
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ యాక్ట్, ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా కేసీఆర్ గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. కాగా, తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్‌కు రావడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment