
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వర్సిటీ పరీక్షల నిర్వహణ, విద్యార్థులను ప్రమోట్ చేసే అంశంపై సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అధికారులు అడిగి తెలుసుకున్నారు. వారి సూచనల మేరకు ఫైనలియర్ విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు సైతం యూజీసీ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment