒకే పార్టీలో జీవిత కాలం కొనసాగరు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులుండాలని ప్రజలు కోరుకోవాలి.. పార్టీలు కాదు. ప్రతిపక్షాలు వద్దని, కేసీఆర్ కావాలని ప్రజలు అనుకుంటున్నారు. మేం తప్పుచేస్తే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపుతారు. రాజకీయ పార్టీలు మనగలగాలంటే ప్రజల విశ్వాసం పొందాలి. మేం రెండు దశాబ్దాల్లో ఎన్నో అవమానాలు, గెలుపోటములు చవిచూశాం. లక్ష్యం దిశగా ఉద్యమాన్ని నడిపేందుకు కేసీఆర్ అనుసరించిన వ్యూహంపై భవిష్యత్తులో పుస్తకాలు, పరిశోధన గ్రంథాలు వస్తాయి. కేసీఆర్ నాయకత్వ తీరుపై కథలుకథలుగా చెప్పుకుంటారు. సైద్దాంతిక విభేదాలున్నా సంఘీభావం ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయ విమర్శలు చేయకుండా ప్రధానికి సంఘీభావం ప్రకటించాం. బీజేపీ, ఎన్డీయేతో సైద్ధాంతిక విభేదాలున్నా ఇలాంటి సంక్షోభ సమయంలో మాట్లాడకూడదని అనుకున్నాం. రాష్ట్రాలను ఆదుకునేందుకు పలు సలహా సూచనలు ప్రధానికి ఇచ్చాం. ప్రకటన కోసం వేచి చూస్తున్నాం. కరోనా సంక్షోభ సమయంలో కేసీఆర్ నాయకత్వ పటిమను దేశం ఆమోదిస్తోంది. చాలా రాష్ట్రాలు సీఎంకు సెల్యూట్ చేస్తూ ధీరోదాత్తంగా వ్యవహరిస్తున్నారని అంటున్నాయి. లాక్డౌన్ పొడిగింపు, చికెన్ తినడం, సీ విటమిన్ వంటి విషయాల్లో కేసీఆర్ చెప్పిన దానిని ప్రజలు ఆమోదిస్తున్నారు. నాయకుడిపై నమ్మకం ఉంటేనే ఇది సాధ్యం. రెండు దశాబ్దాల్లో ఎత్తుపల్లాలు రెండు దశాబ్దాల్లో టీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. 2008, 2009లో ఎదురుదెబ్బలు తగిలినపుడు కేసీఆర్ ఫీనిక్స్‌లా లేచి తెలంగాణ సమాజాన్ని ఏకంచేశారు. జాతీయ పార్టీలు మోసం చేసినా అన్ని భావజాలాలకు చెందిన వారిని ఏకంచేసి కేంద్రంలో తప్పనిసరి పరిస్థితి సృష్టించి తెలంగాణ సాధించాం. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడమే అత్యంత సంతృప్తినిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని ప్రత్యర్థులుగా, ఆంధ్ర నాయకులు శత్రువులుగా చూసినా, ఎన్ని అవమానాలు పడినా చివరకు తెలంగాణ సాధించాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేం కూడా ఫక్తు రాజకీయ పార్టీగా మారాం. తెలంగాణ వచ్చాక గిల్లికజ్జాలు పెట్టుకోకుండా అందరినీ కలుపుకుపోయాం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా ప్రజలు గెలిపించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి నాకు సమాచారం లేదు. నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతుంది. ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్త కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జీవనశైలి మారడంతో పాటు ఇతర మార్పులను మనం స్వాగతించాలి. కరోనాపై పోరు విషయంలో అమెరికా, ఇటలీ సహా ఇతర రాష్ట్ర్రాలతో మాకు పోటీలేదు. బయట జరుగుతున్న అన్ని విషయాలు సీఎం కేసీఆర్‌కు తెలుసు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలు వద్దు. రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలి. నమ్మకం కుదిరాకే.. ఇల్లాలితో కటింగ్! ‘ఏంటి జుత్తు పెరిగినా కత్తిరించుకోవడం లేదు. మీ ఆవిడకు మీ తల ఎప్పుడు అప్పగిస్తారు’అంటూ మంత్రి కేటీఆర్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడం సరదా సంభాషణకు దారితీసింది. ‘విరాట్ కోహ్లి వాళ్ల ఆవిడకు జుత్తు అప్పగించినపుడు నీకేం స మస్య అంటూ ఓ నెటిజన్ను ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనికి కేటీఆర్ సోదరి కవిత స్పందిస్తూ.. అన్నయ్యా వదినమ్మకు నువ్వు ఎప్పుడు అప్పగిస్తున్నావు అంటూ సరదాగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఆదివారం చిట్‌చాట్ సందర్భంగా మీడియా కేటీఆర్ వద్ద ప్రస్తావించింది. ‘ఇదుగో కోవిడ్ వల్ల నేను జు త్తు కత్తిరించుకోవడం లేదు. మా ఆవిడ కత్తిరి స్తానంటే మా అబ్బాయి మీద ప్రయోగం చేయమని చెప్తా. వాడికి కూడా జుత్తు బాగా పెరిగింది. వాడి కటిం గ్ చూసిన తర్వాత నేను సంతృప్తి చెందితే నా జుత్తు అప్పగిస్తా’అని సరదాగా సమాధానం ఇచ్చారు. -
గలగలా గోదారి కదిలి వచ్చింది
సాక్షి, సిద్దిపేట : ‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం నెరవేరే రోజులు ఎంతో దూరంలో లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీకి అదనంగా నీరు ఇవ్వగలిగాం. నిజాంసాగర్‌ను పూర్తి చేసుకుంటున్నాం. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో జలకళ ఉట్టిపడు తుంది. సాగునీటి కోసం ఇబ్బందిపడ్డ రైతుల కష్టాలు తీరి దేశానికే ఆదర్శవంతమైన వ్యవ సాయ కేంద్రంగా తెలంగాణ విరాజిల్లుతుంది’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. మూడు టీఎంసీల సామర్థ్యం, 1,10,718 ఎకరాలకు సాగునీరు అందించేలా సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మించిన శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను శుక్రవారం మంత్రులు హరీశ్, కేటీఆర్ ప్రారంభించారు. తొలుత రంగనాయకసాగర్ కొండపై ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్, హరీశ్‌రావు అక్కడి నుంచి పంప్‌హౌస్ వద్దకు చేరుకొని పంపులను స్విచ్ ఆన్ చేశారు. దాదాపు 10 నిమిషాల వ్యవధిలో రంగనాయకసాగర్‌లోకి వచ్చిన గోదావరికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిదులు పసుపు, కుంకుమలు విడిచిపెట్టి స్వాగతం పలికారు. పంప్హౌస్లోంచి నీరు పైకి ఎగసిపడే క్రమంలో కేటీఆర్, హరీశ్‌పైనా నీరు చిమ్మడంతో వారు తడిసి ముద్దయ్యారు. అనంతరం గుట్టపై ఉన్న విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి చేరుతున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు భగీరథుడికన్నా గొప్పగా... ఆకాశంలో ఉన్న గంగను భూమికి తీసుకొచ్చిన భగీరథుడి గురించి అందరం చెప్పుకుంటామని, కానీ భూమిపై ఉన్న గోదావరిని ఎత్తైన ప్రదేశంలోకి తీసుకొచ్చి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్ భగీరథునికన్నా గొప్ప అన్పించుకున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. మెతుకుసీమగా పిలిచే ఉమ్మడి మెదక్ జిల్లా పేరే మెతుకు అనే పేరు నుంచి వచ్చిందని, గోదావరి జలాలు ఉమ్మడి మెదక్ జిల్లాను ముద్దాడిన తర్వాత మొత్తం తెలంగాణకు బువ్వపెట్టే జిల్లాగా కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నీటివనరులు పెరిగితే ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. చదవండి: తెలంగాణకు కేంద్ర బృందం నాలుగు విప్లవాల ద్వారా ఆర్థిక అభివృద్ధి దశలవారీగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతోందని, రాబోయే రోజుల్లో నాలుగు రకాల విప్లవాల ద్వారా తెలంగాణ గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, దేశానికే ఆదర్శంగా నిలస్తుందని కేటీఆర్ చెప్పారు. నీటి వసతులతో ఈ విప్లవాలు అనుబంధంగా ఉంటాయని చెప్పారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ ఆవిర్భవిస్తుందన్నారు. దీంతో రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతుందని చెప్పారు. చెరువులు, కుంటల్లో నీరు సంమృద్ధిగా ఉంటే మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, దీంతో నీలి విప్లవం వస్తుందన్నారు. అదేవిధంగా పంటలు పండి, పచ్చటి చేలు, గడ్డితో పల్లెలు ఆహ్లాదకరంగా ఉంటే పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, దీంతో శ్వేత విప్లవం వస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేశామని, దీంతో మాంసం ఉత్పత్తులు పెరుగుతున్నాయని, ఈ పెరుగుదల పింక్ రివల్యేషన్కు చిహ్నమన్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో సంపద పెరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. సర్జికల్ పంప్‌హౌస్‌లో రెండో మోటార్‌ను ప్రారంభిస్తున్న హరీశ్, కేటీఆర్. చిత్రంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హరీశ్‌రావు చరిత్ర తిరగరాశారు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు పనిచేసి చరిత్ర తిరగరాశారని కేటీఆర్ కొనియాడారు. గతంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా రేయింబయళ్లు పనిచేసి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారన్నారు. రాజకీయంగా ఆదరించిన సిద్దిపేట అంటే ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమని, సీఎం తర్వాత సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపి హరీశ్‌రావు సమర్థతను రుజువు చేసుకున్నారన్నారు. నాయనమ్మ, అమ్మమ్మ ఊర్లు మునిగాయి.. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని కేటీఆర్ కొనియాడారు. ఇతర పార్టీల వారికి నిర్వాసితుల బాధ తెలియదని విమర్శించారు. ఎగువ మానేరు నిర్మాణం సందర్భంగా తన నాయనమ్మ గ్రామం దొమకొండ మండలం పూసాన్పల్లి మనిగిపోయిందని, మధ్యమానేరు నిర్మాణంలో అమ్మమ్మ గ్రామం కొదురుపాక మునిగిపోయిందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో మేజర్ కాల్వల నిర్మాణం పూర్తయిందని, ఏ గ్రామానికి ఆ గ్రామ పెద్దలు కథానాయకులుగా మారి చిన్న కాల్వల నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. అసాధ్యమన్న పనులు సుసాధ్యం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తుంటే అందరూ అసాధ్యమని విమర్శలు చేశారని, కానీ అసాధ్యమన్న పనులను సుసాధ్యం చేసి రైతులకు నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ వద్ద పారే గోదావరిని 490 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్‌కు, 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపొచమ్మ సాగర్ వరకు పంపింగ్ చేయవచ్చని రుజువు చేశారన్నారు. కరవు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణలో సాగునీటి అవసరాన్ని గుర్తించిన సీఎం... ఇంజనీర్‌గా పనిచేయడంతోపాటు అందరితో పని చేయించారన్నారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణమంటే 3–4 దశాబ్దాల కాలం పట్టేదని, కానీ సీఎం కేసీఆర్ పట్టుదలతో పనిచేయించి మూడున్నర సంవత్సరాల్లోనే పనులు పూర్తి చేయించారన్నారు. కూలీలతో సహపంక్తి భోజనం చేస్తున్న మంత్రులు అన్నదాత కష్టాలు తీరేరోజు... వర్షం, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు కాలం, కరెంట్‌తో పనిలేకుండా కాల్వల ద్వారా రెండు పంటలు పండించుకునేలా సాగునీరు అందుతుందని హరీశ్‌రావు చెప్పారు. అప్పులు చేసి బోర్లు వేసి బోర్లాపడ్డ రైతులు వలసలు, ఆత్మహత్యలు చేసుకునేవారిని గుర్తుచేశారు. వర్షం ఎప్పుడొస్తుందో అని మోగులు చూసే రైతులకు గోదావరి జలాలు ఈ నేలను ముద్దాడడాన్ని చూసి సంబుర పడిపోతున్నారన్నారు. గోదావరి జలాల ద్వారా చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ఉపరితల నీటివనరుల ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. నీరు అభివృద్ధికి సూచిక అని, నీటివనరులు పెరిగితే మానవ మనుగడలో మార్పు వస్తుందన్నారు. ‘‘ఎకానమే కాకుండా ఎకాలజీ’’లో కూడా మార్పు వస్తుందని చెప్పారు. నా జన్మ చరితార్థం... తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమ నేత వెంట ఉండి పనిచేయడం, దేశంలోనే మహోన్నత ఘట్టం కాళేశ్వరం జలాలు సిద్దిపేట జిల్లాను ముద్దాడే కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు తన జన్మ చరితార్థం అయిందని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషం కలిగిందో రంగనాయకసాగర్ నీటిని విడుదల చేసినప్పుడూ అంతే సంతోషం కలిగిందన్నారు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ సమక్షంలో లక్షల మంది మధ్య జరుపుకోవాల్సి ఉండేదని, కానీ కరోనా వైరస్‌తో తక్కువ మందితో జరుపుకుంటున్నామన్నారు. గోదావరి జలాలు రంగనాయకసాగర్‌లో పారుతుంటే ఆ జలాల్లో రైతులు పండించబోయే ధాన్యం సిరులు కన్పిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, బి.వెంకటేశ్వర్లు, కూర రఘోత్తంరెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్ సొలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఒడితల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, ఓఎస్డీ దేశపతి శ్రీనివాసరావు, లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్ర సలహాదారులు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం, సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పట్టణం నుంచి పల్లెకు మహా పయనం -
ఆస్తి పన్ను చెల్లింపు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించిన మేరకు ఆస్తిపన్ను చెల్లింపు గడువును 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది ప్రజలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లింపు గడువు మార్చి 31తో ముగియగా, అపరాధ రుసుం లేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మే 31వరకు గడువు పొడిగిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. -
కరోనా తగ్గుముఖం పడుతుంది
సాక్షి, హైదరాబాద్: కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తు న్న కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశంఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతకుమారి, వైద్యాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కాగా, కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పరిశీలించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. అనంతరం వారు నేరుగా ప్రగతిభవన్‌చేరుకుని సీఎంకుఅక్కడి పరిస్థితి వివరించారు. ఈ సందర్భంగా సీఎంకేసీఆర్.. హైదరాబాద్ సహా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. గాంధీఆస్పత్రిలో అందుతున్న చికిత్సవివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని వైద్యాధికారులు చెప్పారు. చదవండి: 12 లక్షణాల కరోనా! విజయవంతంగా లాక్డౌన్ అమలు.. ‘రాష్ట్రంలో కరోనా సోకిన వారందరినీ గుర్తించాం. వారి ద్వారా ఎవరెవరికి వైరస్ సోకే అవకాశం ఉందో జాబితా తయారు చేసి పరీక్షలు జరిపాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకిన వారున్నారో ఒక అంచనా దొరికింది. దీని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్లు ఏర్పాటు చేశాం. అక్కడ ప్రజలను బయటకు రానీయకుండా, బయటి వారిని అక్కడికి వెళ్లకుండా కఠినంగా వ్యవహరించాం. కాంటాక్టు వ్యక్తులందరినీ క్వారంటైన్ చేశాం. దీని కారణంగా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అరికట్టగలిగాం. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇలాగే సహకరించి లాక్డౌన్ నిబంధనలను, కంటైన్మెంట్ నిబంధనలు పాటిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది’అని సీఎంపేర్కొన్నారు. చదవండి: ముంబైలో మనోళ్లు బిక్కుబిక్కు.. -
కర్ఫ్యూ వేళలు పొడిగిద్దామా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కల్లోలం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో ఈ వైరస్ కట్టడికి దివ్య ఔషధమైన లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సీఎం కేసీఆర్ నుంచి పోలీసుల వరకు పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా, కొంతమందికి ఇదేమీ పట్టడంలేదు. లాక్డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి రోడ్లెక్కుతున్నారు. సోమవారం పలుచోట్ల పెద్దసంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన జనం.. మంగళవారం కూడా కార్లు, ద్విచక్రవాహనాలతో రోడ్డుపైకి వచ్చారు. లాక్డౌన్ ఉల్లంఘనలను ఎట్టిపరిస్థితిల్లో సహించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్వయంగా డీజీపీ వెల్లడించిన మరుసటి రోజే జనం ఆ మాటలు పెడచెవిన పెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికీ పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ ఉల్లంఘనలను సర్కారు సీరియస్‌గా పరిగణిస్తోంది. ఓవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటం.. మరోవైపు మాస్క్ వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా చాలామంది రోడ్లపైకి వస్తుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మే 7వ తేదీకి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చి కొత్త పాజిటివ్ కేసులను నియంత్రించాలన్న సర్కారు ఆలోచనకు విఘాతం కలిగించేలా మారిన ఈ వ్యవహారాన్ని వెంటనే నియంత్రించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాత్రివేళ అమల్లో ఉన్న కర్ఫ్యూ వేళలను పొడిగించే విషయంపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దుకాణాలు తెరిచి ఉన్నంతసేపు నిత్యావసరాల సాకు తో జనం రోడ్లపైకి వస్తున్నందున అవి తెరిచి ఉంచే సమయాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. చదవండి: యువతపై కరోనా పంజా! వచ్చే పక్షం రోజులు కఠినంగా.. ప్రస్తుతం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చే వెసులుబాటు ఉంది. ఆయా దుకాణాలను ఆ సమయంలో తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. సాయంత్రం ఆరు తర్వాత కర్ఫ్యూ మొదలవుతుంది. హైదరాబాద్‌లో ఈ వేళలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ మొదలు కాగానే రోడ్లపై జన సంచారం ఒక్కసారిగా తగ్గిపోతోంది. అడపాదడపా కొన్ని వాహనాలు తప్ప ఎవరూ బయటకు రావడంలేదు. ఎవరైనా బయటకు వచ్చినా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రం లాక్డౌన్ పూర్తిగా అపహాస్యమవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన దుకాణాలు తప్ప మిగతావి మూతపడే ఉంటున్నాయి. కానీ ప్రజలు నిత్యావసరాల వస్తువుల కొనుగోలు కోసం అని, ఇతరత్రా అత్యవసర పనులని చెప్పి రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఎవరిని అడ్డుకోవాలో, ఎవరిని అనుమతించాలో తెలియక పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఇది జనం ఎక్కువగా తిరగడానికి కారణమవుతోంది. ఇక కొనుగోలు ప్రాంతాల్లో భౌతిక దూరం అసలే అమలు కావటం లేదు. ఇది కరోనా కేసుల విస్తృతికి కారణమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మరోసారి కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ ఉల్లంఘనల అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. పరిస్థితిని సరిదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గతంలోనే పోలీసులు లాక్డౌన్ వేళలను సవరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిత్యావసరాలు కొనుగోలుకు ఉన్న సమయాన్ని కుదించాలని పేర్కొన్నారు. కానీ ఈ వేళలు తగ్గిస్తే.. ఉన్న తక్కువ సమయంలో అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తారని, అప్పుడు రద్దీ పెరిగి భౌతిక దూరం విధానం అమలు కాదని సీఎం భావించారు. అయితే, ఆయన సదుద్దేశంతో ఇచ్చిన వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో పరిస్థితి జఠిలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆ వెసులుబాటును తగ్గించే విషయాన్ని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. చదవండి: కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు కర్ఫ్యూ సమయంలో జనాన్ని నియంత్రించేందుకు పోలీసులకు వీలు చిక్కుతుంది. ఆ సమయంలో రోడ్లపైకి రావటానికి ఎవరికీ అనుమతి ఉండదు కాబట్టి, రోడ్లపైకి రావాలనుకునేవారు కూడా కాస్త ఆలోచిస్తారు. ఒకవేళ ఎవరైనా అలా వచ్చినా పోలీసులు నియంత్రించే అవకాశం ఉంటుంది. దీంతో జనం కచ్చితంగా ఇళ్లకే పరిమితమమై లాక్డౌన్ సక్రమంగా అమలవుతుంది. అందుకే పోలీసులు వేళల కుదింపునకే మొగ్గుచూపుతున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, మంగళవారం పలు ప్రాంతాల్లో పోలీసులు దుకాణాలను ఇక తొందరగా మూసేయాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు దుకాణదారులకు మౌఖికంగా ఈ మేరకు స్పష్టంచేసినట్టు తెలిసింది. బుధవారం నుంచి దుకాణాలను తొందరగా మూయాలని, బ్యాంకులను కూడా పని వేళలు తగ్గించుకోవాలని సూచించినట్టు దుకాణదారులు, బ్యాంకు ఉద్యోగులు వెల్లడించారు. పాతబస్తీలో యథేచ్ఛగా ఉల్లంఘనలు.. హైదరాబాద్‌లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు పాతబస్తీ పరిధిలోనే ఉన్నప్పటికీ, అక్కడ లాక్డౌన్ సరిగా అమలు కావడంలేదు. మలక్‌పేట మొదలు ఇటు టోలిచౌకి వరకు యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ సమయం సడలగానే జనం పెద్ద సంఖ్యలో రోడ్డెక్కుతున్నారు. పని ఉన్నా లేకున్నా, సాధారణ రోజుల్లో తరహాలో రోడ్లపైనే ఉంటున్నారు. దీంతో ఎక్కడా భౌతిక దూరం అన్నది కనిపించడంలేదు. మర్కజ్ వ్యవహారంతో పాతబస్తీలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారి ద్వారా వైరస్ సోకినవారు క్రమంగా బయటపడుతూనే ఉన్నారు. నిత్యం పెద్ద సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ కొందరు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మాస్కులు వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. పాతనగరంలోని ప్రధాన రోడ్లు మినహా మిగతా అంతర్గత రోడ్లపై రద్దీ కనిపిస్తోంది. దీనిని నిరోధించాలంటే కర్ఫ్యూ వేళలు పొడిగించడమే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. చదవండి: చైనా ‘కరోనా’ షాపింగ్! -
లాక్డౌన్ పొడిగింపు..
-
మే 7 వరకు ఇళ్లలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు ఎలాంటి సడలింపులూ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ‘కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు ప్రకటిస్తూనే, 20 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులివ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఆదివారం జరిగిన రాష్ట్ర్ర కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తెలంగాణలో ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదని స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం. మంచీ చెడ్డ, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వైరస్ వ్యాప్తి తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’అని సీఎం తెలిపారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అందరి కోరిక ఇదే..: వైద్య, ఆరోగ్యశాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వ్యాధి సోకిన వారు మే 1 లోగా సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజూ కొందరు డిశ్చార్జి అవుతున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటాం. గతంలో మాదిరిగానే పాలు, కూరగాయలు, రాత్రి పూట కర్ఫ్యూ వంటివి యథాతథంగా అమల్లో ఉంటాయి. బియ్యం, నూనె మిల్లులు, శానిటైజర్ల తయారీ, ఫార్మా కంపెనీల వంటివి పనిచేస్తాయి. ముందు జాగ్రత్త చర్యగా సడలింపులు ఇవ్వట్లేదు. గతంలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను రాష్ట్రం ప్రకటించగా, కేంద్రం మే 3 వరకు గడువు పెంచింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై లోతైన సర్వే చేసిన తర్వాత కేబినెట్ మీటింగ్‌లో చర్చించాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కఠినంగా లాక్డౌన్ పొడిగించాలని 95 శాతం మంది కోరుకుంటున్నారు. టీవీ చానెళ్ల సర్వేలోనూ 92 శాతం మంది లాక్డౌన్ పొడిగించాలని కోరారు. నేను కూడా లాయర్లు, డాక్టర్లు, రైతులు, కూలీలు, యువత అన్ని వర్గాలకు చెందిన సుమారు వంద మందితో మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగించాలని కోరారు. మే 7 వరకు పొడిగిస్తున్నాం. మే 8 నుంచి లాక్డౌన్ నుంచి బయటపడతాం. చదవండి: తెలంగాణలో మరో 49 మందికి కరోనా పాజిటివ్ కేంద్ర మార్గదర్శకాల మేరకే.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని 1987 నాటి జీవో కింద కేంద్ర మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోంది. రాష్ట్రంలో విదేశీ ప్రయాణికులకు సంబంధించిన అధ్యాయం వంద శాతం సుఖాంతమైంది. తొలుత 34 కేసులు నమోదై ఆ తర్వాత 64కు చేరింది. క్వారంటైన్లో ఉన్న 26వేల మంది క్షేమంగా డిశ్చార్జి అయ్యారు. నిజాముద్దీన్ సమస్య ఇంకా కొనసాగుతోంది. వాళ్ల కుటుంబ సభ్యులు, సెకండరీ కాంటాక్టులు వస్తున్నాయి. వీళ్లతో సమస్య సద్దుమణుగుతుందనే అనుకుంటున్నాం. వేరే రకమైన కేసులు 13, 14 మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించిన మూలం దొరికితే రాష్ట్రం బాగుపడుతుంది. మార్చి తరహాలోనే వేతనాల చెల్లింపు ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి వేతనం తరహాలోనే 50 శాతం, ప్రజాప్రతినిధులకు 75 శాతం కోత విధిస్తాం. లక్షా 11వేల మంది పెన్షనర్ల కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గతంలో మాదిరిగా కాకుండా 75 శాతం చెల్లిస్తాం. వైద్య, మున్సిపల్, హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి మూలవేతనం మీద 10 శాతం ప్రోత్సాహకాన్ని కొనసాగిస్తాం. లాక్డౌన్లో రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు కూడా 10 శాతం ప్రోత్సాహకం ఇస్తాం. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల్లో పనిచేసే 34,512 మంది ఓఅండ్ఎం సిబ్బంది, ఆర్టిజన్లకు మార్చి వేతనం 50 శాతం ఇచ్చాం. ఏప్రిల్ వేతనం వంద శాతం చెల్లిస్తాం. ఆసరా పింఛన్లు మే మాసానికి కూడా యథాతథంగా పూర్తిగా ఇస్తాం. కిరాయి వసూలు చేయొద్దు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం ఇళ్ల యజమానులు తమ కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి అద్దె వసూలు చేయొద్దు. వీటిని తర్వాత నెలల్లో వడ్డీ లేకుండా వాయిదా పద్ధతిలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇంటి యజమానులకు అప్పీలు కాదు.. ప్రభుత్వ ఆదేశం. చట్టప్రకారం కేబినెట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి.. ఎవరైనా ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయండి. కిరాయిదారులకు అండగా ఉండండి. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో 2019–20కి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపు గడువును అపరాధ రుసుము లేకుండా మే 31 వరకు పొడిగిస్తున్నాం. అనుమతులు రద్దు చేస్తాం.. రాష్ట్రంలో 10వేలకు పైగా ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా 2020–21 విద్యా సంవత్సరంలో నయా పైసా ఫీజు పెంచకూడదు. రకరకాల ఫీజులు వసూలు చేయడాన్ని రాష్ట్రంలో అనుమతించం. ట్యూషన్ ఫీజులను నెలవారీగా మాత్రమే వసూలు చేసుకోవాలి. ఈ కష్ట సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. లేదంటే 100కు డయల్ చేయండి. కేసులు నమోదు చేయడంతో పాటు అనుమతులు రద్దు చేస్తాం. ఉచిత బియ్యం.. ఏప్రిల్‌లో ఆదాయం లేకుండా పోయినందున పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రంలోని 11 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇస్తాం. ప్రతి కుటుంబానికి కూరగాయలు, ఇతర అవసరాల కోసం మే మొదటి వారంలోనే రూ.1,500 ఇచ్చేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశాం. బ్యాంకు ఖాతాల్లో వేసిన రూ.1,500 వెనక్కి వెళ్తాయని కొందరు దుర్మార్గులు ప్రచారం చేశారు. ఈ డబ్బు మీద లబ్ధిదారులకే అధికారం ఉంటుందనే విషయాన్ని సర్పంచ్‌లు గ్రామాల్లో ప్రచారం చేయాలి. రాష్ట్రంలోని వలస కూలీలకు కూడా సాయం కొనసాగిస్తాం. వలస కూలీలు ఒక్కరు ఉంటే 12 కిలోల బియ్యం, 500 డబ్బులు ఇస్తాం. అదే కుటుంబం అయితే మనిషికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి 1500 నగదు ఇస్తాం. లాక్డౌన్ కాలంలో ఏప్రిల్, మే నెలలకు పరిశ్రమల నుంచి వసూలు చేసే ఫిక్స్డ్ చార్జీలు వాయిదా వేస్తున్నాం. అవి ఎలాంటి జరిమానా లేకుండా తర్వాత చెల్లించవచ్చు. గత బిల్లులకు కూడా ఒక శాతం రిబేటు ఇస్తాం. ఈ బిల్లులు కూడా సకాలంలో చెల్లిస్తే అందులోనూ ఒక శాతం రిబేటు ఇస్తాం. చదవండి: కరోనాపై బి 'పాజిటివ్'! 7 వరకు తెలంగాణకు రావొద్దు.. కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కోరాం. వ్యాధిని పరిధి దాటకుండా నిలువరించడంలో విఫలం కావొద్దు. మే 4 నుంచి విమాన సర్వీసులు నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే 7 వరకు తెలంగాణకు రావద్దు. వస్తే ఇక్కడ హోటళ్లు, టాక్సీలు ఏవీ ఉండవు. జీఎంఆర్ ఎయిర్‌పోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేస్తాం. నిత్యావసరాల సరఫరాలో ఇబ్బందులు లేవు. అయితే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ సప్లయ్ సంస్థలు సోమవారం నుంచి సేవలు నిలిపేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. పిజ్జాల వంటి వాటితో కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇళ్లలోనే పండుగలు.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా నిబంధనలు పాటిస్తూ పండుగలు, ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలి. సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, యాదాద్రి, వేములవాడ తదితర ఆలయాలన్నీ మూసేశారు. మతపరమైన సామూహిక కార్యక్రమాలకు అనుమతించం. ప్రజల క్షేమం, భవిష్యత్తు కోసం ఇలాంటి చర్యలు తప్పవు. ఈ విషయంలో ప్రజల నుంచి మంచి సహకారం అందుతోంది. మనం చాలా మెరుగు.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 21 మరణాలు సంభవిస్తే, 186 మంది కోలుకోవడంతో వైద్య పరీక్షల తర్వాత డిశ్చార్జి చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 651 మంది చికిత్స పొందుతుండగా, ప్రాణాపాయ పరిస్థితి ఎవరికీ లేదు. 33 జిల్లాలకుగాను వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, సిద్దిపేట జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. దేశంలో ప్రతి 8 రోజులకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండగా, తెలంగాణలో 10 రోజులకు పైనే పడుతోంది. కరోనా మరణాల రేటు.. దేశంలో 3.22 శాతం కాగా, రాష్ట్రంలో 2.44 శాతం అంటే దేశంతో పోలిస్తే మరణాల రేటు మన దగ్గర తక్కువ. దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 254 మందికి పరీక్షలు చేస్తే, మనం 375 మందికి చేస్తున్నాం. మొదట్లో వైద్య సిబ్బంది, ఇతరత్రా వైద్య ఉపకరణాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. కరోనాను నియంత్రించే మందులు కూడా సరిపడా ఉన్నాయి. ప్రయోగశాలలు, టెస్టింగ్ కిట్లకు ఇబ్బంది లేదు. మిగతా ఆరోగ్య సేవలు నిలిపేయకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాం. వైద్యశాఖకు గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్.. హైదరాబాద్‌కు నలుదిక్కులా ప్రతిష్టాత్మక వైద్య సంస్థలు ఏర్పాటు చేస్తాం. తూర్పు భాగాన ఇప్పటికే ఎయిమ్స్ వచ్చింది. పశ్చిమ భాగాన కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రతిష్టాత్మక టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్) ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను వైద్యశాఖకు బదలాయిస్తున్నాం. 14 అంతస్తుల్లో 540 గదులున్న ఈ భవనాన్ని వైద్య శాఖకు ఇచ్చేస్తున్నాం. 1500 పడకలు ఏర్పాటుచేస్తాం. ప్రస్తుతానికి కోవిడ్ స్పెషల్ ఆసుపత్రిగా వినియోగిస్తాం. తర్వాత మరో 750 పడకల జనరల్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. పీజీ కాలేజీ ఉంటుంది. నిమ్స్, ఇతర ఏ కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోకుండా దీన్ని అభివృద్ది చేస్తాం. ఎలా చేయాలన్నది ఆరోగ్య శాఖ మంత్రికి కేబినెట్ బాధ్యతలు అప్పగించింది. వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. ఆపద సమయంలో ధైర్యం కొల్పొకుండా బాగా పని చేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మందులు, పరికరాలు అందజేస్తాం. తెలంగాణ రాష్ట్ర సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించడం కోసం క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రులు సభ్యులుగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతా మేమే కొంటాం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులు పండించే పంటలను పూర్తిగా మేమే కొనుగోలు చేస్తాం. వరితో సహా కందులు, మొక్కజొన్న, శనగలు, పొద్దుతిరుగుడు, జొన్నలను కనీస మద్దతు ధర ఇచ్చి మేమే కొంటాం. రైతులు ఆగమాగం కావద్దు. ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోంది. దాన్ని కొనసాగిస్తాం. రానున్న ఖరీఫ్‌లో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ పంటల సాగుకు 21 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేస్తున్నాం. రైతులు ఎవరూ గుమికూడి ఎరువులు కొనొద్దు. మే 5 వరకు దాదాపు అన్ని పంటల కొనుగోళ్లు పూర్తి అవుతాయి. అప్పటినుంచి రైతులు ఎరువులు కొనుక్కోవాలి. రాష్ట్రంలోని అన్ని మ్యారేజీ హాళ్లను తాత్కాలిక గోదాములుగా ఉపయోగించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. హెలికాప్టర్ మనీ కాకుంటే ఎయిర్‌క్రాఫ్ట్ మనీ... దేశంలో వ్యవసాయం జరగాలి. 135 కోట్ల మంది భారతీయులకి అన్నం పెట్టే దేశం ఏదైనా వుందా? అడుక్కు తిందామన్నా పెట్టే శక్తి ఎవరికీ లేదు. అందుకే ప్రధాని మోదీకి కూడా అదే చెప్పాం. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు కొనసాగాలి. ఆర్థికంగా దేశం ముందుకు పోవాలి. దేశ ఆర్థిక విధానాలు తయారు చేయడం కేంద్రం చేతుల్లోనే ఉంది. అందుకే సత్వరమే నిర్ణయం తీసుకోవాలని అడుగుతున్నా. ఎఫ్ఆర్బీఎం పెంచండి. దానివల్ల మీకేమీ ఇబ్బంది ఉండదు. మేము జీతాలు ఇవ్వలేక బాధపడుతున్నాం. మొన్న క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీ గురించి చెప్పిన. దాని గురించి ఆర్థికవేత్తలు తలా ఒక మాట చెప్పారు. అయినా కేసీఆర్ చెప్పిందే చేయాలని లేదు కదా. క్వాంటిటేటివ్ కాకపోతే క్వాలిటేటివ్.. హెలికాప్టర్ కాకపోతే ఎయిర్‌క్రాఫ్ట్.. ఏదో రూపంలో చేయండి. లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ప్రధాని కూడా ఈ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఏది చేసినా ప్రజల కోసమే రాష్ట్రాన్ని, అన్ని రంగాలను, ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇంకా కఠినంగా లాక్డౌన్ అమలవుతుంది. బయటకు వచ్చేవాళ్లు రాకండి. ఇప్పటికే 50వేల వాహనాలు సీజ్ చేశారు. అత్యవసరం అన్నవాళ్లకు మేమే పాసులు ఇచి అనుమతి ఇస్తున్నాం. రాష్ట్రంలో ఈ వ్యాధి తగ్గడం లేదు. అనవసరంగా పూసుకొవడం వద్దు. స్విగ్గీ, జొమాటోలను బంద్ చేస్తే రాష్ట్రానికి రావల్సిన సేల్స్ ట్యాక్స్ రాదు. అయినా బంద్ చేస్తున్నాం అంటే అర్థం చేసుకోండి. ప్రజల క్షేమం, మేలు దృష్టిలో ఉంచుకునే తప్ప వేరే కాదని అర్థం చేసుకోండి. అందరూ సహకరించాలి. లోటుపాట్లు, ఇంకా సహకారం కావల్సింది ఏమైనా వుంటే 100కి డయల్ చేయండి. ప్రజలు, ప్రభుత్వం కలిసి ఎదుర్కొంటేనే మనల్ని మనం రక్షించుకోగలం. నేను మళ్లీ చెబుతున్న. ఈ వ్యాధికి మందులు లేవు. నివారణే తప్ప. ప్రజాప్రతినిధుల పనితీరు భేష్ ప్రజాప్రతినిధులు కూడా క్షేత్ర స్థాయిలో చురుగ్గా పాల్గొంటూ సహకారం అందిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ, క్లోరిన్ ద్రావణం పిచికారీ తదితరాల్లో సర్పంచ్‌లు మొదలుకుని మంత్రుల వరకు అందరూ ఆశించిన రీతిలో శక్తివంచన లేకుండా బాగా పనిచేస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో పేదలను బాగా ఆదుకుంటున్నారు. నిత్యావసరాలు, ఇతరాలు అందజేస్తూ దాతృత్వం చూపుతున్న వారికి కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఏ ఒక్కరూ పస్తు లేకుండా చూడాలి. పరిస్థితుల ఆధారంగా ఎత్తివేత.. రాష్ట్రంలో మే 5న ఉండే పరిస్థితుల ఆధారంగా లాక్డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా నిత్యవసరాలు కొనుగోలు చేసుకునేందుకు సడలింపులిస్తే కొందరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన సమయాన్ని కుదించాలని పాతబస్తీ ఎమ్మెల్యేలు సైతం కోరారని తెలిపారు. అయితే పాతబస్తీ, న్యూ సిటీ తేడా లేకుండా అన్ని చోట్లా పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో వలస కార్మికులు సొంత ప్రాంతాలను వెళ్లేందుకు అనుమతించబోమని స్పష్టంచేశారు. లాక్డౌన్ సడలింపుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదని, అనవసర వివాదాల జోలికి వెళ్లట్లేదని పేర్కొన్నారు. పసుపు కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలపై వడ్డీలను ఆర్బీఐ మాఫీ చేయాలని, రుణ వాయిదాల చెల్లింపులను వాయిదా వేయాలని, ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి పెంచాలని ప్రధానికి ఆదివారం కూడా విజ్ఞప్తి చేశానని, ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ర్యాపిడ్ టెస్టుల కిట్లు వచ్చాయన్నారు. ఇబ్బడిముబ్బడిగా టెస్టులు చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉండే వారు భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధిని నియంత్రించడం కోసమే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎఫ్ఆర్బీఎం రుణాలు, పన్నులు, పన్నేతర ఆదాయం కలిపి ఏప్రిల్‌లో రాష్ట్రానికి రూ.1,500 కోట్లు రావాల్సి ఉండగా, రూ.150 కోట్ల ఆదాయమే వచ్చిందని వివరించారు. -
మే 7 వరకు లాక్డౌన్ : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు కరోనా లాక్డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. రాత్రి పూట కర్ఫ్యూ యథాతథంగా అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. మే 5వ తేదీన మరో మారు మంత్రి వర్గ సమావేశం నిర్వహించి అప్పటి కరోనా పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ 20వ తేదీనుంచి సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో సడలింపులు ఇవ్వటం లేదు. నిత్యావసరాలకు తప్ప రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు లేవు. ప్రజారోగ్యమే మాకు ముఖ్యం. దేశంలో ఎనిమిది రోజులకో సారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తెలంగాణలో కరోనా వైరస్ కంట్రోల్లో ఉంది. కేసుల సంఖ్య రెట్టింపు కావటానికి 10 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతోంది. జబ్బు సోకిన వారిలో మరణించే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 3.22 శాతం, తెలంగాణలో 2.44 శాతం ఉంది. డెత్ రేట్లో కూడా మనం తక్కువే ఉన్నాం. వైద్య సిబ్బందికి అవసరమైన మెడికల్ పరికరాలు పూర్తి స్థాయిలో వచ్చాయి. జబ్బును కంట్రోల్ చేయటానికి అవసరమైన మందులు కూడా సరిపడా ఉన్నాయి. మే 1వ తేదీ తరువాత కేసులు తగ్గే అవకాశం ఉంది. విదేశాలనుంచి వచ్చిన వారంతా డిశ్చార్జ్ అయిపోయారు. పండుగలు, ప్రార్థనలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్లలోనే చేసుకోవాలి. ఇది ఏ ఒక్క వర్గానికో, మతానికో పరిమితం కాదు. అందరూ ఈ నియమాలను పాటించి తీరాలి. సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు. మక్కా, జుమ్మా మసీదుల్లో కూడా ఇద్దరు.. ముగ్గురు మాత్రమే ఉండి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అన్ని ఆలయాలు మూసివేశారు. తిరుపతి, శ్రీశైలం, వేములవాడ, యాదాద్రి దేవాలయాలు కూడా మూసివేశారు. సిగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీసులు నిలిపివేస్తున్నాము. దీని వల్ల ప్రభుత్వానికి వాటినుంచి వచ్చే టాక్స్ కూడా రాదు.. అయినా తప్పడం లేదు. మే7 తరువాత కూడా పెళ్లిళ్లు, ఫంక్షన్లు అనుమతించబడవు. మ్యారేజ్ హాల్స్ అన్నింటిని ధాన్యం నిలువకోసం ఉపయోగించాలని నిర్ణయించాం. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నాం. మరింత కఠినంగా లాక్డౌన్ అమలు జరుగుతుంది. ఇప్పటి వరకు 50 వేల వాహనాలు సీజ్ చేశారు. ఎవ్వరు కూడా బయటికి రావొద్దు. అద్దె ఇంట్లో ఉండేవారినుంచి యాజమానులు మే నెల వరకు అద్దె తీసుకోవద్దు.. ఇది రిక్వెస్ట్ కాదు, ప్రభుత్వం ఆర్డర్. ఎవరైనా అద్దె అడిగితే 100కి డయల్ చేయొచ్చ’’ని అన్నారు. -
తెలంగాణలో లాక్డౌన్ కొనసాగింపు..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 7 వరకు కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే పుడ్ డెలివరీ సర్వీసులను కూడా నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనితో పాటు ఇళ్ల కిరాయిలను మూడు నెలల పాటు వసూలు చేయకుండా ఉండే విధంగా గృహ యజమానులను ఆదేశించే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ ఆంక్షల సడలింపు, కరోనా వైరస్ నియంత్రణ వంటి అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. ఈ సమావేశం ముగింపు అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించనున్నారు. -
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిధిగా లాక్డౌన్ అమలవుతోందని పేర్కొన్నారు. తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని, ప్రజలు ఇప్పటి లాగానే సహకరించాలని కోరారు. లాక్డౌన్ అమలుతో పాటు పేదలకు సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిధులు చూపిస్తున్న చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు, వైరస్ సోకినవారికి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ప్రకటించారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్తు అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 518 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం 8 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి అవుతారని వివరించారు. 10 లక్షల పీపీఈ కిట్లు, మాస్కులు.. ‘కరోనా వైరస్ సోకినవారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ప్రాంతాలు ఏర్పాటు చేసి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతమందికైనా సరే, వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పీపీఈ కిట్లకు కొరత లేదు. ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయి. ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చాం. మొత్తంగా రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్ –95 మాస్కులున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షలు ఆర్డర్ ఇచ్చాం. దీంతో తెలంగాణలో 10 లక్షల ఎన్–95 మాస్కులు అందుబాటులో ఉంటాయి. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 20వేల పడకలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. లక్ష మంది పేషెంట్లు అయినా సరే, చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది’అని సీఎం వివరించారు. మంత్రులు సొంత జిల్లాల్లో ఉండాలి ‘లాక్డౌన్ అమలును, పేదలకు అందుతున్న సాయాన్ని, పంటల కొనుగోలు విధానాన్ని ప్రజాప్రతినిధులు ఎంతో చొరవ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా పనిచేస్తున్నారు. ఈ పని ఇంకా కొనసాగాలి. ప్రజలను చైతన్యపరచాలి. ప్రభుత్వపరంగా జరుగుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలి. ఆరోగ్య, మున్సిపల్ మంత్రులు తప్ప మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలి’అని సీఎం కోరారు. పంచాయతీలకు నిధులు విడుదల.. ‘లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. బాగా కష్టపడుతున్న వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అవన్నీ అందాల్సిన వారికి అందుతున్నాయి. ప్రతి పేద కుటుంబానికి 1,500 చొప్పున నగదు అందించాలనే నిర్ణయం మేరకు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేశాం. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందే కార్యక్రమం దాదాపు పూర్తయింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రకటించిన సీఎం ప్రత్యేక నగదు ప్రోత్సాహకం, వైద్య సిబ్బందికి ప్రకటించిన 10 శాతం అదనపు వేతనం కూడా వారికి అందింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం కార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాల్సి ఉన్నందున రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఏప్రిల్ కోసం రూ.308 కోట్లు, అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కలిపి రూ.148 కోట్లు విడుదల చేశాం’అని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేదర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 30 దాకా.. లాక్డౌన్ పొడిగింపు..
సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నాం. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. ఇది సమాజం, మన పిల్లలు, భవిష్యత్తు సంక్షేమం కోసం కాబట్టి అందరూ సహకరించాలి. అన్ని మతాలు, కులాలు, వర్గాలు సామూహిక కార్యక్రమాలను మానుకోవాలి. మీరు నష్టపోయి, సమాజానికి నష్టం చేయొద్దు’అని సీఎం కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలం కలిసొస్తే ఏప్రిల్ 30 తర్వాత దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేతపై ఆలోచిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో శనివారం ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై కోవిడ్–19 వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అలాగే అంతకుముందు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన డిమాండ్లను కేసీఆర్ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... వ్యవసాయానికి మినహాయింపు... లాక్డౌన్ సమయంలో వ్యవసాయానికి అనుమతి ఉంటుంది. లేకపోతే మనకు బువ్వ దొరకదు. ధాన్యం వచ్చింది... కోతలు జరగాలె... పంటంతా చేతికి రావాలె... ఎఫ్‌సీఐకి పోవాలె. అదంతా జరగాలె. ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే రైస్‌మిల్లులు నడుస్తాయి. వాటికి అనుమతిస్తాం. పిండిమరలకు అనుమతి ఉంటుంది. ఆయిల్ సీడ్స్‌ను నూనెగా చేసే మిల్లులుంటాయి. ఆహార సంబంధిత అనుమతి ఇస్తాం. కూర గాయలు రావాలన్నా వ్యవసాయం అవసరం. మన దేశ జనాభా దాదాపు 135 కోట్లు. ప్రపంచంలోనే భారత్‌కు అన్నంపెట్టే శక్తి ఏ దేశానికీ లేదు. మన దేశాన్ని ఎవరూ సాకలేరు. ఎందుకంటే తెలంగాణ కంటే 100 దేశాలు చిన్నగా ఉన్నాయి. ఏ దేశం మనకు అన్నం పెడుతుంది? విశాల భారతానికి ఎవరూ అన్నం పెట్టలేరు. ఆహారంలో స్వావలంబన సాధించిన దేశం మనది. మోదీకి కూడా అదే చెప్పినం. ఎట్టి పరిస్థితుల్లో మనం మన స్థాయిని కోల్పోవద్దు. మన ఆహారాన్ని మనమే సాధించుకోవాలె. వ్యవసాయాన్ని, ఫుడ్ ప్రాసెసింగ్‌ను అనుమతించాలె. అప్పుడే 135 కోట్ల పొట్టలు నింపుకోగలుగుతాం. అయితే ఈ విషయంలోనూ కొన్ని నియమాలు పాటిస్తూ ముందుకెళ్లాలి. అందరూ మాస్కులు ధరించాలి. ఎవరైనా వినకుండా బయటకు వస్తే పోలీసులు కొడ్తరు. క్యూఈ పద్ధతిలో రూ. 10 లక్షల కోట్లు.. ప్రస్తుతం చాలా విచిత్ర, విపత్కర పరిస్తితి ఉంది. ప్రపంచ మానవ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు. 1918లో స్పానిష్ ఫ్లూ, 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తిన సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక పద్ధతిని అవలంబించారు. ఇటువంటి సంక్షోభాల సమయంలో కేంద్ర రాష్ట్రాల రెవెన్యూ పడిపోయినందున వ్యవస్థను నడిపేందుకు ప్రపంచవ్యాప్తంగా క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ) అనే పద్ధతిని పాటిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ విపత్కర పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు అమెరికా ఫెడరల్ బ్యాంకు తమ జీడీపీలో 10 శాతం అంటే 2 ట్రిలియన్ డాలర్లను సమాజంలోకి పంప్ చేసింది. బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ లండన్ కూడా ఆ దేశ జీడీపీలో 15 శాతం పంప్ చేసింది. మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్రాల వద్ద డబ్బు లేదు. రెవెన్యూ, ట్యాక్సులు వచ్చే పరిస్థితి లేనందున ఆర్బీఐ నుంచి క్యూఈ విధానంలో డబ్బు తీసుకోవడం మినహా గత్యంతరం లేదు. 2019–20కిగాను జీడీపీని 203.85 లక్షల కోట్లుగా నిర్ధారించారు. ఇందులో ఐదు శాతం అంటే రూ. 10.15 లక్షల కోట్లను ఆర్బీఐ విడుదల చేసినా అవి కేంద్ర, రాష్ట్రాలకు అందుబాటులోకి వస్తాయి. హెలికాప్టర్ మనీ పంప్ చేయాలి... మన దేశంలో చిన్నా, చితక వ్యాపారులు, కార్మికులు, రేషన్ కార్డులు లేనివారు, రైతులు తదితర వర్గాల నుంచి అనేక డిమాండ్లు ఉన్నాయి. మనం రూ. 30 వేల కోట్ల ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం కొనగోలు చేస్తున్నాం. క్యూఈ విధానంలో డబ్బును సమాజంలోకి పంప్ చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఏప్రిల్‌తో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కితే తిరిగి పుంజుకొనే అవకాశం ఉంది. ఇలా పంప్ చేసే డబ్బును ‘హెలికాప్టర్ మనీ’అంటారు. ఆర్బీఐ ముందుకు వచ్చి హెలికాప్టర్ మనీని సప్లై చేయాలని ప్రధానికి వివరించాం. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఇదే కోరారు. ప్రధాని నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. యథాతథ స్థితి కొనసాగించాలి... ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో మూడు గంటలపాటు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్‌ను కనీసం రెండు వారాలు పొడిగించాలని అన్ని రాష్ట్రాల సీఎంలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కొందరు సీఎంలు కోరారు. దీన్ని ససేమిరా అంగీకరించం. సీఎంఆర్ఎఫ్కు సీఎస్ఆర్, పన్నుల మినహాయింపు ఇవ్వాలి. పీఎం కేర్స్ తరహాలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చే వారికి సీఎస్ఆర్, ట్యాక్సుల నుంచి మినహాయించే నిబంధనలు వర్తింపజేయాలి. రాష్ట్రాల్లోనూ విరాళాలు ఇచ్చేందుకు విరివిగా ముందుకొస్తున్న వారికి ఈ వెసులుబాటు కల్పించాలని ప్రధానిని కోరా. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలను మళ్లీ లేఖ రూపంలో ప్రధానికి పంపించాం. తొలి దశ రోగుల వంద శాతం డిశ్చార్జి.. తొలి దశలో విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో వైరస్ సంక్రమించిన వారిని వంద శాతం డిశ్చార్జి చేశాం. తొలి దశలో క్వారంటైన్లో పెట్టిన 25,937 మంది కూడా డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసులను కూడా కలుపుకొని మొత్తంగా శనివారం వరకు 503 పాజిటివ్ కేసులు రాగా ఇందులో 14 మంది మరణించారు. ఇండోనేషియన్లు సహా విదేశాల నుంచి వచ్చిన 96 మందిని డిశ్చార్జి చేశాం. ఆస్పత్రుల్లో ప్రస్తుతం 393 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిజాముద్దిన్ ఘటన తర్వాత మొత్తంగా 1,200 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు చేశాం. ప్రస్తుతం 1,654 మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారు. ఆస్పత్రికి రెఫర్ అవుతున్న కేసుల సంఖ్య కూడా తగ్గింది. రిస్క్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో గతంలో ఆచూకీ లభించని వారిని కూడా గుర్తించి పరీక్షలు చేస్తున్నాం. ఏప్రిల్ 24 తర్వాత యాక్టివ్ కేసులుండవ్! కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎక్కడా రాజీపడకుండా 234 చోట్ల కంటెయిన్మెంట్ అమలు చేస్తున్నాం. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123 ప్రాంతాలు, ఇతర చోట్ల 120 ప్రాంతాలు ఉన్నాయి. కంటెయిన్‌మెంట్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయి. అదృష్టవశాత్తూ చికిత్స పొందుతున్న వారు, క్వారంటైన్, కంటెయిన్మెంట్ ఏరియాలో ఉన్న వారిలో ఏ ఒక్కరూ సీరియస్‌గా లేరు. భగవంతుడి దయతో ఎవరికీ ఆక్సిజన్, వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ దశ నుంచి సంక్రమణ తగ్గిపోతే ఏప్రిల్ 24 వరకు దాదాపు కోవిడ్ బాధితులు ఎవరూ ఉండరు. కొత్త ఉత్పాతం, ఉప్పెన రాకపోతే మనం బయట పడతాం. మహారాష్ట్ర సరిహద్దు మూసివేత... మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 11 మంది మరణించారు. రాజస్తాన్‌లో 117 మందికి వైరస్ సోకింది. మహరాష్ట్రతో మనకు ఐదారు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. కాళేశ్వరం మొదలుకొని నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, నారాయణఖేడ్ వరకు సరిహద్దు ఉండటంతో బంధుత్వాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. కఠినంగా వ్యవహరిస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేం. మహారాష్ట్ర సరిహద్దును వంద శాతం మూసేస్తాం. అక్కడి నుంచి వచ్చే నిత్యావసరాలను కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 15 వరకు సాగునీరు... రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో ఏప్రిల్ 15 వరకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్రం శనగల కొనుగోలుకు తక్కువ కోటా ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం రూ. 800 కోట్లకు గ్యారంటీ ఇచ్చింది. కనీస మద్దతు ధరకు కొనేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున రైతులు ఆందోళన చెందవద్దు. బత్తాయి, ఉల్లి, మామిడి దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేయదు. అన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటే సాధ్యం కాదు. రాష్ట్రంలో పండే పంటల్లో 95 శాతం వాటా వరి, పత్తి, మొక్కజొన్న పంటలదే. వాటితోపాటు పప్పుశనగలు కొనుగోలు చేస్తున్నం. ఏకతాటిపైకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్రాలు ఏకతాటిపై పనిచేస్తున్నాయి. రైలు, విమానాల రాకపోకలు సహా లాక్డౌన్ కొనసాగింపునకు సంబంధించి అన్ని విషయాలపై ప్రధాని అధికారికంగా జాతికి సందేశం ఇచ్చే అవకాశం ఉంది. కరోనా నియంత్రణలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మంచి స్థితిలో ఉంది. ప్రధాని కూడా లాక్డౌన్ విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి యావత్ దేశం ఒకే మూసలో పనిచేసింది కాబట్టి కరోనా నియంత్రణలో ఉంది. ఇంకో 10–15 రోజులు రాజకీయాలను పక్కనపెట్టి మనం ముందుకెళ్తే కచ్చితంగా బయటపడే ఆస్కారం ఉంది. అత్యవసర వైద్య సేవలు నిరాకరించొద్దు.. ఆరోగ్యం విషమించి అత్యవసర పరిస్థితిలో చికిత్స కోసం వచ్చే రోగులను ప్రైవేటు ఆస్పత్రులు చేర్చుకోకపోవడం మంచిది కాదు. మామూలు సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు సంపాదించుకొని ఈ సమయంలో రోగులకు చికిత్స చేయకపోతే ఎలా? ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుంది. దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షించి ఆదేశాలు జారీ చేస్తారు. ప్రైవేటులో కోవిడ్ చికిత్సకు నో.. ప్రభుత్వ కోవిడ్–19 ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ సామర్థ్యం పూర్తిగా వినియోగంలోకి వచ్చాకే ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అనుమతిస్తాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించేసరికి ప్రైవేటు ఆస్పత్రులు గమ్మున ఉండిపోయాయి. పేదలకు ఇబ్బంది కావద్దనే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 రోగులకు అందించే చికిత్సలో వస్తున్న కొత్త పరిజ్ఞానం తొలుత ప్రభుత్వానికే తెలిసే అవకాశముంది. ఇది కూడా ముఖ్య కారణం. వ్యాధి నయమైందని పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్నాకే రోగులను డిశ్చార్జి చేసుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా నయం కాకుండానే రోగులను డిశ్చార్జి చేస్తే వారు ఆటంబాంబుగా మారి వందలాది మందికి వ్యాధిని అంటించే ప్రమాదముంటుంది. అందుకే ప్రభుత్వ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. నిజాముద్దీన్ ఘటన జరగకపోయి వుంటే ఈ రోజు మనం ఆరామ్‌గా ఉండేవాళ్లం. రోజుకు రెండు, మూడు కేసులే వచ్చేవి. మద్యం షాపులు తెరిచే ప్రసక్తే లేదు.. కేరళ తరహాలో మద్యాన్ని హోం డెలివరీ చేసే యోచన లేదు. రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచే ప్రసక్తే లేదు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో దస్తీలు, టవల్స్ కట్టుకున్నా పర్వాలేదు. మార్కెట్లో మాస్కులు లభించకపోతే ఇంట్లోనే కుట్టుకోవాలి. ఎవరైనా ధరలు పెంచినా, నిత్యవసర సరుకుల కత్రిమ కొరత సష్టించినా పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం. ఈ విపత్కర సమయంలో దుర్మార్గంగా డబ్బులు సంపాధించుకోవడానికి ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదు. 1–9 వరకు అందరూ పాస్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ప్రకటించిన సెలవులు కొనసాగుతుండటం, ఫలి తంగా వార్షిక పరీక్షలను ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేకపోవడంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా పాసైనట్లేనని ప్రకటించారు. ‘‘ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డిటెన్షన్ విధానం లేదు కాబట్టి విద్యార్థులంతా పాస్ అయినట్లే ప్రకటిస్తున్నాం. ఇతర రాష్ట్రాల తరహాలో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులకు బెంబేలు, చింత అవసరం లేదు’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే మధ్యలో ఆగిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై మాత్రం మరికొన్ని రోజులు ఆగి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
-
నగదు బదిలీ షురూ
సాక్షి, హైదరాబాద్ : ‘రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన దాని ప్రకారం తెల్ల రేషన్ కార్డున్న ప్రతీ కుటుంబానికి రూ.1,500 చొప్పున నగదును బ్యాంకు అకౌంటులో వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. అందరికీ డబ్బులు చేరతాయి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘రేషన్ షాపుల ద్వారా నియం త్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలి’అని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. వారి కుటుంబసభ్యులు, వారు కలసిన వారిని కూడా గుర్తించి క్వారం టైన్ చేసినట్లు తెలిపారు. పాజిటివ్ కేసులు ఎక్కువైనప్పటికీ అందరికీ చికి త్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి ని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని వెల్లడించారు. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యం త్రాంగాన్ని ఆదేశించారు. వరి కోత లు, ధాన్యం ఇతర పంటల కొను గో ళ్లు యథావిధిగా జరపాలని చెప్పా రు. ఇక శనివారం ప్రధాని నరేంద్రమోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణ రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు చేసిన సూచనలివే.. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి. దేశంలో, రాష్ట్రంలో లాక్డౌన్ అమలు కావడం వల్లనే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదు. ఈ సత్యాన్ని గ్రహించి ప్రజలు సహకరించాలి. లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూడాలి. పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ షాపుల వద్ద జనం ఒకే దగ్గర పోగవ్వకుండా దూరం పాటించాలి. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలను సరిగ్గా నిర్వహించాలి. రైతులు చెప్పిన సమయానికే వచ్చి, తమ ధాన్యం అమ్ముకుని పోవాలి. పట్టణ ప్రాంతాలు, ఇతర చోట్ల వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను, సహాయ కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించాలి. -
ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు ప్రకటన చేసే అవకాశముంది. ఏప్రిల్ 14తో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ముగియనుండగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరో రెండు వారాలు పొడిగించే అవకాశముంది. ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ఈ సమావేశం అనంతరం సీఎం ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ భేటీలో ఆర్థిక పరిస్థితులు – భవిష్యత్ వ్యూహ రూపకల్పన, రాష్ట్రంలోని పేదలు – ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించడం తప్ప మరో దారి లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఓ వైపు దీనికి గడువు దగ్గరపడుతుండగా.. మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఈనెల 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ‘రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నందున మరో రెండు వారాల పాటు(ఏప్రిల్ 15 తరువాత) లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధాని మోదీని కోరబోతున్నా. ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తివేసినా.. తెలంగాణలో మాత్రం అమల్లో ఉంటుంది’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా కేసీఆర్ బాటలోనే నడిచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర ( 891), తమిళనాడు (571), ఢిల్లీ (525) రాజస్తాన్ (323) కేరళ (295) ఉత్తరప్రదేశ్ (301), మధ్యప్రదేశ్ (230), రాష్ట్రాలు కూడా మరికొన్ని వారాల పాటు లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. (లాక్డౌన్ పొడిగించాలి) దీనిపై ఉత్తర ప్రదేశ్ సర్కార్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కరోనాను పూర్తిగా కట్టడి చేశాకే లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందంట ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాజస్తాన్ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసుల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. లాక్డౌన్, స్వీయ నిర్బంధం వంటి చర్యలతో కొంతమేర నివారించగలింది. ఈ క్రమంలోనే ప్రజలు మరోసారి జస సంచారంలోకి వస్తే అసలుకే మోసం వస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక లాక్డౌన్ ఎత్తివేతపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై ప్రభుత్వం పూర్తిగా సంతృప్తి చెందిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పరిస్థితుల సాధారణ స్థితికి చేరుకునే వరకు ఎదురుచూస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షా మంగళవారం కేంద్రమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14 తరువాత తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను రెడ్జోన్లుగా గుర్తించి.. మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలను తొలగిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం లాక్డౌన్ ఎత్తివేతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం నాటికి 364 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష చేపట్టిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ మానవజాతికి వచ్చిన అతిపెద్ద సంక్షోభమని వ్యాఖ్యానించారు. భారత్‌లాంటి ఎక్కువ జనాభా గల దేశంలో లాక్డౌన్ విధించడం తప్ప మరో గత్యంతరంలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఏప్రిల్ 15 తరువాత కూడా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరతా అని చెప్పారు. ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తివేసినా.. తెలంగాణలో మాత్రం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణలో లాక్‌డౌన్‌కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని కొనియాడారు. లాక్డౌన్ కారణంగా తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారెంటైన్లో ఉంచాం. నిజాముద్దీన్ ఘటనతో కలిపి 364 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్, 11 మంది చనిపోయారు. గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్సలో ఉన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని గుర్తించాం. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబ సభ్యులు 92 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో మరో 100 కేసులు పెరిగే అవకాశం ఉంది. (జూన్ వరకు లాక్డౌన్ పొడిగింపు..!) కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. లాక్డౌన్, స్వీయ నియంత్రణ వల్లే మనం బయట పడగలిగాం. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) సర్వే ప్రకారం దేశంలో లాక్డౌన్ కొనసాగించడం తప్ప మరో మార్గంలేదు. కరోనా వైరస్ కట్టడికి కేంద్రం, ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెప్పిన పద్ధతులను అనుసరిస్తున్నాం. లాక్డౌన్ అమలుతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగాం. అగ్రరాజ్యం అమెరికా కూడా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. న్యూయార్క్‌లో దయనీయమైన పరిస్థితి ఉంది. బలయైన దేశం కూడా సహాయక స్థితికి చేరుకుంది. చేతులెత్తి నమస్కరిస్తున్నా ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆస్పత్రుల్లో స్వీపర్ నుంచి డాక్టర్ వరకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.రాష్ట్రంలో 8 కోవిడ్ ఆస్పత్రులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. కరోనా పాజిటివ్ వస్తే గాంధీ ఆస్పత్రిలో ఉండాల్సిందే. వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు జీతం. 95,392 మంది పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పారిశుద్ధ్య కార్మికులకు 7,500 అదనంగా ఇస్తాం. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు రూ.5వేలు ఇస్తాం. మీడియాపై ఆగ్రహం.. విపత్కర పరిస్థితుల్లో పిచ్చిరాతలు రాసే మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటా. తప్పుడు వార్తలు రాసే వారికి కరోనా తగలాలని శాపం పెడుతున్నా. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి.. ప్రభుత్వం దగ్గర ప్రతి రికార్డు ఉంటుంది. సమయం వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం. లాక్డౌన్ కొనసాగించాలని ప్రధానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్ధిక వ్యవస్థను మెల్లగా బాగుచేసుకోగలం.. కానీ ప్రాణాలను తిరిగి తెచ్చుకోలేం’ అని అన్నారు. -
మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్
-
జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటలు!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన రేపటి( ఆదివారం) జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కోరారు. ఆదివారం ఉదయం 6 గంటలనుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు. మెట్రో రైలు సర్వీసులు కూడా నిలిచిపోతాయని తెలిపారు. అత్యవసర సేవల కోసం ప్రతీ డిపోలో 5 బస్సులను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. షాపులు, మాల్స్ స్వచ్ఛందంగా మూసివేయాలన్నారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రులు, పాలు, కూరగాయలు, పండు, పెట్రోల్ బంకులు, మీడియా సిబ్బందికి ఇందులోనుండి మినహాయింపు ఉందన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ రెండురోజుల తర్వాత మహారాష్ట్ర బార్డర్‌ను మూసివేసే ఆలోచన చేస్తున్నాం. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. కరోనా వైరస్‌పై ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టాం. 5,274 నిఘా బృందాలు పని చేస్తున్నాయి. అంతరాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. 78 మంది జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్‌లు పని చేస్తున్నాయి. మార్చి 1నుంచి ఇప్పటివరకు 20 వేల మందికి పైగా విదేశాల నుంచి వచ్చారు. 11 వేల మందిని ఆధీనంలోకి తీసుకున్నాం. 700 మందికి పైగా కరోనా అనుమానితులు ఉన్నారు. ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారందరూ విదేశాలనుంచి వచ్చిన వారే. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తక్షణం రిపోర్టు చేయండి. వైద్య పరీక్షలు నిర్వహించి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం. ఇది మీ సామాజిక బాధ్యతగా గుర్తించాల’ని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణలో విద్యా సంస్థలు, మాల్స్ బంద్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్, మాల్స్‌ను కూడా మూసివేయాలని సీఎం నిర్ణయించారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. (కరోనాపై సీఎం కేసీఆర్ ప్రకటన) కాగా తెలంగాణలో ఇప్పటికే రెండు కరోనా కేసులు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. గాంధీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య కేంద్రాల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల వద్దనే పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్టాలు సైతం పాఠశాలలు, మాల్స్ మూసివేశారు. ముంబైలో థియేటర్లు, మాల్స్ మూసివేత గోవాలో మార్చి 31వరకు విద్యాసంస్థలకు సెలవులు కర్ణాటకలో వారంపాటు మాల్స్, థియేటర్లు, స్కూల్స్, కాలేజీలు బంద్ బిహార్‌లో మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్ ఢిల్లీలో మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత రాజస్థాన్‌లో ఈనెల 30 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్ యూపీలో మార్చి 22 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్ హర్యానాలో మార్చి 31 వరకు విద్యాసంస్థలు మూసివేత కోల్‌కత్తాలో మార్చి 31 వరకు పాఠశాలలు, మాల్స్ మూసివేత -
అందరికీ హోలీ శుభాకాంక్షలు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: హోలి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతిసౌఖ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరు ఆనందకరమైన, సురక్షితమైన, రంగుల హోలీ జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.(ఓటమి విజయానికి తొలిమెట్టు : సీఎం జగన్) May the festival of colors bring immense joy, peace, and prosperity in your lives. Wishing you and your loved ones a very happy, safe and colorful Holi. #HappyHoli — YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2020 హోలీ పండుగ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్ హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంగుల వసంతోత్సవాన్ని ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
రేపే బడ్జెట్ : హరీష్‌రావు తొలిసారి
సాక్షి, హైదరాబాద్ : శాసనసభలో 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చజరుగుతోంది. ఇక కీలకమైన రాష్ట్ర బడ్జెట్ రేపు (ఆదివారం) సభ ముందుకు రానుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి విత్తమంత్రి హోదాలో ఆయన సభలో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కాగా రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో కీలకమైన ఆర్థికశాఖను హరీష్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి హోదాలో గత ఏడాది బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలిలో రేపు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ సమర్పించనున్నారు. (సీఏఏ, ఎన్ఆర్సీలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు) -
కరోనాపై వెయ్యి కోట్లు ఖర్చు చేస్తాం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనాపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కరోనా రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని సీఎం అన్నారు. రాష్ర్టానికి కరోనా వైరస్ రాదు.. రానివ్వం కూడా అని సీఎం తేల్చిచెప్పారు. ఈ వైరస్ ఇక్కడ పుట్టినది కాదు, ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చిందన్నారు. ఈ 31 మంది కూడా దుబాయ్, ఇటలీ లాంటి ఇతర దేశాలకు పోయి వచ్చినా వారే అని సీఎం తెలిపారు. (సీఏఏ, ఎన్ఆర్సీలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు) మన రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకు? అని కేసీఆర్ ప్రశ్నించారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్ బతకదు అని సీఎం సభలో చెప్పారు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.. అలాంటప్పుడు ఆ వైరస్ ఎలా బతుకుతుందని సీఎం ప్రశ్నించారు. మాస్క్ కట్టుకోకుండానే కరోనాపై యుద్ధం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. వైరస్ లక్షణాలు ఉన్నవారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, ఎవరూ బయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. -
సీఏఏ, ఎన్ఆర్సీలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సభలో కీలక ప్రసంగం చేశారు. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వివాదాస్పద చట్టాలు సీఏఏ, ఎన్ఆర్సీలపై కేసీఆర్ సభలో ప్రస్తావించారు. వీటిపై పౌరులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నాయని, వీటిపై ఓ రోజంతా సభలో చర్చించి తీరుతామని సీఎం అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని, ఇక సామన్య ప్రజలకు ఏం ఉంటుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చట్టాలపై దేశ వ్యాప్తంగా సుధీర్ఘ చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఈ చట్టాలపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని సీఎం కోరారు. కాంగ్రెస్ సభ్యల సస్పెండ్.. ఇక చర్చలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదు అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగించే చర్యలను సహించమని కేసీఆర్ తేల్చిచెప్పారు. సభలో ఎవరు అరాచకం చేస్తున్నారో స్పష్టంగా కనబడుతుందని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంటుందని.. దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని హితవు పలికారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరిచి, అరాచకం సృష్టిస్తే కుదరదు అని విపక్ష సభ్యులను కేసీఆర్ హెచ్చరించారు. ఏదో ఒక విధంగా బయటకు వెళ్లాలనేది కాంగ్రెస్ సభ్యుల గొడవ.. అందుకే అరుస్తున్నారని సీఎం పేర్కొన్నారు. సభకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. దీంతో ఆరుగురు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. దీనిపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాన్ని లేకుండా చూడాలని సీఎం ప్రయత్నిస్తున్నాంటూ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. ఎన్నిక ఏదైనా.. విజయం మాదే కాంగ్రెస్ సభ్యుల అసత్య ఆరోపణలను ఆపడానికే వారిని సభ నుంచి సస్పెండ్ చేశామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నీరుకార్చే ప్రయత్నం చేసిందని, ఉద్యమకారులపై కేసుల పెట్టిన చరిత్ర ఆ పార్టీ అని నిప్పులు చెరిగారు. అన్ని పార్టీలను ఏకంచేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా.. ప్రజలంతా టీఆర్ఎస్ పక్షాణే నిలుస్తున్నారని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతుందో ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎం హితవుపలికారు. -
అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ: తమిళిసై
సాక్షి, హైదరాబాద్: గంగా- యమున సంగమంగా విరాజిల్లుతూ...లౌకిక వాదానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. మత కలహాలు సృష్టించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు. తొలినాళ్లలో విద్యుత్ కోతలు, నీటి సమస్యలు ఎదుర్కొందని.. అయితే అనతికాలంలోనే వాటిని అధిగమించిందని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు తెలంగాణలో పెన్షన్ ఆసరా పెన్షన్(వృద్యాప్య) వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గింపు బీడీ కార్మికులకు పెన్షన్ రూ. 2016 దివ్యాంగులకు పెన్షన్ రూ. 3016 కులవృత్తులను ప్రోత్సహిస్తున్నాం చెరువులు, రిజర్వాయర్లపై మత్స్యకారులకు హక్కులు కల్పించాం నాయీ బ్రాహ్మణులు, రజకులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ రైతు ఆత్మహత్యలను నివారించాం రైతులకు నాణ్యమైన, ఉచిత విద్యుత్ అందిస్తున్నాం కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణలో 969 రెసిడెన్షియల్ స్కూళ్లు ట్రాక్టర్లు, ఆటోలపై రవాణా పన్ను ఎత్తివేత మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలను పెంచాం ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ రూ. 1కే కిలోబియ్య(ఆరు కిలోలు) -
పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతల ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 14లోగా పంజాగుట్టలో విగ్రహాన్ని ప్రతిష్టించనట్లయితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు, మాజీ ఎంపీలు ధర్నాకు దిగారు. సీనియర్ నేత వీహెచ్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మల్లు రవి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు అడ్డుపడి ఆయన విగ్రహాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం అవమానకరం. అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీఎం చర్యలు తీసుకోవాలి. పంజాగుట్టలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలి. లేదంటే మా పోరాటం మరింత ఉధృతమవుతుంది’’ అని పేర్కొన్నారు. -
మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ 2020-21 వార్షిక బడ్జెట్ సమావేశాలను మార్చి 6 నుంచి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చర్చ ప్రారంభంకానుంది. మార్చి 8 ఆదివారం, మరుసటి రోజు హోళీ పండుగ కావడంతో పదో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 25 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. 13 పని దినాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. శాసనమండలి సమావేశాలను మాత్రం కేవలం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పట్టణ ప్రగతి ముగిసిన వెంటనే ఒక రోజు విరామం ఇచ్చి ఆరో తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా షెడ్యూలు సిద్ధం చేశారు. -
తెలంగాణలో పట్టణ ప్రగతి కార్యక్రమం
-
నేటి నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ : పాలనా సంస్కరణల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేటి నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సోమవారం (24వ తేదీ) నుంచి మార్చి 4 వరకు రాష్ట్రవ్యాప్తం గా తొలి విడత పట్టణ ప్రగతి కార్యక్రమా న్ని నిర్వహించబోతున్నారు. పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేసీఆర్ ప్రకటించారు. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కొత్తగా జిల్లా అదనపు కలెక్టర్లుగా (స్థానిక సంస్థలు) నియమితులైన అధికారులు పూర్తిగా ఈ కార్యక్రమంపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించి అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను రానున్న 10 రోజుల్లోగా పూర్తి చేయనున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్డుల వారీగా పట్టణ ప్రగతి ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా పనులు చేయనున్నారు. మూడు నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధింత సమస్యలన్నీ పరిష్కారం కావాలని సీఎం కేసీఆర్ టార్గెట్ నిర్దేశించారు. విఫలమైతే చైర్పర్సన్లు, మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పట్టణ ప్రగతి అమలు తీరును పరిశీలించేందుకు కేసీఆర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశముంది. సీనియర్ అధికారులతో రూపొందించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రగతి ప్రణాళిక.. కౌన్సిలర్/కార్పొరేటర్ల సమన్వయంతో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు వార్డుల వారీగా ప్రణాళికలు రూపొందించనున్నారు. వార్డుల వారీగా నియామకమైన ప్రజాసంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రతీ వార్డుకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేకాధికారి పనిచేయనున్నారు. పారిశుద్ధ్యం, రక్షిత తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులపై గుంతల మరమ్మతులకు సంబంధించిన పనులను తక్షణమే చేపట్టనున్నారు. పట్టణ ప్రగతి కింద తక్షణమే చేయాల్సిన పనులకు కలెక్టర్, మేయర్/చైర్పర్సన్ నుంచి అనుమతి పొంది మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా నిర్వహించాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల వారీగా ప్రతి పురపాలికలో యువజన, మహిళా, వయోజనులు, ప్రముఖుల కమిటీలను ఏర్పాటు చేయాలని మరో ఉత్తర్వులో పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు.. పట్టణ ప్రగతి దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ప్రతి పట్టణంలో దహన వాటికలు/ఖనన వాటికలు, పట్టణ జనాభాకు తగినట్లు పరిశుభ్రమైన వెజ్, నాన్ వెజ్, పండ్లు, పూల మార్కెట్లు, ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. వీధి వ్యాపారుల కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయనున్నారు. వంగిన, తుప్పు పట్టిన స్థంభాలు, రోడ్డు మధ్యలోని స్థంభాలు, ఫుట్‌పాత్‌లపై ఉండే ట్రాన్స్ఫార్మర్లను పట్టణ ప్రగతిలో భాగంగా మార్చనున్నారు. ఇళ్లపై వేలాడే వైర్లను సరిచేయనున్నారు. ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి: కేటీఆర్ పట్టణ రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. పట్టణ ప్రగతి విజయవంతం కావడానికి పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. ప్రతి వార్డులో పౌరులతో కమిటీలు ఏర్పాటు చేసి కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. కాగా, మహబూబ్‌నగర్ పట్టణంలో సోమవారం జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలోతెలిపింది. -
ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఈ నెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ విందులో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆహ్వానం పంపింది. ఈమేరకు కేసీఆర్ మంగళవారం ఢిల్లీకి చేరుకుంటారు. కాగా, ట్రంప్ సోమ వారం ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకుని ప్రధాని మోదీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే గౌరవ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. -
ట్రంప్‌కి విందు: సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం!
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మహారాష్ట్ర, హరియాణా, బిహార్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఈనెల 25న ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం.(ఆ అంశాల గురించి ట్రంప్ చర్చిస్తారు: అమెరికా) కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం భారత్‌కు చేరుకుంటారు. తొలుత మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆగ్రాకు వెళ్తారు. అనంతం అక్కడి నుంచి ఢిల్లీకి పయమవుతారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ట్రంప్ కుటుంబానికి ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ట్రంప్ సహా ఆయన కుటుంబం, అధికారులు బస చేసే గ్రాండ్ ప్రెసిడెన్షియల్ ఫ్లోర్‌ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్ బృందం తిరిగి వెళ్లేంతవరకు ఇతరులెవరికీ ఆ హోటల్లో గదులను కేటాయించరు. హోటల్లో ఉన్న మొత్తం 438 గదులను వారికే బుక్ చేశారు. (ట్రంప్‌తో పాటు ఇవాంకా కూడా..) -
6 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ 2020 వార్షిక బడ్జెట్ సమావేశాలను మార్చి 6 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన తీరుపై రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి ముగిసిన వెంటనే ఒక రోజు విరామం ఇచ్చి ఆరో తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా షెడ్యూలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చర్చ జరిగే అవకాశం ఉంది. మార్చి 8 ఆదివారం, మరుసటి రోజు హోళీ పండుగ కావడంతో పదో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. 12 పని దినాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేస్తున్నారు. మార్చి 22లోపు బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశమున్నట్లు సమాచారం. శాసనమండలి సమావేశాలను మాత్రం కేవలం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019 సెప్టెంబర్ 9 నుంచి 22 వరకు జరిగిన పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ 11 రోజులు సమావేశం కాగా, శాసనమండలిలో మాత్రం కేవలం 4 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. -
బహ్రెయిన్‌లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) 66వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి.. పబ్లిక్ గార్డెన్లో మొక్కలు నాటారు. అనంతరం ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి కోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారని గుర్తుచేశారు. తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరున్నర సంవత్సరాలు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికై అహార్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను మన వంతు పాత్ర పోషించి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేకులకు పథకాలతోనే సరైన సమాధానం ఇవ్వాలని, గల్ఫ్ దేశాలలో ఉన్న కూడా సీఎం కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం అనందంగా ఉందన్నారు. తమ కుటుంబాలను వదిలి ఉపాధికోసం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో సీఎం కేసీఆర్ గల్ఫ్‌లో పర్యటించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలతో చర్చించి తదితర వివరాలు కనుకుని, గల్ఫ్‌లో భారత రాయబారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కారించనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఏ రాష్ట్ర సీఎంలు కూడా గల్ఫ్‌లో పర్యటించిన దాఖలు లేవన్నారు. దీంతో ఎన్నారైల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని సతీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం తాము ఒక అదృష్టంగా భావిస్తుమన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన ప్రతి టీఆర్ఎస్ నాయకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిరెన్లకు సలహాలు సూచనలు అందిస్తు సెల్‌ను ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ, ఎన్నారై టీఆర్ఎప్ సలహాదారు కల్వకుంట్ల కవితకి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి, టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు పార్టీ నాయకులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంత చేసిన అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, సెక్రెటరీలు చెన్నమనేని రాజేందర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
లండన్ ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
లండన్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదిన వేడుకలను లండన్ ఎన్నారై టీఆర్ఎస్ యుకే శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంఘం అధ్యక్షుడు అశోక్ దూసరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వారి ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అశోక్ దూసరి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మించే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని, ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై టీఆర్ఎస్ యుకే శాఖ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. అలాగే ఎన్నారై టీఆర్ఎస్ సెల్‌కి కేసీఆర్, మాజీ ఎంపీ కవిత ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ తెలంగాణ బిడ్డ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడం చారిత్రక అవసరమని అభిప్రాయపడ్డారు. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సంఘం సలహా బోర్డు వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రసంగిస్తూ.. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు యావత్ దేశానికే తలమానికంగా నిలవడం కేసీఆర్ గొప్పదనమని వ్యాఖ్యానించారు. ఎన్నారై టీఆర్ఎస్ ఐటీ కార్యదర్శి వినయ్ ఆకుల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సలహాలు సందేశాలు ఉన్నా వ్యక్తిగతంగా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు. అనంతరం అందరి సమక్షంలో కేక్ కట్ చేసి కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ముఖ్య నాయకులు రక్తదానం చేశారు. ప్రజలంతా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చివరిగా ఈ కార్యక్రమ ఇంచార్జ్ సత్యచిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి మాట్లాడుతూ.. ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, బంగారు తెలంగాణ నిర్మాణం లో కేసీఆర్ వెంటే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అద్యక్షులు అశోక్ గౌడ్ దుసరి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, కార్యదర్శులు హరి బాబు, సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి, అధికార ప్రతినిధులు రవి పులుసు, రవి రేతినేని, ఐటటీ సెక్రటరీ వినయ్ ఆకుల, ఆరూరి విశాల్, దుసరి సాయి కుమార్ గౌడ్, జవహర్లాల్ రామావత్, కాసుల భరత్, వేణు వివేక్ చెరుకు, టిల్లీస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ప్రణీత్, క్రాంతి పుట్ట,రాజ శేఖర్ రావు,అబ్దుల్లాహ్, ప్రణయ్, తరుణ్ రెడ్డి, సోహెల్ కహ్న్, కమల్, మనోహర్ మిట్ట, సయీద్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
-
కేసీఆర్‌కు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని.. చిరకాలం ఆయురారోగ్యాలతో ఆయన ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. అదే విధంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సీఎం కేసీఆర్‌కు ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో.. ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని.. జాతికి సేవ చేస్తూనే ఉండాలని అభిలషించారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.@TelanganaCMO — YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2020 కేసీఆర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థిస్తున్నా- ప్రధాని నరేంద్ర మోదీ Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his long and healthy life. @TelanganaCMO — Narendra Modi (@narendramodi) February 17, 2020 కేసీఆర్‌కు చంద్రబాబు విషెస్ ‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలి హృదయపూర్వకంగా కోరుకుంటున్నా’’ అని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. తల్లిని కన్న తనయుడికి శుభాకాంక్షలు: కేటీఆర్ -
మతపర వివక్ష వద్దు!
సాక్షి, హైదరాబాద్ : భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడా లని విజ్ఞప్తి చేసింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకి కత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన పౌర సత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కేబినెట్ కోరింది. ఈ మేరకు కేబినెట్లో తీర్మానం చేశారు. కేరళ, పంజాబ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలం గాణ అసెంబ్లీలోనూ ఇందుకు సంబంధించి తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో ఆది వారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసు కుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. 10 రోజులపాటు పట్టణ ప్రగతి.. ఈ నెల 24 నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిం చాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి ఈ నెల 18న ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహించనున్నారు. కాగా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని ఆకాంక్షించారు. పట్టణాల్లో పచ్చదనం–పారిశుధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని, పౌరులకు మెరుగైన సేవలు అందాలని, మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. ఆయా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి? అనేది ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా నిధులు వినియోగించుకుని క్రమపద్ధతిలో ప్రగతి సాధించాలని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే... పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహకం కోసం ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలి. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించాలి. పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణపై చర్చించాలి. ఈ సదస్సులో పాల్గొన్న వారందరినీ అదేరోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన వెజ్–నాన్ వెజ్ మార్కెటును, శ్మశాన వాటికలను సందర్శించడానికి తీసుకెళ్తారు. వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి జరగాలి. ప్రతీ వార్డుకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలి. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల వారీగా చేయాల్సిన పనులు, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలి. పట్టణప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలి. ప్రతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లో వార్డుల వారీగా నాలుగు చొప్పున ప్రజా సంఘాల ఏర్పాటు ప్రక్రియను వచ్చే 5 రోజుల్లో పూర్తి చేయాలి. జీహెచ్ఎంసీకి నెలకు రూ.78 కోట్లు, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్లు వెంటనే ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించిన నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండదు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.811 కోట్లలో రూ.500 కోట్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, రూ.311 కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించాలి. పట్టణ ప్రగతిలో పచ్చదనం–పారిశుధ్యం పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. డ్రైనేజీలు శుభ్రం చేయాలి. మురికిగుంతలు పూడ్చాలి. విరివిగా మొక్కలు నాటాలి. హరిత ప్రణాళిక రూపొందించాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. అందుకోసం గ్రామాలను ఎంపిక చేయాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య పనుల కోసం మొత్తం 3,100 వాహనాలు సమకూర్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 600 వాహనాలు వచ్చాయి. మిగతా 2,500 వాహనాలను త్వరగా తెప్పించి, పట్టణాలకు పంపాలి. ఇంకా ఎన్ని వాహనాలు అవసరమో అంచనా వేసి, వాటినీ సమకూర్చాలి. పట్టణాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి. పట్టణాల్లో ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలి. గుంతలు పూర్తిగా పూడ్చేయాలి. దహన వాటికలు/ఖనన వాటికల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయాలి. పొదలు, మురికి తుమ్మలను నరికేయాలి. వెజ్/నాన్ వెజ్ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, వాటి కోసం స్థలాలను ఎంపిక చేయాలి. క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయాలి. డంప్ యార్డుల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించాలి. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్ నిర్మించాలి. వీటి కోసం స్థలాలు గుర్తించాలి. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి. వీధులపై వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించేవరకు వారిని ఇబ్బంది పెట్టొద్దు. పార్కింగ్ స్థలాలు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగు కోసం ఏర్పాటుచేయాలి. పట్టణాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఆధునిక పద్ధతులు అవలంభించాలి. ప్రమాద రహిత విద్యుత్ వ్యవస్థ ఉండాలి. వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్ఫార్మర్లు మార్చాలి. వేలాడే వైర్లను సరిచేయాలి. రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీ లేని రుణం తదితర పథకాల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోవాలి. రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి టి.హరీశ్‌రావు, ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తెచ్చిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికార యంత్రాంగాన్ని కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ అభినందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. -
సౌతాఫ్రికాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
జోహన్నెస్‌బర్గ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సౌతాఫ్రికాలో ఘనంగా నిర్వహించింది. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతి అద్భుతం. తెలంగాణ పురోగతి రోజు రోజుకి పటిష్టమతుండటం చూసి పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ విధానాలను కొనియాడారు. అలాంటి మహానుభావుడైన కేసీఆర్ ఆలోచన విధానం నుంచి రూపొందిన హరితహారం కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఈరోజు పాటించి.. మొక్కలు నాటింది. అలాగే అనాథ శరణాలయములో పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేపట్టాం. టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ బిగాల మహేష్, ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు ఆదేశాలతో కోర్ కమిటీ టీం ఈసారి కూడా దక్షిణాఫ్రికాలోని మూడు రాష్ట్రాల్లో( జోహన్నెస్‌బర్గ్, డర్బన్, కేప్‌టౌన్) కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరపాలని ఓల్డేజ్ హోమ్స్, అనాథ శరణాలయాలు, హాస్పిటల్ డ్రైవ్, కాన్సర్పై అవగాహన డ్రైవ్, మొక్కలు నాటించే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఈ భారీ కార్యక్రమానికి చారిటీ ఇంచార్జ్‌లు శ్రీధర్ అగ్గనగారి, అరవింద్ చీకోటిల ఆధ్వర్యంలో కోర్ కమిటీ టీమ్ అంతా ఆహర్నిశలు కృషి చేస్తుందని.. అలాగే కేప్‌టౌన్ ఇంచార్జ్ వీరన్న గండ్ల, డర్బన్ ఇంచార్జ్ రవిన్రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్టు’చెప్పారు. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ మీడియా ఇంచార్జ్ కిరణ్‌కుమార్ బెల్లి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలాగే గతంలో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని, బిగాల మహేష్ గారు విసిరిన చాలేంజ్‌ను గుర్రాల నాగరాజు అట్టహాసంగా ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రగతి భవన్లో జరుగుతోంది. పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రిమండలిలో చర్చ జరగనుంది.అలాగే పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా, సోమవారం సీఎం కేసీఆర్ 66వ జన్మదినం నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నేడు కేబినెట్ భేటీ..
-
అభిమానం ‘ఆకృతి’ ఐతే..
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో రెండ్రోజుల ముందే ఆయన జన్మదిన వేడుకల సందడి నెలకొంది. ఈనెల 17న కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు తమ అభిమాన నేతకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పారు. శనివారం పట్టణంలోని మైదానంలో 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2.600 మంది తమ అభిమాన నేత కేసీఆర్ ఆకారంలో నిలబడ్డారు. ఈ దృశ్యాన్ని 120 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ కెమెరాలో బంధించారు. అనంతరం మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి పాల్గొన్నారు. -
నేడు కేబినెట్ భేటీ.. సీఏఏ, ఎన్నార్సీపై తీర్మానం?
సాక్షి, హైదరాబాద్ : పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. జనవరి మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో ప్రారంభమవుతాయని భావిస్తున్న నేపథ్యంలో.. ఆలోగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 5 వరకు నిర్వహించాల్సిన పట్టణ ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలపై ఆదివారం కేబినెట్లో చర్చ జరిగే అవకాశముంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర కార్యక్రమాల జోలికి వెళ్లకుండా పూర్తిగా పట్టణ ప్రగతిపై దృష్టి కేంద్రీకరించేలా ఈ సమావేశంలో మార్గనిర్దేశనం చేసే అవకాశముంది. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటై పాలక మండళ్లు కొలువుదీరిన నేపథ్యంలో పట్టణ సమస్యలకు పల్లె ప్రగతిలో పరిష్కారం చూపాలని సీఎం భావిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, మొక్కల పెంపకం, విద్యుత్ సమస్యల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశముంది. సీఏఏ, ఎన్నార్సీపై తీర్మానం? పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) తదితరాలపై ప్రభుత్వ వైఖరి ప్రకటిస్తామని కొంత కాలంగా సీఎం కేసీఆర్ చెబుతూ ఉన్నారు. అవసరమైతే వీటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని కూడా గతంలో కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆదివారం జరిగే భేటీలో ఈ అంశంపై చర్చించి ప్రభుత్వపరంగా నిర్ణయం వెల్లడించే అవకాశముంది. కాగా, ఇటీవలి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీఎం.. నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న వివక్షను అసెంబ్లీ వేదికగా ఎండగట్టే యోచనలో ఉన్నారు. ఆదివారం జరిగే కేబినెట్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, ఇతరాలకు సంబంధించిన నోట్‌ను ప్రవేశ పెట్టి చర్చిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడనున్నారు. ఆమె వ్యాఖ్యల్లో నిజానిజాలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. కొత్త పాలసీలపైనా ప్రస్తావన.. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేకంగా ‘ఎన్ఆర్ఐ పాలసీ’రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న ఎన్ఆర్ఐ పాలసీలను కూడా అధ్యయనం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కేరళ నమూనాను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్ బృందం పర్యటించింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే సీఎం కేసీఆర్ గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ పాలసీ విధివిధానాలపై కేబినెట్ భేటీలో ప్రస్తావనకు రానుంది. కొత్త రెవెన్యూ చట్టం, పీఆర్సీ అమలు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పాటించాల్సిన పొదుపు చర్యలపైనా కేబినెట్లో చర్చించే అవకాశముంది. పాలన సంస్కరణలపైనా చర్చ.. పాలన సంస్కరణలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. ఇటీవల జాయింట్ కలెక్టర్ పోస్టులను రద్దు చేస్తూ జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించిన విషయం తెలిసిందే. పాలన పరంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేబినెట్ భేటీలో ప్రవేశ పెట్టి ఆమోదించే అవకాశముంది. కాగా, సోమవారం సీఎం కేసీఆర్ 66వ జన్మదినం నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. -
‘సీతమ్మ సాగర్’ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీకి సీతమ్మసాగర్‌గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.ఈ మేరకు సాగునీటి శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ఇది వరకే నిర్ణయం తీసుకోగా, దాని పేరుమార్చుతూ జీవోలు విడుదల చేయాలని ఇంజనీర్లకు సూచించారు. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో దీని పేరును సీతమ్మ సాగర్‌గా పెట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే గోదావరిపై చేపట్టిన తుపాకులగూడెం పేరుకు సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. -
జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదిలోని ఒక్క నీటి చుక్కనూ వదలొద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని ఒడిసిపట్టే బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. గోదావరి నీటిని వినియోగిస్తూ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్రతి బ్యారేజీ, రిజర్వాయర్‌లో నీటిని రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూనే నిరంతరం అవి జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్ వేసింది. ఇప్పటికే ఖాళీ అయిన లోయర్‌మానేరు డ్యామ్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం... మరోపక్క ఎల్లంపల్లిని నింపేందుకు నిండుగా ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ నుంచి పంపింగ్ మొదలుపెట్టింది. ఏప్రిల్‌లో మేడిగడ్డ మొదలు అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలను పూర్తిగా ఖాళీ చేసి ఆ నీటితో దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేలా ప్రణాళిక తయారు చేసింది. మొత్తంగా మేడిగడ్డ నుంచి లోయర్ మానేరు వరకు 100 టీఎంసీలు నిరంతరం లభ్యతగా ఉండేలా, జూన్‌లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి ఎస్సారెస్పీలో కనీసం 50 టీఎంసీల నీటి లభ్యత పెంచేలా భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఎల్ఎండీకి సాగుతున్న తరలింపు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా ఎల్ఎండీకి నీటి తరలింపు కొనసాగుతోంది. రాత్రి సమయంలో నంది, గాయత్రి పంపులను 8 గంటలపాటు నడుపుతూ ఎల్లంపల్లి నుంచి నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నారు. రోజుకు అర టీఎంసీకి తగ్గకుండా సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2 టీఎంసీల మేర నీటిని తరలించగా ఎల్ఎండీలో ప్రస్తుతం 24 టీఎంసీలకుగాను 8.35 టీఎంసీల నిల్వలున్నాయి. మరో వారంపాటు ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి 13 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మిడ్‌మానేరులో నీటి నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 25.87 టీఎంసీలకుగాను 24.63 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లికి మొదలైన ఎత్తిపోత... ఎల్ఎండీకి నీటిని తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను 10.98 టీఎంసీ ల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి మరో 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని గురువారం కాళేశ్వరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో నిండుకుండలా ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించేలా శుక్రవారం రాత్రి మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని మోటార్లను ప్రారంభించి ఎత్తిపోతల మొదలుపెట్టారు. ప్రస్తుతం మేడిగడ్డలో 16.12 టీఎంసీలకుగాను 14.80 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి 5 టీఎంసీలను అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించనున్నారు. మేడిగడ్డలో 11 మోటార్లు సిద్ధంగా ఉండగా ఎన్ని మోటార్లతో ఎంతమేర నీటిని, ఎన్ని రోజులపాటు నడపాలన్నది విద్యుత్ శాఖ సూచనల మేరకు నిర్ణయించనున్నారు. ఇక అన్నారంలో ఇప్పటికే 10.87 టీఎంసీలకుగాను 6 టీఎంసీలు, సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 4.5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఏప్రిల్‌లో మూడు బ్యారేజీలు ఖాళీ... ప్రస్తుతం మేడిగడ్డ మొదలు ఎల్ఎండీ వరకు 100 టీఎంసీలకుగాను సుమారు 70 టీఎంసీల మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిని ఖాళీ చేస్తూ ఎల్ఎండీని నింపుతుండగా ఎల్లంపల్లిని నింపేందుకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు. దీంతో ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండీ వరకు నీటి లభ్యత గణనీయంగా పెరగనుంది. ఇక వర్షాకాలం ప్రారంభమైతే జూన్ 15 నుంచే మేడిగడ్డ వద్ద గోదావరి నీటి లభ్యత పెరుగుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రోజుకు కనీసం 2 టీఎంసీల మేర మొత్తంగా 530 టీఎంసీలను ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లభ్యతగా ఉండే నీటినంతా ఖాళీ చేసి దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు వదలాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాటిల్లో లభ్యతగా ఉన్న సుమారు 25 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలి మిగతా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయనున్నారు. బ్యారేజీలను ఖాళీ చేసి వాటిలో ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉన్నా పగుళ్లు, లీకేజీలు వంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. జూన్‌లో మళ్లీ గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే నాటికి అన్ని పరిశీలనలు, మరమ్మతులు చేసి ఎత్తిపోతలకు వాటిని సిద్ధంగా ఉంచనున్నారు. జూన్‌లోనే ఎస్సారెస్పీ నుంచి సాగుకు నీళ్లు.. అయితే బ్యారేజీలను ఖాళీ చేసే సమయంలో నీటిని దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీలను నింపుతూనే మరోపక్క కొంత నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం దాని కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 90 టీఎంసీలకుగాను 62 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ప్రస్తుత యాసంగిలో మరో 25 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్‌లో బ్యారేజీలను ఖాళీ చేసే సమయానికి ఎస్సారెస్పీలో 36–37 టీఎంసీల మేర నిల్వ ఉంటుంది. బ్యారేజీల నుంచి వదిలే 24 టీఎంసీల్లో కనీసం 15–20 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తే అక్కడ 50 టీఎంసీల మేర లభ్యత పెరుగుతుంది. ఈ లభ్యత నీటితో జూన్ నుంచే ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. నిజానికి ఎస్సారెస్పీకి ఆగస్టు వరకు ఎగువ నుంచి ప్రవాహాలు రావు. కానీ ప్రస్తుతం కాళేశ్వరం నీటితో జూన్ నుంచే లభ్యత పెంచడంతోపాటు సాగుకు నీటి విడుదల సాధ్యమయ్యేలా ప్రణాళిక రచించారు. సమాంతరంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం.. కృష్ణా, గోదావరి నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ ఒడిసిపట్టేలా భారీగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపడుతుండటం తెలిసిందే. తొలి విడతగా ఈ ఏడాది 615 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించగా ఇందులో గోదావరి పరిధిలో 410, కృష్ణాలో 205 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని ఈ ఏడాది వర్షాలు కురిసే నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కాళేశ్వరం కాల్వల పరిధిలోని 150 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించగా ఇందులో కరీంనగర్ జిల్లా పరిధిలోవే 32 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. కాళేశ్వరం పరిధిలోని చెక్‌డ్యామ్‌లను జూన్ నాటికి పూర్తి చేస్తే వాటి కింద నీటి కట్టడి సాధ్యం కానుంది. -
ఒక్క చుక్క పోవద్దు : కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుని రిజర్వాయర్లను నింపుతూ.. గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే. ఎస్సారెస్పీ మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పంపులు, కాల్వల ద్వారా చివరాఖరు ఆయకట్టు వరకు వ్యవసాయ భూములను తడిపేలా సునిశిత పర్యవేక్షణ చేయాలి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కేసీఆర్ గురువారం కరీంనగర్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్నారు. నాణేలు వదిలి.. పుష్పాంజలి ఘటించి.. కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం సన్నిధిలోని గోదా వరి ఘాట్‌కు చేరుకున్న కేసీఆర్.. గోదావరి, ప్రాణహిత సంగమ స్థలి, అంతర్వాహిని సరస్వతీ నదుల త్రివేణి సంగమ పుణ్య స్థలిని దర్శించుకున్నారు. ప్రాణహిత గోదారి గంగ పవిత్ర జలాలను తలపై చల్లుకుని నాణేలు వదిలి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత గోదావరి ఘాట్ నుంచి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం చేరుకుని పూజలు చేశారు. తర్వాత లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజ్ వద్ద నిండు కుండను తలపిస్తున్న ప్రాణహిత నదీ జలాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. బ్యారేజ్ వద్దకు చేరుకున్న సీఎం.. బ్యారేజ్ మీద నుంచి నదీ జలాల్లో నాణేలు వదిలి, ఉద్యమ కాలం నాటి మొక్కు చెల్లించుకున్నారు. ‘సాగునీటి’పై అధికారులకు క్లాస్ మేడిగడ్డ వ్యూ పాయింట్ వద్ద ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం వరద నీరు ఉధృతంగా చేరుతుందని, ఈ నేపథ్యంలో లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే సహా పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ‘ప్రాజెక్టుల నిర్మాణం, నీటి సరఫరా విషయంలో ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని పూర్తిస్థాయిలో ఇంజనీరింగ్ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి. అవసరమైతే పోలీసుల మాదిరి వైర్లెస్, వాకీటాకీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని పని చేయాలి. సమాచారాన్ని ప్రతి క్షణం చేరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్ నడుస్తోంది.. ఏ పంపు పోస్తోంది.. ఎంత నీరు ఎత్తిపోయాలి.. ఎప్పుడు ఆపాలే.. ఎప్పుడు నీటిని కిందికి వదలాలే వంటి పలు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాలపై కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి’అని కేసీఆర్ తెలిపారు. అలా సమన్వయంతో పనిచేస్తేనే గోదావరి జలాలను నూరు శాతం సద్వినియోగపర్చుకోవడం సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్టనున్నట్టు వివరించిన సీఎం.. మేడిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజన అనంతరం కరీంనగర్ బయల్దేరారు. ముక్తేశ్వర స్వామికి పూజలు.. లక్ష్మీ బ్యారేజీ సందర్శన కంటే ముందు.. కాళేశ్వర క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు పుష్కరఘాట్‌లో గోదావరిమాతకు సీఎం కేసీఆర్ పూజలు చేశారు. గోదావరిలో నాణేలు వదిలిన కేసీఆర్.. చీర, సారె సమర్పించారు. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐజీ నాగిరెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు గండ్ర జ్యోతి, అలుగు శ్రీవర్షిణి, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు. -
సమ్మక్క బ్యారేజీ.. సీఎం కేసీఆర్ నామకరణం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీర వనిత, వన దేవత.. ‘సమ్మక్క’పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు బ్యారేజీకి ‘సమ్మక్క బ్యారేజీ’గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధర్‌రావును ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉండటంతోనే రాష్ట్రంలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తై బీడు భూముల్లోకి కాళేశ్వరం నీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు. కాగా, సీఎం కేసీఆర్ గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బుధవారం రాత్రి ఆయన కరీంనగర్ జిల్లా తీగలగట్టుపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడే బస చేసి గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తా రు. తర్వాత లక్ష్మీ బ్యారేజీని సందర్శించి, అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరిగి తీగలగట్టుపల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. నీటి విడుదలపై సమీక్ష... సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఈఎన్సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేతో సమీక్ష నిర్వహించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుతోంది. బ్యారేజీలు నిండుకుండలా మారినయ్. రానున్న వానా కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసే దిశగా.. అటు నుంచి కాలువలకు మళ్లించేలా.. ఇరిగేషన్ శాఖ అప్రమత్తం కావాలి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కమలాకర్, అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి బ్యారేజీలో ప్రస్తుతం 16.12 టీఎంసీ నిల్వలకు గాను 14 టీఎంసీల మేర నిల్వలు ఉన్నాయి. దీంతో లక్ష్మి పంప్‌హౌజ్ పరిధిలో 11 పంప్‌లను రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా సిద్ధం చేశారు. ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్ ద్వారా ఎల్ఎండీకి తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మి బ్యారేజీలో ఉన్న నీటిని ఎల్లంపల్లికి తరలించడంపై కేసీఆర్ గురువారం నాటి పర్యటన సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చే అవకాలున్నాయి. ఇదిలా ఉండగా, తుపాకులగూడెం బ్యారేజీకి వనదేవత శ్రీసమ్మక్క పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. -
తెలంగాణ రెవెన్యూ కోడ్..!
సాక్షి, హైదరాబాద్ : భూ పరిపాలన, హక్కులపై ఉన్న గందరగోళాలకు తెరదించుతూ, దీనికి సంబంధించిన అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు యూపీ సర్కారు 2016లో అమల్లోకి తెచ్చిన రెవెన్యూ కోడ్‌ను సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్రం కోసం కొత్త రెవెన్యూ కోడ్‌కు రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ యూపీ కోడ్ అధ్యయనం చేసే పనిలో పడినట్లు సమాచారం. వాస్తవానికి, నిజాం రాష్ట్రంలో ‘ఫస్లీ–1317’చట్టాన్ని రూపొందించారు. ఈ ఫస్లీయే ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని రెవెన్యూ చట్టాలకు భూమికగా వస్తోంది. భూ పరిపాలనకు సంబంధించిన అన్ని చట్టాలు, భాగాలు, అధ్యాయాలు, సెక్షన్లు అన్నీ ఈ చట్టంలో సమగ్రంగా ఉండేవి. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత భూపాలన, హక్కులకు సంబంధించిన ఒక్కో అంశంపై ఒక్కో చట్టం చేశారు. లేదంటే చట్టంలోనే సబ్ సెక్షన్లుగా నియమ నిబంధనలను విడగొట్టారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు/రూల్స్ అమల్లో ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా ఉన్న వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి యూపీ తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్ అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అదే తరహాలో కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడాలని యోచిస్తోంది. మరోవైపు పాశ్చాత్య దేశాలే కాకుండా, పొరుగు రాష్ట్రంలోనూ అమలు చేస్తున్న టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నా, ఇది అమల్లో కష్టసాధ్యమని, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ రెవెన్యూ కోడ్ లేదా తెలంగాణ భూచట్టం’వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కోడ్‌కు తుదిరూపు ఇచ్చేముందుకు ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం నిర్వహించి కోడ్‌పై విస్తృతంగా చర్చించాలని కూడా ఆయన నిర్ణయించినట్లు సమాచారం. యూపీ చట్టం ఇది... దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా రెవెన్యూ వ్యవస్థ గందరగోళంగా ఉండేది. భూ చట్టాల అమల్లో ఉన్న ఇబ్బందులకు పరిష్కారంగా రెవెన్యూ కోడ్ రూపొందించాలని ఆ రాష్ట్ర లా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు 2006 సంవత్సంలో యూపీ రెవెన్యూ కోడ్‌కు అక్కడి ప్రభుత్వం రూపకల్పన చేసింది. 2012లో దీన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఆ తర్వాత 2016 నుంచి ఈ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కోడ్‌లో మొత్తం 16 అధ్యాయాలు, 234 సెక్షన్లు ఉన్నాయి. భూపరిపాలన, భూహక్కులకు సంబంధించిన అన్ని చట్టపరమైన అంశాలు ఈ కోడ్‌లోనే పొందుపరిచారు. అంతకుముందు మనుగడలో ఉన్న 32 చట్టాలను కోడ్ రాకతో అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే తరహాలో 1999లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ కోడ్ రూపొందించారు. అప్పటికే ఉన్న 191 చట్టాలను క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్ భూమి రెవెన్యూ కోడ్–1999 పేరుతో తయారు చేశారు. ఇందులో 17 భాగాలు, 47 అధ్యాయాలు, 260 సెక్షన్లను పొందుపరిచారు. భూపాలనకు సంబంధించిన చట్టాలన్నింటినీ ఒకే చోటకు తెచ్చే ప్రయత్నానికి కేంద్రం మోకాలడ్డింది. శాసనసభ ఆమోదముద్ర వేసిన బిల్లును కేంద్రానికి పంపగా 146 ప్రశ్నలతో తిప్పి పంపింది. దీంతో కోడ్ అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ను యూపీ కోడ్ ఆధారంగా తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మా దోస్త్‌ను కూడా వదలలేదు? కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ మరోసారి రెవెన్యూశాఖపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులివ్వందే పనులు కావడం లేదని మండిపడ్డారు. ‘పాస్ పుస్తకం కోసం మా దోస్తు పోతే వీఆర్వో పైసలు అడిగిండు. అసలేం జరుగుతోంది. విజయారెడ్డిని అన్యాయంగా పోగొట్టుకున్నం. చిన్న పిల్లలు అన్యాయమైపోయారు. ఇలాంటి సంఘటనల తర్వాత కూడా రెవెన్యూ వాళ్లు మారరా? కనువిప్పు కలగాలి. ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. భూ రికార్డుల ప్రక్షాళనను లోపభూయిష్టంగా చేశారు. భూ రికార్డులు సరిగ్గా ఉన్న ప్రాంతాల్లో 3 శాతం జీడీపీ అదనంగా వస్తోందని రుజువైంది. ఇప్పటికైనా మార్పు రావాలి’అని సీఎం కేసీఆర్ కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
మార్పు రాకుంటే ఉపేక్షించం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పరిపాలనా విభాగాలు చిన్నవయ్యాయి. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడకుండా ప్రతినెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నాం. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించాం. ఎంపీఓ, ఎంపీడీవో, డీఎల్పీవో, డీపీఓ, జడ్పీ సీఈఓ వంటి పోస్టులన్నింటినీ భర్తీ చేశాం. ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాం. ప్రతీ గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం కలెక్టర్లపై నమ్మకంతో తన అధికారాలను వారికి బదిలీ చేసింది. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. ప్రగతిభవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 11 గంటలపాటు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ మారథాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, పజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప.. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని స్పష్టంచేశారు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలని, రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ‘విస్తృత మేధోమథనం, అనేక రకాల చర్చోప చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ– విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత. వారి పనితీరుకు ఇదే గీటురాయి. మొక్కలు నాటి, సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే సమస్యే లేదు’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల నిర్వహణను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ‘రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలోనే ఉంటుంది. భూ సంబంధ రికార్డులు పక్కాగా ఉండాలి. కచ్చితంగా సంస్కరణలు రావాలి. 95 శాతం భూముల విషయంలో ఎలాంటి పేచీ లేదు. మిగతా వాటిని పరిష్కరించాలి’ అని సూచించారు. ఇంకా పలు అంశాలపై సీఎం ఏమన్నారంటే... అదనపు కలెక్టర్లకు వేరే పనులు వద్దు... అదనపు కలెక్టర్లలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించాం. వారికి మరో పని అప్పగించవద్దు. ఒక అడిషనల్ కలెక్టర్ కేవలం స్థానిక సంస్థలను సమర్థవంతంగా పని చేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలి. వారి కంప్యూటర్లో అన్ని గ్రామాలు, పట్టణాల చరిత్ర, సంపూర్ణ వివరాలు ఉండాలి. అదనపు కలెక్టర్లందరికీ రెండు రోజుల పాటు ‘గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి’పై శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఈ తరగతులకు కలెక్టర్లను కూడా ఆహ్వానించాలి. రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం’నిర్వహించాలి. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఆహ్వానించాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లను ముఖ్య అతిథులుగా పిలవాలి. సమావేశం తర్వాత పది రోజుల గడువు ఇవ్వాలి. ఆలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఫ్లయింగ్ స్క్వాడ్లు పర్యటిస్తాయి. ముఖ్యమంత్రిగా నేను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తాను. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. అన్ని విషయాలపై అవగాహన ఉండాలి... సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్న యువ ఐఏఎస్ అధికారులే రేపు రాష్ట్రానికి కార్యదర్శులుగా, శాఖాధిపతులుగా వివిధ హోదాల్లో పనిచేస్తారు. అందువల్ల మంచి విధానాలు అమలవుతున్న ఇతర దేశాల పర్యటనలకు వెళ్లాలి. అన్ని రంగాల్లో ఉత్తమ పద్ధతులు, విధానాలను వారు అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయాలి. మున్సిపల్ శాఖలో ఖాళీల భర్తీ.. పంచాయతీ రాజ్ శాఖ మాదిరిగానే మున్సిపల్ శాఖలో కూడా అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని ఖాళీలున్నాయి. ఎక్కడెక్కడ ఏ పోస్టులు భర్తీ చేయాలో మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కూడా సమకూరుస్తాం. హైదరాబాద్ నగరానికి నెలకు రూ.78 కోట్ల చొప్పున.. మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేస్తాం. ఈ నిధులతో పాటు, స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. గ్రామాలు, పట్టణాల్లో వందకు వంద శాతం పన్నులు వసూలు చేయాలి. గ్రామాల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లే పట్టణాల్లో చెత్త సేకరణకు వాహనాలు కొనుగోలు చేయాలి’అని కేసీఆర్ ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పాటు పట్టణ పరిపాలనకు సంబంధించి వ్యవహరించాల్సిన తీరుపై మంత్రులు కె.తారకరామారావు, శ్రీనివాస్‌గౌడ్ కలెక్టర్లకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం సహా ఇతర అంశాలపై సీనియర్ అధికారులు, కలెక్టర్లు తమ అభిప్రాయాలు తెలిపారు. పీసీసీఎఫ్ శోభ హరితహారం, అడవుల పునరుద్ధరణపై వివరించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణ కొత్త మున్సిపల్ చట్టంపై వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో డీజిల్ వాహనాలు తగ్గించాలి ‘సముద్రం ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరగడానికి అవకాశాలెక్కువ. ఇప్పుడు హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం కాక తప్పదు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. హైదరాబాద్ నగరం లోపల, చుట్టూ కలిపి లక్షా 60వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో అడవులు పెం చాలి. వనస్థలిపురంలోని హరిణి వనస్థలిని కేబీఆర్ పార్కులాగా తయారు చేయాలి. హైదరాబాద్‌లో కాలుష్యం నివారించడానికి అనుగుణమైన ప్రణా ళిక రూపొందించి అమలు చేయాలి. డీజిల్ వాహనాలు తగ్గించి, ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెంచే చర్యలు తీసుకోవాలి. ఈ నగరాన్ని కాలుష్యమయం కాకుండా చూసుకోవాలనే స్పృహ కలిగిలా తీసుకోవాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండాలి.. ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలోనే అద్భుత ప్రగతి సాధించాం. విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి వసతి ఏర్పడుతోంది. ఇప్పుడు మన ముందున్న అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని.. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడమే. ఇక కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, కంటివెలుగు వంటి కార్యక్రమాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాలు. ఎంతో మేధోమథనం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తుంది. అలాంటి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో కలెక్టర్లు అమలు చేయాలి. కలెక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పరిపాలనను క్రమబద్ధం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కలెక్టర్లకు అండగా ఉండడం కోసం అదనపు కలెక్టర్లను నియమించాం. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలి. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం, బాధ్యతలు ఉంచింది. కొత్తగా తెచ్చిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల అమలులో కలెక్టర్ల బాధ్యత పెరిగింది. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్‌గా వ్యవహరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చాం. దీనివల్ల కొంత పనిఒత్తిడి తగ్గుతుంది. కలెక్టర్లు ఇతర అధికారులతో సంప్రదింపులు జరపడానికి వీలుగా వైర్లెస్ సెట్లు సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నాం. ‘పట్టణ ప్రగతి’పై శిక్షణ ఇవ్వాలి.. పల్లె ప్రగతి తరహాలోనే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగా పట్టణాలు, నగరాల్లో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో మున్సిపల్ సమ్మేళనం నిర్వహించాలి. మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కమిషనర్లను ఈ సమావేశానికి పిలిచి శిక్షణ ఇవ్వాలి. పట్టణ ప్రగతి కార్యక్రమం కన్నా ముందే అన్ని వార్డుల్లో కమిటీలు నియమించాలి. ఈ కార్యక్రమానికి పట్టణా ల్లోని వార్డును యూనిట్‌గా చూడాలి. ఆ వార్డులోని ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వం నియమించే ప్రజాకమిటీలోని సభ్యులు పట్టణ ప్రగ తి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణంలో పాదయాత్రలు చేసి, వార్డులవారీగా సమస్యలు గుర్తించాలి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని పార్కులు, ఇతర అవసరాలకు వినియోగించాలి. అన్ని పట్ట ణాలకు 2 కిలోమీటర్ల దూరంలో వాకింగ్‌కు అనుకూలంగా పార్కులను అభివృద్ధి చేయాలి. గుట్టలు, కొండల మీద గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి పట్టాలివ్వాలి. పట్టణాల్లో రూ.5లక్షల వరకు వ్యయం చేసే పనులను కలెక్టర్ అనుమతితో చేపట్టవచ్చు. ఇళ్లపై వేలాడే కరెంట్ వైర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామానికి ఒక నర్సరీ పెట్టినట్టే, పట్టణాల్లో కూడా అక్కడి జనాభాను బట్టి అవసరమైనవన్ని నర్సరీలు ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో స్థలం దొరకకపోతే సమీప గ్రామంలో పట్టణానికి సంబం ధించిన నర్సరీ ఏర్పాటు చేయాలి. అన్ని పట్టణాల్లో వెజ్/నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించాలి. మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం మూడు చొప్పున, పట్టణాల్లో కనీసం ఒకటి చొప్పున ఈ మార్కెట్లను నిర్మించాలి. వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు, మరీ ముఖ్యం గా మహిళలు టాయిలెట్లు లేక చెప్పరాని అవస్థలు పడుతున్నారు. అన్ని పట్టణాల్లో విధిగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి. ముందుగా కలెక్టరేట్లలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి. ప్రత్యామ్నాయం చూపించకుండా వీధుల వెంట షాపులు నిర్వహించేవారిని, టాక్సీ స్టాండ్లను, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునేవారిని బలవంతంగా తరలించొద్దు. మెదడువాపుతో పాటు ఇతర వ్యాధులకు కారణమవుతున్న పందుల నివారణకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పందులను పోషిస్తూ జీవించే వారికి ప్రత్యేక ఉపాధి చూపించాలి. దట్టంగా అడవులు పెంచాలి... పల్లె ప్రగతి కొద్దికాలం చేసి ఊరుకునే కార్యక్రమం కాదు. నిరంతరం సాగాలి. దేశం లో ఆదర్శ పల్లెలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలి. గ్రామాల్లో ఎవరు చేయాల్సిన పనిని వారితోనే చేయిం చాలి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవస్థతో పనిచేయిం చాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను కచ్చితంగా బతికించాలి. గ్రామం లో స్మశాన వాటికలు, ఖనన వాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తివేయడానికి ట్రాక్టర్ కొనుగోలు చేయాలి. గ్రామాల్లో పర్యటించినప్పుడు మీ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రా ముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతి కలెక్టర్ వద్ద రూ.కోటి అందుబాటులో ఉంచుతాం. గ్రామాల్లో మొక్కలు నాటడం మాత్రమే కాదు. అడవుల్లో కలప అక్రమ రవాణాను అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. చెట్లు నరకకుండా చూడాలి. అటవీ భూముల్లో దట్టమైన అడవులు పెంచాలి. పదెకరాల అటవీభూమిలో అడవిని అభివృద్ధి చేయడం పదివేల ఎకరాల్లో సామాజిక అడవులు పెంచడంతో సమానం. కాబట్టి అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. గ్రీన్ ప్లాన్ అమలుకు నిధుల కొరత రాకుండా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తాం. సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలి.. ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నాయి. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించాలి. కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలి. అక్షరాస్యతలో వెనకబడిన రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతినబూనాలి. గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలి. జిల్లాను పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లాగా మార్చే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. వారు సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలి. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. -
పాలనలో కొత్త పుంతలు.. కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్ : జిల్లాల పాలనలో కొత్త అధ్యాయానికి తెర లేచింది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం జిల్లా అధికారులకు పని విభజన చేసింది. ప్రస్తుతమున్న జిల్లా కలెక్టర్లకు చేదోడు వాదోడుగా ఉండటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలను పూర్తి చేసేందుకు అదనపు కలెక్టర్లను నియమించింది. ప్రస్తుత జాయింట్ కలెక్టర్ (జేసీ) పోస్టును రద్దు చేసి దాని స్థానే ఇద్దరు అడిషనల్ కలెక్టర్లను నియమించి వారికి వేర్వేరు బాధ్యతలను అప్పగించింది. ముఖ్యంగా కొత్తగా తేవాలనుకుంటున్న రెవెన్యూ చట్టంతోపాటు ఇప్పటికే అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్, పుర చట్టాలను సమర్థంగా అమలు చేయడమే ప్రధాన బాధ్యతగా ఈ పోస్టులను తెరపైకి తెచ్చింది. స్థానిక సంస్థలను గాడిన పెట్టడం, రెవెన్యూ వ్యవహారాలను కొలిక్కి తేవడమే ప్రాతిపదికగా కొత్త సారథులను రంగంలోకి దించింది. మొత్తంమీద జిల్లా స్థాయిలో ఇక నుంచి కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లతో తీన్‘మార్క్’పడనుంది. పల్లె, పట్టణాలకు పెద్దపీట... ప్రస్తుతం జేసీలుగా పనిచేస్తున్న వారు ఇక నుంచి అదనపు కలెక్టర్ (సాధారణ) బాధ్యతలు నిర్వహించనున్నారు. వారు రెవెన్యూ వ్యవహారాలతో పాటు పౌర సరఫరాలు, కొనుగోళ్ల కమిటీ, భూసేకరణ అంశాలను పర్యవేక్షిస్తారు. ఈ పోస్టుకుతోడు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పదవిని ప్రభుత్వం సృష్టించింది. పంచాయతీరాజ్, పురపాలనను ఈ అధికారి పరిధిలోకి తేనుంది. దీంతో పట్టణ, పంచాయతీల్లో పాలనను పారదర్శకంగా, అవినీతిరహితంగా మలచాలని భావిస్తోంది. ఇప్పటివరకు మున్సిపాలిటీలపై కలెక్టర్లకు పెద్దగా అధికారాలుండేవి కావు. యాజమాయిషీ అంతా పురపాలకశాఖ డైరెక్టర్‌దే ఉండేది. కమిషనర్లు, ఇతర ఉద్యోగులు తప్పులు చేస్తే చర్యలు తీసుకొనే అధికారం కూడా కలెక్టర్లకు లేదు. కేవలం సిఫారసుకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉండేది. అయితే మనుగడలోకి వచ్చిన కొత్త పుర చట్టంలో ఈ లోటును అధిగమించేలా సర్కారు సంస్కరణలు చేపట్టింది. పురపాలికలనూ కలెక్టర్ల పరిధిలోకి తెచ్చి వారికి సంపూర్ణ అధికారాలు కట్టబెట్టింది. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకు వేసింది. పురపాలన పర్యవేక్షణకు ఏకంగా అదనపు కలెక్టర్లను నియమించి పరిపాలనలో సంస్కరణలకు కొత్త బీజం వేసింది. అయితే అదనపు కలెక్టర్‌ను కేవలం మున్సిపల్ వ్యవహారాలకే పరిమితం చేయకుండా పంచాయతీరాజ్ పగ్గాలను కూడా అప్పగించనుంది. తద్వారా స్థానిక సంస్థలపై పట్టుబిగించేలా జిల్లా పాలనలో కీలక సంస్కరణ తీసుకొచ్చింది. పల్లె ప్రగతి కార్యక్రమాల పర్యవేక్షణ, హరితహారం, నర్సరీల నిర్వహణ వ్యవహారాలను వారు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పురపాలనలో పట్టణ æప్రగతి, లే అవుట్ల మంజూరు, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చే కమిటీలో వారే ప్రధాన పాత్ర పోషించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నాడు ఏజేసీ.. నేడు జేసీ పోస్టుకు మంగళం గతంలో రంగారెడ్డి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో అడిషనల్ జాయింట్ కలెక్టర్ (ఏజేసీ) పోస్టు ఉండేది. ఏజేసీకి కూడా కొన్ని శాఖలను కేటాయించడం ద్వారా పని విభజన చేశారు. రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇద్దరు జేసీలు ఉండేవారు. వారికి జిల్లాలోని మండలాలను దాదాపు చెరిసగం పంచారు. అలాగే సంక్షేమం, పౌర సరఫరాలు తదితర శాఖలతో సర్దుబాటు చేశారు. అయితే విధానపరమైన నిర్ణయాల్లో అంతిమ నిర్ణయం మాత్రం జిల్లా కలెక్టర్‌కే ఉండేది. 2016లో జిల్లాల పునర్విభజన అనంతరం ఏజేసీ పోస్టులు సహా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్–2 పోస్టును కూడా రద్దు చేసి ఒకరితోనే సరిపెట్టారు. తాజాగా అన్ని జిల్లాల్లో జేసీ పోస్టును ఎత్తేసి ఇద్దరేసి అదనపు కలెక్టర్లను నియమించడం ద్వారా పాలనను కొత్త పుంతలు తొక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖను సంస్కరించాలని భావిస్తున్న సీఎం... మరిన్ని కొత్త నిర్ణయాలు, పాలనాపరమైన అధికార వికేంద్రీకరణ జరిపే అవకాశం లేకపోలేదు. మరిన్ని అధికార కేంద్రాలను సృష్టించే ఆస్కారమూ లేకపోలేదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. అయితే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, అందులో భాగంగానే జిల్లా పాలనా కేంద్రాల్లో మార్పులు జరిగి కొత్త పోస్టును సృష్టించారనే ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ప్రజల దైనందిన వ్యవహారాల్లో కీలకమైన రెవెన్యూ వ్యవస్థను పకడ్బందీగా నడిపించే బాధ్యతను అదనపు కలెక్టర్లు చూస్తారని, మిగతా రెవెన్యూ శాఖ స్వరూపంలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని తెలుస్తోంది. గ్రామస్థాయి పోస్టుల్లో కొన్నింటిని మార్చడంతోపాటు భూ రికార్డుల సవరణలు, రిజిస్ట్రేషన్ చట్టాల అమలు బాధ్యతలను ఆర్డీవో, ఆపై స్థాయి అధికారులకు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం... జిల్లా కలెక్టర్లతోపాటు కొత్తగా నియమితులైన అదనపు కలెక్టర్లకు సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి మొత్తం 8 అంశాలతో ఎజెండా తయారు చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో కలెక్టర్ల పాత్ర, ప్రక్షాళన చేసిన భూ రికార్డుల ఫ్రీజింగ్, అదనపు కలెక్టర్ల జాబ్‌చార్ట్, కీలక ప్రగతి సూచికలు, మత్స్య సంపద, మాంస ఉత్పత్తుల పెంపుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగంగా కీలక మానవాభివృద్ధి సూచికలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేయనున్నారని, ఈ విషయంలోనే జిల్లా అధికారులు చేపట్టాల్సిన కీలక చర్యల గురించి వివరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు కొత్త రెవెన్యూ చట్టం అమలుపైనా ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్టు సమాచారం. -
తగ్గిన కేంద్ర పన్నుల వాటా.. రాష్ట్ర బడ్జెట్‌పై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక మాంద్యం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడులు, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల నేపథ్యంలో ఈసారి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెలలో ప్రవేశపెడతారని భావిస్తున్న 2020–21 వార్షిక బడ్జెట్ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేయడంతో కచ్చితమైన ఖర్చులు, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను ప్రతిపాదించాలంటే భూములపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి తీసుకొనే అప్పులకుతోడు బడ్జెట్లో భూముల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందన్న దానిపైనే వార్షిక బడ్జెట్ అంచనాలు ఆధారపడతాయనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములతోపాటు అన్ని రకాల భూములపై వివరాల సేకరణను రెవెన్యూ శాఖ ముమ్మరం చేయడంతో భూముల అమ్మకాల విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే విధానం చర్చనీయాంశమవుతోంది. రాబడులు ఈసారీ అంతంత మాత్రమే... గత మూడేళ్ల వార్షిక రాబడులను పరిశీలిస్తే ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఆదాయం లేదని బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. రాబడులకుతోడు అప్పులు కలిపినా బడ్జెట్ అంచనాల్లో 90 శాతం మేర నిధుల సమీకరణ జరగడం లేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1.13 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం రూ. 88,711 కోట్లు మాత్రమే వచ్చింది. దీనికి అదనంగా రూ. 26,738 కోట్లను ప్రభుత్వం అప్పుల రూపంలో సమకూర్చుకుంది. 2018–19 సంవత్సరానికిగాను రూ. 1.30 లక్షల కోట్ల ఆదాయ అంచనాకు రూ. 1.01 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. ఆ ఏడాది రూ. 26,949 కోట్లను అప్పుల రూపంలో తీసుకురాగా మొత్తం ప్రతిపాదిత వార్షిక బడ్జెట్లో 92 శాతం నిధులే వచ్చాయి. ఇక ఈ ఏడాది గణాంకాలను పరిశీలిస్తే రూ. 1.13 లక్షల కోట్ల అంచనాకుగాను మూడో త్రైమాసికం ముగిసిన డిసెంబర్ నాటికి రూ. 71,187 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీనికి అప్పులు రూ. 21,715 కోట్లను కలిపితే డిసెంబర్ వరకు రావాల్సిన నిధుల్లో 90.74 శాతం నిధులు మాత్రమే సమకూరాయి. ఇక చివరి త్రైమాసికం విషయానికి వస్తే 2017–18లో చివరి మూడు నెలల ఆదాయం రూ. 29 వేల కోట్లు రాగా 2018–19లో రూ. 33,500 కోట్ల వరకు వచ్చింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే అంచనాలో 63 శాతం మేరకు ఆదాయం వచ్చింది. చివరి మూడు నెలల్లో పన్నుల రూపంలో రూ. 20 వేల కోట్లు, అప్పుల రూపంలో మరో రూ. 10 వేల కోట్లు... వెరసి రూ. 30 వేల కోట్ల వరకు నిధులు సమకూరుతాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూడేళ్ల రాబడులు, అప్పులను అంచనా వేస్తే వచ్చే ఏడాది కూడా రాబడులు (అప్పలు కాకుండా) రూ. లక్ష కోట్లు దాటే పరిస్థితులు కనిపించడం లేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం మరో ఆరునెలలపాటు కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదలతో 2020–21 సంవత్సరానికి కూడా రాబడులు అంతంత మాత్రమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో తయారీ, ఫార్మా రంగాల్లో వినియోగించే చైనా ఉత్పత్తులు తగ్గిపోతే వచ్చే ఏడాది పన్నులకు నష్టం వాటిల్లుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో స్థిరత్వం కనిపిస్తుండగా లిక్కర్ ధరలు పెంచడంతో కొంత మేరకు నిధులు సమకూరుతాయనే అంచనాలున్నాయి. ఇక జీఎస్టీ విషయంలో కేంద్రం అనుసరించే వైఖరి, ఇచ్చే పరిహారం ఏ మేరకు ఉంటాయన్నది కూడా సందేహమే కావడంతో ఆ పన్నులపైనా ఆశలు పెట్టుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వచ్చే ఏడాది నెట్టుకురావడానికి భూముల అమ్మకాలపై ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2020–21 బడ్జెట్ రూ. 1.55 లక్షల కోట్లు? 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.46 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించింది. ఈసారి 8 శాతం వృద్ధి అంచనాతో 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.55 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఇరిగేషన్‌కు రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ. 6 వేల కోట్లకుపైగా కేటాయింపులు చూపినా అప్పులతో కలిపి ఈ ఏడాది డిసెంబర్ వరకు రూ. 18 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఈ అంచనాల నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా రూ. 20 వేల కోట్ల వరకు వ్యయం అవసరమవుతుందని సాగునీటి శాఖ వర్గాలంటున్నాయి. రుణమాఫీకి రూ. 18 వేల కోట్లు కేటాయించే చాన్స్ ఈసారి 2018 ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందనే చర్చ జరుగుతోంది. రుణమాఫీకి రూ. 24 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో పెట్టిన రూ. 6 వేల కోట్లకు తోడు వచ్చే ఏడాది బడ్జెట్లో రూ. 18 వేల కోట్లు రుణమాఫీకి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించడంతో అదనంగా చేరిన 12 లక్షల మందికి కూడా పింఛన్లు ఇవ్వాల్సి ఉన్నందున గతేడాది కంటే రూ. 2,500 కోట్లు అదనంగా.. అంటే రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. దీంతోపాటు రైతుబంధు పథకం కోసం రూ. 12 వేల కోట్లు, జీతభత్యాలకు రూ. 23–25 వేల కోట్లు, సబ్సిడీలకు రూ. 9 వేల కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ. 15 వేల కోట్లు అవసరం అవుతాయి. వాటితోపాటు రైతు బీమా, ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ, కల్యాణ లక్ష్మికి కలిపి రూ. 8 వేల కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. విద్యుత్ రాయితీల రూపంలో మరో రూ. 9 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమాలకు రూ. 12 వేల కోట్లు, విద్యకు రూ. 10 వేల కోట్లు, హోంశాఖకు రూ. 5 వేల కోట్ల అనివార్య కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది అదనంగా పట్టణ ప్రగతి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అవి కూడా రూ. 1,500 కోట్ల వరకు అవసరమవుతాయి. ఇవన్నీ కలిపి రూ. 1.55 లక్షల కోట్ల వరకు ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలకు అవకాశం ఉందనేది ఆర్థిక శాఖ వర్గాల అంచనాగా కనిపిస్తోంది. ఇందులో కొన్ని ఖర్చులు తగ్గించుకున్నా ఇతర అవసరాలకు నిధులు కావాల్సి వస్తుందని, మొత్తం మీద ఆ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశముందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతరం పూడ్చేదెలా? బడ్జెట్ ప్రతిపాదనలు, వాస్తవిక ఆదాయం మధ్య అంతరాన్ని ఎలా పూడ్చుకోవాలన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌గా మారనుంది. ఇందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం అనుమతించిన మేరకు అప్పులు తేవడంతోపాటు భూముల అమ్మకాలే ప్రధాన వనరుగా మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా భూమి లెక్క తేల్చే పనిలో బిజీగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, అటవీ, ఇతర భూముల వివరాలు ఇప్పటికే ఉన్నప్పటికీ అమ్మకానికి అనువుగా ఉన్న భూముల లెక్కను రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని విలువైన భూములను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉంది. ఇజ్జత్‌నగర్‌లో 36 ఎకరాలు, తెల్లాపూర్‌లో 46 ఎకరాలు, హైటెక్స్ సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్లో 8 ఎకరాలు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి అమ్మకం ద్వారా రూ. 3 వేల కోట్లకు పైగా ఆదాయం రానుంది. వాటికితోడు సుప్రీంకోర్టులో కేసులు క్లియర్ అయిన కోకాపేటలో 146 ఎకరాలు అమ్మితే రూ. 4,380 కోట్లు, పుప్పాలగూడలోని 198 ఎకరాలకు రూ. 7 వేల కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మేడ్చల్, శంషాబాద్, రాజేంద్రనగర్‌ల పరిధిలోని ఎవాక్యూ భూములు అమ్మకానికి పెడితే రూ. వేల కోట్ల ఆదాయం రానుంది. వాటన్నింటితోపాటు అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించి పేదలను నుంచి తీసుకొని వాటిని అమ్మితే ఎలా ఉంటుందన్న దానిపై బ్లూప్రింట్ తయారవుతోంది. అందులో భాగంగానే శంషాబాద్ మండలంలోని ఆరు గ్రామాల్లో లెక్కకడితే రూ. 5,745 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తేలింది. దీనికితోడు ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓ ప్రణాళిక ప్రకారం వెళితే రూ. 25–50 వేల కోట్ల వరకు భూముల అమ్మకాల ద్వారా సమీకరించుకునే అవకాశాలున్నా ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే పెద్ద ఎత్తున భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, వచ్చే ఏడాదికి అవసరమయ్యే వరకు ప్రతిపాదనలు చేసి ఆ తర్వాతి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే యోచనలో ఉందని తెలుస్తోంది. -
తెలంగాణలో జేసీ పోస్టు రద్దు
-
మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయండి
-
అక్బరుద్దీన్ ఒవైసీ వినతి.. కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రిని కలసి ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో నిర్వహించే బోనాలు దేశవ్యాప్తంగా లాల్‌దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నా చాలినంత స్థలం లేకపోవడం వల్ల ఆలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోవట్లేదని.. దీనివల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. ‘లాల్ దర్వాజ మహంకాళి ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారు. కానీ ఈ గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉంది. ఇంత తక్కువ స్థలం ఉండటం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయండి. దేవాలయ విస్తరణ వల్ల దీనికి ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశముంది. వారికి ప్రత్యామ్నాయంగా జీహెచ్ఎంసీ అధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని కోరుతూ స్వయంగా (ముఖ్యమంత్రి) మీరు బంగారు బోనం సమర్పించారు. ఆలయ విస్తరణకు ఆ సమయంలోనే ప్రకటన కూడా చేశారు. ఇక పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్ మసీద్ మరమ్మతుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయండి. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారు. మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతోంది..’అని అక్బరుద్దీన్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. -
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా సంస్కరణల అమల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలో రెవెన్యూ చట్టం అమలు, భూ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ (జేసీ) పోస్టును రద్దు చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాయింట్ కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించింది. చాలా జిల్లాల జాయింట్ కలెక్టర్లను అదే జిల్లాకు అదనపు కలెక్టర్లుగా బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు కొత్త అధికారులను అదనపు కలెక్టర్లుగా, అలాగే 14 జిల్లాలకు వేరే అధికారులను అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 49 మంది నాన్‌కేడర్, కేడర్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పాలన సర్వీసుల దిశగా.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మిని స్ట్రేటివ్ సర్వీసును నెలకొల్పి రాష్ట్రంలో పాలనా సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు మరింతగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేసి అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పోస్టులను సృష్టించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కలెక్టర్ నేతృత్వంలోని అదనపు కలెక్టర్ల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)లకు కొన్ని నిర్దిష్ట శాఖలు అప్పగించనుంది. అదనపు కలెక్టర్లు ప్రధానంగా రెవెన్యూ శాఖను పర్యవేక్షించనున్నారు. అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థలు)కు ప్రభుత్వం కీలకమైన కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల అమలు బాధ్యతలను అప్పగించనుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, అకస్మిక తనిఖీలు, నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారాలను వీరికి కట్టబెట్టనుంది. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లను సైతం వీరి పరిధిలోకి తీసుకురానుంది. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల గణన (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులను వీరికే అప్పగించే అవకాశముంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, నర్సరీ ఏర్పాటు, సర్టిఫికెట్ల జారీ ఇకపై వీరే పర్యవేక్షించనున్నారు. వీరిపై జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పోస్టుల విధులు, బాధ్యతలు, జాబ్ చార్ట్‌పై ఈ నెల 11న నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. అవినీతి నిర్మూలనే ప్రధాన ధ్యేయం.. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో భారీ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భారీగా పరిపాలన వికేంద్రీకరణ జరిగినా అవినీతి కారణంగా ప్రజలకు ఆశించిన ఫలితాలు అందట్లేదు. అవినీతి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకురాగా, త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావల్సిన పనులు జరగాలని, ఇందుకు కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా స్థాయిలో కొత్తగా అదనపు కలెక్టర్ పోస్టులను సృష్టించి, ఒక్కో అదనపు కలెక్టర్‌కు కొన్ని కీలకమైన శాఖల బాధ్యతలను అప్పగించబోతోంది. త్వరలో రాష్ట్ర స్థాయిలో కూడా.. రాష్ట్ర స్థాయిలో సైతం ప్రభుత్వం పాలన సంస్కరణలను అమలు చేయబోతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పాటు చేయనుంది. సీఎస్‌కు సహాయంగా అదనపు సీఎస్ల బృందాన్ని నియమించనుంది. వీరికి కొన్ని శాఖల బాధ్యతలను అప్పగించనుంది. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నేతృత్వంలో పనిచేసే బృందం పనితీరును సీఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించనుంది. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోనుంది. (చదవండి: అక్బరుద్దీన్ ఒవైసీ వినతి.. కేసీఆర్ ఆదేశం) -
ముగిసిన మేడారం మహా జాతర
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. నాలుగు రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న వనదేవతలు సమ్మక్క–సారలమ్మ శనివారం సాయంత్రం తిరిగి అడవిలోకి ప్రవేశించారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు, వడ్డెలు వనదేవతలను వనంలోకి తీసుకెళ్లారు. మేడారం గద్దెలపై కొలువుదీరిన నలుగురు దేవతల వనప్రవేశం ఉద్విఘ్నంగా సాగింది. ఆ దృశ్యం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. జాతర చివరి రోజున సుమారు 15 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. శనివారం మేడారంలో భారీ వర్షం కురవడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో సొంతూళ్లకు తిరుగు పయనమైన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక పూజలతో వనంలోకి... దేవతల వనప్రవేశ ఘట్టం శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. మొదట గోవిందరాజును దబ్బగట్ల గోవర్దన్, పోదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి .. గంటలకు కదిలించి ఏటూరునాగారం మండలం కొండాయికి తరలించింది. అనంతరం ... గంటలకు సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్లతో కూడిన మరో బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించాక సమ్మక్కను అక్కడి నుంచి కదిలించి చిలుకలగుట్టకు చేర్చింది. ఇక సమ్మక్క భర్త పగిడిద్దరాజున.. గంటలకు పెనక మురళీధర్, పూజారుల బృందం తరలించి కొత్తగూడ మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రంలోగా వారు గమ్యాన్ని చేరుకుంటారు. ఇక సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లతో కూడిన పూజారుల బృందం గద్దెపై ప్రతిష్టించిన ముట్టె (వెదురుబుట్ట)ను.. గంటలకు తీసుకొని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చింది. భక్తులు ఈ సమయంలో పూజారులను తాకి, మొక్కుకోవడానికి ప్రయత్నించారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగతో మహా జాతర పరిసమాప్తమవుతుంది. అప్పటిదాకా భక్తులు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు. నాలుగోరోజు వీఐపీల తాకిడి మేడారం జాతర చివరి రోజూ వీఐపీల తాకిడి కొనసాగింది. కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. తులాభారంతో నిలువెత్తు (75 కిలోలు) బంగారాన్ని తల్లులకు సమర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తల్లులను దర్శించుకున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్‌రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, షేరి సుభాశ్‌రెడ్డి, నవీన్‌రావు అమ్మలను దర్శించుకున్న వారిలో ఉన్నారు. వారితోపాటు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి, ఆ రాష్ట్ర సీఎస్ ఆర్.పి. మండల్, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. సీఎం అభినందనలు... మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతంగా ముగించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జాతరను విజయవంతం చేసేందుకు అహర్నిశలు పనిచేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయపరిచి జాతరను అద్భుతంగా జరిగేందుకు కృషి చేసిన మంత్రులు, ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా సమ్మక్క–సారలమ్మ దీవిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారం జాతర విజయవంతం మేడారం జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగాం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు సహచర మంత్రులు, ప్రజాప్రతిని«ధులు, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు మొదటి నుంచి ప్రణాళికతో సాగారు. తద్వారా జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం కనిపించలేదు. శనివారం మేడారాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండాను కూడా ఈ విషయమై కోరాం. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి -
దానవీరులు
సిరిసంపదలు సృష్టించడం బ్రహ్మ విద్య మాత్రమే కాదు, ఒక గొప్ప కళ. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాగానే ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో సాలుకి ఎకరాకి కోటింజిల్లర ఆదాయం రావడం మొదలు పెట్టింది. ఆదిత్యుని కటాక్ష వీక్షణాలతో శమంతకమణి తునక ఆ క్షేత్రంలో జారిపడిందని సనాతనులు విశ్వసించారు. కాదు, హైబ్రిడ్ క్యాప్సికమ్ అనే బుంగ మిరపకాయలు విరగకాసి తద్వారా కోటికి పడగలెత్తారని చంద్రశేఖరరావు నమ్మినబంట్లు పొలికేకలు పెట్టారు. ‘కాదు.. ఇవన్నీ శాస్త్రానికి నిలవవు’ అంటూ విషయ పరిజ్ఞానం కలిగిన హేతువాదులు ఇళ్లెక్కి అరిచి మొత్తుకున్నారు. ఏది ఏమైనా వ్యవసాయ క్షేత్రాలకు ఆఖ రికి వజ్రాలు పండినా పన్నులేదని ట్యాక్స్వాళ్లు తేల్చి చెప్పారు. ఆ మహాపంట, ఆ ఆదాయం వాటి వెనకాల ఉన్న శక్తి యుక్తులు ఏవిటో ఈ రోజుకీ ఆయనకు తప్ప వేరేవరికీ తెలియదు. చిదంబర రహస్యంగానే మిగిలి ఉంది. ఈ శమంతకోపాఖ్యానాన్ని ఇలా ఉంచి మరికొన్ని ఆదాయ వనరుల్ని పరిశీలిద్దాం. ఆనాడు గాంధీగారికి వేసిన సాదా సీదా పూలదండని ఏ బిర్లాగారో వెయ్యి రూపాయలకు వేలంలో పాడి ఉద్యమానికి జమవేసిన సందర్భం ఉంది. కాంగ్రెస్ సభలో నెహ్రూగారి మెళ్లో పడిన నూలు దండని వెయ్యినూట పదహార్లకు సింఘానియాలు సొంతం చేసుకుని పార్టీ నిధికి జమవేశారు. అప్పటి రోజుల్లో పరోక్షంగా అవన్నీ భూరి విరాళాలు. ఇప్పుడు కేవలం ఒక ప్లేటు భోజనం. అంతే! ఈమధ్య వేలంపాటల తాలూకు అపశ్రుతులు పేపర్ల కెక్కాయ్. మెట్రోలో జోకులై చిటపటలాడాయ్. మన అగ్ర నేతలంతా శ్రమదానాలతో లక్షలకి లక్షలు కుమ్మారని, దాన్ని సొంత పార్టీకి మంచి పనులకి ధారపోసి దానవీరం ప్రదర్శించారని వార్తలొచ్చాయ్. ఒకాయన చిన్న చిన్న బరువులు మోసి అయి దా రులకారాలు ప్రజల నుంచి గుంజాడు. కేటీఆర్ స్వయంగా కొన్ని చిన్నాచితక పనులు చేసి లక్షలు ఆర్జించి ప్రజలకి ధారపోసి, చేతికి ఎముక లేదని నిరూ పించుకున్నారు. అమ్మాయి కవిత నే తక్కువ తిన్నానా.. ఇదిగో నా కష్టార్జితం అంటూ లక్షలు గుమ్మరించి నుదుటి చెమట తుడుచుకుంది. హరీష్‌రావు పై సంగతి వేసి పెద్దరికంగా మిగిలిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మాణాల దగ్గర ఇసుక సిమెంట్, కంకర బొచ్చెలకెత్తుకుని కేసీఆర్ లక్షలకి లక్షలు ఉద్యమ సాదరు ఖర్చులకు లోటు లేకుండా చూశారు. ఇంతవరకు బానే ఉంది. తర్వాత అసలు కథ మొదలైంది. మీ మీ శ్రమదాన ఆదాయాన్నీ లెక్కల్లో చూపించారా? దానికి పద్ధతిగా పన్ను చెల్లింపులు జరిగాయా? చెల్లించని యెడల మీ ‘ఈజీ మనీ’పై అపరాధ రుసుంతో సహా ఫలానా ఫలానా నిబం ధన కింద పన్నెందుకు వసూలు చేయరాదో చెప్పాలని కేటీఆర్ అని కూడా ఖాతరు చెయ్యకుండా ఐటీవాళ్లు తాఖీదులు జారీ చేశారు. అసలు ఆదాయపు పన్ను వారికి ఓర్పు, సహనాలు చాలా తక్కువ. హస్తవాసి బావుండి డాక్టర్‌కి పది రూపా యలు అదనంగా వస్తే వాళ్లు సహించలేరు. వాక్శుద్ధి కలిగిన లాయర్‌కి నాల్రూపాయలు వచ్చాయని తెలిస్తే తట్టుకోలేరు. ఆఖరికి ప్రైవేట్ ట్యూషన్ మేష్టర్లని కూడా వదలరు. ఆ మధ్య అపరకర్మల మీద బాగా పిండు కుంటున్నాడని ఓ పంతుల్ని కర్మల రేవులో రెడ్ హ్యాండె డ్గా కాటేశారు ఇన్‌కమ్‌ట్యాక్స్ వాళ్లు. గోదాన, భూదాన సువర్ణాది షోడశ దానాలూ పరోక్షంగా పెద్ద తలకాయలకే ముడుతున్నట్టు తేల్చి పాపం ముంచేశారు. పంతులు చేసేది లేక వచ్చిన శాపనార్థాలన్నీ పెట్టాడు. ఐటీ శాఖ వారు ‘జాన్దేవ్’ అనేసి నోటీసులు జారీ చేసేశారు. లాటరీ వచ్చినా వాళ్లొదలరు. ‘జన్మకో శివరాత్రి మహా ప్రభో వదలండి’ అని కాళ్లావేళ్లా పడ్డా మాక్కూడా సేమ్ టు సేమ్ కదా అంటూ రూపాయికి పావలాలు పట్టేస్తారు. ఇదివరకు, ఇప్పుడు కూడా పార్టీ పెద్ద పండుగల ప్పుడు సభల్లో హుండీలు పెడతారు. కలెక్షన్లు బానే ఉంటాయ్. ఇక్కడో చమత్కారం ఉందని చెబుతారు. ‘ఏవుంది, ఓ చేత్తో పడేసి, ఇంకో చేత్తో తీసుకోవడమే.. ఈ రోజుల్లో హుండీలో వేసేది ఎవరండీ అని’ ఒకాయన వాపో యాడు. మనమే తుమ్మి మనమే చిరంజీవ అనుకోవాలి. ఎవరిని నమ్మి కరెన్సీ కట్టలిస్తాం? మళ్లీ అన్నీ పడ్డాయో లేదో తేలేదాకా టెన్షను. ఇలా హుండీ ఆదాయాలు చూపించకపోతే తర్వాత ఏ శేషనో ఖర్చులు బైటికిలాగి లేనిపోని యాగీ చేస్తే– అదో పెద్ద తంటా. ఇవన్నీ గుప్తదానాలు. ఎవరు ఏమిచ్చారో ఎందుకిచ్చారో చెప్పక్కర్లేదు. చంద్రబాబు పదే పదే అంటు న్నట్టు బంగారు గుడ్లు పెట్టే బాతుగా ప్రతి హుండీ ఆ రోజుల్లో నిధులు సమకూర్చేది. మావూరి రచ్చబండ మీద ఒక పెద్దాయన తాజా విశేషాలు చెబుతూ, మా చంద్ర బాబుకి అయిదేళ్లనాడు ఈ సంగతి తెలిస్తేనా... అంటూ మొదలుపెట్టాడు. మొన్న మన గోడవతల చైనాలో తొమ్మిది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని, ఇంకో వారంలో ఇంకోటి నిర్మించారట. వాళ్ల దగ్గర కావల్సిన యంత్రాంగం, మంత్రాంగం ఉందిట! మనకి మాట మాత్రం తెలిస్తే మనకీ అద్భుతం జరిగేది అనగానే అంతా ఛీకొట్టారు. వాళ్లది వేరు, మనది వేరు అని నోరు మూయించారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నగర వాసులకు మరో శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి స్థాయిలో నగర వాసులకు అందుబాటులోకి రానుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెబీఎస్ నుంచి ఎమ్‌జీబీఎస్‌కు రోడ్డు మార్గం ద్వారా వెల్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణం దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైల్లో అందుబాటులోకి వస్తే.. కేవలం 15నిమిషాల్లోన్నే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య ఇక తీరనుంది. కాగా ఈ మార్గం పూర్తవడంతో నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రోరైల్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎమ్జీబీఎస్ నుంచి ఫలక్నామ నిర్మాణ దశలోనే ఆగిపోయింది. ఆ 5 కిలోమీటర్ల మినహాయిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే చెప్పాలి. -
మహిళా ఐఏఎస్‌లకు కేసీఆర్ పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : గత ప్రభుత్వ మంత్రివర్గంలో కనీసం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణకు తొలి మహిళా గవర్నర్ బాధ్యతలు చేపట్టడంతో పాటు ఇద్దరు మహిళా మంత్రులకు కూడా ఈసారి కేసీఆర్ అవకాశం కల్పించారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో మహిళా అధికారులకూ ముఖ్య బాధ్యతలను అప్పగిస్తున్నారు. పరిపాలన ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ఒకేసారి 50 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అధికారులకు పెద్దపీఠ వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 21 జిల్లాలకు కొత్త పాలానాధికారులను నియమించగా.. వాటిల్లో 8 జిల్లాలకు మహిళా అధికారులను కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించడం విశేషం. (50 మంది ఐఏఎస్‌ల బదిలీ) పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో మహిళా కలెక్టర్లను నియమించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరానికి యువ ఐఏఎస్ అధికారిని శ్వేతా మహంతికి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. మరో యువ అధికారిని సిక్తా పట్నాయక్‌ను నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి కలెక్టర్‌గా నియమించారు. కేవలం కలెక్టర్లనే కాకుండా ప్రభుత్వ ముఖ్య శాఖల్లో కూడా మహిళా అధికారులకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత కల్పించారు. యువ అధికారులు కావడం.. గతంలో ముఖ్యశాఖలకు విధులు నిర్వర్తించిన అనుభవం ఉండటంతో పాలనాపరంగా కలిసోస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇటీవల ముగిసిన పల్లెప్రగతి తొలి విడత కార్యక్రమంలో సాధించిన ఫలితాలు, త్వరలో అమల్లోకి తేనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిగణనలోకి తీసుకుని సర్కారు జిల్లా కల్లెక్టర్ల బదిలీలు జరిపినట్లు తెలుస్తోంది. నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హరిచందన జనగామ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కె.నిఖిల కొత్తగా బాధ్యతలు చేపట్టిన మహిళా అధికారులు 1. పాసమి బసు, కలెక్టర్ (వికారాబాద్) 2. దేవసేన (ఆదిలాబాద్) 3. హరిచందన (నారాయణ్‌పేట) 4. శ్వేతా మహంతి (హైదరాబాద్) 5. శృతి ఓఝూ (జోగులాంబ గద్వాల) 6. సిక్తా పట్నయక్ (పెద్దపల్లి) 7. కె. నిఖిల (జనగామ) 8. షేక్ యాస్మిన్ బాషా (వనపర్తి) -
బడ్జెట్ 2020 : కేసీఆర్ తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని మండి పడ్డారు. నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సీనియర్ అధికారులతో దాదాపు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్ పై ఈ క్రింది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. (బడ్జెట్ : తెలంగాణకు దక్కినవేంటి?) కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. కానీ సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి రూ.19,718 కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక కేంద్రం నిధుల్లో కోత విధించడం వల్ల తారు మారు అయింది. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థత మాత్రమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి, రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. ప్రతీ సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూ ఇటు అయిన సందర్భాలున్నాయి కానీ, 2019-20 సంవత్సరంలో ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల నిర్వహణలో లోపానికి నిదర్శనం. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై దారుణంగా పడింది. (ఏపీకి అందని సీతమ్మ వరాలు) 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది. ఒకటి.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. రెండు.. తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్ల రూపాయలు తగ్గనున్నాయి. ఇంత భారీగా తెలంగాణకు నిధులు తగ్గించడం ఖచ్చితంగా వివక్షే. ఈ తగ్గుదల ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రణాళికలపై పడుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తున్నది. ఈ సారి కూడా అంచనాలు సవరించే నాటికి చెప్పిన దాంట్లో ఎంత తగ్గిస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతున్నది. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తున్నది. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా రూ.1,137 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్లో పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారు. దీనివల్ల శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుంది. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధికి 2019-20 బడ్జెట్లో రూ.1,037 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్ వచ్చే సరికి గత ఏడాదికన్నా 148 కోట్ల రూపాయలు తగ్గించి, కేవలం 889 కోట్లు మాత్రమే కేటాయించారు. పట్టణాభివృద్దికి ఇచ్చే నిధుల్లో 14.3 శాతం కోత పెట్టారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల సహాయం తెలంగాణ రాష్ట్రానికి అందివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులు అమలు చేయాలని కేంద్రానికి అనేక సార్లు విన్నవించాం. అయినా వారు పట్టించుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసులేదు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించాం. దాని నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించాం. కానీ కేంద్రం నిధులు కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత అందివ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో ఎక్కడా తగిన కేటాయింపులు చేయలేదు. అన్ని ప్రధాన రంగాలకు కోతలు : కేసీఆర్ రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందన్నారు. ‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. జిఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, తదితర రంగాలకు నిధులను తగ్గించారు. ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. (బడ్జెట్లో తెలంగాణకు దక్కని కేటాయింపులు!) వ్యవసాయరంగానికి 2019-20 సంవత్సరంలో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.39 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికి గత ఏడాది 2.24 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 2.13 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి గత ఏడాది 4.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.94 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. విద్యా రంగానికి గత ఏడాది 3.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.22 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ : తెలంగాణకు దక్కినవేంటి?
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్ఎస్ సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవని ఆ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించకపోగా.. కనీసం విభజన హామీలను సైతం నెరవేర్చలేదని పెదవి విరిశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి విజ్క్షప్తి చేసిన విషయం తెలిసిందే. దాదాపు లక్ష కోట్లతో నిర్మించిన ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. కానీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో దాని ప్రస్తావనే లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తీవ్ర నిరాశ చెందారు. (బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం) గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇచ్చిన హామీని విస్మరిస్తూ.. రెండు బడ్జెట్ సమావేశాలు ముగిసినా.. కేంద్రం నుంచి ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నా.. ముందడుగు మాత్రం పడలేదు. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ.. కేంద్రం విడుదల చేయడంలేదని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, తమపై ఇంత వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ఏపీకి అందని సీతమ్మ వరాలు..) అలాగే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలను కేంద్రానికి ప్రతిపాదిస్తోంది. వాటిలో కాజీపేట్ రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నిజామాబాద్ పసుపు బోర్డుతో పాటు కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి అంశాలను ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. గత బడ్జెట్లో వీటికి మొండిచేయి చూపడంతో.. ఈ సారైనా కేంద్ర కరునిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ విత్తమంత్రి ప్రసంగంలో మాత్రం వాటి ప్రస్తవన లేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర నుంచి నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు కూడా బడ్జెట్లో కేటాయింపులు పెద్దగా లేకపోవడంతో.. తెలుగు ప్రజలు పూర్తి నిరాశలో ఉన్నారు. (కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి) -
120 గెలుస్తం
సాక్షి, హైదరాబాద్ : ‘మేం 100 పైగా పురపాలికలు గెలిచినం. ఎక్స్అఫీషియో ఓట్లతో ఈ సంఖ్య 115 నుంచి 120 వరకు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ వాళ్లు తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు (ఎక్స్అఫీషియో) ఓట్లు వేసే అవకాశముంది. దీంతో 115 నుంచి 120 పురపాలికలు గెలిచే ఆస్కారం ఉంది. అన్ని చోట్లా పోయి మేం రిగ్గింగ్ చేస్తమా? అన్ని చోట్లా వెళ్లి మేము దొంగ ఓట్లు వేస్తమా? ప్రతి చోటా మేం కుమ్మక్కయితమా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న చోట్లలో కూడా చాలా చోట్ల గెలిచినం.. మా ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని చోట్లలో ఒకటీఅరా ఓడిపోయినం కదా? దాన్నేం అంటరు’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత శనివారం ఆయన తెలంగాణభవన్‌లో పార్టీ నేతలతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ఈ వేవ్ ఎప్పుడూ చూడలేదు.. ‘ఆ అవాకులు చవాకులు మానేసి ప్రజా తీర్పును గౌరవించే సంస్కారాన్ని అలవర్చుకోవాలి. ఫలితాలొచ్చాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యం విలువ కోల్పోతుంది. వీళ్ల పిచ్చికూతలేవీ పట్టించుకోవద్దని ప్రజలు మాకు సందేశమిచ్చిన్రు. కాబట్టి వీ డొంట్ స్టాప్ అవర్ మిషన్. నా అనుభవంలో చాలా వేవ్‌లు చూసిన. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ వేవ్ చూసిన. ఈ వేవ్ నేనెప్పుడూ చూడలేదు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీరాజ్ ఎన్నికలు కావొచ్చు.. ఏడాది తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు.. ఇంత స్థిరమైన వేవ్ ఒకపార్టీ పట్ల, ఒక నాయకత్వం పట్ల కొనసాగడం సాధారణ విషయం కాదు. ఈ విజయాన్ని శిరోధార్యంగా తీసుకుంటం. గుండెల్లో పెట్టుకుంటం. మా కర్తవ్యాన్ని, బాధ్యతను ఈ విజయం మరింత పెచింది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు గర్వం, అహంకారం రావొద్దు’అని పేర్కొన్నారు. మా విధానాలు నచ్చాయి.. ‘మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఈ జిల్లా.. ఆ జిల్లా అనే తారతమ్యం లేకుండా 360 డిగ్రీల్లో ఒకే విధమైన ఫలితాన్ని ఇచ్చారు. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, విధానాలపై అనేక చర్చోపచర్చలు, వాదోపవాదాల తర్వాత అద్భుతంగా బలపర్చారు. మాపట్ల వారి విశ్వాసాన్ని తెలిపారు. ఇతరులు ఏమీ మాట్లాడినా పట్టించుకోకండి.. మీరు నిర్దేశించుకున్న లక్ష్యం వైపు కొనసాగండని వారు మమ్మల్ని ఆదేశిచ్చినట్లు భావిస్తునాం. మేం అవలంభించే 100 శాతంలౌకికవాద విధానం, అన్ని మతాలు, కులాల పట్ల సమాదరణ, అందరినీ కలుపుకొని పోయే పద్ధతి ప్రజలకు బాగా నచ్చిందని ఈ ఫలితాలు సందేశమిచ్చాయి. ఈ రోజు ఇంత బలమైన తీర్పునిచ్చి వెన్నుతట్టి మమ్మల్ని ముందుకు నడుపుతున్న తెలంగాణ ప్రజానీకానికి వ్యక్తిగతంగా నా పక్షాన, పార్టీ తరఫున శిరస్సు వంచి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నా. గెలిచిన విజేతలందరికీ అభినందలు. గెలుపు కోసం అహోరాత్రులు పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు. గెలుపు కోసం తమ ప్రాంతంలోనైనా, ఇతర ప్రాంతానికైన వెళ్లి అద్భుతంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి పార్టీ నేతలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌కు నా ఆశీస్సులు’అని కేసీఆర్ చెప్పారు. ఇది అసాధారణ విజయం.. ‘డిసెంబర్లో నేను శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు అనేక అనుమానాలు వెలిబుచ్చారు. కానీ, కరాంఖండిగా 93 నుంచి 102 స్థానాలు గెలుస్తామని చెప్పినం. 88 సీట్లను గెలవడం అద్భుతమైన సంకేతం. ఇటీవల గెచిన హుజూర్‌నగర్‌తో కలిపి సొంతంగా 89 స్థానాలు గెలుచుకున్నం. శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయం వచ్చింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా మాకు మెజారిటీ స్థానాలొచ్చినయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 32కి 32 జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్ గెలుచుకోవడం భారతదేశ చరిత్రలో ప్రథమం. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలను ఆపాలని విశ్వప్రయత్నం చేసిన్రు. ఎన్నికల ప్రక్రియ ముగిస్తే పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రజలిచ్చిన సమయాన్ని వినియోగించుకోవచ్చని మేమనుకుంటే.. అనేక రకాలుగా కోర్టుల చుట్టూ తిప్పి ఎన్నికలు జరగకుండా చేయాలని చూసిన్రు. అన్ని అవాంతరాల తర్వాత ఎన్నికలు జరిగినా ప్రజలు మాత్రం ముక్తకంఠంతో అద్భుత తీర్పు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో విభిన్న సమూహాల ఓటర్లుంటారు. సాధారణంగా ఇలాంటి ఫలితాలు రావు. చాలా కష్టంతో కూడిన పని. నాకున్న 40–45 ఏళ్ల అనుభవంలో దాదాపు అనేక మున్సిపల్ ఎన్నికలను నేను చూసిన. 1994లో అన్నగారు రామారావుతో పాటు నేను టీడీపీలో పనిచేస్తున్న. మధ్య నిషేధం ప్రకటిస్తే ప్రజలు మమ్మల్ని బ్రహ్మండంగా గెలిపించిన్రు. మద్య నిషేధంతో ప్రభుత్వంపై రూ.వేల కోట్ల భారం పడింది. విధి లేక సేల్స్ ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది. ఆ వెంటనే ఎన్నికలు పెడితే ట్యాక్స్ పెంచారనే కోపంతో ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారు. రాజీవ్ గాంధీ మరణించినప్పుడు కూడా నేను అప్పుడు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట మున్సిపాలిటీలో మెజారిటీ సంపాదించుకున్న. కానీ, పన్నులు పెంచినప్పుడు 5 వేల మెజారిటీతో మున్సిపాలిటీ ఓడిపోయిన’అని కేసీఆర్ వివరించారు. ప్రజలు అమ్ముడుపోయిన్రు అంటే మళ్లీ శిక్షిస్తరు.. ‘టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం అని.. ప్రజలు నవ్వుతరనే సిగ్గు లేకుండా నిన్నమొన్న కొందరు మాట్లాడిన్రు. నేనైతే ప్రచారినికీ పోలేదు. మంత్రులూ ఎవరి జిల్లాలకు వారు పరిమితమైన్రు. మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ కూడా ఎక్కడికీ వెళ్లలేదు. నేను నిజాయతీగా చెబుతున్న.. మొదటి నుంచి ఒక క్రమశిక్షణలో బతికినోళ్లం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా నేను ప్రగతి భవన్‌లోని నా కార్యాలయానికి కూడా వెళ్లలేదు. ఒక్క జిల్లా కలెక్టర్‌తో కూడా ఫోన్లో మాట్లాడలేదు. ఒక ప్రభుత్వ కార్యదర్శితో మాట్లాడలేదు. ఈ ఎన్నికల్లో అయితే ఎవరికీ ఫోనే చేయలేదు. ఎప్పుడో ఒకసారి 10 మంది మా పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి నాకు వచ్చిన సర్వే రిపోర్టులు మీకు పంపుతున్న.. చూసుకోండి అని చెప్పిన. అంతకు మించి నేనేమీ చెప్పలేదు. ఒక పోలీసు అధికారి, డీజీపీ, సీఎస్, కనీసం ఒక జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా ఫోన్ చేయలేదు. నేనెక్కడ అధికారిక దుర్వినియోగం చేశాను. రూ.వేల కోట్లు మేం ఖర్చు చేసినమంటరు. చూపెడ్తరా ఎక్కడ ఖర్చు చేసినం? టీఆర్ఎస్ పార్టీని, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాటలంటరా? రూ.వేల కోట్లకు తెలంగాణ ప్రజలు అమ్ముడుపోయిన్రని చెప్పడం మీ ఉద్దేశమా? ఇది ప్రజలను అవమానించడం కాదా? మీరు గెలిచిన మున్సిపాలిటీలను అదే పద్ధతిలో గెలిచిన్రా? దానికి ఏం సమాధానం చెప్తరు? ప్రజలు మిమ్మల్ని తిరేగేసి తొక్కి పడేస్తున్నరు. అయినా మేము అదే పద్ధతిలో మాట్లాడుతం అంటే మేం చేసేది ఏంలేదు. వారి ఖర్మ. ప్రజలు అమ్ముడుపోయిన్రు అంటే వారు మళ్లీ మిమ్మల్ని శిక్షిస్తరు’అని విపక్షాలను కేసీఆర్ మందలించారు. రాక్షసుల్లా పనిచేస్తాం.. ‘ఎన్నికలంటే మాకు తెలంగాణ రాజకీయాలు, రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం. ఇతర పార్టీలకు రాజకీయ ఆట. మాకు ఇది స్పష్టమైన కార్యం. దీనిని మేము ఆటలాగా తీసుకోం. కార్యం లాగా తీసుకుంటం. కార్యం ఎత్తుకున్నమంటే రాక్షసుల్లాగా పనిచేస్తం. ఇదే తెలంగాణ భవన్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంగ్, పార్టీ సాధారణ కార్యదర్శులు, జిల్లా ఇన్చార్జీలైన 9 మంది, క్షేత్ర స్థాయిలో పనిచేసిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అందరూ పనిచేసినరు కాబట్టి ఈ ఫలితం వచ్చింది.’అని స్పస్టం చేశారు. ప్రతిపక్షాల నోటికి మొక్కాలె ‘ప్రతిపక్షాల నోటికి మొక్కాలె. కొన్ని కుక్కలైతే నిరంతరంగా మొరిగే కుక్కలు. అవి ఈ ఎన్నికల్లో కూడా బహుళంగానే మొరిగినయి. ఏ మాట్లాడతరో ఏందో. అర్థం తాత్పర్యం ఉండదు. హద్దు అదుపు లేదు. ఒకడైతే సీఎం ముక్కు కొస్తా అంటడు. వారు జాతీయ పార్టీకి చెందిన వారు. వారి సంస్కారానికి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినట్టు చెంప ఛెల్లుమనిపించినట్టు దెబ్బ కొట్టిన్రు. ఇది మాములు దెబ్బకాదు. కుసంస్కారంగా, దుర్మార్గంగా, వ్యక్తిగతమైన నిందారోపణలతో ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నాయకులను దూషించడంప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని మనకు స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో కూడా చాలా దుర్మార్గమైన, నీచాతినీచమైన దుష్ప్రచారాలు చేశారు. అదేం సోషల్ మీడియానో నాకు అర్థం కాదు. అది సోషల్ మీడియానా? యాంటి సోషల్ మీడియానా? దాన్ని (కేంద్ర) ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుందో ఆలోచన చేయాలి. దీనిని అరికట్టడానికి ఏం చేయాలో మేమూ ఆలోచన చేస్తం. ఇప్పటిదాక సహించినం కానీ, రేపటి నుంచి చాలా కఠినంగా ఉంటాం. వారు ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలు బంద్ చేయకపోతే కొండ మీద గోపీ అయినా చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ దుష్ట సంస్కృతి ప్రబలడం మంచిది కాదు. ఇప్పటికే రాజకీయాలు, నాయకత్వాల మీద ప్రజలకు అసహ్యం కలుగుతోంది. ఇప్పటికే మనం పేపర్ కార్టూన్లం అయిపోయినం. ఇంకా పెద్ద కార్టూన్లు అయ్యే పరిస్థితి తెచ్చుకుందామా? రాజకీయ వ్యవస్థ అంతా ఆలోచించుకోవాలి. తిట్టడానికి ఏం ఉందండి. రేపు ఈ టైందాకా తిడుతూనే ఉండొచ్చు. అడ్దూ అదుపు, ఒక మర్యాద, సంస్కారం అనేది ఉంటది. దాన్ని బట్టి మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతం అంటే పద్ధతి కాదు. మేం చాలా సంయమనం పాటించినం’అని కేసీఆర్ మండిపడ్డారు. -
కారు జోరు.. మీడియా ముందుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ భవన్ చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో కలిసి ఫలితాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు, నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 120 మున్సిపాలిటీలకుగానూ టీఆర్ఎస్ వందకు పైగా స్థానాల్లో గెలుచుకునే విధంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలు సీఎం ఏ విధంగా మాట్లాడుతానేది ఆసక్తికరంగా మారింది. చదవండి :మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కారు జోరు.. తెలంగాణ భవన్లో సంబరాలు కాంగ్రెస్ కంచు కోటకు బీటలు కేటీఆర్‌కు షాకిచ్చిన స్వతంత్రులు కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి షాక్ -
యశోద ఆస్పత్రికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించింది. దాదాపు రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ ఆస్పత్రిలోనే ఉన్నారు. పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. రిపోర్టులు వచ్చిన అనంతరం యశోద ఆసుపత్రి వైద్యలు వివరాలు చెప్పనున్నారు. కాగా, ఆయన వెంట సతీమణి శోభ, కూతురు కవిత, మనవడు హిమాన్ష్, మంత్రి తలసాని శ్రీనివాస్, శుభాష్ రెడ్డిలు కూడా ఆసుపత్రికి వచ్చారు. -
కేసీఆర్‌పై మోత్కుపల్లి ఘాటు విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ : కేసీఆర్ పతనం చూడటమే లక్ష్యమని మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఆయన మెదటిసారిగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నరసింహులు తీవ్ర విమర్శలు చేశారు. కేసీర్‌ను ఎనిమిదో నిజాంతో పోల్చారు. ‘కేసీఆర్‌ను పదవి నుంచి దించేయాలని లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకున్నాను. రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్. కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజలకు బానిసలుగా బతికే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో దళితుల అభివృద్ధే నాకు ముఖ్యం. కేసీఆర్ సీఎం అయ్యాక.. నిరుద్యోగ సమస్య పెరిగింది. ఫీజు రీయింబుర్స్ మెంట్ అమలుచేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఆవేదనకు గురిచేస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశానికి కీర్తిప్రతిష్టలు పెరిగాయి. గతంలో 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచినందుకు.. దళితుడిగా గర్విస్తున్నాను’ అని అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చమరగీతం పాడటామికే మోత్కుపల్లి బీజేపీలో చేరారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ‘రాష్ట్రంలోనే సీనియర్ నాయకుల్లో మోత్కుపల్లి ఒకరు. మోత్కుపల్లి సేవలు తెలంగాణ బీజేపీకి అవసరం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే మా లక్ష్యం. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్కు లేదు. టీఆర్ఎస్ హయాంలో మున్సిపాల్టీలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయి. రాష్ట్రం నిధులతో పాటు.. కేంద్ర నిధులను సైతం గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట మున్సిపాలిటీలకు తరలించారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. మజ్లిస్ కు ఓటు వేసినట్లే. ఎంఐఎం కోసమే ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేశారు.’ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల బిడ్డ మోత్కుపల్లికి బీజేపీ సాదర స్వాగతం పలుకుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యంమని వ్యాఖ్యానించారు. బీజేపీ బలోపేతానికి మోత్కుపల్లి సేవలను ఉపయోగించుకుంటామన్నారు. -
సంపూర్ణ అక్షరాస్యత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమన్నారు. సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణను 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రతిన తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘ప్రతి ఒక్కరు–ఒకరికి బోధించాలి’అనే నినాదం అందుకుని ప్రతీ విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా మార్చాలని కోరారు. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్ స్వీకరించాలని పిలుపునిచ్చారు. ‘ఆరేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళుతూ గొప్ప విజయాలు సాధించింది. అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి, అనేక మంది ప్రశంసలను అందుకున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను తెలంగాణ సొంతం చేసుకుంది. అనతికాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం. ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. అంధకారమైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దడం తెలంగాణ సాధించిన గొప్ప విజయాల్లో ప్రథమంగా నిలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11,703 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చినప్పటికీ ఏమాత్రం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగే శక్తిని రాష్ట్రం సంతరించుకున్నది. మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథ లాంటి పథకం తీసుకురావడానికి మిగతా రాష్ట్రాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇది కూడా మనందరికీ గర్వకారణం. సాగునీటి రంగంలో రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసుకుని, పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకోగలిగాం. ప్రపంచమే అబ్బురపడే ఇంజనీరింగ్ అద్భుతంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. రాబోయే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వంద శాతం అందుతాయి.. రాష్ట్రం సుభిక్షమవుతుంది. ప్రజా సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్‌గా నిలిచింది. అనేక రకాల సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవనభద్రత కల్పించుకోగలిగాం. పారిశ్రామిక, ఐటి రంగాల్లో దూసుకుపోతున్నాం’అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అక్షరాస్యతలో వెనకబడటం మచ్చ ‘అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.. అక్షరాస్యతలో వెనుక వరుసలో ఉండటం ఓ మచ్చగా మిగిలింది. అందరినీ అక్షరాస్యులను చేయడంలో గత పాలకులు విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితిని తెలంగాణ అధిగమించాలి. రాష్ట్రాన్ని వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు మనందరం నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువురాని మరొకరిని అక్షరాస్యులుగా మార్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా ఉద్విగ్న భరితమైన పోరాటం చేసి లక్ష్యం సాధించారు. ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకోగలిగాం. అదే స్ఫూర్తితో తెలంగాణను వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేయాలి. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అక్షరాస్యత విషయంలో అప్రతిష్టను రూపుమాపాలి’అని సీఎం పిలుపునిచ్చారు. -
రాష్ట్రపతికి గవర్నర్ విందు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. విందుకు విచ్చేసిన రాష్ట్రపతి కోవింద్ దంపతులకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ రాజ్‌భవన్ ప్రవేశద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి దంపతులు విందుకు హాజరైన అతిథులందరి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. తన ఆహా్వనాన్ని మన్నించి విచ్చేసిన రాష్ట్రపతికి గవర్నర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ యాప్ ఆవిష్కరణ: తెలంగాణ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) మొబైల్ యాప్‌ను ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ యాప్‌ను ఏ భాషలోనైనా వినియోగించవచ్చని, ఏ రాష్ట్రమైనా అడాప్ట్ చేసుకోవచ్చని గవర్నర్ తెలిపారు. ఈ యాప్ విశేషాలను రాజ్‌భవన్ కార్యదర్శి సురేంద్ర మోహన్ వివరించారు. సభ్యత్వం కోసం రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తమ వివరాలను నమోదు చేస్తే సొసైటీ సభ్యత్వం లభిస్తుందని చెప్పారు. యాప్ నుంచే డిజిటల్ సంతకం చేసిన సభ్యత్వ ధ్రువీకరణ పత్రం పొందవచ్చని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో సమీపంలో ఉన్న రక్త నిధి కేంద్రాల వివరాలు, చిరునామా, ఫోన్ నంబర్, గూగుల్ రూట్ మ్యాప్ తదితర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. విందు ముగిసిన అనంతరం రాష్ట్రపతి కోవింద్ దంపతులకు తమిళిసై, కేసీఆర్‌లు రాజ్‌భవన్ నుంచి వీడ్కోలు పలికారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏర్పాటు చేసిన విందుకు విచ్చేసిన రాష్ట్రపతి కోవింద్ దంపతులు, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ -
కేసీఆర్ వరాలు.. హరీష్ చెక్కులు
సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామస్తుల కళ సాకారమవుతోంది. చింతమడక గ్రామంలోని ప్రతి కుటుంబం స్వయం సమృద్ధి సాధించేందుకు చేయూత ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు చింతమడక గ్రామస్తులకు చెక్కులు పంపిణీ చేశారు. సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌రావు.. కేసీఆర్ హామీ మేరకు పౌల్ట్రీ, డైరీ షెడ్ల నిర్మాణానికి రెండు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చింతమడక గ్రామానికి చెందిన 22 మందికి డైరీ యూనిట్లు, 87 మందికి పౌల్ట్రీ యూనిట్లుకు చెక్కులు అందాయి. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. పదిహేను రోజుల్లో షెడ్లు నిర్మించాలని లబ్ధిదారులను ఆదేశించారు. షెడ్ల నిర్మాణం పూర్తయితే పశువులు, కోళ్ల పంపిణీ చేస్తామని తెలిపారు. చింతమడకలో పాలకేంద్రం ఏర్పాటు చేసి డైరీ నడిపే వారి వద్ద నుంచి పాలు కొనుగోలు చేస్తామని అన్నారు. -
ప్రియాంక హత్యపై స్పందించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారులను కోరారు. ఇటీవల వరంగల్‌లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడిందని గుర్తుచేశారు. అదే తరహాలో ఈ కేసులో కూడా సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసీఆర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి ఆవేదన చెందారు. ఇది అమానుషమైన దుర్ఘటన అని అన్నారు. ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపు విధులు పూర్తయ్యేలా డ్యూటీలు ఉండాలని అధికారులను ఆదేశించారు. -
ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్.. వారికి కొండత భరోసా కల్పించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 97 డిపోల నుంచి దాదాపు 700 మంది ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి భోజనం చేసిన కేసీఆర్.. ఆ తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాలను రేపటిలోగా(డిసెంబర్ 2) చెల్లించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 55 రోజుల సమ్మె కాలానికి కార్మికులకు జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా డిపోల్లో మహిళల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకోస్తే సింగరేణి మాదిరిగా బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మహిళా ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం.. మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అలాగే మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపే డ్యూటీలు ఉండేలా చూడాలన్నారు. మహిళా కార్మికుల ప్రసూతి సెలవులను పెంచాలని నిర్ణయించారు. ప్రయాణికులు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. ఇకపై కండక్టర్లపై కాకుండా వారిపైనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం కార్మికులు కష్టించి పనిచేయాలని సూచించారు. ఉద్యోగ భద్రత కల్పిస్తాం.. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. ఒక్క రూట్లో కూడా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని.. ప్రతి ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ భేటీలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాలు.. ఆర్టీసీలో అందరినీ ఉద్యోగులనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం. ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం. ఉద్యోగులు ఇంక్రిమెంట్ యథావిథిగా ఇస్తాం. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం. ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత. ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే.. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము. కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు. మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయకుండా.. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి. ప్రతి డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం. మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు. ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం. ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఉద్యోగుల పీఎఫ్ బకాయిలను, సీసీఎస్ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం. డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం. ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి. -
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ యాక్ట్, ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా కేసీఆర్ గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. కాగా, తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్‌కు రావడం ఇదే తొలిసారి. -
ఆర్టీసీపై నేడు సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ అంశంపై సీఎం కేసీఆర్ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఆర్టీసీకి ఉన్న అప్పులు, బకాయిలు తదితరాలపై గురువారం సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో సంస్థను నడపాలంటే ప్రతినెలా రూ. 640 కోట్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం జరిగే సమీక్షలో రూట్ల ప్రైవేటీకరణ విధివిధానాలపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రూట్ల ప్రైవేటీకరణకు వీలుగా ప్రైవేటు బస్సులకు పర్మిట్ల జారీకి టెండర్లు పిలవడంపై ఈ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బేషరతుగా విధుల్లో చేర్చుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ అంశం కూడా చర్చకు వస్తుందని భావిస్తున్నారు.